Home Blog Page 8423

కరోనా దెబ్బకు ఏడాది ఆలస్యంగా అజయ్ దేవగణ్‌ మూవీ


సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పటికే షూటింగ్‌లు ఆగిపోగా.. థియేటర్లు మూత పడడంతో సినిమాల రిలీజ్‌ల విషయంలో నిర్మాతలు ఆందోళన చెందుతుందున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే బాలీవుడ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫైనాన్స్‌ ఇబ్బందులు తప్పించుకునేందుకు ఓటీటీల బాట పడుతున్నారు. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘లక్ష్మీబాంబ్‌’, అజయ్‌ దేవగణ్‌ ‘భుజ్‌ ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’తో పాటు మరో ఐదు బాలీవుడ్‌ చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న మరికొన్ని సినిమాలు రిలీజ్‌ డేట్స్‌ వెనక్కివెళ్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న ‘మైదాన్‌’ చిత్రం ఏకంగా ఏడాదికి వెనక్కి వెళ్లింది.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్, హైదరాబాదీ సయ్యద్‌ అబ్దుల్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘బదాయి హో’ మూవీతో నేషనల్‌ అవార్డును అందుకున్న అమిత్‌ రవీందర్‌నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మాత. అక్షయ్‌ సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 1952 నుంచి 1962 మధ్య కాలంలో ఫుట్‌బాల్‌లో ప్రపంచ దేశాలపై భారత్ అద్భుత ఆధిపత్యం చెలాయించింది. ఆ టైమ్‌లో నేషనల్‌ టీమ్‌కు అబ్ధుల్ ర‌హీం కోచ్‌గా, మేనేజర్గా వ్యవహరించారు. ఆయన భారత జట్టును తీర్చిదిద్దిన విధానం, అప్పటి పరిస్థితులు, రహీం జీవితం ఎలా ఉండేదన్న ఇతివృత్తమే ఈ చిత్ర కథాంశం. కొద్ది రోజుల క్రిత్రం అజ‌య్ దేవ‌గ‌ణ్ ఫస్ట్‌ లుక్‌ని విడుద‌ల చేశారు. లాక్‌డౌన్ ముందు వరకూ చిత్రీకరణ జరిగిన ఈ మూవీని తొలుత ఈ ఏడాది న‌వంబ‌ర్ 27న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, కరోనా కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్‌ పడడంతో చిత్రాన్ని ఏకంగా వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం పేర్కొంది. 2021 ఆగ‌స్ట్ 13వ తేదీన ‘మైదాన్‌’ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

మోడీ స్పీచ్ అసదుద్దీన్ కి ఇలా అర్థమైందా?

శుక్రవారం ప్రధాని మోడీ లడక్ లో పర్యటించి చైనా పేరు ప్రస్తావించకుండానే ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మోడీ స్పీచ్, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కి మరోలా అర్థమైంది. చైనా పేరును మోడీ ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నింస్తున్నారు. ఆ దేశం పేరును ప్రస్తావించడానికి మోడీ వెనుకాడుతున్నారంటూ నిలదీశారు.

ఈ మేరకు ఒవైసీ వరుస ట్వీట్లు చేశారు. ‘ప్రధాని గారూ…మీరు మన సైనికులకు, గాయపడిన జవాన్లకు కలుసుకోవడం మంచిదే. వారితో మాట్లాడటంతో వారి నైతిక స్థైర్యం కూడా తప్పనిసరిగా  పెరుగుతుంది’ అని ఒవైసీ పేర్కొన్నారు. ‘మన దేశంలోకి ఎవరూ ప్రవేశించలేదు…ఎవరూ లేరు’… అంటూ మోదీ ఇటీవల అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన క్లిప్‌ ను కూడా ట్వీట్‌ కు జోడించారు. మోదీ లడక్‌ పర్యటనతో దేశంలోకి శత్రువు చొరబడ్డాడనే విషయం నిరూపితమవుతోందని, చైనా పేరెత్తడానికి మోడీ ఎందుకు వెనుకాడుతున్నారని ఒవైసీ మరో ట్వీట్‌ లో ప్రశ్నించారు. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే మన దగ్గరున్న నిల్వలు 12 రోజులు మత్రమే సరిపోతాయనే విషయం ‘చౌకీదార్‌’కు తెలుసా అని ప్రశ్నించారు.

‘గల్వాన్ కావచ్చు, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ టీఎస్ఓ, డెప్సంగ్‌ లలో పరిస్థితి సీరియస్‌ గా ఉంది. ఆ కారణంగానే త్వరలో పార్లమెంటు సమావేశాలు జరపాలని కోరుతున్నాను. తద్వారా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని విపక్షాలు ప్రస్తావించడం, భారత భూభాగం ఆక్రమణల గురించి ప్రశ్నించడం జరుగుతుంది’ అని మరో ట్వీట్‌ లో ఒవైసీ పేర్కొన్నారు.

చైతూ సరసన రష్మిక?


అక్కినేని నటవారసుడిగా తెలుగు తెరకు పరిచమైన నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఫస్ట్‌ సినిమా ‘జోష్‌’తోనే మాస్‌ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం అంతగా సక్సెస్‌ కాకపోవడంతో తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథలతో ముందుకెళ్తున్నాడు. ప్రేమ కథా చిత్రాల్లోనే వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో మజిలీతో సూపర్ హిట్‌ ఖాతాలో వేసుకున్న చైతూ… రీసెంట్‌గా మేనమామ వెంకటేశ్‌తో ‘వెంకీ మామ’తోనూ మెప్పించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’తో ముందుకు రాబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. కరోనా ప్రభావం ముగిశాక థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. దీని తర్వాత పరశురాం దర్శకత్వంలో ఈ మూవీని అనౌన్స్‌ చేసిన తర్వాత ఆపై ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో నటించబోతున్నాడు.

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!

ఈ మూవీకి ‘థ్యాంక్యూ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారట. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం రోజూ వార్తల్లో ఉంటోంది. నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా? అని చిత్ర బృందం ఇంకా అన్వేషిస్తూనే ఉందట. ముందు చైతూ భార్య సమంతనే హీరోయిన్‌గా ఎంచుకున్నట్టు ప్రచారం జరిగింది. అంతలోనే ‘మహానటి’ కీర్తి సురేష్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సామ్, కీర్తి ఇద్దరూ కాదంటూ మరో హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు కుర్ర హీరోలు, స్టార్ల సరసన వరుస అవకాశాలు పట్టేస్తున్న రష్మిక మందాన. దక్షిణాదిలో బిజీ హీరోయిన్‌గా మారిన రష్మికకు విక్రమ్‌ స్టోరీ చెప్పేందుకు రెడీ అవుతున్నాడని టాక్‌. వాస్తవానికి ‘థ్యాంక్యూ’ కోసం సమంత పేరును పరిశీలించనేలేదని, ఈ స్టోరీలో ఫీమేల్‌ లీడ్ రోల్‌కు కీర్తి సురేశ్‌ సూటవదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో, ఈ మధ్య ఫుల్ ఫాలోయింగ్‌ దక్కించుకున్న రష్మిక డేట్స్‌ సంపాదించాలని చిత్ర బృందం భావిస్తోందట. ఆమె ఓకే అంటే వెంటనే అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తోందని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

ఫలించిన మోడీ వ్యూహం?

భారత్-చైనా సరిహద్దులో చెరిగిన ఘర్షణ అనంతరం గల్వాన్‌ వ్యాలీలో ప్రధాని మోడీ పర్యటనకు సత్ఫలితాలు వస్తున్నాయి. చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్‌ కు బాసటగా నిలుస్తున్నాయి.

ఈ విషయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘భారత్‌, చైనా సరిహద్దులో చైనా దురాక్రమణ తీరు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఆ దేశ దుందుడుకు వైఖరికి సరిగ్గా సరిపోతుంది. ఈ చర్యలన్నీ చైనా కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయి’’ అని ట్రంప్‌ అన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్న ఆయన సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

‘‘ఘర్షణ ద్వారా ఎలాంటి సమస్యకు పరిష్కారం లభించదు. ఇరు దేశాలు చర్చల ద్వారా సామరస్యకపూర్వక వాతావరణంలో సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకోవాలి’’ అని చెబుతూ చైనా దురుసు వైఖరిని బ్రిటన్‌ విమర్శించింది.

మరోవైపు చైనా విస్తరణకాంక్షను అగ్రరాజ్యానికి చెందిన పలువురు కీలక చట్టసభ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. అలాగే భారత్ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు.

తెలుగు ప్రొడ్యూసర్ ని బలితీసుకున్న కరోనా


తెలంగాణలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులే కాకుండా రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. చాలా మంది ప్రముఖులు కోలుకున్నా.. తాజా ఓ సినీ నిర్మాత ఈ వైరస్‌ను జయించలేకపోయారు. కరోనా బారిన పడ్డ టాలీవుడ్‌ నిర్మాత, ఈతరం ఫిలిమ్స్‌ సమర్పకుడు పోకూరి రామారావు (64) శనివారం ఉదయం కన్నుమూశారు. దాంతో, తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి కరోనా  మరణం నమోదైంది. కొన్ని రోజుల కిందట కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలడంతో రామారావు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా నెగిటివ్‌ అని తేలిందని సమాచారం.

కరోనా విజృంభణ.. హడలిపోతున్న హైదరాబాదీలు

రామారావు.. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావుకు సోదరుడు. ఈ తరం ఫిలిమ్స్‌కు ఆయన సమర్పకుడిగా ఉండేవారు. ‘నేటి భారతం’ ‘వందే మాతరం’, ‘ఎర్ర మందారం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘యజ్ఞం’, ‘రణం’ వంటి సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. కాగా, రామారావు మృతి పట్ల టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మరోవైపు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. ముఖ్యంగా ఈ మధ్య తిరిగి ప్రారంభమైన షూటింగ్స్‌లో పాల్గొంటున్న టీవీ సీరియల్‌ నటులకు వైరస్‌ సోకింది. బిగ్‌బాస్‌ 3 ఫేమ్‌ రవికృష్ణతో పాటు నటి నవ్య స్వామి, రాజశేఖర్, సాక్షి శివకు పాజిటివ్‌ అని తేలింది. ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ కూడా వైరస్‌ బారిన పడ్డా ఆయన కోలుకున్నారు.

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!


సొంత పార్టీలోనే వైరిపక్షంలా ఎంపీ రఘురామరాజు వ్యవహరిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ తరపున రఘురామరాజు పోటీ చేసి గెలుపుపొందాడు. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఎంపీలకు అపాయిట్మెంట్ ఇవ్వడంలేదని.. తాను సొంతబలంతోనే గెలిచానంటూ మీడియాలో చెప్పడంతో ఆయనపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఆయన వ్యాఖ్యలు చిలికిచిలికి గాలివానలా మారడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం యత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే రఘురామరాజు సీఎం జగన్ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో రఘురామరాజు ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు అల్లూరి సీతరామరాజు పేరు పెట్టాలని కోరారు. గత పాదయాత్ర సమయంలోనే సీఎం ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారికంగా జిల్లా పేరును ప్రకటిస్తే ప్రజలు సంతోషిస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీలోనే ఆయనపై వ్యతిరేక వస్తున్న తరుణంలోనే ఆయన నేరుగా సీఎం జగన్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.

మరోవైపు ఎంపీ రఘురామరాజుకు సొంత పార్టీ నేతలపై, ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈమేరకు ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని గడువు ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆయన ఎన్నికల సంఘాన్ని కలిసి వైసీపీలో క్రమశిక్షణ సంఘం ఉందా? అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చాక సమాధానం పంపుతానని చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో క్రమశిక్షణ కమిటీ లేదని స్పష్టం చేశారు. అయితే తనకు పార్టీ నేతలు పంపిన షోకాజ్ సమాధానం కాకుండా రిప్లై ఇస్తున్నట్లు ట్వీస్ట్ ఇచ్చారు.

సీఎం జగన్ కు ముద్రగడ లేఖ.. వెనకున్నదేవరు?

దీంతో ఎంపీ రఘురామ తీరును వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఆయన వ్యవహారం పార్టీకి నష్టం కలిగించేలా ఉండటంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుంది. ఈమేరకు వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి వేటు వేసేలా పావులు కదుపుతున్నారు. ఈ సమయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి రఘురామరాజు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే విధేయుడినని.. మిగతా వారికి కాదని తెలియజేందుకే లేఖ రాశాడనే ప్రచారం జరుగుతోెంది. అయితే రఘురామరాజు లేఖకు సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!

కరోనా తప్పుడు లెక్కలపై రేవంత్ ఫైర్..!


తెలంగాణలో కరోనా లెక్కలు గందగోళంగా మారుతోన్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు.. ప్రభుత్వ ఆరోగ్యశాఖ చెబుతున్న లెక్కలకు ఎక్కడ పొంతన కుదరడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నవేళ కరోనా కేసుల్లో గందరగోళం నెలకొనడంపై పలు అనుమానాలను రెకేత్తిస్తున్నాయి. ఈ విషయంలో విపక్షాలు పదేపదే విమర్శలు చేస్తున్న ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా లెక్కలపై ప్రభుత్వాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టిన విషయాన్ని విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు.

కరోనా విజృంభణ.. హడలిపోతున్న హైదరాబాదీలు

టీఆర్ఎస్ సర్కార్ కరోనాపై కాకిలెక్కలు చెబుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కరోనా కేసుల విషయంలో తప్పుడు లెక్కలు చూపుతుందని ఆరోపించారు. ప్రభుత్వం రోజువారీగా విడుదల చేస్తున్న బులిటెన్ కు, తెలంగాణ ఆరోగ్య శాఖ డ్యాష్ బోర్డులో చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదని పేర్కొన్నారు. గురువారం వరకు రాష్ట్రంలో 18,570 పాజిటివ్ కేసులుండగా తెలంగాణ ఆరోగ్య శాఖ డాష్ బోర్డులో ఆ సంఖ్య 21,393గా ఉందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కరోనా లెక్కలు ఎందుకు దాస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

తెలంగాణలో కేసులు సంఖ్యను ప్రభుత్వం కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలను రేవంత్ ఆయన ట్వీటర్లో ట్వీట్ చేశారు. మీడియాలో విడుదల చేసిన బులిటెన్ కు.. డాష్ బోర్డులో కన్పిస్తున్న లెక్కలకు 3వేల తేడా ఉందన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడి చేయకుండా లెక్కలు తక్కువ చేసి చూపడం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనమో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కరోనా కట్టడి విషయంలో చెబుతున్న మాటలకు ఆచరణలో ఎక్కడ పొంతన లేకుండా పోతుందని విమర్శించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు మరింత పెరగక ముందే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కరోనా మహమ్మరి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 1,892 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం.

దేవుడా: అటు ప్రభుత్వం చేయదు.. ఇటు ప్రైవేటు దోపిడీ


విద్యా, వైద్యం.. ఇలాంటి కీలకాంశాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటే జనాలకు మేలు. అందుకే సీఎం కేసీఆర్ మొదట కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ ప్రైవేటు ఆస్పత్రులకు ఇవ్వనన్నాడు. కేసులు పెరగడం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులకు పాకడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుకు అప్పగించేశారు.

కరోనా విజృంభణ.. హడలిపోతున్న హైదరాబాదీలు

కేసీఆర్ పర్మిషన్ ఇవ్వడం.. కరోనా టెస్టుకు ఇంత..చికిత్సకు ఇంత అని డిసైడ్ చేయడం కూడా జరిగిపోయింది.. కానీ తెలంగాణలో ‘ప్రైవేటు’ ల్యాబ్ లు.. ప్రైవేటు ఆస్పత్రులు దందా మొదలుపెట్టాయి. చికిత్సకు 10 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక కరోనా టెస్టులకు 2200 ఎవరూ తీసుకోవడం లేదు. అంతకుమించి వసూలు చేస్తున్నారు.

అయితే ప్రభుత్వ వైద్యం, చికిత్స అంత బాగా లేకపోవడం.. కేసులు పెరగడంతో ఆస్తులు అమ్మి అయినా అందరూ ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్ లకే వెళుతున్నారు. ప్రజల ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరూ వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే దగ్గువచ్చినా.. తుమ్ము వచ్చినా వెంటనే టెస్టులు చేయించుకుంటున్నారు.. ప్రజల భయాన్ని మరింత క్యాష్ చేసుకోవాలనుకున్నారో ఏమో కానీ.. ఆ ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తే ఏకంగా కరోనా కేసులు కుప్పలుగా నమోదవుతున్నాయి. ఏం చేస్తున్నారో.? ఎలా చేస్తున్నారో తెలియదు కానీ.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ లో తాజాగా పాజిటివ్ కేసులు కుప్పలుగా నమోదుకావడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

తాజాగా ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ లో 3726 శాంపుల్స్ ను టెస్ట్ చేయగా.. అందులో 2672 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఆ ఒక్క ల్యాబ్ లోనే పాజిటివిటీ ఏకంగా 71.7శాతంగా నమోదు కావడం గమనార్హం.దీంతో ఆ ల్యాబ్ లో సరిగ్గా చేస్తున్నారా? పైసల కోసం కార్పొరేట్ ఆస్పత్రులతో మిలాఖత్ అయ్యి ఇలా రిపోర్టులు ఇస్తున్నారో నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వెంటనే పరిశీలించి ఆ ల్యాబ్ ను మూసివేయడంతోపాటు ఆ శాంపుల్స్ ను తిరిగి పరిశీలిస్తోంది.

ఇప్పుడు తెలంగాణలో కరోనా కేసులు పెరగడం వెనుక కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు చేయకపోవడం ఒక కారణం కాగా.. ప్రైవేటు ల్యాబులు, ఆస్పత్రులు దోచుకోవడంలో భాగంగా కూడా ఇలా పాజిటివ్ లను పెద్ద ఎత్తున నమోదు చేస్తున్నాయి. ఈ రెండు కారణాల వల్ల తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. అటు ప్రభుత్వం చేయదు.. ఇటు ప్రైవేటు దోపిడీతో కునారిల్లిపోతున్నారు.

-ఎన్నం

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!


రాజకీయాలలో పవన్-జగన్…ఉప్పు-నిప్పు తీరు. జగన్ కి ప్రతిపక్షానికి మించిన ప్రధాన ప్రత్యర్థిగా పవన్ ఉన్నారు. టీడీపీ బీజేపీ కూటమిలో ఉన్నప్పటి నుండి పవన్ టార్గెట్ జగన్ మాత్రమే. అందుకే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా..పవన్ విమర్శల దాడి జగన్ పైనే ఉండేది. ఇక 2019 ఎన్నిలలో గెలిచి జగన్ సీఎం కాగా, అనేక సంధర్భాలలో పవన్ 151 మంది ఎమ్మెల్యేలతో మీరు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ తీరును ప్రశ్నించిన పవన్ ఇక ఆయన అధికారంలో ఉంటే ఊరుకుంటాడా? బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలతో పవన్ విభేదించారు.

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానులు నిర్ణయాలను పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా కాపు నేస్తం పథకం,కాపు రిజర్వేషన్ లు పక్కదారి పట్టించడానికి జగన్ పన్నిన వ్యూహం అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతి పథకాన్ని వ్యతిరేకించిన పవన్ 108, 104 అంబులెన్స్ వాహనాల ప్రారంభ కార్యక్రమాన్ని అభినందించారు. కరోనా కష్ట కాలంలో ఏపీ ప్రభుత్వ పని తీరును ఆయన కొనియాడారు. అత్యవసర పరిస్థితులలో అంబులెన్సు సర్వీసుల ప్రారంభించడం అభినందనీయం అన్నారు. మొదటిసారి జగన్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించి పవన్ రాజకీయ వర్గాలను, తన జనసేన సైనికులను విస్మయానికి గురిచేశారు.

జగన్ ని సడన్ గా పొగడడం వెనుక పవన్ వ్యూహం ఏంటని ఆలోచిస్తే…ఇది ఆయన ఇమేజ్ ని పెంచే అంశమే అని అర్థం అవుతుంది. జగన్ నిర్ణయాలను ఎప్పుడూ వ్యతిరేకించే పవన్ అంబులెన్సుల విషయంలో పొగడడం వలన ఆయన మంచిని, చెడుని విభజించి చూస్తాడని… చెప్పే ప్రయత్నం చేశారు. తనది విలువలతో కూడిన విమర్శ అని…మంచి చేస్తే ఎవరినైనా అభినందిస్తామని, చేడు చేస్తే వ్యతిరేకిస్తామని ప్రజలలో అభిప్రాయం కలిగేలా చేశారు. దీని వలన భవిష్యత్ లో జగన్ ప్రభుత్వంపై ఆయన చేసే విమర్శలకు విలువ చేకూరుతుంది అనేది పవన్ నిర్ణయం కావచ్చు. కావున ఇక్కడ పొగిడి జగన్ ఇమేజ్ పెంచినా, తన విమర్శలకు విలువ పెంచుకున్నాడు పవన్. కాబట్టి పవన్ కూడా రాజకీయాలలో రాటు తేలుతున్నాడని చెప్పుకోవచ్చు.

12 గంటలకు భయపెడుతున్న ఆర్జీవీ


కరోనా టైమ్‌లో థియేటర్లు మూతపడి, షూటింగ్స్‌ ఆగిపోయి దేశ వ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలు ఇక్కట్లు పడుతుంటే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం ఫుల్‌ బిజీగా మారాడు. గంటలు, రోజుల వ్యవధిలో సినిమాలు పూర్తి చేయడమే కాకుండా.. డిజిటల్‌ మార్కెట్‌ ద్వారా వాటిని రిలీజ్‌ చేసి తెగ సంపాదిస్తున్నాడు. కరోనా టైంలో అందరూ ఇళ్లలో ఉంటే తాను మాత్రం డైరెక్టర్, ప్రొడ్యూసర్ వరుసగా మూవీలు తీస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. సోషల్‌ మీడియాను తనదైన రీతిలో వాడేసుకుంటూ పైసా ఖర్చు లేకుండా తన మూవీస్‌కు ప్రమోషన్‌ కల్పిస్తున్నాడు. మూవీ అనౌన్స్‌మెంట్స్‌, ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌, ట్రైలర్స్‌ అంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్యే ‘క్లైమాక్స్‌’, ‘నగ్నం’ సినిమాలను తన ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్లో విడుదల చేశాడు వర్మ. ఇప్పటికే కరోనాపై మూవీ తీస్తున్నాడు. అమృత, ప్రణయ్‌ల ప్రేమ కథ ఆధారంగా ‘మర్డర్’, ‘పవర్ స్టార్’ టైటిల్‌తో మరో మూవీని అనౌన్స్‌ చేశాడు. ఇప్పుడు స్వయంగా మెగాఫోన్‌ పట్టిన రాము మళ్లీ తన పాత జానర్లోకి వెళ్లాడు. పూర్తి స్తాయి హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

