Home Blog Page 8573

భారత్ లో 492కు చేరిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 8:45 గంటల వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 492కు చేరుకుంది. అంటే గత 24 గంటలలో సుమారు 100 కేసులో కొత్తగా నమోదయ్యాయి.

కాగా, 36 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు. దేశంలో 25 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు జరుపుతున్నారు.

ఈశాన్య రాష్ట్రాలలో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ యువతి ఇటీవలే యూకే నుంచి వచ్చింది.

మహారాష్ట్రలో అత్యధికంగా ఈ కేసుల సంఖ్య 101కు చేరుకుంది. కేరళలో 95 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 37, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ లలో 33 చొప్పున, ఢిల్లీలో 31 చొప్పున నమోదయ్యాయి. ఢిల్లీలో గత 24 గంటలలో కొత్తగా ఒక కేసు కూడా నమోదు కాలేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసేందుకు కుటుంబం నుంచి ఒక్కరే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దులను ఇప్పటికే పోలీసులు మూసేశారు. కరోనా కట్టడికి అన్ని రాష్ర్టాల సీఎంలు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కరోనా ఎఫెక్ట్.. వాహనదారులపై కొరడా

కరోనా మహమ్మరి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈనెల 31వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఎవరైతే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపై ప్రభుత్వం యంత్రాంగం కొరడా ఝుళిపిస్తోంది. అవనసరంగా రోడ్లపై వచ్చేవారిని పోలీసులు క్లాస్ తీసుకుంటున్నారు. వారిని తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. అలాగే వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారికి జరిమానాలతోపాటు సీజ్ చేస్తున్నారు. సోమవారం ఒకేరోజు 3వేలకు పైగా వాహనాలను సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం అందరికీ అర్థమయ్యేలా తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం-2005, అంటువ్యాధుల(నియంత్రణ) చట్టం-1897 కింద లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. దేశంలోని 75జిల్లాలో కేంద్రం లాక్డౌన్ చర్యలు తీసుకుంటుంది. ఇందులో తెలంగాణలోని ఐదు జిల్లాలు, ఏపీలోని మూడు జిల్లాలు ఉన్నాయి.

హైదరాబాద్ నగరంలోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. సరూర్‌నగర్‌ పీఎస్ లోని కొత్తపేట చౌరస్తాలో సరైన కారణాలు లేకుండా బయటకు వచ్చిన ఐదు కార్లను, ఎనిమిది ద్విచక్రవాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రాజేంద్రనగర్ రోడ్లపై బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్న వారితో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలతో ప్రజలకు ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది.

జాతికి మోడీ మరో సందేశం


కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న ప్రయత్నాలపై, కోవిద్-19 యొక్క ప్రమాద ఘటికలకు సంబంధించిన కీలకమైన అంశాలపై 2020 మార్చి 24న (ఈ రోజు) రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇదే విషయాన్ని మోడీ ట్వీటర్ వేదికగా తెలియజేసారు.

మార్చి 19 న మునుపటి ప్రసంగంలో, జనతా కర్ఫ్యూను ప్రకటించినప్పుడు, కరోనావైరస్ పై పోరాడటానికి “సంకల్పం మరియు నిగ్రహం” కలిగిఉండాలని దాదాపు 30 నిమిషాల పాటు జాతీయ ప్రసారంలో మాట్లాడిన మోడీ మరలా ఈ రోజు కరోనావైరస్ యొక్క ప్రమాద ఘటికలను వెల్లడించనున్నారు.

వీలైనంత వరకు ఇంటి లోపలే ఉంటూ పని చేయమని పిఎం మోడీ ప్రజలను కోరారు. ప్రపంచం ఇంతటి ఘోరమైన సంక్షోభాన్ని ఇంతవరకు చూడలేదని అన్నారు.

“మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండవ ప్రపంచ యుద్ధాలు కూడా కరోనావైరస్ చేసినంత ఎక్కువ దేశాలను ప్రభావితం చేయలేదు” అని మోడీ చెప్పారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను తీవ్రంగా దెబ్బతీసినప్పుడు ఈ వ్యాధి భారతదేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేయదు అనే ఈ మనస్తత్వాన్ని నివారించమని ప్రజలను కోరారు.

