
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నారు. ‘శ్రీమంతుడు’, మహర్షి’, ‘సరిలేరునికెవ్వరు’ వరుస హిట్లను మహేష్ బాబు అందుకున్నాడు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజైన ‘సరిలేరునికెవ్వరు’ మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహేష్ జోడిగా రష్మిక మందన్న నటించింది. వీరిద్దరి జోడీకి ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించారు. ఈ మూవీ తర్వాత మహేష్ తర్వాత మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
‘సరిలేరునికెవ్వరు’ మూవీ తర్వాత పలువురు క్రేజీ దర్శకులతో మహేష్ బాబు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి మూవీ ఉంటుందని అందరు భావించారు. అయితే ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో చిత్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మహేష్ బాబు-పర్శురాం దర్శకత్వంలో నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగానే మహేష్ బాబు-పూరి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుందని వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
దర్శకుడు పూరీ జగన్నాథ్-సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచాయి. ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ బాక్సాఫీస్ హిట్టందుకున్నాయి. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ రాలేదు. తాజాగా మహేష్ బాబుకు సరిపోయే కథను పూరి సిద్ధం చేసినట్లు తెల్సింది. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమా చేసేందుకు పూరి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం పూరి జగన్మాథ్ విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. మహేష్ బాబు వంశీపైడిపల్లి, పరుశురాం దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూడో చిత్రం రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.