జగన్ ను విమర్శించాలన్న.. పొగాడాలన్న.. అతడేనా?

కంపెనీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘12 ఓ క్లాక్‌’.ఈ మూవీ ట్రైలర్ను వర్మ ఎప్పట్లాగే యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశాడు. ఒకప్పుడు హారర్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచి రాత్రి, దెయ్యం, భూత్‌ వంటి సినిమాలను తీసిన వర్మ ఈ మూవీతో కూడా ప్రేక్షకులను భయపెట్టబోతున్నాడు. 1 నిమిషం 47 సెకన్ల నిడివి గల ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్‌లోనూ తన మార్కు చూపించాడు. సైన్స్‌కు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా అనే అంశాన్ని ముడిపెడుతూ డైలాగే లేకుండా కేవలం హావభావాలతోనే అందరినీ భయపెట్టాడు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ డైరెక్టర్ కావడం మరో ప్లస్‌ పాయింట్‌. వర్మ మార్కు కెమెరా ట్రిక్స్‌కు, కీరవాణి బ్యాగ్రౌండ్‌ స్కోరు తోడవడంతో ప్రతీ సీన్‌ హార్ట్‌బీట్‌ పెంచేలా ఉంది. ఈ చిత్రంలో ‘దండుపాళ్యం’ ఫేమ్‌ మకర్‌దేశ్‌ పాండే, మిథున్‌ చక్రవర్తి, ఆశిష్‌ విద్యార్థి, దిలీప్‌ తాహిల్‌, మానవ్‌ కౌల్‌ ‌ తదితరులు నటించారు.

కరోనా విజృంభణ.. హడలిపోతున్న హైదరాబాదీలు


తెలంగాణలో కరోనా మహమ్మరి చాపకింద నీరులా విజృంభిస్తోంది. లాక్డౌన్లో ఒక్క కేసు కూడా లేని జిల్లాల్లో సైతం భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన రెకేత్తిస్తోంది. ఆన్ లాక్ 2.0లో రికార్డు స్థాయిలో కేసులు పెరిగిపోతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న ఆచరణలో సాధ్యంకావడం లేదని వాదనలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

జగన్ ను విమర్శించాలన్న.. పొగాడాలన్న.. అతడేనా?

తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం తెల్సిందే. దీనిని బట్టి రాష్ట్రంలో కరోనా ఏవిధంగా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.లాక్డౌన్ సడలింపులకు ముందుగా రాష్ట్రంలో కరోనా కొంతమేర కట్టడిలోనే ఉంది. లాక్డౌన్లో ప్రభుత్వం కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు భారీగా సడలింపులు ఇచ్చింది. దీంతో కరోనా వ్యాపించేందుకు అవకాశం దొరికింది. ప్రస్తుతం ఉన్న ఆన్ లాక్ 2.0లో కేసులు రోజుకు వేలల్లో నమోదవుతూ ఉన్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ ప్రాంతం ప్రమాదకర స్థితిలోకి వెళ్లిందనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.

ఇప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయంతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పోలీస్, వైద్య, పారిశుధ్య కార్మికులు కరోనా బారినపడి మృతిచెందుతోన్నారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతోన్నారు. అయినప్పటికీ కరోనా మహమ్మరి ఎవరి నుంచి ఎలా వస్తుందోనని భయాందోళన ప్రతీఒక్కరిలో నెలకొంది. గడిచిన మూడురోజులుగా తెలంగాణలో వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 1,892 కేసులు నమోదుయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం.

సీఎం జగన్ కు ముద్రగడ లేఖ.. వెనకున్నదేవరు?

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందనే నగరవాసులు విమర్శిస్తున్నారు. దీంతో నగరంలోని పలు వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛంధంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపారులు మూసివేయడం వల్ల తమకు నష్టం జరిగినా వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాల నేతలు ప్రకటించారు. వీరి బాటలోనే నగరంలోని పలు వ్యాపార సంఘాలు నడుస్తున్నాయి. దీంతో ప్రభుత్వమే సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆవిధమైన ఆలోచన చేసినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో కేసులు సంఖ్య ఇంత వేగంగా పెరుగుతున్న ప్రభుత్వం మాత్రం నెపాన్ని ప్రజలపై, కరోనా టెస్టులు చేసే ప్రైవేట్ ల్యాబులపై నెట్టివేయడం శోచనీయంగా మారింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మరణాల సంఖ్య ఆ స్థాయిలో లేకపోవడం తెలంగాణవాసులకు కొద్దిగా ఊరటనిచ్చే అంశంగా కన్పిస్తుంది. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.

