
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మృతితో చిత్రసీమలో విషాదం నెలకొంది. సుశాంత్ మృతిపై నెటిజన్లంతా బాలీవుడ్ ఇండస్ట్రీని వేలెత్తి చూపుతోంది. బాలీవుడ్లో నెపోటిజం, వారసత్వం, అర్హత లేనివారిని స్టార్స్ గా మార్చడం, ప్రతిభ ఉన్న వారిని తొక్కేయడం వంటి వాటిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సుశాంత్ మృతిపై కంగనా రనౌత్, వివేక్ బబరాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఓ రెంజ్లో ఫైర్ అయిన సంగతి తెల్సిందే. తాజాగా మరో హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఉసరవెల్లి’లో పాయల్ ఘోష్ నటించింది. తాజాగా ఆమె సుశాంత్ ఆత్మహత్య, డిప్రెషన్ పై ట్వీటర్లో ఎమోషన్ ట్వీట్ చేసింది. ‘సౌత్ సినీ ఇండస్ట్రీ స్వర్గం.. బాలీవుడ్ ఓ నరకం.. మమ్మల్ని క్షమించు సుశాంత్.. మేము ఫెయిల్ అయ్యామ’ని చెప్పుకొచ్చింది.. ‘దక్షిణాది వారు హీరోయిన్లకు గుళ్లు కడతారు.. కానీ బాలీవుడ్ మాత్రం చచ్చేలా అగౌరవపరుస్తుంది.. టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్‌కు వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని’ వరుసగా ఎమోషన్ ట్వీట్ చేసింది పాయల్ ఘోష్.
సుశాంత్ లాగే తాను కూడా డిప్రెషన్‌కు లోనయ్యానని చెప్పింది. అయితే ఆత్మహత్య వంటి ఆలోచన చేయలేదని పేర్కొంది. ఎందుకంటే తన చుట్టూరా తనవాళ్లు ఉండేవారిని చెప్పిది. తన భావాలను ఇతరులతో పంచుకునేదానిని అని చెప్పింది. అయితే బాలీవుడ్ జనాలు తనను ఎంతో నీచంగా మాట్లాడరని, అగౌరవ పరిచారని వాపోయింది. దక్షణాదిలో తాను జూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి, జాతీయ అవార్డులు తీసుకున్న వారితోనూ కలిసి పని చేశానని చెప్పింది. వారెప్పుడూ తనను తప్పుగా వాడుకోవాలని చూడలేదని తెలిపింది. బాలీవుడ్ దక్షిణాదిని తక్కువచేసి చూస్తుందని ఆరోపించింది. టాలీవుడ్ వదిలి బాలీవుడ్ వెళ్లి తాను తప్పుచేశానని చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలకు నెటిజన్లు నుంచి మద్దతు లభిస్తుంది. సుశాంత్ మృతి నేపథ్యంలో నెటిజన్లంతా బాలీవుడ్ ను తప్పుపడుతుండగా ఇండస్ట్రీలోని వారుసైతం వేలెత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది.