
తమిళ సినిమా రంగాన్ని ఏలిన ఆగ నటులిద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు . దర్శక మేధావి కె బాలచందర్ గారి శిష్యులైన కమల్ హాసన్ , రజనీకాంత్ అటూ ఇటుగా ఒకే సారి హీరోలయ్యారు. కరెక్ట్ గా చెప్పాలంటే ముందుగా కమల్ హాసన్ హీరో అయ్యాడు. రజనీకాంత్ విలన్ గా స్టార్ట్ అయ్యి సిద్దం గా స్టార్ హీరో అయ్యాడు కాలం తో పాటు ఇద్దరు ఎదిగారు. కాగా రజనీకాంత్ ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తున్నాడు . కెరియర్ పరంగా రజనీకాంత్ కి ఇది 168వ సినిమా అని చెప్పాలి .. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపు కొంది. ఇక ఈ చిత్రం తరువాత రజనీకాంత్ చేయబోయే సినిమాలో కమల్ హాసన్ కూడా నటించనున్నట్టుగా కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. కాగా ఆ వార్తలో కొంతవరకే నిజం వుంది .
ఇక అసలి విషయానికి వస్తే రజనీకాంత్ , కమలహాసన్ `ఇద్దరం కలిసి నటించడం మానేద్దామని ‘ గతంలోనే అనుకున్నారట ..కెరీర్ ఆరంభంలో పదునారు వయదునిలే (పదహారేళ్ళ వయసు ), ఇలమై ఊంజల్ ఆడుకిఱతు (వయసు పిలిచింది ), మూండ్రు ముడిచు ( ఓ సీత కథ ) , నినైత్తలే ఇనిక్కుమ్ ( అందమైన అనుభవం ) వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరవాత ఇద్దరు స్టార్ స్టేటస్ వచ్చాక ఇద్దరు కలిసి నటించ వద్దు అని నిర్ణయించుకొని విడిపోయారు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు కలిసి నటిస్తున్నారని వార్త రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే రజనీకాంత్ ,.కమల్ హాసన్ కలిసి నటించడం లేదు. రజనీకాంత్ నటించే సినిమాకి కమల్ హాసన్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించ నున్నాడని తెలుస్తోంది .కాగా ఈ సినిమాకి (కార్తీ) ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది అన్ని కుదిరితే ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తోంది .