Home Blog Page 8640

అందాలతో కాక రేపుతున్న శ్రీముఖి..

 

తెలుగు యాంక‌ర్లు అందాల ఆర‌బోతలో హీరోయిన్ల‌ను కూడా మించిపోతున్నారు. ఇప్ప‌టికే అన‌సూయ.. ర‌ష్మి లాంటి వాళ్లు అందాలతో ర‌చ్చ చేస్తున్నారు. వాళ్ల అందాలతో టీవీ స్క్రీన్‌ను వేడిపుట్టిస్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి కూడా వీళ్ల జాబితాలో చేరిపోయింది. అందాల ఆర‌బోత‌లో అన‌సూయ‌, ర‌ష్మికి పోటీగా వెళ్తుంది ఈ భామ. మొద‌ట్లో కాస్త ప‌ద్ద‌తిగానే ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ర‌చ్చ చేస్తుంది. ఒక్కో ప్రోగ్రామ్‌కు లక్షల వరకు రెమ్యూనరేషన్స్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దానికి తగ్గట్లే ఇప్పుడు అందాల డోస్ కూడా పెంచేస్తుంది శ్రీముఖి.

 

Read More: ఫొటోస్ : యాంకర్ రష్మీ గౌతమ్ క్రేజీ స్టిల్స్

 

Read More: ఫిబ్రవరిలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు ఇవ్వే…!

 

శ్రీముఖి అప్పుడ‌ప్పుడూ క్లీవేజ్ షోల‌తో కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది. ఈ మ‌ధ్యే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నడుము అందాల‌తో ప్రేక్షకుల మతులు పోగోటింది. తర్వాత బిగ్ బాస్ షోలో చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకుని బాగానే రెచ్చిపోయింది. తాజాగా ఈమె క్లీవేజ్ షో చేస్తూ దిగిన హాట్ ఫోటోస్ ను ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోస్ సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు

చంద్రబాబునాయుడు వ్యూహాలు పన్నటంలో సిద్ధహస్తుడని అందరూ అంటుంటారు. అది ఇంకో సారి రుజవయ్యింది. అయితే ఇందులో పారదర్శక లేకుండా తెరచాటు వ్యవహారంగా ప్రజలు పెద్దగా గమనించలేదనే భావనతో వ్యూహం పన్నినట్లు తెలుస్తుంది. తలాక్ బిల్లుపై గప్ చిప్ గా చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేసాడు. అందరి దృష్టి తెరాస ఏమి చేస్తుందనే దానిపై వుంది కానీ టీడీపీ ని గురించి సందేహపడలేదు. ఎందుకంటే నిద్రలేచిన దగ్గరనుంచి పండుకో పోయిందాకా ప్రతిదానికీ మోడీని విమర్శించే చంద్రబాబునాయుడు బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తాడని అందరూ ఊహించారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని గట్టెకించాలనే తాపత్రయంతో పరోక్షమదత్తు గా బిల్లు వోటింగ్ సమయంలో తెలుగుదేశం సభ్యులు గైరు హాజరయ్యారు. అంతకుముందు సభలో మాట్లాడిన టీడీపీ సభ్యుడు బిల్లుని విమర్శిస్తూనే మాట్లాడేడు. మరి ఈ ద్వంద వైఖరి వెనుక కారణమేంటి? దీన్నే చంద్రబాబు వ్యూహంగా అర్థంచేసుకోవాలి.

వాస్తవానికి చంద్రబాబు అధికారం కోల్పోయినదగ్గర్నుంచి మోడీకి దగ్గరకావాలని ప్రయత్నిస్తున్నాడనేది కారిడార్ టాక్ . వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ టాక్ లో నిజముందనిపిస్తుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎప్పుడయితే బీజేపీ లో చేరారో అప్పుడే ఈ వాదనకు బలం చేకూరింది. ఎందుకంటే వీళ్లిద్దరూ చంద్రబాబు కి కుడి,ఎడమ భుజాలని అందరికీ తెలుసు. ఆయన్నివీళ్ళు మోసం చేసి చేసి వుంటారని ప్రజలు భావించటంలేదు. అయన డైరెక్షన్ లోనే పధకం రచించారని ఎక్కువమంది అనుకుంటున్నారు. ఆ వాదనకు రాజ్య సభలో టీడీపీ ప్రవర్తన కరెక్ట్ అని రుజువు చేసింది. దేశం మొత్తం తలాక్ బిల్లు ఏమవుతుందని ఎదురుచూస్తుంటే అనేక ప్రాంతీయపార్టీలు ఇదే వైఖరిని అవలంబించాయి. వాటికి, టీడీపీ కి తేడా ఏంటంటే చంద్రబాబునాయుడు బీజేపీ వ్యతిరేక కూటమి లో అత్యంత ప్రముఖుడు. అందుకనే తనపై ఎవరికీ సందేహం రాలేదు.

చంద్రబాబు కి పెద్ద లోపం అందరూ చెప్పేది విశ్వసనీయత లేదనేది. అది ఇంకోక్కసారి నిరూపించబడింది. మోడీ ఎన్నికల్లో అదే పాయింట్ ఫై ప్రచారం చేశాడు. ఎన్నికల్లో ఓడిపోతే తిరిగి తనదగ్గరికి వస్తాడని మోడీ ప్రచారం చేశాడు. అక్షరాలా ఇప్పుడు అదే జరిగింది. జగన్ పార్టీ నయం. విజయసాయి రెడ్డి సభలోవుండి బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశాడు. మన మీడియా దాన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఈనాడు పత్రిక టీడీపీ వైఖరి పై ప్రజల్లో వ్యతిరేకంగా రాకుండా చూడటం కోసం వైస్సార్సీపీ కూడా గైరు హాజరు (పాక్షికంగా) అయ్యిందని హైలైట్ చేసింది. ఇది వాస్తవానికి విరుద్ధం. వైస్సార్సీపీ నాయకుడు ముందుగా మాట్లాడినట్లుగానే సభలోవుండి బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసాడు. వైస్సార్సీపీ రెండో సభ్యుడు గైరు హాజరు కావటం హైలైట్ చేయటం పచ్చమీడియా అనిపించుకుంది. అందరూ సభ్యులు లేకపోవటం అనేది ప్రతిపార్టీ లోనూ జరిగింది. ఏమైనా చంద్రబాబునాయుడు వ్యూహంలో ఇదికూడా భాగమే కదా. చంద్రబాబు నాయుడు లో విశ్వశనీయతలేదని, ఊసరవెల్లి అనీ మరొక్కసారి రుజువయ్యింది.

