Home Blog Page 8422

మా యూనిట్‌లో ఎవ్వరికీ కరోనా సోకలేదు: ఆర్జీవీ


క‌రోనా కార‌ణంగా చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతుంటే రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం వరుసగా సినిమాలు తీస్తున్నాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లోనే క్లైమాక్స్‌, నేక్‌డ్ మూవీలు షూట్‌ చేసి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ చేశాడు. కరోనా టైమ్‌లోనే ‘కరోనా వైరస్‌’ మూవీ కూడా చిత్రీకరించాడు. ప్రణయ్, అమృతల ప్రేమ కథ ఆధారంగా  మర్డర్,  గాంధీని చంపిన గాడ్సే జీవితం ఆధారంగా ది మ్యాన్ హు కిల్డ్ గాంధీ,  కిడ్నాప్‌ ఆఫ్‌ కత్రినా కైఫ్‌, పవర్‌ స్టార్‌ అనే చిత్రాలను అనౌన్స్‌ చేశాడు. ఆపై తన మార్కు హర్రర్  జోనర్లోకి వెళ్లి రెండు రోజుల కిందట 12 ఓ క్లాక్‌ అనే మూవీ ట్రైలర్తో ఫ్యాన్స్‌ను భయపెట్టాడు.

ఇలా దేన్ని లెక్కచేయకుండా దూసుకెళ్తున్న ఆర్జీవీ జోరుకు కరోనా వైరస్‌ బ్రేకులు వేసిందని, ఆయన టీమ్‌లో ఒకరికి వైరస్‌ సోకిందన్న వార్తలు వచ్చాయి. దాంతో, రాము చేస్తున్న షూటింగ్స్‌ అన్నీ ఆగిపోయాయన్న వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీనిపై ఆర్జీవీ స్పందించాడు. ఆ వార్తలు పుకార్లే అని స్పష్టం చేశాడు.
తన దగ్గర పని చేస్తున్న వారిలో ఎవ్వరికీ కరోనా సోకలేదని ట్వీట్‌ చేశాడు. ‘మా యూనిట్‌లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం వ‌ల్ల షూటింగ్ నిలిపివేశామంటూ వార్తలు ప్రసారం అవుతున్నాయి. అవి తప్పు.  వాస్తవానికి మేం షూటింగ్ మొద‌లు పెట్టే ముందే యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాం.  అందులో అంద‌రికీ నెగెటివ్ అని వ‌చ్చింది. కోవిడ్‌ విషయంలో మేం అన్ని గైడ్‌లైన్స్‌ కఠినంగా అమలు చేస్తున్నాం’ అని రాము ట్వీట్‌ చేశాడు. దాంతో రాము జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని అర్థమైంది.

https://twitter.com/RGVzoomin/status/1279259951169327104

వెంకటేశ్ ‘నారప్ప’ పెద్ద కొడుకు ఇతనే

Narappa-Karthik-Muniratnam-OKtelugu

Narappa-Karthik-Muniratnam-OKtelugu
కథ నచ్చితే ఇమేజ్‌ను ఇంటి గేటు వద్దే వదిలేసి సినిమాలు చేస్తుంటాడు దగ్గుబాటి వెంకటేశ్. అందుకే సక్సెస్‌ఫుల్‌ హీరోగా మారి విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్నాడు వెంకీ. మరే సీనియర్  హీరోకు లేనంతగా మహిళా అభిమానులను సంపాదించుకున్న  వెంకటేశ్‌ వైవిధ్యమైన చిత్రాల్లో నటించేందుకు ముందుంటాడు. కుర్ర హీరోలతో మల్టీస్టారర్స్‌కూ వెనుకాడడు. ఈ మధ్యే మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు తమిళ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అసురన్‌’ రీమేక్‌లో నటిస్తున్నాడు. ధనుష్‌ నటించిన ఈ మూవీ తమిళ్‌లో భారీ విజయం అందుకోవడంతో పాటు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని ‘నారప్ప’పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు వెంకీ.  సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,  వి క్రియేషన్స్ బ్యానర్ల కింద దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి థాను ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.   మణిశర్మ మ్యూజిక్‌ డైరెక్టర్.

వెంకటేశ్‌ సరసన ప్రియమణి హీరోయిన్‌. మూవీలో నారప్ప భార్య సుందరమ్మగా డీగ్లామర్ పాత్రను ప్రియమణి పోషిస్తోంది. ఓ భూస్వామి చేతిలో అణచివేతకు గురైన దళిత కుటుంబం చేసే పోరాటమే ఈ చిత్రం కథ. మాతృక ‘అసురన్‌’ ప్రకారం నారప్ప (వెంకీ), సుందరమ్మ (ప్రియమణి)లకు ఇద్దరు కొడుకులు ఉంటారు. భూస్వామి చేతిలో పెద్ద కొడుకు చనిపోతాడు. ఆ పాత్రలో ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ ర‌త్నం న‌టిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఈ రోజు (ఆదివారం) కార్తీక్‌ పుట్టిన రోజు. అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ మునికన్నా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసింది.   తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కీలకమైన లాయర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా.. మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, రాజీవ్‌ కనకాల, అజయ్, శ్రీతేజ్‌, రావు రమేశ్‌ ఇతర కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఏపీ బీజేపీలో కీలక మలుపు రాబోతోందా?

ap-bjp-oktelugu

 ap-bjp-oktelugu
కేంద్రంలోని బీజేపీది వైసీపీకి అనుకూల స్ట్రాటజీ.. కానీ ఏపీలోని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణది మాత్రం వైసీపీ వ్యతిరేక వైఖరి. ఒకే పార్టీ రెండు ధోరణులు.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఈ పంచాయితీ ఆసక్తి రేపుతోంది. టీడీపీ అనుకూల కన్నా లక్ష్మీనారాయణ వైఖరి చర్చనీయాంశమైంది.

కేంద్రంలోని పెద్దలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే కన్నా మాత్రం ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీ నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వివాదం వరకు జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.  తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ కూడా రెండు వర్గాలుగా విడిపోయినట్టు కనిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణతోపాటు పాత బీజేపీ నేతలు, టీడీపీ సానుభూతి పరులు చంద్రబాబుకు మేలు చేసేలా జగన్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక బీజేపీలోని మరో వర్గం ఎంపీ జీవీఎల్ తోపాటు రామ్ మాధవ్ లాంటి వాళ్లు జగన్ కు మేలు జరిగేలా చంద్రబాబు టార్గెట్ గా రాజకీయం చేస్తూ వస్తున్నారు. అయితే కన్నా ఎంత విమర్శలు చేసినా ఆయన్ను మాత్రం బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదు. కంట్రోల్ చేయలేదు. అదే బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కన్నా లక్ష్మీనారాయణతో ఏపీలో బీజేపీ బలపడే చాన్స్ లేదని అధిష్టానం దాదాపు నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తోంది. అందుకే కన్నా.. చంద్రబాబు అనుకూల వైఖరి తీసుకున్నా ఆయన్ను పట్టించుకోవడం లేదట.. అందుకే కొద్దిరోజులుగా కన్నా సైలెంట్ అయిపోవడం బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

దీనికి కారణం ఏంటంటే కన్నా ప్లేసులో ఏపీ బీజేపీకి దమ్మున్న కొత్తనేతను బీజేపీ చీఫ్ గా చేయడానికి అధిష్టానం రెడీ అయిపోయిందట.. కన్నా లక్ష్మీనారాయణ పదవీకాలం అయిపోయి నెలరోజులు కావస్తోంది. దీంతో ఆయనను మరోసారి కొనసాగించే అవకాశాలు లేవని బీజేపీ అధిష్టానం నుంచి వార్తలు వస్తున్నాయి.

