Home Blog Page 8531

ఆ ఏడు జిల్లాల్లో కరోనా జాడ లేదు!

దేశవ్యాప్తంగా కరోనా రక్కసి వ్యాప్తి చెందుతున్నప్పటికీ దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల కంటే జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా కనిపిస్తోంది. మొత్తం 734 జిల్లాలకు గాను ఇంతవరకు 350 జిల్లాల్లో సున్నా కేసులు నమోదుకావడం ఒకింత ఊరటనిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఏడు జిల్లాల్లో కరోనా జాడ లేకపోవడం కూడా ఒకింత శుభపరిణమమే. ఆంధ్రప్రదేశ్‌ లో రెండు జిల్లాల్లో (విజయనగరం, శ్రీకాకుళం) ఇంతవరకూ కేసులు లేవు. మిగిలినవాటిలో అత్యధికంగా గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఐదు జిల్లాల్లో (వరంగల్‌ గ్రామీణ, వనపర్తి, మంచిర్యాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరి) కేసుల్లేవు. అత్యధిక కేసులు హైదరాబాద్‌ పరిధిలోనే కనిపిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా 70కి పైగా జిల్లాల్లో కేవలం ఒకేఒక్క కేసు నమోదైంది. 148 జిల్లాల పరిధిలో 10కి మించి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనేక పెద్ద నగరాల్లోనూ కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. సిక్కిం, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలిలలో ఒక్క కేసూ నమోదు కాలేదు. కోల్‌కతా, బెంగుళూరుల్లో మాత్రం కరోనా వ్యాప్తి పరిమితంగా ఉంది.

మణిపూర్‌, త్రిపురల్లో రెండు కేసులు, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌ ల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

సుకుమార్ దారిలో కొరటాల..


ఇంతకు ముందు హిందీలో ఉన్న సంప్రదాయం ఇపుడు తెలుగులోకి వచ్చింది డైరెక్టర్ గా స్థిరపడిన స్టార్ డైరెక్టర్లలో కొంత మంది తమ దగ్గర పనిచేసిన సహాయ దర్శకులకు తామే అవకాశం కల్పిస్తున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళే ఒక కొత్త బ్యానర్ స్థాపించి తమ శిష్యుల్లో ప్రయోజకులైన వారిని కనిపెట్టి .తామే ప్రమోట్ చేస్తున్నారు తెలుగు సినీ రంగానికి సంబంధించి ఇలా చేస్తున్న వారిలో దర్శకుడు సుకుమార్ ముందు వరుసలో ఉండి అందరికీ ఆదర్శం అయ్యాడు. తెలుగులో శిష్యులను ఎంకరేజ్ చేసే వారిలో వి వి వినాయక్ ,శేఖర్ కమ్ముల , మారుతి , త్రివిక్రమ్ శ్రీనివాస్,పూరీ జగన్నాధ్ లాంటి దర్శకులు ఉన్నప్పటికీ సుకుమార్ లాగా బ్యానర్ స్థాపించడం మాత్రం జరగలేదు . కాగా ఇపుడు ఇంకో స్టార్ డైరెక్టర్ కూడా సుకుమార్ ని అనుసరించడానికి రెడీ అవుతున్నాడు
.
ఇప్పటిదాకా ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. వరుసగా మిర్చి ,శ్రీమంతుడు , జనతా గారేజ్ , భరత్ అనే నేను వంటి నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకి అందించాడు . ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో గా ‘ఆచార్య’ సినిమా తీస్తూ బిజీగా ఉన్నాడు .. అయితే లాక్ డౌన్ కారణంగా ‘ఆచార్య’కు బ్రేక్ పడడంతో ఖాళీ సమయంలో ఒక మంచి ఆలోచన వచ్చిందట .. కొరటాల శివ కి …. సుకుమార్ రైటింగ్స్ మాదిరిగా ఓ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, తన అసిస్టెంట్స్ కి డైరెక్టర్ అయ్యే అవకాశం ఇవ్వాలని అనుకొంటున్నాడట …

స్వతహాగా రైటర్ అయిన కొరటాల శివ కొన్ని వందల పుస్తకాలు రాసాడట … ఇపుడు ఆ కథలతో తన అసిస్టెంట్ లను డైరెక్టర్స్ గా ప్రమోట్ చేయాలన్నది కొరటాల ప్లాన్. మొదటగా కొరటాల శివ దగ్గర కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఓ లేడీ అసిస్టెంట్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఆ లేడీ డైరెక్టర్ గురించి లాక్ డౌన్ ముగిశాక చేబుతాడట ..

200 మంది సినీ కార్మికుల‌కు సాయం చేసిన గౌతం రాజు


క‌రోనా లాక్ డౌన్ వేళ సినీకార్మికులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ద్వారా సేవ‌లందిస్తుండ‌గా ప‌లువురు ప‌లు ర‌కాలుగా సాయ‌ప‌డుతున్నారు. సీనియ‌ర్ న‌టుడు గౌతం రాజు త‌న‌వంతుగా 200 మందికి సేవ‌లందించ‌డం హ‌ర్ష‌ణీయం.