జగన్ తొందరపాటుకు కారణం?

ఆంధ్ర రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కితున్నాయి. ఇందులో ఇరుపక్షాలు పాత్రధారులే. పరిశీలకుల అంచనా ప్రకారం తెలుగుదేశం సానుభూతి రాజకీయాలు చేస్తుందని అనుకుంటున్నారు. అసెంబ్లీ లో సస్పెండ్ అయితే అది ప్రజల్లో వైస్సార్సీపీ ఫై కోపంగా తెలుగుదేశం పై సానుభూతిగా మారుతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు వున్నాడు. అసెంబ్లీ బిల్లులపై చర్చ కన్నా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవటంతోనే సమయమంతా వృధా అవుతుంది. అసెంబ్లీ చూసేవాళ్లకు ఇది చేపలమార్కెట్ లాగా వుంది కానీ అసెంబ్లీ లాగా లేదు.

ఈ సెషన్ లో ఎన్నో కీలకమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టటం, ఆమోదించటం కూడా జరిగింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ బిల్లులన్నీ చరిత్రాత్మకమైనవే. అయితే అందరుమనసుల్లో తొలుస్తున్న ప్రశ్న ఇవి అమలుచేయటానికి కావాల్సిన నిధులు ఎక్కడినుంచి వస్తాయనేదే . చూడబోతే మొత్తం ఎన్నికల వాగ్ధానాలు ఈ బడ్జెట్ సెషన్ లోనే అమలుచేసేటట్లు వుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ తొందర కు కొన్ని బలీయమైన కారణాలే ఉన్నాయని అనిపిస్తుంది.

జగన్ మీదున్న కొన్ని కేసులు అడ్వాన్స్ దశలో వున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. అందుకే ఎంత తొందరగా వాగ్దానాలన్నీ చట్టం చేసి అమలు చేస్తే అంత తొందరగా ప్రజల్లోకి తనపై అనుకూల వాతావరణం పెరుగుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ కోర్టులో శిక్షపడినా ప్రజల్లో అభిమానం చెక్కుచెదరకుండా ఉండేటట్లు చేయటమే ఈ తొందరకు కారణమని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇవన్నీ తన వాగ్ధానాలను అమలుచేయటంపై చిత్తశుద్దిగా వైస్సార్సీపీ ప్రచారం చేస్తుంది.

ఇక చంద్రబాబునాయుడు వ్యూహాలు ఫలించే అవకాశాలు తక్కువేనని చెప్పొచ్చు. వున్న ఎమ్మల్యేలను కాపాడుకోగలగటం కష్టమే. బీజేపీ ఇప్పుడున్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవటానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంది. త్వరలో గంపగుత్తగా ఎమ్మెల్యే లను తమవైపు తిప్పుకుంటుందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ఇటీవలే బొల్లినేని శ్రీనివాస గాంధీపై కేసులు పెట్టటం భవిష్యత్తులో జరిగే పరిణామాలకు సంకేతం. పోలవరం పై వేసిన కమిటీ ఈరోజే నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వేడెక్కిన రాజకీయాలు ముందు ముందు మరింత ఉద్రిక్తంగా తయారవబోతున్నాయి. వేచిచూద్దాం.

జగన్ భాయ్ జర సోచో , సోచ్ కే కరో

జగన్ నిర్ణయాలు ప్రజారంజకంగా ఉంటున్నాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అడిగిన వాళ్లకు , అడగని వాళ్లకు కావాల్సినన్ని వరాలు ప్రకటిస్తున్నాడు. ఈ చర్యలన్నీ వినటానికి బాగానే వున్నాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి వీటి ప్రభావం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఏ మేరకు ఉంటుందనేది తెలుసుకోవాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. మొత్తం ఎన్నికల వాగ్ధానాలు మొదటి సంవత్సరంలోనే అమలు చేయాలనే తాపత్రయం కనబడుతుంది. ఉద్దేశాలు మంచివే అయినా అమలులో వచ్చే ఆర్ధిక ఇబ్బందులను గురించి సమీక్షచేస్తున్నట్లు కనిపించటంలేదు. డబ్బులుంటే స్వర్గానికి నిచ్చెనలేయొచ్చనే సామెత వూరికే రాలేదు.

ఒకవైపు తాహతుకు మించి ఖర్చుచేసుకుంటూ పోతున్నాడు. రెండోవైపు ప్రపంచ బ్యాంకు , చైనా ముఖ్యకార్యాలయం తో కూడిన ఆసియా బ్యాంకు రుణాలు ఇవ్వలేమని చేతులెత్తేసినాయి . ఇది ఆందోళన కల్గించే అంశం . సాంఘిక ప్రచార మాధ్యమాల్లో కేంద్రం పెద్దఎత్తున ఆర్ధిక సహాయం చేయబోతోందని ప్రచారం జరుగుతుంది. అది కేవలం వూహాజనితమే . ఎందుకంటే కేంద్రం దాని పధకాలకే డబ్బులులేక ఇబ్బందిపడుతూ ఉంటే ఆంధ్ర కు అన్నివేల కోట్లు, ఇన్నివేలకోట్లు సహాయం ప్రకటిస్తుందనే ప్రచారం కేవలం అత్యాశే. కొన్నాళ్ళు పోయిన తర్వాత చూసారా కేంద్రం మొండిచేయి చూపించింది, సవతితల్లి ప్రేమ చూపించిందని ప్రచారం మొదలుపెడతారు. ఆంధ్ర ప్రజలను ఇలా మోసం చేయటం మొదట్నుంచి జరుగుతుంది. గత అయిదు సంవత్సరాలు ఇలాంటి ప్రచారమే చేసి ప్రజలను మభ్యపెట్టారు. ఇప్పటికైనా వాస్తవప్రపంచం లోకి వచ్చి భూమి మీద నడవటం నేర్చుకుంటే మంచిది.

