
Read More:ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ..రోల్ ఇదే..!

Read More: సీఎం పీఏగా రవితేజ.. ఈసారైనా హిట్ కొడతాడా..?

పవన్ కళ్యాణ్ తానా మహాసభలకు హాజరు అవుతున్నట్లు తెలిసింది. దీనిపై వాళ్ళ అభిమానుల్లోనే చర్చ జరుగుతుంది. ఇంతవరకూ అమెరికా లోని పవన్ అభిమానుల్లో చాలామంది తానా సభ్యులు కాదు. కారణం వాళ్లలో చాలామందికి తానా ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తుందని నమ్ముతున్నారు. మరి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తానా మహాసభలకు హాజరు కావటం జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల మేరీల్యాండ్ లో ఆప్టా సభలు జరిగినప్పుడు అది ఒక కులానికి సంబంధించింది కాబట్టి హాజరు కావద్దని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. అందుకే హైదరాబాద్ నుంచి జనసేన నాయకులెవ్వరూ హాజరు కాలేదు. మరి ఈరోజు తానా సభలకు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా హాజరు కావటం ఆయన అభిమానుల్లో కొంతమందికి నచ్చటంలేదు.
తానా ఆప్టా లాగా ఒక కులస్తులకే సభ్యత్వం ఇవ్వకపోవటం నిజమే. అయితే తానా లో ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం వహిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అంతమాత్రాన ఒక రాజకీయనాయకుడిగా తానా సభలకు వెళ్లటాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ప్రస్తుతం తనకు అంత ప్రాధాన్య అంశం కాదు. అభిమానుల్లో అపోహలు కలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. అలాగే ఆప్టా సభలను కూడా బాయికాట్ చేయాల్సిన పనిలేదు. రాజకీయనాయకులు ఎవరుపిలిచినా వెళ్లొచ్చు. కాకపోతే అక్కడ మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరు కావటం ఆయన అభిమానుల్లో చర్చనీయాంశమయ్యింది.

ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రియ.. పెళ్ళయ్యాక కాస్త జోరు తగ్గించింది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read More:ఫొటోస్: అదిరిపోయిన RRR హీరోలు
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో డైరెక్టర్ రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` పేరుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, హిందీ ‘దృశ్యం’లో వీరిద్దరూ జంటగా నటించారు. మళ్లీ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో అజయ్ దేవగణ్, శ్రియపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. శ్రియకి.. `ఆర్ ఆర్ ఆర్` ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.

