Home Blog Page 8639

పవన్ కళ్యాణ్ ఆ మతానికి వ్యతిరేకమా?

హిందూ పుణ్య క్షేత్రాల్లో అన్య మత ప్రచారం పెరుగుతున్న తీరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ పుష్కర ఘాట్‌లో సామూహికంగా బాప్టిజమ్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ జనసేన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. దింతో పవన్ కల్యాణ్‌పై తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు మండిపడుతున్నారు. అలాగే నరేంద్ర మోడీ, అమిత్ షాలను పొగడటం, ఈ మధ్య జనసేన విడుదల చేసే కొన్ని పోస్టులకు జై జగన్మాత అనడం లాంటివి చూసి అనేక మంది జనసేన పార్టీని హిందూ సిద్ధాంత పార్టీగా ముద్రవేశారు. అన్యమతంపైనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తరహాలో పవన్ కల్యాణ్ వెళ్తున్నారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మత సంబంధ వ్యాఖ్యలపై వారం రోజుల క్రితం ఆలివర్ రాయ్ విశాఖపట్టణం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉన్న రాజు రవితేజ్ కూడా రాజీనామా చేశారు. ఇలా చెప్పుకుంటే పోతే పవన్ కళ్యాణ్ తీరు క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక ప్రజా ప్రతినిధి స్థానంలో ఉన్నప్పుడు అందరి మనోభావాలను గౌరవించాలి. ఎవరి నమ్మకాలు వాళ్లకుంటాయ్.. మాత మార్పిడి అని జనసేన అంటే కాదు అది రాజ్యాంగం నాకిచ్చిన హక్కు(లౌకిక వాదం) అని అనేక మంది అంటున్నారు.

జనసేనలో ఉన్న అనేకమంది చెప్పే మాట ఏమిటంటే.. జనసేన ఎవరి వ్యక్తిగత కోరికలను తీర్చేపార్టీ కాదు, ఎంత మంది వెళ్లి పోయినాపర్వాలేదు, సత్యం కోసం నిలబడేపార్టీ, ప్రజల తరుపున సమస్యల కోసం పోరాడేపార్టీ…. ఇలా చెప్పుతుంటూ వెళ్తున్నారు. నిజమే పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు వచ్చే సినీఫీల్డ్ ని వదులుకొని, ప్రజలకోసం తాను నమ్మిన, సిద్ధాంతాలు, విధి విధానాలపై గట్టిగా నిలబడ్డాడు కానీ పవన్ ని అభిమానానించే (ఫ్యాన్స్) ఎక్కువమంది మాస్ వాళ్ళే.. అంటే పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళే.. వాళ్లలో ఎక్కువమంది కన్వర్టెడ్ క్రైస్తవులే అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రజలు, అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ ఇకనైనా మత సంబంధమైన వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ.. ఏ సిద్ధాంతాలను నెరవేర్చడానికై రాజకీయాలను ఎంచుకున్నారో.. ఆ మార్గంలోనే నడుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కృషిచేస్తారని ఆశిద్దాం..!

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న హీరో కార్తీ!

 

తమిళంలో కార్తీ హీరోగా నటించిన ‘ఖైతి’ సంచలన విజయం సాధించింది. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఖైదీ గా విడుదల అయ్యి అభిమానులను ఆకట్టుకుంది. అదే సమయంలో వచ్చిన విజయ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘విజిల్‌’ను కూడా తట్టుకొని బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నట్లు ఓ నిర్మాణ సంస్థ ప్రకటించింది.రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, డ్రీమ్‌ వారియర్స్‌ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. హిందీ రీమేక్‌గా రానున్న ఈ సినిమా బాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి…

 

More News: పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్.. మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రజాప్రతినిధులూ,మేధావులూ ?

ఒకనాడు ప్రజాప్రతినిధులంటే ఆదర్శంగా ఉండేవారు. ఒక సుందరయ్య, ఒక వావిలాల గోపాలకృష్ణ, ఒక తెన్నేటి లాంటి ఉద్ధండులు అసెంబ్లీలో ఉంటే ప్రజలకు ఉత్తేజాన్నిచ్చేది. రాజకీయ భేదాభిప్రాయాలు ఎన్నివున్నా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు రాజకీయాలను ప్రభావితం చేసేవి. తల్లిదండ్రులు తమ పిల్లలికి నాయకుల పేర్లు పెట్టుకునే వారు. మరి ఇప్పుడో? పిల్లలకు రాజకీయనాయకుల గురించి చెప్పటానికి భయపడుతున్నారు, పిల్లలు ఎక్కడ చెడిపోతారోనని. పత్రికల్లో చూస్తుంటాము, అప్పుడు ఎమ్యెల్యే గా చేసిన వ్యక్తి ఇప్పుడు పొలం పని చేసుకుంటున్నాడని, పేదరికంలో మగ్గుతున్నాడని . మరి ఈరోజో ? ఇలా చెప్పుకుంటూపోతే ప్రజా ప్రతినిధుల స్వరూపం ఎంతమారింది? మార్పు సహజం. కాకపొతే ఆ మార్పు ఏ మార్గంలో ఉందనేదే .

ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండు,మూడు ఘటనలు చూద్దాం. ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీ ని హైద్రాబాదు నుంచి అమరావతి కి మార్చినప్పుడు అసెంబ్లీ ఫర్నిచర్ లో కొంతభాగాన్ని తన ఇంటికి తరలించాడట. వినటానికే సిగ్గుగా వుంది. రాజ్యాంగ పదవిలో వున్న వ్యక్తి చివరకి ఇంత గా చిలక్కొట్టుడు కి పాల్పడాలా? అసలు అటువంటి చెత్త ఆలోచన ఎలా వచ్చింది. అందుకనే అన్నారు, కనకపు సింహాసమున …….. కూర్చుండబెట్టి అని పెద్దలు. దానిపై దర్యాప్తు మొదలయినతర్వాత భుజాలు తడుముకుంటున్నారు. ఇక రెండోది అన్ని పత్రికల్లో, ఛానళ్లలో తాటికాయంత అక్షరాలలో వస్తున్న చిదంబరం అరెస్టు. ఎవరో సాదా సీదా మంత్రి కాదు. సాక్షాత్తు ఆర్ధికమంత్రి, యూపీఏ , యూఎఫ్ లల్లో కీలక నేత , న్యాయం , చట్టం వడపోసిన వ్యక్తి చివరకి నిబంధనల్ని ఉల్లఘించి ఎలా కొడుక్కి మేలు చేసాడో చూసాము. అంతెందుకు మొన్ననే వచ్చిన వార్త. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఉండటానికి వసతి లేక తాత్కాలిక వసతి లో ఉంటున్నారట. కారణం ? పోయిన పార్లమెంటు కి ఎన్నికయి ఈ పార్లమెంటుకి ఎన్నికకాని సభ్యుల్లో 200 మందికి పైగా క్వార్టర్స్ ని ఖాళీ చేయకుండా తిష్టవేసుకొని కుర్చున్నారంట. చివరకి క్వార్టర్స్ కి కరెంటు, నీళ్లు ఆపేస్తామంటే ఆ సంఖ్య 100 కి పడిపోయింది. అంటే ఇంకా వంద మంది అలానే అంటిపెట్టుకొని వున్నారు. వీళ్ళు ప్రజాప్రతినిధులు. కొన్నేళ్ళక్రితం ఓ వార్త వచ్చింది. అది రుజువుకూడా అయ్యింది. ప్రజాసమస్యలపై పార్లమెంటులో ప్రశ్న వేసినందుకు లంచం తీసుకున్నారని. ఇలా చెప్పుకుంటూపోతే చిట్టా చాలా పెద్దది. స్థలం సరిపోదు.

ఇటువంటి ప్రజాప్రతినిధులు వున్నచోట నిజాయితీగలవాళ్ళు బతికిబట్ట కట్టలేరు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున గెలిచినా రెండోసారి గెలిచే ఛాన్సే లేదు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఈ రాజకీయ వ్యవస్థని మార్చాలంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజల్లో రాజకీయాలమీద అభిప్రాయాన్ని మారుద్దాం అని వచ్చి ఒకసారి గెలిచాడు. కానీ తర్వాత ఏమైంది? అంటే నిరాశావాదం తో మాట్లాడటం లేదు వాస్తవానికి దగ్గరలో మాట్లాడుతున్నాను. మేధావులు స్వతంత్రంగా వుండి వేగుచుక్కలాగా పనిచేయాలి తప్పితే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ వ్యక్తిత్వానికి మసక అంటుతోంది. అదేసమయంలో ఇంకో సెక్షన్ వుంది. సిద్ధాంతం పేరుతో ఎప్పుడూ ప్రభుత్వాలను విమర్చించటమే పనిగా పెట్టుకొని పనిచేస్తుంటారు. వాళ్లకు సమస్య మెరిట్ తో సంబంధం లేదు. విమర్శించాలి కాబట్టి కేవలం లోపాలనే ఎత్తిచూపుతారు, వాళ్లకు అందులో మంచివున్నా కనబడదు, కనబడినా అది మంచి అని చెప్పటానికి సిద్ధాంతం అడ్డువస్తుంది. అంతేకానీ, నిజాన్ని నిర్భయంగా చెప్పే అలవాటు ఉండదు. సిద్ధాంతం బోనులో బందీలు. అందువలనే వాళ్ళు కొంతకాలానికి ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు. అలాకాకుండా ఓపెన్ మైండ్ తో అలోచించి అభిప్రాయాలు చెప్తే ప్రజలు వీరి అభిప్రాయాలను శాశ్వతంగా గౌరవిస్తారు. దానివలన ప్రజా చైతన్యానికి దోహదం చేసిన వారు అవుతారు. కాబట్టి రాజకీయనాయకులను మనం మార్చలేకపోయినా పార్టీలకు , సిద్ధాంతాలకు అతీతంగా మేధావులు వేగుచుక్కలుగా పనిచేస్తే సమాజానికి ఎంతైనా మేలుజరుగుతుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు..!

 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కపోతున్న తాజా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం బీమ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఆసక్తికర విషయం టాలీవుడ్ లో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ కు మహేష్, హిందీ వెర్షన్ కు అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు రాజమౌళి మహేష్, అమితాబ్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఇక తమిళ, మలయాళ వెర్షన్ లకు కూడా ఏ హీరోలతో వాయిస్ ఇప్పించాలనే విషయంలో రాజమౌళి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట.

 

More News:పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్.. మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్!

హ్యాట్స్ ఆప్ జగన్:’దిశ చట్టం’ కాపీని పంపండి:ఢిల్లీ సీఎం

 

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు హ్యాట్స్ ఆప్ చెప్పిన విషయం తెల్సిందే. జగన్ కూడా అదేతరహాలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుండి హ్యాట్స్ ఆప్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చారిత్రాత్మక దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ మూడు రోజుల క్రితం ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. అయితే సీఎం జగన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభినందించారు. మహిళలపై దాడుల నిరోధించడానికి దిశ చట్టం తేవడంపై ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

 

ఈ సందర్భంగా ఏపీ దిశ చట్టం 2019పై ఢిల్లీ సర్కారు ఆసక్తి కనబరిచింది. దిశ చట్టం కాపీ తమకు పంపాలని కేజ్రీవాల్ సర్కారు విజ్ఞప్తి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేజ్రీవాల్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. దీనిపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీకి ఇది గర్వకారణం అని ఆయన అన్నారు. త్వరలోనే గవర్నర్ ఆమోదించిన దిశ చట్టం కాపీని ఢిల్లీ ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన ప్రకటించారు.