‘బుట్టబొమ్మా’ మరో రికార్డు కొట్టెనమ్మా


ఇంటర్నెట్‌ వినియోగం, సోషల్‌ మీడియా హవా పెరిగిన తర్వాత సినిమాల పరిధి, మార్కెట్‌ కూడా విస్తృతమైంది. మంచి సినిమాలకు, మంచి పాటలకు ప్రపంచమంతటా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్‌ వీడియోలు, సినిమా సాంగ్స్‌ విషయంలో భాషతో సంబంధం లేకుండా క్రేజ్‌ లభిస్తోంది. ఆ మధ్య ధనుష్ పాడిన ‘కొలవెరి’ ప్రపంచాన్ని ఊపేసింది. ఇప్పుడు టాలీవుడ్‌ స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్.. ‘అల వైంకుఠపురములో’ మూవీలోని ‘బుట్ట బొమ్మ’ సాంగ్‌ కూడా ఒక ఊపు ఊపేస్తోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన అద్భుత సాహిత్యానికి మ్యూజిక్‌ డైరెక్టర్ థ‌మ‌న్ అదిరిపోయే బాణీలు అందించాడు. అర్మాన్‌ మాలిక్‌ హృద్యంగా పాడగా.. కొరియోగ్రాఫర్ జానీ క్లాసిక్‌ నృత్యరీతులు సమకూర్చాడు. బన్నీ, పూజా హెగ్డే కూడా పాటలో లీనమైపోయి నర్తించిన ఈ సాంగ్‌ యూత్‌నే కాదు అన్ని వయసుల వారినీ కట్టి పడేసింది.

సీఎం జగన్ కు ముద్రగడ లేఖ.. వెనకున్నదేవరు?

సినిమా రిలీజ్‌కు ముందే లిరికల్ సాంగ్‌ సూపర్ హిట్‌ అవగా.. సినిమా వచ్చి పూర్తి వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో ఉంచాక ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. బన్నీ, పూజా చేసిన సిగ్నేచర్ స్టెప్స్‌ను చిన్నారులు, యువతే కాకుండా పలువురు సెలెబ్రిటీలు సైతం ట్రై చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్ దంపతులు సైతం బుట్టబొమ్మ స్టెప్పులేయడంతో ఈ పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. దాంతో, ఈ సాంగ్‌ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి 25న ఈ సాంగ్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ వచ్చిన తెలుగు సాంగ్‌గా రికార్డు సృష్టించింది. తాజాగా బుట్టబొమ్మ వ్యూస్‌ సంఖ్య 250 మిలియన్ల మార్కును చేరుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ ప్లేస్‌ సాధించి మరో రికార్డు సాధించింది. ఏదేమైనా ‘అల వైకుంఠపురములో’ రిలీజై చాలా రోజులు గడిచినా.. అభిమానులు బుట్టబుమ్మను మాత్రం మరిచిపోవడం లేదు. ఈ సాంగ్‌ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

థియేటర్లోనే మెగా హీరో ‘ఉప్పెన’!


మెగా కాంపౌండ్‌ నుంచి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న మరో హీరో పంజా వైష్ణవ్‌ తేజ్. సాయి ధరమ్‌ తేజ్‌కు అతను సొంత తమ్ముడు. అతను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్. బుచ్చిబాబు సాన దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ స్టార్ ఓ కీలక రోల్‌ పోషిస్తున్న ఈ మూవీకి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ ‘నీకల్లు నీలి సముద్రం’ సూపర్ హిట్టయింది. మార్చి 1వ తేదీన విడుదలైన ఈ సాంగ్‌ ఇప్పటికీ ట్రెండ్‌ అవుతోంది. యూట్యూబ్‌లో ఇప్పటికే 80 మిలియన్ల పైచిలుకు వ్యూస్‌ వచ్చాయి. వైష్ణవ్‌, కృతి లుక్‌ కూడా బాగుండడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.

జగన్ ను విమర్శించాలన్న.. పొగాడాలన్న.. అతడేనా?

అంతా బాగానే ఉన్నా ఈ మూవీ రిలీజ్‌ విషయంలోనే చిత్రబృందం ముందడుగు వేయలేకపోతోందట. కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడడం.. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియకపోవడడంతో టాలీవుడ్ సినిమాలు ఓటీటీల బాట పట్టాయి. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ సైతం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ‘ భానుమతి అండ్ రామకృష్ణ’, ‘47 డేస్’ తదితర సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ కూడా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ మూవీని థియేటర్ లో మాత్రమే విడుదల చేయాలని చిత్ర బృందం తుది నిర్ణయానికి వచ్చిందట. కొత్త నటులతో చేసినప్పటికీ ఈ మూవీకి దాదాపు 20 కోట్లు ఖర్చు చేశారు. పైగా మెగా కాంపౌండ్‌ నుంచి అరంగేట్రం చేస్తున్న హీరో వైష్ణవ్‌కు తగిన గుర్తింపు రావాలంటే థియేటర్ అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట. అందువల్ల థియేటర్ల ఓపెనింగ్‌పై స్పష్టత వచ్చేదాకా వేచి చూడడమే ఉత్తమమని చిత్ర యూనిట్‌ నిర్ణయానికి వచ్చిందట. ఈ లెక్కన మెగా హీరో థియేటర్లోనే ఉప్పెన సృష్టిస్తాడన్నమాట.

మరో ఇద్దరు టీవీ నటులకు కరోనా!


మహమ్మారి కరోనా బుల్లితెర నటులను వెంటాడుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా మరో ఇద్దరు సీరియల్‌ నటులకు కూడా ఈ మహమ్మారి సోకినట్టు తేలింది. అందులో ఒకరు బిగ్‌బాస్‌ 3 ఫేమ్‌ రవికృష్ణ కావడం గమనార్హం. టీవీ నటుడు సాక్షి శివకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్3తో పాపుల‌ర్ అయిన ర‌వికృష్ణ స్వయంగా వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌న‌కి కరోనా సోకింద‌ని తెలిపాడు. అయినా తనకు ఎలాంటి లక్షణాలు లేవన్నాడు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని స్పష్టం చేశాడు. అయితే, తనతో కలిసి పని చేసిన వారిని జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థించాడు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్‌లో ఉంచాలని ఆయా సీరియల్‌ బృందాలను కోరాడు.

జగన్ ను విమర్శించాలన్న.. పొగాడాలన్న.. అతడేనా?

మరోవైపు అక్క మొగుడు, నెంబర్‌ 1 కోడలు, మౌనరాగం వంటి సీరియల్స్‌లో నటిస్తున్న శివకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో టీవీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆమె కథ సీరియల్ నటి నవ్య స్వామి సహా ఇది వరకే పలువురు ఆర్టిస్టులు కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత పలు జాగ్రత్తలు తీసుకొని చిత్రీకరణలు జరుపుతున్నారు. అయినా ఇలా వరుసగా కరోనా కేసులు నమోదవుతుండడంతో సీరియల్‌ దర్శక, నిర్మాతలు తల పట్టుకుంటారు. ఈ పరిస్థితుల్లో షూటింగ్స్‌ కొనసాగించాలా? వద్దా? అని సతమతమవుతున్నారు. అదే సమయంలో ఆర్టిస్టులు కూడా అయోమయంలో పడ్డారు. షూటింగ్స్‌ లేకపోతే బతుకు బండి నడవడం కష్టం. వస్తే బ్రతుకుతామో లేదో తెలియని పరిస్థితి వారిని ఆలోచింపజేస్తోంది. ఇప్పటికే కొన్ని సీరియల్స్‌ షూటింగ్స్‌ను రద్దవగా.. తాజా పరిణామాల నేపథ్యంలో మరిన్ని సీరియల్స్‌ అదే బాటలో ఉన్నాయని తెలుస్తోంది.

రాజధాని ఉద్యమానికి ప్రజామద్దతు ఎందుకు లేదు?


చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అమరావతి నిర్మాణం. లక్షల కోట్ల వ్యయం సింగపూర్ ని తలదన్నే రాజధాని నిర్మిస్తాను అని ప్రజలకు వాగ్దానం చేశారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములు సేకరించి, స్థానిక రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతా బాగానే ఉంది. బాబు గారి ఐదేళ్ల పాలన ముగిసింది. రాజధాని నిర్మాణంలో అసెంబ్లీ, హైకోర్ట్ మినహా ఎటువంటి శాశ్వత నిర్మాణాలు జరగలేదు. సింగపూరు కంపెనీలతో జరిగిన ఒప్పందాల వలన ఒరిగిన ప్రయోజనం ఏమి లేదు. 2019 లో ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అసలు సమస్య మొదలైంది. అమరావతికి నేను వ్యతిరేకం కాదన్న జగన్…అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు.

జగన్ ను విమర్శించాలన్న.. పొగాడాలన్న.. అతడేనా?

దీనిని పూర్తిగా వ్యతిరేకించిన రాజధాని రైతులు మేము మోసపోయాం అంటూ…అమరావతి ఉద్యమానికి తెరలేపారు. మూడు రాజధానులు వద్దంటూ, దీక్షలు చేపట్టారు. ఈ ఉద్యమంలో పోలీసులకు, రైతులకు మధ్య పరస్పర దాడులు జరిగాయి. ప్రజాప్రతినిధులపై కూడా రైతులుదాడి చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి తరువాత దీక్షా శిబిరాల నుండి నిరసన కారులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇళ్ల దగ్గర నుండే వీళ్లు నిరసనలు కొనసాగించడం జరిగింది. ఐతే వీరి ఉద్యమానికి ప్రజా మద్దతు దొరకలేదు.

సీఎం జగన్ కు ముద్రగడ లేఖ.. వెనకున్నదేవరు?

అమరావతి ఉద్యమం మొదలై 200ల రోజులు దాటింది. టీడీపీ సోషల్ మీడియా దీనికి ప్రచారం కలిపిస్తూనే ఉంది. అమరావతి ప్రాజెక్ట్ ని, అక్కడి వారి భవిష్యత్తును నీరుగార్చిన సీఎం గా జగన్ ని వారు దూషిస్తున్నారు. రెండు వందల రోజులుగా ఉద్యమం జరుగుతున్నా ప్రజల్లో ఎందుకు చైత్యనం లేదు?. అయ్యో పాపం అమరావతి రైతులు అని ఎందుకు ఎవరూ, వారి తరపున మాట్లాడం లేదు? రాష్ట్ర రాజధాని ఉద్యమం కొన్ని గ్రామాలకే ఎందుకు పరిమితం అయ్యింది?. దానికి కారణం ఈ ఉద్యమంలో పాల్గొన్న వారంతా భూయజమానులే కానీ రైతులు కాదనేది కొందరి వాదన. ఆర్థికంగా బలపడిన వర్గానికి చెందిన వీరి ఉద్యమానికి అక్కడి బడుగు బలహీన వర్గాల నుండి వస్తున్న మద్దతు అంతంత మాత్రం గానే ఉంది. ఇక మూడు రాజధానుల వలన అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత, అభివృద్ధి చేకూరుతుందని ప్రజలు భావిస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణా తరహా విభన ఉద్యమాలకు బీజం పడకుండా ఉండాలన్నా, హైదరాబాద్ లాంటి ఆర్థిక రాజధాని ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఉండాలన్నా…మూడు రాజధానుల నిర్ణయం మంచిదని, అధిక ప్రజానీకం భావించడం కూడా కారణం కావచ్చు. అందుకే రోజుల తరబడి సాగుతున్న అమరావతి ఉద్యమం, ఒక పార్టీకి, ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యింది.

జగన్ ను విమర్శించాలన్న.. పొగడాలన్న.. అతడేనా?


ప్రశ్నించేందుకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు. సినిమాలను వదులుకొని ప్రజా సేవ చేస్తానని పార్టీ ప్రకటించిన చెప్పిన పవన్ కిందటి ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడిని పల్లెత్తు మాట అని పవన్ కల్యాణ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడేవారు. ఇక కిందటి ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చాక పవన్ ప్రశ్నించడం ఎక్కువైంది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ ఇందులో రాజకీయ దురుద్ధేశం ఆపాదిస్తుండటంతో పవన్ పై కూడా విమర్శలు మొదలయ్యాయి.

చంద్రబాబు గుడులను కూడా వదల్లేదుగా..!

ఎప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజా ఆయనను పొడుగుతూ ట్వీట్ చేయడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ ఇటీవల ఏపీలో భారీ సంఖ్యలో 108 సేవలను ప్రారంభించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏపీ అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పెద్దఎత్తున 108, 104సేవలను ప్రారంభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. దర్శకుడు పూరి జగన్మాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

తాజాగా పవన్ కల్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమంపై పొగడత్తల వర్షం కురిపించారు. ఈమేరకు తన ట్వీటర్లో ట్వీట్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు.. అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులను, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం-అభినందనీయం..’ అని ఆయన ట్వీట్ చేసారు. ‘అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా, ప్రభుత్వం చేస్తున్న పని తీరు అభినందనీయమని’ ట్వీట్ చేశాడు. ఇటీవల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన పనితీరుతో తిట్టినోటితోనే శభాష్ అనిపించుకోవడం ఆనవాయితీగా మారుతోంది. ఎంతైనా విమర్శినోడే.. పొడిగితే వచ్చే కిక్కే.. వేరప్పా అని జగన్ అభిమానులు అంటున్నారు.

భారత్ దెబ్బకు చైనాకు లక్ష కోట్ల నష్టం?


తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నే వాడొకడు ఉంటారనేది మన పెద్దలు ఎప్పడూ చెబుతూనే ఉంటారు. అందుకే ఎవరినీ కూడా తక్కువ అంచనా వేయద్దని సలహాలు ఇస్తుంటారు. చైనా విషయంలో భారత్ ఈ ఫార్ములాను ఫాలో అవుతోంది. సైనిక శక్తి, ఆర్థిక బలం ఉందని వీర్రవీగా భారత్ పై దాడికి సిద్ధమైన చైనాకు భారత్ కూడా తగిన రీతిలో గుణపాఠం చెబుతోంది. భారత్ ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్ కు చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కేంద్రం ప్రభుత్వం చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత్ తాజా నిర్ణయాలతో చైనాకు ఇప్పటికే ఏకంగా లక్ష కోట్ల నష్టం వాటిలినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు గుడులను కూడా వదల్లేదుగా..!

గాల్వానా లోయలో ఇరుదేశాల ఘర్షణ అనంతరం చైనా-భారత్ సంబంధాలు తగ్గుముఖంగా పట్టాయి. శాంతి చర్చల అంటూనే నక్కజిత్తులతో భారత జవాన్ల మృతికి కారణమైన చైనాకు భారత్ తగిన గుణపాఠం చెబుతోంది. చైనాతో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమవుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితులను బట్టి నిర్ణయాన్ని తీసుకునే అధికారం కట్టబెట్టింది. అంతేకాకుండా త్రివిధ దళాలు సంసిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. భారత రక్షణ జోలికి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని ప్రకటించింది.

చైనా విషయంలో కేంద్రం బహుముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. చైనాను రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బకొడుతోంది. సరిహద్దుల్లో భారత జవాన్లపై మృతి విషయంలో దౌత్యపరంగా చైనాదే తప్పు అని ప్రపంచానికి చాటిచెప్పడంతో భారత్ విజయం సాధించింది. దీంతో అమెరికా, రష్యా, జపాన్ లాంటి దేశాలు భారత్ కు బహిరంగంగానే మద్దతు పలికాయి. మరోవైపు భారత్ లో చైనా కంపెనీలకు చెందిన పలు కాంట్రాక్టులను భారత్ రద్దు చేసింది. రైల్వే, హైవే, టెలికాం రంగాల్లో ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను రద్దుచేసి షాకిచ్చింది. తాజాగా చైనాకు చెందిన 59యాప్స్ నిషేధించి చైనాను కోలుకులేని దెబ్బతీసింది.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

చైనాకు చెందిన కాంట్రాక్టులు, యాప్స్ రద్దు చేయడంతో చైనాకు ఆర్థికంగా భారీ నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. చైనా యాప్స్ రద్దు చేయడం ద్వారానే 49వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక చైనాకు చెందిన కాంట్రాక్టులను రద్దు చేయడం వల్ల వేల కోట్ల నష్టం వాటిల్లిందనే ప్రచారం జరుగుతోంది. వీటివిలువ సుమారు లక్ష కోట్ల పైమాటే ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చైనా భారత్ తో ఎందుకు పెట్టుకున్నార్రా దేవుడా అని కుర్రో.. ముర్రో అంటోంది.

చైనా తన సైన్యంతో భారత్ ను భయపెట్టి సరిహద్దులను ఆక్రమించుకోవాలనుకుంటే ఊహించిన విధంగా భారత్ షాకిస్తుండటం ఆ దేశం తలలు పట్టుకుంటోంది. భారత్ విషయంలో చైనా తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఆదేశం మరింత మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా చైనా తన వక్రబుద్ది మార్చుకుంటుందో.. లేక కుక్కతోక వంకర అన్న చందంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే..!