Home Blog Page 8611

బడ్జెట్ సమావేశాలపై జగన్ సర్కార్ కసరత్తు


ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికల చర్చ జోరుగా సాగుతుంది. అదే సమయంలో 2020 బడ్జెట్ సమావేశాలపై కూడా కొంత మేర చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముందా.. లేక బడ్జెట్ సమావేశాలు ముందా.. అనే విషయంపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

మొదట బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, తర్వాత స్థానిక ఎన్నికలకు పచ్చ జెండా ఊపనుంది ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధిచిన షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, మార్చి 9వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల పై పెద్ద రచ్చ జరగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 20వ తేదీన రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీచేసి.. మార్చి 15 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని సీఎం జగన్ అనుకుంటున్నారు. అయితే ఎన్నికల ముందే బడ్జెట్ ప్రవేశపెడితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడే అవకాశం ఉంటడటంతో.. ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలపై మార్చి 4వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి.. సమావేశాల తేదీని ఖరారు చేయనున్నారు.

వాట్స్ యాప్ గ్రూప్లపై పోలీసుల నిఘా!

దేశ వ్యాప్తంగా వాట్స్ ఆప్ గ్రూప్ లపై పోలీసుల నిఘా ఆకొనసాగుతున్నది. ద్వేషాన్ని వెదజల్లే మెస్సేజ్ లను వ్యాప్తి చేస్తే ఆయా గ్రూప్ ల అడ్మిన్ లనే అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి, ఏ గ్రూప్ సభ్యుడు సోనియా, రాహుల్, నరేంద్ర మోడీ, కేజ్రీవాల్, లేదా ,మరే రాజకీయ నాయకుడి లేదా రాజకీయ పార్టీ ఫోటోను ఫార్వార్డ్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పూణే, ముంబై, చెన్నై, ఢిల్లీ లలో ఇప్పటికే 260 మందికి పైగా గ్రూప్ అడ్మిన్లను జైలుకు పంపారు. సైబర్ నేరం పోలీస్ విభాగాలు అన్ని గ్రూప్ ఫోల్డర్‌లను చూడటం ప్రారంభించాయి. మత, రాజకీయ, సామాజిక వ్యవస్థ లేదా చెడు చిత్రాలు లేదా వీడియోలను ఎగతాళి చేసే సందేశాలను పోస్ట్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

వ్యక్తిగత వివరాలు, వ్యక్తిగత, జాతీయత, మతం, శాఖ, రాడికల్, కస్టమ్స్ , భౌగోళిక ప్రాంతాలకు సంబంధించిన ఎలాంటి హానికరమైన సందేశాన్ని కూడా పంపవద్దని స్పష్టం చేస్తున్నారు. ఇది చట్టం ప్రకారం నేరం. ముంబైలో సైబర్ నేరం వీడియో, ఫోటోను పంచుకున్న వాట్సాప్ గ్రూపులోని 36 మంది సభ్యులను అరెస్టు చేశారు.

పైగా, ఇది నాన్-బెయిలబుల్ నేరం, దీనికి 7 సంవత్సరాల శిక్ష ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రజలు హిందువులు మరియు ముస్లింలపై వాట్సాప్లో వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారని పేర్కొంటూ
మతం, మత సమూహాలపై * తప్పు వ్యాఖ్యలు చేసే వ్యక్తిని గుర్తించడానికి ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ లు తెలిపారు.

సిఆర్‌పిసి సెక్షన్ 44-58 కింద చర్యలు తీసుకోవడం, అతని ఐపి చిరునామాలను గుర్తించడం ద్వారా అతని ఇల్లు గుర్తించి, అతన్ని ఎటువంటి వారంటీ లేకుండా అరెస్టు చేస్తారని హెచ్చరిస్తున్నారు. అలాంటి సందేశాలు సమూహంలో ఉంటే గ్రూప్ అడ్మిన్లకు సెక్షన్ 59 వర్తించబడుతుందని తెలిపారు.

Actress Pallavi Dora New Stills

బీహార్ లో బిజెపికి వణుకు పుట్టిస్తున్న నితీష్

మరో ఎనిమిది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ లో ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు బిజెపికి వణుకు పుట్టిస్తున్నది. వరుసగా ఒకొక్క రాష్ట్రంలో ఓటమి చెందుతూ వస్తున్న బీజేపీతో జత కొనసాగితే తనకు ఓటమి తప్పదనే నిర్ణయానికి నితీష్ వచ్చారా అనే అనుమానాలు వారికీ కలుగుతున్నాయి.