ఆదివారం మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున వైద్య నిపుణులు, పారిశుధ్య సిబ్బంది, విమానయాన సిబ్బంది, డెలివరీ వ్యక్తులు మరియు మీడియా సిబ్బంది కృషిని ప్రశంసించిన పిఎం మోడీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చేతులతో చప్పట్లు కొడుతూ ఐదు నిమిషాల స్టాండింగ్ మర్యాదలు ఇవ్వడం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రజలను కోరారు.

జనతా కర్ఫ్యూ తరువాత, కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా సుదీర్ఘ యుద్ధానికి ఇది ప్రారంభం మాత్రమే అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు, ఎందుకంటే స్వీయ-పరిమితి కోసం ఆయన చేసిన విజ్ఞప్తికి ప్రజలు అధికంగా స్పందించినందుకు ఆయన ప్రశంసించారు. దేశస్థులు కలిసి ఏ సవాలునైనా ఓడించగలరని అన్నారు.

కారోన వైరస్ మహమ్మారిని పరిష్కరించడానికి ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేయడానికి సార్క్ నాయకుల వీడియో సమావేశంలో తెలిపారు.

దేశంలో మంగళవారం మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 500 దాటింది.అందులో తొమ్మిది మంది చనిపోయారు.

రాజ్యసభ ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్ కారణంగా ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు భారత ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తామనేది మార్చి 31 తర్వాత వెల్లడిస్తామని వెల్లడించింది.

రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 17 రాష్ట్రాలలో 55 రాజ్యసభ స్థానాలకు 26న ఎన్నికలు జరుగవలసి ఉంది. కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం కూడా అప్రమత్తమైంది.

జన సమూహం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్న క్రమంలో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రజారోగ్యం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జన సమూహం అధికంగా ఉంటుంది. ఆ సమూహంలో ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా.. అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కనుక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

బ్రేకింగ్ న్యూస్: రాత్రి 8గంటలకు మోడీ ప్రసంగం

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ రాత్రి 8గంటలకు ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని మోదీ ట్వీటర్లో ట్వీట్ చేశారు. దీంతో ప్రధాని ఎలాంటి విషయాలపై మాట్లాడబోతున్నారనే ఆసక్తి నెలకొంది. గడిచిన ఆదివారం ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. దీనికి దేశ ప్రజలంతా మద్దతు తెలిపారు. అయితే ఆ తర్వాత కేంద్రం విధించిన లాక్డౌన్ చర్యలు విఫలమవుతున్న నేపథ్యంలో ప్రధాని మరోసారి తన ప్రసంగంలో కీలక విషయాలను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

దేశ ప్రధాని ఈ వారంరోజుల్లో జాతినుద్దేశించి ప్రసంగించడం రెండోసారి. దేశంలో కరోనా పరిస్థితి తీవ్ర రూపం దాల్చకుండా కేంద్రం పకడ్బంధీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దేశంలోని 75జిల్లాలో లాక్డౌన్ చర్యలు చేపట్టాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా విమాన, రైళ్ల సర్వీసులకు ఎక్కడికక్కడ నిలిపివేసింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహానిస్తూ కరోనా కట్టడికి తగు జాగ్రత్తలను తీసుకుంటుంది.

జనతా కర్ఫ్యూ కు ప్రజలు విశేషంగా మద్దతునిచ్చారు. ఆ తర్వాత నుంచి ప్రజలంతా ఒక్కసారి రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సహకరించకపోవడంతో ప్రధాని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే కేంద్రం కఠిన చర్యలకు పూనుకుంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలు ఇళ్లలోనే ఉండాలనే అనసరంగా రోడ్లపై రావద్దని సూచిస్తుంది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు పూనుకుంటుంది.

ద్విచక్ర వాహనాలపై ఒకరి, ఫోర్ వీలర్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని సూచిస్తుంది. సామాజిక దూరం పాటించాలని సూచిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించిన వారిపై కేసులు పెట్టేందుకు వెనుకడటం లేదు. అలాగే వాహనాలను సీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాని మరోసారి జాతినిద్దేశించి ప్రసంగించనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

లాక్‌డౌన్‌ ను ప్రభుత్వం సమర్థించదు: కేటీఆర్

లాక్‌డౌన్‌ తో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్వీటర్లో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ చర్యను ప్రభుత్వం సమర్ధించదని.. కానీ ప్రస్తుత అసాధారణ పరిస్థితులతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలు అరుదుగా జరుతాయన్నారు. కరోనా మహమ్మరిని అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ చేపట్టిందని తెలిపారు.

మార్చి31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రజలంతా ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్‌ అంతమయ్యే వరకు స్వీయ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ‘నువ్వు బ్రతకుతూ.. తోటివారికి బ్రతికే అవకాశమివ్వాలని’ ఆయన అన్నారు. స్వీయనియంత్రణ పాటించడమే ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు.

తెలంగాణలో ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దన్నా. కరోనాపై ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలన్నారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి వెళ్లాలన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. లాక్‌డౌన్‌ చేసిన జిల్లాలో తెల్లరేషన్ కార్డు దారులకు రూ.1,500 ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు సహకరిస్తే కరోనా వైరస్ కట్టడి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

https://twitter.com/KTRTRS/status/1242011655866703877

లాక్‌డౌన్ పై నేడు సీఎం సమీక్ష

కరోనా ఎఫెక్ట్ తో భారత్ లో కేంద్రం లాక్‌డౌన్ చర్యలను చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించింది. దీంతో ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార యంత్రాంగం సీఎం కేసీఆర్ ఆదేశాలతో పకడ్బంధీ చర్యలు తీసుకుంటుంది. లాక్‌డౌన్ పై అధికారులు తీసుకున్న చర్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు సమీక్షించనున్నారు.

ఆదివారం ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుకు ప్రజలంతా మద్దతు తెలిపారు. ఎవరికీ వారు ఇళ్లకు పరిమితమై సంఘీభావం తెలిపారు. అయితే సోమవారం నాటికి ప్రజలంతా రోడ్లపై రావడంతో పరిస్థితి గందరగోళానికి దారితీసింది. దీంతో ఆయా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ అమలుపై కఠిన చర్యలు తీసుకుంటుంది. మంగళవారం నాటికి లాక్‌డౌన్ రెండోరోజుకు చేరింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రగతిభవన్లో నిర్వహించే సమావేశంలో వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరా, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులు పాల్గొననున్నారు.

కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ వల్ల కలిగే ఇబ్బందులను ఈ సమీక్షలో ప్రధానంగా చర్చిస్తారు. అనంతరం ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిసింది. సాయంత్రం విలేకరుల నిర్వహించి వివరాలను సీఎం వెల్లడించనున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైతే మంచిదని పలువురు సూచిస్తున్నారు.

కరోనా కి మందు మన దగ్గరే ఉందా !

చైనా లోని వుహాన్ లో మొదలైన కోవిడ్ 19 మహమ్మారి ఇపుడు ఇటలీ దేశాన్ని వణికిస్తోంది. అక్కడ మనుషులు ఎవ్వరూ ఊహించని ఊహించని విధంగా విపత్తు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా ఇటలీలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ వైరస్ మొదలయిన చైనా దేశాన్ని దాటేసి ఇక్కడ రికార్డు స్థాయి మరణాలు నమోదు కావడం ఒకింత భయాన్ని కలిగిస్తోంది..చైనా లో ఇంతవరకు 81,496 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 3,153 మంది మరణించారు. కాగా ఇపుడు చైనా లో కరోనా భాదితులు సంఖ్యా గణనీయంగా తగ్గింది నిన్న కేవలం ఒక 40 మంది మాత్రమే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇటలీ లో నిన్నసోమవారం ఒక్క రోజు 700 మరణాలు సంభవించాయి.కాగా 4,789 మంది కొత్త గా కరోనా వ్యాధి బారిన పడ్డారు. దీంతో మొత్తం కరోనా వ్యాధిన పడ్డ వారి సంఖ్య 63, 927కి చేరింది ఇక ఈ విపత్తు ఆరంభం అయిన నాటి నుంచి నేటి వరకు ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 6,077 కు చేరుకుంది.

ఇంత విపత్తులో కూడా ఇటలీలో ఆశ్చర్యకరంగా ఒక అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. మాములుగా కరోనా వైరస్ ప్రభావం యుక్త వయసులో ఉన్న వారి కంటే వయసు మళ్ళిన వారికే అత్యంత ప్రభావాన్ని చూపు తుంది. కానీ ఇటలీలో ఆశ్చర్యకరంగా ఒక 90 ఏళ్ల ముసలావిడ కరోనా నుంచి కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అదెలా సాధ్యం అయిందని ఆలోచిస్తే సదరు వృద్ధ మహిళ ఎక్కువగా ఎండలో సంచరించడం వల్ల ఆమెలో వ్యాధినిరోధక శక్తి బాగా వృద్ధి చెంది త్వరగా కోలుకొందని తేలింది. .

ఆ సంఘటన తో కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోడానికి ప్రకృతి నుంచే ఒక ఊహించని మందు మన కళ్ళ ముందు ఉందని వారు తెలుసు కొన్నారు. సమస్త విశ్వానికి వెలుగును పంచే సూర్య కాంతి నుంచి వచ్చే “డి” విటమిన్ వల్ల కరోనా బాధ కి కొంత ఉపశమనం ఉందని తెలిసింది ఇది పూర్తిగా కరోనా వ్యాధికి విరుగుడు కాదు గాని ఎంతో కొంత మేలు మాత్రం ఉందని రూడీ అయ్యింది. అందుకే ప్రతీ రోజు అరగంట పాటు ఉదయం వచ్చే సూర్య కాంతిని ఆస్వాదిస్తే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు.

ఒలింపిక్స్‌ వాయిదాకు తప్పని పరిస్థితులు

కరోనా సమస్య తీవ్రతరం కావడంతో మే లో జపాన్ లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని ప్రపంచ వ్యాప్తంగా వత్తిడి వస్తున్న దృష్ట్యా అనుకున్న విధంగానే జరుపుతామని ఇప్పటి వరకు పట్టుబడుతున్న జపాన్, ఒలింపిక్స్‌ సమాఖ్య సహితం ఇప్పుడు మెత్తబడి వాయిదాకు సిద్ధం అన్న సంకేతం ఇచ్చారు.

తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు గాని మొత్తం మీద పోటీల రద్దు జరిగే ప్రసక్తి లేదని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య తేల్చి చెప్పింది. ఇప్పటికే పలు దేశాలు ఒలింపిక్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించడంతో దిగిరాక తప్పడం లేదు. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి.

అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ తదితర దేశాలు కూడా ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య కూడా క్రీడలను వాయిదా వేయడానికి సిద్దపడవలసి వస్తున్నది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవంక ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ ప్రశ్నార్థకంగా మాడడంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. వీటి కోసం సంవత్సరాల తరబడి సిద్దపడుతుంటే ఇప్పుడు వాయిదా ఏమిటని విస్తు పోతున్నారు.

ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియాలు తమ అథ్లెట్లను టోక్యో ఒలింపిక్స్‌కు పంపేది లేదని స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్‌ను నిర్వహించాలని భావించామని, అయితే క్రీడల కంటే పోటీల్లో పాల్గొనే అథ్లెట్ల ఆరోగ్యమే తమకు ముఖ్యమని జపాన్ ప్రధాని షింజో అబె ప్రకటించడం గమనార్హం.

క్రీడాకారుల ప్రాణాలను పనంగా పెట్టి పోటీలను నిర్వహించాలనేది తమ ఉద్దేశం కాదని ప్రధాని స్పష్టం చేశారు. ఈ విషయంలో సభ్య దేశాలు, ఒలింపిక్స్ సమాఖ్యతో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సందట్లో సడెమియా.. అటకెక్కిన సిఏఏ నిరసనలు

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్, తీవ్రమైన ఆంక్షలు, భయానక పరిస్థితుల మధ్య పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) నిరసనలు ఆటకెక్కాయి. ఇప్పటి వరకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి కారోన వైరస్ వల్ల ప్రజలలో నెలకొన్న భయానక పరిస్థితులు అందవేసిన చేయిగా భావిస్తున్నాయి.

దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా.. కఠిన చర్యలు తప్పవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో షాహిన్ బాగ్ ఏరియాలో ఆందోళన చేస్తున్న  ఉద్యమకారులను బలవంతంగా పోలీసులు తొలగించారు. పోలీసు అధికారుల బృందం మంగళవారం ఉదయం నిరసన స్థలానికి చేరుకుని నిరసనకారులను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరారు. టెంట్లు, ఇతర సామగ్రిని నిరసన స్థలం నుండి తొలగిస్తున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

మార్చి 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని, నిరసనకారులు ఒకరికొకరు మూడు మీటర్ల దూరంలో కూర్చోవాలని  ఆదేశించారు. అలాగే  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం మైక్రోఫోన్ వాడకూడదని  కూడా హెచ్చరించారు.

అలాగే మరోవైపు నిరసనకారులను వెంటనే తొలగించాలని కోరుతూ చేసిన పిటిషన్ విచారణను  కరోనా వైరస్ కారణంగా  సుప్రీంకోర్టు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

2019 డిసెంబర్ 15న ప్రారంభమై గత 101 రోజులుగా కొనసాగుతున్న సీఏఏ నిరసనలు నేటితో తెరపడినట్లయింది. పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఈ ఆందోళనలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా కారోన బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరగా అందులో 16వేల చనిపోయారు. దేశంలో 499 కారోన పాజిటివ్ కేసులు నమోదుకాగా వారిలో తొమ్మిదిమంది మరణించారు.

వాస్తవాలు చెప్పండి.. వదంతులు ఆపండి

కారోన భయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నియమాలను మరింత కట్టు-దిట్టం చేశాయి. అదేవిధంగా అటు మీడియాకి ఇటు వైద్యులకు పలు సూచనలు, సలహాలను జారీ చేశాయి. ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేస్తూ..లాక్‌ డౌన్‌ ను సీరియస్‌ గా తీసుకోండి. దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించుకోండి. ఆదేశాలను కచ్చితంగా పాటించండి. నియమ నిబంధనలను ఆచరణలో పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని కోరుతున్నాను” అని మోడీ తెలిపారు.

అదేవిధంగా ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ..”వాస్తవాలను ప్రజలకు చెప్పండి, అసత్య, అవాస్తవ వార్తలను ప్రకటించడం మంచిది కాదని, ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదని హెచ్చరించాలి. అదే సమయంలో వారిలో నిరాశావాదం, భయాందోళనలు పెరిగిపోని రీతిలో సకారాత్మక అంశాలు అందించాలి. ఈ యుద్ధంలో ముందుండి పోరాడుతున్నది డాక్టర్లు, వైద్య సిబ్బందే. వారిలో ఉత్సాహాన్ని నింపేలా ప్రోత్సహించాలి. క్షేత్రస్థాయి అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో వార్తా ఛానళ్లది కీలక భూమిక. అందుకే ప్రభుత్వం నిరంతరం ఈ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయి పాత్రికేయులకు ప్రత్యేక మైకులు ఇవ్వడంతో పాటు, వారు ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కనీసం మీటరు దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోండి. శాస్త్రీయ విషయాలను వ్యాప్తి చేయండి. చర్చల్లో విషయ పరిజ్ఞానం ఉన్నవారు పాల్గొనేలా చూడండి. అసత్యాల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు నిరోధించండి. ప్రస్తుతం నెలకొన్న వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి సామాజిక దూరం పాటించడమే అతిముఖ్యం అన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి” అని మోడీ తెలిపారు

కేంద్రం చివాట్లతో ఏపీలో కర్ఫ్యూ వాతావరణం

ఏపీలో అసలు కరోనా వైరస్ ప్రభావమే లేదంటూ మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై విరుచుకు పడిన రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా ప్రమాదం గుర్తించినా, కార్యాచరణలో మాత్రం తడబడుతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ అమలు పరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ప్రకటించినా సోమావారం ఎక్కడ ప్రభావం కనిపించక పోవడంతో కేంద్రం నుండి చివాట్లు ఎదురైన్నట్లు తెలుస్తున్నది.

దేశంలో మరెక్కడా కూడా ఇంత ఉదాసీనంగా ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించినట్లు లేదు. కొన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ను సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ వెంటనే కేంద్ర హోమ్ కార్యదర్శి, కాబినెట్ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కఠిన చర్యలు తీసుకోమని వ్యక్తిగతంగా చెప్పడంతో ప్రభుత్వం అప్పటికి కూడా మేల్కొనలేదు. దానితో మంగళవారం నుండి కఠినంగా అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సమాయత్తం అవుతున్నది.

ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం స్పష్టం చేయడంతో పాటు కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ప్రధాని మోడీ స్పష్టం చేయడం గమనార్హం. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ సోమవారం ఉదయం ప్రజలు చాలా చోట్ల రోడ్లపైకి వచ్చేశారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు పెద్దఎత్తున చేరుకున్నారు. గుంపులు గుంపులుగా రోడ్లపైకి జనం చేరడం, అదే సమయంలో కేంద్రం కూడా తీవ్రంగా హెచ్చరించడంతో తరువాత పోలీసులు అప్రమత్తమై రోడ్లపై తిరుగుతున్న వాహనాలను నియంత్రించారు.

లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, తహశీల్దార్లకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. మంగళవారం నుండి అప్రకటిత కర్ఫ్యూ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం ఆరుగంటల నుండి తొమ్మిది గంటల వరకూ మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు కిరాణా షాపులు, రైతుబజార్లకు అవకాశం కల్పించారు. రాత్రి ఏడుగంటల నుండి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటకు రావడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చారు.

ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఎటిఎం వాహనాలకు అనుమతిచ్చారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడుగంటల వరకూ హోటళ్లలో టేక్‌అవేకి అనుమతి ఇస్తున్నారు. ఇరుకుగా ఉన్న రైతు బజార్లను విశాల ప్రాంతాలకు మార్చడం ప్రారంభించారు. నిత్యాసరాల ధరలు నిర్ణ యించి పరిశీలించే అధికారం కలెక్టర్లకు అప్పగించారు.

బ్యాంకులు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే పనిచేసే విధంగా చేశారు. కొత్త ఎకౌంట్లు, రుణాల మంజూరు వంటి కార్యకలాపాలన్నీ నిలిపేశారు. సగం మంది సిబ్బందితో నిర్వహించాలని బ్యాంకర్ల అసోసియేషన్‌ నిర్ణయంచింది. అన్ని ఎటిఎంలలో సరిపోయినంత డబ్బు ఉంచి, ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రకటించింది. మంగళవారం నుండి మీ సేవ కేంద్రాలు నిలిపివేస్తారు.

రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పోలీసు స్టేషన్ల వారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని, పదే పదే తిరిగే వాహనాలను గుర్తించి సీజ్‌ చేస్తామని డిజిపి గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అత్యవసర వస్తు రవాణా వాహనాలకు మాత్రమే అనుమతిస్తారని, సీజ్‌ చేసిన వాహనాలను వైరస్‌ ప్రభావం తగ్గిన తరువాత మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు.

అమరావతి భూములపై దిక్కుతోచని సిబిఐ

అమరావతి భూములలో గత ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కు పాల్పడినదని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రులు పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు అధికార పక్షానికి చెందిన పలువురు, వారి సహచరులు సహితం పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో విమర్శలు కురిపించారు.

అధికారంలోకి వచ్చాక ఆయా ఆరోపణలను నిర్దుష్టంగా తేల్చి, క్రిమినల్ కేసులు దాఖలు చేయడంలో దిక్కుతోచక వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎన్ని దర్యాప్తులు జరిపించినా జగన్ కోరుకున్న విధంగా నిర్దుష్టమైన ఆధారాలతో నివేదికలు రాకపోవడంతో ఒక విధంగా అసహనానికి లోనవుతున్నట్లు కనిపిస్తున్నది.

దానితో ప్రజలలో తాను చేసిన విమర్శలపై విశ్వసనీయత కోల్పోవలసి వస్తున్నదని గ్రహించినట్లున్నారు. అందుకనే పరువు కాపాడుకోవడానికి ఈ కేసులను సిబిఐకి అప్పగించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడి అవుతున్నది.

