Home Blog Page 8447

భారత్-చైనా సైనికుల ఘర్షణలో తెలుగువాసి మృతి


భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే. ఇటీవలే ఇరుదేశాల మధ్య ఆర్మీ అధికారులు చర్చల నేపథ్యంలో కొంత ఉద్రిక్తత తగ్గింది. ఇరుదేశాలు ఎల్ఏసీ నుంచి కొంతమేరకు వెనక్కి వెళుతున్న నేపథ్యంలో సోమవారం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. లఢక్ సమీపంలోని గాల్వనా వ్యాలీలో చైనా-భారత్ మధ్య ఘర్షణ జరుగగా ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇందులో మృతిచెందిన లెప్ట్ నెంట్ కల్నల్ స్థాయి అధికారి తెలుగువాడు కావడం విషాదంగా మారింది.

సూర్యపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు ఏడాదిన్నరగా చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. కల్నల్ స్థాయి అధికారిగా ఆయన ఆర్మీలో సేవలందిస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ తోపాటు మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. సంతోష్ బాబు మృతిపై ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ బాబుకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. అయితే ఇరుదేశాల మధ్య కాల్పులు జరగలేదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో సంతోష్ బాబుతోపాటు మరో ఇద్దరు జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

సంతోష్ బాబు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ పాఠశాలలో విద్యాభాసం చేశారు. నెలరోజుల క్రితమే కల్నల్ తమ అధ్యాపకులను కలిసినట్లు తెలుస్తోంది. సంతోష్ బాబుకు మూడునెలల క్రితమే హైదరాబాద్ బదిలీ అయింది. అయితే లాక్డౌన్ కారణంగా ఆయన భారత సరిహద్దుల్లోనే విధులు ఉండాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో సోమవారం రాత్రి ఘర్షణలో ఆయన మృతిచెందాడంతో సూర్యాపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆ వీరసైనికుడికి అందరూ నివాళ్లు అర్పిస్తున్నారు. సంతోష్ బాబు మృతిపై అతడి తల్లి స్పందిస్తూ తన కుమారుడు వీరమరణం పొందడం సంతోషంగా ఉందని.. ఒక తల్లిగా బాధగా ఉందని వాపోయింది.

భారత్ ను దొంగదెబ్బ కోడుతున్న చైనా


గత కొంతకాలంగా భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తోంది. లద్దాక్ సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికులు మోహరించడంతో కొన్నిరోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల ఆర్మీ ఉన్నతాధికారులు చర్చలు జరుపడంతో కొంత ఉద్రిక్తత తగ్గింది. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాలు కొంతమేరకు వెనక్కి తగ్గాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. లఢక్ సమీపంలోని గాల్వనా వ్యాలీలో చైనా-భారత్ మధ్య ఘర్షణ జరుగగా ఇందులో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఒక లెప్ట్ నెంట్ కల్నల్ స్థాయి అధికారి ఉన్నారు.

భారత్ జవాన్లు మృతిచెందడంతో సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం సంభవించినట్లు భారత ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. భారత్ నుంచి కల్నల్ స్థాయి ర్యాంకు గల కమాండింగ్ అధికారి, ఇద్దరు జవాన్లు అమరులైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అలాగే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. అయితే ఎంతమంది మృతిచెందారనేది మాత్రం ప్రకటించలేదు. భారత్-చైనా ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్న క్రమంలోనే అనూహ్యంగా ఈ సంఘటన చోటుచేసుకోవడంతో కేంద్రం ఉలికిపాటుకు గురైంది.

ఈ సంఘటనపై వెంటనే రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సరిహద్దుల్లో ప్రాణనష్టానికి దారితీసిన సంఘటనలు, చైనా పై ఎలాంటి వైఖరి అవలంభించాలనేది ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే సరిహద్దు సమస్యలపై చైనాతో భారత్ తొలి దశ చర్చలు ముగిశాయి. మరి కొద్దిరోజుల్లో రెండో దఫా చర్చలు ఉన్న నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు మృతిచెందడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రెండోదశ చర్చలు ఉంటాయా? లేదా అనే చర్చ జరుగుతోంది.

1975తర్వాత భారత్-చైనా సరిహద్దుల్లో సైనికులు మృతిచెందే ఘర్షణలు తలెత్తడం ఇదే తొలిసారి. కాగా సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపైనే చైనా-భారత్ కట్టుబడి ఉన్నట్లు ఇరు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే చైనా ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు భారత్ ను దొంగదెబ్బ కొట్టడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు యుద్ధానికి దారితీయనున్నాయా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనా విషయంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతుందో వేచి చూడాల్సిందే..!

