
వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ధైర్యవంతుడని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఆయన తన మనసులో వున్నది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతరని ఆయన అన్నారు. తాజాగా.. అయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కామెంట్లపై ఆసక్తికరమైన చర్చ సాగింది.
రఘు రామకృష్ణం రాజులా ఫీలయ్యే వాళ్లు వైసీపీలో చాలా మందే ఉన్నారు… అయన ధైర్యవంతుడు కాబట్టి ముందుకొచ్చి మాట్లాడారు.. ఇప్పటికైనా ప్రభుత్వం ఒంటెత్తు పోకడ పోకుండా.. కనీసం వైసీపీ ప్రజా ప్రతినిధుల మనోభావాలనైనా గుర్తించాలని, సామాజిక వర్గాల్లో వైసీపీ చిచ్చు పెడుతోందన్న రఘు రామకృష్ణం రాజు కామెంట్లు వాస్తవమే అని అభిప్రాయపడ్డాడు.
ఎమ్మెల్యే రామానాయుడు స్పందిస్తూ.. రఘు రామకృష్ణం రాజు ప్రజల మనిషి… ఆయన చెప్పినట్టు నర్సాపురం పార్లమెంట్ టీడీపీ బెల్టే… ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం రఘు రామకృష్ణం రాజుకి అలవాటు అంటూ కామెంట్ చేసారు.. ఇలా.. వైసీపీ ఎంపీ వ్యవహారం.. అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్ గా మారింది.