Home Blog Page 8574

కరోనాపై టీఎస్ సర్కార్ కఠిన నిబంధనలు ఇవే!

చైనాలోని వూహాన్ ప్రారంభమైన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచాన్ని చుట్టిముట్టింది. ప్రస్తుతం ఇటలీ దేశాన్ని కబలించేందుకు సిద్ధమవుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగి తక్షణ చర్యలు చేపడుతుంది. అలాగే ప్రపంచ దేశాలకు హెచ్చరికలను జారీ చేస్తుంది. కరోనాపట్ల ఏమరుపాటుగా ఆ దేశంలో మృతుఘోష తప్పదంటుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను ప్రపంచ దేశాలను పాటిస్తున్నాయి. దీంతోపాటు చైనా దేశం కరోనా నివారించేందుకు చేసిన లాక్డౌన్ సత్ఫలివ్వడంతో క్రమంలో ఆయా దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.

భారత్ లో కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో లాక్డౌన్ చర్యలు చేపట్టాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ఈనెల 31వరకు లాక్డౌన్ దిశగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా టీఎస్ సర్కార్ కరోనా పట్ల నిర్లక్ష్యం వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో 1897 చట్టం ప్రకారం లాక్డౌన్ ప్రవేశపెట్టామని.. ఇందుకు సంబంధించిన నిబంధనలను సీఎస్ సోమేష్ కుమార్-తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.

నేటి నుంచి మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ప్రజాలెవరూ రోడ్లపైకి రాకుడదు. ఒక కాలనీలో వాహనాలు ఒకటి- రెండు కిలోమీటర్లు మాత్రమే తిరగాలి. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. పోలీసుల దృష్టిలో ఎక్కువసార్లు పడితే ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు. ఈ వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తర్వాతే ఇస్తారు. నిత్యావసర వస్తువులు క్యారీ ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతీ బైకుపై ఒక వ్యక్తి.. కారు-ఇతర ఫోర్ వీలర్ వాహనాల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. చట్టం ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్ష వంటి కఠిన చర్యలు ఉంటాయి.

ప్రతీఒక్కరు స్వీయ నియంత్రణ పాటించినట్లయితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం విధించే నిబంధనలు తూచ తప్పకుండా పాటించడంతోపాటు. కరోనాపై అవగాహన పెంచుకుంటే ఈ మహమ్మరికి దూరంగా ఉండొచ్చు. ఆ దిశగా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి మూయాలి, వీటిని తెరవాలి…!

Kcr

తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న కారోన వైరస్ కేసుల వల్ల కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వరకు రాష్ట్రంలో ప్రజలు అత్యవసరం, నిత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏయే షాపులు తెరిచి ఉంచాలో, ఏయే దుకాణాలు మూసి ఉంచాలో… తెలంగాణ ఆరోగ్య శాఖ జాబితాను విడుదల చేసింది.

తెరిచి ఉండేవి ఇవే..

మెడికల్ షాపులు
కిరాణా దుకాణాలు
కూరగాయలు, పాల దుకాణాలు
ఫైర్ సర్వీసులు
గ్యాస్ ఏజెన్సీలు
పెట్రోల్ బంకులు
సూపర్ మార్కెట్లు
చికెన్,మటన్,చేపల మార్కెట్లు

మూసి ఉండేవి ఇవే..

విద్యా సంస్థలు
బట్టల దుకాణాలు
టీ,టిఫిన్ సెంటర్లు
బంగారం, ఫ్యాన్సీ,టైలరింగ్ షాపులు
సెలూన్ షాపులు
ఎలక్ట్రికల్ దుకాణాలు
టాయ్స్ షాపులు

కరోనా నివారణపై నిర్లక్ష్యం చేస్తే కటకటలే..

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నోటా విన్న ఈ పేరు. కరోనా కంటికి కనిపించకుండా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి క్రమంలో ప్రపంచ దేశాలకు పాకింది. ప్రస్తుతం ఇటలీ దేశంలో కరోనా తన వికృత క్రీడను ప్రదర్శిస్తోంది. దీంతో ఇటలీ దేశం శవాల దిబ్బను తలపిస్తోంది. దీంతో యావత్ ప్రపంచం కరోనా మహమ్మరిని అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా భారత్ కొన్ని కఠిన చర్యలు చేపడుతుంది.

భారత్ లో ఆదివారం జనతా కర్ఫ్యూను విధించింది. దేశ ప్రధాని పిలుపు మేరకు ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉంటూ తమ సంఘీభావం తెలిపారు. అయితే సోమవారం నాటికి పరిస్థితి మారిపోయింది. భారత్ కరోనా కేసులు నమోదైన 75జిల్లాలను కేంద్రం లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఆయా రాష్ట్రాలకు నివేదించింది. అలాగే ఈనెల 31వరకు రైళ్లు, విమానాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలెవరూ కరోనా పట్ల నిర్లక్ష్యం వ్యవహరించద్దని సూచిస్తుంది. ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనా విషయంలో మోదీ ప్రభుత్వం సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినతరం చేసింది. నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు, జైలు శిక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్-తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రభుత్వం విధించే నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన ప్రజలు సోమవారం లాక్ డౌన్ పాటించలేదన్నారు. తెలంగాణలో 1897 చట్టం ప్రకారం లాక్డౌన్ ప్రవేశపెట్టామని, సరిహద్దులు మూసివేసి ఎమర్జెన్సీ విధించామని తెలిపారు. ఐదుగురు వ్యక్తులు మించి రోడ్లపై కనిపిస్తే చర్యలుంటాయని, ఎన్నారైలు క్వారంటైన్ నుంచి వెళ్లకుండా వారి పాస్ పోర్టులు సీజ్ చేస్తామని సీఎస్ సోమేష్ హెచ్చరించారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నేటి మధ్యాహ్నం నుంచి తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉందన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నిత్యవసర వస్తువుల షాపులు కూడా రాత్రి 7గంటలకు మూసివేయాలని హెచ్చరించారు. రోడ్డుపై వచ్చే ప్రతీ వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని మీడియాకు మాత్రం ఎక్కడైనా తిరిగే అనుమతి ఉందన్నారు. చట్టం ఉల్లంఘిస్తే 6నెలల వరకు జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు. కావున ప్రజలంతా వారివారి ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

లోక్‌స‌భ‌ నిర‌వ‌ధికంగా వాయిదా

కరోనా వైరస్ నేపథ్యంలో దేశం అంతటా అలజడి రేగడం, దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు స్వీయ దిగ్బంధనంలో ఉండడంతో లోక్ సభ సమావేశాలు గడువుకన్నా 12 రోజుల ముందే నేడు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

గత వారం రోజులుగా ఈ విషయమై పలువురు ప్రతిపక్ష సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం దేశం అంతా దిగ్బంధన పరిస్థితులు నెలకొనడంతో మరో దారి లేక సమావేశాల వాయిదాకు ఒప్పుకోవలసి వచ్చింది.

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఏప్రిల్‌ 3వ తేది వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే కరోనావైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేయాలని అఖిలపక్షం కోరింది.

వాయిదాకు ముందు లోక్‌స‌భ ఎలాంటి చ‌ర్చ లేకుండానే కీలకమైన 2020 సంవ‌త్సరానికి సంబంధించిన ఆర్థిక బిల్లును ఆమోదించింది. మ‌రో రెండు బిల్లుల‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్, టిఎంసి, డిఎంకే, శివసేన వంటి పార్టీలు తమ ఎంపిలను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావద్దని ఆదేశించాయి.

మధ్యప్రదేశ్ లో తిరిగి చౌహన్ కే పట్టాభిషేకం

మధ్యప్రదేశ్ లో నేటి రాత్రి మరోమారు బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. సీనియర్ బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

22 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు తిరుగుబాటు చేసి, తమ పదవులకు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడటం, ముఖ్యమంత్రి కమలనాథ్ రాజీనామా చేయవలసి రావడం తెలిసిందే.

పార్టీలో బలమైన ఓబిసి నేతగా, మంచి పరిపాలన దక్షుడిగా పేరొందిన చౌహన్ ను తప్పించి గోపాల్ భార్గవ, నరేంద్ర తోమర్, థావర్ చంద్ గెహ్లాట్, నరోత్తం మిశ్రా వంటి వారిలో ఒకరిని ముఖ్యమంత్రిగా చేయాలని ఉదయం నుండి ప్రయత్నాలు జరిగినా చివరికి పార్టీ అధిష్ఠానం వెనుకడుగు వేసిన్నట్లు తెలుస్తున్నది.

ముఖ్యంగా ప్రభుత్వం నిలబడాలి అంటే రాజీనామా చేసిన 22 మంది స్థానాలతో పాటు, ఖాళీగా ఉన్న మరో రెండు స్థానాలకు జరిగే ఉపఎన్నికలలో బీజేపీ దాదాపు అన్నింటిని గెలుపొందవలసి ఉంది. లేని పక్షంలో ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది.

పైగా, బొటాబొటి ఆధికత్యలో ఉన్న శాసనసభలో బీజేపీ నుండి వలసలు వెళ్లకుండా కూడా కట్టడి చేయవలసి ఉంది. అందుకు బలమైన పునాది ఉన్న చౌహన్ మాత్రమే సమర్థులు కాగలరని `పెద్దలు’ పార్టీ అధిష్టానాన్ని వారించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారెవ్వరికి పార్టీపై గాని, ప్రజలలో గాని పట్టు లేకపోవడం తెలిసిందే.

ఈ రోజు సాయంత్రం బీజేపీ శాసనసభపక్షం భోపాల్ లో సమావేశమై లాంఛనంగా చౌహన్ ను తమ నాయకుడిగా ఎన్నుకొని, గవర్నర్ లాల్జీ టాండన్ కు తెలుపనున్నారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు రాజ్ భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేయగలరని బిజెపి వర్గాలు తెలిపారు.

మరోసారి మెరుపులు మెరిపించనున్న ఇస్మార్ట్ హీరోయిన్లు

పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో గత ఏడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మస్తుగా అలరించింది. మరీ ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకొంది. ఇక ఈ సినిమా విజయంలో హీరోయిన్ల పాత్ర మరువలేనిది ఇద్దరికి ఇద్దరు గ్లామర్ ఒలక పోయడంలో పోటీపడ్డారు. ఇపుడు మళ్ళీ అదే కాంబినేషన్ మరో సినిమాలో రాబోతుంది .కాకపొతే ఇక్కడ హీరో మారాడు .

అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హిట్ దొరక్క చాలా ఇబ్బంది పడ్డాడు చివరికి గత ఏడాది వచ్చిన ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్నాడు .కాగా ‘కందిరీగ’లో ఉన్నట్టే ‘అల్లుడు అదుర్స్’ సినిమా లో కూడా ఇద్దరు కథానాయికలునటించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభ నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించనుంది. ఇక ఆ సాంగ్ సినిమాకే హైలెట్ కానుంది అంటోంది చిత్ర బృందం.

ఇక ఈ సినిమా కూడా ‘కందిరీగ’ ఫార్మాట్ లోనే ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఆ చిత్రం లో ఒక కీ రోల్ పోషించిన సోనూ సూద్ ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఫైట్స్ అన్నీ హైఓల్టేజ్ లో రామ్, లక్ష్మణ్ నేతృత్వం లో రూపొందుతున్నాయి. మొత్తానికి ఈసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని బెల్లంకొండ శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తోంది .
A thing of beauty is joy forever

Aishwarya Rajesh Latest Photo Shoot Stills

నిరుపేద కళాకారులకు హీరో రాజశేఖర్ చేయూత

కరోనా వైరస్ ప్రభావం తో అతలా కుతలం అవుతున్న వివిధ రంగాలలో సినీ రంగం కూడా ఒకటి .ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల వేలాది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. షూటింగ్ ఉంటేనే గాని రోజు గడవని స్థితి వాళ్ళది. అటువంటి నిరుపేద సినీ కళాకారుల్ని ఆదుకొనేందుకు హీరో రాజశేఖర్ ముందుకొచ్చాడు .

గత కొద్దిరోజులుగా సినిమా షూటింగులు బంద్ అవ్వడం వలన చిన్నా చితకా పాత్రలతో కడుపు నింపుకొని బతికే కళాకారుల పరిస్థితి చాలా దయనీయం గా మారింది. షూటింగ్ ఉన్న సమయం లో వారికి రెండు పూటలు కాకపోయినా ఒక పూట అయినా తిండి దొరికేది . దానికి తోడు ఏ రోజు వేతనం ఆ రోజు వాళ్ల చేతికి అందేది. దాంతో వల్ల పెళ్ళాం బిడ్డలు కడుపు నింపుకొనే వారు.ఇపుడు జూనియర్ ఆర్టిస్టులకు ఆ వెసులు బాటు లేదు కాలే కడుపుతో రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వల్ల ఎవరూ బయటికి రాకూడదు అన్న నిబంధన వారి పాలిట శాపంగా మారింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హీరో రాజశేఖర్ తన వంతు సాయం చేయడానికి సిద్ద మయ్యాడు.

తాను స్థాపించిన రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కళాకారులకు పది రోజుల పాటు నిత్యావసరాలను అందించేందుకు సమాయత్త మౌతున్నాడు. ఇందుకు గాను ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ , పస్తులు ఉంటున్న కళాకారులు 9010810140 అనే ఫోన్ నెంబర్ కి కాల్ చేసి నవీన్ వర్మ అనే వ్యక్తి కి తమ వివరాలు అందిస్తే వారికి కావాల్సిన సహాయం అందుతుంది అని రాజశేఖర్ తెలియజేయడం జరిగింది.

తెలుగు సినీ పరిశ్రమ లోని నిరుపేద కళా కారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని oktelugu.com కోరుకొంటోంది.
May god bless his humanity

10రోజులు ఇంట్లో ఉంటారా..?6నెలలు జైల్లో ఉంటారా..?!

దేశంలో కారోన వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో..వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్లపైకి వచ్చి తిరగటం మొదలెట్టారు.  దీంతో  కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సోమవారం నాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  430 కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య  ఎనిమిదికి చేరింది. మరోవైపు లాక్ డౌన్  అమలుపై దేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ సోమవారం ట్విటర్‌ వేదిక  అసంతప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయటానికి ఉపక్రమించింది.

ఈ నేపథ్యంలో కేంద్రం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్లు వదిలి రోడ్లపైకి వస్తే 6 నెలలు జైలుశిక్ష , వెయ్యిరూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇకపై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. నిర్లక్ష్యం చేస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంటువ్యాధి నిరోధక చట్టం అమలుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు. ఇది దేశవ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది.

ప్రజలు తమంతటతాము సురక్షితంగా ఉండటానికి, వ్యాధివ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారించనున్నారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో పూర్తి లాక్ డౌన్ అమలవుతుండగా, మరో 11 రాష్ట్రాల్లో పాక్షికంగా అమలవుతోంది. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించటంతో ప్రధాని  ఉన్నత స్ధాయి అధికారులు,మంత్రులతో సమావేశమై సోమవారం సాయంత్రం మరికొన్ని నిబంధనలు ప్రకటించే అవకాశం ఉంది.

Neha Sharma Latest Pictures

ఎంపీలో ‘కీలు బొమ్మ’ సీఎంకై మోదీ ఎత్తుగడ!

మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మూడు రోజులైనా ఇంకా ప్రభుత్వం ఏర్పాటు గురించి బీజేపీలో సందడి కనిపించడం లేదు. 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ కాబోయే ముఖ్యమంత్రి అని అందరు అనుకున్నారు. అయితే ఎప్పటికైనా ప్రధాన మంత్రి పదవికి పోటీరాగల వ్యక్తి బీజేపీలో ఆయనే కావచ్చనే ఉద్దేశ్యంతో మరో `కీలుబొమ్మ’ ముఖ్యమంత్రి కోసం ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

2013లో బీజేపీలో ఓబిసి అభ్యర్థిగా ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం మోదీ పోటీ పడుతున్న సమయంలో అదే వర్గానికి చెందిన చౌహన్ సహితం పోటీలో ఉండడం గమనార్హం. ఒక బహిరంగసభలో చౌహన్ మంచి ప్రధాన మంత్రి అభ్యర్థి కాగలరని స్వయంగా ఎల్ కె అద్వానీ ప్రకటించారు కూడా. చివరి వరకు అద్వానీ, సుష్మ స్వరాజ్ లకు అనుకూలంగా ఉంది మోదీ, అమిత్ షా సరసన చేరకుండా వస్తున్నారు.

బీజేపీలో వీరిద్దరి ఆధిపత్యాన్ని ఒక విధంగా సవాల్ చేస్తున్నది ముగ్గురే నాయకులు. మొదటగా చౌహన్ కాగా, మరొకరు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమెను కేంద్ర మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా చేసి అమిత్ షా స్వయంగా ఆహ్వానించారు. అయితే అందుకు ఆమె తిరస్కరించడమే కాకుండా “మోదీ ప్రధాని కాకముందే నా ఇమేజ్ తో సీఎం అయ్యాను. మరోసారి కాబోతున్నాను. మరొకరి కింద పనిచేయవలసి అవసరం నాకు లేదు” ఆమె స్పష్టం చేశారు.

ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహితం తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. అందుకనే మహారాష్ట్రలో ఐదేళ్ల క్రితం ఎన్నికల అనంతరం గడ్కరీ పేరు సీఎంగా తెరపైకి వచ్చినా ఆయనతో సంబంధం లేకుండా ఆయన ప్రాంతానికే చెందిన, ఆయన సామజిక వర్గానికే చెందిన జూనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ను తెరపైకి తీసుకు వచ్చారు. తద్వారా గడ్కరీ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయాత్నం చేశారు.

2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ – బీజేపీల మధ్య సీట్ల తేడా ఐదు మాత్రమే. ఎన్నికల ఫలితాలు పూర్తిగా బైటకు రాకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చౌహన్ ధీమా వ్యక్తం చేసినా, మోదీ అనూహ్యంగా బహిరంగంగా బిజెపి ఓటమిని అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నం చేయవద్దని చౌహన్ ను హెచ్చరించారు. దానితో మోదీ `ఆశీస్సులు’ తోనే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినదని గ్రహించాలి.

అయితే ఇప్పుడు వరుసగా ఒకొక్క రాష్ట్రాలలో బిజెపి బలం తగ్గుతూ ఉండడం, ఢిల్లీలో అల్లర్ల సమయంలో హోమ్ శాఖ నిర్వహిస్తున్న అమిత్ షా `అసమర్ధ’ పాలన వెల్లడి కావడంతో బిజెపి వర్గాలలో మోదీ, అమిత్ షా ల `సమర్ధత’లపై విశ్వాసం సన్నగిల్లడం ప్రారంభమైనది. అందుకనే వారందరి దృష్టి మళ్లించడం కోసం గుజరాత్ లోని బరోడాకు చెందిన జ్యోతిరాదిత్య సింధియా అత్తింటివారైన గైక్వాడ్ రాజకుటుంబం ద్వారా ప్రభుత్వ `ఫిరాయింపు’ డ్రామా ఆడించారు.

అందుకనే ఇప్పుడు చౌహన్ ను తిరిగి ముఖ్యమంత్రిగా చేయకుండా కేంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రి, నరేంద్ర సింగ్ తోమర్‌ను తెరపైకి తెస్తున్నారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడైన ఆయనకు పరిపాలన పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 2014 తర్వాత బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రతి రాష్ట్రంలో కూడా జనబలం లేని, కేంద్రానికి `కీలుబొమ్మ’గా వ్యవహరించే వారినే ముఖ్యమంత్రులుగా ఎంపిక చేస్తూ రావడం గమనార్హం.

ముఖ్యమంత్రిగా చౌహన్ అసాధారణ ప్రతిభ చూపారు. మోదీ గుజరాత్ నమూనాకు భిన్నమైన పాలనతో ప్రజలను ఆకట్టుకున్నారు. 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయనపట్ల ప్రజలలో వ్యతిరేకత లేదు. పైగా మోదీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనట్లు విమర్శలు ఎదుర్కొంటు, 2 శాతం కూడా వృద్ధి రేట్ సాధించలేని వ్యవసాయ, గ్రామీణ రంగాలలో 10 శాతంకు పైగా రాష్ట్రంలో చౌహన్ వృద్ధి రేట్ సాధించారు.

తమ నాయకత్వం పట్ల బిజెపి వర్గాలు విరక్తి చెందితే చౌహన్ తెరపైకి వచ్చే ప్రమాదమున్నదనే భయంతోనే ఆయనకు ఇప్పుడు అధికార పగ్గాలు దక్కకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

Anasuya Bharadwaj New Photo Shoot Stills

Soundarya Sharma Hot Photos

తెలంగాణలో 30కి చేరిన కారోన కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు సోమవారం నాటికి 30కి చేరాయి.సోమవారం ఒక్కరోజే మూడు కొత్త కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా..మరొకరు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా వైద్యులు గుర్తించారు. దీంతో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. లండన్‌ నుంచి వచ్చిన 30 ఏళ్ళ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదయింది. 27 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి.. ముగ్గురు స్థానికులకు కరోనా వైరస్ పాకింది.

మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో రజనీ సాహసం

సూపర్ స్టార్ రజనీ కాంత్ రియల్ లైఫ్ లో చేసిన సాహసం నేటి రాత్రి 8గంటలకు ప్రసారం కానుంది. రజనీకాంత్ ఇటీవల ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’పేరిట తీసిన డాక్యమెంటరీలో నటించారు. ఈ సాహస యాత్ర ప్రసారాన్ని డిస్కవరీ ఛానల్ ఈ రోజు రాత్రి 8గంటలకు ప్రసారం చేయనుంది. దీంతో అభిమానులు రజనీ సాహసయాత్ర చూసేందుకు అత్రుతగా ఎదురు చూస్తున్నారు.

గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో సాహస యాత్రికుడు బేర్‌గ్రిల్స్‌ ఓ డాక్యుమెంటరీ తీసిన సంగతి తెల్సిందే. ‘మ్యాన్ వర్సస్ వరల్డ్’ ప్రొగ్రాంకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రధాని మోదీతో బేర్స్ గిల్స్ చేసిన సాహస యాత్ర ఇండియాలో అత్యంత ఆదరణ పొందించింది. ఈ తరహాలోనే సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కూడా ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ పేరిట ఓ డాక్సుమెంటరినీ చిత్రీకరించారు.

‘మ్యాన్ వర్సస్ వరల్డ్’ ప్రోగ్రాం హోస్ట్‌ బేర్‌గ్రిల్స్‌తో కలిసి రజనీకాంత్ కర్ణాటకలోని బండిపురా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో సాహసయాత్ర చేశారు. ఈ సందర్భంగా వీరుచేసిన సాహసయాత్రను చిత్రీకరించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రొమో వీడియోను డిస్కవరీ చానెల్‌ ప్రోమో విడుదల చేసింది. సుమారు 30సెకన్ల నిడివిగా ఉన్న ఈ ప్రొమోలో రజనీ అడవిలో జీపు నడుపుతూ, కొండలెక్కడం లాంటి సాహసాలు చేస్తూ రజనీ కనిపించారు. 60ఏళ్ల పైబడిన రజనీ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా సాహసయాత్ర చేయడం ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/tv/B98RgGwA9io/

లాక్‌ డౌన్‌ దెబ్బతో భగ్గుమంటున్న కూరగాయల ధరలు..!

తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో కూరగాయలు ధరలు భగ్గుమంటున్నాయి. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూతో కారోనాని నియంత్రించడానికి ఈ నెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో నిత్యావసరాల కోసం జనాలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. జనాల రాకతో రైతు బజార్లు, పండ్ల మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు రద్దీగా మారాయి. ప్రైవేటు వాహనాలు, వ్యక్తిగత వాహనాల రాకపోకలతో ప్రధాన రహదారులపై రద్దీ పెరిగింది.

