టాలీవుడ్లో వరుసగా పీరియాడికల్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో హీరోలంతా పీరియాడికల్ మూవీలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో పీరియాడికల్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ కోవలోనే మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ తాజాగా ఓ పిరియాడికల్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘బిందాస్’, ‘రగడ’ చిత్రాలను దర్శకుడు వీరుపోట్ల ఈ పీరియాడికల్ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’లో నటిస్తున్నాడు. పెళ్లంటేనే నో అనే పాత్రలో కన్పించబోతున్నాడు. తేజుకు జోడిగా నభా నటేష్ నటిస్తుంది. యూత్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రోమాంటిక్ లవ్ స్టోరీస్ గా దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీకి బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వాలంటెన్స్ డేకు చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఈ మూవీని మే 1న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది.
ఈ పీరియాడికల్ మూవీని భారీ బడ్జెట్లో తెరకెక్కనుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలాన్ని గుర్తుతెచ్చేలా సినిమా ఉండనుందని సమాచారం. ఈ మూవీ కోసం భారీ సెట్లను కూడా వేస్తున్నారని సమాచారం. ఇటీవలే ‘ప్రతీరోజూ పండగే’ మూవీతో మళ్లీ సక్సస్ బాటపట్టారు. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్న తేజు త్వరలో పీరియాడికల్ మూవీతో కనువిందు చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు.