Home Blog Page 8569

దేశంలో అతిపెద్ద కరోనా ఆసుప్రతి ఎక్కడో తెలుసా?

కరోనా(కోవిడ్-19) పేరు చెబితినే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్ పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దేశమంతటా 21రోజులపాటు లాకౌడౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. కరోనా నియంత్రణ కోసం కేంద్రం తీసుకునే అన్ని చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా దేశంలో కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఆసుప్రతి ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు చైనా కేవలం పది రోజుల్లోనే 1000పడకల ఆసుప్రతి నిర్మించిన సంగతి తెల్సిందే. ఈ తరహాలోనే భారత్ లోనూ ప్రత్యేక ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్రం పూనుకుంది. ఒడిశాలో అతిపెద్ద కరోనా(కోవిడ్-19) ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వెయ్యి పడకలతో కూడిన ఓ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దేశంలోనే కరోనా కోసం ప్రత్యేకంగా ఆసుప్రతి ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ఇందులో కరోనా బాధితులకు ప్రత్యేకమైన చికిత్స అందిస్తున్నారు.

అన్ని రాష్ట్రాలు ఒడిశాను ఆదర్శంగా తీసుకోవాలిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు. ఒడిశా తరహాలోనే మరిన్ని రాష్ట్రాలు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసే దిశగా సన్నహాలు చేస్తున్నట్లు తెల్సింది.

ప్రభుత్వ తీరుపై ఫైర్ అయిన పవన్

జంట నగరాల్లో హాస్టళ్ల నుంచి వచ్చిన వాళ్లు ఏపీ సరిహద్దుల్లో ఆపేయడం పై జనసేన అధినేత ఫైర్ అయ్యారు. రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టి వారిని స్వస్థలాలకు పంపాలని కోరారు. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా ఏపీ సీఎం జగన్‌ కు పవన్‌ విజ్ఞప్తి చేశారు.

‘‘హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నో అబ్జెక్షన్ పత్రాలతో బయలుదేరిన ఏపీ వారిని సరిహద్దుల్లో ఆపివేయడంతో నడిరోడ్డుపై ఇప్పటికీ ఇబ్బందులుపడుతున్నారు. హాస్టల్స్ మూసివేతపై రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. వీరిలో చదువుకుంటున్నవారు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులు ఉన్నారు. వారి వేదనను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకొని స్వస్థలాలకు చేర్చాలి. అవసరమైన వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించండి. అలా రోడ్డుపై గుంపులుగా వదిలేస్తే కొత్త సమస్యలు వస్తాయి’’ అని పవన్‌ అన్నారు.

“రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందిలో అందరికీ ఎన్-95 మాస్కులు అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షించే సిబ్బందితో పాటు సంబంధిత వైద్యులను ప్రభుత్వం పట్టించుకోవాలి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, రక్షణ దుస్తులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగంలో ఉన్నవారికీ వీటిని అందించడం అవసరం. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యతో పాటు వాటిలో శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యాన్ని పెంచాలి’’ అని సీఎంకు సూచించారు.

రైతు సాయానికి ఫిదా అయిన మాజీ ఎంపీ కవిత

అతనో సామాన్య రైతు.. అయితేనేం.. దేశంలో వచ్చిన కరోనా లాంటి విపత్కర పరిస్థితిని చలించిపోయాడు. తన దగ్గరున్న మొత్తం డబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసిన గొప్ప మనస్సు చాటుకున్నాడు. దేశాన్ని కాపాడేందుకు రైతన్న ఎల్లప్పుడు ముందే ఉంటాడని ఆ రైతు నిరూపించాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల అతనో ‘రియల్ హీరో… చాలా ఇన్‌స్పైరింగ్’ అంటూ తన ట్వీటర్లో ట్వీట్ చేసి అభినందించారు. దీంతో ఆ రైతు గురించి తెలుసుకునేందుకు నెజిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా లాండసాంగి గ్రామానికి చెందిన మోర హన్మాండ్లుకు కేవలం నాలుగెకరాల భూమి ఉంది. కొన్ని రోజులుగా కరోనా వైరస్ గురించి వార్తలను వింటున్నట్లు హన్మండ్లు చెప్పాడు. కరోనా నివారణకు కేంద్రం లాక్డౌన్ చేసిందని చెప్పారు. ఈ ఏడాది పంటలు బాగానే పండాయని.. అయితే కరోనాతో పేదలు ఆకలితో పస్తుంటారని తెలుసుకొని తన కుమారుడు కొంత ఆర్థికసాయం చేద్దామని చెప్పినట్లు హన్మండ్లు వివరించారు. దీంతో తన దగ్గరున్న 50వేలను రూపాయలను బుధవారం తమ జిల్లా కలెక్టర్ దేవసేనను అందజేసినట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50వేల చెక్కును జమ చేయాలని కోరినట్లు తెలిపాడు.