సోషల్ మీడియా చాలా అలెర్ట్ గా ఉంటుంది. జగన్ నియామకాలపై ఇప్పటికే ఓ పెద్ద సంచలనం మొదలయ్యింది. ఇప్పటికి నామినేషన్ పోస్టుల్లో ఎక్కువమందిని రెడ్డి కులస్తులనే నియమించాడని పేర్లతో సహా హల్ చల్ చేస్తుంది. ఇదేగనుక నిజమయితే తెలుగుదేశం చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నట్లే. తెలుగు దేశం అన్ని కీలక పోస్టుల్లో కమ్మ వారినే నియమించటం తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకుంది. అదే తప్పు మరలా జగన్ చేస్తే ప్రజానీకం క్షమించరు. ఇప్పటికే ఎన్నో కీలక పదవులు రెడ్డి కులస్తులకు కట్టబెట్టాడని సోషల్ మీడియా లో పేర్లతో సహా హల్ చల్ చేస్తుంది. అది ఎంతవరకు నిజమో పాఠకులే చెప్పాలి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న లిస్టు ఇక్కడ ఇస్తున్నాం.
:
*రెడ్డి రాజులు మళ్ళీ వచ్చారు *
*వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి *
సీఎం అయిన 6 రోజులలో మూడు యూనివర్సిటీల రిజిస్ట్రార్లను మార్చారు.
🔺రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా శ్రీ సీవీ కృష్ణారెడ్డి
🔺ఎస్కేయూ రిజిస్ట్రార్ గా …
శ్రీ మల్లికార్జున్ రెడ్డి,
🔺ఎస్వీ రిజిస్ట్రార్ గా
శ్రీ శ్రీధర్ రెడ్డి
🔺ఇక ముఖ్యమంత్రి రెడ్డి
🔺ముఖ్యమంత్రి PA రెడ్డి
🔺ప్రభుత్వ సలహాదారు రెడ్డి
🔺పార్లమెంట్ లో పార్టీ నేత గా రెడ్డి
🔺రాజ్యసభ లో పార్టీ నేత గా రెడ్డి
🔺ఖాళీగా ఉన్న మూడు యూనివర్సిటీ లకు నియమించిన VC లు ముగ్గురు రెడ్లే
🔺ఒలింపిక్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రెడ్డి
🔺పార్లమెంట్ లో పార్టీ అధ్యక్షుడు రెడ్డి
🔺టీటీడీ ఛైర్మన్ గా రెడ్డి
🔹ఇంక మతం విషయానికి వస్తే
🔹ముఖ్యమంత్రి క్రిస్టియన్
🔹డీజీపీ క్రిస్టియన్
🔹ఇంటిలిజెన్స్ చీప్ క్రిస్టియన్
🔹చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా క్రిస్టియన్
🔹పులివెందుల సీఎం క్యాంప్ ఆఫీస్ PA క్రిస్టిన్
🔸”ఇదింకా శాంపిలే”🔸
🔸 అసెంబ్లీ సమావేశాలయ్యాక నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
🔸 ఈ లోపే కొన్ని కీలకమైన పదవులన్నీభారీ స్థాయి బడ్జెట్ అధీ కారం ఉండే పదవులన్నీ నియామకం అయిపోతున్నాయి.
🔸కొత్త ప్రభుత్వం లో చాలా కీలకమైన చైర్మన్స్ మరియు పార్లమెంట్ లీడర్స్, సభలో పార్టీ లీడర్స్ ప్రస్తుతానికి ఎవరెవరున్నారో చూడండి.
🔸ఇదేమి కల్పితం కాదు. ప్రభుత్వ సమాచారమే. ఇందులో తప్పులు ఉంటే సవరించుకుంటా.
🔸ఏపీఐఐసీ చైర్మన్ – రోజా రెడ్డి
(పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ. చాలా ప్రాముఖ్యమైంది)
🔸టీటీడీ చైర్మన్ – వైవీ సుబ్బా రెడ్డి
(తిరుమల తిరుపతి దేవస్థానం )
🔸సీఆర్డీఏ చైర్మన్ – ఆళ్ల రామకృష్ణ రెడ్డి
🔸(రాజధాని పరిధి ప్రాంత అభివృద్ధి సంస్థ. వేల ఎకరాల భూమి పై అధికారం ఈ సంస్థ కి సొంతం )
🔸చీఫ్ విప్ – గడి కోట శ్రీకాంత్ రెడ్డి
🔸అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ క్యాబినెట్ హోదా
🔸తుడా చైర్మన్ – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
🔸తిరుపతి నగర పరిధి అభివృద్ధి సంస్థ . చాలా బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం.
🔸ప్రభుత్వ సలహాదారు – సజ్జల రామకృష్ణ రెడ్డి
దీని గురించి చెప్పేదేముంది.
🔸ఆర్టీసీ విలీనం పై కమిటీ – ఆంజనేయ రెడ్డి .
🔸పార్లమెంటరీ పార్టీ లీడర్ – విజయ సాయి రెడ్డి
🔸లోక్ సభ పార్టీ లీడర్ – మిథున్ రెడ్డి
🔸వీటిలో కొన్నింటికి క్యాబినెట్ హోదా కూడా ఉంటుంది.
🔸ఇది శాంపిల్ ఇంకా ముందుంది..
🔸మంత్రి వర్గ కూర్పుని అభినందిస్తా. కానీ రానున్న రోజుల్లో జరగబోతున్నది ఏమిటో కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది.
🔸ఈ విషయాలన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా అయినా ప్రచారం చేయండి.
🔸కనీసం రానున్న నియామకాల్లో అయినా ఇటువంటి ఏకపక్ష వైఖరి వీడతారేమో..
🔸అన్నట్టు దళితులకు పెద్ద పీట అనే వారు ఇంత భారీ స్థాయి నియామకాల్లో మన పీట ఎవరు ఎత్తుకెళ్లారో కాస్త చూడండి బ్రదర్స్.🔸
🙏🔸
Is this true ?
మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించిన జగన్ కీలక పదవుల్లో తనవారిని ఎందుకు నియమించాడో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.

మెగాస్టార్ చిరంజీవి పేరు మరలా వినిపిస్తోంది. ఆంధ్రా బీజేపీ లోని కాపు నాయకులు తన ఇంటిముందు క్యూ కడుతున్నారు. నిన్నఅంటే సోమవారం రాత్రి మరోసారి చిరంజీవి ఇంటికి వెళ్లి బీజేపీ లో చేరమని అడిగారని విశ్వసనీయంగా తెలుస్తుంది . తానుగనుక వచ్చేటట్లయితే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా చేస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకు చిరంజీవి స్పందన ఏంటో తెలియదు. కానీ అప్పుడే ఇది వైరల్ అయ్యింది.
చిరంజీవి గనుక ఒప్పుకొనేటట్లయితే ఆంధ్రా రాజకీయాలు రంజుగా ఉంటాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన తో వచ్చే అయిదు సంవత్సరాలు రాజకీయాల్లో వుండాలని పధకాలు రచిస్తుంటే రెండోవైపు చిరంజీవి కనుక బీజేపీ అధ్యక్షుడయితే రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. చిరంజీవి కనుక తిరిగి రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన ను అన్నయ్య కోసం విలీనం చేస్తాడా? ఇది అందరి మనస్సుల్లో తొలుస్తున్న ప్రశ్న.
ఇకపోతే అసలు కాపు బీజేపీ నాయకుల ఈ ప్రయత్నం వెనుక సామజిక కోణం ఉందని అందరూ అనుకుంటున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రా రాజకీయాలు చక చకా మారుతున్నాయి. అధికారం కోల్పోయిన ఒక సామాజిక వర్గం బీజేపీ ద్వారా తిరిగి అధికారానికి దగ్గరకావాలని ప్రయత్నం చేయటం అందరికీ తెలిసిందే. అయితే ఇది బీజేపీ లో ఎన్నికలకు ముందే చేరిన కాపు సామాజిక వర్గం నాయకులకు రుచించటం లేదు. తెలుగుదేశం పూర్తిగా కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యంలో ఉందనే వీళ్ళు బీజేపీ ని ఆశ్రయించారు. తిరిగి ఇక్కడా వాళ్ళే వచ్చి ఆధిపత్యం చెలాయించటం ఇష్టం లేకే చిరంజీవిని ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అందుకనే ఆంధ్రా రాజకీయాలు రంజుగా ఉన్నాయని అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి ఇంకా అయిదు సంవత్సరాలు ఎన్నికలు లేవు. అయిదు సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరగొచ్చు. ఇంతముందుగా ఇప్పట్నుంచే ఈ రాజకీయ సమీకరణాలు కోకిల ముందే కూసినట్లుందని అనుకుంటున్నారు.

ఈయన ఏది మాట్లాడినా మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈయన ప్రతి వారం కొత్త కొత్త విషయాలను మనకు ఆవిష్కరిస్తుంటాడు . సామాన్యుడికి ఐతే ఇతను చెప్పే విషయాలు ఒక పట్టాన అర్ధంకావు. ఈమధ్య తెలుగు మాధ్యమాల్లో ఇలాంటి వారు చాలా మంది పుట్టుకొస్తున్నారు. ప్రధమంగా ఇలాంటి వారు, వారి గురుంచి వారు చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇతర ప్రచార సాధనాలు రానంత వరకు వీరి మీడియాలో ఏమి మాట్లాడితే , ఏది రాస్తే అదే ప్రవచనము అనుకోవాలి.
విషయానికి వస్తే ఈయన కొత్త చెత్త పలుకులో మనకు కొత్త విషయాన్ని ఆవిష్కరించాడు. అదేంటంటే కెసిఆర్ గారు హరీష్ రావు ను కొత్త పార్టీ పెట్టటానికి తానే వెనకనుండి తెరవెనక భాగోతమ్ నడిపిస్తున్నాడు అనే ఎవరికీ తెలియని దాన్ని ఈయన కనుక్కున్నాడు. ఇంకా ముందుకు వెళ్లి తమిళనాడులో DMK , AIADMK తరహాలో ఏదో ఒక పార్టీ వాళ్ళ కుటుంబం లోనే ఉండేటట్లు కెసిఆర్ వ్యూహమాట . ఈ కుహానా మేధావులు మొదట చేసే పని ఏమిటి అంటే ఆ విషయం నిజమయిన కాక పోయినా ముందర ఒక అనుమానపు బీజాన్ని ప్రజల మనస్సులో నాటాలి. ఈ రకంగా వీళ్లు ముందర వీళ్ళ పేపర్లు చదివే వాళ్లలో ఆసక్తిని రేకిస్తారు అదే సమయంలో వీరి ప్రతికూల పార్టీలో కొంత అనుమానాన్ని రేకిస్తారు.
ఇవన్నీ పాతకాలం నాటి విధానాలు RK గారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడు తున్నారో అందరికి తెలుసు. ప్రజలకు ఏదన్న ఉపయోగం ఉండే విషయాలు మాట్లాడితే బాగుంటదేమో ఆలోచించండి సారూ RK గారూ .

అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు మరలా 2020 నవంబర్ లో ఉన్నాయి కానీ 2 సంవత్సరాల ముందు నుంచి ఈ ఎన్నికల హడావిడి మొదలవుతుంది . అమెరికా లో ప్రతి 4 సంవత్సరాలకు ప్రెసిడెంట్ ఎన్నికలు, ప్రతి 2 సంవత్సరాలకు కాంగ్రెస్, సెనెట్ ఎన్నికలు జరుగుతుంటాయి. అంటే ఎప్పుడూ ఎన్నికల హడావిడి ఉంటుంది అన్నమాట. 2016 లో ట్రంప్ గెలిచిన తర్వాత మరలా 2018 ఎన్నికల్లో ట్రంప్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి . కాంగ్రెస్ లో డెమొక్రాట్స్ , సెనెట్ లో రిపబ్లికన్స్ మెజారిటీ సాధించారు. కానీ 2018 ఎన్నికల్లో సబర్బన్ మహిళలు చాలా మంది ట్రంప్ కు వ్యతిరేకంగా వోట్ చేసారు . ఇదే ట్రెండు కనుక కంటిన్యూ ఐతే 2020 ప్రెసిడెంట్ ఎన్నికలలో ఈ మహిళలు , మిల్లీనియల్స్ , పెళ్లి జరిగి విడాకులు తీసుకున్న మహిళలు వలన ప్రమాదం పొంచి ఉన్నట్లు అనిపిస్తుంది . దీనికి కొసమెరుపుగా కొంతమంది వైస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతమున్న మైక్ పెన్స్ కు బదులు భారతీయ సంతతికి చెందిన నిక్కీ హెలీ పేరును పరిశీలించమని ప్రొపొస్ చేస్తున్నారు.

