
పవన్ కళ్యాణ్ తానా మహాసభలకు హాజరు అవుతున్నట్లు తెలిసింది. దీనిపై వాళ్ళ అభిమానుల్లోనే చర్చ జరుగుతుంది. ఇంతవరకూ అమెరికా లోని పవన్ అభిమానుల్లో చాలామంది తానా సభ్యులు కాదు. కారణం వాళ్లలో చాలామందికి తానా ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తుందని నమ్ముతున్నారు. మరి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తానా మహాసభలకు హాజరు కావటం జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల మేరీల్యాండ్ లో ఆప్టా సభలు జరిగినప్పుడు అది ఒక కులానికి సంబంధించింది కాబట్టి హాజరు కావద్దని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. అందుకే హైదరాబాద్ నుంచి జనసేన నాయకులెవ్వరూ హాజరు కాలేదు. మరి ఈరోజు తానా సభలకు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా హాజరు కావటం ఆయన అభిమానుల్లో కొంతమందికి నచ్చటంలేదు.
తానా ఆప్టా లాగా ఒక కులస్తులకే సభ్యత్వం ఇవ్వకపోవటం నిజమే. అయితే తానా లో ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం వహిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అంతమాత్రాన ఒక రాజకీయనాయకుడిగా తానా సభలకు వెళ్లటాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ప్రస్తుతం తనకు అంత ప్రాధాన్య అంశం కాదు. అభిమానుల్లో అపోహలు కలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. అలాగే ఆప్టా సభలను కూడా బాయికాట్ చేయాల్సిన పనిలేదు. రాజకీయనాయకులు ఎవరుపిలిచినా వెళ్లొచ్చు. కాకపోతే అక్కడ మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరు కావటం ఆయన అభిమానుల్లో చర్చనీయాంశమయ్యింది.