Home Blog Page 8613

విశాఖ ఎయిర్ పోర్టులో రాజకీయ ప్రతీకారం?

విశాఖ, విజయనగరం జిల్లాలలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని భావించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం నుండి విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి అడుగు కూడా బయట పెట్టలేక పోయారు. షరతులతో కూడిన పోలీసుల అనుమతులను భేఖాతర్ చేస్తారేమో అనేది ఒక కారణమైతే.. వైసీపీ శ్రేణులు చంద్రబాబును అడ్డుకోవడం ప్రధాన కారణం.

చంద్రబాబు పర్యటనకు ముందస్తు అనుమతులు ఉన్నాయని.. పోలీసులు చెప్పిన తర్వాతే తాము పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పత్రాలు మాదగ్గర ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయ కక్షను తీర్చుకోవడానికి విశాఖ ఎయిర్‌ పోర్ట్‌ ను అడ్డాగా మార్చుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసుల అనుమతి ఉన్నా.. వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

2017 జనవరి 26న విశాఖ పర్యటనకు నాటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అయితే ఇదే ఎయిర్ పోర్టులోనే పోలీసులు, టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకున్నారు. అయితే నాటి సంఘటనకు నేడు జరుగుతున్న దానికి ఏమాత్రం పోలిక లేదని టీడీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. ఆనాడు అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఉండటంతో జగన్ ను అనుమతించలేదని టీడీపీ నేతలు అంటున్నారు.

Actress Krithi Ghargh Interview Photos

‘రాహు’ మూవీ USA ప్రీమియర్ షో టైమ్స్

 

 

 

 

 

 

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘రాహు’. సుబ్బు వేదుల దర్శకత్వం వహించారు. ఏవీఆర్ స్వామీ, శ్రీశక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల సంయుక్తంగా నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో USA ప్రీమియర్ షో టైమ్స్ చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఢిల్లీ మారణహోమం వెనుక సంఘ విద్రోహ శక్తులు?

గత మూడు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు చూస్తుంటే.. కేవలం పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లగా అనిపించడం లేదు. అల్లర్ల ఉద్రిక్తత రోజు రోజుకి పెరగి, హింసాత్మంగా మారడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ హింసాత్మక ఘటనలలో అటు ముస్లింలు, ఇటు హిందువులు చనిపోతున్నారు. కాబట్టి సిఏఏకి వ్యతిరేక వర్గాలు ఈ మారణహోమం చేస్తున్నట్టుగా లేవు. కర్రలు, రాళ్లు, రివాల్వర్లతో అల్లరి మూకలు యథేచ్ఛగా లూటీలు, విధ్వంసకాండకు తెగబడడాన్ని బట్టి ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారమే జరిగిందని అర్థమవుతోంది.

షాహిన్ బాగ్ లో మహిళలు రెండు నెలలుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ఎన్నడూ ఎలాంటి హింసాత్మక ఘటన కూడా చోటుచేసుకోలేదు. కానీ, ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన అల్లర్లు మూడు రోజుల్లోనే.. ఢిల్లీ మొత్తం వ్యాపించి, మారణహోమం సృష్టించడం వెనుక బలమైన సంఘ విద్రోహ శక్తులు పనిచేశాయని చెప్పొచ్చు. సిఏఏ నిరసనకారులపై జరిగిన దాడులను సిఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణగాను, మత ఘర్షణలుగాను చిత్రీకరించేందుకు ఈ శక్తులు ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

వ‌రుస‌గా సాగుతున్న దాడుల్లో మృతుల సంఖ్య 32కు చేరుకుంది. వందల మంది గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. వీరిలో సగం మందికి బులెట్‌ గాయాలు ఉన్నట్లు తేలింది. చివరికి జర్నలిస్టులను, పోలీసులను కూడా ఈ శక్తులు వదల్లేదు. ఈ హింసాత్మక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉద్యోగి అంకిత్ శర్మ ని చంపి, ఆయన శవాన్ని మురికి కాలవలో పడేసి, ఎవరికైన చెబితే చంపేస్తాం.. అని అక్కడున్న మహిళలను బెదిరించడం వెనుక సంఘ విద్రోహ శక్తులు ఏ స్థాయిలో వీరవిహారం చేస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు.

అసలు బీజం పడ్డది.. ఢిల్లీ ఎన్నికలలో..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జామియా, జెఎన్‌యు, అలీగఢ్‌ యూనివర్శిటీల్లో విద్యార్థులపై సంఘ విద్రోహ శక్తులు, పోలీసుల వత్తాసుతో భయానక దాడులకు తెగబడడం ద్వారా సిఏఏ వ్యతిరేకులను భయభ్రాంతులను చేయాలని చూశాయి. ఈ ఎన్నికల్లో బిజెపి నేతలు గతంలో ఎన్నడూ లేని రీతిలో అసత్యాలు, అర్థసత్యాలతో విషప్రచారం చేశారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌, బిజెపి నాయకుడు కపిల్‌ మిశ్రా వంటి బీజేపీ నేతలు రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్నీ హోమ్ మంత్రి అమిత్ షా కూడా ఒప్పుకున్నారు. ఢిల్లీ ఎన్నికలలో ఘోర పరాభవం వెనుక బీజేపీ నేతల మత విద్వేష వ్యాఖ్యలే కారణమని అమిత్ షా చెప్పడం ఆశ్చర్యం.

ఢిల్లీని మరో గుజరాత్‌ గా మార్చాలని చూస్తున్న విద్వేష శక్తులు, 1984 మరణహోమాన్ని పునరావృతం చేయాలనుకుంటున్న దేశ ద్రోహులను వీలైనంత త్వరగా అణిచివేసి, దేశ రాజధానిలో శాంతిని నెలకొల్పాలని ఆశిద్దాం..

‘ఫైటర్’పై మనసుపారేసుకున్న అనన్య

పూరి జగన్మాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారం ఉంది. పాన్ ఇండియా మూవీగా ‘ఫైటర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని హిందీలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తుండగా తెలుగులో పూరి జగన్మాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది.

బాలీవుడ్లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ చిత్రంతో అనన్యపాండే గుర్తింపు తెచ్చుకొంది. ‘ఫైటర్’లో తొలుత విజయ్ దేవరకొండ సరసన శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే జాన్వీ కపూర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చివరికి ఈ అవకాశం అన్యన్య పాండేకు దక్కింది. ఇటీవల ‘ఫైటర్’ షూటింగ్ పాల్గొన్న అనన్య పాండే సెట్లో సందడి చేస్తుంది. ఖాళీ సమయం దొరికితే తెలుగు పదాలను నేర్చకుంటుంది. అన్ని భాషలు నేర్చుకొని తానే డబ్బింగ్ చెప్పుకుంటానని చెబుతుందట. అలాగే ‘ఫైటర్’ మూవీలోని తన క్యారెక్టర్ పై మనసు పారేసుంది. తన నిజజీవితానికి దగ్గర ఉండే కారక్టర్లో నటించడం ఆనందంగా ఉందని సెట్స్ వచ్చిన వారితో అనన్య పాండే చెబుతుందట.

వాలంటైన్స్ డే రోజు విడుదలైన విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ మూవీ నెగిటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ ఆలస్యం చేయకుండా ‘ఫైటర్’ షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో నటిస్తుంచనున్నట్లు తెలుస్తోంది. కబీర్ సింగ్’ హిట్టు తర్వాత సందీప్ వంగా రణ్ బీర్ సింగ్ తో మూవీ ప్లాన్ చేశాడు. అనివార్య కారణాలతో ఈ మూవీ నుంచి రణ్ బీర్ సింగ్ తప్పుకున్నాడు. దీంతో విజయ్ దేవరకొండ ఈ మూవీ చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు.

‘ప్ర‌భాస్ 20’ సినిమా విడుదల తేదీ ఖరారు..!

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.. ఆ ఇమేజ్ త‌గ్గ‌ట్టుగానే సినిమాలు చేసుకుపోతున్న ఈ రెబల్ స్టార్… ప్ర‌స్తుతం త‌న 20వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సొంత నిర్మాణ సంస్థ‌లు గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీ… శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

కాగా,టైటిల్ లేని ఈ సినిమాకి  ‘ఓ మైడియ‌ర్‌’, ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.ఈ క్రేజీ ప్రాజెక్ట్ అక్టోబ‌ర్ 16న సంద‌డి చేయనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. రాధాకృష్ణ రూపొందిస్తున్న “ప్ర‌భాస్ 20″లో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

O Pitta Katha Movie Press Meet Photos

‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసడర్ గా సుశాంత్

వరుస హిట్లతో హీరో సుశాంత్ జోరు మీదున్నారు. తాజాగా ఆయన శీతల పానీయం ‘స్ప్రైట్’తో వాణిజ్య ప్రకటనల (కమర్షియల్ యాడ్స్) ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. సుశాంత్ ఇప్పుడు ‘స్ప్రైట్’కు బ్రాండ్ అంబాసడర్. ఆ బ్రాండ్ కు ఆయన చేసిన మొదటి కమర్షియ యాడ్ విడుదలైంది.

ఇదివరకటి యాడ్స్ తరహాలోనే ఉత్తేజభరితంగా ఉన్న ఈ టీవీ కమర్షియల్ లో సుశాంత్ ఉబర్ కూల్ లుక్స్ లో కనిపిస్తున్నారు. ‘స్ప్రైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసడర్లుగా వ్యవహరిస్తున్నారు.

హీరోగా ‘చి.ల.సౌ’ సినిమాతో సక్సెస్ సాధించిన సుశాంత్, దాని తర్వాత ఒక కీలక పాత్ర పోషించిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=mdFNCKq7CG0

Nithya Shetty Photo Stills

వైజాగ్ లో ‘భీష్మ’ విజయోత్సవ వేడుక..

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. కథానాయకుడు నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది ఈ చిత్రం. ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. వెంకీ కుడుముల దర్శకుడు.

ప్రపంచ వ్యాప్తంగా చిత్రం సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని వైభవంగా ఓ వేడుకను జరపాలని నిర్ణయించారు చిత్ర యూనిట్. వాటి వివరాల్లోకి వెళితే…ఈ నెల 29 న వైజాగ్ లోని ‘గురజాడ కళాకేత్రం’ లో ‘భీష్మ’ చిత్ర విజయోత్సవ వేడుక ను నిర్వహించ నున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. హీరో నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన ‘భీష్మ’ వేడుకను, ఇంతటి ఘన విజయాన్ని తమకు అందించిన ప్రేక్షకాభిమానుల సమక్షంలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శనివారం( 29 ) సాయంత్రం వైజాగ్, వుడా కాంప్లెక్స్, సిరిపురం లోని ‘గురజాడ కళాకేత్రం’ లో 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ విజయోత్సవ వేడుకలో చిత్రకథానాయకుడు నితిన్, నాయిక రష్మిక మందన్న లతోపాటు చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. ఆరోజు జరిగే వేడుక ఆద్యంతం అభిమానులను అలరించనుంది.

ట్రంప్ పర్యటనలో రహస్య అజెండా!


చెప్పుకోదగిన ప్రాధాన్యత గల ఎటువంటి ఒప్పందం లేకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన జరపడం, అదీ కూడా భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో గత సెప్టెంబర్ లో ద్వైపాక్షిక సంప్రదింపులు జరిపిన ఐదు నెలలకే రావడం వెనుక రహస్య అజెండా ఉన్నట్లు తెలుస్తున్నది. రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రధాని మోదీని మారే దేశాధినేత చేయని విధంగా పొగడ్తలతో ముంచెత్తిన్నట్లు కనిపిస్తున్నది.

నేడు అమెరికాను తీవ్రంగా వేధిస్తున్న సమస్య ఆఫ్గనిస్తాన్. అక్కడ 19 ఏళ్ళ పాటు స్థావరం ఏర్పరచుకొని భారీగా సైనికులను కోల్పోవడం, పెద్ద ఎత్తున నిధులను నీళ్లపాలు చేయడం మినహా ఏమీ సాధించుకోలేక పోయారు. తమ సైనికులను వెనుకకు తీసుకు రావాలని అమెరికా ప్రజల నుండి తీవ్రమైన వత్తిడి ఏర్పడుతున్నది.
ఆఫ్ఘానిస్తాన్ లో తమ సేనలను మోహరింప చేయడం “పూర్తిగా వృధా” అంటూ 2012 లోనే ట్రంప్ ప్రకటించారు.

తాలిబన్లతో శాంతి ఒప్పందాన్ని ఈ నెల 29న సంతో ఒప్పందం చేసుకోవడానికి నాలుగు రోజుల ముందు భారత్ కు రావడం ప్రాధాన్యత సంతరింప చేసుకోండి. ఆ ఒప్పందం ప్రకారం అమెరికా సేనలు విడతల వారీగా వైదొలగాలి. ప్రస్తుతం 12,000 మంది సైనికులు ఉన్నారు. జులై నాటికి నాలుగోవంతు తొలిగితే, క్రమంగా ఈ సంవత్సరం చివరకు మొత్తం సైన్య ఉపసంహరణ పూర్తి కావాలని భావిస్తున్నారు.

అయితే ఒకసారి ఆఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా సేనలు వైదొలిగితే అక్కడ ఏమి జరుగుతుంది? ఆల్ ఖైదా స్థావరాలను ధ్వసం చేయడం మినహా అక్కడ అమెరికా వారేమి చేయలేకపోయారు. ఇప్పుడు ప్రాబల్యం వహిస్తున్న తాలిబన్ లను నడిపిస్తున్నది పాకిస్తాన్ ఐ ఎస్ ఐ అని అందరికి తెలుసు. అమెరికా సేనలు వైదొలగితే, ప్రస్తుతం అమెరికా మద్దతుతో అక్కడున్న ప్రభుత్వం బలహీనమై, తాలిబన్లు అధికారంలోకి రావడం ఖాయం.

అప్పుడు అక్కడ ప్రభుత్వం పాకిస్తాన్ పర్యవేక్షణలో, అంటే చైనా ఆధిపత్యంలో ఉంటుంది. ఆఫ్గనిస్తాన్ వంటి కీలక ప్రాంతంలో పాకిస్తాన్, చైనా ఆధిపత్యం వహిస్తే, ఉగ్రవాద శిబిరాలు ఇక బహిరంగంగా అక్కడ కొనసాగుతాయి.

పలు సంవత్సరాలుగా ఆఫ్ఘానిస్తాన్ రక్షణ బాధ్యతను భారత్ కు అప్పచెప్పి తమ సేనలను ఉపసంహరింపచేసు కోవాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ వస్తున్నది. అయితే గతంలో శ్రీలంకలో ఎల్ టి టి ఇ ని తుదముట్టించే ప్రయత్నంలో ఆ దేశం వెళ్లిన భారత్ సేనలు తీవ్రమైన మూల్యం చెల్లింపవలసి వచ్చింది. ఆ అనుభవంతో భారత్ ఆఫ్గనిస్తాన్ విషయంలో తలదూర్చడానికి మొదటినుండి వెనుకడుగు వేస్తున్నది.

ఆఫ్గనిస్తాన్ లో శాంతి నెలకొనడం భారత్ కు కూడా ఎక్కువ మేలు చేస్తుందని భారత్ పర్యటన సందర్భంగా ట్రంప్ చెప్పడం గమనార్హం. ఇదే సందర్భంగా గత ఏడాది కాలంగా పాకిస్తాన్ విషయంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు కీలకమైనది.

