Home Blog Page 8612

నిరుద్యోగ యువతకు కేసీఆర్ శుభవార్త


తెలంగాణా సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధిని అందించే రెండు కీలక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

ఇంటి వద్ద ఉండే బీసీ మహిళలకు ఆదాయం చేకూరేలా దాదాపు 10 వేలమంది నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చెయ్యాలని నిర్ణయించారు. అంతే కాకుండా నిరుద్యోగ మహిళలకు నిఫ్ట్ ద్వారా శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి తెలియజేసారు.

మరో పథకం “ఆపద్బంధు” పేరుతో ఎంబీసీ యువకుల కోసం అంబులెన్స్‌లను పంపిణీ చేయనున్నారు. అర్హులైన బీసీ విద్యార్థులకు ఒక్కటి చొప్పున అంబులెన్స్‌లను బీసీ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు గంగుల తెలియజేసారు. ఆపద్బంధు పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించటమే కాకుండా, మారుమూల ప్రాంతాలకు కూడా అంబులెన్స్ సేవలను విస్తరించడం జరుగుతున్నదని మంత్రి తెలియజేసారు. ఈ రెండు పథకాలను త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలియజేసారు.

సునీల్ కలర్ ఫోటో.. అదిరింది!

సునీల్ క‌మెడియ‌న్ గా, హీరోగా ప‌లు చిత్రాలు న‌టించి మెప్పించాడు. ఈరోజు సునిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా క‌ల‌ర్‌ఫోటో లుక్ ని విడుద‌ల చేశారు. ఈ సినిమాలో సునీల్ విలన్ నటిస్తున్నాడు. హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ కామెడిల‌తో మైండ్‌బ్లాక్ చేసిన‌ అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో ని లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ‌జిలి, ఏజెంజ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌, ప్ర‌తిరోజుపండ‌గ చిత్రాల్లో క‌మెడియన్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న సుహాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇత‌నికి జోడిగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తుంది. ఇందులో సునీల్ ఎస్ రామ‌రాజు పాత్ర‌లో త‌న విల‌నిజాన్ని పండించ‌నున్నాడ‌ట‌.

యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ మెట్ట‌మెద‌టిసారిగా దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌లే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.కామెడీ ఎంటర్త్సైనర్ గా 1995 సంవ‌త్స‌రంలో ఒక ఇంజ‌నీరింగ్ కాలేజి లో జ‌రిగిన ప్రేమ‌క‌థగా రూపొందుతుంది.

అగ్గి రాజేయకండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి

ఢిల్లీ అల్లర్లను నియంత్రించే పనుల్లో ప్రభుత్వముంటే అగ్గిరాజేసే పనుల్లో కొన్ని మీడియా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు వున్నాయి. ఇది దురదృష్టకరం, అభ్యంతరకరం. మృతుల్లో ముస్లింలు ఎంతమంది, హిందువులు ఎంతమంది అనే స్కోర్ కౌంట్ లో కొన్ని మీడియా సంస్థలు ఉండటం దురదృష్టకరం. ముస్లింలయినా , హిందువులయినా పోయింది మనుషుల ప్రాణాలు అన్న మానవత్వముంటే ఈ పని చేయరు. కావాల్సింది ఏ మతస్తులెంతమందనికాదు ఈ దారుణ మారణహోమాన్ని ఎలా ఆపటం? ఈ ఘోరకలి మరిచిపోయి తిరిగి అందర్నీ కలపటమెలా? ఇది మనసున్న మనుషులు చేయాల్సిన పని. గతాన్ని గుర్తుచేస్తూ అయిన గాయాల్ని మానకుండా చేయటం బాధ్యతగల మీడియా చెయ్యకూడదు. అందుకనే ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రతి మాట , ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. అంతిమంగా అందరి లక్ష్యం సామరస్యాన్ని పునరుద్ధరించటం, శాంతి ని నెలకొల్పటం. మీడియా ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆశిద్దాం.