 

ఏపీ క్రిమిలన్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయనున్నారు.

చంద్రబాబు వెన్నులో వణుకు ?

ఈరోజు విజయసాయి రెడ్డి ఢిల్లీ లో ఓ సంచలన ప్రకటన చేసాడు . పోలవరం రేటెండరింగ్ , పీపీఏ సమీక్ష లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుగా ప్రధానమంత్రి, హోం మంత్రి లతో మాట్లాడి వాళ్ళ ఆమోదంతోనే చేస్తున్నాడని ప్రకటించాడు. ఇది ఆశ్చర్యకర విషయమే. ఒకవైపు జలశక్తి మంత్రి పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తుంటే రెండోవైపు విజయసాయి రెడ్డి ఈ ప్రకటన చేయటం ఆశ్చర్యకరం. అలాగే విద్యుత్తూ రంగం లో పీపీఏ ల సమీక్షపై కూడా ఆ శాఖా మంత్రి అసంతృపి వ్యక్తం చేయటమే కాకుండా దీనివలన ప్రపంచ వ్యాప్తంగా పరపతి పడిపోతుందని ప్రకటించాడు. వీటికి తోడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం రాష్ట్రప్రభుత్వ చర్యలపై విమర్శలు ఎక్కుపెట్టింది. వీటన్నిటి సంఘటనలకు యాంటీ క్లైమాక్స్ గా ఈరోజు విజయసాయి రెడ్డి ప్రకటన వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. మోడీ, అమిత్ షా లు ఈ ప్రకటనను ఖండించానన్నా ఖండించాలి లేకపోతే విజయసాయి రెడ్డి చెప్పినది నిజమని నమ్మాల్సి ఉంటుంది. ఇప్పుడు బంతి మోడీ, అమిత్ షా కోర్టు లో వుంది.

ఇదే నిజమయితే దీనివెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎలాగైనా చంద్రబాబు నాయుడు ని జైలుగోడల్లోకి నెట్టాలనే సంకల్పం అటు మోడీ కి ఇటు జగన్ మోహన్ రెడ్డి కి బలంగా వుంది. అదే వీళ్ళిద్దరిని ఒకచోటకు తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో కలిసి పోటీచేసిన మోడీ, చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికలకోసమని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాడు. మోడీ కి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా మోడీ వ్యతిరేక కూటమికి కీలకంగా వ్యవహరించాడు. తన చర్యలని నమ్మిన ప్రతిపక్షనాయకులు చంద్రబాబు కి పెద్దపీట వేశారు. ఇదంతా చూస్తే అసలు ముందు ముందు బీజేపీ కి వ్యతిరేకంగా అందరికీ నాయకత్వం వహిస్తాడని భావించారు. రాజకీయాల్లో ఆరితేరిన మమతా బెనర్జీ , శరద్ పవార్ లాంటి నాయకులు కూడా చంద్రబాబు ని పూర్తిగా నమ్మారు.

కానీ ఎన్నికలఫలితాలు వెలువడగానే వాళ్ళను పలకరించటం , వాళ్ళతో మాట్లాడటం మానేసాడు. వాళ్లెవరో తెలియదన్నంతగా తన ప్రవర్తన వుంది. మొదట్లో జనం మనస్తాపంతో అలా ఉన్నాడేమో అనుకున్నారు. కానీ అసలు విషయం రాను రానూ బయటపడింది. బీజేపీ తో సఖ్యతోకోసం ప్రయత్నిస్తున్నాడని ఆ తర్వాత పరిణామాలు తెలిపాయి. తనకి కుడి భుజం, ఎడమ భుజం అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లు బీజేపీ లో చేరటం వెనుక చంద్రబాబు నాయుడు వ్యూహం ఉందని జనం నమ్ముతున్నారు. తను ప్రత్యక్షంగా మోడీతో మాట్లాడటానికి మొహం చెల్లక తన నమ్మినబంటు ల ద్వారా నాటకానికి తెర దించాడు. ఈ వ్యూహం తెలియనంత అమాయకులేం కాదు మోడీ, అమిత్ షా. ఆరోజుకు రాజ్యసభలో వీళ్లందరి అవసరం ఉందికాబట్టి అందుకు సరేనన్నారు. ఈరోజు విజయసాయి రెడ్డి ప్రకటన చూస్తే అదంతా కేవలం ఎత్తుగడ మాత్రమేనని అర్ధమవుతుంది.

మోడీ పాత సంఘటనలను అంత తొందరగా మరచిపోయే మనిషికాదు. ఒకవైపు ఆయన నమ్మిన బంటుల్ని పార్టీలో చేర్చుకొని రెండోవైపు చంద్రబాబు నాయుడు ని ఎలా దెబ్బ తీయాలనే వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈరోజు చిదంబరం వ్యవహారం తర్వాత మోడీ ఏమిటో చంద్రబాబు కి ఇంకా బాగా అర్ధమయ్యింది. ఎప్పటికైనా జైలుగోడలు చూడాల్సివస్తుందేమోనని భయం వెంటాడుతుంది. ఒకవైపు మోడీ, రెండోవైపు జగన్ చంద్రబాబు ని వేటాడటం మొదలుపెట్టారు. దాని పర్యవసానమేంటో చంద్రబాబు కి బాగా తెలుసు. అందుకే చివరి ఎత్తుగడగా ఆయన మనుషుల్ని ఒక్కొక్కరిని బీజేపీ లోకి పంపిస్తున్నాడు. మోడీ ఎత్తుకు పైఎత్తులు వేయటం లో మొనగాడు. ఆయన వ్యూహాలు ఓ పట్టాన ఎవరికీ అర్ధంకావు. ఇవన్నీ చూసి చంద్రబాబు వెన్నులో చలిమొదలయ్యిందని పరిశీలకులు అనుకుంటున్నారు. చివరకి ఆయనకున్న దింపుడుకల్లెం ఆశల్లా జ్యూడిషరీ . జ్యూడిషరీ లో చంద్రబాబు కి గట్టి పలుకుబడి ఉందని అందరూ నమ్ముతున్నారు. తనపై ఇన్నాళ్లు కేసులు లేకుండా కాపాడింది కూడా ఈ పలుకుబడివలనే నని అందరూ అనుకుంటున్నారు. ఏమైనా ఇంకా మోడీకి 5 సంవత్సరాలటైముంది. అదే చంద్రబాబు కి భయం పట్టుకుంది. చూద్దాం ఏమవుతుందో

