కరోనా వైరస్ పేరు చెబితే ప్రపంచం గజగజలాడిపోతుంది. ఈ వైరస్ చిన్న, పెద్ద తేడా లేకుండా విజృంభిస్తోంది. ముఖ్యంగా సెలబ్రెటీలు కరోనా పేరు చెబితేనే బెంబెలేత్తిపోతున్నారు. కరోనాకు మందులేకపోవడంతో ఎంత ధనికులైనా ఈ వైరస్ తో పోరాడి చివరకు మృత్యువాత పడక తప్పడం లేదు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ కరోనాతో పోరాడి చివరకు మృతి చెందారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదచాయలు నెలకొన్నాయి.
హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి గత కొన్నిరోజుల క్రితం కరోనా సోకింది. ఈ విషయాన్ని సోఫియా కొన్నిరోజుల కిందటే కన్ఫామ్ చేసింది. అయితే తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని.. త్వరలోనే కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆయన 60ఏళ్ల వృద్ధుడు కావడంతో కరోనాను ఎదుర్కోవడం ఆయన వల్ల కాలేదని వాపోయింది. దీంతో కరోనాతో పోరాడి పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందినట్లు కన్నీటి పర్యంతమైంది.
కరోనా సోకి సినీపరిశ్రమకు చెందిన వారిలో తొలి వ్యక్తిగా పీటర్స్ మైల్స్ నిలిచారు. ఆయన సీనీ యావత్ సీని ప్రపంచంతోపాటు సోఫియా మైల్స్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.