
దేశవ్యాప్తంగా కేంద్రం 21రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్లపై పహారా కాస్తూ ప్రజలు గుమ్మికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. సరైన కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చే వారికి కౌన్సిలింగ్ చేసి తిరిగి పంపిస్తున్నారు. టూవీలర్ పై ఒకరు, ఫోర్ వీలర్లలో ఇద్దరు కంటే ఎక్కువగా తిరుగుతున్న వారికి జరిమానాలు విధంచడంతోపాటు వాహనాలు సీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమందిలో మార్పు రావడం లేదు. ఇలాంటి వారికి పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా ఓ యువతి తన కారును ఆపినందుకు ట్రాఫిక్ పోలీస్ చేయికొరికి హల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో లాక్డౌన్ అమలులో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలోనే బిదాన్ నగర్ ప్రాంతంలో పోలీసులు అటుగా వచ్చిన ఓ కారును ఆపారు. ఎందుకు ప్రయాణం చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు వారిని ప్రశ్నించారు. ఈక్రమంలోనే కారు డ్రైవర్, మరో యువకుడికి పోలీసులు పక్కకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఇంతలోనే కారు దిగిన 20 ఏళ్ల యువతి పోలీసులపై దాడికి దిగి హల్ చల్ సృష్టించింది.
WTF this DESPICABLE Woke #COVIDIOT when stopped by police abused & spit on Kolkata Police Cop 😠😡 #COVIDIDIOTS #COVIDIOTS #coronavirusindia #21daylockdown pic.twitter.com/Q1P8RcVtZw
— Rosy (@rose_k01) March 25, 2020
ఈక్రమంలోనే యువతితోపాటు కారులో వచ్చిన యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విచక్షణ కోల్పోయిన యువతి ట్రాఫిక్ పోలీస్ చేతిని కొరికి రక్తం కళ్ల చూసింది. ఆ రక్తాన్ని మరో పోలీస్ చొక్కాపై ఉమ్మేసింది. ఈ ఘటనతో షాకైన పోలీసులు వెంటనే ఆ యువతిని, యువకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులకు సహకరించాల్సిందిపోయి కొంతమంది వారిపై తిరగబడుతుండటం శోచనీయంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.