Home Blog Page 8571

పరీక్షలు లేకుండానే పాస్!

కరోనా వైరస్‌ ను నియంత్రించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని విద్యాసంస్థలను మూసివేసింది.

ఏప్రిల్ 14వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రెండు రాష్ట్రాలు ప్రకటించాయి. వార్షిక పరీక్షలు రాసే అవసరం లేకుండానే పై తరగతుల్లో చేరే వెసులుబాటును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అంతేకాదు, మార్చి 24న జరిగిన ప్లస్ 2 పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు మరో రోజు పరీక్ష నిర్వహించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలియజేసింది.

కరోన వల్ల కొంత మేలు జరిగిందా..?

 

ప్రజలను వణికిస్తోన్న కరోన వైరస్ వల్ల ఎంతో కొంత అటు ప్రకృతికి ఇటు మనుషులకు మేలు చేస్తోందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.

కరోన వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

జల, వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించింది.

ఎప్పుడూ బిజీ బిజీగా యంత్రాల్లాగా తయారైన మనుషులను మళ్లీ మామూలు మనుషులుగా తయారుచేసింది .

ఉద్యోగాలు, వ్యాపారం పేరుతో కుటుంబానికి దూరంగా సభ్యులందరినీ ఒక్క చోటికి చేర్చి కుటుంబ విలువలను పెంచింది.

బయటి తిండి కి అలవాటు పడిన మనిషికి ఇంటి రుచి ని మళ్ళీ చూపించింది

నూడిల్స్ గోబీ ల బారి నుండి పిల్లలను కాపాడి అమ్మ ముద్దను అలవాటు చేసింది.

ఆచార,బాహ్య భక్తికి బదులు,ఆత్మ భక్తిని నేర్పించింది .

మనిషికి అవసరమైన పరిశుభ్రతను నేర్పించింది .

గుంపు భక్తికి అలవాటుపడిన మనుషులకు ఏకాంత భక్తి యొక్క అవసరతను నేర్పించింది.

కొత్త కొత్త రుచులకు అలవాటుపడ్డ నాలుకను ఇంటి రుచికి అలవాటు చేసింది.

ఎప్పుడో వెనుకపడ్డ భారతీయ సనాతన ధర్మం “నమస్తే” మళ్ళీ తెరపైకి వచ్చింది.

బ్రిటిష్ రాజుకు కారోన పాజిటివ్!

కారోన రక్కసి ప్రకంపనలతో ప్రపంచం అతకుతలం అవుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరికి కారోన కబలిస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం బ్రిటన్ క్వీన్ ఇప్పటికే క్వారెంటైన్ లో ఉన్నారు. ఇప్పుడు
ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు.

మార్చి 13 నుండి అతను అంటువ్యాధి ఉండేదని వైద్యులు భావిస్తున్నారు. అతను చివరిసారిగా మార్చి 12 ఎలిజబెత్ రాణిని కలిశాడు. ప్రస్తుతం ఆయన మంచి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సీసీఎంబి అందుబాటులోకి తేనున్న కోవిద్-19 నిర్ధారణ కిట్

మొత్తం దేశాన్ని కలవరానికి గురిచేస్తున్న కోవిద్-19 రోగాన్ని నిర్ధారణ చేసే కిట్లు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కిట్ లు సహితం అత్యాధునికమైనవి కావు. దానితో నాణ్యమైన కిట్ ల విడుదలకు హైదరాబాద్ కేంద్రంగా గల ప్రముఖ భారతీయ బయో-టెక్నాలిజీ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి) సన్నాహాలు చేస్తున్నది.

తక్కువ ధరలో, ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేసే వీటిని అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు, మూడు వారాలలో అందించగలమని ప్రకటించింది.

“మేము మా అనుబంధ సంస్థలకు సహాయం చేస్తున్నాము; వారు ఆలోచనలతో బయటకు వచ్చారు. మేము వారికి మద్దతు ఇస్తున్నాము. వారు ప్రతిపాదించిన డయాగ్నొస్టిక్ కిట్‌లను మేము పరీక్షిస్తున్నాము. ధృవీకరిస్తున్నాము. మేము కొన్ని మంచి వస్తు సామగ్రితో రావచ్చు” అని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ ఆర్ కె మిశ్రా వెల్లడించారు.

ప్రస్తుతం రూ 1,000 కన్నా తక్కువకే రోగనిర్ధారణ జరిగేటట్లు ద్రుష్టి సారిస్తున్న సిసిఎంబి రూ 400-500 చౌకైన కిట్ల గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ప్రామాణికత, ఖచ్చితత్వంకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సివిఎంబి కూడా కోవిడ్ -19 వైరస్ కల్చర్ చేయడానికి పైసా యోచిస్తోంది. వారికి తగు సౌకర్యాలు ఉన్నాయని, వారికి ప్రభుత్వం నుండి కూడా ఆమోదాలు వచ్చాయని, అయితే కల్చర్ ను ప్రారంభించడానికి వారికి ఇంకా నమూనా, వస్తు సామగ్రి లభించలేదని డా. మిశ్రా చెప్పారు.

“ఈ సమయంలో, మా సౌకర్యాలు సెట్ చేయబడ్డాయి. వాస్తవానికి నగరంలోని ఇతర గుర్తింపు పొందిన ప్రదేశాలలో పరీక్ష కోసం వెళ్లే వ్యక్తులకు మేము శిక్షణ ఇస్తున్నాము” అని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రభుత్వ నియమించబడిన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో వెళ్లి పరీక్షలు చేయగలిగేలా 25 మందికి సిసిఎంబి శిక్షణ ఇచ్చింది.

బ్రిటన్ రాజవంశానికి కరోనా కాటు

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అన్ని దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతుంది. తాజాగా బ్రిటన్ పిన్స్ చార్లెస్(71) కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ప్రస్తుతం యూకేలో పంజా విసురుతోంది. ఇప్పటికే బ్రిటన్ రాణి క్విన్ ఎలిజిబెత్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆమె ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు.

చార్లెస్ బ్రిటన్ రాణి తరువాత సింహాసనాన్ని అధిరోహించనున్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 71సంవత్సరాలు. చార్లెస్ లో రోగ లక్షణాలు అంత తీవ్రంగా లేవని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని క్లెరెస్స్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం చార్లెస్ ఇంటికే పరిమితమయ్యారు. చార్లెస్ భార్య కెమిల్లాకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చార్లెస్ ఇటీవల అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో ఏ సందర్భంలో ఆయనకు కరోనా సోకిందో చెప్పడం కష్టమని క్లెరెస్స్ హౌస్ ప్రకటింంది. వైద్యుల సూచనల మేరకు చార్లెస్, ఆయన భార్య కెమిల్లాను స్కాట్ ల్యాండ్‌లో సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉంటారని తెలిపారు. ప్రస్తుతం యూకేలో కరోనా కేసులు 8077నమోదయ్యాయ. ఇందులో 422 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. తాజాగా బ్రిటన్ రాజుకే కరోనా సోకడంతో యూకేవాసులు భయాందోళన చెందుతున్నారు.

ఇంట్లో ఉండే సమాజ సేవ చేద్దాం..!

ప్రపంచ వ్యాప్తంగా కారోన వైరస్ ప్రకంపనలు మిన్నంటాయి. దాదాపు రెండువందలకు పైగా దేశాలు ఈ కారోన భయంతో వణికిపోతున్నారు. అందులో భారతదేశం కూడా ఉంది. మన దేశంలో కారోన వైరస్ పాజిటివ్ కేసులు రెండు వారాల వ్యవధిలోనే 3రేట్లు అయ్యాయి. దీంతో దేశంలో కారోన కట్టడికి 21రోజులు సంపూర్ణ లాక్ డౌన్ అమలుపరుస్తున్నారు. ఈ మూడు వారాలు ప్రజలు ఇళ్లలోనే ఉండే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలను అమలుపరుస్తోంది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలౌతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చే అవకాశాలు 90% కోల్పోతున్నారు. ఈ సమయంలో ఆహార పదార్ధాల వనరులను చాలా పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ప్రతి వనరును కాపాడుకుంటూ.. అవసరమైన మేరకు ఉపయోగించుకుంటూ.. వృధా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ మూడు వారాల్లో ఆహార పదార్ధాల ఉత్పత్తి కూడా తగ్గిపోనుంది కాబట్టి అవసరానికి మించి ఎక్కువగా పొదుపు చేసుకోకుండా ఉన్నట్లయితే మరి కొంతమందికి ఈ వనరులు అందే వెసులుబాటు ఉంటుంది.వీలైనంత తక్కువగా వనరులను ఉపయోగించు” అనే ప్రకృతి నియమాన్ని పాటిస్తూ.. సాధారణ రోజులకు కాస్త భిన్నంగా ఈ లాక్ డౌన్ రోజుల్లో దిన చర్యలో ఏర్పాటు చేసుకునే మెనూ ను కూడా తగ్గించుకుంటే.. మంచిదని కొందరు సలహా ఇస్తున్నారు.

