
మన బాలీవుడ్ స్టార్స్ అందరిలో ఒక విభిన్న మైన దారిలో వెళ్లే అగ్ర నటుడు హృతిక్ రోషన్.కెరీర్ ఆరంభం లోనే మిషన్ కాశ్మీర్ , కోయి మిల్ గయా ,గుజారిష్ ,ధూమ్ 2 (విలన్) వంటి విభిన్న చిత్రాలు చేసి అందర్నీఆశ్చర్య పరిచాడు. ఇక ఇండియన్ మూవీ లవర్స్ ని అత్యంత బాగా ఆకట్టుకొనే సూపర్ హీరో ` క్రిష్ ` సిరీస్ అంటే.హృతిక్ రోషన్ కెరీర్ లోనే మైలు రాళ్లు అనక తప్పదు .. హాలీవుడ్లో సూపర్ మాన్, బాట్ మాన్ ,స్పైడర్ మాన్ మాదిరి ఒక సూపర్ హీరో పాత్రను తీసుకుని వరుసగా సినిమాలు తీస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు..ఒకనాటి హీరో , ఇపుడు దర్శకుడు అయిన రాకేష్ రోషన్.ఈ చిత్రాలతో కొడుకు హృతిక్ రోషన్ కి భారీగా అభిమానగణాన్ని సంపాదించు కొనేలా చేసాడు .
ముందు కోయీ మిల్ గయా సినిమాను మామూలుగానే తీశారు. అప్పటికి సిరీస్ గురించి ఆలోచనలేమీ లేవు. కానీ అది చక్కటి విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా ` క్రిష్ ‘ తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానితో క్రిష్- 3 తో తీయడం అదికూడా సూపర్ హిట్ అవ్వడం జరిగిపోయాయి ..
అలా మూడోభాగం కూడా ఆర్ధిక లాభం తేవడం తో క్రిష్-4 చిత్రానికి అంకురార్పణ జరిగింది. అంతా రెడీ అయ్యాక ఊహించని రీతిలో రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడటంతో సినిమా ఆగిపోయింది . దాంతో అందరూ ఈ సిరీస్ కి ఇక మంగళ హారతి ఇచ్చారు అని అనుకున్నారు. కానీ గత ఏడాది క్యాన్సర్ నుంచి కోలుకున్న రాకేష్.. తాను క్రిష్-4 చిత్రాన్ని తీయబోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు .
తాజాగా హృతిక్ రోషన్ అందరి అయిన దర్శకుడు రాకేష్ రోషన్ ఆ ప్రాజెక్టు గురించి మరికొన్ని ఆసక్తికర అప్ డేట్స్ ఇచ్చారు. క్రిష్-4 చిత్రానికి ఆల్రెడీ కథ ఖరారైందని.. ఈ సినిమాకు సన్నాహాలు కూడా మొదలుపెట్టామని , ఇంతలో కరోనా వచ్చి ప్రాజెక్ట్ ని ఆపింది అంతే తప్ప సినిమా ఆగిపోలేదు ..అని రాకేష్ రోషన్ వెల్లడించాడు ..