తాజాగా ఆ భూముల లావాదేవీలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం జిఓ జారీచేయడం ఒక విధంగా ప్రభుత్వం నిస్సహాయ ధోరణిని వెల్లడి చేస్తుంది. మొదట ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఆరోపణలతో నివేదికను విడుదల చేశారు.

రాజధానిలో 4,000 ఎకరాల కొనుగోళ్లకు సంబంధించి పెద్దఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు ఉపసంఘం కనుక్కుందని.. దాని ఆధారంగా తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్న ట్లు జగన్‌ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అంతకు ముందే సిఐడి దర్యాప్తు అన్నారు.

ఈ మధ్య డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో అసాధారణ అధికారాలతో సిట్‌ ఏర్పాటైంది. ఈ బృందం కొందరు వ్యక్తుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. అయితే ఇన్ని చర్యలు తీసుకున్నా.. భూముల క్రయవిక్రయాల్లో కుంభకోణం చోటు చేసుకుందన్న ఆరోపణలకు సంబంధించి ఒక కేసు కూడా నమోదు చేయలేక పోయారు.

హెల్ప్ కరోనా అంటున్న భీష్ముడు

ప్రకృతి  విపత్తులు వచ్చినపుడు అందరం కలిసికట్టుగా పోరాడాలి. సమాజం క్షేమంగా ఉన్నపుడే జాతీయ పతాకం గర్వంగా ఎగురుతుంది . సెలబ్రిటీ నుంచి సామాన్యుడి దాకా అందరూ సమాజంలో భాగమే… జాతికి ఆపద వచ్చినపుడు ఎవరికి వారు తమకు తోచినంత సహాయం చేయాలి …ప్రస్తుతం ప్రపంచం కరోనా సమస్య తో విలవిలలాడి పోతోంది. కరోనా  విపత్తు భారత దేశానికి అంతగా ఉండదు అనుకొన్నారు. కానీ ఊహించని రీతిలో మానవ సంహారి కరోనా ఇండియా లో కూడా ప్రవేశించింది  అందులో మన తప్పిదం స్వల్పమే అయినా ఫలితం మాత్రం దారుణం గా ఉండ బోతోంది .

రాబోయే ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టిన రెండు తెలుగు రాష్ట్రాలు గట్టిగానే చర్యలు చేపట్టాయి, ఇంకా చేపడుతూనే ఉన్నాయి. కరోనా నివారణకు యెంత ఖర్చు అయినా వెనుకాడేది లేదు అని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కృత నిశ్చయం తో ఉన్నారు. అలాంటి స్థితిలో దాతలు ముందుకి వస్తేనే ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఈ విషయం గుర్తించిన అంబానీ , మహేంద్ర లాంటి కొందరు వ్యాపార ప్రముఖులు తమ వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా చాలా మంది వస్తారని అంటున్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ కూడా దేశ ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది   కాగా ఈ విషయం లో తొట్ట తొలి అడుగు  పడింది.  రీసెంట్ గా భీష్మ చిత్రం తో మంచి విజయం చవి చూసిన యువ కథానాయకుడు  నితిన్  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధికి చెరో పది లక్షల చొప్పున 20 లక్షల రూపాయలను అందజేసి తన ఔనత్యాన్ని చాటు కొన్నాడు. a small help can save the big problem

చెర్రీ తో చలో బ్యూటీ

కన్నడ హుడిగి రష్మిక మందన్నఅదృష్టానికి పర్యాయపదం లా మారింది. వరుస విజయాలతో చాలా సునాయాసం గా అందలం ఎక్కింది. తెలుగులో చేసింది కేవలం ఆరు చిత్రాలు. అయినా అగ్రపథానికి చాలా దగ్గర్లో ఉంది. రష్మిక మందన్న చేసిన ఆరు చిత్రాల్లో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ , రెండు చిత్రాలు సూపర్ హిట్ , రెండు చిత్రాలు జస్ట్ యావరేజ్. తారలకు ఇలాంటి సక్సెస్ రేట్ చాలా అరుదుగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అప్పుడే మహేష్ బాబు , నాగార్జున, నాని , నితిన్ ,విజయ్ దేవరకొండ, నాగ శౌర్య వంటి బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసింది. అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ కూడా దక్కించు కొంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం తెలుగులో ఒక ల్యాండ్ మార్క్ చిత్రం గా రూపొంద నుంది. ఈ చిత్రం కూడా సక్సెస్ సాధిస్తే రష్మిక మందన్నకి తెలుగులో దాదాపు అగ్రపీఠం దక్కినట్టే … ఇవన్నీ ఒక ఎత్తు అయితే త్వరలో మరో హై రేటెడ్ మూవీ చేయబోతోంది .

