
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో భారతదేశంలో కూడా లాక్ డౌన్ విధించడం జరిగింది. 25 మార్చి నుండి మొదలైన ఈ లాక్ డౌన్ నేటికీ చిన్నారులను ఇంటికే పరిమితం చేసింది. మొదట్లో పరీక్షల పై ఆందోళన ను దాటి నెమ్మదిగా ఇంట్లోనే వేసవి సెలవులను గడపడం ప్రారంభించారు. బయటకు వెళ్లి ఆడుకొనే అవకాశం లేకపోవడంతో పిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉన్న టెలివిజన్, మొబైల్, కంప్యూటర్, ల్యాప్ టాప్, ట్యాబ్ వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించడం ద్వారా సమయాన్ని గడపడం ప్రారంభించారు. దీంతో నెమ్మదిగా వీరు ఈ డిజిటల్ స్క్రీన్స్ ను ఎక్కువ కాలం చూడడం ప్రారంభమైంది.
అటు పిమ్మట జూన్ నెలాంతానికి నెమ్మదిగా విద్యాలయాలు తీవ్రమవుతున్న కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఇక ఇంటి వద్దనే ఆన్ లైన్ లేదా వర్చువల్ క్లాసులను ప్రారంభించి విద్యార్థులకు పాఠాలు భోదించడం ప్రారంభమైంది. దీంతో పిల్లలు డిజిటల్ స్క్రీన్ పై పని చేసే సమయం దగ్గర దగ్గర ఎనిమిది నుండి పది గంటలకు చేరిపోయింది. ఇలా డిజిటల్ పరికారలపై పిల్లలు గడిపే సమయం పెరిగిపోవడంతో అంటే ఈ సమయంలో ఎప్పుడైతే 4 గంటలు దాటి పోయిందో నాటి నుండి వీరి కళ్ల పై అధి ప్రభావం చూపడం ప్రారంభించింది. ముఖ్యంగా డ్రై ఐ (కంప్యూటర్ విజన్ సిండ్రోమ్) లేదా డిజిటల్ స్ట్రయిన్ కారణంగా పిల్లలలో కంటి సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయని తల్లితండ్రులు పేర్కొంటున్నారు.
డా. అల్పా అతుల్ ఫూరబియా, ఆప్తమాలజిస్టు మరియు సీనియర్ రిఫ్రాక్టివ్, కార్నియా, కాటరాక్ట్ సర్జన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్ , కొండాపూర్ దీనిపై స్పందిస్తూ చిన్నారులలో తలెత్తుతున్న ఈ కంటి సమస్యల పట్ల తల్లితండ్రుల ఆందోళన సహజమని అన్నారు. రోజులో ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్స్ పై గడపడం వలన ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆమె అన్నారు. ఇలా ఎక్కువ కాలం డిజిటల్ స్క్రీన్స్ పై దృష్టి కేంద్రీకరించడం, కంటికి విశ్రాంతి ఇవ్వకుండా చదవడం, డిజిటల్ స్క్రీన్స్ కారణంగా ఎక్కువ కాంతి లేదా తక్కువ వెలుతురు ల మధ్య స్క్రీన్ ను చూడడం, అదే పనిగా పని చేస్తూ నోట్స్ రాస్తుండడం, సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వంటి కారణాలతో చిన్నారులలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె వివరించారు. ఇది కేవలం చిన్నారులకే పరిమితం కాదని, వర్క్ ప్రం హో చేస్తున్న పెద్ద వారిలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని అయితే చిన్నారులలో దీనిని సరిగ్గా పట్టించుకపోతే ఇది కొంత తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదని ఆమె అన్నారు.