
ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రియ.. పెళ్ళయ్యాక కాస్త జోరు తగ్గించింది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read More:ఫొటోస్: అదిరిపోయిన RRR హీరోలు
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో డైరెక్టర్ రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` పేరుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, హిందీ ‘దృశ్యం’లో వీరిద్దరూ జంటగా నటించారు. మళ్లీ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో అజయ్ దేవగణ్, శ్రియపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. శ్రియకి.. `ఆర్ ఆర్ ఆర్` ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.