
కరోనా(కోవిడ్-19) వైరస్ ఎదుర్కొనేందుకు ఓ పెద్దాయన భారీ విరాళాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.100కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆయన ఏవరో కాదు.. వేదాంత రిసోర్సెస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్. దీనిపై ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని చెప్పారు. రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనాన్ని గడిపే వారికోసం తనవంతుగా తక్షణ సాయంగా 100కోట్ల విరాళాన్ని ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.
కరోనాపై పోరాటానికి ‘దేశ్ కీ జరూరతోన్ కే లియే’ అనే వాగ్ధానం చేస్తున్నానని.. ప్రస్తుతం మన దేశానికి ఇదే కావాలని అన్నారు. కరోనాతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రోజువారీ కూలీల జీవనం అస్తవ్యస్తంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం తనకు తోచినంత వారికి సాయం అందిస్తున్నానని అని అనిల్ కపూర్ పేర్కొన్నారు. భారత్ లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనిల్ కపూర్ 100కోట్ల విరాళం ప్రకటించడంపై పలువురు అభినందిస్తున్నారు. అనిల్ కపూర్ దాతృత్వానికి సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.