వైస్సార్సీపీ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 22 స్థానాలతో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా టీఎంసీ తో పాటు అవతరించిన వైస్సార్సీపీ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పార్లమెంట్ పార్టీ. వచ్చే అయిదు సంవత్సరాల్లో లోక్ సభ లో దాని పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే 22 స్థానాలతో రాష్ట్రాలపరంగా చూస్తే పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మాత్రమే బీజేపీ రాష్ట్రాల తర్వాత పెద్ద సంఖ్యలో వున్నాయి. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికివ్వటం ఓ ఆనవాయితీగా వస్తూవుంది. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షపార్టీకి ఇవ్వటం ఇష్టంలేదు. పోయినసారి ఎన్డీయే లో లేని అన్నా డీఎంకే కి ఇవ్వటం జరిగింది. ఈసారి కాంగ్రెస్ తర్వాత పెద్ద పార్టీలుగా వున్న టీఎంసీ , వైస్సార్సీపీ లలో టీఎంసీ కి ఇవ్వటం మోడీకి ఇష్టంలేదు. కాబట్టి వైస్సార్సీపీ కి ఆఫర్ చేయటం జరిగింది. అయితే ఈ పదవి తీసుకోవాలా వద్దా అనే విషయంలో వైస్సార్సీపీ ఆలోచనలో పడింది.
ఆ పదవి తీసుకోకుండా ఉంటేనే మంచిదని ఆ పార్టీ ఆంతరంగిక చర్చల్లో ఓ అభిప్రాయానికి వచ్చారు. పోయిన లోక్ సభలో తెలుగుదేశం చేసిన తప్పిదం ఈ సారి చేయకుండా జాగ్రత్తపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ సారి బీజేపీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకుంటే బీజేపీ తో వైస్సార్సీపీ మిలాఖత్ అయిందనీ, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టిందనీ ప్రచారం జరిగే అవకాశం మెండుగా వుంది. ఇది తీసుకోకపోతే సమస్యలపై మిత్రవైఖరి అవలంబించినా పెద్దగా నష్టం వాటిల్లే అవకాశాలు లేవు. అందుకే వ్యూహాత్మకంగా , తెలివిగా నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా ఇది వైస్సార్సీపీ కి లాభించే చర్య గా భావిస్తున్నారు. బాలయోగి తర్వాత వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవటం సరయిన నిర్ణయమా కదా అనేది చరిత్ర చెప్పాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం దీని వలన ప్రత్యర్థుల విమర్శలకు అవకాశంలేకుండా పోయింది.

కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెజిఎఫ్-1’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియన్ మూవీగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సైకిల్ మెకానిక్ ను వరించిన పద్మశ్రీ.. కారణం ఇదే..!
సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘కెజిఎఫ్’ చాప్టర్ 2 సినిమా విడుదల తేదీని మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడం వల్ల ఈ మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కానుంది. రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, అనంత్ నాగ్, మాళవిక అవినాష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

పవన్ నటిస్తున్న పింక్ సినిమాకు మొదట భారీ పారితోషికం ఇవ్వాలని నిర్మాత దిల్ రాజు భావించాడు. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తప్ప నాన్ థియేట్రికల్ రైట్స్ కి పెద్దగా డిమాండ్ లేదట. ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్టిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. కారణం ఈ సినిమా మిగతా భాషలలో కూడా రిలీజ్ అయి.. అక్కడ టీవీలలో కూడా ప్రచారం అయ్యిందట. కావున ఈ సినిమాను కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించారని వినికిడి.
బైక్ నడుపుతూ స్నానం చేసిన యువకులు… వీడియో వైరల్
ఇక ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసే సమయంలో దర్శకుడు కృష్ణవంశీ సలహా మేరకు హీరోగా మారాడు రవిశంకర్ రాజు భూపతిరాజు అలియాస్ రవితేజ. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నాడు.అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసే సమయంలో దర్శకుడు కృష్ణవంశీ సలహా మేరకు హీరోగా మారాడు రవిశంకర్ రాజు భూపతిరాజు అలియాస్ రవితేజ. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నాడు. వయసు యాభై పైబడినా ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. అంతే ఎనర్జిటిక్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. సినిమాల్లో తప్ప ఈ హీరో బయట పెద్దగా కనిపించడు. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా అతడికి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు .
Read More: టీవీ9లో లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకుతూ, హోటల్ కి రమ్మని..
.jpg)
.jpg)
Read More: 2020 సమ్మర్… రీమేక్ స్పెషల్
.jpg)

Read More: బంగార్రాజు మూవీ అప్ డేట్.. ఎప్పుడు విడుదల కాబోతుంది అంటే…!


Read More: 2020 సమ్మర్… రీమేక్ స్పెషల్

Read More: బంగార్రాజు మూవీ అప్ డేట్.. ఎప్పుడు విడుదల కాబోతుంది అంటే…!

