
సిబిఐ దర్యాప్తులో భాగంగా కేంద్ర జీఎస్టీ లో అధికారయిన బొలినేని శ్రీనివాస గాంధీ ఆస్తులపై దాడి చేయటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇటీవల మోడీ 2. 0 అధికారం చేపట్టిన తర్వాత సిబిఐ దేశ వ్యాప్తంగా దర్యాప్తు వేగాన్ని పెంచింది. ఇదే స్పీడు లో త్వరలో గాంధీ కుటుంబం పై కూడా దర్యాప్తు వేగవంతం కావచ్చని తెలుస్తుంది. ముఖ్యంగా ఆగస్తా వెస్ట్ ల్యాండ్ కి సంబంధించి దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిందనుకుంటున్నారు. అలాగే రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాలకు సంబంధించి కూడా సాక్ష్యాలు బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. చిదంబరం , కార్తీ చిదంబరం ల కేసులు కూడా ఓ కొలిక్కి రావచ్చు. ఇటీవలే ఇంద్రాణి అప్రూవర్ గా మారింది. ఈ వేగం ఇలానే కొనసాగితే త్వరలో సంచలన వార్తలు వినే అవకాశం వుంది.
ఇది ఇలావుంటే బొలినేని శ్రీనివాస గాంధీ విషయంలో జగన్ వర్గీయులు చాలా సంతోషంగా వున్నారు. జగన్ పై కేసులు నమోదు చేసి వెంటపడిన దాంట్లో ఈ అధికారి పాత్ర ఎక్కువగా ఉందని చెపుతున్నారు. ఇప్పటికి బయటపడిన ఆస్తులే మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్ల రూపాయలు వుంటాయని అనుకుంటున్నారు. ఇతను చంద్రబాబు నాయుడు కి అతి సన్నిహితుడని కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒత్తిడి తోనే జగన్ ని వెంటాడని జగన్ వర్గీయులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదో ఒకరోజు చంద్రబాబు నాయుడు మీదకూడా ఉచ్చు బిగిస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటికే పోలవరం పై నివేదిక తెప్పించుకొని ప్రస్తుత కాంట్రాక్టర్ ని తొలగించ బోతున్నారని వార్తలు వచ్చాయి. మిగతా వాటిల్లో కూడా చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయం లో మోడీ కి, జగన్ కి , కెసిఆర్ కి వుమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు నే.
ఇది ముందుగానే పసిగట్టిన చంద్రబాబు నాయుడు తనకు విశ్వాసపాత్రులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లను బీజేపీ లోకి పంపించాడని జనం బలంగా నమ్ముతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదుకానీ చంద్రబాబు కి ముందు ముందు కష్టాలు ఖాయం. బొలినేని శ్రీనివాస గాంధీ కేసు రాబోయే పరిణామాలకు సంకేతమని భావిస్తున్నారు.