హఠాత్తుగా అసెంబ్లీలో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా నితీష్ తీర్మానం తీసుకువచ్చి ఆమోదింప చేయడం బిజెపికి మింగుడు పడటం లేదు. ఈ తీర్మానం విషయం తమకు చివరి నిమిషం వరకు తెలియదని బిజెపి ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను ప్రధాన ఎన్నికల నినాదం చేసుకోనున్న బిజెపికి నితీష్ తీసుకున్న వైఖరి మింగుడుపడడం లేదు. రానున్న రోజుల్లో నితీష్ మళ్లీ మహాకూటమి పంచన చేరతారా అనే ఊహాగానాలు ఉపందుకొంటున్నాయి. ఈ తీర్మానం తర్వాత 2015లో వలే జెడియు, ఆర్జేడీ లతో కలసి ఈ సారి కూడా కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది.

ఇవ్వన్నీ గాక ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ తో ఈ వారం వరుసగా రెండు సార్లు నితీష్ సమావేశం కావడం బిజెపికి కలవరం కలిగిస్తున్నది. 2017లో ఆర్ జె డి తో పొత్తు తెంచుకున్న తర్వాత తేజస్విని విడిగా నితీష్ కలవడం ఇదే కావడం గమనార్హం.

గురువారం అసెంబ్లీ స్పీకర్ విజయ్ చౌదరి కార్యాలయంలో ముఖ్యమంత్రితో తేజస్వి భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక సందర్శనగా తేజస్వి అభివర్ణిస్తున్నప్పటికీ దీని వెనుక తెరచాటు మంత్రాంగమేదో ఉందని బిజెపి అనుమానిస్తోంది.నితీష్, తేజస్వి మధ్య భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియరానప్పటికీ తేజస్వి మాత్రం ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం మాత్రం చేశారు.

అమిత్ షాను అరవింద్ కేజ్రీవాల్ కలవగా లేంది తాను నితీష్‌జీని కలిస్తే తప్పేంటని ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. తాను మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిశానని, ఇందులో వేరే అంతరార్థం వెతకవద్దని ఆయన కోరారు.

దాదాపు మూడేళ్ల అనంతరం నితీష్, తేజస్వి మధ్య మొదటిసారి సమావేశం గత మంగళవారం నితీష్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించిన రోజున ముఖ్యమంత్రి ఛాంబర్‌లో జరిగింది. ఈ భేటీతో మళ్లీ నితీష్ తన పాత దోస్తీని సమీప భవిష్యత్తులో పునరుద్ధరించుకుంటారన్న ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది.

జెడియు, ఆర్‌జెడి మధ్య మరోసారి పొత్తు సాధ్యం కాదని ఆర్‌జెడి వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆ అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతోంది. నితీష్ కుమార్ లౌకిక వైఖరిని ఎవరం ప్రశ్నించలేమని, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తొలి ఎన్‌డిఎ రాష్ట్ర ప్రభుత్వం బీహార్ అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అవధేష్ సింగ్ చెప్పారు. సహజంగానే కాంగ్రెస్ నేతల ప్రకటనలు బిజెపి ఎమ్మెల్యేలలో కలవరం పుట్టిస్తున్నాయి.

మురళీధర్ బదిలీపై మాజీ సీజేఐ కీలక వ్యాఖ్యలు


ఢిల్లీ అల్లర్లు హింసాత్మకంగా మారి అనేకమందిని బలితీసుకుంటున్న సమయంలో సిఏఏ నిరసనకారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయుకలు అనురాగ్ శర్మ, పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని తప్పుబట్టి, వెంటనే ఆ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టుకి బదిలీ అయిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ విషయమై రాజకీయదుమారం రేగింది. అయన బదిలీ పై స్పందించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కె జి బాలకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా.. వ్యవహరించాల్సింది అని బాలకృష్ణన్ అన్నారు. దేశంలో పరిస్థితి చాలా అస్థిరంగా ఉన్నప్పుడు మరియు మీడియా, దేశ ప్రజలు చురుకుగా ఉన్నప్పుడు.. అర్ధరాత్రి బదిలీ ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రజలు వేరే విధంగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు భిన్నంగా అర్థం చేసుకోగలరు అని మాజీ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసును జస్టిస్ మురళీధర్ స్వయంగా తీసుకోలేదని ఆ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి ఎన్ పటేల్ సెలవులో ఉన్నందున, అతను మూడవ సీనియర్ న్యాయమూర్తి కావడంతో, ఈ కేసును విచారించిన ప్రత్యేక ధర్మాసనానికి జస్టిస్ మురళీధర్ నేతృత్వం వహించారు. జస్టిస్ మురళీధర్ ను మరుసటి రోజు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో చేరమని కోరినట్లు తాను భావించడం లేదని మాజీ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ అన్నారు.సాధారణంగా అటువంటి బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడినప్పుడు, బదిలీ చేసిన న్యాయమూర్తి కొత్త పోస్టింగ్ కోసం తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఏడు రోజుల సమయం ఇవ్వబడుతుందని జస్టిస్ బాలకృష్ణన్ తెలిపారు.

ఇక ఈ బదిలీపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కేసుతో ఈ బదిలీకి సంబంధం లేదని పేర్కొంది. ఇక మురళీధర్ బదిలీకి సిఫారసు ఇప్పటికే సుప్రీంకోర్టు కొలీజియం చేసిందని న్యాయమూర్తి కూడా తన సమ్మతిని తెలియజేశారని పేర్కొంది.

రఫ్పాడిస్తానంటున్న పాయల్

తెరపై బోల్డ్ గా కనిపించే పాయల్‌ రాజ్‌పుత్‌ తొలిసారి ఛాలెంజిగ్ రోల్ చేస్తోంది. ‘ఆర్‌ఎక్స్‌-100’లో పాయల్ నటనకు కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో యువతలో ఆమెకు భారీ ఫ్యాన్ పాలోయింగ్ ఏర్పడింది. తొలినాళ్లలో గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన తాజాగా నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. ప్రణదీప్ దర్శకత్వంలో పాయల్ తాజాగా ఓ మూవీ చేస్తుంది. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ మిస్టరీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీలో పాయల్ తొలిసారి ఐపీఎస్ అధికారిగా కనిపించబోతుంది. నేరాలకు పాల్పడే వారిని రఫ్పాడించేందుకు పాయల్ సిద్ధమవుతుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

కైవల్య క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణదీప్ తెరక్కిక్కిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ వద్ద ప్రణదీప్ పలు చిత్రాలకు పని చేశాడు. పాయల్ ఇమేజ్ మార్చేలా ఆమె క్యారెక్టర్ ను దర్శకుడు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా సినిమా ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. మార్చి నెలాఖరుకు సినిమా పూర్తి చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మార్చి 4న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

పారామౌంట్ స్టూడియోలో అగ్నిప్రమాదం

తమిళలోని పెరంబూరు షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల రూ. 20లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. సాలిగ్రామంలోని వేలాయుధం కాలనీలో పారామౌంట్‌ స్టూడియో ఉంది. ఇందులో సినిమా, టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లు రెగ్యూలర్ గా జరుగుతుంటాయి. ఇందుకోసం అవసరమైన సెట్స్‌ను పర్మినెంట్‌గా ఏర్పాటు చేశారు.

ఈక్రమంలోనే పారామౌంట్‌ స్టూడియో శుక్రవాం ఉదయం సినిమా సెట్‌కు సంబంధించిన వస్తువుల నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన వాచ్‌మెన్‌ వెంటనే అగ్నిమాపక దళ కార్యాలయానికి సమాచారం అందించాడు. సకాలంలో ఫైరింజన్లు ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే అక్కడ వేసిన సెట్, సామాన్లు ప్రమాదంలో దగ్ధమైనట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఇటీవలే ఇండియన్-2 సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో క్రేజ్ విరిగి కిందపడటంతో ముగ్గురు మృతిచెందగా పదిమంది గాయాలపాలయ్యారు. దర్శకుడు శంకర్, హీరో కమలాహాసన్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటన గడువకముందే మరో ప్రమాదం జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణనష్టం ఏమి జరగకపోవడంతో అంత ఊపిరి పిల్చుకున్నారు. ఇప్పటికైనా షూటింగ్ నిర్వాహాకులు ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని సినీప్రియులు కోరుతున్నారు.

‘కరోనా’పై యుద్ధం ప్రకటించిన కిమ్!

చైనాలో పుట్టిన కరోనా రక్కసి ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తుందో.. అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఈ వైరస్ ఉత్తర, దక్షిణ కొరియా దేశాలను వణికిస్తోంది. దక్షిణకొరియా ఉపాధ్యక్షురాలికే ఈ వైరస్ సోకడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. దక్షిణ కొరియా కి వచ్చిన కరోనా.. ఉత్తర కొరియా లో కూడా అడుగు పెట్టె అవకాశాలు ఉండటంతో.. ఆ దేశ అధికారులు అప్రమతం అయ్యారు. ఈ క్రమంలో ఆ దేశ అధికారులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక వేళా ఈ వైరస్ ను ఆపడంలో ఉత్తరకొరియా అధికారులు విఫలం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.

చీమ కూడా తమ బార్డర్ దాటి లోపలి రావడానికి వీల్లేదు అని కిమ్ అధికారులకు తెలిపారు. అయితే కరోనా విషయం లో అజాగ్రత్త ఉన్నారని ఆరోపణలు రావడంతో అక్కడి అధికార వర్కర్స్ పార్టీ వైస్ ఛైర్మన్ రీ మాన్ గోన్, పాక్ తే డొక్ ను వారి పదవుల నుండి ఇప్పటికే తప్పించారు కిమ్.

చైనాలో వెలుగుచూసిన ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు వ్యాపించింది. చైనా తర్వాత అత్యధికంగా కరోనా వైరస్ కేసులు దక్షిణ కొరియాలో నమోదుకావడం ఆ దేశం మరింత కలవరపడుతోంది. కరోనా బాధితుల సంఖ్య 2,931కి చేరింది. చైనాలో కరోనా కేసుల సంఖ్య 79,251కి చేరింది.

చిరంజీవి ఇంటి ముందు ఉద్రిక్తత!


ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. జగన్ మూడు రాజధానుల ప్రకటనకు చిరంజీవి మద్దతు తెలపడంతో అమరావతి జేఏసీ నాయకులు ఆయన ఇంటి ముట్టడికి ప్లాన్ చేశారు. దీంతో పోలీసులు చిరు ఇంటి ముందు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. నివాసం దరిదాపుల్లోకి ఎవరినీ రాకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున చిరు నివాస ప్రాంతానికి చేసుకున్నారు. చిరంజీవికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. మెగాస్టార్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు.

గతంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంటి దగ్గర కూడా టెంట్లు వేసి అమరావతి రైతులు ఆందోళనలు నిరసన దీక్షలు చేపట్టారు. ఏపీ రాజధాని అంశంపై మహేష్ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే చిరు మాత్రం జగన్ మూడు రాజధానుల ప్రకటనకు చిరంజీవి మద్దతు పలికిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను ఆయన స్వాగతించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం కాబట్టి మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని చిరంజీవి కోరారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేలా జీఎన్ రావు కమిటీ సిఫార్సులు ఉన్నాయని చిరంజీవి అభిప్రాయపడ్డారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని గుర్తు చేసిన చిరంజీవి. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే.. ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయన్నారు.

అయితే చిరంజీవి ఇంటి ముట్టడికి అమరావతి జేఏసీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు మీడియా కి తెలిపారు

పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ సిద్ధం..!

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘వకీల్ సాబ్ ‘(వర్కింగ్ టైటిల్ ) మూవీ మే 15 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న PSPK 26 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న PSPK 26 మూవీ టైటిల్, పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మార్చి 2 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ మార్చి 8 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న PSPK 26 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అదిరిపోయిన ‘కోబ్రా’ ఫస్టు లుక్


చియాన్ విక్రమ్ తాజాగా నటిస్తున్న మూవీ ‘కోబ్రా’. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్కును చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘కోబ్రా’ ఫస్టు లుక్కుతోనే విక్రమ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాడు. ఏడు విభన్న గెటప్ లతో ఉన్న విక్రమ్ ఫస్టు లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ‘కోబ్రా’ కొత్త గెటప్స్ వైరల్ గా మారుతున్నాయి.

వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు విక్రమ్ ఎల్లప్పుడు ముందుంటాయి. సరికొత్త గెటప్పులతో విక్రమ్ ‘అపరిచితుడు’, ‘ఐ’ సినిమాల్లో నటించి మెప్పించాడు. ‘అపరిచితుడు’లో విక్రమ్ ట్రిపుల్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెల్సిందే. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా ‘కోబ్రా’ మూవీ తెరకెక్కుతుంది. విక్రమ్ ఏడు విభిన్న గెటపుల్లో కనిపించనున్నట్లు సమాచారం.

‘కోబ్రా’లో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి నట్టిస్తుంది. ఇర్ఫాన్ పటాన్, ఆనంద్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ బాణీలను సమకూరుస్తున్నాడు. ఈ మూవీని 7 స్ర్కీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్.లలితకుమార్ నిర్మిస్తున్నారు. ‘కొబ్రా’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీని వేసవిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

ఏడేండ్ల కనిష్ఠానికి జీడీపీ, 6 నెలల కనిష్ఠానికి రూపాయి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో వరుసగా మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో కూడా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు క్షీణించింది. 4.7 శాతానికి పతనమై దాదాపు ఏడేండ్ల కనిష్ఠస్థాయికి దిగజారింది. మరోవంక, స్టాక్‌ మార్కెట్ల భారీ పతనంతో మారకం విలువ ఆరు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థలో ‘నిలకడ’ శుభసూచకమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

2012-13 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికం (జనవరి-మార్చి) తర్వాత ఇదే అత్యల్ప వృద్ధిరేటు. ఆ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 4.3 శాతంగా నమోదైంది. తయారీ రంగంలో ఉత్పత్తి తగ్గడమే తాజా పతనానికి ప్రధాన కారణమని శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. గత ఆర్థిక సంవత్సర (2018-19) మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.6 శాతంగా నమోదైంది.

అయితే వ్యవసాయ రంగంలో ఏడాది క్రితం 2 శాతంగా నమోదైన వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో 3.5 శాతానికి పెరిగింది. అలాగే ఈ వృద్ధిరేటు ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, ప్రొఫెషనల్‌ సర్వీసుల రంగంలో 6.5 శాతం నుంచి 7.3 శాతానికి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, డిఫెన్స్‌, ఇతర సేవల రంగాల్లో 8.1 శాతం నుంచి 9.7 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో 6.3 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 5.1 శాతానికి క్షీణించిం

ఈక్విటీ మార్కెట్లు కుదేలవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో రూపాయి కరెన్సీ వరుసగా ఆరో రోజు 63 పైసలు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.24 వద్ద నిలిచింది. 71.90 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఇంట్రాడేలో 72.29 కనిష్ఠ స్థాయిని తాకింది.

సెప్టెంబర్‌ 13, 2019 తర్వాత రూపాయికి ఇదే భారీ పతనం. కరోనా వైరస్‌ భయాలు ఫారెక్స్‌ మార్కెట్లకు చుట్టుకున్నాయని, ఫలితంగా దేశీయ కరెన్సీతోపాటు ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని ఫారెక్స్‌ డీలర్‌ వెల్లడించారు.

శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ ఫస్ట్ లుక్..

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునయన నాయిక. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పేరును, ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే పేరును నిర్ణయించారు. ‘హసిత్ గోలి’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం అవుతున్నారు.

 

రేవంత్ కి ప్రాణహాని..! కెసిఆర్ పై అనుమానంతో..?


మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌‌‌‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం, మంత్రులు, పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కాబట్టి తనకు 4 ప్లస్‌‌‌‌ 4 గన్‌‌‌‌ మెన్‌‌‌‌ లతో పాటు ఎస్కార్ట్‌‌‌‌ కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో రిట్ వేశారు రేవంత్‌‌‌‌.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనకు 3ప్లస్‌‌‌‌3 సెక్యూ రిటీ ఉండేదని, తర్వాత 2ప్లస్‌‌‌‌2కు తగ్గించారన్నారు. 2018 ఎన్నికల సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు 4ప్లస్‌‌‌‌4కు పెంచినా, మళ్లీ 2ప్లస్‌‌‌‌2కు తగ్గించేశారని చెప్పారు. దీంతో 2019 ఆగస్టులో కేంద్రానికి సెక్యూరిటీ పెంచాలని దరఖాస్తు చేసుకున్నానని, అది పరిశీలనలో ఉందని జవాబు వచ్చిందని, ఆ దరఖాస్తును ఆమోదించి భద్రత కల్పించేలా కేంద్ర హోంశాఖకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న భూ దందా వ్యవహారం పై పోరాటం చేస్తున్నాను. ఈ క్రమంలో కోట్ల రూపాయల విలువైన భూములను జూపల్లి రామేశ్వరరావుకు కట్టబెట్టడం పై తాను పోరాటం చేశానని, ఈ నేపథ్యంలో తన ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిట్ పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్ భల్లా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావులను ప్రతివాదులుగా చేశారు.

Raahu Movie Success Meet

Kriti Garg Photo Stills

Hit Movie Success Celebration Photos