న‌టుడు గౌతం రాజు మాట్లాడుతూ-“ చాలా షూటింగులు తూగో జిల్లాలో జ‌రుగుతాయి. రాజ‌మండ్రి- యానాం- కాకినాడ – మండ‌పేట‌- పిఠాపురంలో జ‌రుగుతుంటాయ‌. క‌రోనా మ‌హ‌మ్మారీ వ‌ల్ల అక్క‌డ జూ.ఆర్టిస్టుల‌కు ప‌నుల్లేవ్. షూట్ లేక‌పోతే పొలం ప‌నులు చేసేవారు. ధైన్యంగా ఉన్నారంతా. నాకు ఆర్థిక సాయం చేసేంత లేక‌పోయినా మా అబ్బాయి .. కొంత సాయం చేశాడు. అమెరికాలో నా మిత్రుడు శేష‌గిరి.. న్యూజెర్సీలో ముర‌ళి .. బిగ్ బ‌జార్ సూర్య‌.. చంద్ర‌కాంత్ రెడ్డి. భీమ‌వ‌రంలో నా త‌మ్ముడు మ‌హేష్‌.. కాకినాడ కిర‌ణ్ కుమార్ (నిర్మాత‌) త‌మ‌వంతు సాయం చేశారు. కొండ‌య్య అనే జూ.ఆర్టిస్టు కం స‌ప్ల‌య‌ర్ సాయంతో 200 మందికి సాయం చేయ‌ద‌లిచాం. క‌ల్కి, గంగ, మ‌ల్లేష్ గౌడ్ త‌దిత‌రులం రామ‌చంద్ర పురం మొద‌లు పెట్టి ఆర్థిక సాయం చేశాం. వంద మందికి ఇప్ప‌టికే సాయ‌మందించాం. ఈ స‌ల‌హా ఇచ్చిన మా అబ్బాయికి ధ‌న్య‌వాదాలు. మ‌న ప్ర‌ధాని ముఖ్య‌మంత్రులు మ‌న ప్రాణాలు కాపాడేందుకు నియ‌మ‌నిబంధ‌న‌లు పెట్టారు. నెలాఖ‌రు వ‌ర‌కూ పాటిద్దాం. క‌రోనాను త‌రిమేద్దాం. సేవ‌లు చేస్తున్న‌ పోలీస్.. డాక్ట‌ర్ల‌కు అంద‌రికీ పాదాభివంద‌నాలు“ అని తెలిపారు.

సీసీసీ టీమ్ పై చిరంజీవి ప్రశంసలు


క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో సినీకార్మికుల భృతి స‌హాయార్థం క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) నిరంత‌రం ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే వెయ్యి మంది సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందించారు. సీసీసీ స‌రుకుల పంపిణీ చేస్తున్న టీమ్ పై సీసీసీ ర‌ధ‌సార‌థి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“ఒకే రోజు వెయ్యి మందికి స‌రుకులు పంపిణీ చేశాం అంటే ఆశ్చ‌ర్య‌పోయాను. ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ప‌ని చేయాలంటే ప్ర‌తి ఒక్క‌రూ సైనికుల్లా ముందుకొచ్చి ఇదొక బాధ్య‌త‌గా ధ‌ర్మంగా భావించి ఈ ప‌ని చేసారంటే ప‌రిశ్ర‌మ అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. డ‌బ్బు ఉన్నా ప‌ని సేవ చేసే వాళ్లు కావాలి. అంద‌రూ అభినందిస్తున్నారు. ప్ర‌శంసిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ గారు ఈ పంపిణీ విధానం తెలుసుకొని నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌- ఎన్.శంక‌ర్ తోపాటు మరీ ముఖ్యంగా మెహ‌ర్ ర‌మేష్ కి నా ప్రత్యేక అభినంద‌న‌లు“ అని తెలిపారు.

స్వీయ నిర్బంధంలో గుజరాత్ సీఎం రూపాని


గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అని తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

అధికారుల సూచనల మేరకు సీఎం రూపానీ సెల్ఫ్‌ క్వారెంటైన్‌లోని వెళ్లినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తెలిసింది. అహ్మ‌దాబాద్‌లోని జ‌మ‌ల్‌పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావడంతో ఈ జాగ్రత్త తీసుకొంటున్నారు.

ఇమ్రాన్ ఖేద్వాలా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయ‌న గ్యాసుద్దీన్ షైఖ్‌, శైలేష్ పార్మ‌ర్ అనే మ‌రో ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి గాంధీన‌గ‌ర్‌లోని సీఎం కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీతో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ఉపముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్‌, హోంమంత్రి ప్ర‌దీప్ సిన్హా జ‌డేజా, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అనంత‌రం రాత్రి స‌మ‌యంలో ఎమ్మెల్యే ఇమ్రాన్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. అయితే ఈ స‌మావేశంలో ప్ర‌తి ఒక్క‌రు‌ సామాజిక దూరం పాటించార‌ని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ ఎమ్యెల్యేలు ఇద్దరు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

మరోవైపు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా బుధవారం నాటికి గుజరాత్‌లో 617 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవ్వగా.. మృతుల సంఖ్య 26కు చేరింది.

చంద్రబాబుకు మోడీ ఫోన్ …. ఉలిక్కి పడుతున్న జగన్!


సరిగ్గా రెండు సంవత్సరాల, ఒక నెల అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్ లో మాట్లాడడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.

దాదాపు అన్ని రాజకీయ పక్షాల నేతలతో కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ చంద్రబాబుతో కూడా, అది కూడా ఆయన చేసిన ఫోన్ కు సమాధానంగా మాట్లాడటం రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉండదు.

అయితే ఈ టెలిఫోన్ సంభాషణ గురించి వైసిపి నేత విజయసాయిరెడ్డి స్పందించిన తీరు గమనిస్తే వైసిపి అధినేత అబద్రతాభావంకు గురవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

2018లో మార్చ్ 8న ఇదే విధంగా అంతకు ముందు చంద్రబాబు చేసిన ఫోన్ కు అందుబాటులో లేని ప్రధాని మోదీ చంద్రబాబుకు ఫోన్ చేసారు. ఆ సందర్భంగా తమ మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రివర్గం నుండి నిష్క్రమిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత కొద్దీ రోజులకే ఎన్డీయే నుండి టిడిపి వైదిలొగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా చంద్రబాబు ప్రధానిని కలుసుకోవడం గాని, కనీసం మాట్లాడటం గాని జరగలేదు.

