Homeజాతీయ వార్తలుఢిల్లీ మారణహోమం:కుట్రకు కారకులు వీళ్ళే?

ఢిల్లీ మారణహోమం:కుట్రకు కారకులు వీళ్ళే?


ఢిల్లీలో గత నాలుగు జరుగుతున్న హింసాత్మక అల్లర్లు గురువారానికి కాస్త సద్దుమణిగాయి. దింతో అల్లర్లకు కారకులను పట్టుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన అల్లర్లు రెండు, మూడు రోజుల్లోనే.. ఢిల్లీ మొత్తం వ్యాపించి, మారణహోమం సృష్టించడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ హింసాత్మక ఘటనలలో అటు ముస్లింలు, ఇటు హిందువులు చనిపోవడంతో బలమైన సంఘ విద్రోహ శక్తులు పనిచేసి ఉండోచ్చనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్లాన్ చేసి, స్క్రిప్ట్ రాసి, స్కెచ్ వేసి ఈ హింసాత్మక అల్లర్లు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రాళ్లు, కర్రలు, యాసిడ్ ప్యాకెట్లు, పెట్రోల్ బాంబులు, రివాల్వర్లతో అల్లరి మూకలు యథేచ్ఛగా లూటీలు, విధ్వంసకాండకు తెగబడంతో ఇప్పటివరకు 38 మంది చనిపోగా.. వందలమంది ఆసుపత్రి పాలయ్యారు. రెండు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దర్యాప్తు చేసి ఇప్పటికే 48 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 130 మందిని అరెస్టు చేశారు. గొడవల్లో పాల్గొన్న 50 మంది మొబైల్‌‌ ఫోన్లను సీజ్‌‌ చేసిన పోలీసులు.. వారందరూ వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్‌‌ అయ్యారని పోలీసులు అభిప్రాయపడ్డారు. యూపీ నుంచి వచ్చే కిరాయి రౌడీలకు డైరెక్షన్స్‌‌ ఇచ్చేందుకు కూడా వాట్సాప్‌‌ నే ఉపయోగించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అదేవిధంగా ఈ అల్లర్ల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ మొహ్మద్ తాహిర్ హుస్సేన్ హస్తం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయగా.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఇంటి మిద్దె​ పై పెట్రోల్ బాంబులతో పాటు డజన్ల కొద్దీ యాసిడ్ ప్యాకెట్లు, భారీ సంఖ్యలో రాళ్లు బస్తాలు లభ్యమయ్యాయి. వెలుగులోకి వచ్చిన ఈ సంచలన విషయాలు రాజకీయంగా కలకలం రేపాయి. అల్లర్లలో ఆప్ హస్తం ఉందని, తాహిర్ హుస్సేన్​ ను ఆ పార్టీ వెనకేసుకొస్తోందని బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆరోపించారు. కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈమేరకు తాహిర్‌‌ పై మర్డర్‌‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆప్‌ వర్గాలు మీడియాకి తెలియజేసారు.

“అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధంలేదని, తనపై వస్తున్నఆరోపణలు నిరాధారమైనవని తాహిర్‌‌ అన్నారు. ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని, తన తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోకుండా నన్ను అరెస్ట్ చేయడమేంటని తాహిర్ అన్నారు.‘‘నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఓ దుర్మార్గపు ప్రచారం. కొంతమంది డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు” అని ఆయన ఆరోపించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular