ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కు మద్రాసు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ప్రకాశ్ రాజ్ ఇటీవల ఒక ఫైనాన్సియర్ కు చెక్కు ఇవ్వగ బౌన్స్ కావడంతో సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించినట్లు తెల్సింది. దీంతో మద్రాస్ హైకోర్టు ప్రకాశ్ రాజ్ కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 2లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
ప్రకాశ్ రాజ్ తన విలక్షణ నటనతో అన్ని భాషల్లో నటిస్తూ బీజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా రాణించాడు. ప్రకాశ్ రాజ్ ఇటీవల నడిగర్ అనే మూవీ నిర్మించాడు. ఈ మూవీ కోసం ఓ బడా ఫైనాన్సియర్ వద్ద ఐదు కోట్లు అప్పు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇటీవల సదరు ఫైనాన్షియల్ డబ్బులు అడుగగా ప్రకాశ్ రాజ్ చెక్ ఇచ్చినట్లు తెల్సింది. ఈ చెక్కును సదరు వ్యక్తి బ్యాంకులో వేయగా బౌన్స్ అవడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో మద్రాసు హైకోర్టు ప్రకాశ్ రాజ్ కు సమన్లు జారీ చేసింది.
‘సరిలేరునికెవ్వరు’ మూవీలో ప్రకాశ్ రాజ్ నటించారు. మహేష్ బాబుకు ధీటుగా ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన సంగతి తెల్సిందే. ఇటీవల ప్రకాశ్ రాజ్ ఓ ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానింకా ‘సరిలేరునికెవ్వరు’ మూవీని చూడలేదని చెప్పారు. తనకు సినిమాలు చూసే అలవాటు తక్కువని చెప్పడం గమనార్హం.