ఇప్పుడు కూడా కరోనా గురించి తాను సేకరించిన సమాచారం కొంత ఇవ్వడం కోసం చంద్రబాబు ఫోన్ చేస్తే అందుబాటులో లేని ప్రధాని, ఆ మరుసటి రోజు ఉదయం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ విషయాన్నీ చంద్రబాబు స్వయంగా మీడియాకు తెలిపారు. ప్రధాని వైపు నుండి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా తాను కొన్ని సూచనలు ఇస్తున్నానని అంటూ, ఈ సూచనలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కూడా చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా గత వారం విశేషంగా ప్రచారం పొందిన దేశాన్ని మూడు విభాగాలుగా – రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఎల్లో జోన్ – అంటూ విడదీయడం తన ఆలోచన అన్నట్లుగా కూడా చెప్పారు అనుకోండి.

ఈ టెలిఫోన్ సంభాషణని అవహేళన చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పాతికసార్లు ప్రాధేయ పడితే ప్రధాని నరేంద్ర మోదీ కాల్ చేసి ఉంటారని అంటూ ధ్వజమెత్తారు. పైగా, మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా కాల్‌ చేసి మాట్లాడారని గుర్తు చేశారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు .

ఆ ట్వీటీపై టిడిపి నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ..చంద్రబాబుకు ఫోన్‌ చేస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి దుస్తులు ఎందుకు చించుకుంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు.

పైగా, ఎన్నికల ముందు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ జగన్‌ ఊరేగారు, ఫ్రంట్‌ గెలిస్తే జగనే ఉప ప్రధాని అంటూ మీరు ఇచ్చిన బిల్డప్‌ మర్చిపోయారా? అని ఆయన ఎద్దేవా చేశారు.

‘‘ఎంపీలను గెలిపించండి..మోదీ మెడలు వంచుతాం.. అని..ప్రజలు ఓట్లేసిన తర్వాత పోటీపడి మరీ..మోదీ కాళ్ల మీద జగన్‌ పడిన విషయం గుర్తులేకపోతే ఎలా?.. విజయసాయిరెడ్డి ..’’ అని అవహేళన చేశారు.

శ్రీయ శరన్ భర్తకి కరోనా..!


నువ్వే నువ్వే ఛత్రపతి , శివాజీ , ఠాగూర్ వంటి చిత్రాల్ నాయిక గా నటించిన స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ కొన్నేళ్ల కిందటే రష్యాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొషీవ్ ని పెళ్లాడటం జరిగింది. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ కొంత కాలం ఇండియాలోనే ఉన్న శ్రియ.. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో భర్త తో కలిసి ఫారెన్ లో ఉంటోంది. వీళ్లిద్దరూ కొన్ని నెలలుగా స్పెయిన్లో గడుపుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కరోనా వైరస్ స్పెయిన్ దేశప్రజల్ని వణికించడం స్టార్ట్ అయ్యింది.

ప్రపంచంలో కరోనా కారణంగా అత్యంత ప్రభావితమైన దేశాల్లో స్పెయిన్ ఒకటి అని రోజూ టివి ల్లో మనం కూడా చూస్తూనే వున్నాం అలా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్న సమయంలోనే శ్రియ, ఆండ్రీ కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి .

సడన్ గా ఆండ్రీ కొషీవ్ లో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడం తో శ్రీయ అనుమానంగా డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తే కరోనా బారిన పడినట్లు తేలింది. కానీ వైద్యులు అక్కడ చేర్చుకోవడానికి అంగీకరించలేదని.. వెంటనే ఇంటికి వెళ్లిపోమన్నారని శ్రియ వెల్లడించింది. ఆండ్రీ కొషీవ్ కి కరోనా ఎక్కువ ఉన్నా, లేకున్నా అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆసుపత్రుల్లో ఉంటే కచ్చితంగా ఈ వైరస్ ఇంకా ఎక్కువ ఆవుతుందని..ఇంటిదగ్గరే క్వారంటైన్లో ఉండి మందులు వేసుకొంటున్నాడని శ్రియ తెలిపింది. ఇంటికి తిరిగొచ్చేశాక .ఆండ్రీ కొషీవ్. ఒక గదికి పరిమితమై మందులు వాడుతున్నాడని., ఇప్పుడు అతడి పరిస్థితి మెరుగ్గానే ఉందని శ్రియ వెల్లడించింది ..అని తెలుస్తోంది .

ఏపీలో దారుణం.. మిస్డ్ కాల్ కు వివాహిత బలి


ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. సాఫీగా సాగుతున్న కాపురంలో భార్య ఫోన్ కు వచ్చిన మిస్డ్ కాల్ చిచ్చురేపింది. చివరికీ భార్య హత్యకు దారితీయడం శోచనీయంగా మారింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని కొస్రూరు మండలం దొడ్లేరు గ్రామంలో చోటుచేసుకుంది.

బోడా సుబ్బారావు, బోడా కోటేశ్వరమ్మ(28) ఇద్దరు భార్యభర్తలు. కొద్దికాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. అయితే గతకొంకాలంగా సుబ్బారావు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. దీంతో వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో కోటేశ్వరమ్య ఫోన్ కు మిస్డ్ కాల్ వచ్చింది. భార్య ప్రియుడే ఫోన్ చేసి ఉంటాడని ఆమెతో సుబ్బారావు గొడవకు దిగాడు.

ఈక్రమంలోనే ఆవేశానికి గురైన సుబ్బారావు తన భార్యను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ప్రస్తుతం గుంటూరులో సంచలనంగా మారింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జగన్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ!


రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85 హైకోర్టు కొట్టివేసింది. కొద్ది రోజుల కిందట ప్రభుత్వం ఈ జి.ఒలను తెచ్చింది. గతంలోనే ప్రభుత్వం, పిటీషనర్ తరుపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పు వివరాలను వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు సుదీష్ రాంబోట్ల, ఇంద్రనీల్ అనే న్యాయవాది పిటీషన్ లు దాఖలు చేశారు.

విచారణ సమయంలో ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని, ప్రభుత్వం బలవంతంగా రుద్దకుడదని పిటీషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. అదేవిధంగా ఇలా ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల నిర్వహిస్తామని కావాలనుకున్న వారు అక్కడ చదువుకోవచ్చని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు ఒక్క చోటికి వచ్చి చదుకు కోవడం సాధ్యం కాదని పిటీషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుగు భాషా సంఘము, ఉపాద్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. కోర్టు తీర్పును ఈ సంఘాలు స్వాగతిస్తున్నాయి.

లాక్ డౌన్ ఎఫెక్ట్.. బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన అంశాలు!

What is the attitude of RBI on Emi, loans
What is the attitude of RBI on Emi, loans


దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడగించిన సంగతి తెల్సిందే. మే 3వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే ఏప్రిల్ 20 తర్వాత కొన్నిరంగాలకు సడలింపులు ఉంటాయని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ రంగానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా ఆర్‌బీఐ, బ్యాంకులు, ఏటీఎంలు, డెట్ మార్కెట్స్ వంటి వాటిని ప్రస్తావించింది.

ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి. అంటే ఎన్‌పీసీఐ, సీసీఐఎల్, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్, స్టాండలోన్ ప్రైమరీ డీలర్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు యథావిధిగా సేవలను కొనసాగిస్తాయి. బ్యాంకింగ్ రంగానికి చెందిన ఐటీ వెండర్స్, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్, ఏటీఎం ఆపరేషన్స్, క్యాష్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలు యథావిధిగా కొనసాగుతాయి. డీబీటీ క్యాష్ ట్రాన్స్‌ఫర్ పంపిణీ పూర్తయ్యే వరకు బ్యాంకు శాఖలు సాధారణ వర్కింగ్ అవర్స్‌లోనే విధులు నిర్వహిస్తాయి. బ్యాంకుల్లో, బ్యాంక్ కరస్పాండెట్స్ వద్ద ఖాతాదారులు సామాజిక దూరం పాటించేలా చూసే బాధ్యత స్థానిక అడ్మినిస్టేషన్‌ పేనే ఉంటుంది. సెబీ రూల్స్‌కు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్లు, డెట్ మార్కెట్లు విధులు నిర్వహిస్తాయి. ఐఆర్‌డీఏఐ, బీమా రంగ సంస్థలు యథావిథిగా పని చేస్తాయి.

12 రోజుల్లో 10లక్షల కరోనా కేసులు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా రక్కసి విజృంభన ఇంకా తగ్గక పోగా రోజు రోజుకి ఎక్కువవుతుంది. గడించిన 12 రోజుల్లో 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 3నాటికి 10 లక్షలు దాటినా కరోనా కేసుల సంఖ్య అక్కడనుండి జడ్ స్పీడ్ తో దూసుకెళ్లి 12 రోజుల్లోనే 20 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 19 లక్షల 76 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో మరణించిన వారి సంఖ్య 1 లక్ష 28 వేలు దాటింది. 4 లక్షల 73 వేల మంది కొలుకున్నారు.

భారత్ లో కూడా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.గడిచిన వారం రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 8 గంటలకు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 11,439 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ కారణంగా 38 మరణాలు సంభవించగా, కొత్తగా 1076 కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుండగా, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పెంచడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ రోజు వివరణాత్మక మార్గదర్శకాన్ని జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 20 నుండి అనేక ప్రాంతాలు షరతులతో పనిచేయడానికి అనుమతించబడ్డాయి. కరోనా వైరస్ కారణంగా భారత్ లో ఇప్పటివరకు మొత్తం 377 మంది మరణించారు, 1,305 మంది కోలుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం..బుధవారం ఉదయానికి తెలంగాణలో 644పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 18మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 110మంది కోలుకోగా ప్రస్తుతం 516 మంది చికిత్స పొందుతున్నారు. కేవలం మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 52పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గడచిన 24గంటల్లో నగరంలో కొత్తగా 40కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌ లో ఈ వైరస్‌ సోకి 9మంది మరణించగా మొత్తం 486మందికి సోకింది. వీరిలో కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే 114 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో కూడా వైరస్‌ తీవత్ర పెరిగింది. ఇప్పటివరకు కర్నూలులో 93 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తికి కరెన్సీ నోట్లు కారణమా..?


ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్‌ కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందుతోందా అన్న ప్రశ్నకు, అవుననే అంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఇటువంటి అనుమానాలు లేకపోయినా తాజాగా గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించిన తరువాత ఈ నిర్థారణకు వచ్చినట్లు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ఎక్కువగా చేతుల్లోనే తిష్టవేసి ఉంటుంది. ఎందుకంటే దైనందిన జీవితంలో కంప్యూటర్‌ను ఆన్‌ చేయడం నుంచి బాత్‌రూంకు వెళ్లేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్‌ ఎక్కిదిగినప్పుడు డోర్ల ఆపరేషన్‌, స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయడం అన్నీ చేతులతోనే చేస్తుంటారు. దీనివల్ల ఒకరి చేతిలోని వైరస్‌ మరొకరి చేతిలోకి విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం క్రయవిక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో డిజిటల్ చెల్లింపులపై దృష్టి సారించింది. క్రమంగా మార్కెట్లో నగదు చలామణి పెరిగిన అనంతరం డిజిటల్ పేమెంట్ల వినియోగం కోట తగ్గింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో డిజిటల్ పేమెంట్ వినియోగం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ దిశగా ప్రజలను మరింత ప్రోత్సహించాల్సి ఉందంటున్నారు.