జనసేనపార్టీని విడిచి ఎంతమంది వెళ్ళినా పర్వాలేదు, కానీ…

 

ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తర్వాత అనేక పాఠాలను నేర్చుకొని ఒక బలమైన పార్టీగా అవతరించింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రజలకోసం, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా మంచి పేరునే గడించింది. 23అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ కంటే కూడా ప్రజలు జనసేనతోనే వారి సమస్యలను విన్నవించుకుంటున్నారు. మొన్న ఇసుక సమస్య, నిన్న రైతు సౌభాగ్య దీక్షలు అందుకు ఉదాహరణలు. అలానే వైసీపీ నేతలు, టీడీపీ కంటే జనసేన మీదే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు అంటే జనసేన ప్రతిపక్ష స్థానాని ఆక్రమించినట్లే అని చెప్పొచ్చు. ఈ విధంగా జడ్ స్పీడ్ తో దూసుకుపోతున్న పార్టీలో నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్తున్నారు..అందుకు గల కారణాలను విశ్లేషిద్దాం..

 

వ్యక్తిగతంగా ఏదో ఆశించి అది నెరవేరక పార్టీని విడిచి వాళ్ళు కొంతమంది, బలమైన జగన్ సర్కార్ ని ఎదిరించలేక వైసీపీ ప్రలోభాలకు లోబడి వెళ్లే వాళ్ళు మరికొంతమంది కాగా పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చక వెళ్ళే వాళ్ళు ఇంకొంతమంది. మొదటి రెండు కారణాల వల్ల పార్టీని విడిచిపోయే వాళ్ళ గూర్చి జనసేన పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు కానీ పవన్ ప్రవర్తన వల్ల పార్టీని విడిచిపెడితే కొంచం ఆలోచించాలి. ఎందుకంటే నాయకుడు అన్ని కోణాలలో నాయకత్వ లక్షణాలను కనపర్చాలి. ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో, కొంతమంది వ్యక్తులకో కొమ్ము కాసినట్లయితే.. పార్టీ భవిష్యత్ ప్రశాంర్ధకం అవుతుంది.

 

పవన్ కళ్యాణ్ విధి విధానాలు, ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకోలేక పార్టీని విడిచిపెడుతున్నారు అని జనసేన ఆరోపిస్తోంది.. ఒకవేళ అదే నిజమైతే.. కలిసి పని చేసిన వాళ్ళకే అర్థం కాకపోతే ప్రజలకు ఎలా అర్థమౌతుంది..? పవన్ విధి విధానాలు గొప్పవే కావొచ్చు కానీ వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. క్షేత్రస్థాయిలోకి పవన్ విధి విధానాలను తీసుకెళ్లడంలో జనసేన విఫలమైతే.. మరి కొంత మంది నేతలు కూడా పార్టీని వీడే అవకాశాలు లేకపొలేదు. ఎమ్మెల్యే రాపాక కి కూడా పార్టీలో తగిన స్థానం, గౌరవం దక్కకపోవడంతో ఆతను కూడా జనసేనని విడిచి పెడుతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ పవన్ పై నమ్మకం, పార్టీ నుంచి ప్రజలు వెళ్లిపోకుండా జాగ్రత్త పడితే మంచిది.

బెంగాల్ మార్గంలో ఖమ్మం కమ్యూనిస్టులు

కాలం మారుతుంది, దానితోపాటు సమాజమూ మార్పులకు లోనవుతుంది. ఆ టైం లో కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతుంటాయి. ఆకోవకు చెందిందే ఖమ్మం లో జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ. ఖమ్మం అంటేనే కమ్యూనిస్టుల కంచుకోట. భారత దేశం లో ఎన్ని కమ్యూనిస్టు పార్టీలున్నాయో వాటన్నిటి శాఖలు వుమ్మడి ఖమ్మం జిల్లాలో వున్నాయి. ఒకనాడు జిల్లాలోని ప్రతి కుటుంబంలో ఒకరన్నా ఏదో ఒక కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు. వుమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఖమ్మం , నల్గొండ జిల్లాలు కమ్యూనిస్టుల ఖిల్లాలు. అటువంటి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కొన్ని ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతున్నాయి.

కమ్యూనిస్టు నాయకులు, క్యాడర్ బీజేపీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీలు కమ్యూనిస్టులను వదిలి బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇల్లేందు అసెంబ్లీ కి అదివరకు ప్రాతినిధ్యం వహించిన సిపిఐ మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య త్వరలో బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ సిపిఎం నాయకుడు రామచంద్ర నాయక్ బీజేపీ లో చేరటం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుని మాటల ప్రకారం దాదాపు 2500 మంది మాజీ కమ్యూనిస్టు క్యాడర్ ఆగష్టు 18వ తేదీన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె పి నడ్డా సమక్షం లో బీజేపీ పార్టీ లో చేరుతున్నట్లు ప్రకటించాడు.