‘సెన్సేషన్ బ్యూటీ’కి ఛాన్స్ లు కావాలట !


సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే మొదట్లో కొన్ని ఆఫర్లు వచ్చినా.. అమ్మడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి వచ్చిన అవకాశాలను కాదనుకుంది. ఆ తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఓరు అదార్ లవ్’ చిత్రం ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులోకి డబ్ అయి ఫ్లాప్ కావడంతో మొత్తానికే ఆమెకు ఆఫర్లు దూరమైపోయాయి. అప్పటికీ గానీ ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడలేదు. ప్రస్తుత పరిస్థితికి వస్తే.. మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటా ముందు మీ సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వండి అని అందర్నీ పోన్ చేసి అడుగుతుందట.

అయితే ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో మాత్రం ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదని సమాచారం. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న. ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది.

కాగా ఇప్పుడు వీళ్ళ మాదిరిగానే ప్రియా ప్రకాష్ వారియర్ సైతం పయనించబోతుందట. ఈ క్రమంలోనే నితిన్ కొత్త సినిమాలో ఆమె రెండో కథానాయకిగా ఛాన్స్ కొట్టేసింది అని తెలుస్తుంది. అలాగే మరో సినిమాలో కూడా నటించబోతుందట. నాగశౌర్య హీరోగా రాబోయే ఓ సినిమాలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మరి ఈ రెండు చిత్రాల్లో తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు ప్రియాకి బాగానే వస్తాయి.

అనుష్క ‘నిశ్శబ్దం’.. ఇంట్రెస్టింగ్ అప్డేట్


స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. కాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ అని, సినిమా మర్డర్ చేసింది ఎవరు అనే కోణంలోనే చాల భాగం నడుస్తోందని.. అయితే మర్డర్ చేసేది అనుష్కనేనని… ఈ విషయం క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో రివీల్ అవుతుందని.. సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ లోనే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్, మరియు అనుష్క, మాధవన్ ల మధ్య రిలేషన్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ అండ్ హారర్ ఎఫెక్ట్స్ ను టీజర్ లో బాగా ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారు. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలను బాగా పెంచింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది.

కాగా మాధవన్ ఈ చిత్రంలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఇక ఈ చిత్రంలో సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

శాసన సభ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ..!


తెలుగుదేశం పార్టీ శాసన సభ సమావేశాలను బహిష్కరించింది. తొలుత టీడీపీ శాసన సభ సమావేశంలో  హాజరై రాష్ట్రంలో నెలకొన్న అన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించింది. సభ రెండు రోజులే నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించడం, వివిధ అంశాలపై చర్చలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరించడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలకు, ప్రతిపక్ష పార్టీ నాయకుల అరెస్టులు వ్యతిరేకంగా నల్ల చొక్కాలు ధరించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లోకేష్, ఇతర ఎమ్మెల్సీలు సభకు హాజరై నిరసన తెలిపారు.

ఈ శాసన సభ సమావేశాల్లో కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, అమరావతి రాజధాని అంశం, ప్రత్యేక హోదా, కరెంట్ చార్జీల పెంపు, బలవంతపు భూసేకరణ, భూ కొనుగోళ్లలో అక్రమాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం ధరల పెరుగుదల, అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్, దళితులపై దాడులు, బిల్డ్ ఏపీ ఇలా తదితర అంశాలను సభలో చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వీటిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని బీఏసీ సమావేశంలో కోరితే ప్రభుత్వం చర్చకు అవకాశం లేదని చెప్పడంతో శాసన సభ సమావేశాలు బహిష్కరించాలని పార్టీ నిర్ణయం తీసుకుందని టిడిపి నాయకులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

శాసన సభ సమావేశాల్లో చర్చలు లేనట్టే..!


ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ఈ సారి భిన్నంగా సాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ శాసన సభలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకు భిన్నంగా రాజ్ భవన్ నుంచే గవర్నర్ ప్రసంగించారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏ అంశాలపై చర్చ లేకుండానే ఈ శాసన సభ సమావేశాలు ముగియనున్నాయి. బడ్జెట్ సమావేశాలు చర్చలు లేకుండా ముగియడం ఇదే తొలిసారి కావచ్చు. గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. రేపు సభ ముందుకు కొన్ని బిల్లులు తీసుకు వస్తారు. వాటి ఆమోదం అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్ పై, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగడం సాంప్రదాయం. అనంతరం సభ్యులు వివిధ అంశాలపై ఇచ్చిన నోటీసులపై స్పీకర్ నిర్ణయం తీసుకుని చర్చకు అనుమతిస్తారు.