లాక్ డౌన్ టైంలో..విద్యార్థులకు గుడ్ న్యూస్!

లాక్ డౌన్ కాలంలో విద్యార్థులు ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండటానికి హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కలిసి దేశవ్యాప్తంగా ఆన్‌ లైన్ ప్రోగ్రామ్‌ ను ఏర్పాటు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమానికి అనుగుణంగా ఫిట్‌ నెస్ మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం ఆన్‌ లైన్ ప్రోగ్రామ్‌ ను రూపొందించామని హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో పాఠశాల విద్యార్థుల కోసం నిపుణుల లైవ్ ఫిట్నెస్ సెషన్లను అందించడానికి సిబిఎస్ఇ మరియు ఫిట్ ఇండియా ఉద్యమం సహకరించనున్నాయి. ఈ సెషన్‌ లు యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లో ఏప్రిల్ 15 ఉదయం 9.30 నుండి ప్రతిరోజూ ఒక నెల పాటు ప్రత్యక్షంగా ఉంటాయి.

ఫిట్ ఇండియా ఉద్యమం యొక్క యూట్యూబ్ ఛానెల్ నుండి విద్యార్థులు ఈ ఆన్ లైన్ సేవలను ఉపయోగించుకోవచ్చని హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు.

హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (NIOS) సమర్థవంతమైన పాఠశాల విద్యను నేరుగా విద్యార్థులకు చేరే విధంగా ఒక ప్రత్యేకమైన పద్ధతిని ప్రారంభించింది. 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు వివిధ విషయాల కోసం MHRD యొక్క అనేక ప్లాట్‌ఫారమ్‌ ల ద్వారా ఆన్‌ లైన్‌ లో కంటెంట్ అందుబాటులో ఉంచబడింది.

సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్‌తో పాటు, ‘స్వయం’ పోర్టల్ వీడియో ఉపన్యాసాలు మరియు స్వీయ-అంచనా సౌకర్యాన్ని అందిస్తుంది. అభ్యాసకుల అనుమానపు ప్రశ్నలు కూడా చర్చా వేదిక ద్వారా పరిష్కరించబడుతున్నాయి.అదనంగా, ఇంటర్నెట్‌ కు ఎక్కువ ప్రాప్యత లేని వారికి, ఈ వీడియో ఉపన్యాసాలు ఎంహెచ్‌ఆర్‌డి స్వయంప్రభా టివి ఛానెళ్లలో లైవ్ సెషన్స్‌ తో తమ ఉపాధ్యాయులు మరియు విషయ నిపుణులతో సంభాషించడానికి ప్రసారం చేయబడతాయి. జెఇఇ మరియు నీట్ కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఇంట్లో కూర్చుని ప్రయోజనం పొందవచ్చు.

అభ్యాసకులు ఈ DTH ఛానెల్స్ మరియు NIOS యూట్యూబ్ ఛానెల్‌ లో లెస్సన్ వైస్ విద్యా కార్యక్రమాలను చూడవచ్చు మరియు లైవ్ సెషన్‌ లో ఫోన్ కాల్ ద్వారా మరియు NIOS వెబ్‌సైట్ యొక్క ‘స్టూడెంట్ పోర్టల్’ ద్వారా నేరుగా వారి ఇంటి నుండి సబ్జెక్ట్ నిపుణులకు ప్రశ్నలు అడగవచ్చు.

ప్రాధేయపడితేనే ఫోన్ చేసి వుంటారు..!


ప్రధానితో మాట్లాడాలని అనుకుంటున్నానని పీఎంఓ కార్యాలయానికి కాల్ చేసి చెబితే, ఆ వెంటనే ప్రధాని తనకు ఫోన్ చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఓ పాతికసార్లు ప్రాధేయపడివుంటారని, అందుకే మోదీ కాల్ చేసి ఉండవచ్చని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్వీట్ పెట్టారు.

ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారని, నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారని, పరామర్శిస్తారని తెలిపారు. మోదీ వినమ్రత అటువంటిదని పేర్కొన్నారు.

పెద్ద నోట్ల రద్దు సలహా తనే మోదీకి ఇచ్చానని అప్పట్లో బాబు డప్పుకొట్టుకుని క్రెడిట్ కొట్టేయాలని చూసినా ప్రధాని హుందాతనంతో వదిలేశారన్నారు. ఉదయం ఫోన్ వస్తే నాలుగు గంటలు ఓపిక పట్టలేనోడు, ‘మూడు జోన్ల’ లేఖ విషయం ఇన్నాళ్లు దాచాడంటే అది బోగస్ అని తెలుస్తూనే ఉందిని పేర్కొన్నారు.

ప్రదాని ఏం మొహం పెట్టుకుని ఏపికి వస్తాదంటూ, మోదీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన విషయం ప్రజలిప్పటికీ గుర్తుపెట్టుకున్నారని, వ్యక్తిగత విషయాలపై నీచంగా ఆరోపణలు చేసిన సంగతి మోదీగారు మర్చిపోయుంటాడని బాబు అనుకుంటున్నాడని తెలిపారు. ప్రదాని అపార జ్ఞాపకశక్తి కలిగిన వ్యక్తిగా చెప్పారు. అయినా ప్రజలు తిరస్కరించిన వాడిని ఎవరూ ఆదరించరని బాబును ఉద్దేశించి పేర్కొన్నారు.