ఈ రాజకీయ పునరేకీకరణ బెంగాల్ లో ఇటీవలకాలం లో జరిగింది. సిపిఎం కి చెందిన అనేకమంది నాయకులు , క్యాడర్ బీజేపీ లో చేరారు. ముఖ్యంగా ఆదివాసీలు , షెడ్యూలు కులాల వాళ్ళు ఎక్కువమంది బీజేపీ గొడుగు కింద చేరారు. బీజేపీ ఒకనాడు బ్రాహ్మణ – బనియా పార్టీగా ముద్రపడింది. అదేపార్టీ ఈరోజు వెనకబడిన కులాలు, షెడ్యూలు కులాలు , ఆదివాసీలను ఎక్కువగా ఆకర్షించటం ఆశ్చర్యమేస్తుంది. ఈ సామాజిక మార్పుని రాజకీయ పండితులు ఎప్పుడూ ఊహించలేదు. బెంగాల్ లో జరిగింది ఓ ఐసోలేటెడ్ సంఘటనగా అనుకున్నారు. మరి ఈరోజు ఖమ్మం లో జరుగుతుంది చూస్తే ఇది ఒక్కచోటే కాదు దేశవ్యాప్త ప్రభావమేమో అని ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ వైఫల్యం బీజేపీ కి మరింత అనుకూలతగా మారిందని చెప్పొచ్చు. ఇది కేవలం ఖమ్మంకే పరిమితమా లేక తెలంగాణా మొత్తం ప్రభావం చూపుతుందో చూడాలి. అలాగే దీని ప్రభావం ఆంధ్ర కమ్యూనిస్టుల పై కూడా ఉంటుందా? ఏమో రాజకీయ అంచనాలు ఊహకందని విధంగా మారుతున్నాయి. ముందు ముందు తెలుగు నాట రాజకీయాలు అనూహ్యమార్పులకు గురి అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

అమరావతి రియల్ ఎస్టేట్ ఢమాల్

జగన్ కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరిస్తున్నాడని చెప్పాలి. నిన్నటికి నిన్న కీయ మోటార్ కంపెనీ మొదటి కారు విడుదల ఫంక్షన్ కి డుమ్మా కొట్టాడు. ఇవ్వాళ్ళ వచ్చిన వార్తల్ని బట్టి అమరావతి రాజధాని ప్రణాళికకు సున్నా చుడుతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం పనులన్నీ ఆపటం అందరికీ తెలిసిందే. ఆ ప్రాజెక్టులన్నీ ఇప్పట్లో ప్రారంభిచడని వార్తలు వస్తున్నాయి. ఒక్క సీడ్ ఆక్సిస్ రోడ్డు తప్పితే మిగతావన్నీ అటకెక్కించినట్లు తెలుస్తుంది. అదేగనక నిజమయితే ఇది ఆంధ్ర ప్రజలకి పెద్ద షాక్ అని చెప్పాలి. ఇంతపెద్ద తప్పిదం చేస్తాడని అనుకోవడంలేదు. ఈరోజు టైమ్స్ అఫ్ ఇండియా లో వచ్చిన వార్త నిజమయితే జగన్ రాష్ట్ర ప్రయోజనం కన్నా స్వీయ కక్షసాధింపు ఆలోచనతోనే వెళ్తున్నాడని అనుకోవాలి.

దీనికి రెండు కారణాలు అనుకుంటున్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఏ పనీ ముట్టుకోవటం ఇష్టంలేకపోవటం. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పని పూర్తిచేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు ఇదంతా తన ఘనతేనని ప్రచారంచేసుకుంటాడని కాబట్టి ఆ ఆలోచనే భరించే స్థితి లో జగన్ లేకపోవటం ఒక కారణం. రెండోది ఆ చుట్టుపక్కల ఒక కులం వాళ్ళు , చంద్రబాబు నాయుడు అనుకూలురు భూములు విపరీతంగా కొన్నారుకాబట్టి వాళ్లకు లాభం చేకూర్చటం ఇష్టంలేకపోవటం రెండో కారణంగా చెబుతున్నారు. జగన్ ఆలోచించే కోణం ఓ చిన్నపిల్లాడి మనస్తత్వం లాగావుంది. ఎవరిమీదో కక్షతో అమరావతి పనులు ఆపేస్తే అది మొదటికే మోసం వస్తుందని గ్రహించటంలేదు. పైకి చెప్పేకారణం అంత డబ్బులు రాష్ట్రం లో లేవని చెప్పటం.

ఒకవైపు డబ్బులు లేవని చెబుతూనే సంక్షేమ కార్యక్రమాలపేరుతో, ప్రభుత్వ ఖర్చులు విపరీతంగా ఖర్చయ్యే విధానాలతో రాష్ట్ర ఖజానాని ఖాళీ చేయటం ఏ విధంగా అర్థంచేసుకోవాలి. ఆర్టీసీ ని విలీనం చేసుకోవటం, సిబ్బంది నియామకాల్లో విచ్చలవిడితనం, భవిష్యత్తు ఆర్ధిక పరిస్థితిపై పెనుభారం పడుతుందని గ్రహించలేకపోవటం దౌర్భాగ్యం. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు రిజర్వు చేయటం దూరదృష్టిలేని చర్య. ఉదాహరణకు కియా మోటారు కార్ల కంపెనీని తీసుకుందాం. అందులో ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటే ఆ కంపెనీ ని ఇబ్బంది పెట్టిన వారే అవుతారు.

ఈ తప్పుడు పనులకు తోడు రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోవటానికి కారణమయ్యే పని ఇప్పుడు తీసుకుంటున్నాడు. తక్షణం ఆ వార్తలపై వివరణ ఇవ్వకపోతే నిజమేనని అందరూ నమ్ముతారు. అందునా ప్రతిష్టాత్మకమైన పేపరుకూడా. తన కూర్చున్న కుర్చీని తానె నరుక్కుంటున్నాడని అనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ ఆలోచనని మానుకొని రియల్ ఎస్టేట్ రంగాన్ని నిలబెడితే మంచిది.