ఇక అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ మీడియా సమస్యను కూలంకషంగా అర్ధంచేసుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించటం చేయదగ్గపనికాదు. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం, అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థ, ఇస్లామిక్ సహకార సంస్థల వ్యాఖ్యానాలు. ఇవి మూడూ దాదాపు ఒకే భాషను వాడాయి. ఇందులో వాస్తవమెంత? మొదటిగా చెప్పుకోవాల్సింది మైనారిటీలపై దాడులగురించి. ఈ అల్లర్లు రెండు మతస్థుల మధ్య కొట్లాట అయినప్పుడు మైనారిటీలపై దాడులుగా వర్ణించటం సమస్యను ప్రపంచానికి తప్పుగా చూపించి భారత ప్రతిష్టను దెబ్బతీయటానికి పన్నిన కుట్రగా అనుకోవాల్సివస్తుంది. లేదంటే కమ్యూనికేషన్ లోపమన్నా అయివుండాలి. ఇది ఓ విధంగా సమస్యను చక్కదిద్దటానికి ఉపయోగపడకపోగా రెచ్చగొట్టటానికి ఉపయోగపడుతుంది. రెండోది, పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహనా లోపంతో మాట్లాడటం. పౌరసత్వ సవరణ చట్టం భారతీయ పౌరులకు సంబంధించినది కాదు. బయటనుంచి దేశంలోపలి కి వచ్చినవాళ్లలో కొంతమందికి త్వరగా పౌరసత్వం కల్పించటానికి సంబందించినది. ఇది ప్రతిదేశమూ పాటించేదే. ఇలా మత పరంగా అన్యాయానికి గురైన క్రైస్తవులకు అమెరికాకూడా పౌరసత్వం కల్పించిందని మర్చిపోవద్దు. మధ్య ఆసియా లో, ఈజిప్ట్ లో నుంచి వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇచ్చినప్పుడు గగ్గోలుపెట్టని సంస్థలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాయి. ఇక ఇస్లామిక్ సహకార సంస్థ మానవహక్కులగురించి మాట్లాడటం విడ్డూరం. అసలు అందులోని దేశాలు ఎక్కువభాగం ప్రజాస్వామ్య దేశాలు కావు. ఇస్లాం మతం ఆధారంగా చట్టాలు రూపొందించుకున్నవి. వాటికి భారత దేశాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిగినప్పుడు మాట్లాడి ఆ దేశాల్ని దారిలో పెట్టివుంటే అక్కడినుండి మైనారిటీల వలసలు ఉండేవి కావు , మనకు వాళ్లకు ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉండేది కాదు. కాబట్టి ఈ సంస్థలు చెప్పే నీతులు పరిస్థితుల్ని చక్కపెట్టటానికి ఉపయోగపడకపోగా ఇంకా దిగజార్చటానికే ఉపయోగపడతాయి.

ఇక అంతర్జాతీయ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవి ఏ రోజూ భారత్ కి అనుకూలంగా లేవు. న్యూయార్క్ టైమ్స్ మొదట్నుంచీ భారత వ్యతిరేకతనే ప్రదర్శిస్తూ వస్తుంది. మోడీ ప్రధాని అయ్యిన తర్వాత ఆ దాడి ఇంకా ఎక్కువ అయ్యింది. ఆ పత్రిక దక్షిణ ఆసియా విభాగం చూసే వ్యక్తులు పూర్తిగా పాకిస్తాన్ అనుకూల వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చారు. దాదాపు ఇదే మిగతా పత్రికల పరిస్థితి కూడా. ఇకపోతే అమెరికాలో డెమొక్రాట్ల నాయకత్వానికి పోటీపడే వాళ్లలో ఎక్కువమంది భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ముందువరసలో వున్న బెర్నీ సాండర్స్ భారత్ కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు భారతీయుల్లో ఎక్కువమంది డెమొక్రాట్లవైపే వున్నారు. డెమొక్రాట్ అభ్యర్థులు వరసగా ఇటువంటి ప్రకటనలే ఇస్తే అది భారతీయ అమెరికన్లపై ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంపై ఎక్కువమంది ప్రవాసభారతీయులు అనుకూలంగా ప్రదర్శనలు చేయటం చూస్తున్నాము. డెమొక్రాట్లు తమ వైఖరి మార్చుకోకపోతే గంపగుత్తగా భారతీయ అమెరికన్లు ట్రంప్ వైపు మొగ్గే అవకాశముంది. మనముందు ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ ఎన్నికల అనుభవముంది. కాబట్టి ఈ అంతర్జాతీయ మీడియా, సంస్థలు, పార్టీలు ఎవరినో సంతృప్తి పరచటానికో , అవగాహనాలోపంతోనో భారత వైఖరి తీసుకుంటే వాళ్ళ ప్రతిష్ట కే నష్టం.