మొన్నటి వరకు కాశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, దానిపై భారత్ – పాకిస్తాన్ లు మాత్రమే చర్చలు జరుపుకోవాలని, మూడో దేశం జోక్యం తగదని భారత్ చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కాశ్మీర్ భారత్ ఆంతరంగిక విషయమని, ఆ విషయమై పాకిస్థాన్ తో చర్చల ప్రసక్తి లేదని మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగితే ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే అని చెప్పడం గమనార్హం.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత తమ తదుపరి లక్ష్యం ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం అని హోమ్ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలకు ఈ ప్రాంతమే కేంద్రంగా ఉంటూ వస్తున్నది. ఆక్రమిత కాశ్మీర్ భారత్ ఆధీనంలోకి రావడం వ్యూహాత్మకంగా అమెరికాకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. చైనా ప్రతిష్టాకరంగా చేపట్టిన వాణిజ్య కారిడార్ ఈ ప్రాంతం నుండే వెడుతున్నది.

అందుకనే ఆఫ్ఘానిస్తాన్ కు నేరుగా భారత్ భూమార్గం ఏర్పాటు చేసేందుకు ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు `అప్పచెప్పేందుకు’ అమెరికా సిద్దపడుతున్నదా? చూడాలి.

చిరు-152లో మహేష్ రోల్ ఇదే?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ 152వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ ఎండోమ్మెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరో పాత్ర ప్లాష్ బ్యాక్ వచ్చే యంగ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా చిరు-152లో నటించేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ రాంచరణ్ కోసం రాసుకున్న పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించనున్నాడు.

సీని ఇండస్ట్రీలో మెగాస్టార్ అందరితో సాన్నిహిత్యంగా ఉంటారు. మొదటి నుంచి మహేష్ బాబు, మెగాస్టార్ కుటుంబాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ చనువుతోనే మెగాస్టార్ మూవీలో మహేష్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉండటంతో చిరు-152 నుంచి తప్పుకున్నట్లు తెల్సిందే. రాంచరణ్ కోసం దర్శకుడు కొరటాల శివ ఓ పవర్ క్యారెక్టర్ సిద్ధం చేశాడు. రాంచరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం జరిగింది. రాంచరణ్ ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో మహేష్ బాబు నక్సలైట్ పాత్ర చేస్తారని అనుకున్నారంత. అయితే కొరటాల మహేష్ బాబును నక్సలైట్ పాత్రలో కాకుండా స్టూడెంట్ లీడర్ గా చూపించనున్నారని ప్రచారం జరుగుతుంది.

గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో మల్టిస్టారర్ మూవీలకు బాగా ఆదరణ లభిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కూడా మల్టిస్టారర్ మూవీగానే తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తుంది. చిరు-152వ మూవీలో మెగాస్టార్, సూపర్ స్టార్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు దాదాపు 20నిమిషాలపాటు కనిపించనున్నాడు. చిరు-152వ రాంచరణ్ మ్యాట్నీ మూవీ మేకర్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మణిశర్మ ఈ మూవీకోసం అదిరిపోయే బాణీలను సమకురుస్తున్నాడు.

ఢిల్లీలో మారణహోమం: 32కి చేరిన మృతుల సంఖ్య


పౌరసత్వ సవరణ బిల్లు (సిఏఏ) కి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనల సెగ ఢిల్లీకి తాకింది. దేశ రాజధానిలో మూడురోజులుగా కొనసాగుతున్న అల్లర్లు హింసాత్మంగా మారాయి. ఇప్పటివరకు 32 మంది చనిపోగా వందల మంది గాయపడ్డారు. వేలమంది సామాన్య ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.