50వేలు ఇవ్వడం వల్ల తనకు కొంత ఆర్థికంగా నష్టం జరుగచ్చు కానీ.. కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుంటాననీ గర్వంగా చెబుతున్నాడు. తన లాంటివాళ్లు సాయం చేయడానికి ముందుకు రావాలని హాన్మండ్లు కోరుతున్నాడు. ఇలాంటి కష్టం శత్రువులకు కూడా రావొద్దని కోరుకుంటున్నానని తెలిపాడు. ఆయన నిస్వార్థ హృదయానికి ప్రతీఒక్కరూ ఫిదా అవుతున్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రైతు సాయాన్ని తెలుసుకొని తన ట్వీటర్లో రైతు సాయానికి సంబంధించిన క్లిప్పింగ్ పోస్టు చేశారు. అతనో ‘రియల్ హీరో.. చాలా ఇన్‌స్పైరింగ్’ అంటూ ట్వీట్ చేయడం ప్రతీఒక్కరిని ఆకట్టుకుంది.

Neha Malik Glamorous Pics

ఖైదీలకు మేలు చేసిన కరోనా!

కరోనా వైరస్‌ సృష్టిస్తోన్న భయానక పరిస్థితులకు ప్రపంచం మొత్తం హడలిపోతుండగా.. జైళ్లలోని ఖైదీలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యాధి కొందరు ఖైదీలకు వరంలా మారింది. ఏళ్లతరబడి జైల్లో మగ్గుతున్న వీరికి స్వేచ్ఛ దొరికినట్లయింది. జైళ్లలోని విచారణ ఖైదీలను జామీనుపై విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే..

భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో రానున్న 3-4 రోజుల్లో 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని తీహార్ సెంట్రల్ జైలు నిర్ణయించినట్లు తీహార్ జైలు పరిపాలన మీడియాకు తెలిపింది. అంతేకాదు చెన్నై లో కూడా మరో మూడు వేలమంది ఖైదీలు విడుదల కానున్నారు. తీహార్ జైలు రాబోయే 3-4 రోజుల్లో 3000 మంది ఖైదీలను విడుదల చేస్తుంది. వీరిలో 1500 మంది దోషులను పెరోల్‌పై, ఇతర 1500 మంది ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయనున్నారు. గత ఏడాది ఆగస్టు 5 న జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను రద్దు చేయడంతో అల్లర్లకు పాల్పడిన 261 మంది ఖైదీలను దేశంలోని వివిధ జైళ్లలో ఉంచారు. వీరికి కూడా తాత్కాలికం ఊరట కల్పించించారు. మరోవైపు చెన్నై సెంట్రల్‌ పుళల్‌ జైల్లో ఆడ, మగ కలుపుకుని 3 వేల మందికి పైగా ఖైదీలున్నారు. ఈ జైలులోని ఖైదీలను విడుదల చేయాలని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు న్యాయస్థానాల నుంచి జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే జైలు ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, విడుదల చేయబోయే ఖైదీల పేర్లను మాత్రం ఇంకా ఇవ్వలేదు.