చివరిగా చెప్పేదేమిటంటే భారత్ ఎప్పుడూ విలువల ఆధారంగా పనిచేసే దేశం. పురాతనకాలం నుంచీ అందర్నీ కలుపుకెళ్లిన ఘన చరిత్ర మనది. వీళ్ళ సన్నాయి నొక్కులు అవసరం లేదు. అసలు ఈదేశంలో 1857 తర్వాత పనిగట్టుకొని మతాల వారీగా జనాన్ని విడదీసిన సంస్కృతి బ్రిటిష్ వాళ్ళది. వాళ్ళు రాజేసిన కుంపటి ఇంకా మండుతూనేవుంది. మతం పేరుతో రెండు దేశాలు ఏర్పాటుచేసింది ఈ రాజకీయాలే. వీళ్లు మాకు నీతులు చెప్పాల్సిన పనిలేదు. భారత్ తన ఇంటి సమస్యలను సమర్ధంగా పరిష్కారం చేసుకోగలదు. అంత చేయాలనుకుంటే ఇస్లాం మత వ్యతిరేక చట్టం (Blasphemy ) పేరుతో మైనారిటీలను వేధించే పాకిస్తాన్ చట్టాలని మార్పుచేయించండి. అదిచేతకాకపోతే గమ్మునవుండండి కానీ అన్ని మతాల్ని సమానంగా చూసే భారత్ కి నీతులు చెప్పటానికి సాహసించకండి.

రజనీ కోసం నయన్ అంతపని చేసిందా?

దక్షిణాదిలో నెంబర్ వన్ హీరోయిన్ గా నయనతార కొనసాగుతుంది. ఆమె అడిగినంత పారితోషకం ఇచ్చి తమ సినిమాల్లో నటింపజేసేందుకు నిర్మాతలు క్యూ కడుతుంటారు. అయితే నయన్ చేసిన పనికి నిర్మాతలు షాకైనట్లు తెల్సింది. రజనీకాంత్ తాజా చిత్రంలో నటించేందుకు ఆమె పారితోషికంగా తగ్గించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా కోటి రూపాయలు వరకు తగ్గించుకోవడంతో సదరు నిర్మాత ఫుల్ ఖుషీ అవుతున్నట్లు సమాచారం.

నయనతార సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి చాలా సినిమాల్లో నటించింది. ఇటీవలే రజినీకాంత్ ‘దర్బార్’లోనూ నయన్ నటించి మెప్పింది. ఈ మూవీ కోసం నయనతార ఏకంగా 5.5 కోట్లు తీసుకుందని సమాచారం. దీనికితోడు ఆమెతో ఉన్నవారికి మెయింటెన్స్ ఖర్చులు తప్పని సరి చూసుకోవాల్సిందే. రజనీకాంత్ తాజాగా శివ దర్శకత్వంలో ‘అన్నాతై’ మూవీలో నటిస్తున్నాడు. రజినీకి జోడీగా నటించేందుకు నయన్ సంప్రదించగా గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతోపాటు నిర్మాతలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ఈ మూవీని సన్ పిచర్స్ నిర్మిస్తుంది. వరుసగా రజినీతో రెండోసారి కావడంతో నిర్మాత అడగకముందే కోటి రూపాయాలు తగ్గించి ఇవ్వండని చెప్పిందట. దీంతో నిర్మాతలు ఆనందంతో వెంటనే అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే నయనతార సినిమా ప్రమోషన్లకు మాత్రం దూరంగా ఉంటుంది. ఇటీవల నయనతారపై నిర్మాతలు ఈ విషయంలో గుర్రుగా ఉంటున్న సంగతి తెల్సిందే. అయితే నయనతార కోటి రూపాయాలు తగ్గించడం వెనుక కారణం ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమేనా అనే సందేహం కలుగుతుంది. ఏదిఏమైనా నయన్ చేసిన పనికి నిర్మాతలు మాత్రం హ్యపీగా ఫీలవుతున్నారట.

కీలక నిర్ణయంతో మంత్రులకు షాకిచ్చిన జగన్


ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీ మంత్రులు అవాక్కవుతున్నారు. సంక్షేమ పథకాల దగ్గరి నుంచి, ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని వెలికితీసే చర్యల వరకు జగన్ తనదైన శైలిలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికారం కట్టబెట్టిన ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్న ఆయన.. తాజాగా మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సంక్షేమ పథకాల అమలులో భాగంగా, ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కరానికి మంత్రులు తమ పేషీల్లో అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు.ప్రజలు, అర్జీదారులు తమ అభ్యర్థనలు చెప్పుకొనేందుకు సెక్రటేరియట్‌ కు వచ్చే అవకాశం ఉన్నందున.. వారి సమస్యలు పరిష్కరించే దిశగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు, తదితర కారణాల రీత్యా బుధవారం ఒక్క రోజు మాత్రం కచ్చితంగా సెక్రటేరియట్‌లో ఉండాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిరు సినిమాలో పూజా హెగ్డే?

