కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. చైనాలోని వూహాన్లో సొకిన కరోనా వైరస్ క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ప్రస్తుతం ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ప్రజలకు ఉపయోగపడే మాస్కులు పెద్దఎత్తున అక్రమ నిల్వలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే అక్రమంగా నిల్వచేసిన కోటి రూపాయల విలువైన మాస్కులు తాజాగా బయటపడ్డాయి. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల నిల్వలను అరికట్టడానికి జరిపిన దాడుల్లో మాస్కుల అక్రమ నిల్వలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి పక్కా సమాచారంతో గోదాములపై పోలీసులు దాడిచేశారు. గోదాముల్లో నిల్వచేసిన 200బాక్సుల ఫేస్ మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
ఈ మేరకు మాస్కులను అక్రమంగా నిల్వచేసిన గోడౌన్ యజమాని, ఏజెంట్, సరఫరాదారుడితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్‌లు వంటి ముఖ్యమైన వస్తువులను నిల్వ చేయడం నేరమని పోలీసులు పేర్కొంటున్నారు. సోమవారం కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రూ.15.25కోట్ల విలువచేసే మాస్కులను సీజ్ చేశారు. పోలీసుల దాడుల నేపథ్యంలో గత రెండ్రోజులుగా మాస్కుల అక్రమ నిల్వలు బయటపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి దాడులకు పాల్పడితే మొత్తంలో మాస్కులు, శానిటైజర్లు, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలు పెద్దఎత్తున బయటపడుతాయని పలువురు అంటున్నారు. ఈ దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.









అత్యాధునిక వైద్య సదుపాయాలు, అపారమైన వనరులు గల అమెరికా నేడు కరోనా వైరస్ తో కకావికలం కావడానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలి దశలో అనుసరించిన నేరమయ నిర్లక్ష్య వైఖరియే కారణమా? అవుననే ఆ దేశంలోని సీనియర్ అధికారులు, రాజకీయ నేతలు వాపోతున్నారు.










కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి దేశం మొత్తం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించడంతో దేశ వృద్ధి రేటుపై దారుణమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. దేశ వార్శిక వృద్థిరేటు కేవలం 2.5శాతానికే పరిమితం కావచ్చని బార్‌క్లే బ్యాంకు అంచనా వేసింది. ఈ ఏడాది దేశ వృద్దిరేటు 4.5శాతం ఉండవచ్చని గతంలో అంచనా వేశారు. కానీ ఈ ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో లాక్‌డౌన్ ప్రభావం అసాధారణంగా ఉంటుందని బార్‌క్లే తెలిపింది.









మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. తన అభిమానులతో తన భావాలను షేర్ చేసుకునేందుకు ఓ వేదిక కోసం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అన్నట్లుగా ఉగాది రోజున ఉదయం 11గంటల 11నిమిషాలకు మెగాస్టార్ ట్వీటర్లో తన తొలి ట్వీట్ చేశారు. ‘తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అంటూ తొలి ట్వీట్ చేశారు. అదేవిధంగా కరోనాపై నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరో ట్వీట్ చేశారు.