శాసన సభను రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ రెండు రోజులు మాత్రమే జరుగుతుందని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. టీడీపీ తరుపున సమావేశంలో పాల్గొన్న నిమ్మల రామానాయుడు సభలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, కనీసం వారం నుంచి పది రోజులు నిర్వహించాలని కోరారు. సమయం తక్కువగా ఉంటే ప్రతి పక్షం నుంచి ఒకరు, అధికార పక్షం నుంచి ఒక్కరికి మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా  అచ్చెన్నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారని దీనిపై చర్చ జరగాలని కోరగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని బయట మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడవద్దని సూచించారు. కనీసం వర్చ్యువల్ విధానంలో అయినా కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిమ్మల కోరారు. పార్లమెంట్ వర్చ్యువల్ విధానంలో నిర్వహిస్తే అప్పుడు ఆలోచిద్దామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశాల్లో మొత్తం 16 అంశాలపై చర్చ జరపాలని టీడీపీ భావించింది. వీటిలో అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, అమరావతి రాజధాని అంశం, ప్రత్యేక హోదా, కరెంట్ చార్జీల పెంపు, బలవంతపు భూసేకరణ, భూ కొనుగోళ్లలో అక్రమాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం ధరల పెరుగుదల, దళితులపై దాడులు, బిల్డ్ ఏపీ ఇలా తదితర అంశాలను సభలో చర్చించాలని టీడీపీ కోరుతుంది. కానీ ప్రభుత్వం కరోనాను సాకుగా చూపి సభలో చర్చలు లేకుండా బడ్జెట్, బిల్లుల ఆమోదానికి మాత్రమే పరిమితం చేశారు.

కరోనా ట్రీట్ మెంట్ ప్రైవేటుకు.. కేసీఆర్ ఎందుకిచ్చారు?


మొన్నటివరకు కూడా తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు అసలే అనుమతి ఇవ్వమని… సుప్రీం కోర్టు ఆదేశించినా వినమని.. వైద్యం ప్రభుత్వం చేతిలో ఉంటేనే ప్రజల ప్రాణాలకు విలువ, వారి డబ్బు హారతి కర్పూరం కాకుండా ఉంటుందని కేసీఆర్ ప్రెస్ మీట్లలో చెప్పుకొచ్చారు. ప్రైవేటుకు అనుమతిస్తే కరోనా చికిత్స పేరిట అవి దోచుకుంటాయని కేసీఆర్ ఆడిపోసుకున్నారు.

ఇక చాలా సార్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సదుపాయాల పేరిట రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని.. పరీక్షలు, చికిత్స అంటూ వారి ఆందోళనను క్యాష్ చేసుకొని పిప్పి పీల్చేస్తాయని కరోనా ప్రైవేట్ ట్రీట్ మెంట్ ను వ్యతిరేకించారు.

కరోనా ప్రబలుతున్న వేళ రోగులకు వారు కోరుకున్న చోట పరీక్షలు, చికిత్స చేసుకునే స్వేచ్ఛ కల్పించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించలేదు. తెలంగాణలో ఎవరికి వైరస్ సోకినా గాంధీ ఆస్పత్రికే రావాలని కేసీఆర్ పట్టుబట్టారు.

కానీ అకస్మాత్తుగా కేసీఆర్ కొన్ని రోజుల క్రితం సడన్ గా మాట మార్చుకున్నాడు. కరోనా రోగులకు చికిత్స చేయడానికి ప్రైవేట్ ఆస్పత్రులను అనుమతించాలని నిర్ణయించుకున్నాడు. పరీక్షల కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు కూడా అనుమతులు ఇచ్చారు. ఆస్పత్రులు వసూలు చేసే ఫీజును కూడా తెలంగాణలో ఫిక్స్ చేసి సోమవారం ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించింది.

కేసీఆర్ ఇంత అకస్మాత్తుగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికారణంపై మీడియా సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ దారుణ వైరస్ బారిన పడి బలైపోతున్న తన సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ప్రైవేట్ ఆస్పత్రులకు కేసీఆర్ అనుమతి ఇచ్చారని అంటున్నారు.

గత మూడు రోజుల్లో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారు ముగ్గురు కార్పొరేట్ ఆస్పత్రులలో చేరారు. దారుణమైన విషయం ఏంటంటే.. వారి అనుచరులు, వ్యక్తిగత సహాయకులు మాత్రం గాంధీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ వ్యవహారం తెలంగాణలో దుమారం రేపింది.

కరోనా చికిత్సలో ఎమ్మెల్యేలను కూడా గాంధీ ఆస్పత్రిలోనే వేయాలని.. వీఐపీలకు సామాన్యులకు మధ్య ఈ వివక్ష ఏంటని తెలంగాణ సమాజం మీడియాలో, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోంది. కేసీఆర్ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల కోసమే ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు కేసీఆర్ ఇచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు.

అయితే కరోనా వైరస్ తో ఎక్కువమంది రాజకీయ నాయకులు గాంధీలో చేరడంతో వారందరికీ వీఐపీ ట్రీట్ మెంట్ నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం గ్రహించింది. అందుకే విమర్శలు వచ్చినా కూడా ప్రైవేట్ ఆస్పత్రులను అనుమతించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే గాంధీకి తాకిడి ఎక్కువవుతుందని.. నేతలు మరణిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే కేసీఆర్ ఇలా ప్రైవేట్ బాటపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. .

-నరేశ్ ఎన్నం

బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్ హీరోయిన్


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మృతితో చిత్రసీమలో విషాదం నెలకొంది. సుశాంత్ మృతిపై నెటిజన్లంతా బాలీవుడ్ ఇండస్ట్రీని వేలెత్తి చూపుతోంది. బాలీవుడ్లో నెపోటిజం, వారసత్వం, అర్హత లేనివారిని స్టార్స్ గా మార్చడం, ప్రతిభ ఉన్న వారిని తొక్కేయడం వంటి వాటిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సుశాంత్ మృతిపై కంగనా రనౌత్, వివేక్ బబరాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఓ రెంజ్లో ఫైర్ అయిన సంగతి తెల్సిందే. తాజాగా మరో హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఉసరవెల్లి’లో పాయల్ ఘోష్ నటించింది. తాజాగా ఆమె సుశాంత్ ఆత్మహత్య, డిప్రెషన్ పై ట్వీటర్లో ఎమోషన్ ట్వీట్ చేసింది. ‘సౌత్ సినీ ఇండస్ట్రీ స్వర్గం.. బాలీవుడ్ ఓ నరకం.. మమ్మల్ని క్షమించు సుశాంత్.. మేము ఫెయిల్ అయ్యామ’ని చెప్పుకొచ్చింది.. ‘దక్షిణాది వారు హీరోయిన్లకు గుళ్లు కడతారు.. కానీ బాలీవుడ్ మాత్రం చచ్చేలా అగౌరవపరుస్తుంది.. టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌కు వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని’ వరుసగా ఎమోషన్ ట్వీట్ చేసింది పాయల్ ఘోష్.

సుశాంత్ లాగే తాను కూడా డిప్రెషన్‌కు లోనయ్యానని చెప్పింది. అయితే ఆత్మహత్య వంటి ఆలోచన చేయలేదని పేర్కొంది. ఎందుకంటే తన చుట్టూరా తనవాళ్లు ఉండేవారిని చెప్పిది. తన భావాలను ఇతరులతో పంచుకునేదానిని అని చెప్పింది. అయితే బాలీవుడ్ జనాలు తనను ఎంతో నీచంగా మాట్లాడరని, అగౌరవ పరిచారని వాపోయింది. దక్షణాదిలో తాను జూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి, జాతీయ అవార్డులు తీసుకున్న వారితోనూ కలిసి పని చేశానని చెప్పింది. వారెప్పుడూ తనను తప్పుగా వాడుకోవాలని చూడలేదని తెలిపింది. బాలీవుడ్ దక్షిణాదిని తక్కువచేసి చూస్తుందని ఆరోపించింది. టాలీవుడ్ వదిలి బాలీవుడ్ వెళ్లి తాను తప్పుచేశానని చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలకు నెటిజన్లు నుంచి మద్దతు లభిస్తుంది. సుశాంత్ మృతి నేపథ్యంలో నెటిజన్లంతా బాలీవుడ్ ను తప్పుపడుతుండగా ఇండస్ట్రీలోని వారుసైతం వేలెత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది.

రూ. 2.24 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్..!


రాష్ట్ర బడ్జెట్ 2020-21 ఏడాదికి గాను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవేశపెట్టారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో భారీ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టడం విశేషం. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్ధికమంత్రి తెలిపారు.

ఏపీ బడ్జెట్‌(2020-21) ప్రధాన అంశాలు పరిశీలిస్తే..’అన్నిరకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు’ అంటూ బడ్జెట్‌ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రారంభించారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు మాత్రమే.

వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపు పరిశీలిస్తే..వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు, పశుగాణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు, హోంశాఖకు రూ.5,988.72 కోట్లు జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు, పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు, ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు​​​​​​​, కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు, పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.16710.34 కోట్లు కేటాయింపులు జరిపారు.

సవరించిన అంచనాలు ఇలా ఉన్నాయి..
2019-20 ఏడాది సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు, మూలధన వ్యయం రూ.12,845.49 కోట్లు, రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు, ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు, ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం​గా ఉన్నాయి.

వివిధ పథకాలకు కేటాయింపులు గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు, రియల్‌ టైం గవర్నెన్స్ కోసం రూ.54.51 కోట్లు, వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు, 104, 108 లకు రూ.470.29 కోట్లు, డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు కేటాయించారు.

వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులు పరిశీలిస్తే, న్యాయ శాఖకు రూ. 913.76 కోట్లు, మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 856.64 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు, ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు, విద్యుత్‌ రంగానికి రూ. 6,984.72 కోట్లు, ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు, సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు
మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది.

కోమటిరెడ్డిపై నజర్ పెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేతలు


తెలంగాణలో పీసీసీ చీఫ్ మార్పు ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం నేతలకు సిగ్నల్ ఇచ్చింది. అయితే పీసీసీని మార్చేందుకు యత్నిస్తున్న ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి వస్తుండటంతో వాయిదా వేస్తూ పోతుంది. త్వరలోనే పీసీసీ మార్పు తథ్యమనే సంకేతాలు రావడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అలర్ట్ అయ్యారు. ఈ పదవీ కోసం చాలామంది నేతలు పోటీపడుతున్నారు. సీఎం పీఠానికి పీసీసీ చీఫ్ పదవీ దగ్గరిదారి కావడంతో కాంగ్రెస్ లోని సీనియర్లంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

పీసీసీ పదవీ రేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవీ కట్టబెడితే కాంగ్రెస్ శ్రేణులకు తప్పుడు సందేశం పోతుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా సేవలు చేస్తున్న వారికి పీసీసీ పదవీని కట్టబెట్టాలని సీనియర్ నేతలు అధిష్టానికి సూచిస్తున్నారు.

ఈనేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ కోసం పావులు కదుపుతున్నారు. పీసీసీ ఛీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పూర్తవడంతో ఆయన స్థానంలో కోమటిరెడ్డి రావాలని చూస్తున్నారు. గతంలో ఉత్తమ్ కుమారెడ్డిపై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తమ్-కోమటిరెడ్డిలు ఉప్పునిప్పులా ఉండేవాడు. ఇప్పుడు ఉత్తమ్ తో కోమటిరెడ్డి సన్నిహితంగా ఉంటున్నాడు. ఉత్తమ్ చేపట్టిన కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నాడు. ఉత్తమ్ సిఫార్సుతో పీసీసీ పదవీ దక్కించుకునేందుకు కోమటిరెడ్డి పావులు కదుపుతున్నాడనే టాక్ విన్పిస్తోంది.

ఈనేపథ్యంలోనే ఎప్పుడూ నియోజకవర్గానికే పరిమితమయ్యే కోమటిరెడ్డి ఇటీవలీ కాలంలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విమర్శించినోళ్లనే ఇప్పుడు ప్రశంసిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ఎప్పుడూ కలవని నేతలను సైతం కలుస్తూ కాంగ్రెస్ లో సరికొత్త రాజకీయం చేస్తున్నాడు. తాజాగా కోమటిరెడ్డి ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణ వెనుబాటుకు గురవుతుందని కొత్త వాదన తెరపైకి తెచ్చాడు దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడని గళమెత్తుతున్నాడు. ప్రాజెక్టుల వద్ద దీక్ష సందర్శనలు అంటూ హడావుడి చేస్తున్నాడు. నల్గొండ సమస్యలతోపాటు తెలంగాణ సమస్యలను ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కోమటిరెడ్డిలో వచ్చిన ఈ మార్పుపై పలువురు కాంగ్రెస్ సీనియర్ కూడా నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా పీసీసీ పదవీ కోసం కోమటిరెడ్డి ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకున్నాడు. ఈసారైనా కోమటిరెడ్డికి పీసీసీ పదవీ దక్కుతుందో? లేదో అనేది వేచి చూడాల్సిందే..!

‘ఫ్యామిలీ ప్యాక్’ మోషన్ పోస్టర్..


కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.ఇప్పుడు ఆ కోవలోకే తన ఐదో సినిమాగా ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ అనే రొమాంటిక్ కామెడీ
సినిమాను తెరకెక్కిస్తున్నారు.

లిఖిత్ శెట్టి,అమృత అయ్యంగార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మోషన్ పోస్టర్ చూస్తుంటే యూత్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తుందీ. ఈ ఫస్ట్
లుక్ కోసం ఓ కాంటెస్ట్ ను కూడా పెట్టింది యూనిట్.

‘‘ఫ్యామిలీ ప్యాక్’’ మూవీ మోషన్ పోస్టర్ ని చూసి అక్కడ కనిపిస్తున్న జంట రిలేషన్ ఎంటో గెస్ చేసి ట్విట్టర్ లో కామెంట్ చేసిన 5 మందికి జె.బి.ఎల్ స్పీకర్లను అందజేస్తుంది మూవీ టీం. దీని కోసం ట్విట్టర్ లో #FamilyPack
అని టైప్ చేసి సెర్చ్ చేసి కామెంట్ చేయవచ్చు.

పునీత్ రాజ్ కుమార్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ ,లిఖిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని ఎస్.అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకు ముందు లిఖిత్ శెట్టి-అర్జున్ కుమార్ కలిసి ‘‘సంకష్టకారా గణపతి’’
అనే మూవీ తీసారు. 2018 లో అమెజాన్ లో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే కావడం విశేషం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది.

https://www.instagram.com/p/CBfGAIzl0Dy/

నారా లోకేష్ అరెస్ట్ కు రంగం సిద్ధం?


ఏపీలో పాలిస్తున్న వైఎస్ జగన్ సర్కార్ ప్రతీకారేచ్చతో రగిలిపోతోంది. ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేసిన జగన్ సర్కార్ తాజాగా తమ నెక్ట్స్ టార్గెట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మెడకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం హెచ్చరికలు పంపిందా? ఇక త్వరలోనే లోకేష్ ను అరెస్ట్ చేయబోతున్నారని ప్రచారం ముమ్మరమైంది.. తాజాగా జరుగుతున్న పరిణామాలు అలానే జరుగుతున్నాయట.. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా లోకేష్ ను టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

తనను చాలా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను ఎలాగైనా సరే వారు చేసిన అక్రమాలను తవ్వితీసి జైలుకు పంపాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం గద్దెనెక్కగానే అమరావతి రాజధాని కుంభకోణంపై పడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు పాలనలో అవినీతిని నిగ్గుతేల్చాలని కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం విచారణలో తాజాగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కేంద్రంగా ఈ అవినీతి సాగినట్టు సబ్ కమిటీ తేల్చింది.ఈ వేమూరి హరికృష్ణ గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో ప్రధాన నిందితుడు. ఇతడికి చెందిన బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ కు గత చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టినట్టు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముందుగా లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా లోకేష్ ను అరెస్ట్ చేసి చంద్రబాబుకు గట్టి షాక్ ఇవ్వాలని.. ఆ తర్వాత చంద్రబాబు పని పట్టాలని వైసీపీ అధిష్టానం పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

టీడీపీ సర్కార్ హయాంలో ముఖ్యంగా నారా లోకేష్ ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో చేపట్టిన అతిపెద్ద పథకం ఫైబర్ గ్రిడ్. ఈ పథకంలో వందల కోట్ల అవినీతి జరిగినట్టు తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం.

ఏపీ ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2015 జూలై 7న గత సర్కారు హయాంలో రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ -ఆంధ్రపదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. హారిజోన్‌ బ్రాడ్‌క్రాస్ట్‌ ఎల్‌ఎల్‌పీ, సిగ్నమ్‌ డిజిటల్‌ నెట్‌తో టెరాసాఫ్ట్‌ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది.

అయితే ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్‌ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్‌ను 2015 మే 11న ఏపీటీఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌) బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్‌ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)ల చోరీ కేసులో నిందితుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ బిడ్‌ను ఆమోదించాలని టీడీపీ సర్కార్‌ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారని సబ్ కమిటీ నివేదించింది. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్‌ దాఖలు చేసిన ఎల్‌–1ను కాదని అధిక ధరకు బిడ్‌ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌ గ్రిడ్‌ దక్కేలా చక్రం తిప్పినట్టు కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది. ఈ క్రమంలో పైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది.

ఈ స్కాంలో ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ లో నాటి మంత్రి లోకేష్ ను ముందుగా బుక్ చేయాలని వైసీపీ ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ అడ్డంగా బుక్కైనట్టేనని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. త్వరలోనే లోకేష్ అరెస్ట్ తప్పదా అన్న చర్చ కూడా మొదలైంది. మరి ఎక్కడా దొరకని చంద్రబాబుకు ప్రస్తుతం లోకేష్ అరెస్ట్ తో జలక్ ఇవ్వాలని జగన్ నిర్ణయించారట.. ఈసారి సీఎం వైఎస్ జగన్ కు లోకేష్ దొరికేశాడని.. అతడి అరెస్ట్ ఖాయమన్న న్యూస్ వైరల్ అవుతోంది.

తెలంగాణలో విజృంభిస్తున్న మహమ్మరి


దేశంలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన వారం పదిరోజులుగా కరోనా విజృంభిస్తోంది. రోజుకు దేశంలో 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే భారత్ కరోనా కేసుల్లో ఇటలీని దాటేసింది. ఇటీవలే 3లక్షల కేసుల మార్కును దాటేసింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే భారత్ కరోనా కేసుల్లో తొలి మూడు దేశాలతో పోటీపడేలా కన్పిస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో కరోనా కేసులు 5వేల మార్కును దాటాయి. సోమవారం కొత్తగా 219కేసులు నమోదుగా మొత్తంగా ఈ సంఖ్య 5,193 చేరింది.

తెలంగాణలో పంజా విసురుతున్న వైరస్..
తెలంగాణలో సోమవారం నాటికి 5,193కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 2766 కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 2240 మంది చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.వీరిలో 449 మంది వలస కార్మికులు, విదేశీయులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మృతుల సంఖ్య సోమవారం  నాటికి 187కు చేరుకుంది. సోమవారం 219 కొత్త కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. సోమవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 189 కేసులు ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 13, మేడ్చల్‌లో 2, సంగారెడ్డిలో 2, వరంగల్ అర్బన్ జిల్లాలో 4, మహబూబ్‌నగర్‌లో 1, మెదక్‌లో 1, ఆదిలాబాద్‌లో 1, యాదాద్రి భువనగిరిలో 1, వరంగల్ రూరల్ జిల్లాలో 3, వనపర్తి జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.

ఎవరినీ వదలని మహమ్మరి..
కరోనా ఎవరిని వదలేదడం లేదు. కరోనాపై ముందుడి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులకు సైతం మహమ్మరి సోకడం శోచనీయంగా మారింది. కరోనా వారియర్స్ పదుల సంఖ్యల్లో కరోనా బారినపడటంతో ఆందోళన నెలకొంది. వీరితోపాటు ప్రజాప్రతినిధులు, సెలబెట్రీలు సైతం కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు కరోనా నుంచి త్రుటిలో తప్పించుకొని హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఇంకా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కూడా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు.

వైద్యులకు కరోనా.. ఆందోళనలో ప్రజలు..
కరోనా మహమ్మరిపై పోరాడుతున్న వైద్య సిబ్బంది ఈ మహమ్మరి బారినపడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తరుచుగా డాక్టర్లు, వైద్య సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. సోమవారం వైద్య సిబ్బందికి జరిపిన పరీక్షల్లో 32మందికి వైరస్‌ పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. వీరిలో 14మంది డాక్టర్లు, 18మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా కూడా పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. ఒకే ఆస్పత్రిలో పనిచేస్తున్న 32మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

అదేవిధంగా ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రులతోపాటు, నిమ్స్‌, కింగ్‌ కోఠి, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు కరోనా బారిన పడ్డారు. నిమ్స్ లో వైద్యులు కరోనా బారినపడటంతో అక్కడ తాత్కాలికంగా వైద్యసేవలు నిలిపివేశారు. ప్రతీరోజు వైద్య సిబ్బంది పదుల సంఖ్యలో వైరస్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. పీపీఈ కిట్లు ధరించినప్పటికీ వైద్య సిబ్బందికి కరోనా బారినపడటం మరింత ఆందోళనకు కారణమవుతోంది. వీరితోపాటు పోలీసులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. దీంతో హైదరాబాద్ పరిధిలో 50వేల కరోనా టెస్టులు చేసేందుకు కేసీఆర్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ప్రైవేట్ ఆస్పత్రిలోనూ కరోనా టెస్టులకు గ్రీన్ సిగ్నల్..
అదేవిధంగా రాష్ట్రంలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా టెస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. రోజురోజుకు వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు ఎప్పుడు కట్టడి అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కరోనాపై సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కరోనా కేసులు అదుపులోకి రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

మరోసారి తెరపైకి మూడు రాజధానుల అంశం..!


అసెంబ్లీ సమావేశాల చోటు చేసుకున్న పరిణామాలతో రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన రావడంతో రాజధాని ప్రాంతంలో అలజడి నెలకొంది. పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధికి మంత్రమని, మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోందని గవర్నర్ పేర్కొన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటే మా ఉద్దేశం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు.

గత అసెంబ్లీ సమావేశాలలో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. శాసన సభలో బిల్లులు ఆమోదం పొందగా, శాసన మండలిలో బిల్లులు ఆమోదానికి నోచుకోలేదు. శాసన సభ ఛైర్మన్ బిల్లులలో అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయని భావించి సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. మండలి కార్యదర్శి తదుపరి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రక్రియ అలాగే నిలిచిపోయింది.

మరోవైపు బిల్లులను ఆమోదింప జేసుకునేందుకు ఉన్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. కొన్ని సవరణలతో మరోసారి బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. బిల్లులు ఆమోదం పొందిన అనంతరంమే రాజధానిని తరలిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదంపై సర్కారు దృష్టి సారించింది.

ఇదిలా ఉండగా మరోవైపు ప్రభుత్వ ఉన్నత అధికారులు కార్యనిర్వహక రాజధానిగా నిర్ణయించిన విశాఖ నగరంలో సీఎంఓ, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం భూములను పరిశీలించారు. సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, నిపుణులతో కలిసి కొద్దీ రోజుల కిందట సాగర తీరంలోని భూములను సందర్శించారు. అధికారులు కార్యనిర్వాహక రాజధాని కోసం వారి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు.

గవర్నర్ ప్రసంగంలో లేవనెత్తిన అంశాలతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టమవుతోంది. రాజధాని రైతులు ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించినా ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. టీడీపీ న్యాయపరంగానే ఈ అంశాన్ని ఎదుర్కోవాలని భావిస్తుంది. శాసన మండలి కార్యదర్శి ఛైర్మన్ ఆదేశాలను అమలు చేయడం లేదని, పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపక పోవడంపై ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

మార్చురీ బాక్స్ లో మద్యం తరలింపు..!


మద్యం అక్రమ వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి పోలీసులకు దొరకకుండా అక్రమంగా మద్యం తెచ్చి విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. మార్చురీ బాక్స్ లో అక్రమ మద్యం తరలిస్తున్న సంఘటన కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే… తెలంగాణ నుండి ఆంధ్రా ప్రాంతానికి అంబులెన్స్ లో మార్చూరీ బాక్స్ ఉంచి మద్యం తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ ను ఆపి తనిఖీ చేయడంతో మద్యం సీసాలు దొరికాయి. మొత్తం 107 లీటర్ల మద్యం సీసాలు వీరులపాడు పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బృందం స్వాధీనం చేసుకున్నారు.

వీరులపాడు మండలం పెద్దాపురం చెక్ పోస్ట్ వద్ద వెనక ఎస్కార్ట్ గా వస్తున్న ఒక కారుతో సహా అంబులెన్స్ ను పట్టుకొని అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎదో ఒక మార్గంలో మద్యం అక్రమ రవాణాకు వ్యాపారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కాపు సారా తయారీ ముమ్మరంగా సాగుతుంది.

రఘురామకృష్ణం రాజు ధైర్యవంతుడు:టీడీపీ


వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ధైర్యవంతుడని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఆయన తన మనసులో వున్నది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతరని ఆయన అన్నారు. తాజాగా.. అయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కామెంట్లపై ఆసక్తికరమైన చర్చ సాగింది.

రఘు రామకృష్ణం రాజులా ఫీలయ్యే వాళ్లు వైసీపీలో చాలా మందే ఉన్నారు… అయన ధైర్యవంతుడు కాబట్టి ముందుకొచ్చి మాట్లాడారు.. ఇప్పటికైనా ప్రభుత్వం ఒంటెత్తు పోకడ పోకుండా.. కనీసం వైసీపీ ప్రజా ప్రతినిధుల మనోభావాలనైనా గుర్తించాలని, సామాజిక వర్గాల్లో వైసీపీ చిచ్చు పెడుతోందన్న రఘు రామకృష్ణం రాజు కామెంట్లు వాస్తవమే అని అభిప్రాయపడ్డాడు.

ఎమ్మెల్యే రామానాయుడు స్పందిస్తూ.. రఘు రామకృష్ణం రాజు ప్రజల మనిషి… ఆయన చెప్పినట్టు నర్సాపురం పార్లమెంట్ టీడీపీ బెల్టే… ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం రఘు రామకృష్ణం రాజుకి అలవాటు అంటూ కామెంట్ చేసారు.. ఇలా.. వైసీపీ ఎంపీ వ్యవహారం.. అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్ గా మారింది.

టాటా ఏసీ వాహనానికి ఉరివేసుకొని డ్రైవర్ ఆత్మహత్య!


హైదరాబాద్ కి చెందిన రామకృష్ణ అనే టాటా ఎసి డ్రైవర్ అదే వాహనానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసున్నాడు. ఈ సంఘటన తూప్రాన్ టోల్ ప్లాజా జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… తూప్రాన్ టోల్ ప్లాజా జాతీయ రహదారిపై ఆగివున్న టాటాఎసికి ఉరి వేసుకొని డ్రైవర్ ఆత్మహత్య చేసున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు హైదరాబాద్ లోని బహదూర్ పల్లికి చెందిన సనం రామకృష్ణగా పోలీసులు గుర్తించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఇది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనే కోణంలో తూప్రాన్ పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.