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో మెగాస్టార్ డ్యుయల్ చేస్తున్నారు. చిరుకు సీనియర్ హీరోమిన్ త్రిష నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘స్టాలీన్’ మంచి విజయం సాధించింది. చిరుకు జోడీగా త్రిష అలరించింది. దీంతో చిరు-152 మూవీలో త్రిషకు ఆఫర్ దక్కింది. అదేవిధంగా తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కుర్ర హీరోయిన్ రెజీనా చిరంజీవితో కలిసి ఓ ఐటమ్ లో మెరవబోతుంది. ఇంతమంది అందగత్తెలకు తోడుగా మరో భామ ఈ మూవీలో నటించనుందని తెలుస్తోంది.

చిరంజీవి-152వ మూవీలో కొరటాల శివ రాంచరణ్ కోసం ఓ పవర్ ఫుల్ పాత్రను రాసుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో రాంచరణ్ బీజీగా ఉండటంతో ఈ మూవీని తప్పుకున్నట్లు తెల్సింది. అయితే రాంచరణ్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. రాంచరణ్ కోసం కొరటాల శివ ‘నక్సలైట్’ పాత్రను రాసుకున్నాడు. ఈ పాత్ర మహేష్ బాబు చేస్తుండటంతో ఈ పాత్రలో కొన్ని మార్పులు చేస్తున్నాడు. మహేష్ బాబును స్టూడెంట్ లీడర్ గా కొరటాల చూపించబోతున్నాడని తెల్సింది. మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డేను తీసుకుంటున్నట్లు తెల్సింది. ఇప్పటికే చిత్రబృందం పూజను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చిరు మూవీలో మహేష్ బాబు నటిస్తుండటంతో సినిమాకు మరింతగా క్రేజీ పెరిగింది. ఈ చిత్రాన్ని రాంచరణ్ మ్యాట్ని మూవీ మేకర్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. భారీ తారాగణం, భారీ బడ్జెట్లో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీని కొరటాల శివ చిరంజీవి పుట్టిన రోజు కానుక విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఈ మూవీని మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు.

చిట్టచివరకు ఢిల్లీకి కొత్త పోలీస్ కమీషనర్!

గత శనివారం నుండి ఢిల్లీ రావణకాష్టంగా మారడానికి, 1984 తర్వాత ఎన్నడూ ఎరుగని రీతిలో మత ఘర్షణలు చెలరేగడానికి ఢిల్లీ పోలీస్ కమీషనర్ అమూల్య పట్నాయక్ “అసమర్ధత” కారణం అని ఎన్ని విమర్శలు వస్తున్నా అతనిని సమర్ధిస్తూ వస్తున్నా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చిట్టచివరకు ఆయన స్థానంలో ఎస్ ఎన్ శ్రీవాత్సవను ఢిల్లీ కమీషనర్ గా నియమించారు.

అయితే అమూల్య పదవీకాలం ముగిసిన తర్వాత ఆదివారం గాని ఆయన బాధ్యతలు చేపట్టారు. శ్రీవాత్సవ ప్రస్తుతం సి ఆర్ పి ఎఫ్ లో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఢిల్లీలో అల్లర్లు అదుపు తప్పడంతో ప్రత్యేక పోలీస్ కమీషనర్ గా ఢిల్లీకి తీసుకు వచ్చారు.

రెండు నెలలకు పైగా షాహీనభాగ్ లో నిరసనలు చెలరేగుతున్నా, సిఏఏ వ్యతిరేక ప్రదర్శనలు జామామిలియా, జె ఎన్ యు లలో హింసాయుత రూపం దాల్చినా, ఈ సందర్భంగా పోలీస్ ల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చెలరేగినా, తాజా అల్లర్ల సందర్భంగా పోలీసుల ముందే ప్రదర్శనకారులు తుపాకులు పేలుస్తున్నా, కత్తులతో స్వామిరా విహారం చేస్తున్నా నిస్సహాయంగా ఉండిపోయారు.

చివరకు అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సు లపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదు. వీటన్నింటికి కారణం పోలీస్ కమీషనర్ “అసమర్ధత”ఏ కారణంగా అందరు విమర్శలు గుప్పిస్తున్నా ప్రభుత్వం వెనుకవేసుకు వచ్చింది.