తనకు రెండోసారి అవకాశం ఇస్తారని కన్నా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త చీఫ్ కోసం బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని వార్తలు రావడంతోనే కన్నా మౌనం దాల్చారట.. ఇలా బీజేపీకి కొత్త చీఫ్ రావడానికి కన్నా స్వయంకృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది.

మోకా హత్యలో మాజీ మంత్రి కొల్లు నింధితుడేనా?

moka-bhaskar-rao-and-kollu-oktelugu

moka-bhaskar-rao-and-kollu-oktelugu

కృష్ణా జిల్లాలో రాజకీయ హత్యలు చోటు చేసుకోవడం ఆ ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య జరిగిన కొద్ది రోజుల వ్యవధిలో నాగాయలంక మండలం పర్రచివర గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి తాతా సాంబశివరావు హత్యకు గురయ్యాడు. ఈ రెండు హత్యలు జిల్లాలో రాజకీయాన్ని మరింత వేడెక్కించాయి. రెండు హత్యలు నేపథ్యం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినదే కావడం విశేషం.

మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ 24వ వార్డుకు వైసీపీ అభ్యర్థిగా మోకా భాస్కర రావు నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థి నాంచారయ్యకు మోకా భాస్కరరావుకు ఎంతో కాలంగా వైరం ఉంది. ఈ నేపథ్యంలో నాంచారయ్య కొంతకాలంగా భాస్కరరావును హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద కత్తితో పొడిచి హాత్య చేశారు. నాంచారయ్య మాజీ మంత్రి, టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర అనుచరుడు కావడంతో, వారి మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా మాజీ మంత్రి కొల్లు అనుమతితోనే మోకా హత్య జరిగిందని పోలీసులు తేల్చారు.

హత్యకు సంబంధించిన అంశాలను నాంచారయ్య కొల్లు రవీంద్రతో పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై చర్చించానని పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. దీంతో పోలీసు బృందాలు ఆయన కోసం గాలించాయి. చివరి మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళుతుండగా మధ్యలో అరెస్టు చేశారు. టీడీపీ నాయకులు ఈ అరెస్టును ఖండిస్తున్నారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుడు నాంచారయ్య, హాత్యకు గురైన మోకా భాస్కరరావులు బీసీ (మత్స్యకార) సామాజిక వర్గానికి చెందిన వారు. వైసీసీ అధికారంలోకి రావడంతో మంత్రి పేర్ని నాని అండతో భాస్కరరావు ఆ సామాజిక వర్గంలో పట్టు పెంచుకునే యత్నంలో ఉన్నారు. దీంతో ప్రత్యర్థి నాంచారయ్య, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తమకు రాజకీయంగా సమస్యలు ఉంటాయని భావించి ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు విచారణలో వెల్లడైంది. మొబైల్ ఫోన్లో నిందితులు మాజీ మంత్రితో మాట్లాడిన వివరాలు.. కాల్ డేటా, మాజీ మంత్రి పిఏతో మాట్లాడిన వివరాలు పోలీసులు సేకరించి కొల్లు ప్రోద్భలంతోనే హత్య జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. మాజీ మంత్రి అరెస్ట్ తో మోకా హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరో ఘటనలో అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని నాగాయలంక మండలంలోని పర్రచివర గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తాతా సాంబశివరావు ద్విచక్ర వాహనంపై నాగాయలంక నుంచి పేద గౌడపాలెం వెళుతుండగా మేరకాపాలెం వద్ద మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఇది వైసీపీ నాయకుల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణ సాగుతోంది. రెండు సంఘటనలు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఈ రెండు హత్యలు జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేశాయి.

అమరావతి కధకు ముగింపు ఎప్పుడు?

అమరావతి రైతుల ఆందోళన 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విదేశీ భారతీయుల నిరసన గళం హడావుడి టీవీ మాధ్యమాల్లో ధ్వనించింది. విశేషమేమంటే ఇదికూడా ఇప్పటికే టిడిపి అనుకూల ముద్రపడిన టీవీ ల్లోనే వినిపించటంతో దానికి రావాల్సిన ప్రాముఖ్యత రాలేదు. ఇదేదో టిడిపి అనుకూల విదేశీయులు ఓ పధకం ప్రకారం ప్రచారం చేసారనే స్థానిక ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. కారణం అసలు ఆందోళన జరగాల్సిన ఆంధ్రలో పెద్దగా ప్రజా ఉద్యమంగా మారకపోవటం, రెండోది ఇప్పటికే ప్రజలు చంద్రబాబు అనుకూల, జగన్ అనుకూల వర్గాలుగా విడిపోవటం, మూడోది కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకూ వుధృతం కావటం , నాలుగోది ఇది రాజధాని పోరాటం కన్నా రైతుల పోరాటంగా మారటం , అయిదోది ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రజలు దీనిపై అంతగా ఆసక్తి చూపకపోవటం , ఆరోది అమరావతి లో భూములు కొనుక్కున్న ఎన్నారై ల పోరాటంగా వై ఎస్ ఆర్ పి ప్రచారం కొంతమేర ప్రజల్లోకి వెళ్ళటం, ఏడోది, ఎంత గింజుకున్నా జగన్ మొండివాడు కాబట్టి ఫలితం ఉండదనే నిరాశల్లోకి టిడిపి శ్రేణులు కూడా వెళ్ళటం, ఎనిమిదోది, సంవత్సరం లోపే చంద్రబాబు మీద క్రమ క్రమేణా విశ్వాసం సన్నగిల్లటం, చివరగా జగన్ తీసుకున్న సంక్షేమ పధకాలు ప్రజల్లో ప్రభావం చూపటం ఇవన్నీ కలిసి ఆంధ్రలో ప్రజా ఉద్యమంగా రాజధాని ఉద్యమం మారలేకపోవటం ఈ సంవత్సరం లో జరిగిన పరిణామం .

ముందుగా ఉద్యమ సరళిని పరిశీలిస్తే అమరావతి రైతుల పై ప్రారంభంలో అందరికీ సానుభూతి వుండేది. ఎందుకంటే అన్ని వేల ఎకరాలు స్వచ్చందంగా ఇవ్వటమనేది చరిత్రలో మరుపురాని ఘట్టం. వాళ్ళందరినీ ఒప్పించటం లో చంద్రబాబు నాయుడు పాత్రని అభినందించాల్సిందే. రెండోది, రైతులకు భూమి అంటే ప్రాణంతో సమానం. అటువంటిది రాజధాని తమ ప్రాంతంలో వస్తుందని , తమకు కేటాయించే స్థలాలకు కూడా మంచి విలువ వస్తుందని, దానిపై ఆదాయం కూడా బాగా వస్తుందని నమ్మటంతో ప్రాణంతో సమానమైన భూమిని కూడా వదులుకోవటం చిన్న విషయమేమీ కాదు. అయితే మెల్లి మెల్లిగా ఈ సానుకూలత మొదట్లో ఉన్నంత లేకపోవటానికి కారణాలు అనేకం. రైతు ఉద్యమం టిడిపి ఉద్యమం లాగా మారటం అన్నింటికన్నా పెద్ద బలహీనత. దానికి ఎవర్నీ తప్పుపట్టలేము. మొదట్లో వాళ్ళ తరఫున మాట్లాడి వాళ్ళను ఉద్యమబాటలో నడిపించటం లో టిడిపి పాత్ర నే ప్రధానం. అది రాష్ట్రవ్యాప్త ప్రజావుద్యమంగా మారివుంటే ఈ బలహీనత నే బలంగా మారి వుండేది. అలా జరగక పోవటం తో ఇది టిడిపి తన రాజకీయాలకు వాడుకుంటుందనే ప్రచారం వైపు కొంత సెక్షన్ మారటానికి దోహదపడింది. దానితో పాటు వై ఎస్ ఆర్ పి వ్యూహం కూడా కొంత ప్రజల్లోకి వెళ్ళింది. విశాఖ లో కార్యనిర్వాహక రాజధాని , కర్నూలు  లో న్యాయ రాజధాని అని ప్రకటించటంతో ఆ ప్రాంత ప్రజలు అమరావతి రాజధాని ఉద్యమం లో పాలుపంచుకోవటం తగ్గింది. ఇకపోతే ఎన్నారై లు భూములు కొన్నారనేది పాజిటివ్ కన్నా నెగటివ్ గా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం లో వై ఎస్ ఆర్ పి కొంతమేర సఫలీకృత మయ్యింది. దానితోపాటు ఈ భూములు కొన్నవాళ్ళలో ఒక సామాజిక వర్గం వారే ఎక్కువమంది వున్నారనే ప్రచారం కూడా ప్రజల్లోకి వై ఎస్ ఆర్ పి తీసుకెళ్ళింది. ప్రజాభిప్రాయం ఏర్పడటానికి ఒక్కోసారి ప్రచార సరళి ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఉద్యమం రాజధాని కోసమా , రైతుల కోసమా అనేది కూడా ముఖ్యమే. ఉద్యమం సజీవంగా నిలబడాలంటే సరైన వ్యూహమే కీలకం. ఆ విషయం లో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ఎంత పెద్ద అనుభవజ్నుడైనా  ఫలితం రానప్పుడు విఫలమయినట్లే అనుకోవాలి.

రాజధాని విషయం పక్కన పెడితే అమరావతి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై వుంది. రైతుల గోడు వినని ప్రభుత్వం ఎప్పటికీ ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పరిగణించబడదు. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రం లో అత్యంత ఉన్నత పదవి లో వున్నాడు. అటువంటప్పుడు పట్టువిడుపులతో ఒక మెట్టుదిగి రైతులను స్వయంగా పిలిపించుకొని మాట్లాడితే తన ప్రతిష్టే పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మిగతా విషయాల్లో ఎంత పేరుతెచ్చుకున్నా ఈ ఒక్క విషయం చాలు ప్రతిష్ట మంట గలవటానికి. రైతులు కూడా స్వతంత్రంగా ముఖ్యమంత్రి ని కలవటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందోళనల కన్నా, ఒక పార్టీ తోకగా వున్నామనే అభిప్రాయం కన్నా ఏదోవిధంగా సమస్య పరిష్కారానికి చొరవ చూపటమే సరైన చర్య అవుతుంది. అటు జగన్ మోహన రెడ్డి ఇటు రైతులు పట్టు విడుపులతో వ్యవహరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. రాజధాని సమస్యగా కాకుండా రైతు సమస్యగా ఇద్దరూ చూడగలిగేటట్లయితే కొంతమేర పరిష్కారమార్గం దొరుకుతుంది. ఆ దిశగా ఇద్దరూ ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాం.

విద్యార్థులకు కొత్త సమస్యలు!

 

Students

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో భారతదేశంలో కూడా లాక్ డౌన్ విధించడం జరిగింది. 25 మార్చి నుండి మొదలైన ఈ లాక్ డౌన్ నేటికీ చిన్నారులను ఇంటికే పరిమితం చేసింది. మొదట్లో పరీక్షల పై ఆందోళన ను దాటి నెమ్మదిగా ఇంట్లోనే వేసవి సెలవులను గడపడం ప్రారంభించారు. బయటకు వెళ్లి ఆడుకొనే అవకాశం లేకపోవడంతో పిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉన్న టెలివిజన్, మొబైల్, కంప్యూటర్, ల్యాప్ టాప్, ట్యాబ్ వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించడం ద్వారా సమయాన్ని గడపడం ప్రారంభించారు. దీంతో నెమ్మదిగా వీరు ఈ డిజిటల్ స్క్రీన్స్ ను ఎక్కువ కాలం చూడడం ప్రారంభమైంది.

అటు పిమ్మట జూన్ నెలాంతానికి నెమ్మదిగా విద్యాలయాలు తీవ్రమవుతున్న కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఇక ఇంటి వద్దనే ఆన్ లైన్ లేదా వర్చువల్ క్లాసులను ప్రారంభించి విద్యార్థులకు పాఠాలు భోదించడం ప్రారంభమైంది. దీంతో పిల్లలు డిజిటల్ స్క్రీన్ పై పని చేసే సమయం దగ్గర దగ్గర ఎనిమిది నుండి పది గంటలకు చేరిపోయింది. ఇలా డిజిటల్ పరికారలపై పిల్లలు గడిపే సమయం పెరిగిపోవడంతో అంటే ఈ సమయంలో ఎప్పుడైతే 4 గంటలు దాటి పోయిందో నాటి నుండి వీరి కళ్ల పై అధి ప్రభావం చూపడం ప్రారంభించింది. ముఖ్యంగా డ్రై ఐ (కంప్యూటర్ విజన్ సిండ్రోమ్) లేదా డిజిటల్ స్ట్రయిన్ కారణంగా పిల్లలలో కంటి సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయని తల్లితండ్రులు పేర్కొంటున్నారు.

డా. అల్పా అతుల్ ఫూరబియా, ఆప్తమాలజిస్టు మరియు సీనియర్ రిఫ్రాక్టివ్, కార్నియా, కాటరాక్ట్ సర్జన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్ , కొండాపూర్ దీనిపై స్పందిస్తూ చిన్నారులలో తలెత్తుతున్న ఈ కంటి సమస్యల పట్ల తల్లితండ్రుల ఆందోళన సహజమని అన్నారు. రోజులో ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్స్ పై గడపడం వలన ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆమె అన్నారు. ఇలా ఎక్కువ కాలం డిజిటల్ స్క్రీన్స్ పై దృష్టి కేంద్రీకరించడం, కంటికి విశ్రాంతి ఇవ్వకుండా చదవడం, డిజిటల్ స్క్రీన్స్ కారణంగా ఎక్కువ కాంతి లేదా తక్కువ వెలుతురు ల మధ్య స్క్రీన్ ను చూడడం, అదే పనిగా పని చేస్తూ నోట్స్ రాస్తుండడం, సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వంటి కారణాలతో చిన్నారులలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె వివరించారు. ఇది కేవలం చిన్నారులకే పరిమితం కాదని, వర్క్ ప్రం హో చేస్తున్న పెద్ద వారిలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అయితే చిన్నారులలో దీనిని సరిగ్గా పట్టించుకపోతే ఇది కొంత తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదని ఆమె అన్నారు.

పవన్ ట్వీట్ కు.. వైసీపీ జోరుగా ప్రచారం..


ఎప్పుడు విమర్శించేవాడు ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తే వచ్చే కిక్కే వేరప్పా అంటున్నాయి వైసీపీ శ్రేణులు.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే కానీ పొగిడిన సందర్భం లేదని చెప్పవచ్చు. తాజాగా సీఎం జగన్ ఏపీలో వెయ్యికిపైగా అంబులెన్స్ లను ఒకేరోజు ప్రారంభించారు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతోన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్ ను పొగుడుతూ చేసిన ట్వీట్ మరో ఎత్తయింది. పవన్ ట్వీట్ ను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నాయి.

వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా పవన్ కల్యాణ్ విమర్శిస్తూనే వస్తున్నారు. జగన్ మంచి పనులు చేసినా విమర్శలు గుప్పించే పవన్ సడన్ గా సీఎం జగన్ ను పొగుడుతూ ట్వీట్ చేయడంతో వైసీపీ శ్రేణులు విస్కృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. పవన్ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైసీసీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. ఎట్టకేలకు పవన్ కల్యాణ్ కు జగన్ మంచి పనులు కనిపించడం హర్షనీయమని కామెంట్లు చేస్తున్నారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులు మెగాస్టార్ ఎల్లప్పుడు ప్రశంసిస్తుంటారని పేర్కొంటున్నారు. అదేవిధంగా మెగాబ్రదర్ నాగబాబు సైతం ఇటీవల జగన్ చేస్తున్న మంచి పనులకు వత్తాసు పలికాడని, చంద్రబాబు, పచ్చమీడియా విసయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలకు మెగాబ్రదర్ నాగబాబు మద్దతు పలికారని గుర్తు చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం జగన్మోహన్ రెడ్డిని పొగడటం అభినందనీయమని అంటున్నారు.

ఇన్నాళ్లకు జగన్ చేసే మంచి నిర్ణయాలను పవన్ గుర్తించడం, మెగా ఫ్యామిలీ మొత్తం సీఎం జగన్ మంచి పనులకు బ్రహ్మరథం పట్టడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. పవన్ ఒక్క ట్వీట్ వైసీపీకి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చినట్లు ఆ పార్టీ శ్రేణులంతా ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు జనసేన కార్యకర్తలు సైతం సీఎం జగన్ మంచి పని చేస్తే.. మంచి చేశాడని.. చెడుచేస్తే చెడును విమర్శిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇలా ఇరుపార్టీలు పవన్ ట్వీట్ ను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుండటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

యాప్ ల పై మోడీ సవాల్!

Modi

చైనాకు సంబంధించిన 59 మొబైల్ ఫోన్ యాప్‌ లను భారత ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్‌ లో భాగస్వామ్యం అయ్యేందుకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టవలసిందిగా ప్రధాని మోడీ ఐటి రంగానికి చెందిన నిపుణులకు పిలునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం నూతన ఆవిష్కరణలకు పూనుకుందాం శీర్షికతో శనివారం ప్రధాని మోడీ సోషల్ మీడియా లో రాసిన ఒక పోస్ట్‌ లో ఆత్మనిర్భర్ భారత్ సృష్టిలో భాగంగా కొత్త యాప్‌ లను రూపొందించే సవాలులో పాలుపంచుకుని తమ సత్తా చాటాలని మన దేశానికి ఐటి నిపుణులను కోరారు.

ఇటువంటి యాప్‌ లకు భారతదేశంలో గల విస్తృతమైన మార్కెట్ సామర్ధాన్ని ఉపయోగించుకోవలసిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. మన మార్కెట్ సామర్ధం, మార్కెట్ అవసరాలను సంతృప్తి పరచగల ప్రాడక్ట్‌లు(యాప్‌ లు) రూపొందించడం వల్ల సాధించగల ప్రయోజనాలు మనకు తెలుసునని ఆయన అన్నారు. గృహావసరాలకు ఉపయోగపడే ఇటువంటి యాప్‌లను రూపొందించడానికి ఐటి రంగంలో ఎంత ఆసక్తి ఉందో ఇటీవలి కాలంలో మనమందరం చూస్తున్నామని ప్రధాని తెలిపారు. ఈరోజు దేశం ఆత్మనిర్భర్ భారత్‌ ను సృష్టించడానికి యావద్దేశం కృషి చేస్తున్న తరుణంలో మన మార్కెట్‌ను సంతృప్తిపరచడంతోపాటు ప్రపంచంతో పోటీ పడగల యాప్‌ లను రూపొందించడానికి జరిగే ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ఇదే మంచి అవకాశమని ఆయన అన్నారు.

ఈ లక్ష్యాలను సాధించడంలో అంకుర, ఐటి కంపెనీలకు తోడ్పడేందుకు కేంద్ర ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అటల్ ఇన్నోవేషన్ మిషన్‌ తో కలసి ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ ను చేపడుతోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న యాప్‌ లను ప్రోత్సహించడం, కొత్త యాప్‌ లను రూపొందించడం అనే రెండు విభాగాలు ఇందులో ఉంటాయని ఆయన వివరించారు. మొదటి విభాగంలో ఇప్పటికే ఉన్న యాప్‌ లకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని ఆయన చెప్పారు. ఇందులో ఇ-లర్నింగ్, వర్క్-ఫ్రమ్-హోమ్, గేమింగ్, బిజినెస్, ఎంటర్‌టైన్‌ మెంట్, ఆఫీస్ యుటిలిటీస్, సోషల్ నెట్‌వర్కింగ్ వంటివి ఉంటాయని ఆయన చెప్పారు. వీటిలో నాణ్యమైన యాప్‌ లను గుర్తించి వాటికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం నెలరోజుల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు.

ఇక కొత్త యాప్‌ ల రూపకల్పనకు ప్రభుత్వ పరమైన ప్రోత్సాహం రెండో విభాగంలో జరుగుతుందని ఆయన చెప్పారు. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త యాప్‌ల అవసరంఎంతో ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారతీయ సనాతన క్రీడలను కొత్త యాప్‌ల ద్వారా ప్రజలకు చేరువ చేయగలమో లేదో ఆలోచించాలని ఆయన సూచించారు. ఆయా వయసుల వారికి అనుగుణంగా వారికి ఉపయోగపడే రీతిలో ఆటలు, విజ్ఞానం అందించగలమో లేదో కూడా యోచించాలని ఆయన పేర్కొన్నారు. పునరావసంలో ఉన్న వారికి లేదా కౌన్సెలింగ్ పొందుతున్నవారికి ఉపయోగపడే క్రీడా యాప్‌లను రూపొందించే విషయాన్ని కూడా ఆలోచించాలని ఆయన చెప్పారు. ఇటువంటి చాలా ఆలోచనలు చేయవచ్చని, దీనికి సాంకేతికత ఒక్కటే పరిష్కారం అందివ్వగలదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

మృతదేహంలో కరోనా ఎంత సమయం ఉంటుందో తెలుసా?


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తోంది. కరోనా దాటికి ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవడంతో ఫ్యామిలీతో సంబంధాలు మళ్లీ దగ్గరయ్యాయి. అయితే కరోనా పాజిటివ్ వస్తే మాత్రం మానవత్వం మంటగిలిసేలా ప్రతీఒక్కరూ దూరంగా జరుగుతున్న సంఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్

కరోనా పాజిటివ్ సోకగానే ఆ వ్యక్తిని అంటరానివాడిగా చూస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కన్నపేగు బంధం కూడా దూరమవుతోంది. భార్యభార్తలు, తల్లి కొడుకులు, తండ్రి కూతుళ్ల బంధం సైతం కరోనా కారణంగా విడిపోతున్న సంఘటనలు నిత్యం వార్తల్లోనే చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కోటి మార్కును దాటేశాయి. మరణాల సంఖ్య కూడా భారీగా ఉంది. అయితే ఇటీవలీ కాలంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం కొంత ఊరటనిస్తోంది.

ఇదిలా ఉంటే కరోనాతో మృతిచెందిన వారికి కనీస దహన సంస్కారాలకు కూడా నోచుకోవడం లేదు. వారి మృతదేహాలను అనాథశవాల్లా సాగనంపుతుండటం సోషల్ మీడియాల్లోనే వైరల్ అవుతూనే ఉన్నాయి. కరోనాతో మృతిచెందే వారికి చివరిచూపు కూడా కరువవుతోంది. కరోనా పేరు చెబితేనే ప్రజలు దూరంగా జరుగుతున్నారు. కరోనా మృతదేహన్ని తాకితే తమకు కూడా ఎక్కడ సోకుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అమరావతి కోసం నమో మోడీ అంటున్న బాబు..!

దీంతో కరోనా వైరస్ మృతదేహంలో ఎంతకాలం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది.దీనిని తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే మృతదేహం నుంచి కరోనా వ్యాపించే అవకాశం చాలా తక్కువ ఉన్నాయట. ఒక వ్యక్తి చనిపోయాక అతడి మృతదేహంలో కరోనా వైరస్ ఆరుగంటలు మాత్రమే బతికి ఉంటుందట. ఆ తర్వాత మృతదేహం నుంచి కరోనా వ్యాపించదని తాజాగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి వెల్లడించారు.

ఇటీవల చాలాచోట్ల కరోనాతో మృతిచెందిన వారికి దహన సంస్కారాలు చేయకుండా స్థానిక ప్రజలు అడ్డకుంటారని చెప్పారు. కరోనాపై అవగాహన పెంచుకోకుండా కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేయకుండా అడ్డుకోవడం మంచిది కాదని సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇకనైనా కరోనా మృతదేహాలకు కనీస దహన సంస్కార మర్యాదలు దక్కుతాయని ఆశిద్దాం..

ఛీ.. ఓటీటీ బూతు కంపు కొడుతుంది !


ఓటీటీలో ప్రస్తుతం బూతు కంపు కొడుతుంది. వెబ్ సిరీస్ లు రాకతో డిజిట‌ల్ వేదిక వేడెక్కి.. ఆ బోల్డ్ నెస్ యవ్వారమే యువ‌త‌రంలో యమా హాట్ టాపిక్ గా మారేలా చేస్తోంది. ఈ డిజిట‌ల్ మాధ్య‌మంలో సెన్సార్ షిప్ అన్న‌ది లేక‌పోవ‌డంతో బూతు రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏం సినిమా తీస్తున్నామో, ఎలాంటి సినిమా తీస్తున్నామో.. అని కనీస అవగాహన కూడా లేకుండా.. బూతు రాయుళ్లు తమ బుర్రలకు పదును పెడుతూ.. బూతులో కూడా క్రియేటివిటీని చూపిస్తూ.. డీసెంట్ ప్రేక్షకులకు వెన్ సిరీస్ లు, వెన్ ఫిల్మ్ ల పైనే ఏవగింపు కలిగేలా చేసేస్తున్నారు. ఎక్కువుగా బెంగాలీ, హిందీ సినిమాల్లో కనిపించే అసహ్యమైన బూతు.. ఇప్పుడు తెలుగు డిజిటల్ కంటెంట్ లో కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతుందంటే దానికి ఎవర్ని నిధించగలం ?

అమరావతి కోసం నమో మోడీ అంటున్న బాబు..!

రొమాన్స్ పేరుతో మితిమీరిన శృంగారంతో పాటు జుగుప్స క‌లిగించే క్రైమ్ స్టోరీల్ని.. ర‌క‌ర‌కాల వెబ్ సిరీస్ ల‌లో చూపిస్తూ డబ్బులు చేసుకుంటున్న వారిని ఎలా ఆపేది. అదేమంటే నేటి సమాజంలో పెట్రేగుతున్న శృంగార కార్య‌క‌లాపాల‌ ఆధారంగానే మేం తీస్తున్నాం అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ క‌థాంశం పై తీవ్ర విమ‌ర్శ‌లు వచ్చాయి. నిజానికి ఈ సినిమా నయం.. అంతకంటే దారుణమైన సినిమాలు చాల ఉన్నాయి. అంతెందుకు ‌ రామ్ గోపాల్ వ‌ర్మ బూతు సినిమాలు నగ్నం, క్లైమాక్స్ చూశాక.. ఆర్జీవీ అనేవాడు వింత జీవి అని మనం ఓ అభిప్రాయానికి రావొచ్చు.

ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్

ఇప్పటికైనా ఈ బూతు వ్యవహారం అనేది ఆగాలి అంటే.. డిజిట‌ల్ మాధ్య‌మం పై ఆంక్షలు విధించాలి. బూతు విశృంఖ‌ల‌త్వాన్ని పెర‌గ‌కుండా అడ్డుక‌ట్ట వేయాలి. ఆధునిక యువత భావ‌జాలం పక్కదారి పట్టకుండా మనమే కాపాడుకోవాలి. మొత్తానికి అడల్డ్ కంటెంట్‌ తో డిజిటల్ మాధ్యమం మీద ఎవ్వరూ దండయాత్రకు రాకుండా.. ఏ ఒక్క బూతు సినిమాను ఆదరించకుండా మనం ఉండాలి. అలాగే మూవీ మేకర్స్ కూడా ఆ దిశగా ఆలోచించాలి.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?

దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్నవేళ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ కర్నాటక ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా అన్నది పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలు జూన్ 25 నుంచి జూలై 3 వరకూ జరిగాయి. ఐతే పరీక్షలు రాసిన వారిలో 32 మంది విద్యార్థులకు కరోనాపాజిటివ్ అని తేలడం ఇప్పుడు ఆందోళకరంగా మారింది.

కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, జూన్ 25 మరియు జూలై 3 మధ్య పరీక్షలు రాసినవారిలో 32 మంది ఎస్‌ఎస్‌ఎల్‌సి విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. మరో ఎనభై మంది విద్యార్థులను హోంక్వారెంటైన్లో వుంచారు. ఈ పరీక్షలను 7.60 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 14,745 మంది హాజరు కాలేదు. 3,911 మంది విద్యార్థులు కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నందున పరీక్షలకు హాజరు కాలేదని ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అనారోగ్యంతో మొత్తం 863 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు.

అమరావతి కోసం నమో మోడీ అంటున్న బాబు..!


నేటితో అమరావతి ఉద్యమానికి 200రోజులు. ఈ సంధర్భంగా చంద్రబాబు నాయుడు మహా దీక్ష పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. అమరావతి ఉద్యమంలో మరణించిన రైతులకు మరియు అల్లూరి సీతారామరాజు పటానికి పూలువేసి నివాళులు అర్పించారు. ఇక రాజధాని అమరావతిపై, ఆ ఉద్యమంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదన్న చంద్రబాబు, అమరావతిని కాపాడాల్సిన బాధ్యత మోడీపై ఉందని గుర్తు చేశారు. ఇక అమరావతి ప్రాజెక్ట్ దేశానికి సంపదను చేకూర్చే ఓ కల్పతరువుగా చెప్పడం విశేషం.

ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్

లోతుగా పరిశీలనా చేస్తే…అమరావతి ఉద్యమం బాబును రెండు ప్రాంతాల ప్రజలకు దూరం చేస్తుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అమరావతి ఉద్యమం నచ్చని అంశమే. అధికారం, అభివృద్ధి, సంపద అంతా ఒక ప్రాంతానికి పరిమితం కావడం మిగతా ప్రాంతాల వారికి ఎలా నచ్చుతుంది చెప్పండి. దీనివలన భవిష్యత్తులో బాబుకి పెద్ద సమస్యలే రావచ్చు. వచ్చే ఎన్నికలలో సైతం అమరావతి అంశం వైసీపీ కి ఆయుధంగా మారడం ఖాయం. మూడు రాజధానుల తమ నిర్ణయం, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా వారు గట్టిగా ప్రచారం చేసుకుంటారు అనడంలో సందేహం లేదు. దీని వలన వైసీపీ మహా అయితే గుంటూరు, కృష్ణ ప్రాంతాలలో సీట్లు కోల్పోవచ్చు. టీడీపీ మాత్రం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై పట్టుకోల్పోయే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో ఇదే ప్రధాన అంశం అవుతుంది.

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!

ఇంత పెద్ద రిస్క్ అమరావతి ఉద్యమంలో ఉంటే బాబు దానిని ఎందుకు వదిలేయడం లేదనేది అంతుబట్టని అంశం. అమరావతికి పునాది రాయివేసిన వాడిగా ఓ చారిత్రాత్మక ప్రాజెక్ట్ మరుగున పడిపోతుందనే ఆవేదన కావచ్చు. చంద్రబాబు అమరావతిని తప్పుడు ప్రచారాలతో చంపేయాలని చూస్తున్నారని అనడం బాధాకరం. రెండు నెలలుగా జరుగుతున్న అమరావతి పోరాటానికి ఆయన తన అధీనంలో ఉన్న వ్యవస్థల సాయంతో ఊపిరి పోస్తున్నాడు. ఐతే మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆపలేక పోయారు. శాసన మండలి రద్దయినా, మండలిలో టీడీపీ బలం తగ్గినా మూడు రాజధానుల బిల్లు పరుగులు పెడుతుంది. అందుకే బాబు మోడీపైనే ఆశలు పెట్టుకున్నాడు. ప్రత్యక్షంగా మోడీ జోక్యం చేసుకొని అమరావతిని కాపాడాలని, అమరావతి ఏర్పాటులో తమ హస్తం కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు మోడీపై తీవ్ర విమర్శలు చేసిన బాబు చివరి ఆశగా, మోడీని కలిసే ప్రయత్నం చేయవచ్చు. అలా జరిగితే మోడీ నిర్ణయం ఏమౌతుందనేది చూడాలి.

రేస్ లో స్పీడ్ పెంచిన రేవంత్?

Revanth Reddy

Revanth Reddy

రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఏ పార్టీలో ఉన్నా, ఫైర్ బ్రాండ్ నేతగా మంచి ఫాలోయింగ్ ఉన్న రేవంత్, గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తూ జడ్పిటిసి గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. అనతికాలంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్ లో స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ ఇప్పుడు పిసిసి చీఫ్ రేసులో ఉన్నారు. పిసిసి అధ్యక్ష నియామకం అన్న ప్రతీసారి రేవంత్ కు వద్దని కొందరు, కావాలని ఇంకొందరు ఎవరైనా ఫర్వాలేదని మరికొందరు చెబుతుంటారు. వీరందరి పాలిట్రిక్స్ ను పసిగట్టిన రేవంత్, పార్టీలో తనదైన గ్రూపును బలంగా తయారు చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో లాబీయింగ్ ముఖ్యమని, తనను సపోర్ట్ చేసే కీలక నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారట. జూబ్లీహిల్స్ లో తన నియోజకవర్గ కార్యాలయం ఓపెనింగ్ నాడే, తనకు మద్దతు పలికే నేతలందర్నీ ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే జిల్లాకు రెండు మూడేసి చొప్పున ఎమ్మెల్యే సీట్లు పట్టుబట్టి ఇప్పించుకున్న రేవంత్, జిల్లాల వారిగా తన పట్టు పెంచుకుంటున్నారట. కొత్తగా వచ్చిన నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించొద్దని సీనియర్లు పదేపదే అడ్డుపడుతున్నా, తన పని తాను చేసుకు పోతున్నారట.

ఏడాది కిందటే ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్లి, సోనియాను కలిశారు రేవంత్. సోనియాతో దిగిన ఆ ఒక్క ఫోటో వైరల్‌ గా మారడంతో, గాంధీభవన్‌ లో అగ్గిరాజుకుంది. సీనియర్లు వరుసకట్టి ఢిల్లీకెళ్లి రేవంత్‌ కు పీసీసీ రాకుండా అడ్డుకున్నారట. పార్టీ కూడా గ్రీన్ సీగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో ఢిల్లీలో రాహుల్ కోటరీకి అత్యంత సన్నిహితుడిగా మారారట. పార్టీ పగ్గాలిస్తే వైఎస్ తరహాలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని మాట కూడా ఇచ్చారట. అయితే, తెలంగాణలో తనను వ్యతిరేకిస్తున్న వారిని కూడా కూల్ చేేసేందుకు, ఇటు నుంచి కూడా నరుక్కొస్తున్నారట రేవంత్.

ఈ క్రమంలో తన పదవికి అడ్డు పడుతున్న వారందర్నీ కలిసాడట. ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేతలుగా చెప్పుకునే షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తో సహా అనేకమంది మద్దతు కూడగడుతున్నారట. పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు తనవైపు పనిచేసేలా ముందు జాగ్రత్త పడుతున్నారట రేవంత్. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ మినహా మరెవ్వరూ పార్టీని గట్టెక్కించే పరిస్థితిలో లేరనే టాక్ తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు అధికార టీఆర్ఎస్‌ తో అంటకాగుతున్న తీరు, కోవర్టు వ్యవహారాలను కాంగ్రెస్ హైకమాండ్ కు చెప్పి సక్సెస్ అయిన రేవంత్ కు, చేతిలో పదవి వచ్చే వరకు గ్యారంటీ లేదనే టాక్ కూడా ఉంది. ఓవైపు గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌ లో, అధిష్టానంకు లాయల్ గా ఉండే పాత నేతలకు పెద్దపీట వేస్తారా లేక రేవంత్ వైపు మొగ్గు చూపుతారా అనేది త్వరలోనే తేలిపోతుంది.

ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్


రాజకీయాల్లో గట్స్ ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రజల్లో అభిమానం ఉండాలి. అవి ఉంటే ఏమైనా చేయవచ్చని ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవచ్చని నాడు ఎన్టీఆర్ నిరూపించారు. నాదెండ్ల భాస్కర్ రావు మోసం చేసి టీడీపీని హైజాక్ చేస్తే సీఎం అయితే ఎన్టీఆర్ కృంగిపోలేదు. జనంలోనే తేల్చుకున్నారు. ఉప ఎన్నికల్లో అందరూ కొత్త వారు.. ఉద్యోగులు, యువత, సామాజిక సేవాకారులకు టికెట్లు ఇచ్చి అనామకులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. భ్రష్టు పట్టిన రాజకీయ నేతలపై ప్రజల్లోనే తేల్చుకున్నారు.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే చేయబోతున్నారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసినా పార్టీ కోసం పనిచేసే వారిని యువతను, పోలీసును, లాయర్ ను, ప్రొఫెసర్లను ఎన్నికల్లో దించి నిజాయితీ గల 151 మంది ఎమ్మెల్యేలను, 23మంది ఎంపీలను గెలిపించుకోగలిగారు. అందులో ఇప్పుడు కొందరు తోకజాడిస్తున్నారు అది వేరే సంగతీ..

నాడు కుల్లు రాజకీయాలను ప్రజల్లోనే తేల్చుకునేవారు ఎన్టీఆర్. నేడు అదే రకమైన ఆవేశాన్ని ప్రస్తుత సీఎం జగన్ లో చూస్తున్నారు తెలుగు జనాలు. జగన్ కూడా పార్టీ మనుషుల కంటే.. కట్టబెట్టిన పదవుల కంటే జనాన్నే ఎక్కువగా నమ్ముకున్నారు. అసెంబ్లీకి కూడా వెళ్లకుండా జనంలోనే ఉన్నారు. వాళ్ల మధ్యనే పంచాయితీ పెట్టుకుంటున్నారు.

ఇలా చేయాలంటే దమ్ముతోపాటు అపరిమితమైన ప్రజాదరణ ఉండాలి. ఈ రెండూ నాడు ఎన్టీఆర్, నేడు జగన్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే జగన్ తోకజాడించే నేతలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ది చెప్పాలని.. వారి పదవులను ఊడబీకించాలని కంకణం కట్టుకున్నారు. చాటు మాటు రాజకీయాలు చేసే టీడీపీ లాంటి పార్టీలకు ప్రజా క్షేత్రంలోనే బుద్ది చెప్పాలని జగన్ రెడీ అయ్యారు.

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!

తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి అతడిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు కోరారు. ఆ ముచ్చట త్వరలోనే తీరబోతోంది. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి. ఇదే రఘురామపై వైసీపీ కొత్త అభ్యర్థిని నిలబెట్టి గెలిపించి రఘురామకు బుద్ది చెప్పాలని యోచిస్తున్నాయి.తద్వారా పార్టీలోని అసమ్మతులందరి నోళ్లు మూయాలని.. జగన్ ఏడాది పాలన ఫెయిల్యూర్ అన్న ప్రతిపక్ష టీడీపీకి కూడా తగిన గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఒకే దెబ్బకు చాలా పిట్లలను రాల్చే జగన్ ఎత్తుగడ ప్రజాక్షేత్రమే కావడం గమనార్హం.

నిజానికి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో పక్క పార్టీల్లోని వారిని లాగేయడం.. మంత్రి పదవులు ఇవ్వడం చంద్రబాబు, కేసీఆర్ లు చేశారు. కానీ రాజీనామా చేసి మరీ గెలిపించుకున్న చరిత్ర జగన్ ది.ఇప్పుడు అసమ్మతిని కూడా ప్రజల్లోనే తేల్చుకోవడం.. తనపై రెఫరెండాన్ని తనే పెట్టుకోవడం జగన్ గట్స్ కు నిదర్శనమని.. నాడు ఎన్టీఆర్ కూడా ఇలానే చేసేవారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-నరేశ్ ఎన్నం

అమరావతి.. బాబుకు మళ్లీ ఎందుకు గుర్తొచ్చింది?


వైసీపీ ప్రభుత్వం దాదాపు మరిచిపోయిన అమరావతిని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ చేపట్టారు. ఓవైపు పరిపాలన రాజధానిగా విశాఖవైపు అడుగులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఝలక్ ఇస్తూ మళ్లీ అమరావతిపై పోరాటం కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతిని మార్చడానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. అమరావతి రైతులు 200 రోజుల నిరసనను పూర్తి చేసిన సందర్భంగా ‘200రోజుల అమరావతి పోరాటం’పేరు హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అభివృద్ధి ఆగిపోయింది. రూపాయి పుట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఏమీ లేని అమరావతిని వేల కోట్లు పెట్టి నిర్మించడం కన్నా.. అన్నీ ఉన్న విశాఖ నుంచే పాలించడం ఆర్థికంగా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జగన్ సర్కార్ కూడా అదే భావిస్తోంది.అందుకే రాజధాని తరలింపును సమయస్ఫూర్తిగా చేసేందుకు ఆలోచిస్తోంది.

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!

అయితే వైసీపీ ప్రభుత్వం సహా అందరూ కరోనా-లాక్ డౌన్ తో మరిచిపోయి 200 రోజులు అవుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని చంద్రబాబు మళ్లీ గుర్తు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలో పడేయవద్దంటూ నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. వేలాది రైతుల సమస్యను తీర్చాలని.. అమరావతిపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు.అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా చేసే వరకు నిరసనకారులతో పోరాడుతానని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు.

ఇలా జగన్ సర్కార్ అమరావతి నుంచి విశాఖకు రాజధాని మార్చే పరిణామాలు బ్యాక్ ఎండ్ లో వేగంగా చేస్తున్న నేపథ్యంలో కమ్మ వర్గం అంతా పెట్టుబడి పెట్టిన అమరావతిలో అన్యాయం కాకుండా చంద్రబాబు మళ్లీ పాత పాట పడేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు వర్గం సొంతలాభం కోసం తప్పితే.. రైతులకు లాభం చేకూర్చేది కాదంటూ దెప్పి పొడుస్తున్నారు.

కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం?


తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఎవరైనా గీతదాటారో వేటు తప్పదన్నట్లుగా కరోనా విజృంభిస్తోంది. గడిచిన మూడురోజులుగా కరోనా కేసులు తెలంగాణలో వెయ్యికిపైగా నమోదవుతోన్నాయి. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతోన్నారు. ఒకవైపు ప్రభుత్వం కరోనా కట్టడికి సర్వశక్తులు ఒడ్డుతున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ఫలితాలు రావడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడమేకానీ తగ్గిన దాఖలాలు కన్పించడం లేదు.

మోడీ స్పీచ్ అసదుద్దీన్ కి ఇలా అర్థమైందా?

శుక్రవారం ఒక్కరోజు తెలంగాణ రికార్డు స్థాయిలో 1,892కేసులు నమోదయ్యాయి. దీనిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోని 1,658 కేసులు నమోదకావడం గమనార్హం. మిగతా జిలాల్లన్ని కలుపుకొని 234పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20,462కు చేరింది. ఇప్పటివరకు కరోనా 283మంది మృతిచెందినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్ర హోంమంత్రికి సైతం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఐదురోజుల చికిత్స అనంతరం ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ కూడా కరోనా సెగ తాకింది. దీంతో ప్రభుత్వం యంత్రాంగం అలర్టయి తగు చర్యలు చేపడుతోంది.

లాక్డౌన్లో భాగంగా ప్రభుత్వం రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లను ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టింది. దీంతో కరోనా కొంతమేర కట్టడిలో ఉండేది. ప్రభుత్వం ఎప్పుడైతే ఆదాయం కోసం సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టితే నాటి నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఒకప్పుడు పదులు, వందల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. గడిచిన మూడురోజులుగా వెయ్యికి తగ్గకుండా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం చేతులేత్తినట్లుగా కన్పిస్తోంది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండటంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేవుడా: అటు ప్రభుత్వం చేయదు.. ఇటు ప్రైవేటు దోపిడీ

కరోనా విషయంలో సీఎం కేసీఆర్ గతంలో చూపించనంత శ్రద్ధ ప్రస్తుతం చూపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో కేసీఆర్ కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన తొలినాళ్లలో కలెక్టర్లే ఆయా జిల్లాల్లో కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్లే స్వయంగా రంగంలోకి దిగడం ప్రభుత్వాధికారులు చిత్తశుద్ధితో పని చేశారు. దీంతో కరోనాను కట్టడిలోకి వచ్చింది. కొన్ని జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారాయి. వీరి పనితనాన్ని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రశంసించారు. ఆ తర్వాత లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కలెక్టర్లంతా వారివారీ పనుల్లో బీజీగా మారిపోయారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తిరిగి వారిని రంగంలోకి దింపాలని కేసీఆర్ ఆశిస్తున్నారట. ఐఏఎస్ లు కరోనా కట్టడికి చర్యలు చేపడితే కంట్రోల్ అవుతుందని ఆయన భావిస్తున్నారట. ఈమేరకు ఐఏఎస్ లంతా బృందంగా ఏర్పడి పని చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్లంతా రంగంలోకి దిగితే పరిస్థితిలో కొంచెం మార్పురావడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి కంట్రోల్లో ఉందని ప్రభుత్వం చెబుతోంది. కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న ఆ స్థాయిలో మరణాల్లేవని చెబుతోంది. ఏదిఏమైనా కలెక్టర్లు రంగంలోకి దిగడం శుభపరిణామమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం వేలల్లో నమోదవుతున్న కేసులు సంఖ్యను ఐఏఎస్ ల బృందం ఏమేరకు కట్టడి చేస్తుందో వేచి చూడాల్సిందే..!

పవన్‌ మూవీలో రామ్‌ చరణ్ ?


అజ్ఞాతవాసి’ అనంతరం రాజకీయాలపై దృష్టి పెట్టి కొంతకాలం సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’పై ప్రేక్షకుల్లోనే కాకుండా టాలీవుడ్‌ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పవన్‌ ఫస్ట్‌ లుక్‌, ఓ పాటకు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మూవీపై హైప్‌ మరింత పెంచింది. బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘పింక్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం ఈ మూవీ చిత్రీకరణ లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. సాధారణంగా ఓ చిత్రం పూర్తయ్యాకే మరో కథ వినే పవన్‌… ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ నడుస్తుండగానే జాగర్లమూడి క్రిష్తో సినిమాకు అంగీకరించాడు. దీన్ని పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు క్రిష్. ఇది ఓ పీరియాడికల్‌ స్టోరీ అని సమాచారం.

మోడీ స్పీచ్ అసదుద్దీన్ కి ఇలా అర్థమైందా?

క్రిష్, పవన్‌ ప్రెస్టేజియస్‌గా భావిస్తున్న ఈ మూవీ గురించి ఆసక్తికర వార్త బయటికొచ్చింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ కూడా నటించబోతున్నాడట. అయితే, ఇది కీలక పాత్ర లేక కెమెరా అప్పియరెన్సా అనేది తెలియాలి. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌తో అబ్బాయ్‌ చరణ్‌ తొలిసారి తెర పంచుకోనున్నాడు. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు పండగే. ప్రస్తుతానికి చరణ్.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్న ‘ఆచార్య’కు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీలో కూడా చరణ్ ఓ చిన్న పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్, ఆచార్య షూటింగ్స్‌ రెండూ వాయిదా పడ్డాయి.