Read More: రవితేజ రేర్ ఫోటోలు: అసిస్టెంట్ స్థాయి నుండి హీరో రేంజ్..!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు మరో 13 మందిని హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఓ లేఖను విడుదల చేశారు. కన్నడంలో ఉన్న ఆ లేఖ.. ధర్మానికి, దేశానికి ద్రోహం చేస్తున్న వారిని హతమార్చేందుకు ఈ నెల 29న ముహూర్తంగా నిర్ణయించామని.. అందరూ తమ అంతిమ ప్రయాణానికి సిద్ధం కావాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు నిజగుణానంద స్వామి మఠానికి ఈ లేఖ వచ్చింది. అయితే ఆశ్రమ నిర్వాహకులు ఆ లేఖను జిల్లా ఎస్పీకి అందించారు.

క్లాస్, మాస్, యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాల్లో స్మార్ట్ లుకింగ్ స్టైల్‌తో నటనను పండించగలడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబుకు మేల్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో… ఫీమేల్ ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉన్నారు. ఆరంబడ సన్నివేశాలకు దూరంగా ఉండే మహేష్ యువతను మాత్రమే కాకుండా పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాడు.
టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ హీరో నెట్ వర్త్ రూ.130 కోట్లు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో బంగ్లా కట్టించుకొని జీవిస్తున్నాడు. మరి ఈ రిచ్ హీరో ఎలాంటి కార్లు వాడతాడో తెలుసా..?
Read More: RRR: ఎన్టీఆర్ పులితో ఫైటింగ్.. వీడియో లీక్
వానిటీ వ్యాన్ – రూ. 6.2 కోట్లు…

టయోటా ల్యాండ్ క్రూజర్ – రూ.92 లక్షలు…

ఆడి ఏ8 – రూ.1.12 కోట్లు…

రేంజ్ రోవర్ వోగ్ – రూ.2.1 కోట్లు…

Read More: పవన్ కల్యాణ్-క్రిష్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్!
జూబ్లిహిల్స్ లో ఇల్లు – రూ.14 కోట్లు…

ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ ట్రిప్ లో ఉన్నారు. రాగానే దర్శకుడు వంశి పైడిపల్లి.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మిక సినిమా ఆర్ ఆర్ ఆర్ వస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. రాజమౌళి తెలుగు టాప్ స్టార్స్ తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. రాజమౌళి ఇటీవలే ఎన్టీఆర్ పై విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. ప్రస్తుతం షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఈ మధ్యే షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబందించిన ఓ పిక్‌ను చిత్రబృందం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. మరో ముఖ్య పాత్రలో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని నటిస్తున్నాడు.
Read More: టీవీ9లో లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకుతూ, హోటల్ కి రమ్మని..
అది అలా ఉంటే.. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు లీకేజ్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇది వరకే ఈ సినిమా షూటింగ్ సంబందించి లొకేషన్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అవడంతో ఆ మధ్య ఎన్టీఆర్ లుక్ రివీల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ షూటింగ్ లొకేషన్ పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంది. అయినా లీక్ సమస్య తగ్గలేదు. అందులో భాగంగా తాజాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్‌కు సంబందించిన ఓ విజువల్ బయటికొచ్చింది. ఈ ఫైట్ ఓ పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన హోరా హోరిగా జరిగేది. అంతేకాదు ఈ పోరాట సన్నివేశం సినిమాలోని కీలకమైన అంశం అట. దీంతో ఎంతో ప్రయాసతో దీన్ని తెరకెక్కించింది చిత్రబృందం. ఈ విషయం తెలుసుకున్న టీమ్, తారక్ లుక్ బయటికి లీక్ కావడంతో వెంటనే అప్రమత్తమై.. కాపీ రైట్ ఇష్యూ కింద ఆ వీడియోను ఆన్ లైన్ నుండి తొలగించారు.
Read More: పవన్ కల్యాణ్-క్రిష్ సినిమాకి హీరోయిన్ ఫిక్స్!