
సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే మొదట్లో కొన్ని ఆఫర్లు వచ్చినా.. అమ్మడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి వచ్చిన అవకాశాలను కాదనుకుంది. ఆ తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఓరు అదార్ లవ్’ చిత్రం ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులోకి డబ్ అయి ఫ్లాప్ కావడంతో మొత్తానికే ఆమెకు ఆఫర్లు దూరమైపోయాయి. అప్పటికీ గానీ ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడలేదు. ప్రస్తుత పరిస్థితికి వస్తే.. మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటా ముందు మీ సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వండి అని అందర్నీ పోన్ చేసి అడుగుతుందట.
అయితే ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో మాత్రం ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదని సమాచారం. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న. ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది.
కాగా ఇప్పుడు వీళ్ళ మాదిరిగానే ప్రియా ప్రకాష్ వారియర్ సైతం పయనించబోతుందట. ఈ క్రమంలోనే నితిన్ కొత్త సినిమాలో ఆమె రెండో కథానాయకిగా ఛాన్స్ కొట్టేసింది అని తెలుస్తుంది. అలాగే మరో సినిమాలో కూడా నటించబోతుందట. నాగశౌర్య హీరోగా రాబోయే ఓ సినిమాలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మరి ఈ రెండు చిత్రాల్లో తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు ప్రియాకి బాగానే వస్తాయి.