తెలుగు టాప్ డైరెక్టర్ లలో ఒకరైన కొరటాల శివ భారీ ఎత్తున, ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న ” ఆచార్య” చిత్రం లో చెర్రీ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మెగా స్టార్ నటించే 152 వ చిత్రం గా రూపొందుతున్న “ఆచార్య ” చిత్రం లో రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించ నుండగా అతని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఆలయాల నేపధ్యం లో అరుదైన కాన్సెప్ట్ తో పాన్ ఇండియా మూవీ గా నిర్మాణం అయ్యే ” ఆచార్య ” చిత్రం రష్మిక మందన్న కి తన సినీ ప్రయాణం లో ఒక మైలు రాయిగా నిలుస్తుంది అందులో సందేహం అక్కర లేదు.
Luck is like a rain comes all of sudden

కరోనాపై యుద్ధానికి 100కోట్ల విరాళం..

కరోనా(కోవిడ్-19) వైరస్ ఎదుర్కొనేందుకు ఓ పెద్దాయన భారీ విరాళాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.100కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆయన ఏవరో కాదు.. వేదాంత రిసోర్సెస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్. దీనిపై ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని చెప్పారు. రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనాన్ని గడిపే వారికోసం తనవంతుగా తక్షణ సాయంగా 100కోట్ల విరాళాన్ని ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.

కరోనాపై పోరాటానికి ‘దేశ్ కీ జరూరతోన్ కే లియే’ అనే వాగ్ధానం చేస్తున్నానని.. ప్రస్తుతం మన దేశానికి ఇదే కావాలని అన్నారు. కరోనాతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రోజువారీ కూలీల జీవనం అస్తవ్యస్తంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం తనకు తోచినంత వారికి సాయం అందిస్తున్నానని అని అనిల్ కపూర్ పేర్కొన్నారు. భారత్ లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనిల్ కపూర్ 100కోట్ల విరాళం ప్రకటించడంపై పలువురు అభినందిస్తున్నారు. అనిల్ కపూర్ దాతృత్వానికి సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో పోరాడి.. హీరోయిన్ తండ్రి మృతి

కరోనా వైరస్ పేరు చెబితే ప్రపంచం గజగజలాడిపోతుంది. ఈ వైరస్ చిన్న, పెద్ద తేడా లేకుండా విజృంభిస్తోంది. ముఖ్యంగా సెలబ్రెటీలు కరోనా పేరు చెబితేనే బెంబెలేత్తిపోతున్నారు. కరోనాకు మందులేకపోవడంతో ఎంత ధనికులైనా ఈ వైరస్ తో పోరాడి చివరకు మృత్యువాత పడక తప్పడం లేదు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ కరోనాతో పోరాడి చివరకు మృతి చెందారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదచాయలు నెలకొన్నాయి.

హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి గత కొన్నిరోజుల క్రితం కరోనా సోకింది. ఈ విషయాన్ని సోఫియా కొన్నిరోజుల కిందటే కన్ఫామ్ చేసింది. అయితే తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని.. త్వరలోనే కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆయన 60ఏళ్ల వృద్ధుడు కావడంతో కరోనాను ఎదుర్కోవడం ఆయన వల్ల కాలేదని వాపోయింది. దీంతో కరోనాతో పోరాడి పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందినట్లు కన్నీటి పర్యంతమైంది.

కరోనా సోకి సినీపరిశ్రమకు చెందిన వారిలో తొలి వ్యక్తిగా పీటర్స్ మైల్స్ నిలిచారు. ఆయన సీనీ యావత్ సీని ప్రపంచంతోపాటు సోఫియా మైల్స్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.