ఏడాది పాటు ఒలింపిక్స్ వాయిదా
ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ను జపాన్ ఒక సంవత్సరం పాటు వాయిదా వేసింది. రోజురోజుకూ కరోనా కేసులను పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి చెందినప్పటి నుండి ఒలింపిక్స్ జరపేందుకు మొగ్గు చూపింది
కానీ ప్రపంచం వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు పెరిగి జనం మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ ను సంవత్సరం పాటు జపాన్ ప్రభుత్వం వాయిదా వేయక తప్పలేదు.ఒలింపిక్స్ మళ్లీ ఎప్పుడు మొదలు అవుతాయో మాత్రం తెలపలేదు.
మరోవంక టోక్యో ఒలింపిక్స్ 2020ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు డిక్ పౌండ్ కూడా ప్రకటించారు. ఈ ఏడాది జూలైలో జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగాల్సి ఉంది. అయితే, మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడలను ఏడాదిపాటు వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
అయితే, ఈ క్రీడలను తిరిగి ఎప్పడు నిర్వహించాలనే దానిని ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, బహుశా 2021లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కరోనా తీవ్రం రూపం దాల్చిన ప్రస్తుత స్థితిలో పలు దేశాలు ఒలింపిక్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించాయి. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఆ మూడు కీలక అంశాలపై జగన్ కి చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి మూడు కీలక అంశాలలో చుక్కెదురైంది. ఒకటి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విషయం కాగా మిగిలిన రెండు జగన్ తొందరపాటుతో తీసుకున్న అంశాలు.
పేదలకు 25లక్షల ఇండ్లను మంజురు చేసే విషయంలో జగన్ సర్కార్ కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకొంది. అమరావతి రైతుల భూములు, విశాఖ భూములను అక్రట్మంగా లాక్కున్నారనే అప్రతిష్ట జగన్ ప్రభుత్వానికి వచ్చింది. ఇదే అంశం పై హైకోర్టు పిటిషనలు దాఖలు అయ్యాయి. ఇళ్ల స్థలాల కోసం ఆరువేల ఎకరాల భూముని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.పాతిక లక్షల ఇళ్ల స్థలాలను ఐదేళ్ల తర్వాత అమ్ముకునే వీలు కల్పించే..”కన్వేయన్స్ డెడ్”లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇల్లు కట్టుకునే షరత్ లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.
గ్రామ సచివాలయం గోడపై ఉన్న జాతీయ జెండాకి వైసీపీ జెండా రంగులు వేయడం, గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో జగన్ బొమ్మలను వేసిన అంశంపై ముప్పా వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో.. హైకోర్టు, జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని ఏపీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడకూడా జగన్ సర్కార్ కి చుక్కెదురైంది. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చి, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే రంగులకు నేషనల్ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేస్తూ పిటిషన్ ని కొట్టివేసింది.
మూడో అంశంగా శాసన మండలి రద్దు విషయంలో జగన్ ప్రభుత్వానికి పార్లమెంట్ లో షాక్ తగిలింది. మండలి రద్దు కనీసం ప్రస్థావనికి రాకుండానే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి.
ఈ విధంగా జగన్ ప్రభుత్వానికి, పై మూడు అంశాలపై అటు సుప్రీంకోర్టులో ఇటు పార్లమెంటు లో షాక్ తగిలింది.
ప్రతి ఐదుగురిలో ఒకరు కరోనా ఆధీనంలో
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి ఐదుగరిలో ఒకరు (20 శాతం మంది) కరోనా ఆధీనంలోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. వైద్యులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటించకుంటే వీరంతా కరోనా బారిన పడతారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
మంగళవారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 3,78,679 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 16,500 మందికి పైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. కాగా, ఇప్పటి వరకు 1,01,000 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మొదటి లక్ష మందికి కరోనా సోకడానికి 67 రోజులు పట్టగా కేవలం నాలుగు రోజుల్లోనే మరో లక్ష మందిని కరోనా ఆవహించింది. దీంతో దీనిని ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. అవసరమైతే 170 కోట్ల మందిని నిర్బంధంలోనే ఉంచాలని, వారిని బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
ఐటీ రిటర్న్‌ల దాఖలుకు జూన్ 30 గడువు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికే లాక్‌డౌన్ అమలు చేస్తున్నదృష్ట్యా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పలు సడలింపులను ప్రకటించారు. ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్ లను దాఖలు చేయడానికి సమయం పొడిగించారు. బ్యాంకుల ఏటీఎం ల నుండి నగదు ఉపసంహరణ చార్జీలను తీసివేయడంతో పాటు, సేవింగ్ బ్యాంకు ఖాతాలలో కనీసమొత్తం నిబంధనను తొలగించారు.
రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపు ఆలస్య రుసుములు ఉండవని ఆమె స్పష్టం చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్‌ల దాఖలుకు 2020, జూన్ 30 వరకు గడువు విధించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుము 12 నుంచి 9 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఆధార్ – పాన్ అనుసంధానం గడువును కూడా జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
టీడీఎస్ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9 శాతానికి తగ్గించారు. రూ. 5 కోట్ల టర్నోవర్ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివాద్ సే విశ్వాస్ పథకం గడువు జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగించారు. మార్చి, ఏప్రిల్, మే జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్ 30 వరకు పొడిగించారు.
కాంపొజిషన్ స్కీమ్ రిటర్న్‌ల దాఖలుకు కూడా జూన్ 30 గడువు విధించారు. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం ఉండవని వెల్లడించారు. రూ. 5 కోట్ల టర్నోవర్ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.
డెబిట్ కార్డుదారులు ఇక నుంచి ఇతర ఏటీఎంల నుంచి ఎన్నిసార్లు అయినా నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ అవకాశం వచ్చే మూడు నెలల దాకా అందుబాటులో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వను ఉంచాలనే అంశంలో ఎలాంటి నియంత్రణ ఉండదు. ఇకపై బ్యాంకింగ్ ఛార్జీలను కూడా తగ్గిస్తారు.
కర్ఫ్యూ సమయంలో పాస్ లు జారీ!

దేశంలో కారోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూను అమలు పరుస్తున్నాయి. అనేక చోట్ల బయటకు వచ్చిన వారిపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు చెక్ పెట్టేవిధంగా కేరళ పోలీసులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. అవసరమైన వస్తువులను కొనడానికి బయటకు రావాలనుకునే వారికి కేరళ పోలీసులు పాస్లు జారీ చేస్తారు. ఎటువంటి కారణం లేకుండా సాధారణంగా బయలుదేరిన వారిపై కేసు నమోదుచేస్తున్నారు.
తిరువనంతపురం జిల్లాలో నేడు 52 కేసులు నమోదయ్యాయి. ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కేరళ పోలీసు చీఫ్ లోక్‌నాథ్ బెహ్రా తెలిపారు.
ఇదే విధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యవసరంగా, నిత్యావసర వస్తువుల కొరకు బయటకు వచ్చే వారికి పాస్ లు మంజూరు చేస్తే మంచిదని పలువురు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అనేకకోట్ల ప్రజాధనం రంగుల పాలు

ఏపీలోని పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దింతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నారో.. అర్థమౌతోంది. అంతేకాకుండా సీఎం చర్యతో అనేకకోట్ల ప్రజాధనం వృధా అవుతోంది.
సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే..ఆ పార్టీ ప్రతిభింబిచేలా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ గుర్తులతో నింపేయడం సర్వసాధారణం. కానీ ఏపీ అధికారపార్టీ వైసీపీ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తూ..గ్రామ సచివాలయం గోడపై ఉన్న జాతీయ జెండాకి వైసీపీ జెండా రంగులు వేయడం, గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో జగన్ బొమ్మలను వేసి విమర్శల పాలైంది.
ఇదే అంశంపై ముప్పా వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో.. హైకోర్టు, జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని ఏపీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి పార్టీ రంగులూ ఉండకూడదని ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. దీనిపై జస్టిస్ నాగేశ్వరరావు స్పందిస్తూ…‘అలా ఎలా చెప్తారు? అధికారంలోకి వచ్చిన వారు వారి పార్టీ గుర్తులు ప్రభుత్వ కార్యాలయాలకు వేసుకుంటూ పోతే ఎలా? కేంద్ర సంస్థలకు కాషాయ రంగు వేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకుంటారా?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసే రంగులకు నేషనల్ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేస్తూ పిటిషన్ కొట్టివేసింది.
దింతో వైసీపీ పార్టీ రంగుల పంచాయితీకి తెరపడినట్లయింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పంచాయితీ కార్యాలయాలలో వైసీపీ వేసిన రంగులను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో మరో రంగు వేయడానికి అనేక కోట్ల ప్రజాధనం వేస్ట్ అవుతోందని అనేకమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మంచి హీరోలు మనసున్న విలన్
భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ కరోనా వైరస్ ని ఎలాగైనా సరే అడ్డుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా కీలకమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని సినిమాలు, సినిమా షూటింగులు బంద్ పాటిస్తున్నాయి. ఆ ప్రభావం రోజు వారి సినీ కార్మికుల ఫై బాగా పడింది. ఇప్పటికే వారు తమ ఉపాధిని కూడా కోల్పోయారు.
ఇలాంటి ఆపత్కర సమయం లో సినీ కార్మికులు పడే బాధలు చూడలేక సీనియర్ తమిళ హీరో శివ కుమార్ తన కొడుకులైన హీరో సూర్య , హీరో కార్తీ లతో కలిసి ఒక మంచి పని చేసాడు. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ అఫ్ సౌత్ ఇండియా ( f e f s i ) కార్మికుల సంక్షేమం కోరుతూ 10 లక్షల భారీ విరాళం అందజేయడం జరిగింది. దాంతో వీరి యొక్క దాన గుణాన్ని కోలీవుడ్ బహుదా ప్రశంసిస్తోంది.
అలాగే ఈ విపత్కర సమయం లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకొని సినీ వర్గాల్లో కొందరికి సహాయం చేయాలని సంకల్పించాడు. అనుకోండి ప్రశంసిస్తూ తడవుగా ప్రకాష్ రాజ్… తన పొలంలో పని చేస్తున్న వారితో పాటు, తన ఇంటిలో పనిచేస్తున్న వారికి , ప్రొడక్షన్ కంపెనీలో పనిచేసే వారికి , ఫౌండేషన్ ఉద్యోగులకు మరియు వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల వరకు జీతాలు ముందుగానే ఇచ్చేశారు. అంతేకాకుండా తాను ప్రస్తుతానికి నటిస్తున్నటువంటి సినిమాలలో పని చేస్తున్న రోజు వారీ వేతన జీవులకు కూడా సగం జీతం ఇవ్వాలని ప్రకాష్ రాజ్ నిర్ణయించు కొన్నాడట …
Great lives in the hearts of public
పరశురామ్ పంట పండింది
2008 లో నిఖిల్ హీరోగా ‘యువత’ సినిమాతో డైరెక్టర్ గా మారిన పరుశురాం ఇన్నాళ్ళకి తన కల నెరవేర్చుకో గలుగుతున్నాడు. సరిగ్గా పన్నెండు ఏళ్ళ తరవాత స్టార్ హీరో ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించు కొన్నాడు. రీసెంట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’తో భారీ హిట్ అందుకున్న మహేశ్ బాబు నటించే 27వ సినిమాను తాను డైరెక్ట్ చేయనున్నాడు. నిజానికి మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాడు. దిల్ రాజు నిర్మాతగా ఆ సినిమాను నిర్మించడానికి రెడీ అయినాక వంశీ పైడిపల్లి చెప్పిన కథ విని నచ్చకపోవడంతో నో చెప్పేశాడు. దాంతో ఆ అవకాశం పరశురామ్ కి దక్కింది.