వలస కార్మికుల సమస్యతో దేశం అతలాకుతం

లాక్ డౌన్ దేశవ్యాప్తంగా ఇంకో 19 రోజులు పొడిగించటం తో వలస కార్మికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. వారి మానసిక స్థితి ని సానుకూలంగా చూడాలి తప్పితే కేవలం చట్టాల , నిబంధనల చట్రంలో నుంచి చూడకూడదు. అందరూ అనుకుంటున్నట్లు, కొంతమంది మేధావులు వ్యక్తపరుస్తున్నట్లు ఇది వారి ఆర్ధిక దయనీయమైన పరిస్థితి కి సంబందించినది కాదు. అది కేవలం ఒక పార్శ్వం మాత్రమే. ముఖ్యమైనది వారి మానసిక స్థితి కి సంబందించినది. ఇంటికి చాలా దూరంగా ఉండటంతో ఇంటి దగ్గర కుటుంబం , పెళ్ళాం, పిల్లలు, తల్లిదండ్రులు ఎలావున్నారనే  ఆదుర్దా, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబం మధ్య ఉండాలనే బలమైన కోరిక వాళ్ళని అశాంతి కి, ఆందోళన కి గురి చేస్తుంది. వలస కార్మికుల్లో కుటుంబంతో నివసించే వాళ్ళు మూడో వంతు మాత్రమే. అదీ అందరి కుటుంబ సభ్యులతో  కాదు. ఈ ఆందోళన నే వీళ్ళను సామాజిక దూరం లెక్కచేయకుండా నిరసనలకు పురికొల్పుతుంది.

ముంబై ఉల్లంఘన చాలా ప్రమాదకరం 

నిన్న ముంబై లో జరిగింది క్షమించరాని ప్రభుత్వ వైఫల్యం. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పటికే డిల్లీ వలస కార్మికుల ఆందోళన, డిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సంఘటన మనకు నేర్పిన చేదు అనుభవాలనుంచి గుణపాఠం నేర్చుకోకపోవటం దారుణం. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం ఒకత్రాటి పై నడవటంలేదు అనటానికి ఇది ఉదాహరణ. గట్టి నాయకుడు ప్రభుత్వాధినేతగా వున్న చోట ఇటువంటి పరిస్థితుల్లో గట్టి నిర్ణయాలు తీసుకోగలడు. సంకీర్ణ ప్రభుత్వాల్లో అది సాధ్యం కాదు, అదీ పరస్పర విరుద్ధ సిద్ధాంత పార్టీలు కలిసిన చోట. బాంద్రా లో జరిగింది చిన్న విషయం కాదు. ఇంకో నిజాముద్దీన్ మర్కజ్ లాంటిదే. ఇప్పటికే ముంబై లో కరోనా మహమ్మారి జడలు విప్పి స్వైర విహారం చేస్తున్న వేళ ఇంతమంది ఒకచోట గుమికూడటం కారణమేదైనా మహా ప్రమాదం. దీని పరిణామాలు ముందు ముందు ఎలా వుంటాయో నని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ముంబై లో కరోనా మహమ్మారి రెండో దశను దాటి మూడో దశలోకి ప్రవేశించిందనే భయం అందరిలో ఒక వైపు వెంటాడుతుంటే ఇంకోవైపు దాన్ని విస్తరించే కార్యక్రమాలు జరగటం దారుణం. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి.

బాంద్రా ఎమ్యెల్యే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ప్రకటించాడు. ఆయనేమీ ప్రతిపక్ష బిజెపికి చెందిన వ్యక్తి  కాదు. సాక్షాత్తు అధికార సంకీర్ణానికి చెందిన కాంగ్రెస్ ఎమ్యెల్యే. రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులకు ఆహారం సరఫరా చేయటం లో విఫలమయ్యిందని అందుకే వాళ్ళలో అశాంతి చెలరేగిందని ప్రకటించాడు. అయితే ఉద్ధవ్ థాకరే మాత్రం అటువంటిదేమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇందులో నిజా నిజాల సంగతి ఎలావున్నా వాళ్ళలో ధైర్యాన్ని నింపటం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని చెప్పక తప్పదు. మోడీ నిన్న దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించటానికి ముందే మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అటువంటప్పుడు మోడీ ప్రకటన వల్లే ఇది జరిగిందని కొంతమంది మాట్లాడటం సమస్యను రాజకీయం చేయటమే అవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కుమారుడు , మంత్రి అయిన ఆదిత్య థాకరే ప్రకటన బాధ్యతా రాహిత్యంగా వుంది. వలస కార్మికుల్ని కేంద్రం వాళ్ళ స్వస్థలాలకు తరలించటానికి ఏర్పాట్లు చేయక పోవటం వల్లనే ఈ సమస్య ఉత్పన్న మయ్యిందని ప్రకటించటం, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ప్రధాన మంత్రి కి, హోంమంత్రి కి ధన్యవాదాలు తెలపటం చూస్తుంటే తన అపరిపక్వత ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. బ్యాంకు స్కాం లో ఇరుక్కొని సిబిఐ , ఇడి విచారణకు రాకుండా కరోనా కుంటి  సాకులతో కాలం గడుపుతున్న వద్వానా కుటుంబం కి వివిఐపి పాసులు జారీ చేసి నిబంధనలు ఉల్లంఘించటం అక్కడి రాష్ట్ర ప్రజలందర్నీ ఆశ్చర్య పరిచింది. అందరూ అనుకోవటం శరద్ పవర్ ఆజ్ఞలతోనే ఇది జరిగందని . ఇందులో నిజా నిజాలు తెలుసుకోవటం ఇప్పుడు ప్రాధాన్యం కాదు కాబట్టి సర్దిపుచ్చుకుందాం. కానీ ఇలా కరోనా వ్యాప్తి చెందే పనులకు పరోక్షంగా దోహదం చేయటం క్షమించ రాని నేరం.

బాంద్రా వెస్ట్ రైల్వే స్టేషన్ కి ఇన్ని వందలమంది వాళ్ళంతట వాళ్ళే వచ్చారని నమ్మే అమాయకులు ఎవరూ లేరు. వివిధ ప్రాంతాలనుంచి అదీ ఒక్క బాంద్రా స్టేషన్ కే ఇంతమంది ఎందుకు వచ్చారో దర్యాప్తు చేయాల్సి వుంది. ఇప్పటికే అందిన సమాచారం మేరకు కొంతమంది సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టి అందర్నీ ఒకచోట చేర్చారని అర్ధమవుతుంది. వీళ్ళు హోం మంత్రి కి తెలిసినవాళ్ళని కూడా సాక్ష్యాధారాలతో కొన్ని చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి. దానిలో నిజా నిజాలు దర్యాప్తులో తేలాల్సివుంది. ఒకవేళ నిజంగా హోం మంత్రికి తెలిసిన వాళ్ళయినా దానికి హోం మంత్రిని బాధ్యుడిని చేయలేము. కాకపోతే ఇటువంటి వ్యక్తులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పగలం. అధికారంలో వున్న ముఖ్యమంత్రి పార్టీ చరిత్ర చూసినా వలస కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పలేం. అసలు శివ సేన పుట్టుకే వలస కార్మికులు, స్థానికేతరులు కి వ్యతిరేకంగా. అందుకే ఆదిత్య థాకరే అలా మాట్లాడాడు. ఇప్పుడు అందరి ఆందోళన అల్లా ఈ అంతర్గత కలహాలతో పరిపాలన కుంటుపడి కరోనా మహమ్మారి కి వ్యతిరేకంగా పటిష్టమైన చర్యలు లోపిస్తాయేమోనని. దేశం మొత్తం మీద అత్యంత ఆందోళన కర పరిస్థితులు ముంబై లోనే వున్నాయి. ఇది సామూహిక విస్తరణ ( Community Spread) దశగా మారిందనో, మారే అవకాశాలు మెండుగా ఉన్నాయనో వస్తున్న వార్తలు అందరి మనస్సుల్నీ తీవ్రంగా కలిచివేస్తుంది.

కేంద్రప్రభుత్వం పారదర్శకత తో వ్యవహరించాలి 

అంటే దీనర్ధం కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదు. వలస కార్మికుల సమస్యపై కేంద్రం ఇప్పటికే మరింత సానుకూల వైఖరితో చర్యలు చేపట్టి వుండాల్సింది. మోడీ విషయం లో కరోనా మహమ్మారి ని కట్టడి చేయటంలో వున్నంతలో సమర్ధంగానే చేసాడని అనుకున్నా తన ఆలోచనలు, చర్యల్లో పారదర్శకత లోపించింది. ఇంత రహస్యంగా ప్రభుత్వ పనివిధానం ఉండాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు ముఖ్యంగా లాక్ డౌన్ వలన నష్టపోయిన పరిశ్రమలు, ఎంఎస్ఎం ఇ లు, వలస కార్మికులు ఎదురుచూస్తున్న ఉద్దీపన, సంక్షేమ ప్యాకేజీలు ఎప్పుడు వస్తాయో అసలు వస్తాయో రావో తెలియని గోప్యత ఉండాల్సిన పనిలేదు. రాష్ట్రాలకు ఏమేర సహాయం చేస్తారో తెలియని పరిస్థితి. ప్రధానమంత్రి  గరీబీ కళ్యాణ్ పధకం తర్వాత మరిన్ని ప్రభుత్వ ప్రోత్సాహ చర్యలు ప్రకటిస్తుందని అందరూ ఎదురుచూస్తుంటే అసలు ప్రభుత్వ ఆలోచన ఏమిటో ఎవరికీ తెలియదు. అన్నీ ఊహాగానాలే.

మోడీ తను  జాతినుద్దేశించి చేసే ప్రసంగాలలో వీటిపై వివరణలు లేకపోవటాన్ని కొంతమేరకు అర్ధం చేసుకోగలం. ఇటువంటి సమయం లో జాతి మొత్తాన్ని సామాజిక దూరం పై కేంద్రీకరించేటట్లు భావోద్రేకాన్ని రగిలించటం అవసరం కాబట్టి సమస్య పక్కదారి పట్టకుండా ఒకే సమస్యపై మాట్లాడని అనుకోవచ్చు. కానీ ఆర్ధిక మంత్రి తో నైనా ఎలా చేద్దామనుకుంటున్నారో ప్రకటించక పోవటం సరైన ఆలోచనకాదు. ప్రతిదీ అంత గోప్యతగా వుంచటం వలన ప్రజల్లో, రాష్ట్ర ప్రభుత్వాల్లో అపార్ధాలు, అశాంతి పెరగటం ఖాయం. ఇప్పటివరకు ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ చెప్పినట్లు గా చేస్తూ వచ్చారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలతో  వీడియో సమావేశాలు నిర్వహించటం సరిపోదు. తన ఆలోచనలు మరింత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం వుంది.

నోట్లు ముద్రించటం పరిష్కారం కాదు 

అదేసమయం లో కొంతమంది మేధావులు చెబుతున్నట్లు క్వాంటమ్ ఈజింగ్ , హెలికాప్టర్ మనీ పధకాలు ఆచరణ సాధ్యం కాదు. ఇది ఒక సిద్ధాంతం మాత్రమే. ఇది పాటించిన అన్ని దేశాల్లో అనుభవం ఒకలా లేదు. ముఖ్యంగా మనలాంటి దేశాల్లో ఇది ఎంతవరకు సాధ్యమో చెప్పలేము. ఇది అధిక ద్రవ్యోల్బణానికి , సమీప భవిష్యత్తు లో కోలుకోలేని ఆర్ధిక దౌర్బల్యానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. ప్రోత్సాహక   ప్యాకేజీలు అవసరమే కానీ మరీ కేవలం నోట్లు ముద్రించి పరిష్కార మార్గాలు కనుక్కోవటం అనుకున్నంత తేలిక కాదు. అలాగే  రాష్ట్రాలు ప్రతిదీ కేంద్రం మీద భారం మోపటమూ సరికాదు. వాళ్ళ పరిధిలో కూడా కొన్ని చర్యలు చేపట్టాల్సి వుంది. ముఖ్యంగా పేదప్రజల ఆకలి తీర్చే పని రాష్ట్రాలదే. కొంతమేర కేంద్రం ఆర్ధిక సహాయం చేసినా పటిష్ట అమలు రాష్ట్రాల చేతుల్లోనే వుంది. ఇప్పటికైనా వలస కార్మికుల్లో ఆర్ధిక సహాయం తో పాటు ఆత్మ స్థైర్యాన్ని నింపే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టగలిగితేనే లాక్ డౌన్ సంపూర్ణంగా జరిగి కరోనా మహమ్మారి పై విజయం సాధించగలమని గ్రహించాలి.

లాక్ డౌన్ కాలంలో ఈ 13 పనులు నిలుపుదల!


లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించిన సమయంలో దేశ పౌరులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు (బుధవారం) విడుదల చేసింది.

జారీ చేసిన మార్గదర్శకాలు ఎక్కువగా సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విడుదల చేశారు. లాక్ డౌన్ అమలయ్యే వరకు ఈ కొత్త మార్గదర్శకాలు అమలులో ఉంటాయి.

నిలిచిపోయిన 13 పనుల జాబితా..

1.భద్రతా ప్రయోజనాల మినహా అన్ని దేశీయ మరియు విమాన ప్రయాణాలు ప్రయాణాలు నిలుపుదల.

2.భద్రతా ప్రయోజనాల మినహా రైళ్ల ద్వారా అన్ని ప్రయాణాలు రద్దు.

3.ప్రజా రవాణా కోసం కొన్ని బస్సులు తప్ప అన్ని బస్సులు నిలుపుదల.

4.అన్ని మెట్రో రైలు సేవలు ఉండవు.

5.వైద్య కారణాల మినహా వ్యక్తుల మధ్య జిల్లా మరియు అంతర్-రాష్ట్ర కార్యకలాపాలు ఉండవు.

6.అన్ని విద్యలు, కోచింగ్, శిక్షణా సంస్థలు మూసివేయబడతాయి

7.ప్రత్యేకంగా అనుమతించబడినవి కాకుండా అన్ని పారిశ్రామిక మరియు వాణిజ్య కార్యకలాపాలు నిలుపుదల.

8.ప్రత్యేకంగా అనుమతించబడిన ఆతిథ్య సేవలు ఉండవు.

9.టాక్సీలు (ఆటోరిక్షాలు మరియు సైక్లెరిక్షాలతో సహా) మరియు క్యాబ్ అగ్రిగేటర్ల సేవలు నిలుపుదల.

10సినిమా హాళ్ళు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, వ్యాయామశాలలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్‌లు మరియు ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్ళు మరియు ఇలాంటి ప్రదేశాలు మూసివేత.

11.అన్ని సామాజిక / రాజకీయ / క్రీడలు / వినోదం / విద్యా / సాంస్కృతిక / మతపరమైన విధులు / ఇతర సమావేశాలు పెట్టుకోకూడదు.

12.అన్ని మతపరమైన ప్రదేశాలు లేదా ఆరాధన స్థలాలు మూసివేయబడుతాయి. మత కూడికలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి

13.అంత్యక్రియల విషయంలో, 20 మందికి పైగా ఉన్న గుంపులు అనుమతించబడదు.

లాక్ డౌన్ పీరియడ్లో ఇవి పూర్తిగా బంద్.. వీటికి సడలింపులు


దేశంలో కరోనా కట్టడిని చేసేందుకు కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడగించిన సంగతి తెల్సిందే. మే3వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే ఈనెల 20తర్వాత కొన్నిరంగాలకు మినహాయింపులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది.

పూర్తిగా బంద్..
-హాట్ స్పాట్లలో అన్ని క్లోజ్
-రైలు, విమానాలు, రద్దు, మెట్రో సర్వీసులు
-సినిమా థియేటర్లు బంద్, సిమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు
-ఆటోలు, క్యాబ్ లు, రిక్షాలు బంద్
-బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు
-విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు
-నిత్యావసర షాపులు మినహా అన్ని బంద్
-బార్లు, వైన్ షాపులు, పబ్బులు
-పార్కులు, సిమ్మింగ్ పూల్స్,
-అన్ని సభలు, సమావేశాలు నిషేధం
-మత ప్రార్థనలు, ఆలయాల్లో దర్శనాలు బంద్

షరతులతో కూడిన సడలింపులు..
-వ్యవసాయ పనులకు పూర్తి అనుమతి
-వ్యవసాయ మార్కెట్ల కొనుగోళ్లకు అనుమతి
-భవన నిర్మాణ పనులకు అనుమతి
-ఎక్కడ ఉండే వారితో అక్కడే పనులకు అనుమతి
-అన్నిరకాల సరుకు రవాణాకు అనుమతి
-ఉఫాధి హామీ పనులకు గ్రీన్ సిగ్నల్
-రొయ్యలు, చేపల రవాణాకు అనుమతి
-కొరియర్, ఈకామర్స్ సేవలకు అనుమతి
-కొన్నిరకాల సరుకు రవాణా సేవలకు అనుమతి
-రాష్ట్రాల మధ్య సరుకుల రవాణాకు అనుమతి
-గ్రామీణ ప్రాంతాల పరిశ్రమలకు అనుమతి
-ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్ సేవలు యథాతధం
-ఎవరైనా చనిపోతే 20మందికి మించి హాజరు కాకుడదు.