వాస్తవానికి అమూల్య పదవీకాలం డిసెంబర్ లోనే ముగిసినా, అమిత్ షా భజనపరులలో ఒకరు కావడంతో, అతని మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించారు. అప్పుడే పలువురు సీనియర్ అధికారులు అసహనం ప్రదర్శించినట్లు తెలిసింది.

కనిపిస్తే కాలపు ఉత్తరువులు ఇచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో వెంటనే పరిస్థితులు అదుపులోకి రాకపోవడం గమనార్హం. రెండు వైపులా ఉత్తర ప్రదేశ్ నుండి అసాంఘిక శక్తులు మారణాయుధాలతో ప్రవేశించి అల్లర్లు సృష్టిస్తున్నా సరిహద్దును మూసివేసే ప్రయత్నం చేయక పోవడం గమనార్హం.

ఢిల్లీ అల్లర్లలో బిజెపిని ఆత్మరక్షణలో పడవేసిన కపిల్ మిశ్రా!

ఢిల్లీలో గత ఐదు రోజులుగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి మాజీ ఎమ్యెల్యే కపిల్ మిశ్రా బిజెపిని ఆత్మరక్షణలో పడవేస్తున్నారు. గత ఆదివారం సిఏఏ అనుకూల ప్రదర్శనకారులను  రెచ్చగొట్టే రీతీలో ప్రదర్శన జరిపి, హింసాయుత సంఘటనకు కారణమయ్యారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. ప్రస్తుత అల్లర్లకు అతనే కారకుడని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అతనిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయమని కూడా హై కోర్ట్ ఆదేశించింది.

అతని చర్యలతో పార్టీకి సంబంధంలేదన్నట్లు బిజెపి వ్యవహరించింది. అతను జరిపిన ప్రదర్శనతో తమకు సంబంధం లేదన్నట్లు, పార్టీ ఎటువంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే అతని ఎటువంటి తప్పు చేయలేదని బిజెపి ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు గురువారం వెనుక వేసుకు రావడం బీజేపీలో కూడా కాకారేపుతున్నది. అతని ప్రసంగాలు “రెచ్చగొట్టే విధంగా” లేవని సర్టిఫికెట్ ఇవ్వడం కూడా పలు పార్టీ నేతలు తమాయించుకోలేక పోతున్నారు.

గత ఎన్నికలలో ఆప్ నుండి శాసన సభకు ఎన్నికైన కపిల్ మిశ్రా ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురి కావడంతో ఎన్నికల ముంది బీజేపీలో చేరి, మొన్నటి ఎన్నికలలో ఓటమి చెందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయం నుండి విద్వేష పూరిత ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అతనిని కట్టడి చేసే ప్రయత్నాలను ఎవ్వరు చేయడం లేదు.

తూర్పు ఢిల్లీ బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ బహిరంగంగానే మిశ్రాకు పార్టీ సీనియర్ నేత ఒకరు `సర్టిఫికెట్’ ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “వ్యక్తి ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కఠినంగా శిక్షింప వలసిందే” అని స్పష్టం చేశారు. మతాల మధ్య రెచ్చగొట్టే మిశ్ర వంటి వారిని పార్టీ ప్రోత్సహించరాదని కూడా ఘాటుగా స్పందించారు.

బిజెపి భాగస్వామ్య పక్షం ఎల్జేపీ నేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సహితం ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై – ఏ పార్టీ వారైనా తగు చర్య తీసుకోవలసింది అని స్పష్టం సీదేశారు. ఇప్పుడు కపిల్ మిశ్రా గురించి బిజెపి నేతలే జోక్ లు వేస్తున్నారు. ఎన్నికలలో ఆయనకు వచ్చిన ఓట్ల కన్నా సోషల్ మీడియా లో ఆయన ట్వీట్ లకు లీకులు, రీట్వీట్ లు ఎక్కువగా వస్తున్నాయని అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఢిల్లీ మారణహోమం:కుట్రకు కారకులు వీళ్ళే?


ఢిల్లీలో గత నాలుగు జరుగుతున్న హింసాత్మక అల్లర్లు గురువారానికి కాస్త సద్దుమణిగాయి. దింతో అల్లర్లకు కారకులను పట్టుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన అల్లర్లు రెండు, మూడు రోజుల్లోనే.. ఢిల్లీ మొత్తం వ్యాపించి, మారణహోమం సృష్టించడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ హింసాత్మక ఘటనలలో అటు ముస్లింలు, ఇటు హిందువులు చనిపోవడంతో బలమైన సంఘ విద్రోహ శక్తులు పనిచేసి ఉండోచ్చనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్లాన్ చేసి, స్క్రిప్ట్ రాసి, స్కెచ్ వేసి ఈ హింసాత్మక అల్లర్లు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రాళ్లు, కర్రలు, యాసిడ్ ప్యాకెట్లు, పెట్రోల్ బాంబులు, రివాల్వర్లతో అల్లరి మూకలు యథేచ్ఛగా లూటీలు, విధ్వంసకాండకు తెగబడంతో ఇప్పటివరకు 38 మంది చనిపోగా.. వందలమంది ఆసుపత్రి పాలయ్యారు. రెండు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దర్యాప్తు చేసి ఇప్పటికే 48 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 130 మందిని అరెస్టు చేశారు. గొడవల్లో పాల్గొన్న 50 మంది మొబైల్‌‌ ఫోన్లను సీజ్‌‌ చేసిన పోలీసులు.. వారందరూ వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్‌‌ అయ్యారని పోలీసులు అభిప్రాయపడ్డారు. యూపీ నుంచి వచ్చే కిరాయి రౌడీలకు డైరెక్షన్స్‌‌ ఇచ్చేందుకు కూడా వాట్సాప్‌‌ నే ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అదేవిధంగా ఈ అల్లర్ల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ మొహ్మద్ తాహిర్ హుస్సేన్ హస్తం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయగా.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఇంటి మిద్దె​ పై పెట్రోల్ బాంబులతో పాటు డజన్ల కొద్దీ యాసిడ్ ప్యాకెట్లు, భారీ సంఖ్యలో రాళ్లు బస్తాలు లభ్యమయ్యాయి. వెలుగులోకి వచ్చిన ఈ సంచలన విషయాలు రాజకీయంగా కలకలం రేపాయి. అల్లర్లలో ఆప్ హస్తం ఉందని, తాహిర్ హుస్సేన్​ ను ఆ పార్టీ వెనకేసుకొస్తోందని బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈమేరకు తాహిర్‌‌ పై మర్డర్‌‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆప్‌ వర్గాలు మీడియాకి తెలియజేసారు.

“అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధంలేదని, తనపై వస్తున్నఆరోపణలు నిరాధారమైనవని తాహిర్‌‌ అన్నారు. ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని, తన తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోకుండా నన్ను అరెస్ట్ చేయడమేంటని తాహిర్ అన్నారు.‘‘నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఓ దుర్మార్గపు ప్రచారం. కొంతమంది డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు” అని ఆయన ఆరోపించారు.

కేశవరావుకు రాజ్యసభ సీట్ మళ్ళి కష్టమా!

సీనియర్ రాజకీయ వేత్త, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావుకు మరోసారి రాజ్యసభ సీట్ లభించే అవకాశాలు కనబడటం లేరు. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగుస్తుంది. మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా, రెండో సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.ప్రస్తుతం సాంకేతికంగా ఏపీ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవరావు సభ్యత్వం ఏప్రిల్ 9తో ముగుస్తుంది.

తెలంగాణ నుండి ఎన్నిక కావలసిన మొత్తం నలుగురిని ఎన్నికయ్యేటట్లు చూడదగిన ఎమ్యెల్యేల భలం ఉన్నప్పటికీ సామజిక వర్గాల సమతూకంలో ఆయనకు మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం లేకపోవచ్చని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంకా మిగిలే ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులు కూడా బిసి వర్గాలకులు చెందినవారే కావడంతో ఈ సారీ ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. రెడ్డి, వెలమ, ఎస్సి వర్గాలకు వరుసగా మూడు సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి.

వెలమ వర్గం నుండి సీఎం కుమార్తె కవిత, కేసీఆర్ సమీప బంధువైన వినోద్ కుమార్ ల పేర్లు వినబడుతున్నాయి. వీరిద్దరూ గత లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందిన వారే. ఓటమి తర్వాత కవిత రాజకీయంగా దాదాపు మౌనంగా ఉంటున్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు గురించి ఆందోళనలు జరుగుతున్నా ఆమె పట్టించుకోవడం లేదు.

