Home Blog Page 8532

బిజెపిలో పవన్ కళ్యాణ్ కు అమిత్ షా అడ్డు!


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకొని మూడు నెలలు దాటినా, ఇంకా ఆ పార్టీతో కలసి ఉమ్మడిగా ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడం, ముందుగా ప్రకటించిన విధంగా రాజధాని అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా ఒక్క ఉద్యమం కూడా చేయలేక పోవడం చాలామందికి విస్మయం కలిగిస్తున్నది. బీజేపీలో చాలామంది నేతలు పవన్ కళ్యాణ్ ను దరిచేర్చుకోవడం పట్ల విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

ముఖ్యంగా బీజేపీలో తిరుగులేని నాయకుడిగా, ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ముఖ్యమైన నేతగా గుర్తింపు పొందిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు బిజెపి మరోసారి జనసేనతో చేతులు కలపడం పట్ల అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఆ రెండు పార్టీల ప్రయాణం ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనుకకు అన్నట్లుగా జరుగుతున్నది.

మొదటగా జనవరిలో అకస్మాత్తుగా బిజెపితో చేతులు కలపడం కోసం తనతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఢిల్లీ రావడం అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కు తీవ్ర ఆగ్రహం కలిగించినట్లు చెబుతున్నారు. అందుకనే రెండు రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంలో కొద్దిమంది నాయకులను తప్ప మరెవ్వరిని పవన్ కలవలేక పోయారు.

ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ నాయకుల ద్వారా బీజేపీతో కలవడంకోసం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు సహజంగానే అమిత్ షా కు అసంతృప్తి కలిగించినట్లు చెబుతున్నారు. అందుకనే మొదటిసారి రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండి కూడా పవన్ ను కలవడానికి అమిత్ షా విముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు.

విజయవాడలో బిజెపి నాయకులతో మొదటి సమావేశంలోనే రెండు పార్టీలు కలసి ఉమ్మడిగా అమరావతి రైతులకు సంఘీభావంగా ఉద్యమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటగా `మార్చ్ తో అమరావతి’ కార్యక్రమం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం కూడా చేపట్టక పోవడం గమనార్హం.

ఉమ్మడిగా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి, ప్రచారం చేయాలని ప్రకటించినా క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన ప్రభావం చూపలేక పోయింది. ఏపీలోని బీజేపీ నేతలలో కన్నా లక్ష్మినారాయణ తప్ప మిగిలిన వారంతా దాదాపుగా అమరావతి విషయంలో బిజెపి తలదూర్చడంపై విముఖంగా ఉండడం గమనార్హం.

డి పురందేశ్వరి, సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు వంటి నాయకులు ఎవ్వరు ఇప్పటి వరకు అమరావతికి వెళ్ళనేలేదు. రైతులకు సంఘీభావం ప్రకటించలేదు. పైగా, రెండు జిల్లాలకే పరిమితమైన ఉద్యమంలో పాల్గొనడం బిజేపికి ఉపయోగం కాదని వాదిస్తూ వస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ముఖ్యంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దుష్పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడటం కోసం బిజెపితో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించారు. అయితే ఏపీలో చాలామంది బిజెపి నేతలు పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డితో చేతులు కలిపినవారే. వారెవ్వరూ జగన్ కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా లేరు.

అందుకనే పవన్ కళ్యాణ్ తో చేతులు కలపడం చాలామంది బిజెపి నాయకులకు సహితం ఇష్టం లేదని చెబుతున్నారు. పురందేశ్వరి, జివిఎల్ నరసింహారావు వంటి నేతలు సహితం పవన్ కళ్యాణ్ – అమిత్ షా ల మధ్య దూరం పెంచడానికే దోహదపడుతున్నారు.

వలస కూలీల వేదన వర్ణానాతీతం!

అకస్మాత్తుగా దేశంలో లాక్‌ డౌన్‌ అమలుపరచడంతో వలస కూలీల బ్రతుకులు చిందరవందరగా మారిపోయాయి. దీంతో వారు సొంతూళ్లకు వెళ్లే మార్గంలేక, పరాయి పంచన ఉండలేక సతమతమైపోతున్నారు. వారిని కదిలిస్తే పుట్టెడు దుఃఖంతో స్వరం గద్గదమవుతోంది. మాటల్లో ఆవేదన, చూపుల్లో నిస్సహాయత, కన్నీటి చారికల్లో ఆందోళన, నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఆకలి వారిని దహించివేస్తోంది. చాలా చోట్ల వలస కూలీలు రాత్రిళ్లు సేదతీరుతూ, పగలు కాలినడకన సొంతూళ్లకు పయనమవుతున్నారు. అలసిపోతే రోడ్లపైనే పడుకుంటున్నారు. వారు కోరుకుంటున్నదల్లా ఒక్కటే… తమ ఊర్లకు పంపించేయండని. ఈ పరిస్థితుల్లో తాజాగా మే 3 వరకు లాక్‌ డౌన్‌ పొడిగింపు వారిని మరింత కలచివేసింది. ముంబయిలో స్వస్థలాలకు వెళ్లిపోతామని వేల మంది రోడ్డెక్కారు. ఇంకా హైదరాబాద్‌ లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

సుమారు 200 మంది వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లాలని హైదరాబాద్‌ లో మూటాముల్లె సర్దుకొని, చంటి పిల్లలను ఎత్తుకొని నడుచుకుంటూ బయలుదేరారు. హబ్సిగూడ జెన్‌ పాక్‌ ప్రాంతంలోని పోలీసు తనిఖీ కేంద్రం దగ్గర అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా వెంటనే అక్కడికి చేర్చుకుని వారిని సుముదాయించారు. మీ అందరినీ తమ బిడ్డల్లా చూసుకుంటామని హామీ ఇచ్చి వారిని వాహనాల్లో వారి ఆవాసాల దగ్గరకు తరలించారు. వారికి భోజనం ఏర్పాట్లు చేశారు. చందానగర్‌ నుంచి మధ్యప్రదేశ్‌ కు దాదాపు వందమంది డీసీఎం వ్యాన్‌ లో బయల్దేరగా బాచుపల్లి చౌరస్తా వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డారు. అలాగే గచ్చిబౌలి నుంచి 200 మంది కాలినడకన బయల్దేరితే రేతిబౌలి వద్ద పోలీసులు నిలువరించి వెనక్కి పంపారు. టోలిచౌకి నుంచి మధ్యప్రదేశ్‌ కే బయల్దేరిన మరో యాభై మందికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నగరంలోనే ఇలా దాదాపు వేయి మంది ఊరెళ్లిపోవడానికి పరిపరి విధాల ప్రయత్నించారు.  తమ రాష్ట్రాలకు పంపించేందుకు అనువైన ఏర్పాట్లు చేయాలంటూ వారు వేడుకుంటున్నారు.

హైదరాబాద్‌ లోని నానక్‌ రాంగూడ ప్రాంతంలో ఒక్క చోటే 1200 నుంచి 1500 మంది వరకు వలస కార్మికులు కనిపించారు. ‘మా ఆరోగ్యం గురించి పట్టించుకొనేవారు కూడా లేరని వారు వాపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో వేల సంఖ్యాలో.. దేశం మొత్తం మీద లక్షల సంఖ్యలో వలస కూలీలా బాధలు వర్ణాన%

కరోనాపై మెగా ఫ్యామిలీ వినూత్న ప్రచారం


ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తున్న కరోనా మహమ్మరి కట్టడికి పలువురు సెలబ్రెటీలు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, ట్వీట్లు చేస్తూ సామాజిక బాధ్యతను గుర్తుచేస్తున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా కోడలు ఉపాసన, మహేష్ బాబు కూతురు సితార తదితరులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ కరోనాపై వినూత్నంగా సందేశం ఇచ్చింది. ఈ మేసేజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇటీవల టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు కరోనాపై ఓ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు కోటి సంగీతాన్ని అందించాడు. ఈ సాంగ్ అందరి ప్రశంసలు పొందిన సంగతి తెల్సిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ప్లకార్డులు చూపిస్తూ ఓ సందేశం ఇచ్చారు. ‘ఇంట్లో ఉంటాం..యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు.. ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం.. భారతీయులం ఒక్కటై.. భారత్‌ని గెలిపిస్తాం..’ అంటూ ప్లకార్డులు పట్టుకొని మెగా ఫ్యామిలీ స్టే హోమ్ అంటూ సందేశాన్నిచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ లు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఫొటోల్ని కూడా ఎవరింట్లో వాళ్లు ఉంటూ షూట్ చేసి పోస్టు చేశారని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

మద్యం లభించక నేరాలు పెరిగిపోతున్నాయా!


ఎక్కడైనా నేరాలు, ఘర్షణలు పెరగడానికి మద్యంను ప్రధాన కారణంగా చెప్పుకొంటుంటాము. ముఖ్యంగా గృహహింస, లైంగిక వేధింపులకు దీనినే కారణంగా చూపుతుంటాము. కానీ లాక్‌ డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాలు సహితం స్థంభించి పోవడంతో దేశంలో నేరాలు పెరుగుతున్నాయని అంటూ వింతయిన వాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు మద్యం అమ్మకందారుల.

లాక్ డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా గత మూడు వారాలుగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిన్నట్లు దాదాపు అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒక విధంగా సామాజికంగా ప్రశాంతతకు కూడా కారణమవుతుంది. అయితే అక్కడక్కడా మూసి ఉన్న మద్యం షాపులపై కొద్దిపాటి దాడులు జరిగాయి. మద్యం కోసం దోపిడీలు కూడా జరిగాయి.

దానితో అత్యవసర వస్తువుల జాబితాలు మద్యంను కూడా తీసుకు వచ్చి, దేశంలో మద్యం అమ్మకాలకు లాక్ డౌన్ సమయంలో అనుమతి ఇవ్వాలని కోరుతూ అఖిల భారత బ్రూవరీస్‌ సంఘం (ఎఐబిఎ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు వ్రాసింది. మద్యం షోపలపై చెదురుమదురుగా జరుగుతున్న దాడుల కారణంగా దేశంలో అక్రమం మద్యం అమ్మకాలు పెరిగిపోతున్నాయని అంటూ వీరు పేర్కొన్నారు.

అందుకనే ఆహారం మాదిరిగానే అత్యవసర సేవల్లోకి మద్యాన్ని కూడా తీసుకురావాలని కోరుతున్నారు. పైగా తమ వ్యాపారాన్ని లాక్ డౌన్ సమయంలో పెంచుకునేందుకు ఇంటి వద్దనే కొనుగోలు దారులకు మద్యం సరఫరా చేస్తామని కూడా వీరు ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు కూడా నిధులు సమకూరుతాయి గదా అంటూ ప్రభుత్వాలకు ఆశలు కలిపిస్తున్నాయి.

కరోనా కారణంగా ఒక్క ఏప్రిల్‌, మే నెల్లోనే రూ 16,000 కోట్ల వరకు తమకు తెలంగాణలోనే నష్టం వాటిల్లే పరిస్థితి ఉరదని, మిగిలిన నెలల్లో కూడా పరిస్థితి నిరాశాజకనంగానే ఉంటుందని వీరు పేర్కొన్నారు.

దేశంలోని 86 ఉత్పత్తి సంస్థల ద్వారా దాదాపు రూ 60,000 కోట్ల విలువైన బీరు ఉత్పత్తి జరుగుతోరదని, అమ్మకాల ద్వారా వచ్చే పన్నుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ 36,000 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలున్నాయని ఎఐబిఎ పేర్కొన్నది.

ప్రస్తుతం బీర్ల తయారీకి బార్లీ, బియ్యం, గోధుమ, చక్కెర వంటివి రైతుల నుంచి సమీకరించుకొంటున్నారు. తమ వ్యాపారం మూతబడితే పరోక్షంగా రైతులకు కూడా దెబ్బె అని వారిస్తున్నారు.

20 శాతం వరకూ పడిపోనున్న ఇండ్ల ధరలు


దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఏర్పడిన నేపథ్యంలో ఇండ్ల ధరలు 20 శాతం వరకూ పడిపోయే ప్రమాదముందని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పారేఖ్‌ తెలిపారు. నరెడ్కో ఏర్పాటు చేసిన వెబినార్‌లో మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, నగదు నిల్వలున్న ఇండ్ల కొనుగోలుదారులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికిదే సరైన సమయమని సూచించారు.

వాస్తవానికి కోవిడ్‌ రాకముందే దేశీయ నిర్మాణ రంగం కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నదన్న ఆయన.. నిధుల కొరత, నిర్మాణ రంగంలో నిరర్థక ఆస్తుల విలువ పెరగడం వంటివి పెనుభారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుబాటు గృహాలకు కేంద్రం ప్రోత్సాహం ప్రకటించినా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా ఉత్పాతం వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు.