ఈ నేపథ్యంలో జగన్ ఇంకో ప్రజాకర్షక నిర్ణయం తీసుకున్నాడు. ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలనే నిబంధన పెడుతూ శాసనం తీసుకొచ్చాడు. దేశం మొత్తం మీదా ఇటువంటి చట్టం తీసుకొచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాడు . ఈ నిర్ణయం పైకి చూట్టానికి బాగానేవున్నా దీనివలన అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం వుంది. ప్రైవేటు పెట్టుబడులు రావటానికి ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చి ఆహ్వానిస్తున్న సందర్భంలో ఇటువంటి నిబంధన వలన వచ్చే పెట్టుబడులు ఆగిపోయే ప్రమాదముంది. అసలే కొత్త రాష్ట్రం. ప్రధానంగా వ్యవసాయ రంగం ఫై ఆధారపడిన రాష్ట్రం. వేగంగా పారిశ్రామీకకరణ వైపు అడుగులు వేయాలంటే ఇటువంటి నిబంధనలు అడ్డుగా నిలుస్తాయి. రెండోది, ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఒకనాడు శివసేన ముంబై లో ఇటువంటి డిమాండ్లే పెడితే దేశవ్యాప్తంగా నిరసనలు రావటంతో ఆత్మరక్షణలో పడింది. తిరిగి ఈ నిర్ణయంతో జగన్ దేశవ్యాప్త చర్చకు కారణమయ్యాడు. ఏ కారణంతో చూసినా ఈ చర్య సమర్ధనీయం కాదు. దీనివలన దేశవ్యాప్త అప్రతిష్టను మూటకట్టుకోవటంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అనాలోచిత, దుస్సాహిత నిర్ణయాలవలన దీర్ఘకాలంలో ఆంధ్ర ప్రజలు నష్టపోతారనేది ఎంతతొందరగా గ్రహిస్తే అంతమంచిది. జగన్ భాయ్ జర సోచో , సోచ్ కే కరో.

మునిసిపల్ ఎన్నికలతో కాంగ్రెస్ అవుట్

తెలంగాణ లో మునిసిపల్ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. అయితే హైకోర్టు తీర్పుని బట్టి తుది నిర్ణయం ఉంటుంది. కెసిఆర్ రాజకీయ చాణిక్యుడు కాబట్టి తన దృష్టిలో ఆలస్యం అయ్యేకొద్దీ నష్టం జరిగే అవకాశముందని భావిస్తున్నాడు. అందుకే ప్రతిపక్షం తేరుకుని ఎన్నికలకు సిద్ధమయ్యే లోపలే పూర్తి చెయ్యాలనే పట్టుదలతో వున్నాడు. హైకోర్టు బ్రేకు లేయకపోతే తన పాచిక పారే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.

ఇప్పుడు అందరి దృష్టి ప్రతిపక్షంపై వుంది. తెరాస కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ ల్లో ఎవరు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారనే దానిపైనే ఆసక్తి నెలకొంది. మొన్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణాలో బీజేపీ, దక్షిణ తెలంగాణాలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదిగాయి. అయితే ఆ తర్వాత జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ అధ్యక్షుడుగా రాజీనామా చేయటం, తెలంగాణాలో 16 మంది శాసనసభ్యుల్లో 12 మంది తెరాస లో చేరటం , గోవా లో మెజారిటీ సభ్యులు బీజేపీ లో చేరటం లాంటి పరిణామాలు కాంగ్రెస్ నైతిక స్థాయిని దెబ్బ తీశాయనే చెప్పాలి. బీజేపీ ప్రస్తుతం దక్షిణ తెలంగాణ లో కూడా పాగా వేయటానికి అన్ని పావులు కదుపుతుంది. మునిసిపల్ ఎన్నికల లోపే చాలా మంది ని తమవైపు లాక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ బీసీ లు, ముస్లింలను తనవైపు ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టింది. వారికీ మొత్తం సీట్లలో సగం ఇస్తానని ప్రకటించింది. అయితే నావ మునిగేటప్పుడు అందులోకి దూకటానికి ఎవరూ ప్రయత్నించరు. అందునా పట్టణ ఓటర్లలో బీజేపీ కి సహజంగానే కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. కాబట్టి ఈ ఆకర్షణ ప్రయత్నాలతో పెద్ద ప్రయోజనం ఉండక పోవచ్చు. మునిసిపల్ ఎన్నికలతో బీజేపీ తెరాస కు ప్రత్యామ్నాయంగా అవతరించే అవకాశాలు మెండుగా వున్నాయి. బీజేపీ ప్రస్తుతం అంతటితో సంతృప్తి చెందక తప్పదు. ఈ ఎన్నికల్లో కూడా తెరాస తన ఆధిక్యత ప్రదర్శిస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహంలేదు. కాంగ్రెస్ భవిష్యత్తు పైనే సస్పెన్స్ కొనసాగుతుంది . మునిసిపల్ ఎన్నికలతో దాని ఆశలు చల్లారి రాజకీయ పునరేకీకరణ కు నాంది పలుకుతుందని అందరూ భావిస్తున్నారు.

పేర్లు: రాజకీయ ప్రహసనం

రాజకీయనాయకులు ఏం చేసినా అతిగానే ఉంటుంది. ప్రజల్లో నాయకులమీద వున్న సానుభూతిని ఎలా సొమ్ము చేసుకోవాలో వాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకు ఓ ఉదాహరణ పథకాలకు నాయకుల పేర్లు. దేశంలో ఏమూలకెళ్లినా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ నాయకుల పేర్లే కనపడతా ఉంటాయి. పార్టీలకు అతీతంగా వాళ్ళను ప్రజలూ చూడటంలేదు, పార్టీలు అంతకన్నా. చివరకు ఈ పేర్ల ప్రహసనం ఓ పెద్ద జోకు అయిపొయింది.

ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కేవలం మహాత్మాగాంధీ పేరుతోనే పధకాలు గానీ, రోడ్లుగానీ, అన్నింటికన్నా ముఖ్యంగా విగ్రహాలుగానీ వెలిసేవి. అప్పట్లో పుట్టిన పిల్లలకు కూడా జాతీయనాయకుల పేర్లు పెట్టేవాళ్ళు. అయితే ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలే స్వచ్చందంగా విగ్రహాలు పెట్టే సంస్కృతి కూడా ఉండేది. నేతాజీ సుభాష్ చంద్ర బోసు విగ్రహాలు ఆంధ్రాలో ఏ మూలకెళ్లినా దర్శనమిచ్చేవి. ఇవి ప్రజలు స్వచ్చందంగా నిర్మించినవి. ఆ తర్వాత సంస్కృతి మారింది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విగ్రహాలు ప్రతి గ్రామానా పెట్టారు. అయితే ఆయన గాంధీ తర్వాత అత్యంత పలుకుబడి కలిగిన నాయకుడు కాబట్టి అందుకు ప్రజలు పూర్తిగా కలిసివచ్చారు. ఆ తర్వాత దశలో అంబేద్కర్ విగ్రహాలు విరివిగా వచ్చాయి. అవి ప్రతిష్టించటం లో దళిత సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయి. తర్వాత కాంగ్రెస్ కూడా ప్రోత్సహించటం మొదలు పెట్టింది. వాస్తవానికి అంబేద్కర్ భారత దేశం లోని అతి కొద్దిమంది మేధావుల్లో ఒకరు. ఆయన బ్రతికున్నంతకాలం రావాల్సినంత పేరు, ప్రఖ్యాతులు రాలేదు. ఆయన్ను పార్లమెంటుకు రానివ్వకుండా ఓడించారు. ఆ తర్వాత అవసర రీత్యా తప్పనిపరిస్థితుల్లో తనకు ప్రాచుర్యం కల్పించారు. అలాగే భారత దేశ ఇంకో దార్శనికుడు డాక్టర్ రామమనోహర్ లోహియా కు రావాల్సినంత ప్రాముఖ్యత రాలేదు. చరిత్రలోకి తొంగిచూస్తే దీనిపై ఇంకా ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు.

ఈ పేర్ల ప్రాముఖ్యం వింతపుంతలు తొక్కటం మొదలుపెట్టింది ఇందిరా గాంధీ తదనంతరం. ముందుగా ఇందిరా గాంధీ , తర్వాత రాజీవగాంధీ పేర్లు ప్రతి పధకానికి పెట్టటం మొదలయ్యింది. అది ఎక్కడిదాకా వెళ్లిందంటే ప్రజలకు మొహం మొత్తిందాకా. అయినా ప్రజలు ఏం చేస్తారు భరించటంతప్ప. ఈ ప్రహసనం కాంగ్రెస్ అప్రతిహంగా కొనసాగినంతకాలం బాగానే వుంది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు రావటం మొదలుపెట్టింతర్వాత దీనిని సమీక్షించటం మొదలుపెట్టారు. అయితే వాళ్లలో ఆ స్టేచర్ వున్న నాయకులు లేరు కాబట్టి పేర్ల ప్రహసనం ఆగిపోయింది. మోడీ వచ్చినతర్వాత ప్రతి పధకానికి ఓ కొత్త నామాన్ని పెట్టటం మొదలుపెట్టాడు. పధకం ముందుగా ప్రధానమంత్రి పేరు తగిలిస్తున్నాడు. ఓ విధంగా ఇది రేపు అధికారం లోకి ఎవరొచ్చినా ఇబ్బంది ఉండదు.

ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఈ పేర్ల ప్రహసనం చంద్రబాబు నాయుడు తోనే మొదలయిందని చెప్పొచ్చు.ఎన్టీఆర్ పేరుని అన్నింటికీ తగిలించటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్ ప్రతిగా ప్రతిపథకానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టటం
మొదలుపెట్టాడు. ఈ తంతు అధికారమార్పిడి జరిగినప్పుడల్లా నడిచింది. చివరగా చంద్రబాబు నాయుడు పోయిన ప్రభుత్వం లో ఎన్ టిఆర్ పేరు తో పాటు తనపేరుతో పధకాలు ప్రారంభించటం మొదలుపెట్టాడు. చంద్రన్న పధకాలు ప్రారంభించాడు. ఇది కొత్త ఒరవడి. దాన్నే జగన్ ఇప్పుడు కాపీ కొట్టాడు. తన తండ్రి వైఎస్సార్ తో పాటు తనపేరుతో కూడా పధకాలు ప్రారంభించాడు. ఇప్పుడు చంద్రన్న బదులు జగనన్న పధకాలు మొదలయ్యాయి. వీళ్లిద్దరూ బతికుండగానే వాళ్ళ పేర్లను ప్రాచుర్యం లోకి తెచ్చుకోవాలని తాపత్రయపడటం కొంత జుగుప్సాకరంగా వుంది. ముందు ముందు చంద్రబాబు, జగన్ విగ్రహాలను కూడా వాళ్లే ప్రారంభించుకుంటారేమో చూడాలి. రాజకీయాల దిగజారుడుతనానికి ఇంతకన్నా ఏం కావాలి?

బోల్డ్ ఇమేజ్ మంచిదే అంటున్న పాయల్ రాజ్ ఫుత్

 

మరక మంచిదే అన్నట్లు.. సినిమాల్లో బోల్డ్ ఇమేజ్ మంచిదేనని పాయల్ రాజ్ ఫుత్ హాట్ కామెంట్ చేసింది. ఓ ఇంటర్యూలో పాయల్ రాజ్ ఫుత్ బోల్డ్ ఇమేజ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను బోల్డ్ ఇమేజ్ కోరులేదని, ప్రేక్షకులే తనకు బోల్డ్ ఇమేజ్ ఇచ్చారని తెలిపింది. తనకు మంచే చేసిందని హీరోయిన్ పాయల్ రాజ్ ఫుత్ అన్నారు. అభిమానులు కోరుకున్న క్యారెక్టర్లో నటించడంలో తప్పేమీ లేదని చెప్పింది. ఈ ఇమేజ్ ఇలానే కొనసాగుతుందని పాయల్ రాజ్ ఫుత్ స్పష్టం చేసింది.