ఈశాన్య ఢిల్లీలో ప్రారంభమైన అల్లర్లు ప్రస్తుతం ఢిల్లీ మొత్తం వ్యాపించాయి. తీవ్రస్థాయి హింసాత్మక ఘటనలతో ఢిల్లీ అట్టుడుకుతుంది.
రాజధాని విధుల్లో వాహనాలు తగలబడుతున్నాయి, దుకాణాలు తెరవని పరిస్థితి, మూసేసిన ఇల్లు దర్శనమిస్తున్నాయి. సిఏఏ కి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లుగా భావిస్తున్న ఈ హింసకాండలో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతుంది. అలాగే గాయపడిన వారి సంఖ్య కూడా గంట గంట కి పెరుగుతుంది. దింతో సామాన్య ప్రజలు ఇళ్లలోని నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.

ప్రస్తుత నేపథ్యంలో రెచ్చ గొట్టే వ్యాఖ్యలు, విద్వేష పూరిత ప్రసంగాలు చేయొద్దని, అలాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇందిరాగాంధీ హత్య సందర్బంగా 1984లో సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన మారణహోమం మరలా పునరావృతం కాకుండా చూడాలని హైకోర్టు, అధికారులను ఆదేశించింది. అల్లర్లు, హింసాత్మంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత దోవల్ ని రంగంలోకి దించింది. ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించి ఢిల్లీలో అల్లర్లను అదుపుచేసే ప్రయత్నం చేసుతున్నారు. మరోవైపు పోలీసులు, భద్రత వ్యవస్థలు ఢిల్లీలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాయి.

Ruhani Sharma At Hit Pre Release Event At Vizag

Photos: HIT Movie Pre Release Event at Vizag

ఢిల్లీ పోలీసులకు ఆయుధాలు ఆభరణాలా!


ఢిల్లీలో విచ్చలవిడిగా హింసాయుత సంఘటనలు ప్రారంభమై మత ఘర్షణలుగా మారడానికి ఎవ్వరు కారకులు? తగినంత సంఖ్యలో పోలీసులు లేరని ఇప్పుడు కొత్తగా సాకులు చెబుతున్నారు. అయితే పోలీసుల ముందే విచ్చలవిడిగా దుండగులు తుపాకులతో కాల్పులు జరుపుతుంటే, ఇంతవరకు భారత దేశంలో మరెక్కడా జరగని రీతిలో అగ్నిమాపకదళం, అంబులెన్సు లపై కూడా దాడులు జరుపుతుంటే ఎందుకు వారు మౌనంగా ఉన్నారు? తమ చేతులలో తుపాకులకు ఎందుకని పని అప్పచెప్పలేదు?

ఢిల్లీలో `సూపర్ కాప్’ మరెవ్వరో కాదు. ఎంతో బలమైన నేతగా ప్రచారం జరుగుతున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. ఆయనకు పరిస్థితులను సమీక్షించి, అవసరమైతే కాల్పులు జరపమని చెప్పడానికి మూడు రోజులు పట్టింది. అప్పటికే సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక పోలీస్ కూడా ఉన్నారు.

అప్పటిదాకా కాల్పులు జరపని పోలీస్ లను ముందుగా సస్పెండ్ చేయాలి. వారి చేతులలో ఉన్న ఆయుధాలు కేవలం ఆత్మరక్షణకు, ప్రజలను కాపాడడానికి, ప్రభుత్వ – ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే. అవి ఆభరణాలు కానేకావు. కానీ, పోలీస్ లను ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంను నియంత్రించే రాజకీయ ప్రయోజనాలకు పరిమితం చేస్తూ ఉండడంతో వారు అవసరమైనప్పుడు తుపాకులకు పని చెప్పలేక పోయారు.

ప్రతిపక్ష పార్టీలలో ఫిరాయింపు దారులను ప్రోత్సహింప చేసి రాజ్యసభలో కీలకమైన బిల్లులకు ఆమోదం పొందడంలో నేర్పరి అయిన అమిత్ షా ఆర్టికల్ 370, సిఏఏ వంటి బిల్లును ఎటువంటి పూర్వరంగం సిద్ధం చేయకుండా అకస్మాత్తుగా తీసుకొచ్చి, ఆమోదింప చేసుకో గలిగారు. కానీ ప్రజాక్షేత్రంలో సమస్యలు ఎదురైతే మాత్రం వెన్ను చూపుతున్నారు.

ఆరు నెలలు అయినా ఇప్పటి దాకా కాశ్మీర్ వెళ్లే సాహసం చేయలేక పోతున్నారు. సిఏఏ చట్టం తీసుకొచ్చే ముందు కూడా రాగాల పరిణామాల గురించి కించిత్తు కూడా ఆలోచించిన్నట్లు లేదు. అందుకనే రెండు నెలలకు పైగా నిరసనలు పలు చోట్ల చెలరేగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

ఢిల్లీలో షహీన్ బాగ్ లో రెండు నెలలకు పైగా నిరసనలు చేస్తుంటే కనీసం వారిని విరమించమని ఒప్పించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసిందా? గతంలో యుపిఎ హయాంలో అన్నాహజారే ఢిల్లీలో సత్యాగ్రహం చేస్తానంటూ వస్తే విమానాశ్రయంలోని నలుగురు కేంద్ర మంత్రులు కలిసి, ఆయనను నివారించే ప్రయత్నం చేశారు. కానీ అమిత్ షా కనీసం అటువంటి ప్రయత్నమే చేయలేదు.

పైగా, నిరసనలు చేస్తున్న గురించి బీజేపీలో ప్రముఖులే రెచ్చగొట్టే విధంగా, బాధ్యతారాహిత్యంగా వాఖ్యలు చేస్తుంటే వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. వారెవ్వరిపై కేసులు కూడా నమోదు చేయక పోవడంపై ఢిల్లీ హై కోర్ట్, సుప్రీం కోర్ట్ నిలదీయడం తెలిసిందే. ఢిల్లీలో అల్లర్లను ఎవ్వరు ప్రారంభించినా, ఎందుకు చేస్తున్నా వాటిని కట్టడి చేసి హింస ప్రజ్వరిల్లకుండా చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోమ్ మంత్రి అమిత్ షా వైఫల్యమే కారణం అని చెప్పక తప్పదు.

చివరకు హోమ్ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి బాధ్యతారహితంగా రాహుల్ గాంధీ హింసను రెచ్చగొట్టారని ప్రకటన చేశారు. కానీ అమిత్ షా ఏమాత్రం యాదృశ్చికంగా హింస చెలరేగినదని చెబుతున్నారు. అంటే ప్రభుత్వంలోనే హింసపై గందరగోళం నెలకొన్నది అన్నమాట.

‘శ్రీమంతుడి’గా మారిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ‘శ్రీమంతుడి’గా మారాడు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ మూవీలో గ్రామాన్ని దత్తత తీసుకొని అన్నివిధలా ఆదుకుంటాడు. ఈ సినిమా టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈ మూవీలో మాదిరిగానే సల్మాన్ భాయ్ రియల్ గా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అన్నివిధలా ఆదుకుంటానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

2019 సంవత్సరంలో మహారాష్ట్రలో భారీ వరదలు సంభవించారు. కోల్హాపూర్ జిల్లాలోని ఖిద్రాపూర్ గ్రామం వరదలకు చాలావరకు దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వారికి ఆదుకుంటానని ప్రకటించారు. ఎలాన్ ఫౌండేషన్ వారితో కలిసి సల్మాన్ ఖాన్ బాధితులకు ఇళ్లు, ఇతర సదుపాయాలు కల్పించనున్నాడు. తమకు సల్మాన్ ఖాన్ మద్దతు లభించడంపై ఎలాన్ ఫౌండేషన్ నిర్వాహకులు రవి కపూర్ హర్షం వ్యక్తం చేశారు.

సల్మాన్ ఖాన్ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడు ముందే ఉంటాడు. గతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి తన ఉదారతను చాటుకున్నాడు. కాగా సల్మాన్ ప్రస్తుతం రాధే, కబీ ఈద్ కబీ దివాళీ చిత్రాలతో బీజీగా ఉన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో రాధే మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో సల్మాన్ కు జోడీ దిశా పటానీ నటిస్తుంది. రందీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు రానుంది.