
వైస్సార్సీపీ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 22 స్థానాలతో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా టీఎంసీ తో పాటు అవతరించిన వైస్సార్సీపీ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పార్లమెంట్ పార్టీ. వచ్చే అయిదు సంవత్సరాల్లో లోక్ సభ లో దాని పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే 22 స్థానాలతో రాష్ట్రాలపరంగా చూస్తే పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మాత్రమే బీజేపీ రాష్ట్రాల తర్వాత పెద్ద సంఖ్యలో వున్నాయి. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికివ్వటం ఓ ఆనవాయితీగా వస్తూవుంది. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షపార్టీకి ఇవ్వటం ఇష్టంలేదు. పోయినసారి ఎన్డీయే లో లేని అన్నా డీఎంకే కి ఇవ్వటం జరిగింది. ఈసారి కాంగ్రెస్ తర్వాత పెద్ద పార్టీలుగా వున్న టీఎంసీ , వైస్సార్సీపీ లలో టీఎంసీ కి ఇవ్వటం మోడీకి ఇష్టంలేదు. కాబట్టి వైస్సార్సీపీ కి ఆఫర్ చేయటం జరిగింది. అయితే ఈ పదవి తీసుకోవాలా వద్దా అనే విషయంలో వైస్సార్సీపీ ఆలోచనలో పడింది.
ఆ పదవి తీసుకోకుండా ఉంటేనే మంచిదని ఆ పార్టీ ఆంతరంగిక చర్చల్లో ఓ అభిప్రాయానికి వచ్చారు. పోయిన లోక్ సభలో తెలుగుదేశం చేసిన తప్పిదం ఈ సారి చేయకుండా జాగ్రత్తపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ సారి బీజేపీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకుంటే బీజేపీ తో వైస్సార్సీపీ మిలాఖత్ అయిందనీ, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టిందనీ ప్రచారం జరిగే అవకాశం మెండుగా వుంది. ఇది తీసుకోకపోతే సమస్యలపై మిత్రవైఖరి అవలంబించినా పెద్దగా నష్టం వాటిల్లే అవకాశాలు లేవు. అందుకే వ్యూహాత్మకంగా , తెలివిగా నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా ఇది వైస్సార్సీపీ కి లాభించే చర్య గా భావిస్తున్నారు. బాలయోగి తర్వాత వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవటం సరయిన నిర్ణయమా కదా అనేది చరిత్ర చెప్పాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం దీని వలన ప్రత్యర్థుల విమర్శలకు అవకాశంలేకుండా పోయింది.










.jpg)
.jpg)
.jpg)





























ఆ విషయంలో కెసిఆర్ ని పొగిడి.. పప్పులో కాలేసిన జగన్!
ఏపీలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ‘మహిళలకు రక్షణ ఎలా కల్పించాలి” అనే విషయంలో చర్చ జరగగా సీఎం జగన్ “దిశ” ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “దిశ” నిందితులను ఎన్ కౌంటర్ విషయాన్ని సమర్ధిస్తూ ఈ విధంగా మాట్లాడారు.. ‘అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్’…అని. ఈ మాట ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంటే దిశా హంతకుల్ని ఎన్ కౌంటర్ చేయమని కేసీఆర్ గారు పోలీసులకు ముందే చెప్పారా? మరి అందేంటి.. తప్పించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, దాడి చేసినందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు! అది నిజంకాదా??!” అని అనేకమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అసలే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్ కౌంటర్ విషయంలో చాలా సీరియస్ గా ఉండగా ఇప్పుడు జగన్ మాటలు కెసిఆర్ కి మరింత తల నొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు!. ఇదిలా ఉండగా మరోవైపు మహిళా సంఘాలు కూడా ఎన్ కౌంటర్ విషయంలో కాస్త గుస్సుగా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటన్న వారిని కూడా చంపేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఏపీ సీఎం మాటలు వారికి మరింత ఊతం ఇచ్చినట్లయింది. అలాగే ప్రస్తుతం ఏపీలో 2014 నుండి 2019ల మధ్య అనేక రేప్ కేసులు జరిగాయి. అందులో వైసీపీ పార్టీ నేతలుకూడా ఉన్నారు. 2014లో 82, 2015లో 100, 2016లో 116, 2017లో 105, 2018లో 93 కేసులు, 2019 జగన్ సీఎం అయ్యాక దాదాపు 40 పైగా రేప్ కేసులు పెండ్డింగ్ లో ఉన్నాయి వారందర్ని కూడా కెసిఆర్ పంథాలో జగన్ ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు, అనేక విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ఈ విమర్శలు ఇప్పుడే రాక పోవచ్చు కానీ మున్ముందు రావొచ్చు. ఇది, ఇలా ఉండగా ఈ జగన్ పొగడ్తల పై కెసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి…
మా ఈ కామెంట్ నిజమని చెప్పడానికి…. జగన్ విమర్శలు ఎదురుకోబోతున్నారు అనడానికి…