 

Read More: అందాలతో కాక రేపుతున్న శ్రీముఖి..

 

ఆర్ఎక్స్-100 మూవీతో తెలుగు ప్రేక్షకులకు పాయల్ రాజ్ ఫుత్ పరిచయమైంది. ఈ సినిమా పాయల్ నటనతోపాటు అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో పాయల్ ఏమాత్రం బెరుకులేకుండా అందాలను ఆరబోసింది. ఈ సినిమా విజయంలో పాయల్ కీ రోల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో యువతలో పాయల్ కు భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి ఆమెకు వరుసగా బోల్డ్ ఇమేజ్ క్యారెక్టర్లు చేస్తూ వస్తుంది. ఆర్ఎక్స్-100 తరహాలోనే ఆర్డీఎక్స్ లవ్ మూవీలోనూ బోల్డ్ క్యారెక్టర్ చేసింది. కానీ ఈ సినిమా అనుకున్నంత సక్సస్ కాలేదు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. అయితే పాయల్ బోల్డ్ ఇమేజ్ దూరంగా క్యారెక్టర్లు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.

 

ఇటీవలే హీరో వెంకటేష్ సరసన వెంకీమామలో మంచి నటనతో ఆకట్టుకుంది. అలాగే కిందటివారం విడుదలైన డిస్కో రాజాలోనూ పాయల్ రవితేజ సరసన నటించింది. అయితే పాయల్ గ్లామర్ పాత్రలకు దూరమవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పాయల్ రాజ్ ఫుత్ ఈ హాట్ కామెంట్ చేసింది. బోల్డ్ ఇమేజ్ అంటే కొందరు హీరోయిన్లు భయపడుతారు. అలాంటి బోల్డ్ ఇమేజ్ ను వదిలేదని ఈ హాట్ బ్యూటీ స్పష్టం చేస్తుంది. ఏదిఏమైనా పాయల్ ను అభిమానులు ఏవిధంగా కోరుకుంటారో అలా చేయడానికి తాను రెడీ అని బోల్డ్ గా చెబుతోంది. ఆమె మాటలు దర్మక, నిర్మాతలకు చేరాయో లేదోగానీ, పాయల్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కెసిఆర్ సీతయ్య! ఎవరి మాటా వినడు…

హైదరాబాద్ ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే ప్రయత్నం మానుకున్నారు. దానికి బదులు కొత్త గా అదనంగా ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే ఇటీవల బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన మణికొండ దానిచుట్టుపక్కల ప్రాంతాలను జిహెచ్ ఎంసీ లో కలుపుతున్నారు. ఈ రెండు పరిణామాలు ఆహ్వానించదగ్గవిగానే వున్నాయి. నిన్న అనుకున్నట్లు హైదరాబాద్ ని మూడు కార్పొరేషన్లగా చేసే ఆలోచనను విరమించుకున్నట్లే చెప్పాలి. మూడు కార్పొరేషన్ల ఆలోచన ఢిల్లీ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని విరమించుకొని ముంబై మోడల్ ని తెరపైకి తెచ్చారు.

ఓ విధంగా ఇది మంచిదే. శివారు ప్రాంతాలు మొత్తం ఒకేసారి హైదరాబాద్ లో కలిపితే చాలా సమస్యలు వచ్చే అవకాశం వుంది. శివారు ప్రాంతాలు ఇప్పటివరకు పంచాయతీలో ఉండటంవలన ప్రణాళికలేకుండా , తగిన నగర అనుభవంలేని సిబ్బందితో నడిచాయి. ఒక్కసారి వాటిని హైదరాబాద్ నగరం లో కలిపే బదులు ప్రత్యేకంగా ఉంచటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే అదేసమయంలో ఓ ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చెందాలంటే వాటిని నగరపాలికలు చేయటమే మంచిది.

కెసిఆర్ ఆలోచనలు మిగతావాళ్లకు భిన్నంగా, విన్నూత్నంగా వుంటాయనే దాంట్లో సందేహం లేదు. అయితే అన్నిసార్లు అవి ప్రజారంజకంగా వుండవు. కెసిఆర్ తో వచ్చిన చిక్కల్లా తాను చెప్పిందే వినాలి. పారదర్శకంగా అందరి అభిప్రాయాలు తీసుకుని పోదామనే ఆలోచన తనకు పొసగదు. అంతమాత్రాన తన ఆలోచనలు కొట్టిపారేసేవిగా వుండవు. సమస్యల్లా ‘ సీతయ్య ఎవరిమాటా వినడు’ తోనే . నిజంచెప్పాలంటే తన పధకాలను మిగతా దేశం కాపీ కొడుతోంది. ఎవరు కాదన్నా ఇది నిజం. అంటే సృజనాత్మక ఆలోచనలు వున్నట్లే కదా. కొంచెం మార్చుకొని మిగతా వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటే అందరి మన్ననలను పొందొచ్చు. ఓ విధంగా కెసిఆర్ మంచి నియంత ( benevolent dictator ) గా ఉండటమే ఇష్టపడతాడు. ప్రజలు కూడా తనని అలానే చూస్తున్నారు. ఇప్పటివరకు కెసిఆర్ ని ఆ రకంగా ఇష్టపడుతున్నారు. అయితే ముందు ముందు ఎలా ఉంటుందో మరి.