ఫిబ్రవరిలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు ఇవ్వే…!

 

‘జాను’ మూవీ ఫిబ్రవరి 07 విడుదల
తమిళంలో విడుదలైన సంచలన విజయాన్ని సాధించిన ’96’ మూవీని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించగా.. ఆ పాత్రలను తెలుగులో శర్వానంద్, సమంతలు పోషిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

‘సవారి’ మూవీ ఫిబ్రవరి 07 విడుదల
సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “సవారి” మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మాతలు.

 

 

‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ ఫిబ్రవరి 14 విడుదల
విజయ్ దేవరకొండ – క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ఐశ్వర్య రాజేష్‌, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నలుగురిని ప్రేమించే వ్యక్తిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు.

 

 

‘నిశ్శబ్దం’ మూవీ ఫిబ్రవరి 20 విడుదల
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

 

 

‘భీష్మ’ మూవీ ఫిబ్రవరి 21 విడుదల
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్.. రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాకు నిర్మాతలు. ఫిబ్రవరి 21 న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంత్ నాగ్.. వెన్నెల కిషోర్.. సత్య.. రాజీవ్ కనకాల.. సంపత్ రాజ్.. రఘుబాబు.. బ్రహ్మాజీ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

 

తల్లిపై ప్రేమ:కారునడిపే వ్యక్తిపై గొడవకు దిగిన బుడ్డోడు

 

తల్లిని కారుతో గుద్దిన వ్యక్తి మీద యుద్దానికి దిగాడు ఓ బుడ్డోడు. కోపం వచ్చి కారును టపా టపా కాలితో తన్నాడు. కారునడిపే వ్యక్తిపై గొడవకు దిగాడు. ఓ పక్క అమ్మకు ఏమైపోయిందో అనే బాధ..కంగారు మరోపక్క కారు నడిపిన వ్యక్తిపై కోపం అమ్మ పడిపోయిందని బాధతో ఏడుస్తూనే కారు యజమానిపై విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శించిన ఈ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. సౌత్ చైనా పోస్ట్ పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

 

ఈ వీడియోలో… తల్లి కొడుకూ రోడ్డు దాటుతున్నారు. రోడ్డుపై వచ్చే కారుని గమనించకుండా పిల్లాడిని తీసుకుని కుడి వైపుకి చూస్తూ రోడ్డు దాటుతోంది తల్లి. ఈ క్రమంలో ఎడమ వైపు నుంచి వచ్చిన ఒక కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె కింద పడిపోయింది. ఆమె పక్కన ఉన్న తన కుమారుడు కూడా కింద పడిపోయాడు. కానీ వెంటనే లేచిన ఆ పిల్లాడు ఏడుస్తూ తన తన తల్లిని లేపి..దూకుడుగా కారు యజమాని మీద గొడవకు దిగాడు.

 

తల్లి గాయపరిచిన ఆ కారుని కాలి తో తన్నుతూ… కారులో నుంచి దిగు అంటూ డిమాండ్ చేశాడు. ఆ యజమాని పిల్లాడిని చూసి కారు దిగి ఆమెను తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. ఒక పక్కన తన తల్లిని లేపుతూ మరోపక్క గొడవకు దిగుతూ తల్లి మీద తనకు ఎంత ప్రేమ ఉందో చూపించాడు. ఈ వీడియో అక్కడ ఉన్న సెక్యురిటి కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఈ వీడియో ఊపేస్తోంది. చిన్న వయసులో తల్లి మీద అంత ప్రేమ పెంచుకున్న ఆ బుడ్డోడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నాడు. అమ్మకోసం ఆ పిల్లాడి తపనను..చూస్తే ఎవ్వరికైనా..భలే పిల్లాడులే..అమ్మపై ఎంత ప్రేమ అనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి ప్రభ మసకపారిందా?

రేవంత్ రెడ్డి , ఈ పేరు మూడు సంవత్సరాల క్రితం ఓ సంచలనం. తర్వాత జరిగిన ఒక్కొక్క సంఘటన తన పూర్వ వైభవాన్ని తుడిచిపెట్టేసింది. మొదట్లో కెసిఆర్ కి ఎదురునిలిచే మొనగాడుగా యూత్ లో పెద్ద క్రేజ్ వచ్చింది. అయితే అప్పుడు తెలుగుదేశం లో ఉండటంలో రావలసినంత లబ్ది రాలేదు. తర్వాత కెసిఆర్ తెలివిగా ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా ఇరికించటంతో మేధావుల్లో, మధ్యతరగతి వర్గాల్లో కొంత ప్రతిష్ట దెబ్బతింది. అయినా వున్నవాళ్లలో కెసిఆర్ కి ఎదురునిలిచే సత్తా వున్నవాడుగా సర్దుకుపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం తెలంగాణాలో పూర్తిగా దెబ్బతినడంతో తన భవిష్యత్తు సందేహంలో పడింది.

ఆసమయంలో బీజేపీ ప్రభ పుంజుకోవటం మొదలుపెట్టింది. కాంగ్రెస్ లోని అనేకమంది బీజేపీ లో చేరతారని ప్రచారం జరిగింది. అప్పుడు గనక రేవంత్ రెడ్డి బీజేపీ లో చేరివుంటే తెలంగాణ బీజేపీ లో తిరుగులేని నాయకుడు అయివుండేవాడు. రేవంత్ రెడ్డి తనన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బేరం పెట్టినట్లుగా అందరూ అనుకున్నారు. అప్పటికి బీజేపీ ఆ అభ్యర్ధనను ఆమోదించలేదని అందరూ అనుకుంటున్నారు. ఆ తర్వాతదశలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటం అందరికీ తెలిసిందే. అది కొంతమేరకు లోక్ సభకు ఎన్నిక కావటానికి ఉపయోగపడినా భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. అసలు కాంగ్రెస్ పరిస్థితే బాగాలేదు. అది మునిగిపోయే నావలాగా ఉండటంతో రేవంత్ రెడ్డి భవిష్యత్తు కూడా డోలాయమానంలో పడింది.