ప్రస్తుత సమాజంలో కడుపు నిండా ఆహారంతినని పేదలు ఎంతో మంది ఉన్నారు. ఒక పూట ఆహారంకోసం ప్రయసపడే నిరు పేదలు అనేకమంది ఉన్నారు. కానీ మూడు పూటలు తృప్తిగా తినేవారు ఇలాంటి విపత్తు సమయంలో సమయమనం పాటించి ఆహార వనరులను పొదుపు చేయగలిగితే ఈ సమాజానికి మేలు చేసినవారౌతారు. “ఆర్థిక సంపద నీదే కానీ ప్రకృతి వనరులు సమాజానివి” ఈ విపత్తు సమయంలో సమాజానికి ప్రత్యక్షంగా సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ పరోక్షంగా కీడు చేయకుండా మనవంతు సహకారాన్ని అందిస్తే మంచిది.

80 కోట్ల మందికి ప్రత్యేక రేషన్‌

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం మూడు వారల పాటు దేశవ్యాప్తంగా దిగ్బందనం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం 80 కోట్ల మందికి ప్రత్యేక రేషన్‌ ద్వారా రూ 3 కే కిలో బియ్యం, రూ 2 కే కిలో గోధుమలు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

అదే విధంగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించించింది. మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా త్వరలో జిల్లాల వారీగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయని, పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచిఉంటాయని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతూ సామాజిక దూరాన్ని చెప్పారు. పాటించాలని కోరారు.

కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ భరోసా ఇచ్చారు.

కాగా, సామాజిక దూరమే ఈ వైరస్ విరుగుడుకు మార్గమని దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని, మంత్రివర్గ సమావేశాన్ని సహితం ఆ రీతిలో జరిపి ప్రజల ముందు ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా ఒక బల్ల చుట్టూ మంత్రులు, అధికారులు కూర్చునేవారు. కానీ ఈ రోజు ఒక పెద్ద హాలులో కుర్చీలలో ఒకరికి మరొకరు కనీసం మూడు మీటర్ల దూరంలో కూర్చున్నారు.

ఈ స‌మావేశంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు, ప్ర‌స్తుత ప‌రిస్థితి, దేశ వ్యాప్తంగా అమ‌ల‌వుతున్న లాక్ డౌన్ పై చర్చించారు.

అమెరికా రెండు ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ

వేగంగా క‌రోనా వైర‌స్ మహమ్మారి వ్యాపిస్తూ, తీవ్రత గల దేశాలలో మూడో దేశంగా మారిన అమెరికాలో దీనిని కట్టడి చేయడం కోసం అమెరికా భారీ ఉద్దీప‌న ప్యాకేజీని చేపట్టింది.

ఆధునిక ప్రపంచ చరిత్రలోనే ఇప్పటి వరకు మరే దేశంలో కూడా ప్రకటించని రీతిలో భారీగా సుమారు రెండు ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ ఇవ్వ‌డానికి సేనేట‌ర్లు, వైట్‌హౌజ్ బృందం అంగీక‌రించారు.

వ్యాపార‌వేత్త‌ల‌కు, కార్మికుల‌కు, వైద్య సిబ్బందికి.. ఈ ప్యాకేజీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఉద్దీప‌న ప్యాకేజీ నుంచి నేరుగా ఖాతాల్లోకి డ‌బ్బులు బదిలీ చేస్తారు. క‌రోనా వ‌ల్ల దెబ్బ‌తిన్న వ్యాపార‌ వ‌ర్గాల‌కు కూడా ఈ ప్యాకేజీ డ‌బ్బు వెళ్తుంది. త్వ‌ర‌లోనే ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్నట్లు ప్రకటించారు.

ఆధునిక‌ అమెరికా చ‌రిత్ర‌లో ఇది అతిపెద్ద ఉద్దీప‌న ప్యాకేజీ అని నిపుణులు చెబున్నారు. ప్ర‌తి ఒక వ్య‌క్తికి ప్యాకేజీ కింద వ్యక్తులకు 1200 డాల‌ర్లు, దంపతులకు 2,400 డాలర్లు, నలుగురు సభ్యుల కుటుంబానికి 3,000 డాలర్లు ఇస్తారు. ప్ర‌తి ఒక చిన్నారికి 500 డాల‌ర్లు ఇచ్చేందుకు కూడా అంగీకారం జ‌రిగింది.

కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇంటి వద్ద ఉండిపోగా, వారికి జీతాలు ఇవ్వడం కోసం 500 మంది లేదా అంతకన్నా తక్కువ మంది ఉద్యోగులు గల కంపెనీల కోసం 367 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. ఒకొక్క కంపెనీకు 10 మిలియన్ డాలర్ల వ్యాపార రుణాలు ఇస్తారు.

వారానికి 600 డాలర్లు చొప్పున నాలుగు నెలల వరకు నిరుద్యోగ భృతిని ఇస్తారు. ఆరోగ్య సేవలు, సామజిక సేవలు అందించే వారి కోసం 242 మిలియన్ డాలర్లు వ్యయం చేస్తారు.

అమెరికాలో జీవిస్తున్న దాదాపు ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సొమ్ము అందుతుంది. నిరుద్యోగుల‌కు కూడా ప్యాకేజీ సొమ్ము చెల్లిస్తారు. అమెరికాలో ఇప్పటికే 55 వేలమందికి పైగా కరోనా సోకగా, మరో 802 మంది మృతి చెందారు.

Actress Kapilakshi Malhotra Photos

RRR Movie New Posters

కరోనా కోరలను వంచుతున్న తెలంగాణ

కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసిన ఈ పేరే.. కంటికి కన్పించకుండానే ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. చైనాలోని వూహాన్ పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దేశమంతటా 21రోజులపాటు లాకౌడౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8గంటలకు ప్రకటించారు. ప్రధాని నిర్ణయానికి దేశ ప్రజలంతా స్వాగతించారు.

కరోనా పేరు చెబితేనే అగ్రరాజ్యలు సైతం భయపడిపోతుంటే.. తెలంగాణవాసులు కరోనా మహమ్మరిపై విజయం సాధిస్తున్నారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం. ఇప్పటికీ తెలంగాణ 36కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనా బాధితులకు సంబంధించి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడంతో ఇటీవల ఒకరు కరోనా జయించారు. దీంతో అతడిని డిశ్చార్జ్ చేశారు. తాజాగా మరొకరు కరోనా జయించడంతో తెలంగాణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసుల్లో చాలామంది కోలుకుంటుండటం అందరికీ శుభవార్త అని చెప్పొచ్చు.

ఈనెల 12న ఇటలీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి వచ్చిన విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వెంటనే ఆ విద్యార్థిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. మంగళవారం గాంధీ ఆస్పత్రి వైద్యాధికారులు విడుదల చేసిన తాజా రిపోర్టులో ఆ విద్యార్థికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తూ బాధితుల ప్రాణాలను రక్షిస్తున్న వైద్య సిబ్బందికి ప్రతీఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు దేశం సెల్యూట్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ప్రజల డేటా సేకరించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా విదేశీయులు మరియు విదేశీ నుంచి తిరిగి వచ్చినవారు, దిగ్బంధంపై ప్రభుత్వం పిలుపునివ్వడానికి ఈ వ్యవస్థ సేవ అమోఘం.   ప్రతి గ్రామం మరియు పట్టణంలో దాదాపు 50 కుటుంబాలకు ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్న వాలంటీర్లు.. ప్రజల డేటా, ఆరోగ్య స్థితి మరియు విదేశాల నుండి వచ్చిన వారి డేటాను నమోదు చేశారు. కరోనా వైరస్ యొక్క అనుమానితులను గుర్తించడం మరియు వారిని ఇంటి నిర్బంధంలో ఉంచడం లేదా ఆసుపత్రులలోని ఐసోలేషన్ వార్డులకు మార్చడం వంటి పనులు గ్రామ వాలంటీర్ల వల్ల చక చక జరుగుతున్నాయి. అదే విధంగా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి పరిసర ప్రాంతాల శుభ్రతకు కూడా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ లో ఈ వాలంటీర్ల సహకారాన్ని దేశవ్యాప్తంగా మీడియా హైలైట్ చేసింది. అనేక జాతీయ వార్తాపత్రికలు, టెలివిజన్ చానెల్స్ మరియు వార్తా సంస్థలు వాలంటీర్లు పోషించిన పాత్రను ప్రశంసిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి, అంటువ్యాధులను ఎదుర్కోవటానికి లేదా ప్రభుత్వం నుండి ఏదైనా ప్రయోజనాన్ని పొందటానికి లేదా ఇంటి నుండి ఇంటి సర్వేను చేపట్టడానికి ప్రతి రాష్ట్రంలో ఇలాంటి యంత్రాంగాన్ని కలిగి ఉండాలని భారత ప్రభుత్వాన్ని సూచించారు.

గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రతిపక్షాలు గుర్తించకపోయినా.. దేశం, వారి సేవలను గుర్తించిందని కొంతమంది వైసీపీ నేతలు అంటున్నారు.

ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్… జగన్ ఆలోచన

మరో నాలుగైదు రోజులలో ఆర్ధిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా వార్షిక బడ్జెట్ కు ఆమోదింప చేసుకొనే విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ కసరత్తు చేస్తున్నారు. ఉగాది పూర్తి కాగానే నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఓట్‌ ఆన్‌ అక్కౌరట్‌ కు ఆమోదం పొందాలను తొలుత భావించారు.

ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో దిగ్బంధనంలో ఉండడం, ఏపీలో సహితం క్రమంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఇటువంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరపడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్ కు ఆమోదం పొందే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు న్యాయనిపుణులు సంప్రదిస్తున్నారు.

పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అనుమతి పొండాలంటే కనీసం 14 రోజులు అవసరం అవుతుంది. బడ్జెట్‌పై చర్చకు ఆరు రోజులు, డిమాండ్లపై చర్చకు ఎనిమిది రోజులు కావాల్సి ఉంటుంది. అందుచేత ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌కు అవకాశమే లేదని వారం రోజుల క్రితమే నిర్ణయానికి వచ్చారు.

ఇక ఔట్‌ ఆన్‌ అక్కౌరట్‌ ద్వారా బడ్జెట్‌ను ఆమోదించు కోవాలన్నా కూడా కనీసం నాలుగు రోజులైనా చర్చించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రవేశపెట్టిన మర్నాడే ఆమోదం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికోసం కొద్ది గంటలే సభ నిర్వహించి వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు.

తాజాగా కరోనా విజృరభణ కారణంగా రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేసిన పరిణామాల నేపథ్యంలో శాసనసభ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 175 మంది శాసనసభ్యులు, 50 మందికిపైగా మండలి సభ్యులు, వందలాది మంది అధికారులు, సిబ్బంది హాజరు కావాల్సిన పరిస్థితి ఉండడంతో నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్‌ అంశం తెరపైకి వస్తున్నది. 2004లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ విధంగా చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేస్తున్నారు. 2003 అక్టోబర్‌ లో అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి జరిగిన వెరటనే ఆయన అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌ 14న ఆయన శాసనసభను రద్దు చేశారు.

అయితే ఎన్నికల కమిషన్‌ మాత్రం పార్లమెంట్ ఎన్నికలతోపాటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలను మార్చి నుంచి మే నెలల మధ్యలో నిర్వహించడంతో బడ్జెట్‌ పై గందరగోళం నెలకొంది. ఆ తరుణంలోనే ఆర్డినెన్స్‌ ద్వారా ద్రవ్య వినిమయానికి అనుమతి తీసుకున్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఆ ఆర్డినెన్స్‌నే శాసనసభలో ప్రవేశపెట్టి అనుమతి పొందడం గమనార్హం.

గ్రాండ్ గా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ అభిమానులతో తన భావాలను పంచుకునేందుకు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఉగాది రోజున తన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెల్సిందే. మెగాస్టార్ అన్నట్లుగానే నేటి ఉదయం(బుధవారం) 11గంటల 11నిమిషాలకు ‘తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అంటూ తొలి ట్వీట్ చేశారు.

అలాగే మరో ట్వీట్ కరోనాపై చేశారు. నేడు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారిని భారత్ నుంచి తరలిమేందుకు కలిసికట్టుగా పోరాడాలన్నారు. ‘ప్రతీఒక్కరూ ఇంటి పట్టునే ఉందాం.. సురక్షితంగా ఉందామంటూ’ మెగాస్టార్ పేర్కొన్నారు. దేశ ప్రధాని మోదీ చెప్పినట్లుగా 21 రోజులు మనమంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయనియంత్రణే శ్రీరామరక్ష అని చెప్పారు.

ఈ క్లిష్ట సమయంలో మనం, మన కుటుంబాలు, మన దేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ప్రియ ముఖ్యమంత్రులు శ్రీ కేసీఆర్ గారు, శ్రీ జగన్ గారు ఇచ్చే ఆదేశాలను పాటిద్దాం.. ఇంటి పట్టునే ఉందామని మరో ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, తన ప్రియమైన అభిమానులందరితో నేరుగా మాట్లాడగలగటం ఆనందంగా ఉందన్నారు.

మెగాస్టార్ ఎంట్రీతో మెగాస్టార్ ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. కొద్దినిమిషా వ్యవధిల్లోనే వేలసంఖ్యలో ఫాలోవర్స్ అయ్యారు. సిల్వర్ స్ర్కీన్ పై రికార్డులు సృష్టించిన మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీతో మరెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఏపీలో సహకరించని యువత… పోలీస్ లాఠీలకు తప్పని పని!

కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడం కోసం దేశం మంతా దిగ్బంధనం పాటిస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ప్రజల నుండి, ముఖ్యంగా యువత నుండి తగు సహకారం లభించక పోవడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు కష్టతరమవుతుంది. అందుకనే పలు చోట్ల లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు. నిషేదాజ్ఞలని అధిగమించి రోడ్లపైకి వస్తున్న వారిని తరమడంకోసం మంగళవారం పలు చోట్ల లాఠీచార్జీలు జరిపిన్నట్లు తెలుస్తున్నది.

దేశం అంతా అంతర్ రాష్ట్ర రాకపోకలను స్తంభింప చేయగా, సోమవారం రాత్రే పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులను మూసివేసిన ఏపీ ప్రభుత్వం మంగళవారం రాత్రి నుండి జిల్లాల మధ్య రాకపోకలను సహితం స్తంభింప చేసింది. దీనిని కఠినంగా పాటించాలని, ఆదేశాలను ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. వాహనాలను సీజ్‌ చేస్తామని, వ్యక్తులపై కేసులు పెడతామని హెచ్చరించారు.

సోమవారం ఏపీతో సహా కొన్ని రాష్ట్రాలలో దిగ్బంధనాన్ని పాటించకుండా, ప్రజలు యథేచ్ఛగా రోడ్డులపై తిరుగుతూ ఉండడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసహనం ప్రకటించడంతో పాటు, కేంద్ర హోమ్ కార్యదర్శి రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలను పంపారు. దానితో ఏపీ పోలీసులు ఈ విషయమై సీరియస్ అయ్యారు. ఉదయం లాక్‌డౌన్‌ నిబంధనలను లెక్కచేయకుండా పలు చోట్ల ప్రజలు రోడ్లమీదకు వచ్చినవారిని వెంటాడారు.

నెల్లూరు, విజయవాడ, చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో రోడ్ల పైకి వచ్చిన వారిని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు.కొన్ని ప్రాంతాల్లో లాఠీలకు పని చెప్పారు. విజయవాడలో ఓ యువకుడిని అదుపు చేసేందుకు ఆరుగురు పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. చివరకు బలప్రయోగంతో అతడిని పంపించారు.

చిత్తూరు, నెల్లూరు, గుంటూరు పట్టణాల్లో వాహనదారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఒకటికి రెండుసార్లు తిరుగుతూ టాబ్లెట్ల కోసమని చెబుతున్న కొంతమంది యువకులను పోలీసులు గుర్తించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. మరోసారి దొరికితే బండి సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

విజయవాడ రామవరప్పాడు రింగు సెంటర్లో వాహనాలను అదుపు చేస్తున్న శ్రీధర్‌ అనే కానిస్టేబుల్‌ను క్వాలిస్‌ వాహనం ఢకొీట్టింది. అతనికి తీవ్రగాయాలు కావడంతో తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, టంగుటూరులో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పెదదోర్నాలలో వాహనదారులతో గుంజీలు తీయించారు.

గుంటూరులో 107 ఆటోలను సీజ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.14.66 లక్షలు జరిమానా విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న 2300 మందిపై కేసులు నమోదు చేశారు. 288 వాహనాలను సీజ్‌ చేసినట్లు డిజిపి గౌతంసవాంగ్‌ తెలిపారు. విదేశాల నుండి వచ్చేవారు విధిగా పరీక్షలు చేయించుకోవాలని చెబుతూ, అవసరమైతే వారి పాస్‌పోర్టులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

విదేశాల నుండి వచ్చిన పలువురు పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడంతో వారిని పట్టుకోవడం కోసం వెంటాడవలసి వస్తున్నది. గుంటూరు లోని శ్యామలానగర్ లో ఒక వ్యక్తిని రెండు రోజులపాటు కాపు కాస్తే గాని పటుట్కోలేక పోయారు.

విశాఖలో మూడు ప్రాంతాలను హైరిస్క్‌ జోన్లుగా ప్రకటించారు. నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఉదయం తొమ్మిది గంటల వరకే అనుమతి ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుబజార్లు కిటకిటలాడాయి. విజయవాడలో పాజిటివ్‌ నమోదైన వ్యక్తి కుటుంబ సభ్యులకు నెగెటివ్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా వారిని 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. .

భారత్ కి నిపుణుల హెచ్చరిక!

భారత్ లో కారోన మహమ్మారి వ్యాప్తి పట్ల నిర్లక్ష్యం వహిస్తే.. మే సగం నాటికి 13 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని శాస్తవేత్తలు హెచ్చరించారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ అంటువ్యాధిని అరికట్టడానికి భారత్‌ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కరోనా పరీక్షలను తరచుగా నిర్వహించడంతో బాగా వెనుకబడిందని అభిప్రాయపడ్డారు.
కారోన వైరస్ కు ఇంతవరకు వ్యాక్సిన్‌ గానీ.. మందుగానీ కనుగొనలేదు. ఈనేపథ్యంలో రెండో దశ, మూడో దశలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టనట్లయితే భారత్‌లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి’’ అని భారత్ మేధావులు, డేటా సైంటిస్టుల సముదాయం హెచ్చరించింది.

అదే విధంగా అగ్రరాజ్యం అమెరికా, ఇటలీలో ఈ మహమ్మారి క్రమక్రమంగా విస్తరిస్తూ ఒక్కసారిగా విస్పోటనం చెందింది. భారత్‌ కూడా కరోనా వ్యాప్తిని త్వరగా కట్టడి చేయకపోతే ఇలాంటి ఫలితాలే చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత జనాభాకు తగినట్లుగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని వెల్లడించారు. ఇక కరోనా ప్రభావం వైద్య సిబ్బందిపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

కాగా కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా భారత్‌ మంగళవారం రాత్రి నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

బాధ్యత ఉండక్కర్లే.. వ్యాపారులపై ఫైర్ అవుతున్న అలీ

కరోనా నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని నటుడు, కామెడీయన్ అలీ అన్నారు. కొందరు వ్యాపారులు ఇలాంటి విపత్కర పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు నిత్యావసర సరుకుల ధరలు రేట్లను పెంచి సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది డబ్బులు సంపాదించే సమయం కాదని, నిత్యావసర సరుకులు ఎంత రేటు ఉన్నాయో అంతకే అమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో కూలీ, నాలీ చేసుకునే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనాను నివారించేందుకు తనవంతు సాయంగా ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్లు అలీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి విజృంభిస్తుందని తెలిపారు.

ఇటలీలో కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాలను కూడా తీసుకెళ్లడానికి ఎవరు రావట్లేదని అలీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నుంచి దేశం విముక్తి పొందాలని పదిరోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని అలీ తెలిపారు. ప్రభుత్వాలు నిబంధనలు తూచతప్పకుండా పాటిస్తూ అందరూ స్వీయనియంత్రణ పాటించి కరోనా మహమ్మరిని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.