ముఖ్యంగా మహేశ్ బాబు నటించ బోయే 27 చిత్రానికి దర్శకుడిగా పరుశురాం పేరు ఖరారు కాక మునుపు చాల మంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం దాదాపు మహేష్ నెక్స్ట్ మూవీని పరుశురామ్ డైరెక్ట్ చేయడం ఖాయమైంది. ‘గీత గోవిందం’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు రెండేళ్లుగా పెద్ద అవకాశం కోసం వెయిట్ చేసిన పరుశురామ్ చివరకు మహేష్ బాబు ని తన కథతో లాక్ చేసుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ తో పాటు మహేష్ బాబు ఓన్ ప్రొడక్షన్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోనుందని తెలుస్తోంది . మే నెలలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
Patience is bitter but it`s fruits are very sweet.
హంటా వైరస్ లక్షణాలు ఇవే..
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచం గజగజ వణికిపోతుండగా మరో కొత్త వైరస్ పుట్టికొచ్చింది. చైనాలోనే ఈ కొత్త వైరస్ పుట్టుకురావడం గమనార్హం. దీనికి వైద్యులు ‘హంటా’గా నామకరణం చేశారు. ఈ హంటా వైరస్ సోకి చైనాలో ఒకరు మృతిచెందడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా హంటర్ వ్యాధి లక్షణాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
-ఎలుకల ద్వారా సోననున్న ‘హంటా’..
హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకలు వదిలిన లాలాజలం, మలం, మూత్రం వల్ల మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఎలుకలు కరవడం వల్ల కూడా వచ్చేఅవకాశముంది. హంటా వైరస్ అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు. అయితే హంటా వైరస్ సోకిన వ్యక్తి మూత్రం, మలం ఇతరుల శరీరాలకు వెళితే వారికి ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తి మలం, మూత్రం మంచినీటిలో కలిసి ఆ నీరుతాగితే సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు డెంగ్యూ వ్యాధిని పోలి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక దశలోనే ఈ వైరస్ ను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేనట్లయితే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
-హంటా వైరస్ లక్షణాలివే..
హంటా వైరస్ సోకిన వ్యక్తికి తీవ్ర జ్వరం వస్తుంది. ఉన్నట్టుండి కండరాల నొప్పి, ఆ తర్వాత బీపీ తగ్గుతుంది. మూత్రపిండాల పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. నీరుడు తక్కువగా అవడం. ఆ తర్వాత నీరు ఎక్కువగా పోవడము. మూత్రపిండాలు పాడవడం. ఊపిరి తీసుకోవడములో ఇబ్బందులు ఏర్పడుతాయి. గుండె వేగంగా కొట్టుకోవడం. దగ్గు ఎక్కువగా వచ్చి గుండెపోటుతో మరణిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా అరికట్టేందుకు ప్రపంచం నానా ఇబ్బందులు పడుతుంటే.. మరో మహమర్మి చైనాలో పుట్టుకురావడం ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తుంది.
చైనాలో పుట్టుకొచ్చిన మరో మహ్మమరి
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచం గజగజ వణికిపోతుంది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈమేరకు తగిన నివారణ చర్యలను ఆయా దేశాలు చేపడుతున్నాయి. అయితే తాజాగా మరో వైరస్ పుట్టుకొచ్చి ప్రపంచానికి సవాల్ విసురుతోంది. కరోనా పుట్టిన గడ్డపైనే ఈ కొత్తరకం వైరస్ పుట్టుకొచ్చింది. దీనికి వైద్యులు ‘హంటా’గా నామకరణం చేశారు. ఈ హంటర్ వ్యాధి సోకి చైనాలో ఒకరు మృతిచెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
చైనాలో హంటా వైరస్ లక్షణాలు మరో 32మందిలో ఉన్నట్లు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది. దీంతో చైనావాసులు బెంబెలెత్తిపోతున్నారు. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో ఈ హంటా వైరస్ పుట్టుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. యూనాన్ ప్రావిన్స్ కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలను గుర్తించారు. 33మంది ప్రయాణికుల ఉన్న బస్సులో ప్రయాణించిన ఆ వ్యక్తి హంటా వైరస్ తో కొన్ని గంటల్లోనే మృతిచెందాడు. దీంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
ఆ వ్యక్తితో బస్సులో ప్రయాణించిన వారందరికి పరీక్షలను నిర్వహించింది. కొందరికీ పాజిటివ్ లక్షణాలు కన్పించడంతో వారిని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ హంటా వైరస్ ఎలుకల ద్వారా వస్తుందని వైద్యులు తెలిపారు. ఎలుకలు వదిలిన లాలాజలం.. మాలమూత్రం ద్వారా వైరస్ విస్తరిస్తుందని, ఎలుకలు కరవడం ద్వారా వచ్చే అవకాశం ఉందని.. ఇది అంటువ్యాధి కాదని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిని ప్రాథమిక దశలో నివారించకపోతే ప్రాణాంతకంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్.. ఖైదీలకు వరమా?
కరోనా పేరు చెబితేనే ప్రపంచం గజగజలాడిపోతుంది. చైనాలో సోకిన కరోనా మహహ్మరి క్రమంగా అన్నిదేశాలకు పాకింది. కరోనా మహ్మమరికి భయపడి ప్రజలు ఇళ్లకు పరిమితమవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కరోనా ఎఫెక్ట్ మాత్రం ఖైదీలకు వరంగా మారింది. కరోనా నివారించడానికి సరైన సదుపాయాలు లేవని కారణంతో మంగళవారం న్యూజెర్సీలోని 1000మంది ఖైదీలను విడుదల చేయాలని న్యూజెర్సీ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
వీరిలో త్రీవమైన నేరాలకు పాల్పడిన వారిని విడుదల చేయడం లేదు. కేవలం జైళ్లలో సత్పప్రవర్తన కలిగిన ఖైదీలను మాత్రమే విడుదల చేయాలని న్యాయమూర్తి నిర్ణయించారు. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనాతో తమకు విముక్తి కలిగినందుకు ఆనందపడాలో.. లేక కరోనా మహమ్మరి ప్రపంచాన్ని కబలిస్తున్నందుకు దుఃఖించాలో తెలియని పరిస్థితిలో ఖైదీలున్నారు. కరోనాతో ప్రజలు భయాందోళన చెందుతుంటే.. కొందరు ఖైదీలు మాత్రం జైలు నుంచి కూడా విడుదలవడం గమనార్హం. న్యూజెర్సీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఖైదీలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.












20వ శతాబ్దంలో సోషల్ మీడియా పాత్రను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీఒక్కరు సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతుంటారు. ఒకరి భావాలను మరొకరు పంచుకునేందుకునే, వినోదం, తదితర అంశాలకు సోషల్ మీడియాను విస్కృతంగా ఉపయోగిస్తుంటారు. ఇక సెలబెట్రీలైతే తమ అభిమానులతో తమ రోజువారీ విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇప్పటికే అనేక మంది సెలబెట్రీలు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి తమ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. తాజాగా టాలీవుడ్ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.





ఈ మధ్య తెలుగు సినిమాకి శాండల్ వుడ్ పరిమళం ఎక్కువై పోతోంది. పూజా హెగ్డే , రష్మిక మందన్న వంటి కన్నడ భామలు తెలుగు లో తమ సత్తా చాటు తున్నారు. ఇంకా చెప్పాలంటే అగ్ర తారలుగా వెలుగుతున్నారు అంతకు ముందు స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క టాలీవుడ్ కి మకుటం లేని మహారాణి గా పేరు తెచ్చుకొంది. ఇపుడా వరసలో మరో కన్నడ హుడిగి తెలుగు తెర ఫై తన అదృష్టాన్ని పరీక్షించుకో బోతోంది .