అదే అంటారు రైట్ టైం లో రాంగ్ డెసిషన్ అని. రేవంత్ రెడ్డి లో స్ట్రాంగ్ పాయింట్లు ఎన్ని ఉన్నాయో వీక్ పాయింట్లు కూడా అన్నే వున్నాయి. రాష్ట్ర స్థాయినాయకుడు కావాల్సిన వ్యక్తి ఓపెన్ గా తన కులాన్ని అన్నివిషయాల్లో వెనకేసుకురావటం తన బలమూ , బలహీనత కూడా . రెడ్డి కులస్థుల్లో అభిమానాన్ని కూడగట్టుకున్నా మిగతా కులాల్లో దానివలన ఎంతోకొంత పోగొట్టుకోవటం జరిగింది. అలాగే అత్యాశ వల్ల కూడా నష్టపోవటం జరిగింది. లేకపోతె ఇప్పటికి బీజేపీ లో తిరుగులేని నాయకుడు అయివుండేవాడు. ఒకవేల ఇప్పుడు చేరాలన్నా అందరిలో ఒకడిగానే ఉంటాడు. మహబూబ్ నగర్ లోనే అరుణ, జితేందర్ రెడ్డి నాయకులుగా వున్నారు. మొత్తం మీద చూస్తే రేవంత్ రెడ్డి మూడు సంవత్సరాల క్రితం వున్న ప్రభ, ప్రతిష్టని చేతులారా చెడగొట్టుకున్నాడని అనిపిస్తుంది. కాలమే చెప్పాలి మరి.

బికినీ ఫొటోస్ తో రచ్చ చేస్తున్న ఇలియానా..

 

ఇలియానా.. నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ.. దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. కాగా ఆ మధ్య కొంచెం బొద్దుగా కనపడిన ఇలియానా.. కొంచెం కష్ట పడి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా అదరగొడుతోంది.

 

 

Read More: ఫొటోస్ : యాంకర్ రష్మీ గౌతమ్ క్రేజీ స్టిల్స్

 

 

కుకీ గులాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ది బిగ్ బుల్’ అనే హిందీ సినిమా లో ఇలియానా నటిస్తోంది. ఇది కాకుండా మరో రెండు కొత్త ప్రాజెక్టులు కూడా సైన్ చేసిందట.

 

 

తాజాగా ఇల్లీబేబీ ఒక స్విమ్మింగ్ పూల్ ఒడ్డున నలుపు రంగు బికినీలో సేదదీరుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలలో ఇల్లీ ఎక్స్ ప్రెషన్లు చూస్తే ఎలాంటివారైనా చిత్తైపోతారు. కసరత్తులు మరీ కఠినంగా చేస్తోందేమో కానీ ఇప్పుడు ఇల్లీ ఒంపుసొంపులతో మిస మిసలాడుతూ ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్నాయి.

 

Read More: ఫిబ్రవరిలో విడుదల కాబోయే తెలుగు సినిమాలు ఇవ్వే…!

 

 

Read More: అందం అంటే ఇదేగా మరి…మెహ్రిన్ లేటెస్ట్ ఫోటోలు

సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పని ఒకదానిమీద ఒకటి సెల్ఫ్ గోల్స్ వేసుకోవటంలాగుంది. లోక్ సభ కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కాశ్మీర్ అంతర్గత సమస్యనా, ద్వైపాక్షికమా లేక అంతర్జాతీయ సమస్యనా అనే సందేహం లేవనెత్తి సెల్ఫ్ గోల్ వేసుకుంటే మనోజ్ తివారి అనవసరంగా ఆంధ్ర-తెలంగాణ విభజన ని కెలికి ఇంకో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆంధ్ర – తెలంగాణ విభజన సమయంలో మేము ఎంత అద్భుతంగా అందరినీ సంప్రదించించి బిల్లు తెచ్చామో చూడండంటూ మనోజ్ తివారి మాట్లాడిన తీరు పెద్ద వివాస్పదమయింది. అనవసరంగా మండుతున్న గాయాన్ని ఇంకోసారి కెలికినట్లయింది. కాశ్మీర్ బిల్లు విషయంలో ఆంధ్ర-తెలంగాణ విభజన బిల్లు పోలిక తెచ్చి లబ్ది పొందుదామనుకుంటే మొదటికే మోసం వచ్చింది.

అటు అధిర్ రంజాన్ చౌదరిని, ఇటు మనోజ్ తివారి ని అమిత్ షా పూర్తిగా ఎండకట్టటం తో పాటు ఇద్దర్నీ ఓ ఆట ఆడుకున్నాడని చెప్పాలి. మనోజ్ తివారి కి సమాధానమిస్తూ ఆంధ్ర-తెలంగాణ విభజన బిల్లు ఎంత అప్రజాస్వామికంగా పాస్ అయ్యిందో సోదాహరణంగా వివరించాడు. కాశ్మీర్ అసెంబ్లీ లేని తరుణంలో ఈ బిల్లు పాస్ చేయటం అప్రజాస్వామికం అని చెప్పేవాళ్ళు వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పుడు పార్లమెంట్ ఆ అభిప్రాయాన్ని తుంగలో తొక్కటం ఎటువంటి ప్రజాస్వామ్యమో చెప్పాలని అమిత్ షా గట్టిగా ప్రశ్నించాడు. లైట్లు ఆపి, టీవీ ప్రసారాలు బంద్ చేసి బిల్లు పాస్ చేసిన రోజు ఈ నీతులేమయ్యాయని ప్రశ్నించాడు. మెల్లి, మెల్లిగా మానుతున్న గాయాన్ని తిరిగి కెలకడం సెల్ఫ్ గోల్ కాక మరేంటి?

కాంగ్రెస్ పార్టీ దశ దిశా లేని నావ లాగా అయిపొయింది. ముఖ్యంగా కాశ్మీర్ సమస్యపై కాంగ్రెస్ నాయకుల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ లో ముఖ్య నాయకులైన జ్యోతిరాదిత్య సింధియా , భూపేందర్ హుడా , మిలింద్ దేవర లాంటి యువనాయకులు ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ ప్రకటనలివ్వటం జరిగింది. రాజ్య సభ చీఫ్ విప్ భువనేశ్వర్ కాలిట ఏకంగా పదవికే రాజీనామా చేశాడు. అయినా మంకుపట్టు వీడకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాశ్మీరుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. ఇది చివరకు ఎక్కడికి చేరుతుందో అంతుచిక్కటంలేదు.

శభాష్ విజయసాయి రెడ్డి

విజయసాయి రెడ్డి రాజ్య సభలో తనదయిన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే తనకొక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో తెలుగువాళ్ళలో ఆ మాత్రం ప్రత్యేకతను సాధించిన వాళ్ళు లేరనే చెప్పాలి. దాదాపు ప్రతి బిల్లుపై చర్చల్లో పాల్గొంటూ సభలో ఓ ఇమేజ్ ని పెంచుకోగలిగాడు. అలాగే ప్రశ్నల గంట సమయంలో కూడా ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. సభ్యుల కోసం కేటాయించిన ప్రైవేట్ మెంబెర్ బిల్లు సమయంలోకూడా కొన్ని ప్రత్యేక బిల్లులు పెట్టటమే కాకుండా చివరిదాకా దాని ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఓ విధంగా ఆ విషయంలో ప్రభుత్వ వర్గాలను ఇరుకున పెడుతున్నాడని చెప్పాలి. మొన్నటికి మొన్న తలాక్ బిల్లుపై అందరూ వైస్సార్సీపీ మద్దత్తు ఇస్తుందని ఊహించారు. కానీ బిల్లు కి వ్యతిరేకంగా ఓటు వేసి తన పార్టీ పంథాను గట్టిగా వినిపించాడు. ఈ ఘటనలన్నీ చూస్తే ఇన్నాళ్లకు తెలుగువాడు ఒకడు పార్లమెంటులో గట్టి పిండం దొరికాడనిపిస్తుంది. డ్రెస్సులోనూ ఓ ప్రత్యేకంగా ఉంటున్నాడు. ప్యాంటు, షర్ట్ పై ఓ జాకెట్ తో కనిపిస్తున్నాడు. ఇదంతా ఎందుకుచెబుతున్నానంటే తెలుగు వాళ్ళు ఏ పార్టీ లో వున్నా సమర్ధత ఉంటే అభినందించాల్సిందే. ప్రతిదీ రాజకీయంగా చూడాల్సిన పనిలేదు. కాకపోతే హిందీ భాష అసలు మాట్లాడటం లేదు. జాతీయరాజకీయాల్లో రాణించాలంటే హిందీ భాష నేర్చుకుంటే మంచిది.

పాత లోక్ సభ, రాజ్య సభ లో ఇలా ప్రత్యేకతను చూపగలిగిన వాళ్లు లేరని చెప్పాలి. లోక్ సభ లో రామమోహన్ నాయుడు కొంతమేరకు అవలీలగా మాట్లాడగలిగేవాడు. తాను మళ్ళీ ఎన్నిక కావటం సంతోషం. అయితే తన ప్రతిభని పార్టీ సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. చంద్రబాబు అనుకూల ప్రచార సాధనాలు ఒక్కసారి గళ్ళా జయదేవ్ మోడీని విమర్శిస్తూ లోక్ సభ లో మాట్లాడితే హారతులు పట్టి స్వాగతించారు. కానీ అదే ప్రచారం రామమోహన్ నాయుడుకి రాలేదు. దీన్ని ఏమనాలి? రామమోహన్ నాయుడు సహజ సిద్దమైన వక్త. జయదేవ్ రాసుకొని చదువుతాడు. ఇద్దరికీ పోలికే లేదు. అయినా జయదేవ్ ఫస్ట్ , రామమోహన్ నాయుడు సెకండ్ . అదీ తెలుగుదేశం లో న్యాయం.

ఇకపోతే ఇన్నాళ్లు పార్లమెంటు లో తెలుగు వాళ్ళ ప్రాతినిధ్యం ఎలా వుంది? ఆంధ్ర ప్రాంతం లో కేవలం వ్యాపార ప్రయోజనాలు చూసుకొనేవాళ్లే ఎక్కువమంది వున్నారు. పార్లమెంటు లో అనర్గళం గా మాట్లేడేవాళ్లు తక్కువ. అదే తెలంగాణ నుంచి ఎక్కువమంది రాజకీయవేత్తలే వున్నారు. ఈ లోక్ సభ ఒక్క సెషన్ మాత్రమే అయిపోవచ్చింది. ఆంధ్రానుంచి ఒక్క విజయసాయి రెడ్డి మాత్రమే ఓ ఇంపాక్ట్ తెచ్చుకోగలిగాడు . మిగతా వాళ్ళ పనితీరు ఆ స్థాయిలో లేదు. ముందు ముందు ఏమైనా డెవలప్ అవుతారేమో చూడాలి. విజయసాయి రెడ్డి పనితీరుకు అభినందనలు.