టిటిడి కి మంచి రోజులొచ్చాయి

 

కొత్త టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యేక దర్శనాల పేరుతో ఇన్నాళ్లు సామాన్య భక్తుల్ని ఇబ్బందిపెట్టిన వైనం అందరికీ తెలిసిందే. దానిపై కొంత మంది కోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ రేపు అంటే 18వ తేదీన జరగనుంది. ఇందులోభాగంగానే నిన్న కొత్త చైర్మన్ ఇప్పుడున్న మూడు క్యాటగిరీలతో కూడిన విఐపి దర్శనానికి బ్రేకులు వేశాడు. ఈ మూడు కేటగిరీల వలన సామాన్య భక్తులకు విపరీతమైన జాప్యం జరుగుతుందని ప్రకటించాడు. ఈ రోజు సాయంత్రం ఈ పద్దతి స్థానంలో కొత్త పద్దతి తీసుకొస్తానని ప్రకటించటం అందరూ హర్షిస్తున్నారు. దైవ దర్శనానికి ఇన్ని క్యాటగిరీలేంటని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ ప్రకటనను ప్రజలు స్వాగతిస్తున్నారు.

వైవి సుబ్బారెడ్డి ని నియమించినప్పుడు ఆయన హిందూ కాదని విమర్శించారు. నిజానికి అవునో కాదో తెలియదు కానీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం హిందూ సామాన్య భక్తులకు మాత్రం పెద్ద ఊరటనే ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దేవుణ్ణి దర్శించుకోవటానికి రాజకీయ పలుకుబడి వున్న వాళ్లకు లేని వాళ్లకు మధ్య వ్యత్యాసం చూపటం సరైనది కాదు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లాంటి కొంతమంది ప్రముఖులకు తప్పితే మిగతా వాళ్ళందరూ సామాన్య జనంతోపాటు దర్శనానికి రావటానికి ఇబ్బందేమిటో అర్ధంకాదు. మనదేశంలో ప్రతిదీ డబ్బులు, అధికారం, హోదా తో ముడిపడి వుంది. చివరకు దేవుడి దర్శనం కూడా. ఈ వ్యవస్థ మారాలి. పనిలో పనిగా కొత్త చైర్మన్ ఇంకో మాట చెప్పాడు. విఐపి దర్శనాలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే అనుమతిస్తే బాగుంటుందని తన అభిప్రాయంగా చెప్పాడు. ఇది హర్షింతదగ్గది . కానీ దానిమీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఇందులో తప్పేముంది. దర్శనాన్ని నిషేదించలేదు సుమా . కేవలం విఐపి దర్శనాన్నే పరిమితం చేయాలనీ చెప్పాడు. నిజంగా దాన్ని అమలుచేస్తే సామాన్య ప్రజలు జేజేలు పలుకుతారు. సుబ్బారెడ్డి గారు, గో ఎహెడ్ . విఐపి సంస్కృతిని పక్కనపెట్టండి. సామాన్య భక్తులకు అండగా నిలవండి. ఇలాంటి మరెన్నో నిర్ణయాలు తిరుమలలో మీ హయం లో రావాలని కోరుకుంటున్నాం. ధైర్యంగా ముందుకెళ్ళండి.

హైదరాబాద్ మూడు ముక్కలవుతుందా?

హైదరాబాద్ నగరం ప్రస్తుతం జిహెచ్ఎంసి నగర పాలక సంస్థగా వుంది. అయితే ఇది ప్రస్తుతం పరిపాలనాపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదురుకుంటుంది. జనాభా పరంగా ప్రస్తుత అంచనాలప్రకారం కోటి దాటింది . ఈ సైజు లో వున్న ఇతరనగరాలు చూస్తే అధికార వికేంద్రీకరణ జరిగిందని చెప్పొచ్చు. ఉదాహరణకు ఢిల్లీని తీసుకుంటే మూడు కార్పొరేషన్లుగా విభజించబడి వుంది. ముంబై కూడా థానే , ఇంకా మరికొన్ని నగరాలుగా విడిపోయివుంది. కలకత్తా కూడా అంతే . కలకత్తా తో పాటు హౌరా , సాల్ట్ లేక్ లాంటి నగరాలుగా వికేంద్రీకరించబడివుంది. మరి హైదరాబాద్ కూడా ఆ దిశగా పయనిస్తుందా?

ఈరోజు కొత్త పురపాలక చట్టాన్ని తెలంగాణా రాష్ట్ర కాబినెట్ అమోదించబోతుంది. ఆ తర్వాత రేపు, ఎల్లుండి రాష్ట్ర శాసన సభ, మండలి ద్వారా చట్టం చేయబోతున్నారు. అయితే దీనిపై నిపుణులు ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈరోజు ఆమోదించే పురపాలక చట్టం హైదరాబాద్ నగరానికి వర్తించదు. జిహెచ్ఎంసి కి ప్రత్యేక చట్టం వుంది. అయితే ఈరోజు ఆమోదించే చట్టం లోకి శివారు ప్రాంతాల్లో కొత్తగా పంచాయితీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన చాలా ప్రాంతాలు వున్నాయి. ఒకవేళ గనుక హైదరాబాద్ నగరాన్ని వికేంద్రీకరణ చేసి ఎక్కువ కార్పొరేషన్లు చేసేటట్లయితే ఈ శివారు మునిసిపాలిటీలను అందులో విలీనం చేయాలనే ఆలోచన కూడా వుంది. అందుకే వీటి భవిష్యత్తు ఈరోజు తేలనుంది.

కొంతమంది నిపుణులు చెప్పేదాన్నిబట్టి హైదరాబాద్ ని హైదరాబాద్, హైదరాబాద్ తూర్పు, హైదరాబాద్ పశ్చిమంగా మూడు కార్పొరేషన్లు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు విభాగం ఆ విధంగానే విభజించబడింది. అయితే దీనిపై ఇప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఒకవేళ వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల లోపు చేసేటటట్లయితే శివారు ప్రాంతాల మున్సిపాలిటీలకు ఇప్పుడు ఎన్నికలు జరపరు. ఇంకో అయిదు సంవత్సరాల తర్వాత విభజించేటట్లయితే శివారు ప్రాంతాల పురపాలక సంఘాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. అది ఈరోజు తెలిసిపోతుందని భావిస్తున్నారు. ఏమైనా హైదరాబాద్ మూడుగా విభజించటం ఖాయమని అయితే అది ఇప్పుడా లేక అయిదు సంవత్సరాల తర్వాతనా అనేదే తేలాల్సివుందని నిపుణులు చెబుతున్నారు. వేచి చూద్దాం మరి.