సినీ కార్మికుల కోసం కోటి రూపాయలు ఇచ్చిన చిరు

రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్ళది. షూటింగ్ ఉంటేనే నాలుగు వేళ్ళు లోపలికి వెళతాయి. లేదంటే ఆ రోజు పస్తు పడుకోవాల్సిందే. రోజువారీ బేటాలే వారి సంపాదన. నెలవారీ జీతం లాంటివి ఏమీ వుండవు. ఇది నూటికి తొంబై మంది సినీ కార్మికుల దైనందిన జీవిత చక్రభ్రమణం అందులో ఎపుడైనా గతి తప్పిందా వారి భాదలు చెప్పా నలవి కాదు. షూటింగ్ ఉంటేనే కడుపు నిండుతుంది. లేదంటే ఆకలితో అలమటించాల్సిందే … రంగుల రాట్నం తిరిగినంత సేపే హుషారుగా ఉంటుంది. ఆగితే ఇక అంతే…

నలభై మూడేళ్ళుగా చిత్ర పరిశ్రమ తో అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి కి ఇవన్నీ బాగా తెలుసు. అందుకే కరోనా వైరస్ తో చిత్ర పరిశ్రమ సంక్షోభం లోకి నెట్టి వేయబడింది అని తెలుసుకోగానే స్పందించాడు.

తన వంతు వితరణ చూపించి తెలుగు సహా మొత్తం చిత్ర లోకపు కార్మికులు అందరికి ఒక కోటి రూపాయలు విరాళంగా ఇవ్వబోతున్నాడు. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇదే రకమైన స్పందన తో యాభై లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. మిగతా సినీ హీరోలు కూడా సినీ కార్మికుల కోసం తమ వంతు సాయం అందిస్తున్నారు. .

Rashmi Gautam Traditional Photos

తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్!

తెలంగాణలో ఈ రోజు మరో మూడు కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైరస్‌ సోకిన ఇద్దరు డాక్టర్లు కూడా భార్యాభర్తలు కావడం గమనార్హం హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన డాక్టర్‌ తో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. భర్త నుంచి భార్యకు కరోనా వ్యాప్తి చెందింది. కుత్బుల్లాపూర్‌ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతను ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. డాక్టర్లయినా భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 44కు చేరింది.

క్వారంటైన్ కు అంగీకరిస్తేనే.. ఏపీలోకి ఎంట్రీ

కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొంటున్నది. ముఖ్యమంగా పొరుగు రాష్ట్రాల నుండి స్వగ్రామాలకు వచ్చే వారు తమ ఆధీనంలో ఉన్న క్వారంటైన్ లో ఉండాలని, అలా ఉంటేనే రాష్ట్రానికి రావాలంటే స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో స్వగ్రామాలకు వచ్చేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పోలీసులు వారిని నిలిపివేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరైనా సరే తప్పనిసరిగా 14రోజుల క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేశారు.

క్వారంటైన్ పూర్తయిన తరువాత వారి వారి స్వగ్రామాలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు డాక్టర్లను పంపిస్తామని, కరోనా వైరస్ టెస్ట్ ల అనంతరం హోం క్వారంటైన్ కు పంపిస్తున్నట్లు చెప్పారు.

ఇలా ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా స్క్రీనింగ్‌ చేస్తోంది. ఇప్పటివరకూ 26,059 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని వాలంటీర్లు గుర్తించారు. మరోవైపు 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

అలాగే 117మందిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకూ 332 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, 289 కేసులు నెగటివ్‌గా, 10 కేసులు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. మరో 33 కేసుల ఫలితాల కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌, నాకా బందీకి సీఎస్‌, డీజీపీలు ఆదేశాలు ఇచ్చారు. అన్ని రహదారులను బ్లాక్‌ చేసి, పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ నుంచి వచ్చి 44 మందిని క్వారంటైన్‌కు తరలించి, వైద్యం అందిస్తున్నారు. ఇక ప్రజల సందేహాలు తీర్చేందుకు 24 గంటల కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఇరవై నాలుగు గంటలు పని చేసేలా నాలుగు టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.

రేపు ఎపి క్యాబినెట్ భేటీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది. అమరావతిలోని సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు నిర్వహించక పోవడంతో, మూడు నెలల బడ్జెట్ కు ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకురానుంది. జూన్ 30 వరకూ అవసరమైన నిధులకు ఆర్డినెన్స్ రూపొందించనున్నారు. క్యాబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ కు ఆర్డినెన్స్ ను పంపుతారు.

ఇప్పటి వరకు 1వ బ్లాక్ల్ లోని సీ.ఎం.ఓ లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో సామాజిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గుంటూరులో ఫస్ట్:ఎమ్మెల్యే బామ్మర్దికి కరోనా పాజిటివ్

 

మార్చి 22 న దేశమంతా కర్ఫ్యూ అమలుపరుస్తున్న సమయంలో గుంటూరులోని మంగళదాస్ నగర్ 2వ లైన్ లో ఉన్న పారిశ్రామిక వేత్త మరియు వన్ టౌన్ ఎమ్మెల్యే(వైసీపీ) మొహ్మద్ ముస్తఫా షేక్ బామ్మర్ది వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 500మందితో ఒక పార్టీ ఇచ్చారు. అతనికే కరోన పాజిటివ్ అని తేలడంతో గుంటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది.

ఆ పార్టీ సమయంలో అతను ఎంతమందిని టచ్ చేశారో వారికి కూడా కరోన వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో వన్ టౌన్ ప్రాంతంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. విందుకు వచ్చిన వందల మందిలో కూడా కరోనా వ్యాప్తి చెందే ఉండవచ్చనే అంచనా వేస్తున్నారు. వారిలో ఇప్పటికే 80మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నారు.మిగిలిన 420మంది ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.అలాగే ఎమ్మెల్యే(వైసీపీ) మొహ్మద్ ముస్తఫా షేక్ కూడా ఈ 10రోజుల్లో ఎవరెవరిని కలిసారనే దానిపై ఆరా తీస్తున్నారు.గుంటూరు వన్ టౌన్ లో తొలి కరోనా కేసు నమోదు కావడంతో అధికార యంత్రంగం కఠిన ఆంక్షలు విధించింది. వన్ టౌన్ ప్రాంతంలోని ప్రజలు ఎవరు కూడా ఇంట్లో నుండి బయటకు రాకూదని ఆదేశాలు జారీ చేసింది.

అజ్మీర్ వెళ్ళిన ఎమ్మెల్యే బామ్మర్ది ఈ నెల 19వ తేదీన గుంటూరు వచ్చి అక్కడ కర్ఫ్యూ రోజున పార్టీ ఇచ్చారు. ఆ మరుసటి రోజు జలుబు, జ్వరం లక్షణాలతో అతను ఆసుపత్రిలో చేరడంతో పరీక్షలు నిర్వహించి కరోన పాజిటివ్ అని తేల్చారు.

ఇదిలా ఉండగా కర్ఫ్యూ రోజు 500మంది పార్టీ కోసం ఎవరు అనుమతించారు? పార్టీకి వెళ్లే వారిని పోలీసులు అడ్డుకోలేదా..? లేదా వెళ్ళడానికి పోలీసులే సహకరించారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై కూడా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు

పేదలకు రూ 1,70 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి

కరోనా కల్లోలంతో లాక్‌డౌన్ సమయంలో పేదలు ఎవ్వరు ఆకలితో అలమటించకుండా చూడడం కోసమై ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ రూ 1.70 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు.
గరీబ్ కల్యాణ్ పేరుతో ప్రకటించిన ఈ భారీ ఆర్ధిక ప్యాకేజీలో ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు, రోజువారీ కూలీలను ఆదుకోవడం కోసమై ఉద్దేశించారు.

లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ, పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మల ప్రకటించారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర ఆరోగ్య బీమాను కల్పించనున్నట్టు ఆమె వెల్లడించాయిరు.