మరోవైపు రద్దీ పెరగడంతో రైతుబజార్లలో అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నారు. రైతుబజార్లకు సమీప ప్రాంతాల నుంచి కూరగాయల రాక తగ్గిందని చెబుతున్నారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ధరలు పెంచి అమ్మడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు షాపింగ్ మాల్స్ వద్ద ఉదయం 9గంటల నుంచే నగరవాసులు బారులు తీరారు. కరోనా నేపథ్యంలో వినియోగదారులను పరీక్షించిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. ఒక్కో వినియోగదారుడి మధ్య కనీస దూరం ఉండేట్లు చూస్తున్నారు.

మన తారలు బహు ముదుర్లు

మన తెలుగు హీరోలకు ముందు చూపు ఎక్కువ అవుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలన్న ఆలోచన వారిలో బాగా పెరిగింది. ఆ క్రమంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ భాగస్వామిగా ‘ ట్రూ జెట్ ‘ అనే విమాన సంస్థలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా సెలబ్రిటీ లకు కార్లను లీజ్ కి ఇచ్చే ఒక బడా కంపెనీ లో పార్టనర్ గా జాయిన్ అయ్యాడు .

ఇక మహేష్ బాబు అయితే మల్టీప్లెక్స్ నిర్మాణం లో ఆల్రెడీ దిగాడు. సూళ్లూరుపేట లో ఒక ప్రెస్టీజియస్ మల్టీప్లెక్స్ కట్టి ప్రభాస్ కూడా తానేమి తక్కువ కాదని నిరూపించు కొన్నాడు. ఇక సందీప్ కిషన్ లాంటి యువ హీరో కూడా బ్యూటీ సెలూన్లు ,రెస్టారెంట్ లు అంటూ వ్యాపారాలు చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున ఎన్ గ్రిల్ రెస్టారెంట్ , కన్వెన్షన్ సెంటర్ లాంటి వాటి నిర్వహణలో బిజీ బిజీ గా గడుపు తుంటాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు శ్రీ విద్య నికేతన్ అనే సంస్థ స్థాపించి తన ప్రత్యేకతను చూపిస్తున్నాడు .

అలా బిజినెస్ లు చేస్తూనే మన హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు కూడా చేస్తున్నారు. ఆ క్రమంలో విక్టరీ వెంకటేష్ తండ్రి స్థాపించిన సురేష్ సంస్థని మ్ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక అక్కినేని నాగార్జున కి అన్నపూర్ణ సంస్థ ఉండనే ఉంది. మోహన్ బాబు కి సొంత సంస్థ శ్రీ లక్ష్మి ప్రసన్న తో బాటు కొడుకులు స్థాపిస్తున్న అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి.

మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి తన సత్తా చాటుతున్నాడు. ఆ క్రమంలో మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ల నుంచి మొదలుపెడితే నాని లాంటి యూత్ స్టార్ హీరోలవరకూ సినీ నిర్మాణంలో అడుగుపెట్టినవారే. అయితే వీరిలో కొందరు స్వయంగా కాకుండా పరోక్షంగా నిర్మాతలుగా మారుతుంటారు. ప్రభాస్.. బన్నీ లాంటి వాళ్ళు పరోక్షంగా తమా హోమ్ బ్యానర్ల ద్వారా సినిమాల్లో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా అదే బాటలో ఉన్నాడని తెలుస్తోంది .

వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాను వరుణ్ తేజ్ కజిన్ అయిన సిద్దు ముద్దా స్థాపించిన రినసాన్స్ బ్యానర్ లో అల్లు వెంకటేష్ తో కలిసి నిర్మిస్తున్నాడు. అయితే పేరు కి మాత్రమే అతను నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిజానికి వరుణ్ తేజ్ ఈ సినిమాకు పెట్టుబడి పెడుతున్నాడని తెలుస్తోంది

ఈ సినిమానే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలనే ఆలోచన వరుణ్ తేజ్ కి ఉందట. అందులో భాగంగా మొదట యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఒక సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా సిద్దు ముద్దా స్థాపించిన రినసాన్స్ బ్యానర్ పైనే నిర్మిస్తారని.. వరుణ్ తేజ్ మాత్రం బ్యాక్ ఎండ్ లో ఉంటాడని తెలుస్తోంది . కాగా ఈ సినిమాతో మోహన్ అనే నూతన దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది .
Prevention is better than cure