Home Blog Page 8421

వంట నేర్చుకుంటున్న స్టార్ హీరో !


కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కొన్ని నెలలుగా సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో, హీరోలు ఫుల్ రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. పైగా సినిమాలకు సంబందించి జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్షన్ పనులతో కూడా హీరోలకి పెద్దగా సంబంధం లేకపోవడంతో, అందరీ హీరోలూ.. తమ ఫ్యామిలీస్ తోనే ఫుల్ టైం గడిపేస్తున్నారు. షూటింగ్ లతో తరచూ బిజీగా గడిపే హీరో హీరోయిన్లు, నటీనటులంతా ఇప్పుడు వంట గదిలో తమ కుటుంబ సభ్యుల కోసం కుస్తీ పడుతున్నారట.

ఇళ్ల స్థలాల పంపిణీకి వాయిదాకు కారణం ఇదేనా..!

టాలీవుడ్ లో ఆ మధ్య ‘బీ ది రియల్ మాన్ ఛాలెంజ్’ పేరుతో కొనసాగిన దానిలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోలు దర్శకులు అందరూ కూడా ఇల్లు ఊడుస్తూ వంట చేస్తూ కనిపించిన విజువల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఏదో పేరు కోసం చేసినట్టు కాకుండా నిజంగానే ఒక హీరో వంట నేర్చుకుంటున్నాడు. కరోనాతో దొరికిన తీరిక వేళను రామ్ వంటింట్లోకి దూరి సరదగా గరిటె పట్టి వంట నేర్చుకుంటున్నాడట.

తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?

ఇప్పటికే రామ్ చరణ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఖాళీ సమయాల్లో వంటింట్లోకి దూరి సరదగా గరిటె పట్టి వంట చేస్తుంటారని.. గతంలో వాళ్లే చెప్పారు. పైగా వాళ్ళు వంట చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఆ మధ్య హల్ చల్ చేశాయి. ప్రస్తుతం రామ్ వంతు వచ్చింది.

రైతులకు మరో వరం ప్రకటించిన జగన్..!


ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను సచివాలయం గోడలకు అంటించి, వాగ్దానాల అమలులో తన చిత్తశుద్ధి చాటుకున్న జగన్ ఆ దిశగా ముందుకు వెళుతున్నాడు. కేవలం ఎన్నికలకు నెలల ముందు హామీల అమలు మొదలుపెట్టి, ఓట్లు దండుకునే రాజకీయం తనది కాదని నిరూపిస్తున్నాడు. ముఖ్యంగా రైతు పక్షపాతిగా అనేక పథకాల అమలుతో వారికి చేరువ అవుతున్నాడు. రైతు భరోసా పథకం క్రింద అర్హులైన రైతులకు ఇప్పటికే విడతల వారీగా ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. ఇక గ్రామ సచివాలయాల ద్వారా రైతులకు ఉచిత విత్తనాల పంపిణీ, భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

వీటితో పాటు జగన్ రైతులకు ఇచ్చిన మరో ఎన్నికల హామీ నెరవేర్చడానికి విధివిధానాలు సిద్ధం చేశారు. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఉచిత బోరు బావి పథకాన్ని పొందుపరిచారు. అర్హులైన ప్రతి రైతుకు బోరుబావి ప్రభుత్వం తరుపున నిర్మించి ఇస్తామని చెప్పడం జరిగింది. చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూర్చేలా గ్రామీణాభివృద్ధి శాఖ వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఈ పథకం అమలు చేయనుంది. ఈ పథకానికి అర్హత, మార్గదర్శకాలు ఆ శాఖ విడుదల చేసింది.

జగన్ కు మరో లేఖాస్రం సంధించిన ఎంపీ రాజు..!

కనీసం రెండున్నర ఎకరం భూమి ఉన్న ప్రతి రైతు ఈ పథకానికి అర్హుడు అవుతాడు. అంతభూమి లేనివారు ఇద్దరు ముగ్గురు కలిసి పథకానికి అప్లై చేసుకోవచ్చు. గరిష్టంగా 5 ఎకరాలకు మించి ఉన్నారు ఈ పథకానికి అనర్హులు. భూమి పట్టా, పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీ ద్వారా గ్రామసచివాలయాలలో లేదా నేరుగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పరిశీలన అనంతరం అర్హులైన వారి జాబితా గ్రామ సచివాలయానికి చేరుతుంది. తద్వారా ఆర్తులైన రైతుల పొల్లాలో ప్రభుత్వం బోరుబావి నిర్మించి ఇస్తుంది. రాష్ట్రంలో సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా భారీ లబ్ది చేకూరనుంది.

అది మోడీ ప్రచార స్టంట?

Modi manmohan

Modi manmohan

ప్రధాని నరేంద్ర మోడీ లఢఖ్ పర్యటనలో భాగంగా సైనిక ఆసుపత్రిని సందర్శించిన ఫొటోలు తాజాగా వివాదానికి తెర‌లేపాయి. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ప్రధాని లఢఖ్ పర్యటన ఒట్టి ప్రచార స్టంట్ ఆయన ఫొటోలు షేర్ చేస్తూ ఎగతాళి చేస్తున్నారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కూడా మోడీ పర్యటనను ఎద్దేవా చేశాడు. నాడు మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో గాయపడిన సైనికులను సందర్శించిన చిత్రాలను ఇప్పుడు మోడీ ఫొటోలను పక్కపక్కన షేర్ చేసి ట్వీట్ చేసి ‘‘ఈ చిత్రాలే చెప్తాయి మిలియన్ వర్డ్స్’’ అంటూ ట్వీట్ చేశారు. మోడీది ఒట్టి ప్రచార స్టంట్ అని ట్వీట్ లో దెప్పిపొడిచాడు.

నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ సైనిక ఆస్పత్రి సందర్శనలో పక్కన వైద్యులు.. సైనికులకు గ్లూకోజ్ పెట్టి చికిత్స పొందుతున్నట్టు ఉంది. ఒక కాన్ఫరెన్స్ హాల్ ను ఒక ఆసుపత్రిలా మార్చి అందులో ఉంచారు. వారు గాయపడ్డా వారికి గ్లూకోజ్ బాటిల్స్ పెట్టలేదు. వైద్య పరికరాలు మందులు లేవు.. వైద్యుడి స్థానంలో ఫోటోగ్రాఫర్ లు కనిపించారు. దీన్ని బట్టి మోడీ సైనికుల పరామర్శ కేవలం స్టంట్ అని కాంగ్రెస్ నేత పీ.చిదంబరం విమర్శించాడు.

అయితే చిదబంరం చేసిన విమర్శలలో ఎంతోకొంత నిజాలున్నాయని అనేకమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైద్యులు లేని ఆసుపత్రి, గ్లూకోజ్ బాటిల్స్ కూడా పెట్టని గాయపడిన సైనికులు..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

‘ఈ ఆఫీస్’ విధానానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం?


తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. గడిచిన వారంరోజులుగా కరోనా కేసులు రాష్ట్రంలో భారీగా నమోదవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువు లాంటి భాగ్యనగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ కరోనా కట్టడి కావడం లేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి.

లాక్డౌన్ సడలింపుల అనంతరం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గడిచిన మూడురోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికు తక్కువగా కాకుండా నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడమేగానీ తగ్గముఖం పట్టడంలేదు. గ్రీన్ జోన్లలో సైతం ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతుండటం గమనార్హం. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సైతం కరోనా బారినపడుతున్నారు. కీలకమైన శాఖల్లో ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సైతం కరోనా వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్రజలెవరు రావద్దని ప్రకటించడం సంచలనంగా మారింది.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

ఉద్యోగులు సైతం కరోనా సమయంలో విధులు నిర్వహించాలంటే భయాందోళన చెందుతున్నారు. కరోనా ఎవరి నుంచి ఎలా వస్తుందో తెలియకపోవడంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వారిలో ఆందోళన నెలకొని ఉంటూనే ఉంది. కార్యాలయంలోని ఫైళ్లన్నీ ఒకరిని నుంచి మరొకరి వెళుతుంటాయి. ఈక్రమంలో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా దీనిపై దృష్టిసారించింది. ఉద్యోగుల్లో కరోనా భయంపోయేలా.. పనులు వేగంగా జరిగేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ ఆఫీస్ విధానానికి నాంది పలికింది.

ఈ ఆఫీస్ విధానం ద్వారా ఉద్యోగులు ఇళ్లలో ఉన్నా.. కార్యాలయంలో ఉన్నా పనులు చేసే అవకాశం ఉంది. సచివాలయం సహా అన్ని హెచ్ఓడీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ ను ప్రవేశపెట్టనుంది. ఈమేరకు ఉద్యోగుల మాస్టర్ డేటాబేస్ రూపొందించాలని, ఆయా కార్యాలయాలకు అవసరమయ్యే కంప్యూటర్ పరికరాలు, డిజిటల్ సంతకాలను సేకరించాలని ప్రభుత్వం నోట్ జారీ చేసింది. ఇప్పటికే ఈ ఆఫీస్ నిర్వహణకై ప్రతిశాఖకు ఒక నోడల్ అధికారిని, సాంకేతిక సహాయకుడిని నియమించారు.

వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?

ముందుగా రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీనిలో ఎలాంటి గందరగోళం లేకుండా, ఫైళ్లను నిరంతరం ట్రాక్ చేసేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ-ఆఫీస్ పై ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. జూలై రెండో వారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ద్వారా పరిపాలన మొదలు కానుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు కొంతమేర ఊరట లభించడం ఖాయంగా కన్పిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్ లైన్ విధానం వల్ల కరోనా వ్యాప్తిని కొంతమేర కట్టడి చేసే వీలుండటంతో ప్రభుత్వం కూడా ఈ ఆఫీస్ విధానానికే మొగ్గుచూపుతోంది.

తాజ్ మహల్ దర్శనం ఇప్పట్లో లేనట్టేనా..?

Tajmahal

Tajmahal

ఆగ్రాలో గడిచిన నాలుగు రోజుల్లో 55 మందికి కరోనా సోకింది. జిల్లాలో మొత్తం 71 కంటోన్మెంట్ జోనులు ఉన్నాయి. దీంతో యూపీ ప్రభుత్వం తాజ్ మహాల్ తెరచి.. సందర్శకులకు అనుమతి ఇవ్వాలనే విషయంలో వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది. స్మారక చిహ్నాలు తెలిస్తే.. సందర్శకుల తాకిడిపెరిగి కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని భావించిన అధికారులు తాజ్‌ మహాల్ మరికొన్ని రోజులు మూసివేయనున్నట్లు తెలుస్తోంది.

దేశంలో ప్రార్థనా స్థలాలతో కూడిన 820 స్మారక చిహ్నాలు గత నెలలో ప్రారంభించబడ్డాయి.
కరోనా కారణంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) పరిధిలోకి వచ్చే అన్ని స్మారక చిహ్నాలు మార్చిలో మూసివేయబడ్డాయి. ఎఎస్ఐ క్రింద 3 వేలకు పైగా స్మారక చిహ్నాలు ఉన్నాయి. ప్రార్థనా స్థలాలను కలిగి ఉన్న 820 స్మారక చిహ్నాలను జూన్ 8 న ప్రారంభించారు.

స్మారక చిహ్నాల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం

1. నాన్-కంటైనేషన్ జోన్ లోని స్మారక చిహ్నాలు మరియు మ్యూజియంలు మాత్రమే తెరవబడతాయి.
2. ఎంట్రీ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ మోడ్‌ లో మాత్రమే ఇవ్వబడతాయి.
3. ఫలహారశాలలో,పార్కింగ్ ప్రాంతాలలో డిజిటల్ చెలింపులు మాత్రమే అనుమతించబడతాయి.
4. సందర్శకులు ఎంట్రీ వద్ద వారి ఫోన్ నంబర్‌ ను సూచించాల్సి ఉంటుంది, తద్వారా అవసరమైతే వారిని తరువాత సంప్రదించవచ్చు.
5. రోజుకు 1,000 నుండి 1,500 మంది సందర్శకులు మాత్రమే ప్రవేశం పొందుతారు.
6. సందర్శకులు సామాజిక దూరాన్ని పాటించాలి, మాస్క్ ధరించడం అవసరం.
7. గ్రూప్ ఫోటోగ్రఫీకి అనుమతి ఉండదు.
8. తదుపరి ఆర్డర్లు వచ్చేవరకు లైట్ అండ్ సౌండ్ షోలు మరియు ఫిల్మ్ షోలు మూసివేయబడతాయి.
9.చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్న గైడ్‌ లు మరియు ఫోటోగ్రాఫర్‌ లకు మాత్రమే అనుమతి లభిస్తుంది.
10. స్మారక చిహ్నం లోపల ఆహారం అనుమతించబడదు.

ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాకు కారణం ఇదేనా..!


రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం కుదరడం లేదు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ జయంతి సందర్భంగా నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇళ్ల స్థలాల లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తొలుత మార్చి నెల 25న ఉగాది పండుగ రోజు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. అప్పట్లో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో వాయిదా వేశారు.అప్పటి నుంచి లబ్ధిదారులు సుమారు 29 లక్షల మంది స్థలాల కోసం నిరీక్షిస్తున్నారు

ఇళ్ల స్థలాల పంపిణీని తాజాగా ఆగస్టు 15వ తేదీకి వాయిదా వేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో స్థలాల సేకరణ దాదాపుగా పూర్తయ్యింది. అయితే ఈ సారి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూమి కొనుగోలు చేసి భారీ స్థాయిలో లే అవుట్ లు వేశారు. భూముల కొనుగోలు విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వంటి వారు ఇళ్ల స్థలాల సేకరణ విషయంలో అక్రమాలు జరిగాయని ప్రకటించారు. స్థానిక వైసీపీ నాయకులు అధికారులతో కలిసి మార్కెట్ రేటుకంటే అధిక ధర చెల్లించి భూములు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

మరోవైపు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వ్యవసాయ భూముల సేకరణ చేపట్టి లే అవుట్ లుగా అభివృద్ధి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అవ భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడంపై పెద్ద దుమారం రేగింది. స్థానికులు, టీడీపీ న్యాయస్థాన్ని ఆశ్రయించారు. దీని వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని టీడీపీ వాదిస్తోంది. జిల్లా కలెక్టర్ ఈ వాదనను ఖండించారు. కృష్ణా జిల్లాల్లో మండవల్లి మండలంలోని గన్నవరం గ్రామంలో చెరువును పూడ్చి ఇళ్ల స్థలాలుగా మార్చారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా జలవనరులు ఉన్న ప్రదేశాలను ఇళ్ల స్థలాలకు కేటాయించడం చేయకూడదు. అదేవిధంగా మరి కొన్ని చోట్ల న్యాయపరమైన ఇబ్బందులు ఉండటంతో పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. సుప్రీం కోర్టులో ఈ అంశంపై కేసుల ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో స్థలాల పంపిణీని ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. అయితే వాయిదాకు సంబంధించిన కారణాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు.

చైనా మొండి వైఖరితోనే అసలు సమస్య?

China vs India

చైనా మోడీ వైఖరితో గాల్వన్ వ్యాలీలో మేలో ప్రారంభమైన భారత్-చైనా ఉద్రిక్తత త్వరగా పరిష్కరం అయ్యే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. ఈ వివాదం దీర్ఘకాలికంగా ఉండబోతోందని మాజీ ఆర్మీ అధికారులు ఖండించడం లేదు. అయితే.. ఈ వివాదాన్ని లేవనెత్తినందుకు చైనా విజయం సాధించబోదని రిటైర్డ్ మేజర్ జనరల్ పికె సెహగల్ అభిప్రాయపడ్డారు. భారత్ అన్ని రంగాలలో చైనాని దాటిపోవడం ఆ దేశానికి మింగుడు పడని విషయం. భారత్ తనను తాను అభివృద్ధి చెందుతున్న శక్తికి పరిమితం చేయాలని చైనా కోరుకుంటుంది.ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగడానికి ఇదే కారణం.

మే 15-16 రాత్రి పెట్రోలింగ్ సమయంలో, భారత సైనికులు చైనా సైనికులను భారత సరిహద్దు నుండి వైదొలగాలని కోరిగా, వారు భారత సైనికులను ఇనుప ముళ్ల తీగతో దాడి చేశారు, ఇందులో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. అప్పటి నుండి సరిహద్దులో విపరీతమైన ఉద్రిక్తత ఉంది. సరిహద్దులో ఉన్న దళాల అప్రమత్తతను పెంచడానికి ముందుజాగ్రత్త చర్యగా భారత్ ఇతర చర్యలు తీసుకుంటోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్‌ లో ఉన్న సైన్యం యొక్క డివిజనల్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. ఇక్కడి సైనికుల ధైర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. మరియు దేశం మొత్తం వారితోనే నిలుస్తుందని వారికి హామీ ఇచ్చారు. సరిహద్దులో చైనాతో వ్యవహరించడానికి భారత ప్రభుత్వం దళాలకు బహిరంగ మినహాయింపు ఇచ్చింది. తద్వారా చైనాకు ఒకే సమయంలో ఒకే పాఠం నేర్పవచ్చు. ఈ మొత్తం సమస్యపై, సెహగల్ దైనిక్ జాగ్రాన్‌ తో సంభాషణ సందర్భంగా ఇది 1965 సమయం కాదని చెప్పారు. భారత సైన్యం ఏ పరిస్థితిలోనైనా శత్రువులకు తగిన సమాధానం ఇవ్వగలదు. యుద్ధం ఒక ఎంపిక కాదని చైనాకు బాగా తెలుసు. భారతదేశం యొక్క బలం గురించి ఆయనకు పూర్తి భావన ఉంది. భారతదేశం తనను తాను అభివృద్ధి చెందుతున్న శక్తికి పరిమితం చేయాలని చైనా కోరుకుంటుందని వారు నమ్ముతారు.

తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఏడాది ప్రారంభం నుంచే ప్రజలంతా కరోనా మహమ్మరితో పోరాడుతున్నారు. ఈ వైరస్ దాటికి అగ్రరాజ్యాలు సైతం కకావికలం అవుతోన్నారు. అందమైన ఇటలీ దేశంలో కరోనా మరణమృదంగాన్ని తలపించింది. ఎక్కడ చూసిన శవాలదిబ్బలే కన్పించాయి. దీంతో అక్కడి ప్రజలంతా కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మానవళికి సోషల్ మీడియాలో సందేశాన్నిచ్చారు. నాటి నుంచి ప్రజలు కరోనా పేరు చెబితే భయాందోళనకు గురవుతున్నారు. అలాగే కరోనాపై అవగాహన పెంచుకుంటూ అనవసరంగా రోడ్లపైకి రావడం తగ్గించారు.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

ఆయా దేశాలు లాక్డౌన్ పాటించడం, కరోనాపై అవగాహన కల్పిస్తుండటంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నారు. అయితే తొలినాళ్లలో నమోదైన మరణాలతో పొలిస్తే ప్రస్తుతం నమోదవుతున్న మరణాలు కొంచెం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. అయితే కేసుల సంఖ్య తగ్గడం లేదు. కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే కరోనా ఊసరవెల్లిగా రంగులు మారుస్తుండటంతో దీనికి వ్యాక్సిన్ కనుగోనడం కొంచెం కష్టంగా మారింది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా శాస్త్రవేత్తలు నిరంతరంగా వాక్సిన్ తయారీ కోసం పని చేస్తున్నారు.

ఇప్పటికే పలుదేశాలు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తున్నాయి. పలు బయోటెక్ కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ తయారీ ఛాలెంజ్ గా తీసుకొని పని చేస్తున్నారు. దీని తయారీకి ఇంకో ఏడాది సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు చెబుతోన్నాయి. అయితే ఇప్పటికే భారత్ చెందిన బయోటెక్ కంపెనీలు కరోనా డ్రగ్, ఇంజక్షన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గ్లేన్ మార్క్ సంస్థ తయారు చేసిన కరోనా మెడిసిన్ ను ఐసీఎంఎఆర్ అనుమతి ఇచ్చింది. వైద్యుల సూచనల మేరకు ఈ మందులను వాడాలని సూచించింది. ఒక్కో ట్లాబెట్ ధర రూ.103గా నిర్ధారించింది. అయితే సాధారణ కరోనా లక్షణాలు ఉన్నవారికే పని చేస్తుందని తెలిపింది. పూర్తిస్థాయి కరోనా రోగులకు ఇది పని చేయదని పేర్కొంది.

వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?

మరోవైపు హెటిరో కంపెనీ కూడా కరోనాకు ఇంజెక్షన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఇంజక్షన్ ధర రూ.5వేలు ఉంటుందని తెలుస్తోంది. కరోనా డ్రగ్, ఇంజక్షన్లు మార్కెట్లోకి వచ్చినా వ్యాక్సిన్ కోసం భారత్ ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఆగస్టు 15 టార్గెట్ గా పెట్టుకొని కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని భారత్ బయోటెక్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఒకేసారి జంతువులు, మానవులు ట్రయల్ నిర్వహిస్తూ వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేశాయి. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందనే ఆశాభావాన్ని ఐసీఎంఆర్ లాంటి సంస్థలు చెబుతున్నారు.

భారత్ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా కరోనా వ్యాక్సిన్ ప్రపంచానికి అందించాలని చూస్తోంది. దీనికోసం భారత సైంటిస్టులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. వీరి కృషి ఫలిస్తే ఆగస్టు 15న భారత్ తోపాటు ప్రపంచమంతా శుభవార్త వినడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే కరోనా డ్రగ్, ఇంజక్షన్ ను భారతే ముందుగా తీసుకొచ్చింది. దీంతో భారత్ నుంచే కరోనాకు తొలి వ్యాక్సిన్ వస్తుందనే ఆశతో ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయి. దీనికి అనుగుణంగా మన సైంటిస్టులు పని చేస్తున్నారు. ఈ ఛాలెంజ్లో మన సైంటిస్టులు నెగ్గి.. ప్రపంచం నుంచి కరోనా మహ్మమరిని తరలికొట్టాలని మనసారా కోరుకుందాం..

కరోనా కట్టడిలో జగన్, కేసీఆర్ ప్రోగ్రెస్ రిపోర్ట్..


దేశంలోనే కరోనా టెస్టులలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానములో నిలిచింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటికి పైగా కరోనా టెస్టులు చేయడం జరిగింది. 10.17 లక్షల కరోనా టెస్టులతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధిక టెస్టులు నిర్వహించిన రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. ఈ విషయంలో తెలంగాణా బాగా వెనుక బడింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న తెలంగాణా కేవలం 1.15 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు సమాచారం ఉంది. అంటే దేశవ్యాప్తంగా నిర్వచించిన కరోనా టెస్టులలో 1.15 శాతం టెస్టులు మాత్రమే తెలంగాణాలో జరిగాయి.

వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?

హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టెస్టుల విషయంలో ప్రభుత్వ అలసత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ప్రతిపక్షం ఈ విషయంలో సీఎం కేసీఆర్ ని ఏకిపారేస్తుండగా… ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో రెండు నెలలకు ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొరియా నుండి లక్షల కిట్లు తెప్పించి పరీక్షలు విరివిగా నిర్వహించారు. వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ కరోనా కట్టడి చేయడంలో చాలా వరకు విజయం సాధించారు. కరోనా కేసుల విషయంలో తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ని దాటి వేసింది. జులై 5వరకు 23,902 మందికి కరోనా సోకినట్లు వారిలో 12,703 కోలుకున్నట్లు 10,904 మంది చికిత్స తీసుకుంటున్నట్లు బులెటిన్ విడుదల చేశారు. అలాగే కరోనా వలన 295 మంది మరణించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జులై 5వరకు 18697 మంది కరోనా బారిన పడగా 8442 మంది కోలుకున్నారు. 10043 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ఇక కరోనా వలన మరణించిన వారి సంఖ్య 232గా ఉంది. ఒకప్పుడు ఆంధ్రా కంటే తెలంగాణా లో రోగులు సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం. నిన్న ఆంధ్రపదేశ్ లో 20,567 టెస్టులు నిర్వహించగా..తెలంగాణలో 5290 మాత్రమే నిర్వహించారు. ఏపీలో 20,567 టెస్టులకు 961 పాజిటివ్ కేసులు రాగా, తెలంగాణాలో 5290 టెస్టులకు 1,590 పాజిటివ్ కేసులు రావడం ఆందోళనకరం అంశం.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కనీసం వెంటిలేటర్ సౌకర్యం లేక మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. పేషేంట్లకు సరిపడా బెడ్లు లేక, ఆసుపత్రి వరండాలకు పరిమితం అవుతున్నారు. ఇక ప్రయివేటు ఆసుపత్రులలో దోపిడీ దారుణంగా ఉంది. రోజుకు లక్ష రూపాయలకు పైగా కరోనా పేషేంట్ నుండి వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. చనిపోయిన వారి శవాలు అప్పగించడానికి లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి హృదయ విదారక పరిస్థితి కరోనా వలన హైదరాబాద్ లో దాపురించింది. మరో వైపు సీఎం కెసిఆర్ కి కరోనా సోకిందని…ఆయన తన ఫార్మ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది.

మలి ప్రస్థానానికి కవిత తొలి అడుగులు?

Kavitha

కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత… మాటల మాంత్రికురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మహిళా నాయకురాలు. గత ఎన్నికల్లో నిజామాబాద్‌ ఓటమితో సైలెంట్‌ అయ్యారు. ఓటమి బాధతో ఇక రాజకీయాలతో సంబంధమే లేదని చెప్పినట్టె చెప్పి సైలంట్‌ గా దూసుకెళ్లడమే బెటరని డిసైడ్ అయ్యాయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కవితను చూసి బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. నిన్నటి వరకు ఎవ్వరికీ అపాయిట్‌ మెంట్లు ఇవ్వని కవిత, ఇప్పుడు కార్యక్షేత్రంలోకి దిగి క్యాడర్‌ తో కలిసిపోవాలని డిసైడ్ అయినట్టున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఎంత నచ్చచెప్పినా, ఏడాది పాటు ఓటమి బాధతో ఇంటివద్దే ఉన్నారు. నిజామాబాద్‌ పై కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాదు ఎవ్వరికీ అపాయింట్ మెంట్లూ ఇవ్వకుండా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇక, కవిత రాజకీయల్లో దూరంగా ఉంటారని భావించారు.

పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కవిత, నిజామాబాద్ ఓటమి దెబ్బకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకున్నారట. ఇదే సమయంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో కూడా అనుభవంలోకి తెచ్చుకున్నారట. అందుకే యాక్టివ్ పాలిటిక్స్ లోకి విధిగా రావాలని డిసైడ్ కావడంతో, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నోటిఫికేష‌న్ ఆమెకు కలిసివచ్చింది. దీంతో కవిత ఎమ్మెల్సీ అవ్వడం లాంఛనమే.

కవిత ఎమ్మెల్సీగానే కాకుండా కేబినేట్ లో బెర్త్ కూడా కన్‌ ఫాం అయ్యిందనే పొలిటికల్ టాక్ చక్కర్లు కొడుతోంది. దీనికి తోడుగా క‌విత ఇప్పుడు పూర్తిస్థాయిలో ఫీల్డ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ముందుగానే గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చి బిజెపిపై కత్తులు దూయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారట. అందుకే తాజాగా దేశవ్యాప్తంగా కొన్ని బొగ్గు గ‌నుల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై, అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. ఓ అడుగు ముందుకేసి ఏకంగా బిజెపి దిష్ఠిబొమ్మల ద‌హ‌నాలు, 24 గంట‌ల సింగరేణి స‌మ్మెకు క‌విత పిలుపునిచ్చారు. దీంతో టిఆర్ఎస్ వ‌ర్గాల్లో ముఖ్యంగా సింగ‌రేణి కార్మిక సంఘాల్లో కొత్త జోష్ వ‌చ్చేసింది.

కవిత పొలిటికల్ రీఎంట్రీ కేబినెట్‌ లో చోటుపై టిఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా ఖండించలేకపోతున్నారు. ఒకవేళ మంత్రివర్గంలో కవితకు చోటు దక్కితే, అటు సామాజికకోణంలో, ఇటు మహిళా కోటాలో ప్లస్ లు మైనస్ లు అన్నీ కూడా లెక్కకట్టారట. కవిత మలి ప్రస్థానం ఎలా వుండబోతోందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాలి.

కేసీఆర్ ఎక్కడ.. ఇప్పుడు ఇదే చర్చ..!


కరోనా సమయంలో మీడియా ముందుకొచ్చి ప్రజలకు ధైర్యం చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడ కన్పించడం లేదు. గడిచిన కొద్దిరోజులుగా ఆయన ఫౌమ్ హౌజ్ నుంచి బయటికి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో భారీ ఎత్తున కేసులు నమోదవుతున్న వేళ కేసీఆర్ మీడియా ముందుకు రాకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల ప్రగతి భవన్లో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అక్కడ పనిచేసే వారందరినీ హోంక్వారంటైన్లోకి తరలించారు. వీరికి పాజిటివ్ రాకముందు నుంచే కేసీఆర్ ప్రగతి భవన్ కి రావడం లేదని ప్రచారం జరిగింది.

వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?

కాగా కొందరు మాత్రం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నారని.. ఆయన కరోనా పాజిటివ్ రావడంతో అక్కడే చికిత్స చేయించుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మరికొందరేమో ఆయన ఫౌంహౌజ్ లో ఉన్నారని చెబుతోన్నారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని హాట్ టాపిక్ గా మారింది. కరోనా విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఫౌంహౌజ్ కు పరిమితమవడంపై విపక్షాలు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడ్డారు. ఇటీవలే రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కరోనా బారినపడి ఐదురోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ప్రయివేట్ ఆసుప్రతుల్లో ఉంటూ చికిత్స పొందుతున్నాయి. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ప్రజాప్రతినిధులకు ప్రయివేట్లో చికిత్స అందిస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

కరోనా భయంతో నగరవాసులంతా సొంతూళ్లుకు వెళుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఇప్పటికే 20నుంచి 30శాతం ప్రజలు సొంతూళ్లకు పయనమ్యారు. దీంతో నగరరోడ్లన్నీ ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. దీంతో నగరంలో ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నారు. ఆదాయంలేక అద్దెలు చెల్లించలేక నగరంలో ఉండటం కంటే సొంతూళ్లకు వెళ్లడమే బెటరని వలస కార్మికులు ఇంటిముఖం పడున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడం కుండా ప్రభుత్వం ఇటీవల హరితహారం కార్యక్రమం ప్రారంభించింది. నేతలు, ప్రజాప్రతినిధులు గుంపులు గా పాల్గొంటూ భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో కరోనా వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా ఫౌంహౌజ్ కే పరిమితమయ్యారనే వార్తలు వస్తున్నారు. కేసీఆర్ కూడా హోంకార్వంటైన్ తరలి వెళ్లారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కేసీఆర్ ఎక్కడ ఉన్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. సోషల్ మీడియాలో నెటిజన్లు వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ ప్రశ్నిస్తుండటం గమనార్హం. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే..!

వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?


ప్రపంచానికి కరోనా వైరస్ ను అంటించి చోద్యం చూస్తున్న చైనాను అంత తేలికగా వదిలిపెట్టడం లేదు మహమ్మారులు. ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రాణాలు పోవడానికి కారణమైన చైనీయులను కొత్త వైరస్ లు పుట్టుకొచ్చి మరీ ఆడుకుంటున్నాయి. ఇప్పటికే కరోనాను పుట్టించి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న చైనాలో.. వారం కింద జీ4 అనే కొత్త వైరస్ ను కనుగొన్నారు. చైనాలో ఈ వైరస్ పందుల నుంచి మనుషులకు వ్యాపించింది. అది మరువకముందే మరో కొత్త మహమ్మారి చైనాలోనే పురుడుపోసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే ‘బుబోనిక్’ వ్యాధి. ఇదో ప్లేగు వ్యాధి. బ్యాక్టీరియా వల్ల సోకుతుందని వైద్యులు తేల్చారు.

జగన్ అస్త్రాన్నే ప్రయోగిస్తున్న బీజేపీ-పవన్

కరోనాతోనే జనాలు సగం చస్తుంటే కొద్దిరోజుల క్రితం చైనాలోనే మరోకొత్త రకం వైరస్ జీ4 ప్రబలింది. పందుల నుంచి మనుషులకు ఇది వ్యాప్తి చెందిందని చైనా వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ కు జీ4గా చైనా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. వైరస్ చైనాలో పందుల కబేళాలలో పనిచేస్తున్న వారికి సోకిందని సోమవారం వెల్లడించిన నివేదికలో తెలిపారు. 2016-18 వరకు పందులను పెంచే 10శాతం మందికి సోకింది. తాజాగా చైనాలోని హుబే, షాండోంగ్ ప్రావిన్సుల్లో జనాభాలో 4.4శాతం మందికి జీ4 వైరస్ సోకినట్టు తేలింది. పరీక్షలు నిర్వహించి వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేస్తున్నారు. వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి క్వారంటైన్ చేస్తున్నారు. ఈ కేసులు పందుల పెంపకం ఎక్కువగా ఉండే హుబే, షాండోంగ్ ప్రావిన్సుల్లో గుర్తించారు. తాజాగా ఆ ప్రాంతాల్లో 18-35 ఏళ్లలోని 20.5శాతం మందికి పాజిటివ్ గా తేలిందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.

ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందని.. మహమ్మారిగా మారవచ్చని చైనా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తరకం వైరస్ కాబట్టి దీన్నుంచి కాపాడుకునే రోగ నిరోధక శక్తి ప్రజలకు తక్కువగా ఉంటుందని.. మరణాలు సంభవించే అవకాశాలుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గుర్తించిన ఈ వైరస్ పందుల ద్వారా వ్యాపిస్తోంది. స్వైన్ ఫ్లూ లక్షణాలున్న హెచ్1ఎన్1కు దగ్గరి పోలికలున్నాయి. 2011లోనే దీనిపై పరిశోధనలు చేశారు. 2016 తర్వాత ఇది మరింత బలంగా మారినట్లు తేలింది. కరోనా మాదిరే ఇది ప్రమాదకరంగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించారు.

జగన్ కు మరో లేఖాస్రం సంధించిన ఎంపీ రాజు..!

ఇక జీ4 వైరస్ ను మరిచిపోకముందే చైనాలో మరో మహమ్మారి కలకలం రేపుతోంది. చైనాలో తాజాగా ‘బుబోనిక్ ప్లేగు’ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కొత్త బుబోనిక్ ప్లేగు వ్యాధితో జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింప్ గ్రంథుల్లో నొప్పి, శరీరంపై పుండ్లతో బాధపడుతారు. ఇప్పటికే ఈ వైరస్ సోకిన ఓ వ్యక్తిని చైనా ఉత్తర ప్రాంతంలోని బయన్నుర్ నగర వైద్యులు గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులను, సన్నిహితులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు లెవెల్-3 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఇప్పటికే ఈ వైరస్ చైనాకు ఉత్తర సరిహద్దుకు ఆనుకొని ఉన్న మంగోలియా దేశంలోనూ వేగంగా వ్యాపిస్తోంది. ప్లేగు లోని ఓ రకం వ్యాధిగా దీన్ని గుర్తించారు. బుబోనిక్ ప్లేగుగా దీనికి పేరు పెట్టారు. ఇన్ఫెక్షన్లకు ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణం అని తేల్చారు.మర్మోట్ జాతికి చెందిన ఎలుకలను తిన్న వారికి ఈ వ్యాధి చైనాలో సోకిందని.. అది బాగా వ్యాపిస్తోందని సమాచారం.

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారులు చైనాలోనే వ్యాపించడానికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లే.. కరోనా వైరస్ వ్యాప్తికి గబ్బిలాలు కారణంగా ఓ పరిశోధనలో తేలింది. ఇక ఇప్పుడు చైనాలో ప్రబులుతున్న జీ4 వైరస్ వ్యాప్తికి పందులు వాహకంగా ఉన్నాయి. తాజాగా బయటపడ్డ ‘బుబోనిక్ ప్లేగు’వ్యాధి ‘మర్మోట్ జాతి’ ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపించిందని తేల్చారు. సాధారణంగా ఎలుకలను తినడం చైనీయులకు అలవాటు. ఆ అలవాటే మరో మహమ్మారి ప్లేగు వ్యాప్తికి కారణం అని అనుమానిస్తున్నారు. ఇలా మనుషులను తప్ప అందరినీ తినేస్తున్న క్రూరమైన చైనీయుల ఆహారపు అలవాట్లే ఇప్పుడు ప్రపంచంలో కొత్త వైరస్ ల పుట్టుకకు వ్యాప్తికి.. ఇంతటి వినాశనానికి కారణమవుతోందని శాస్త్రవేత్తలు ఆడిపోసుకుంటున్నారు.

-నరేశ్ ఎన్నం

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!


జగన్ వ్యూహాలను అందుకోవడం అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు సాధ్యం కావడం లేదు. బహుశా యంగ్ పొలిటీషియన్ ఆలోచనల పదును ముందు, ఆయన అవుట్ డేటెడ్ ఆలోచనలు పనికి రావడం లేదనుకుంటా. జగన్ నిర్ణయాలు బాబును ప్రజలకు దూరం చేస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా అమరావతి అంశం కూడా ఒకటి. మూడు రాజధానుల నిర్ణయంతో బాబును అమరావతి ఉద్యమానికి పరిమితం చేసి, రెండు ప్రాంతాల ప్రజల దృష్టిలో బాబును విలన్ గా చేశారు. అమరావతి ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతుంటే పట్టుమని పది మంది కూడా ఆయన సందేశం చూడలేదు. ఆ చూస్తున్న వారిలో కూడా చాలా మంది మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కామెంట్స్ రూపంలో ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు.

జగన్ అస్త్రాన్నే ప్రయోగిస్తున్న బీజేపీ-పవన్

ఈ సారి టీడీపీ కంచుకోటలోనే జగన్ బాబుకు చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నాడు. కృష్ణా జిల్లాకు టీడీపీ స్థాపకుడు మరియు ఆ పార్టీ మూలపురుషుడు అయిన ఎన్టీఆర్ పేరును ఖరారు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఎన్నికల సమయంలోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ హామీ ఇచ్చి సంచలనం రేపాడు. టీడీపీ కూడా ఎప్పుడూ చేయని ఈ ఆలోచన జగన్ చేయడంతో ప్రత్యర్థులకు షాక్ కొట్టింది. ఐతే జీవనది కృష్ణ పేరుమీద ఏర్పాటైన జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారు. ఐతే అటు ఆ వర్గం నుండి వ్యతిరేకత రాకుండా…ఇటు టీడీపీకి ఝలక్ ఇచ్చేలా జగన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.

జగన్ కు మరో లేఖాస్రం సంధించిన ఎంపీ రాజు..!

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దీనిపై అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జగన్ త్వరలో 26 జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయనున్నాడు. దీనితో కృష్ణా జిల్లా నుండి మచిలీపట్నం వేదికగా మరో జిల్లా ఏర్పడనుంది. కొత్తగా ఏర్పడే ఆ జిల్లాకు జగన్ ఎన్టీఆర్ పేరు పెట్టే ఆలోచనలో ఉన్నారు. మరి అదే కనుక జరిగితే టీడీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చినట్లే. మూడు రాజధానుల వలన ఏర్పడిన అసంతృప్తి నుండి జగన్ ఈ విధంగా బయటపడే అవకాశం ఉంది. తమ పార్టీ వ్యవస్థాపకుడికి జగన్ ఇచ్చిన గౌరవం 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఇవ్వలేకపోయారని టీడీపీ వర్గాలలోనే బాబు అబాసుపాలు కావడం ఖాయం.

జగన్ కు మరో లేఖాస్రం సంధించిన ఎంపీ రాజు..!

Raghu ramakrishnam raju

Raghu ramakrishnam raju

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ లోక్ సభ స్పీకర్ ఓమ్ ప్రకాష్ బిర్లాకు ఫిర్యాదు చేసినా ఆయన మాత్రం తన తీరు ఏ మాత్రం మార్చుకోలేదు. ఇప్పుడు ఇంకా తీవ్రత పెంచినట్లుగా కనిపిస్తుంది. పింఛన్ల అంశంపై నేరుగా సీఎం జగన్ కు లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. తాజా లేఖలో సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని గడువు దాటినా నెరవేర్చక పోవడంపై ప్రశ్నించారు. ఎన్నికల ముందు పలు బహిరంగ సభల్లో పింఛన్ల విషయంలో సీఎం ఇచ్చిన హామీలను లేఖలో ప్రస్తావించారు.

పింఛన్ల లబ్ధిదారులకు ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ, నాలుగేళ్లలో నెలకు రూ. 3 వేలను అందజేస్తామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయినా ఇంకా పింఛను మొత్తాన్ని నెలకు రూ.250 పెంచి రూ.2,500 చెల్లించక పోవడంపై విమర్శలు గుప్పించారు. వృద్ధాప్య పింఛను పొందేందుకు వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని ప్రభుత్వం జీఓ 103ను 2019 మే 30వ తేదీన విడుదల చేసి 2019 జూలై నుంచి వయోపరిమితి తగ్గింపు అమలు చేస్తామని ప్రకటించారని, వాస్తవంగా ఫిబ్రవరి నుంచి మాత్రమే అమలు చేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో అవ్వా తాతలు రూ.15,700 నష్టపోయారని తెలిపారు.

ఇంత కాలం మీడియాకు మాత్రమే వివారాలు వెల్లడించడం, మీడియా ముందు మాత్రమే విమర్శలకు దిగిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు సీఎంకు లేఖ రాసి మీడియాకు విడుదల చేయడం అంశాన్ని బట్టి చూస్తే పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం విమర్శలు వేగం మరింత పెంచినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చట్ట పరంగా ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతున్న ఎంపీ రాజు తనపై అనర్హత వేటు పడే అవకాశం లేదని ధీమాతో ఉన్నారు.

మరోవైపు పార్టీని ఎన్నికల సంఘం ముందు చట్టపరంగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో మొత్తంగా ఎంపీ రాజు హైలెట్ అవుతూ వైసీపీ పార్టీని, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఎంపీ లేఖకు సీఎం జగన్ స్పందించలేదు, ఇప్పుడు రాసిన లేఖకైనా స్పందిస్తారో.. లేదో వేచిచూడాల్సిందే.

జగన్ అస్త్రాన్నే ప్రయోగిస్తున్న బీజేపీ-పవన్

పాదయాత్ర.. తెలుగునేలపై పవర్ ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు..  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్.. అంతా ఒకేబాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు.ఇప్పుడు జగన్ పాదయాత్రతో కొల్లగొట్టిన అధికారాన్ని అదే అస్త్రంతో చేజిక్కించుకోవాలని కేంద్రంలోని బీజేపీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాన్ డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ మేరకు ఏపీ రాజకీయాలను షేక్ చేసే ప్లాన్ తో రెడీ అవుతున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.టీడీపీ కుదేలైంది. వైసీపీ కొట్టిన దెబ్బకు కోలుకోవడం లేదు. మరోవైపు ప్రత్యర్థులంతా కాచుకు కూర్చున్నారు. బీజేపీ అయితే చంద్రబాబును నిర్వీర్యం చేసి టీడీపీని హైజాక్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలను లాగేసింది. పార్టీ మారిన వారంతా టీడీపీ పుట్టి మునగడానికి లోకేష్ కారణమంటున్నారు.  లోకేష్ పై నమ్మకం లేదని.. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కొందరంటున్నారు. ఇక టీడీపీ గడ్డు పరిస్థితుల్లో ఉందని.. బాలక్రిష్ణ సినిమాలు వదిలి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలని తెలుగుతమ్ముళ్లు కొంతమంది కోరుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో ఉన్న అనిశ్చితిని క్యాష్ చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్టు సమాచారం. 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో బలంగా లేని జనసేనాని బీజేపీతో పొత్తుతో ఆలోటును భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు.

జనసేన ఒంటరిగా గెలవడం జనసేనాని పవన్ తో సాధ్యం కాదని తేలిపోయింది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం.. వాటి నుంచి దూరంగా వెళ్లడం జనసేనకు అలవాటైపోయింది. పవన్ పార్టీ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది.

అయితే ఏపీలో అధికారాన్ని సాధించడానికి పవర్ ఫుల్ మంత్రాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని సమాచారం. కేంద్రంలో బీజేపీ అండ ఉండడంతో చెలరేగిపోవడానికి పవన్ కూడా రెడీ అవుతున్నాడట.. పవన్ ను ముందు పెట్టి ఆయన ఇమేజ్ తో రాజకీయం నడపడానికి బీజేపీ రెడీ కాబోతోందట..

తెలుగునాట చరిత్ర చూస్తే.. పాదయాత్ర చేసిన ఏ నాయకుడైనా కానీ అధికారంలోకి రాకమానలేదు. ప్రజల్లోకి వెళ్లి నిజాయితీగా కలిసిపోయి వారి కష్టాలు తెలుసుకున్న నాయకులు వారి విశ్వాసాన్ని పొంది రాజకీయ అధికారం సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా బీజేపీ ప్రజల్లోకి పంపబోతోంది.

2022 నుంచి పాదయాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభించి, 2024 ఎన్నికల వరకు కొనసాగించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎలాగూ 15రోజులు, నెలకోసారి విరామం ఇస్తూనే ఉంటారు. అందుకే రెండేళ్లు కాలపరిమితిని పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు చేరువ కావడం.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతమే లక్ష్యంగా పవన్-బీజేపీ ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం. మరి ఈ పవర్ ఫుల్ పాదయాత్ర పవన్ కళ్యాణ్ ను అధికారంలోకి తెస్తుందా? బీజేపీ ఆశలు ఫలిస్తాయా? అన్నది వేచిచూడాలి.

-ఎన్నం

వైసీపీ నేత హత్య కేసులో విస్తుపోయే నిజాలు..!

Moka-Bhaskar-kollu-ravindra
Moka-Bhaskar-kollu-ravindra
వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ హత్యతో కొల్లు రవీంద్రకు ప్రమేయం ఉన్నట్లు తేలిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. మోకా హత్యకు చింతా నాంచారయ్య, రవీంద్ర కలిసి పథక రచన చేశారని.. దానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు కూడా ఉన్నాయని ఎస్ పి పేర్కొనడంతో, ఈ కేసులో కొల్లు రవీంద్ర పూర్తిగా ఇరుక్కుపోయారని తెలుస్తుంది.
ఇక ఈ హత్య గురించి కొన్ని సంచలన విషయాలు జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా బయటపెట్టారు.  మోకా హ్యతకు 20రోజుల ముందు కొల్లు రవీంద్రను చింతా నాంచారయ్య కలిశాడు. రాజకీయంగా ఎదుగుతున్న మోకా భాస్కర రావును అంతం చేయకపోతే తన మనుగడ కష్టం అని కొల్లు రవీంద్రతో చింతా నాంచారయ్య చెప్పగా…ఇది సమయం కాదు, కొన్నాళ్ళు ఆగాలని, కొల్లు రవీంద్ర సూచించారట. ఐతే ఇంతలోనే ఓ విషయమై మోకా భాస్కర్ రావుకు, చింతా నాంచారయ్యకు మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. దీనితో నాంచారయ్య కొల్లు రవీంద్రను కలిసి భాస్కర రావుని వెంటనే అంతం చేయాల్సిందే అని ప్రతిపాదన పెట్టారట.
దీనికి కొల్లు సరే కానీ… నా పేరు బయటికి రాకుండా చూడండి అని చెప్పారట. హత్య తరువాత కూడా మోకా భాస్కర్ రావు కథ ముగిసిందని కొల్లు రవీంద్రకు నాంచారయ్య ఫోన్ చేసి చెప్పారట. దానికి కొల్లు నాకు ఇకపై ఫోన్ చేయవద్దని…ఏదైనా మాట్లాడాలి అనుకుంటే తన పి ఏ కు కాల్ చేయాలని సూచించడడంతో పాటు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారట. హత్య అనంతరం కూడా కొల్లు అనుచరులతో పాటు, పీఏతో  నాంచారయ్య పలు మార్లు మాట్లాడినట్లు ఆధారాలున్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఈ విధంగా సినీ పక్కీలో భాస్కర రావు హత్యకు భారీ కుట్ర పన్ని అమలు జరిపినట్టు  ఆయన తెలియజేశారు.

ప్రత్యర్థులను పొగిడేస్తున్న బాబు, పవన్…!

Pawan-Kalyan-YS-Jagan-Chandrababu-Naidu-Modi
Pawan-Kalyan-YS-Jagan-Chandrababu-Naidu-Modi
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అవసరాలను బట్టి మారిపోయే రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు, నేతల మాటలకు ఈ సూత్రం చక్కగా సరిపోతుంది. టీడీపీ కాంగ్రెస్ తో జోడి కడుతుందని ఎవరైనా అనుకున్నారా? ఎన్నడూ జరగదనుకున్న ఆ పరిణామం, బాబు గత ఎన్నికలలో సాకారం చేశారు. కాబట్టి రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు, ఎవరు ఎవరికైనా మిత్రులు కావచ్చు. ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలలో ఇలాంటి పరిస్థితే నెలకొంది . రెండు ప్రధాన పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్ ప్రత్యర్థులను పొగిడేస్తున్నారు. చంద్రబాబు మోడీని భేష్ అంటుంటే, పవన్ జగన్ కి కితాబు ఇస్తున్నాడు. ఈ పరిణామం ఆంధ్ర రాజకీయాలలో సరికొత్త సమీకరణాలకు దారి తీస్తోందా అనే అనుమానం రేపుతోంది.
అమరావతి ఉద్యమం 200రోజులు పూర్తి చేసుకున్న సంధర్భంగా బాబు ఓ సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగం మొత్తం ఆంధ్రాలో జగన్ అరాచక పాలన చేస్తున్నాడు, జరుగుతున్న అరా కొరా సంక్షేమం మోడీ చలవే అన్నట్లు సాగింది. ఇకప్పుడు ‘భార్యను వదిలేసిన మోడీకి, బంధాల విలువ ఏమి తెలుస్తుందని’ దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేసిన బాబు, ఏపీలో విధ్యుత్ ధరల గురించి ప్రశ్నించిన నిర్మలా సీతారామన్ ని వైసీపీ వాళ్ళు వ్యక్తి గత విమర్శలు చేశారని వాపోవడం ప్రజలకు వింతగా తోచింది. అమరావతి జాతీయ ప్రాజెక్ట్, సంపద చేకూర్చే కల్పతరువన్న బాబు, మోడీనే కాపాడాలని వేడుకున్నాడు. పరోక్షంగా మోడీ వలన ఆంధ్రాకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొనియాడాడు. 2019 ఎన్నికల ముందు మోడీపై బాబు చేసిన వ్యాఖ్యలు గుర్తున్న ఎవరికైనా, ఆయన తాజా మాటలు ఆశ్చర్యం కలిగించక మానవు.
మరో వైపు జగన్ అంటే కస్సున లేచే పవన్ అంబులెన్సు సర్వీసుల పునరుద్ధరణ విషయంలో మెచ్చుకోవడం మరో సంచలన రాజకీయ పరిణామంగా మారింది. బీజేపీతో మిత్రుడిగా ఉన్న పవన్ సీఎం జగన్ ని మెచ్చుకోగా, ఆ ప్రాజెక్ట్ కి అవినీతి మరక అంటించడంతో పాటు, కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే అని బాబు కొట్టిపారేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బాబు బీజేపీ కి దగ్గరవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని అర్థం అవుతుంది. దానికి కారణం జగన్ దూకుడికి అడ్డుకట్ట వేయడం కోసమే. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ నాయకుల వరుస అరెస్ట్ ల నేపథ్యంలో ఎంత త్వరగా బీజేపీ పంచన చేరితే అంత మంచిది అనేది ఆయన ఆలోచన. ఐతే పవన్ సీఎం జగన్ ని పొగడడం అనేది ఇక్కడ ఆసక్తి గొలిపే అంశం. బాబు మోడీని పొగడడం వెనుక కారణాలు, ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తుండగా, పవన్ కి జగన్ ని పొగడడం వలన చేకూరే ప్రయాజనం ఏమి లేదు. ఈనేపథ్యంలో జగన్ కి అనుకూలంగా పవన్ ఎందుకు స్పందించాడనే సందేహం తలెత్తుంది. అలాగే భవిష్యత్తులో కొత్త పొత్తులతో, నయా రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందనిపిస్తుంది.