సినిమా లెక్కలు తేలుస్తానంటున్న పవన్

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడో సినిమా పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీగా పింక్(తెలుగు) ప్రారంభమైంది. పవన్ ఈ మూవీ చేస్తుండగానే ఆయన తదుపరి సినిమా క్రిష్ దర్శకత్వంలో ఉంటుందంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగానే పవన్ మూడో సినిమా ‘పండగసాయన్న’ అంటూ టైటిల్ పేరుతోసహా సోషల్ మీడియాలో ప్రచారం కావడం చర్చనీయాంశంగా మారింది.

 

Read More: అందాలతో కాక రేపుతున్న శ్రీముఖి..

 

పవన్ ఫొకస్ సినిమాలపైనే!

పింక్(తెలుగు) మూవీ కోసం పవర్ స్టార్ కేవలం 20రోజుల మాత్రమే కేటాయించారని సమాచారం. శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతుండగా కొన్ని ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోలకు సంబంధించి చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ సినిమా ఓవైపు జరుగుతుండగా పవర్ స్టార్ తదుపరి మూవీ క్రిష్ దర్శకత్వంలో ఉంటుందంటూ ప్రచారం జరిగింది. మొగల్ సామ్రాజ్య కథాంశంతో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నాడు. ఈ సినిమాపై పవన్ బందిపోటుగా నటిస్తాడని సమాచారం. పవన్ సరసన ఇద్దరి భామలకు అవకాశం ఉండగా కంచె బ్యూటీ ప్రగ్య జైస్వాల్ ఒక కథానాయికగా ఎంపికయినట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్ విషయంలో చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షిసింగ్ పేరు విన్పిస్తుంది.

 

Read More: జనసేన-బీజేపీ:తాటి చెట్టు క్రింద మజ్జిగ తాగుతున్న పవన్..!?

 

తెరపైకి ‘పండగసాయన్న’

పవన్ నటించే మూడో సినిమా ‘పండగ సాయన్న’ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి చేసిన సైరా మూవీ తరహాలోనే పండుగ సాయన్న అనే స్వాతంత్ర్య సమరయోధుడి కథతో పవన్ చిత్రం ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ ఇటూ రాజకీయాల్లో బీజీగా ఉన్న నేపథ్యంలో వరుస సినిమా పేర్లు తెరపైకి రావడం ఒక్కింత ఆశ్చర్యం కలుగజేస్తోంది. పవన్ సినిమా రంగంలో ఉన్నప్పుడు ఏడాది ఒక సినిమా రావడమే గగనంగా ఉండేది. అలాంటిది అటూ రాజకీయాల్లో బీజీగా ఉన్న సమయంలో వరుసగా సినిమాలు చేస్తాడని ప్రచారం జరగడంలో అంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. గతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ తిరిగి ఆ లెక్కలను సరిచేసేందుకు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై పవన్ తరుపు నుంచి వీటిపై ఎలాంటి ఖండన రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా పవర్ స్టార్ తాను చేయబోయే సినిమా లెక్కలపై క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి మరీ..

ఇడి కేసునుంచి జగన్ కి విముక్తి

జగన్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఇ డి అప్పలేట్ ట్రిబ్యునల్ పెన్నా సిమెంట్ కేసులో ఇ డి అధికారుల్ని తప్పుపట్టింది. ముందుగా పెన్నా సిమెంట్ కంపెనీ 1.1 కోట్ల రూపాయల లబ్ది కోసం సాక్షి పేపర్లో 45 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టటం ఏవిధంగానూ తర్కానికి నిలబడటంలేదని, హాస్యాస్పదంగా ఉందని చెప్పింది. సాక్షి పత్రిక రెండో అత్యధిక సర్క్యూలేషన్ గల పత్రికా ఉండటం ఈ పెట్టుబడులు వ్యాపార దక్షతకు సాక్ష్యంగా ఉన్నాయని తీర్పు చెప్పింది. సిబిఐ ఛార్జ్ షీట్ ఏమీ దైవదత్తం కాదని, ఆరోపణలు నిరూపణ కాకముందే దానిని అధికారులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించింది. అసలు ఇందులో అక్రమ నగదు చలామణి కి సంబంధించి ఏముందని అడిగింది. సిబిఐ ఛార్జ్ షీట్ ని మక్కి కి మక్కి కాపీ కొట్టటం తప్పిస్తే ఈడీ కి సంబంధించి ఇందులో ఏమీ కనిపించలేదని చెప్పింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి కి పెద్ద ఉపశమనమే. ఇది రాబోయే పరిణామాలకు సంకేతమా?

జగన్ మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యినతర్వాత దర్యాప్తు సంస్థల్లో వచ్చిన మార్పుకి ఇది సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇది రాబోయే తీర్పులకు ముందు సూచికగా అని అనుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి మీద ఇప్పటికే చాలా కేసులు పెండింగు లో వున్నాయి. ముఖ్యమంత్రి అయ్యిన తర్వాత ప్రత్యక్షంగా కోర్టు హాజరునుంచి మినహాయింపు కోరుతున్నాడు. అందుకు కోర్టులు ఆమోదం తెలుపుతున్నాయి. అయితే తన మీదున్న కొన్ని కేసుల్లో సాక్ష్యాలు బలంగా వున్నాయి. అదీగాక ఇందులో కొన్ని ఇప్పటికే చివరిదశకు చేరాయి. ఈ సమయంలో ఆరోపణలు నిరూపణ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అనుకుంటున్నారు. వచ్చే రోజుల్లో ఈ పరిణామాలు ప్రధానం కాబోతున్నాయి. ఓ విధంగా జగన్ మోహన రెడ్డి కి ఇది పెద్ద అగ్నిపరీక్షే.

బొల్లినేని కి ఉచ్చు బిగిస్తుంది

 

బొల్లినేని శ్రీనివాస గాంధీ కేసులో మరిన్ని నిజాలు బయటకొస్తున్నాయి. హైదరాబాద్ ఇడి ఆఫీసులోనే రాజకీయ పెద్దల పలుకుబడితో ఎక్కువకాలం పనిచేశాడు. ఆ టైములో తన అధికారానికి మించి పెత్తనం చెలాయించాడు. సంయుక్త కార్యదర్శి అధికారాలు కూడా తనే చేసేవాడు. కీలకమైన కేసులు తన దగ్గరే అట్టిపెట్టుకోవటమే కాకుండా మిగతా కేసులు కూడా ఎవరికివ్వాలో సంయుక్త కార్యదర్శికి బదులు తనే చేసేవాడు. ఇప్పుడు తన నిర్వాకాలన్నీ ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆంతరంగిక సమాచారాన్ని తనకు అనుకూలమైన, తన వర్గానికి చెందిన వ్యక్తులకు చేరవేసేవాడని ఆధారాలు దొరికినట్లు తెలుస్తుంది.

సుజనా చౌదరి కి చెందిన కేసుల్లో తనకు గాంధీ ద్వారా ముందస్తు సమాచారం ఎప్పటికప్పుడు చేరేది. ఇటీవల జీఎస్టీ ఇన్ పుట్ క్రెడిట్ తప్పుడు బిల్లులు పెట్టి క్లెయిమ్ చేసిన వ్యవహారంలో కూడా సుజనా చౌదరికి ముందస్తు సమాచారం ఉన్నట్లు తెలిసింది. తన మోడస్ ఆపరెండి లో ఇంకో వ్యవహారం బయటకు వచ్చింది. తన వర్గానికి, కావాల్సిన వాళ్లకు సంబంధించిన కేసుల్లో తప్పనిపరిస్థితుల్లో కేసులు బుక్ చేసి సీరియస్ ఛార్జీలకు బదులు చిన్న చిన్న చార్జీలు పెట్టి కేసుల్లోనుంచి బయట పడేసేవాడు. ఇవన్నీ ఇప్పుడు బయటకొచ్చి తన మెడకు వుచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా గాంధీని జీఎస్టీ నుండి బదిలీ చేశారు. ఆ తర్వాత వీటన్నింటిపై దర్యాప్తు జరుపుతారని తెలిసింది.

గాంధీ భార్య శిరీష పై కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆవిడ ఐటీ రిటర్న్ లో కన్సల్టెన్సీ ద్వారా ఆదాయం వచ్చినట్లు చూపించటం జరిగింది. ఆ ఫర్మ్ కస్టమ్స్, ఎక్సయిజ్ విశ్రాంతి ఉద్యోగులతో స్థాపించి నిందితులకు సలహాలిస్తూ సమాచారం చేరవేస్తూ వచ్చింది అందులో డైరెక్టర్ గా వున్న శిరీషనేనని తెలుస్తుంది. దీనిపై కూడా సిబిఐ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ముందు ముందు ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయో వేచిచూద్దాం

.

గాంధీ పై దర్యాప్తు భవిష్యత్తు పరిణామాలకు సంకేతమా?

 

సిబిఐ దర్యాప్తులో భాగంగా కేంద్ర జీఎస్టీ లో అధికారయిన బొలినేని శ్రీనివాస గాంధీ ఆస్తులపై దాడి చేయటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇటీవల మోడీ 2. 0 అధికారం చేపట్టిన తర్వాత సిబిఐ దేశ వ్యాప్తంగా దర్యాప్తు వేగాన్ని పెంచింది. ఇదే స్పీడు లో త్వరలో గాంధీ కుటుంబం పై కూడా దర్యాప్తు వేగవంతం కావచ్చని తెలుస్తుంది. ముఖ్యంగా ఆగస్తా వెస్ట్ ల్యాండ్ కి సంబంధించి దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిందనుకుంటున్నారు. అలాగే రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాలకు సంబంధించి కూడా సాక్ష్యాలు బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. చిదంబరం , కార్తీ చిదంబరం ల కేసులు కూడా ఓ కొలిక్కి రావచ్చు. ఇటీవలే ఇంద్రాణి అప్రూవర్ గా మారింది. ఈ వేగం ఇలానే కొనసాగితే త్వరలో సంచలన వార్తలు వినే అవకాశం వుంది.

ఇది ఇలావుంటే బొలినేని శ్రీనివాస గాంధీ విషయంలో జగన్ వర్గీయులు చాలా సంతోషంగా వున్నారు. జగన్ పై కేసులు నమోదు చేసి వెంటపడిన దాంట్లో ఈ అధికారి పాత్ర ఎక్కువగా ఉందని చెపుతున్నారు. ఇప్పటికి బయటపడిన ఆస్తులే మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్ల రూపాయలు వుంటాయని అనుకుంటున్నారు. ఇతను చంద్రబాబు నాయుడు కి అతి సన్నిహితుడని కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒత్తిడి తోనే జగన్ ని వెంటాడని జగన్ వర్గీయులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదో ఒకరోజు చంద్రబాబు నాయుడు మీదకూడా ఉచ్చు బిగిస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటికే పోలవరం పై నివేదిక తెప్పించుకొని ప్రస్తుత కాంట్రాక్టర్ ని తొలగించ బోతున్నారని వార్తలు వచ్చాయి. మిగతా వాటిల్లో కూడా చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయం లో మోడీ కి, జగన్ కి , కెసిఆర్ కి వుమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు నే.

ఇది ముందుగానే పసిగట్టిన చంద్రబాబు నాయుడు తనకు విశ్వాసపాత్రులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లను బీజేపీ లోకి పంపించాడని జనం బలంగా నమ్ముతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదుకానీ చంద్రబాబు కి ముందు ముందు కష్టాలు ఖాయం. బొలినేని శ్రీనివాస గాంధీ కేసు రాబోయే పరిణామాలకు సంకేతమని భావిస్తున్నారు.