వినోద్ కుమార్ ప్రస్తుతం రాష్త్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నప్పటికీ ఆయనకు రాజ్యసభ సీట్ పట్ల ఆసక్తి ఉన్నట్లు తెలుస్తున్నది. రెడ్డి సామజిక వర్గంలో అనేకమంది పోటీ పడుతున్నారు. కేసీఆర్ తమకు హామీ ఇచ్చారని మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ హోమ్ మంత్రి నాయని నరసింహ రెడ్డి భరోసాతో ఉన్నారు.

ఇక ఎస్సి, ఎస్టీ ల నుండి కూడా పలువురు సీట్లు ఆశిస్తున్నారు. అనూహ్యంగా రాజకీయాలతో సంబంధం లేకుండా పారిశ్రామిక వేత్తలను ఎవరినైనా కేసీఆర్ తెరపైకి తీసుకు వస్తారా అనే చర్చ కూడా జరుగుతున్నది.

Mannara Chopra Hot Stills

దళపతి విజయ్‌ సరసన ఆ క్రేజి భామ..!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా చేస్తున్నాడు. మలయాళ కుట్టి మాళవికమోహన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు తుది దశకు చేరుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమలో ఆండ్రియా కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమా తరువాత కొంగర సుధ దర్శకత్వంలో విజయ్, మరో సినిమాలో నటించబోతున్నాడు. గతంలో కొంగర సుధ వెంకటేష్ హీరోగా ‘గురు’ సినిమాను తెరకెక్కించింది.ఈ సినిమాలో విజయ్ సరసన క్రేజి భామ పూజా హెగ్డే నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విజయ్ 65వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను సన్ ఫిక్చర్స్‌ సంస్థ నిర్మించబోతోంది. సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఆడవారి కోసం ప్రత్యేకంగా విదేశీ మద్యం, వైన్ షాపులు

మధ్య ప్రదేశ్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా వైన్స్‌ షాపులు రానున్నాయి. ఆడవారికి ఇబ్బంది లేకుండా మందు కొనుక్కోవడానికి అక్కడి కమల్ నాథ్‌ ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన చేసింది.

తొలుత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌, ఇండోర్‌లలో రెండేసి చొప్పున షాపులు.. జబల్ పూర్‌, గ్వాలియర్‌లలో ఒక్కో షాపును ప్రారంభింపనున్నారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే విస్కీ, వైన్‌ బ్రాండ్లనే అక్కడ అమ్మనున్నారు. అందులోనూ ఫారిన్ బ్రాండ్లనే అమ్మకానికి పెట్టనున్నారు.

అంటే రాష్ట్రంలో రిజిస్టర్‌ కాని బ్రాండ్లను కూడా ఈ షాపుల్లో కొనొచ్చన్నమాట. ట్యాక్స్‌ కట్టాకే ఈ ఫారిన్‌ లిక్కర్‌ను అనుమతిస్తారు కాబట్టి మళ్లీ అదనపు పన్ను వసూలేం చేయబోమని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలో ఎక్కడా దొరకని ఫారిన్‌ బ్రాండ్లను ఇక్కడ అమ్ముతారని వాణిజ్య పన్నుల శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ ఐసీపీ కేశ్రీ చెప్పారు. ఆడవాళ్లు ఈజీగా లిక్కర్‌ కొనుక్కునేలా మాల్స్‌, మార్కెట్ ప్లేస్‌లో షాప్‌లను తెరుస్తామని పేర్కొన్నారు.

కాగా, రాష్ట్రంలో తయారుచేసే లోకల్‌ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసేందుకు భోపాల్, ఇండోర్, జబల్ పూర్, గ్వాలియర్‌లో వైన్ ఫెస్టివల్స్‌ నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో రత్మాల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో తయారు చేసే ద్రాక్షపళ్ల మద్యాన్ని ప్రమోట్ చేసేందుకు 15 టూరిస్ట్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దుకాణాలు తెరవనున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు.

దేశంలో కర్ణాటక తర్వాత మద్యం ధరలు ఎక్కువగా మధ్యప్రదేశ్ లోనే ఉన్నాయి.