80 కోట్ల మంది పేద ప్రజలకు ఇప్పుడిస్తున్న రూ.5 కేజీల బియ్యం, గోధుమలకు అదనంగా మరో 5 కేజీలు ఉచితంగా అందిస్తామని నిర్మల పేర్కొన్నారు. ఇప్పుడిస్తున్న 1 కేజీ పప్పు ధాన్యాలకు అదనంగా మరో కేజీ పప్పు ధాన్యాలు ఇస్తామని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద వచ్చే మూడు నెలల పాటు ఈ అదనపు ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు.

న‌రేగా కింద దిన‌స‌రి కూలీని రూ.182 నుంచి రూ.202కు పెంచుతున్నామ‌ని, దీని ద్వారా దాదాపు ఐదు కోట్ల మందికి లాభం క‌లుగుతుంద‌ని ఆర్ధిక మంత్రి తెలిపారు. క‌నీసం వీరి ఆదాయం రూ.2000 దాకా పెరుగుతుంద‌ని పేర్కొన్నారు.

నిరుపేద వృద్ధులు, వితంతువులు, విక‌లాంగుల‌కు రెండు వాయిదాల చొప్పున రూ.1000ను అంద‌జేస్తామ‌ని, వీటి ద్వారా సుమారు మూడు కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని చెప్పారు. దేశంలో ఉన్న 20.5 కోట్లు గ‌ల మ‌హిళ‌ల జ‌న్ ద‌న్ ఖాతాలో నెల‌కు రూ.500 చొప్పున నేరుగా సొమ్మును మూడు నెలలపాటు జమ‌చేస్తామ‌ని వెల్ల‌డించారు.

క‌రోనా బాధితుల‌కు వైద్య‌సాయం అందించే ప్ర‌తి ఆరోగ్య సిబ్బందికి సుమారు రూ.50 ల‌క్ష‌ల బీమా సౌక‌ర్యాన్ని వ‌చ్చే మూడు నెల‌ల దాకా క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో డాక్ట‌ర్లు, పారామెడిక‌ల్‌, ఆరోగ్య సిబ్బంది, క‌రోనా కోసం ప‌ని చేసే ఆశా వ‌ర్క‌ర్లు.. ఇలా మొత్తం ఇర‌వై ల‌క్ష‌ల మంది ప్ర‌యోజ‌నం పొందుతార‌ని వివ‌రించారు.

సంఘ‌టిత రంగంలో ప‌ని చేసే ఉద్యోగుల‌కు వ‌చ్చే మూడు నెల‌ల కాలానికి కేంద్ర ప్ర‌భుత్వ‌మే 24 శాతం ఈపీఎఫ్ చెల్లిస్తుంద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. వంద ఉద్యోగులు ఉన్న సంస్థ‌ల్లో, దాదాపు తొంభై శాతం మంది జీతం నెల‌కు రూ.15,000 లోపు ఉన్న‌వారికి ఇది వ‌ర్తిస్తుంద‌ని వివరించారు. అంతేకాకుండా 75 శాతం పీఎఫ్ విత్ డ్రా కూడా చేసుకోవచ్చని ఆమె తెలిపారు.

ఉజ్వల లబ్ధిదారులకు నెలకు ఒకటి చొప్పున మూడు గ్యాస్ సిలిండర్లు 8 కోట్లమంది మహిళలకు ఉచితంగా ఇస్తామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతున్నామని ప్రకటించారు. 8.69 కోట్ల మంది రైతులకు సంవత్సరానికి రూ 6,000 మొత్తంలో తక్షణం రూ 2,000 అందిస్తామని వెల్లడించారు.

నమోదైన 3.5 కోట్ల మంది నిర్మాణమని కార్మికులకు గల రూ 31,000 కోట్ల సంక్షేమ నిధిని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చని ఆర్ధిక మంత్రి తెలిపారు. అదే విధంగా జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న మినరల్ నిధులను వారి ఆరోగ్యాల కోసం ఉపయోగించుకోవచ్చని ఆమె చెప్పారు.

కేవ‌లం లాక్‌డౌన్ సరిపోదు… దూకుడు అవసరం

కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్రపంచ దేశాలు వరుసగా లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తున్నా అదేమీ సరిపోదని, మరింత దూకుడు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్ఫష్టం చేసింది. దాదాపు 300 కోట్ల జ‌నాభా ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న‌ది. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 21 వేల మంది చ‌నిపోయారు.

కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అద‌న‌మ్ గెబ్రియాసిస్ సూచించారు. కోవిడ్‌19 రోగుల‌ను గుర్తించాలి, వారిని ఐసోలేట్ చేయాలి, అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టాలి, వారికి చికిత్స ఇవ్వాలంటూ టెడ్రోస్ హితవు పలికారు. సామాజిక‌, ఆర్థిక ఆంక్ష‌ల‌తో పాటు క‌ఠిన నియ‌మాలు పాటిస్తేనే కోవిడ్‌19ను ఎదుర్కోగ‌ల‌మ‌ని చెప్పారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ లాంటి చ‌ర్య‌లను చేప‌ట్టాయ‌ని, కానీ మ‌హ‌మ్మారి వైర‌స్‌ల‌ను త‌రిమేందుకు ఈ చ‌ర్య‌లు స‌రిపోవ‌ని పేర్కొన్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలోనే వైర‌స్‌పై అటాక్ చేయాల‌ని కూడా అన్ని దేశాల‌కు పిలుపు ఇస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ అవ‌కాశాన్ని అంద‌రూ వాడుకోవాల‌ని సూచించారు.

ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను విస్త‌రించాల‌ని, ప‌బ్లిక్ హెల్త్ వ‌ర్క్‌ఫోర్స్‌ను పెంచుకోవాల‌ని ఆయ‌న ప్ర‌పంచ‌ దేశాల‌కు సూచించారు. క‌మ్యూనిటీ స్థాయిలోనే అనుమానిత కేసుల‌ను గుర్తించే వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకోవాల‌ని చెప్పారు. అనుమానితుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు కావాల్సిన వైద్య ప‌రిక‌రాల‌ ఉత్ప‌త్తిని, సామ‌ర్ధ్యాన్ని పెంచుకోవాల‌ని పేర్కొన్నారు.

జిజిహెచ్ లో ఐసోలేషన్ వార్డులపై అభ్యంతరం

విజయవాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో కరోనా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డు లను ఎలా ఏర్పాటు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 16 పడకల సామర్థ్యం తో రెండు ఐసోలేషన్ వార్డులను ఈ ఆసుపత్రిలో అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ నివాస ప్రాంతాలు ఉండటంతో ఈ వైరస్ అక్కడి వారికి సోకుటుందనే సందేహంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అంశాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి సైతం తీసుకువెళ్లారు. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న చోట్ల నివాస ప్రాంతాలకు దూరంగా అప్పటికప్పుడు తాత్కాలిక ఆసుపత్రి నిర్మించి ఐసోలేషన్ వార్డులు విదేశాలలో ఏర్పాటు చేసిన సంగతి తెలుసుకున్న నగరవాసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులు వెంటనే ఇక్కడ నుంచి తొలగించి నివాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం ఈ అంశంపై అధికారుల తీరును తప్పుబట్టారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, ఐసోలేషన్ వార్డులు నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని’ ట్విట్టర్ లో కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు

బాబాయికి తోడుగా రామ్ చరణ్..

రోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగిసేలా లేదు. చూస్తుంటే దేశమంతా మరో నెల రోజులకు పైగా ఈ ఇబ్బందులు ఎదుర్కోవాలి అనిపిస్తోంది. ఆ క్రమంలో సినీ పరిశ్రమ లోని వివిధ వర్గాల వ్యక్తులు ఇపుడిపుడే పరిస్థితులను ఆకళింపు చేసుకొని సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

తాజా గా పవన్ కళ్యాణ్ చేసిన 2 .కోట్ల ఆర్ధిక సాయం ఎందరికో స్ఫూర్తి గా నిలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు దర్శకులు , హీరోలు తమకు తోచిన ఆర్ధిక సాయం చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రియ మిత్రుడు , సోదరుడు అయిన నితిన్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు పది , పది లక్షల చొప్పున ఇవ్వగా ఇపుడు తాజాగా రామ్ చరణ్ 70 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించాడు. రామ్ చరణ్ ఈ మొత్తాన్ని ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ తో పాటు , రాష్ట్ర ప్రభుత్వాల సి ఎం రిలీఫ్ ఫండ్స్ కి ఇవ్వనున్నాడు.

కరోన భయానికి భారీ ప్యాకేజీతో చెక్!

కరోన వైరస్ వ్యాప్తి వల్ల తలెత్తే ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి దేశానికి సహాయపడే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మనా సీతారామన్ గురువారం ప్రకటించారు.”వలస కార్మికులు, పట్టణ మరియు గ్రామీణ పేదలు వంటి వారికి తక్షణ సహాయం అవసరమైన పేదలకు ఒక ప్యాకేజీ సిద్ధంగా ఉంది.ఆ ప్యాకేజీతో ఎవరూ ఆకలితో ఉండరు. ఈ ప్యాకేజీ విలువ 1.7 లక్షల కోట్ల రూపాయలు” అని సీతారామన్ చెప్పారు.

ఈ ప్యాకేజీలో ఆహార భద్రత మరియు ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాల కలయిక అని, ఇది లాక్డౌన్ సమయంలో పేద కుటుంబాలను కాపాడుతుంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ ఆన్ యోజన కింద ఇది జరుగుతుంది. ప్రధాన మంత్రి ప్రకటించిన గరీబ్ కల్యాణ్ ఆన్ యోజన కింద రాబోయే 3నెలలు కనీసం 80 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరనుంది. ఈ పథకం కింద ప్రతి ఇంటికి ఐదు కిలోల బియ్యం, గోధుమలు ఇవ్వబడతాయి.

ప్రతి ఆరోగ్య కార్యకర్తకు మూడు నెలల పాటు రూ .50 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని ఆమె ప్రకటించారు.

కోవిడ్ -19 పరిమితుల కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోజువారీ కూలీ కార్మికులు, పేద కుటుంబాలు మరియు ఇతరులకు సహాయం చేయడానికి గత వారం నుండి ప్రభుత్వం ఆర్థిక ఉపశమన ప్యాకేజీని విడుదల చేయాలని భావించారు.

కోవిడ్ -19 వ్యాప్తిని కలిగి ఉండటానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ వలన కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించడంలో ఉపశమన ప్యాకేజీ సహాయపడుతుంది.

మోదీకి జై కొట్టిన సోనియా గాంధీ

కరోనా(కోవిడ్-19) పేరు చెబితినే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్ పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దేశమంతటా 21రోజులపాటు లాకౌడౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8గంటలకు ప్రకటించారు. ప్రధాని నిర్ణయానికి దేశ ప్రజలంతా స్వాగతించారు. తాజాగా ప్రధాని మోదీ నిర్ణయానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మద్దతు ప్రకటించారు.

దేశంలో కరోనా మహమ్మారి నియంత్రించడానికి ప్రధాని తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గురువారం వెల్లడించారు. ఈమేరకు ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. కరోనా మహమ్మారి లక్షలాదిమంది జీవితాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత విపత్కర పరిస్థితిన ఎదుర్కొనేందుకు దేశం ఒక్కతాటిపై నిలవాలన్నారు. కరోనా నియంత్రణ కోసం కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు కాంగ్రెస్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని సోనియాగాంధీ లేఖలో వెల్లడించారు.

లాకౌడౌన్ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా నివారణకు కేంద్రం శాయశక్తులు కృషి చేస్తుంది. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలను తీసుకుంటుంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ప్రభుత్వం కోరుతుంది. ప్రజల నుంచి కూడా ప్రభుత్వ చర్యలకు మద్దతు లభిస్తుంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా మోదీ నిర్ణయాలకు మద్దతు పలుకడంతో కేంద్రం మరింత కఠిన చర్యలకు పూనుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.