మరోవైపు కోవిడ్‌-19 వల్ల దెబ్బతిన్న నిర్మాణ రంగాన్ని ఆదుకోవడానికి రియల్‌ రంగానికిచ్చిన రుణాల్ని రీ స్ట్రక్చర్‌ చేయాలని సూచించారు.

ఇలా ఉండగా, మే 3 వరకూ లాక్‌డౌన్‌ పొడిగించాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని తెలంగాణ నిర్మాణ రంగం స్వాగతించింది. కాకపోతే, కట్టుదిట్టమైన రక్షణ చర్యల్ని తీసుకునే రియల్‌ సంస్థలకు నిర్మాణ కార్యకలాపాల్ని చేపట్టేందుకు ఉద్దీపన ప్రకటించాచాలని అభ్యర్థించింది.

ప్రతిపక్షాల పంతమే నెగ్గిందా..?


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రధాని మోడీ లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకూ పొడిగించారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం లాక్ డౌన్ ను కొన్ని ప్రాంతాల వరకే పరిమితం చేయాలని, మిగిలిన ప్రాంతాలను లాక్ డౌన్ కు మినహాయింపు ఇవ్వాలని భావించారు, ఇదే విషయాన్ని ప్రధానికి సైతం వివరించారు. రాష్ట్రంలో 676 మండలాలు ఉండగా కరోనా వైరస్‌ సోకిన మండలాల్లో 37 రెడ్‌జోన్‌లో, ఆరెంజ్‌ జోన్లో 44 మండలాలు ఉన్నాయి. అంటే 676 మండలాల్లో మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నవి కేవలం 81 మాత్రమే. మిగిలిన 595 మండలాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయి, ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదనేది సీఎం వాదన.

ప్రతిపక్ష పార్టీలు ఈ వాదనను పూర్తిగా వ్యతిరేకించాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నాయకులు ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో కరోనా వ్యాప్తిని నివారించడం సాధ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేప రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లాక్ డౌన్ పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు స్వయంగా సీఎం, గవర్నర్ కు లేఖలు రాశారు. సీపీఐ కూడా ఇదే వాదన వినిపించింది. లాక్ డౌన్ పొడిగించడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. లాక్ డౌన్ పొడిగించి గ్రీన్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అవకాశం కల్పించాలన్నారు.

ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం మాత్రం లాక్ డౌన్ పొడిగింపు పట్ల సుముఖంగా లేరు. ప్రధాని ప్రకటనకు ముందు రోజు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో కూడా రెడ్, ఆరెంజ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేస్తే బాగుంటుందని చెబుతూ, మీ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమేనాని పేర్కొన్నారు. సీఎం ఈ నిర్ణయానికి రావడానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఈ నెల 28 నుంచి విశాఖపట్నం రాజధానిగా పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉండటమేనని తెలుస్తోంది.

ప్రధాని మోడీ లాక్ డౌన్ వచ్చే నెల 3వ తేదీ వరకూ పొడిగిస్తూ ప్రకటన చేయడంతో ప్రతిపక్ష పార్టీల పంతమే నెగ్గినట్లయ్యింది. అధికార పక్షం ఎన్ని ఎత్తులు వేసినా ఈ విషయంలో వెనుకడుగు వేయక తప్పలేదు. రాష్ట్రంలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసులు సంఖ్య నిన్నటి నుంచి పెరగడంతో ప్రజలు సైతం ప్రధాని సరైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు.

నాలుగో కృష్ణుడి రాక ఖాయమే అంటున్నారు


మన బాలీవుడ్ స్టార్స్ అందరిలో ఒక విభిన్న మైన దారిలో వెళ్లే అగ్ర నటుడు హృతిక్ రోషన్.కెరీర్ ఆరంభం లోనే మిషన్ కాశ్మీర్ , కోయి మిల్ గయా ,గుజారిష్ ,ధూమ్ 2 (విలన్) వంటి విభిన్న చిత్రాలు చేసి అందర్నీఆశ్చర్య పరిచాడు. ఇక ఇండియన్ మూవీ లవర్స్ ని అత్యంత బాగా ఆకట్టుకొనే సూపర్ హీరో ` క్రిష్ ` సిరీస్ అంటే.హృతిక్ రోషన్ కెరీర్ లోనే మైలు రాళ్లు అనక తప్పదు .. హాలీవుడ్లో సూపర్ మాన్, బాట్ మాన్ ,స్పైడర్ మాన్ మాదిరి ఒక సూపర్ హీరో పాత్రను తీసుకుని వరుసగా సినిమాలు తీస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు..ఒకనాటి హీరో , ఇపుడు దర్శకుడు అయిన రాకేష్ రోషన్.ఈ చిత్రాలతో కొడుకు హృతిక్ రోషన్ కి భారీగా అభిమానగణాన్ని సంపాదించు కొనేలా చేసాడు .

ముందు కోయీ మిల్ గయా సినిమాను మామూలుగానే తీశారు. అప్పటికి సిరీస్ గురించి ఆలోచనలేమీ లేవు. కానీ అది చక్కటి విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా ` క్రిష్ ‘ తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానితో క్రిష్- 3 తో తీయడం అదికూడా సూపర్ హిట్ అవ్వడం జరిగిపోయాయి ..

అలా మూడోభాగం కూడా ఆర్ధిక లాభం తేవడం తో క్రిష్-4 చిత్రానికి అంకురార్పణ జరిగింది. అంతా రెడీ అయ్యాక ఊహించని రీతిలో రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడటంతో సినిమా ఆగిపోయింది . దాంతో అందరూ ఈ సిరీస్ కి ఇక మంగళ హారతి ఇచ్చారు అని అనుకున్నారు. కానీ గత ఏడాది క్యాన్సర్ నుంచి కోలుకున్న రాకేష్.. తాను క్రిష్-4 చిత్రాన్ని తీయబోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు .

తాజాగా హృతిక్ రోషన్ అందరి అయిన దర్శకుడు రాకేష్ రోషన్ ఆ ప్రాజెక్టు గురించి మరికొన్ని ఆసక్తికర అప్ డేట్స్ ఇచ్చారు. క్రిష్-4 చిత్రానికి ఆల్రెడీ కథ ఖరారైందని.. ఈ సినిమాకు సన్నాహాలు కూడా మొదలుపెట్టామని , ఇంతలో కరోనా వచ్చి ప్రాజెక్ట్ ని ఆపింది అంతే తప్ప సినిమా ఆగిపోలేదు ..అని రాకేష్ రోషన్ వెల్లడించాడు ..

`జీరో’ శాతంకు భారత్ వృద్ధి రేట్!


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్ వృద్ధి రెట్ ఆశలను వమ్ము చేసి, `జీరో’ స్థాయికి తీసుకు వేళ్ళనున్నదా? అవునన్న సంకేతాలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్‌ పొడిగింపుతో భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చని బ్రిటన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ బార్క్‌లేస్‌ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అసలు వృద్ధికి తావులేదన్నది. సున్నాగా తేల్చేసింది.

ఆర్థిక సంవత్సరం ఆధారంగా చూస్తే మాత్రం జీడీపీ 0.8 శాతంగా నమోదు కావచ్చని చెప్పింది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో ఇప్పటిదాకా ఉన్న నష్ట అంచనాలు రెట్టింపైయ్యాయి.

మొదటి 21 రోజుల లాక్‌డౌన్‌లో సుమారు రూ.10 లక్షల కోట్ల నష్టం రావచ్చన్న బార్క్‌లేస్‌.. పొడిగింపుతో దాదాపు రూ.18 లక్షల కోట్లుగా ఉండవచ్చని చెప్తున్నది.

ఇక ఈ ఏడాది వృద్ధిరేటు ఉండదన్న బ్రోకరేజీ.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 0.8 శాతంగా అంచనా వేసింది. తయారీ, వ్యవసాయ, గనుల రంగాలు అధికంగా ప్రభావితం అవుతున్నాయని వివరించింది.

మరోవైపు ఈ ఏడాది దేశ జీడీపీ 1.9 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 1930 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని మంగళవారం తమ తాజా నివేదికలో అభిప్రాయపడింది. ఈ సంవత్సరం జీడీపీ-3 శాతానికి పతనం కావచ్చన్నది.
భారత వృద్ధిరేటుపైనా అధిక ప్రభావం ఉంటున్నదని వెల్లడించింది. 1991 తర్వాత అత్యంత కనిష్ఠ వృద్ధిరేటును భారత్‌ నమోదు చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే వచ్చే ఏడాది దేశ ఆర్థిక వృద్ధిరేటు 7.4 శాతానికి పెరుగవచ్చనడం గమనార్హం.

స్టార్ హీరో సినిమాకి స్టార్ హీరో నిర్మాత


తమిళ సినిమా రంగాన్ని ఏలిన ఆగ నటులిద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు . దర్శక మేధావి కె బాలచందర్ గారి శిష్యులైన కమల్ హాసన్ , రజనీకాంత్ అటూ ఇటుగా ఒకే సారి హీరోలయ్యారు. కరెక్ట్ గా చెప్పాలంటే ముందుగా కమల్ హాసన్ హీరో అయ్యాడు. రజనీకాంత్ విలన్ గా స్టార్ట్ అయ్యి సిద్దం గా స్టార్ హీరో అయ్యాడు కాలం తో పాటు ఇద్దరు ఎదిగారు. కాగా రజనీకాంత్ ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తున్నాడు . కెరియర్ పరంగా రజనీకాంత్ కి ఇది 168వ సినిమా అని చెప్పాలి .. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపు కొంది. ఇక ఈ చిత్రం తరువాత రజనీకాంత్ చేయబోయే సినిమాలో కమల్ హాసన్ కూడా నటించనున్నట్టుగా కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. కాగా ఆ వార్తలో కొంతవరకే నిజం వుంది .

ఇక అసలి విషయానికి వస్తే రజనీకాంత్ , కమలహాసన్ `ఇద్దరం కలిసి నటించడం మానేద్దామని ‘ గతంలోనే అనుకున్నారట ..కెరీర్ ఆరంభంలో పదునారు వయదునిలే (పదహారేళ్ళ వయసు ), ఇలమై ఊంజల్ ఆడుకిఱతు (వయసు పిలిచింది ), మూండ్రు ముడిచు ( ఓ సీత కథ ) , నినైత్తలే ఇనిక్కుమ్ ( అందమైన అనుభవం ) వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరవాత ఇద్దరు స్టార్ స్టేటస్ వచ్చాక ఇద్దరు కలిసి నటించ వద్దు అని నిర్ణయించుకొని విడిపోయారు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు కలిసి నటిస్తున్నారని వార్త రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే రజనీకాంత్ ,.కమల్ హాసన్ కలిసి నటించడం లేదు. రజనీకాంత్ నటించే సినిమాకి కమల్ హాసన్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించ నున్నాడని తెలుస్తోంది .కాగా ఈ సినిమాకి (కార్తీ) ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది అన్ని కుదిరితే ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తోంది .

ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

2002 లో ఈశ్వర్ చిత్రం తో కృష్ణంరాజు గారి వారసుడిగా తెలుగు సినిమాల్లో కాలు పెట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తెలుగు లో అగ్ర నటుడి హోదాని .ఎంజాయ్ చేస్తున్నాడు .చేసింది 20. సినిమాలే వాటిలో ఏడు సినిమాలే హిట్ అయ్యాయి కాకపొతే బాహుబలి సిరీస్ తో నేషనల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ డిమాండ్ పీక్స్ లో ఉంది . తను చేస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా స్కోప్ ఉన్నవే .తాజాగా .. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఓ డియర్’ లేదా ‘రాధే శ్యామ్ ’ అనే టైటిల్స్ అనుకుంటున్నారు.

అదలా ఉంటే ప్రహస ప్రస్తుతంతెలుగులో అత్యధిక పారితోషకం తీసుకొంటున్న నటుడిగా మారాడు .‘బాహుబలి `మరియు ‘బాహుబలి2’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్. ఆ రెండు భాగాలకు కలిపి లాభాల్లో వాటాగా 80 కోట్ల వరకూ అందుకున్నాడు. ఇక ‘సాహో’ చిత్రానికి ఎటువంటి పారితోషికం తీసుకోలేదు అని ప్రభాస్ ఆ మధ్య ఏదో వార్తల్లో చెప్పాడు. ఆ సినిమాని నిర్మించింది బంధువు లు , స్నేహితులే కాబట్టి… నిజంగానే తీసుకుని ఉండక పోవచ్చు. నిజానికి ఆ చిత్రం ప్లాప్ టాక్ తో కూడా 230 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 150 కోట్ల వరకూ వచ్చిందట ఆ చిత్రం నిర్మాతలకు సేఫ్ వెంచర్ అనే చెప్పాలి. ఇక తన తరువాతి చేయబోయే చిత్రానికి కూడా లాభాల్లో వాటా లేదా నాన్ థియేట్రికల్స్ రైట్స్ రూపంలోపారితోషకం అందుకునే అవకాశం ఉందట. ఇక ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసే చిత్రానికి దాదాపు 80 కోట్ల వరకూ అందుకునే అవకాశం ఉందట.. ఇది కూడా సైన్స్ ఫిక్షన్ తో కూడిన పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం . . .

ఏపీలో విద్యార్థులకు శుభవార్త..!


రాష్ట్రంలో విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. 2018-19 విద్యా సంవత్సరానికి చెందిన రూ. 1,800 కోట్ల రీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు 2019-20 సంవత్సరానికి సంబంధించిన తొమ్మిది నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ పై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రీయింబర్స్ మెంట్ మొత్తాన్ని విద్యార్థినీ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలోకే నేరుగా వేయనున్నామని సీఎం తెలిపారు. ఇక, గత ప్రభుత్వం రూ. 35,000 ఫీజు రీయింబర్స్ మెంట్ గరిష్ట పరిమితిని పెట్టడంతో, మిగతా ఫీజు మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆయా కాలేజీ యాజమాన్యాలు వసూలు చేశాయి. అలా వసూలు చేసిన అదనపు మొత్తాన్ని ఆయా విద్యార్థులకు తిరిగి ఇచ్చేయాలని, కాలేజీలను ఆదేశిస్తూ, ఆ బకాయిలను కూడా ప్రభుత్వం కాలేజీలకు విడుదల చేసింది.

ఇందుకు సంబంధించి 191 కాలేజీలకు ఆదేశాలు ఇప్పటికే ఇచ్చామని, వారి నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు సక్రమంగా డబ్బు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని కాలేజీలపై చర్యలుంటాయని, వాటిని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు వెనుకాడవద్దని సూచించినట్టు విద్యా శాఖ అధికారులు తెలిపారు.

చిరంజీవి తొలి మూవీ రచయిత కన్నుమూత


రచయిత, నటుడు సి.ఎస్.రావు(85) మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. సి.ఎస్.రావు సుప్రసిద్ధ సీనీ, నవలా, నటక రచయితగా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ మూవీకి సీఎన్.రావు కథను అందించారు. ఆయన రచయితగానే కాకుండా పలు సినిమాల్లో నటించి మెప్పించారు.

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోపాటు ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’, జాతీయ అవార్డు చిత్రం ‘ఊరుమ్మడి బతుకులు’, ‘నాయకుడు వినాయకుడు’, ‘మల్లెమొగ్గలు’ వంటి పలు చిత్రాలకు సి.ఎస్.రావు కథలు అందించారు. అదేవిధంగా ఎన్టీఆర్ తో కలిసి ‘సరదా రాముడు’, ‘సొమ్మొకడిది సోకొకడిది’ చిత్రాల్లో ఆయన నటించి ప్రేక్షకులను అలరించారు.

అలాగే సి.ఎస్.రావు నాటక రంగానికి చేసిన విశేష సేవలను గుర్తించిన ప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. సి.ఎస్.రావుకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్డౌన్ నిబంధనల వల్ల ఎవరూ పరామర్శకు రావద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. బుధవారం హైదరాబా‌ద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

ఆ ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలి


రాష్ట్రంలో కరోనా ఉధృతి కొంత వరకూ తగ్గిందని భావిస్తున్న నేపధ్యంలో మళ్ళీ కోవిడ్ – 19 కేసుల సంఖ్య పెరగడంతో ఆందోళన కలిగిస్తుంది. సోమవారం సాయంత్రం నుండి నేటి ఉదయం 9 వరకు 34 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క గుంటూరులో అత్యధికంగా 109 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వివరిస్తూ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం, గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్, బుచ్చయ్య నగర్, జిల్లా పరిధిలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన, కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

వీటితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లా వడమాలపేట, శ్రీకాళహస్తి ప్రాంతాలతో పాటు మద్దూరు పరిధిలోని పాణ్యం గ్రామం, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం, నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట, చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం, అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు వచ్చాయని, ఇక్కడి వారంతా తగు జాగ్రత్తల్లో ఉండాలని సూచించింది.

మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి వందలాది యాత్రికులు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుకు పెడుతున్నారు. దీంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్న యాత్రికులకు గరికపాడు చెక్‌పోస్టు వద్ద వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా పాజిటివ్ కేసులను క్వారంటైన్‌ సెంటర్లకు పంపేందుకు, అలాగే నెగిటివ్ వచ్చిన వారిని హౌస్ క్వారంటైన్ సెంటర్లలో 14 రోజుల పాటు ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 16 బస్సుల్లో దాదాపు 664 మంది యాత్రికులు ఆంధ్రా బార్డర్‌కు రానున్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర , ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. నేడు, రేపు ఆంధ్రాలోకి 16 టూరిస్టు బస్సులు ప్రవేశించనున్నాయి.

వలస కూలీల ఆకలి కేకలు!

మల్కాజిగిరి లోని సఫీల్ గూడ లో జైన్ కనెస్ట్రక్షన్స్ వద్ద బీహార్, యూపీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్‌ కు చెందిన సుమారు 500మంది ధర్నాకు దిగారు. తమను గత 15 రోజులుగా ఎవరు పట్టించుకోవడంలేదని, కనీసం తాగడానికి నీళ్లివ్వడం లేదని వారు వాపోతున్నారు. తమ కాంట్రాక్టర్లు గాని ప్రభుత్వం కానీ తమకు ఎటువంటి సహాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారంతా సఫీల్ గూడ రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేకపోతే తమ రాష్ట్రాలకు తరలించాలని వేడుకుంటున్నారు. తమకు ఎక్కడా సోషల్ డిస్టెన్స్ లేదని ఒక్కొక్క గదిలో 10 మందిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ బయట వలస కార్మికులు లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించారు. తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ దాదాపు 1500 మంది వలస కార్మికులు రోడ్లపైకి వచ్చి, గుమిగూడి ఆందోళన నిర్వహించారు. సత్వరమే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలంటూ పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా కార్మికులు వినకపోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. అసలే మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది.

మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్న వేళ, కార్మికులు ఇలా భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి లాక్‌ డౌన్‌ ను ఉల్లంఘించడం మంచిది కాదని నిపుణులు, ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ విషయంపై హోంమంత్రి మాట్లాడుతూ… వలస కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉందని, వారు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. తాము మాత్రం వారిని నిలవరించే తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉన్నామని ఆయన ప్రకటించారు.

షాకింగ్ న్యూస్.. పని గంటలను పెంచనున్న కేంద్రం?


దేశంలో కరోనా ఎంట్రీతో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. రేపటితో లాక్డౌన్ ముగుస్తుందనగా ప్రధాని మోదీ మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 20వరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు కానుందని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులను అంచనా వేసి కొన్ని సడలింపులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే లాక్ డౌన్ అమలు వల్ల మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. దీంతో లాక్డౌన్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం పని గంటలను పెంచనుందని ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రచురించింది.

కేంద్ర ప్రభుత్వం పని గంటల మార్పునకు ఆర్డినెన్స్ తీసుకువచ్చే ఛాన్స్ ఉందని ఎకనమిక్స్ టైమ్ పేర్కొంది. లాక్ డౌన్ వల్ల కార్మికులకు సొంత ఊళ్లకు వెళ్లడంతో కొరత ఏర్పడింది. ఇదే సమయంలో నిత్యవసర వస్తువులకు గిరాకీ పెరిగింది. లాక్డౌన్ వల్ల ఏర్పడిన కార్మికుల కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు నుంచి 5నెలలు పని గంటలను పెంచాలని ఆలోచిస్తుంది. ఇందుకోసం చట్టాలను కూడా మార్చాలని యోచిస్తోంది. దీంతో రాష్ట్రాలకు పని గంటలు పెంచుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది.

కేంద్రం చట్టం చేస్తే కార్మికులు, ఉద్యోగులు 8గంటలు కాకుండా 12గంటలు పని చేయాల్సి రావచ్చు. అంటే వారానికి 48గంటలు కాకుండా 72గంటలు పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీస్ చట్టం-1948 ప్రకారంగా వారానికి 48గంటలకు మించి పని చేయడానికి వీల్లేదు. యుక్తవయస్సు ఉన్నవారిని బలవంతంగా పని చేయించడానికి వీల్లేదు. దీంతో ఈ చట్టానికి సవరణ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎవరెవరికీ ఈ చట్టం వర్తిస్తుంది? అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Divinaa Thackur Hot Photos

Actress Vedhika Photo Stills