Naga Shourya New Movie Opening Photos

ప్రకాశ్ రాజ్ కు సమన్లు జారీ చేసిన హైకోర్టు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కు మద్రాసు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ప్రకాశ్ రాజ్ ఇటీవల ఒక ఫైనాన్సియర్ కు చెక్కు ఇవ్వగ బౌన్స్ కావడంతో సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించినట్లు తెల్సింది. దీంతో మద్రాస్ హైకోర్టు ప్రకాశ్ రాజ్ కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 2లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

ప్రకాశ్ రాజ్ తన విలక్షణ నటనతో అన్ని భాషల్లో నటిస్తూ బీజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా రాణించాడు. ప్రకాశ్ రాజ్ ఇటీవల నడిగర్ అనే మూవీ నిర్మించాడు. ఈ మూవీ కోసం ఓ బడా ఫైనాన్సియర్ వద్ద ఐదు కోట్లు అప్పు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇటీవల సదరు ఫైనాన్షియల్ డబ్బులు అడుగగా ప్రకాశ్ రాజ్ చెక్ ఇచ్చినట్లు తెల్సింది. ఈ చెక్కును సదరు వ్యక్తి బ్యాంకులో వేయగా బౌన్స్ అవడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో మద్రాసు హైకోర్టు ప్రకాశ్ రాజ్ కు సమన్లు జారీ చేసింది.

‘సరిలేరునికెవ్వరు’ మూవీలో ప్రకాశ్ రాజ్ నటించారు. మహేష్ బాబుకు ధీటుగా ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన సంగతి తెల్సిందే. ఇటీవల ప్రకాశ్ రాజ్ ఓ ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానింకా ‘సరిలేరునికెవ్వరు’ మూవీని చూడలేదని చెప్పారు. తనకు సినిమాలు చూసే అలవాటు తక్కువని చెప్పడం గమనార్హం.

బాధిత కుటుంబాలకు కేజ్రీవాల్ మార్క్ సాయం


గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఢిల్లీ మారణహోమం గురువారానికి కొంతవరకు సద్దుమణిగాయి.అయితే గొడవల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అదేవిధంగా చనిపోయిన వారిలో మైనర్లు ఉంటే వారి కుటుంబాలకు 5 లక్షలు, ఇళ్లు, షాప్ లు అలర్లలో ధ్వంసమై నష్టపోయిన వారందరికీ 5 లక్షల రూపాయలు ప్రకటించారు. దాడుల్లో చాలా మంది రిక్షావాలా పై అటాక్ జరిగింది. రిక్షా కోల్పోయిన వారికి 25 వేలు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి ఒక్కో జంతువుకు 5 వేలు ప్రభుత్వం ఇస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఇళ్లు ధ్వంసమైన వారిలో కిరాయికి ఉన్న వాళ్లు ఉంటే వారికి రూ.లక్ష ఇవ్వనున్నారు. గాయపడిన వారందరికి మెడికల్ బిల్లుల్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బాధితులందరికీ మామూలు పరిస్థితి నెలకొనే వరకు ఫ్రీ గా ఫుడ్ అందిస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయకూడదు కాబట్టి ఈ హింసలో ఎవరి ప్రమేయం ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని సీఎం అన్నారు. ఒకవేళ ఆప్ నేతల హస్తం ఉన్నట్లు తేలితే రెండింతల శిక్ష వేయాలని కేజ్రీవాల్ చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ) అనుకూల, వ్యతిరేక ఘర్షణలుగా భావించే ఈ హింసాకాండ లో ఇప్పటి వరకు 38మంది చనిపోయారు. వందల మంది గాయాలపాలై ఆసుపత్రులలో చేరారు.

పీరియాడికల్ మూవీలో మెగా అల్లుడు

టాలీవుడ్లో వరుసగా పీరియాడికల్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో హీరోలంతా పీరియాడికల్ మూవీలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో పీరియాడికల్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ కోవలోనే మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ తాజాగా ఓ పిరియాడికల్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘బిందాస్’, ‘రగడ’ చిత్రాలను దర్శకుడు వీరుపోట్ల ఈ పీరియాడికల్ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’లో నటిస్తున్నాడు. పెళ్లంటేనే నో అనే పాత్రలో కన్పించబోతున్నాడు. తేజుకు జోడిగా నభా నటేష్ నటిస్తుంది. యూత్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రోమాంటిక్ లవ్ స్టోరీస్ గా దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీకి బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వాలంటెన్స్ డేకు చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఈ మూవీని మే 1న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది.

ఈ పీరియాడికల్ మూవీని భారీ బడ్జెట్లో తెరకెక్కనుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని గుర్తుతెచ్చేలా సినిమా ఉండనుందని సమాచారం. ఈ మూవీ కోసం భారీ సెట్లను కూడా వేస్తున్నారని సమాచారం. ఇటీవలే ‘ప్రతీరోజూ పండగే’ మూవీతో మళ్లీ సక్సస్ బాటపట్టారు. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్న తేజు త్వరలో పీరియాడికల్ మూవీతో కనువిందు చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు.