Home Blog Page 8360

కరోనా రోగులకు శుభవార్త… ఆ మెడిసిన్ హోం డెలివరీ…?

భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ అంచనాలనూ అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పూర్తిస్థాయిలో పని చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో వైద్యులు సమర్థవంతంగా పని చేసే మందులపై ఆధారపడుతున్నారు.

అయితే వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా నియంత్రణకు ఇతర మందులతో పోలిస్తే ఫావిపిరవిర్ మంచి ఫలితాలు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీంతో మన దేశంలోని చాలా ఔషధ కంపెనీలు ఈ మందును తయారు చేస్తున్నాయి. దేశంలోని ఔషధ కంపెనీలలో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తాజాగా ఫావిపిరవిర్ ను మార్కెట్లో విడుదల చేసింది. వేర్వేరు పేర్లతో మన దేశంలో అందుబాటులో ఉన్న ఈ మెడిసిన్ తాజాగా అవిగాన్ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది.

Also Read : కరోనా వైరస్ వారి నుంచే ఎక్కువ వ్యాపిస్తుందట!

డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అవిగాన్ 200 మి.గ్రా టాబ్లెట్‌ కు అనుమతులు ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఈ మెడిసిన్ ను . 122 టాబ్లెట్ల ప్యాక్‌లో విడుదల చేసింది. ఈ మెడిసిన్ ను హోం డెలివరీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దేశంలోని 41 ప్రధాన నగరాల్లో ప్రస్తుతం మెడిసిన్ హోం డెలివరీ చేస్తున్నట్టు రెడ్డీస్ లాబోరేటరీస్ ప్రకటించింది. 18002670810 నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది.

www.readytofightcovid.in వెబ్ సైట్ ద్వారా మందుల కోసం సంప్రదించవచ్చని పేర్కొంది. ఉదయం 9.00 గంటలకు నుంచి రాత్రి 9.00 గంటల వరకు ఆదివారం మినహా మిగతా రోజులు హోం డెలివరీ అందిస్తామని తెలిపింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనా మందులు హొం డెలివరీ చేయడం ద్వారా కరోనా బాధితులకు ప్రయోజనం కలగనుంది.

అదృష్టం కొద్దీ బెయిల్ వచ్చింది..! మరి బుద్ధి….?

JC Prabhakar Reddy, son sent to police custody for two days- The ...

రాజకీయాల్లో విపరీతమైన దుడుకు స్వభావం అసలే పనికిరాదు. అలా ప్రవర్తించిన వారు చివరిదాకా విజయవంతంగా తమ కెరీర్ ను కొనసాగించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. జగన్ లాంటి వ్యక్తే చివరికి ఆచితూచి అడుగులేస్తూ శాంత స్వభావాన్ని అలవర్చుకున్నాడు. ఇక టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురింఛి తెలియ్తని వారుండరు. ఆయన ప్రదర్శించే అహంకారం అంతా ఇంతా కాదు. దివాకర్ ట్రావెల్స్ లో అక్రమాలకు సంబంధించి అరెస్టయి నానా తంటాలు పడి బెయిల్ తెచ్చుకున్నాడు. అంతే బెయి వచ్చి 24 గంటలు కూడా కాకముందే పోలీసులపై అహంకారం ప్రదర్శించి దురుసు ప్రవర్తనతో వెంటనే అరెస్ట్ అయ్యారు.

ఇక జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇటీవల కరోనా సోకింది. ఈ నేపథ్యంలో అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే న్యాయస్థానం ఇక ఎమర్జెన్సీ కింద బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సారైనా జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారా… శాంతమూర్తిగా మారిపోయి జైలుకు వెళ్లడం తప్పించుకుంటాడా…. అన్నది ఇక్కడి ప్రశ్న. ఇక ఈ సమయంలో “మా పై కుట్ర జరుగుతోంది” అంటూ జేసీ కుటుంబం గగ్గోలు పెట్టడం తెలిసిన విషయమే. 

Also Read : వైసీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే పెత్తనమెంటో?

సరే న్యాయస్థానం నుండి ఎలాగో అదృష్టవశాత్తు బెయిల్ పొందారు…. ఇక ఈ హంగామా కు టాటా చెప్పి రెండోసారి జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిదని పలువురు చెబుతున్నారు. అయితే ఆ సంగతేమోగాని పోలీసుల పై దురుసుగా ప్రవర్తించడం మాత్రం ఎవరూ సమర్థించరు. కావాలని అత్యుత్సాహం ప్రదర్శించారా లేదా వారి దూకుడు స్వభావం తెలియకుండానే బయటకు వచ్చి రెచ్చిపోయారో తెలియదు కానీ రెండో సారి జైలుకి పోయి కరోనా ని కొని తెచ్చుకున్నారు. 

ఇకపోతే టిడిపి వర్గాలు మాత్రం ‘కరోనా సోకేలా చేయాలని ప్రభుత్వం మా జేసీపై కుట్ర పన్నింది’ అంటూ అర్థం పర్థం లేని వాదనకు కూడా తెరలేపారు అనుకోండి అది వేరే విషయం. మరి ఇప్పటికైనా జేసీ జాగ్రత్తగా నడుచుకుంటారా లేదా అన్నదే ఇక్కడ కీలకం.

పొలాల్లో కూలీ పనికి రెడీ అవుతున్న రకుల్​ ప్రీత్!


కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ‘కెరటం’ అనే చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ అనే మరో చిన్న సినిమాతో బ్రేక్ సాధించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎక్స్ప్రెస్ స్పీడుతో దూసుకెళ్లింది. వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంటూ తెలుగులో నంబర్ వన్ రేసులో నిలిచింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున సరసన నటించింది. విజయాలు కూడా ఆ స్థాయిలో ఉండడంతో ఆమెకు ఎదురే లేదనిపించింది. కానీ, తెలుగులో పీక్లో ఉన్న టైమ్ లో బాలీవుడ్ కు అడుగు పెట్టి చేతులు కాల్చుకుంది. అక్కడ పెద్దగా సక్సెస్ రాకపోగా.. కొంత గ్యాప్ రావడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. పైగా, మహేష్ తో ‘స్పైడర్’, నాగార్జునతో ‘మన్మధుడు2’ డిజాస్టర్స్ కావడంతో రకుల్ కెరీర్ తలకిందులైంది. లక్కీ హీరోయిన్ పేరు పోయి ఐరన్‌ లెగ్ ముద్ర పడింది. మరోవైపు బాలీవుడ్ లో అందాల ప్రదర్శన ఎంత చేసినా అవకాశాలు రాకపోవడంతో బ్రతుకు జీవుడా అంటూ మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది రకుల్. అయితే, ఈ రెండు మూడేళ్లలో రాశీ ఖన్నా, రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ హవా కొనసాగుతోంది కాబట్టి.. టాలీవుడ్ రీఎంట్రీలో తనకు ఎర్ర తివాచీ పరిచేందుకు ఎవరూ సిద్ధంగా లేరని రకుల్ ముందుగానే అర్థం చేసుకున్నట్టుంది. అందుకే ఏ అవకాశం వచ్చిన వదులుకోవద్దని నిర్ణయించింది. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ కొత్త హీరో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్గా చేసేందుకు ఆమె ఒప్పుకుంది.

Also Read: శ్రీరాముడు ప్రభాస్‌, సీత కీర్తి సురేషేనా..!

వైష్ణవ్ చేసిన ఒకే సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా అతనితో నటించేందుకు ఒప్పుకుందంటేనే రకుల్ ఎంత కరువులో ఉందొ అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ మూవీకి టాప్ ఫిల్మ్ మేకర్‌‌ క్రిష్ దర్శకత్వం వహించడం ఆమెకు ప్లస్ పాయింట్. క్రిష్ ఉన్నాడనే భరోసాతోనే ఆమె ముందడుగు వేసిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సినిమాను పక్కనబెట్టి మరీ క్రిష్ ఈ మూవీ చేస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే థ్రిల్లింగ్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ను ఈ మధ్యే హైదరాబాద్లో మొదలు పెట్టారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిన్న చిత్రాన్ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది. ఇక, ఈ మూవీలో రకుల్ పాత్రపై ఆసక్తికర విషయం తెలిసింది. ఇందులో రకుల్ డీ గ్లామర్ రోల్ పోషిస్తోందట. అంతేకాదు ఇందులో ఆమె ఓ రైతు కూలీగా కనిపిస్తుందని సమాచారం. రకుల్ కోసం క్రిష్ బలమైన క్యారెక్టర్ రాశాడట. చిత్రంలో అదే హైలైట్గా ఉంటుందని టాలీవుడ్ టాక్. అయితే, ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన రకుల్ తొలిసారి డీగ్లామర్ గా కనిపించడమే కొత్త అనుభూతి. అలాంటిది రైతు కూలీగా, పొలాల్లో పని చేసే మహిళగా రకుల్ ను ఊహించుకోవడమే గమ్మత్తుగా అనిపిస్తోంది. మరి, ఈ చాలెంజింగ్ క్యారెక్టర్లో ఆమె ఎలా నటిస్తుందో చూడాలి. మరో వైపు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2 లో కూడా రకుల్ కీలక పాత్ర పోషిస్తోంది.

వైసీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే పెత్తనమెంటో?


రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వింత రాజకీయాలు చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ కు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు దక్కింది. అయితే ఆయన మాత్రం వైసీపీ అనుకూల రాజకీయాలకు పాల్పడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. రాపాక వరప్రసాద్ ఒకసారి పవన్ కల్యాణ్ తనకు జనసేనలో ప్రాధాన్యం ఇవ్వలేదని.. మరోసారి తన నియోజకవర్గంలో పనులు చేయించుకునేందుకు జగన్ సర్కార్ తో అనుకూలంగా ఉంటున్నానని ప్రకటించి అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాడు.

Also Read: గల్లా పయనం కమలం వైపేనా?

ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ పనులు చేయించుకోవడం కొత్తమీ కాదనప్పటికీ రాపాక వ్యవహార శైలి మాత్రం వింతగా కన్పిస్తోంది. జనసేన పార్టీ తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ ఇటీవల వైసీపీ పార్టీ తరుఫున నియోజకవర్గ బాధ్యతలను తనకు ఇవ్వాలని ఇటీవల ఆయన బహిరంగంగానే సీఎం జగన్ ను కోరారు. రాపాక జనసేనలో కొనసాగుతూ రాజోలు నుంచి వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు తనకు అప్పగించాలని జగన్ ను కోరడంపై రాజకీయ పరిశీలకులే అవాక్కవుతున్నారు. రాపాక వింత రాజకీయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

రాజోలు నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసిన బొంతు రాజేశ్వర్ 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆయనప్పటికీ ఆయనకు రాజోలులో బలమైన వర్గం ఉంది. అయితే రాపాక వరప్రసాద్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ నేతలపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల కార్పొరేషన్ ఛైర్మన్ పెడపాటి అమ్మాజీ రంగంలోకి దిగారు. ఆమె ఈ నియోజకవర్గానికి నాన్ లోకల్ అయినప్పటికీ వైసీపీ రాజోలు నియోజకవర్గ ఇన్ ఛార్జీని అనుహ్యంగా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ ఇటీవల జగన్ తనకు రాజోలు సీటు ఇద్దామనుకున్నారని అయితే కుదరకపోవడంతో తాను జనసేనలో చేరి గెలిచినట్లు పేర్కొన్నారు.

Also Read: సోము వీర్రాజు పై జగన్ విసరనున్న అస్త్రం ఇతనే..?

తాను ఎమ్మెల్యేగా గెలిచాక సీఎం జగన్ కలిసి నడుద్దామని చెప్పారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. అందుకే తాను ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే నియోజకవర్గంలోని వైసీపీ నేతలపై జనసేనకు చెందిన ఎమ్మెల్యే పెత్తనం చేయడం ఏంటనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాపాక వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. తమపై జనసేన ఎమ్మెల్యే పెత్తనం చేయడాన్ని వైసీపీ శ్రేణులు సహించలేకపోతున్నాయి. దీంతో రాపాక వ్యవహారంపై సీఎం జగన్ వద్దే ఏదో ఒకటి తేల్చుకోవాలని వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. దీంతో రాజోలు రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

సీఎంపై ఫైరవుతున్న రాములమ్మ.. త్వరలోనే ప్రెస్ మీట్?


లేడి అమితాబ్, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇటీవలీ కాలంలో తెలంగాణ ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని రాములమ్మ ఆరోపించారు. ఇక హైదరాబాద్ మహానగరం చిన్నపాటి వానకే జలమయం అవుతున్నా సీఎం కేసీఆర్ కాపాడలేకపోయారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే నేడు వరంగల్ నగరం కూడా హైదరాబాద్ నగరంలా జలమయం అయిందన్నారు.

Also Read: గల్లా పయనం కమలం వైపేనా?

ప్రభుత్వ అండదండలతో కొందరు వరంగల్ నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చెరువులు, నాలాలను కూడా అక్రమార్కులు వదలడం లేదన్నారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. ఇప్పటికే నగరంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించలేదన్నారు. ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరం నీటమునగడానికి అక్రమార్కుల భూకబ్జాలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ఘోరంగా విఫలమైందన్నారు. భూకబ్జా ల విషయంలో ఇటీవల రెవెన్యూ వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుందో కోటి రూపాయల లంచం ఘటన తెలియజేస్తుందని విజయశాంతి ఎండగట్టారు.

రాష్ట్రంలో కరోనా కట్టడిలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తొలినాళ్లలో కరోనా టెస్టులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయిందన్నారు. ఒకప్పుడు జీహెచ్ఎంసీకే పరిమితమైన కరోనా కేసులు నేడు పల్లెలకు విస్తరించడం టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో కరోనా హాస్పిటల్ గా పేరొందిన గాంధీ ఆస్పత్రి ఇటీవల పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైన ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవని దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన వైద్య సిబ్బందిలేక రోగులకు సరైన వైద్యం అందడం లేదన్నారు.

Also Read: సోము వీర్రాజు పై జగన్ విసరనున్న అస్త్రం ఇతనే..?

ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో సామాన్యులు చికిత్స చేయించుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో యాజమాన్యాలు కరోనా రోగులకు లక్షల్లో బిల్లులు వేస్తున్నా ప్రభుత్వం వాటిని కట్టడి చేయలేకపోతుందన్నారు. ఇక త్వరలోనే హైదరాబాద్ నడిబొడ్డులో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాదులో కరోనా కట్టడి ప్రభుత్వ నిర్లక్ష్యం.. రోడ్లు జలమయం విషయంలో ప్రభుత్వం ఎలా వైఫల్యం చెందిందో ప్రజలకు రాములమ్మతో చెప్పేందుకు టీకాంగ్రెస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాములమ్మ హైదరాబాద్ నడిబొడ్డున ప్రెస్ మీట్ పెట్టి సీఎం కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

గాంధీయేతరుడే కాంగ్రెస్ కు దిక్కా?


దేశంలో 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. బీజేపీకి బలమైన మోడీషాలు స్తంభాలుగా నిలబడ్డ వేళ కాంగ్రెస్ కు ఒక్కో స్తంభం కూలుతోంది. వృద్ధురాలైన సోనియా భారం మోయలేకపోతుండగా.. కొడుకు రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో కాడి వదిలేశాడు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కు గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడు కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. విశేషం ఏంటంటే ఈ డిమాండ్ ను అదే గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ తాజాగా మద్దతు పలకడం విశేషంగా మారింది.

Also Read: భారత్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూపు..!

తాజాగా కాంగ్రెస్ కు కొత్త నాయకత్వం రావాలన్న డిమాండ్ కు రాహుల్ గాంధీ సైతం మద్దతు తెలిపారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం గాంధీయేతర వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనే నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన వేళ.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఈ వయసులోనూ సోనియాగాంధీనే మోస్తోంది. తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వర్గాలు ఎంత కోరుతున్నా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంత ఒత్తిడి తెస్తున్నా రాహుల్ మాత్రం ససేమిరా అంటున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు గాంధీయేతర వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి స్వయంగా ప్రియాంక గాంధీ మద్దతు తెలుపడం విశేషం. గాంధీయేతర వ్యక్తి కింద పనిచేయడానికి తనకు ఎలాంటి సమస్యలు లేవని.. చీఫ్ ఏ పదవిని ఇచ్చినా తాను నెరవేరుస్తానని ప్రియాంక తెలిపారు.

Also Read: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోమంత్రి అమిత్ షా..!

నిజానికి కాంగ్రెస్ కు అధ్యక్షుడి ఎంపికలో ప్రియాంక నిజాయితీగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ సైతం మద్దతు తెలిపారు. కానీ 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ కుటుంబం నుంచి చేజారిపోకుండా సోనియానే కాపుకాస్తోంది. ఒకసారి ‘పీవీ నరసింహారావును’ ప్రధానిగా చేస్తే ఆయన సోనియాను ఎదురించాడు. స్వతంత్రంగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే కొత్త గాంధీయేతర వ్యక్తికి పగ్గాలు ఇవ్వడానికి సోనియానే అడ్డుగా ఉన్నారు. కానీ బీజేపీని ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న సోనియా, రాహుల్, ప్రియాంక బలం సరిపోదని అర్థమైంది. దీంతో గాంధీయేతరుడైన సమర్థవంతమైన వ్యక్తి కోసం కాంగ్రెస్ వెతకాల్సిన అవసరం ఉంది.

గల్లా పయనం కమలం వైపేనా?


రాష్ట్రంలో టీడీపీ నాయకులను వైసీపీ టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎవరిదారి వారు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అధికార పార్టీ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటుండగా, మరికొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. అయితే వైసీపీలో చేరే వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పాలి. ఈ క్రమంలో గుంటూరు ఏంపీ గల్లా జయదేవ్ కూడా తన దారి ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Also Read: భయంలో చంద్రబాబు.. ప్రతిపక్షం టీడీపీ కాదా?

కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు సమీపంలో అమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు కేటాయించిన భూముల్లో వినియోగంలో లేని భూములను వెనక్కి తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై ఆ సంస్థ హై కోర్టును ఆశ్రయించగా హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికీ ఈ సమస్య నుంచి గట్టెక్కినా భవిష్యత్తులోను ఇబ్బందులు తప్పవనుకున్న గల్లా కుటుంబం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో చేరడంతో ఈ సమస్య నుంచి గట్టెక్కాలనే ఆలోచనలో ఉంది.

గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగై పోవడంతో ఆమె టీడీపీలో చేరారు. తన కుమారుడు జయదేవ్ కు గుంటూరు లోక్ సభ టిక్కెట్టు సాధించారు. అనంతరం పరిణామాల్లో రెండు పర్యాయాలు జయదేవ్ గుంటూరు ఏంపీగా విజయం సాధించారు.

Also Read: విశాఖ లోని ఆ ఇంట్లోనే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంతా…! జగన్ దూకుడూ మామూలుగా లేదు

మరోవైపు బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో గల్లా జయదేవ్ కుటుంబం ఈ వరుసలో మొదట ఉందని స్పష్టం అవుతుంది. భవిష్యత్తులో టీడీపీ నాయకులు ఎవరెవరు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఈ వలసలను అడ్డుకునేందుకు చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

సోము వీర్రాజు పై జగన్ విసరనున్న అస్త్రం ఇతనే..?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా చురుగ్గా వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా… చివరికి పట్టుబట్టి మరీ గవర్నర్ దగ్గర నుండి మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెచ్చుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజు ఇప్పుడు జగన్ కు సరికొత్త తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తున్నాడు. వైసిపి పార్టీ వర్గాల్లో కూడా ఇప్పుడు వీర్రాజు గురించే చర్చ. ప్రతిపక్ష స్థానంలో చంద్రబాబు పొజిషన్ లో బిజెపి కనుక వచ్చినట్లయితే వారికి కొత్త కష్టాలు మొదలవుతాయి.

 

దీనిని దృష్టిలో ఉంచుకొని జగన్…. సోము వీర్రాజు మీదకి రాపాక వరప్రసాద్ రూపంలో అస్త్రాన్ని విసురుతున్నారు. ఇప్పటికే రాపాక జనసేన పార్టీకి వ్యతిరేకంగా…. తను ఒక అనధికార వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు అతనినే ఉపయోగించి సోము వీర్రాజు ని టార్గెట్ చేయించాలని వైసీపీ పార్టీ అధిష్టానం భావిస్తోందట. “మీ ఎమ్మెల్యేలే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటి?” అన్నట్లు రాష్ట్రంలోని ప్రజలు కొంతమంది జనసేన ను తక్కువగా చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారి మిత్రపక్షమైన బీజేపీ పైకి రాపాక విమర్శలు కురిపిస్తే అది వీరిద్దరి మధ్య చిచ్చు రేపి తమకు ఉపకరిస్తుందని జగన్ అంచనా కాబోలు.

అయితే సోము వీర్రాజు ఇటువంటి రాజకీయాలను ముందే గ్రహించి తన జాగ్రత్తలో తాను ఉన్నట్లు ఎప్పుడో చెప్పుకున్నాడు. జనసేన తో కలిసి జరగవలసిన కార్యాచరణ గురించి ఎంతో క్లారిటీతో ఉన్నామని… ఎవరు ఎటువైపు నుండి ఎన్ని విమర్శలు చేసినా తమ ఆలోచనా సరళిలో ఎటువంటి మార్పు ఉండదు అని తేల్చేశారు. పైగా సోము వీర్రాజు పైకి రాపాక వంటి నేతను అనేది నిజంగానే చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఇప్పటివరకు వీర్రాజు టిడిపి పై రెచ్చిపోయిన తీరు…. ఆ తర్వాత రాష్ట్రంలో బిజెపిని నిలబెట్టాలని అతనికున్న కసి ముందు ఎవరైనా నిలిచిచేది అనుమానమే అని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ మంత్రులు సైతం సోము పై ఒక్క మాట ఎత్తడానికి భయపడుతున్న తరుణంలో జగన్ అంత సాహసం చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

రాజధానిపై విచారణలో సుప్రీం కోర్టులో మరో ట్విస్ట్..!


రాజధాని తరలింపు విషయంలో హై కోర్టు విధించిన స్టే ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ విచారణకు వచ్చిన రెండు పర్యాయాలు విచారణ జరగకుండానే వాయిదా పడింది. ప్రభుత్వం త్వరగా విచారణ చేపట్టాలని కోరుతున్నా… విచారణ జరపకుండా వాయిదా వేయడానికి కారణం లేకపోలేదు. వరుసగా రెండు పర్యాయాలు ధర్మాసనంలో సభ్యులైన న్యాయమూర్తుల బంధువులు రాజధాని రైతుల పట్ల వాదించడంతో పిటీషన్ ను మరో బెంచికి కేటాయించాలని న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

Also Read: విశాఖ లోని ఆ ఇంట్లోనే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంతా…! జగన్ దూకుడూ మామూలుగా లేదు

తొలిసారి ఈ నెల 17వ తేదీన పిటీషన్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే అప్పుడు ప్రధాన న్యాయమూర్తి శరత్ అర్వింద్ బాబ్డే ధర్మాసనంలో ఒకరిగా ఉన్నారు. అమరావతి రైతుల తరపున కేసును ప్రధాన న్యాయమూర్తి కుమార్తె రుక్మిణి బాబ్డే వాదించేందుకు సిద్ధమవడంతో రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ కేసును మరో బెంచి ముందుకు పంపమన్నారు.

దీంతో బుధవారం ఈ పిటీషన్ సుప్రీం కోర్టు రిజిస్ట్రారు మరో బెంచికి సమర్పించారు. ఆ బెంచిలో న్యాయమూర్తి రోహిటం నారీమన్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ రోజు అనూహ్యంగా రోహిటం నారీమన్ తండ్రి పాలి నారీమన్ రాజధాని రైతుల తరుపున వాదిస్తున్నారని తెలియడంతో రోహిటం నారీమన్ ‘నాట్ భిపోర్ మీ’ అంటూ పిటీషన్ ను మరో బెంచికి రిఫర్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరగకుండా వాయిదా పడింది.

Also Read: భయంలో చంద్రబాబు.. ప్రతిపక్షం టీడీపీ కాదా?

మరోవైపు ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా విశాఖలో కార్వనిర్వాహక రాజధానికి అధికారుల చేత అనుకున్న మూహుర్తానికే ఈ నెల 16వ తేదీన శంఖుస్థాపన పూర్తి చేయడంతో ఇప్పడు ఈ పిటీషన్ ను త్వరగా విచారించాలనే ఆదుర్దా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. గతంలో 16వ తేదీన విశాఖలో ప్రధానితో కార్యనిర్వాహక రాజధానికి శంఖుస్థాపన చేయించాలని భావించడంతో త్వరగా విచారించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రారుకు ప్రభుత్వం లేఖ రాసింది.

భయంలో చంద్రబాబు.. ప్రతిపక్షం టీడీపీ కాదా?


40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు.. సొంత రాష్ట్రాన్ని విడిచి ఇంతకాలం ఎప్పుడూ దూరంగా ఉండలేదట.. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు. వృద్ధాప్యం మీదపడడం.. కరోనాకే అదే ఇష్టం కావడంతో చంద్రబాబు కాలు బయటపెట్టడం లేదు. ఇక చంద్రబాబు వెంటే ఆయన కుమారుడు.. నవ యువకుడు లోకేష్ బాబు కూడా గడప దాటడం లేదు. దీంతో ఏపీలో ప్రతిపక్షం అన్న టీడీపీ పాత్ర కనుమరుగు అవుతోందని తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు.

Also Read: విశాఖ లోని ఆ ఇంట్లోనే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంతా…! జగన్ దూకుడూ మామూలుగా లేదు

కరోనా వచ్చినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తెగ భయపడిపోతున్నాడు. హైదరాబాద్ ను వీడి అమరావతి మొహం చూడడం లేదు. ఆ మధ్య అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సందర్భంగా చంద్రబాబు లోకేష్ బాబు లు అలా వచ్చి ఇలా వెళ్లారు. లోకేష్ మాత్రం ధైర్యం చేసి జేసీ, అచ్చెన్న ఫ్యామిలీలను పరామర్శించి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక అమరావతిలో ఒకసారి చంద్రబాబు కనిపించి ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించారు.

ప్రస్తుతం చంద్రబాబు జూమ్ కెమెరాతో.. లోకేష్ ట్విట్టర్ తో ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఎక్కడా క్షేత్రస్థాయిలోకి రావడం లేదు. కరోనాతో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్ష రాజకీయాలకు ప్రతిపక్ష పార్టీ దూరమైపోయిందన్న అపవాదును మూటగట్టుకుంటోంది.

అదే సమయంలో ఏపీలో బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు కాగానే ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా సోము వీర్రాజు స్పందించి వెళ్లిపోతున్నారు. రమేశ్ ఆస్పత్రి దుర్ఘటన చోటకు వెళ్లి పరామర్శించారు. ఇక వరదలు వచ్చి మునిగితే గోదావరి జిల్లాలకు వెళ్లి ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలని నినదించారు. ఏ సమస్య తలెత్తినా అక్కడికెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Also Read: బాబుపై కేసు… జగన్ కు మరో అస్త్రమేనా?

నిజానికి సోము వీర్రాజు వయసు కూడా 60 ఏళ్లు దాటింది. కానీ ఆయన చురుకుగా ప్రజా సమస్యలపై స్పందిస్తూ చంద్రబాబు లేని లోటును భర్తీ చేస్తున్నారు. దూకుడుగా వెళుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. సోము వీర్రాజు దూకుడు ఇలాగే కొనసాగితే ఏపీలో టీడీపీని ప్రతిపక్షంగా మరిచిపోయి బీజేపీని చూస్తారని తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారట.. చంద్రబాబుకు కరోనా భయం ఎప్పుడు పోతుందా? ఆయన ఎప్పుడొస్తారో తెలియక తమ్ముళ్లు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

సీబీఐకి సుశాంత్‌ కేసు.. వాళ్లకు మూడినట్టే!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. బాలీవుడ్‌లో ప్రకంపణలు రేపిన యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలిచ్చింది. సుశాంత్‌ మృతిపై సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా ఈ కేసు విచారణలో సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ నేతృత్వంలోని సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ రంగ ప్రవేశం చేయనుండడంతో సుశాంత్‌ మృతి వెనకున్న వారి వెన్నులో భయం మొదలైంది. ముఖ్యంగా సుశాంత్‌ ప్రేయసి రియాతో పాటు మరికొందరు బడా బాబులకు మూడినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో రియాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని సుప్రీం సమర్థించింది. సుశాంత్‌ మరణానికి ముందు జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తునకు రియా సహకరించలేదు. కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో తానేం చెప్పనని మొండికేసింది. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగుతుంది కాబట్టి ఎవ్వరి పప్పులు ఉడకవు. సుశాంత్‌ మృతిపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తుంది కాబట్టి కాస్త ఆలస్యమైనా నిజానిజాలు కచ్చితంగా బయట పడుతాయి.

Also Read: శ్రీరాముడు ప్రభాస్‌, సీత కీర్తి సురేషేనా..!

జూన్‌ 14 వ తేదీన సుశాంత్‌ ముంబై బాంద్రాలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి, కుంగుబాటు వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని మొదట భావించారు. కానీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేలా కొందరు ప్రేరేపించారన్న ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక రియాతో పాటు పలువురు బాలీవుడ్‌ బడా బాబులు, మహారాష్ట్రకు చెందిన రాజకీయ ప్రముఖులు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ముంబై పోలీసుల విచారణ అర్థవంతంగా లేదని, ప్రత్యక్ష సాక్షులు, ప్రాధమిక అనుమానితులను సైతం సరిగ్గా విచారించడం లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రముఖ జర్నలిస్ట్‌ అర్నాబ్‌ గోస్వామి.. సుశాంత్‌కు సన్నిహితంగా ఉన్న వారందరినీ వరుసగా ఇంటర్వ్యూ చేస్తూ అనేక అనుమానాలను బయట పెట్టడంతో ఈ కేసు రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సుశాంత్‌ స్వరాష్ట్రం బీహార్ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. ఇలా అనేక మలుపులు తిరుగుతూ తమ వద్దకు వచ్చిన ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

శ్రీరాముడు ప్రభాస్‌, సీత కీర్తి సురేషేనా..!

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్ అయ్యాడు. బాహుబలి మేనియా తర్వాత మన డార్లింగ్ మార్కెట్‌ పరిధి అమాంతం పెరగడంతో బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు ప్రభాస్‌పై ఫోకస్‌ పెట్టారు. మనోడిపై ఎంత పెట్టుబడి పెట్టిన తిరిగొస్తుందని భావిస్తున్నారు. అలాగే, ఆరడుగుల ఆజానుబాహుడు కావడంతో అతని బాడీని, బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో ఉంచుకొని కథలు రెడీ చేస్తున్నారు. ఇకపై ప్రభాస్‌ చేసే అన్ని చిత్రాలు పాన్‌ ఇండియా మూవీసే కానున్నాయి. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా ప్రభావం తగ్గితే ఆ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా 2021 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు వైజయంతీ మూవీస్‌ బ్యానర్ పై నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమాకు ప్రభాస్‌ ఒప్పుకున్నాడు. భారీ బడ్జెట్‌తో పాటు బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపిక పడుకోన్‌ ఫీమేల్‌ లీడ్‌ చేస్తుండడంతో ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టని మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఇప్పుడు బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్‌’ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు ప్రభాస్‌.

Keerthy-suresh-Prabhas-sita

Also Read: పాపం ఖుష్బూ.. కంటికి కత్తి తగిలి గాయం

ఈ మూవీ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. చెడుపై విజయం సాధించిన మంచికి వేడుక అనే ట్యాగ్‌లైన్‌ వస్తున్న ఈ మూవీ దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ భూషన్‌ కుమార్ ప్రొడ్యూసర్. ఇది పౌరాణిక గాథతో కూడిన సోషియో ఫాంటసీ చిత్రం. భారతీయ ఇతిహాసం ఆధారంగా త్రీడీలో రూపొందించనున్నారు. టైటిల్‌ డిజైన్‌ చూస్తుంటే ఇందులో ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ మూవీలో ప్రభాస్‌ సరసన సీతగా కీర్తి సురేశ్‌ పేరును పరిశీలిస్తున్నారు. ఈ మధ్య సౌతిండియాలో వరుస హిట్లతో దూసుకెళ్తోంది కీర్తి. ముఖ్యంగా ‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న తర్వాత ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అమెజాన్‌లో రిలీజైన్‌ ఆమె ‘పెంగ్విన్‌’ చిత్రాన్ని హిందీ జనాలు కూడా చాలా మంది చూశారు. చీరకట్టులో ఒదిగిపోవడమే కాకుండా అద్భుతమైన హావభావాలను పలికించడంలో కీర్తి దిట్ట. దాంతో, సీత పాత్రకు ఆమె అయితే న్యాయం చేసుందని చిత్రం బృందం భావిస్తోందని సమాచారం.

Also Read: అయ్యో.. పాపం బాలయ్య.. !

కాకపోతే ఆమె హైట్‌ కాస్త ప్రతికూలం అయ్యేలా ఉందని టాక్. కీర్తి హైట్‌ తక్కువే. ఆరడుగుల ప్రభాస్‌ సరసన ఆమె సెట్‌ అవుతుందా? అని ఆలోచన కూడా చేస్తున్నారట మూవీ మేకర్స్‌. అలాగే, ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ప్రభాస్‌ స్టార్డమ్‌తో పాటు పాన్‌ ఇండియా మూవీ కావడంతో కీర్తినే ఫైనల్‌ చేస్తారా? బాలీవుడ్‌లో మరెవరినైనా పరిశీలిస్తారా అన్నది తేలాలి. ఒకవేళ చాన్స్‌ వస్తే మాత్రం కీర్తి కెరీర్ మరో మెట్టు ఎక్కిన్టే అనొచ్చు. కాగా, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కే ఆదిపురుష్ను తమిళ్‌, మలయాళం, కన్నడ తో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్‌ చేయనున్నారు.

పాపం ఖుష్బూ.. కంటికి కత్తి తగిలి గాయం


సీనియర్ నటి, చిరంజీవి, వెంకటేశ్ సహా పలువురు స్టార్ హీరోలతో నటించిన ఖుష్బూ కంటికి గాయమైంది. తన ఎడమ కంటికి కత్తి తగిలి గాయం కాయడంతో చికిత్స చేయించుకుంది. ఈ విషయాన్ని ఖుష్బూనే స్వయంగా వెల్లడించింది. ఈ రోజు ఉదయం కత్తి తగలడంతో తన కంటికి గాయమైందని ట్వీట్‌ చేసింది. ఒక కంటికి పూర్తిగా బ్యాండేజీ వేసిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలం పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు చెప్పింది. తొందర్లోనే మీ ముందుకు వస్తానని ట్వీట్‌ చేసింది. అయితే, తనకు గాయం ఎలా అయిందన్న విషయాన్ని ఆమె వెల్లడించలేదు. ఇంట్లోనే ఆమె గాయపడినట్టు అర్థం అవుతోంది. బ్యాండేజీ వేసుకున్నప్పటికీ ఆమె మొహంలో ఎలాంటి దిగులు కానీ, బాధ కానీ కనిపించడం లేదు. కాబట్టి గాయం చిన్నదే అని అర్థమవుతోంది. ఇక, ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఖుష్బూ తన అభిమానులను కోరడం విశేషం. అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించే బయటకు వెళ్లాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. కాగా, గాయం నుంచి ఖుష్బూ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: సాంగ్స్ కోసం ‘పుష్ప’ను సిద్ధం చేస్తున్నారు !

ముంబైలో పుట్టిన ఖుష్బూ దక్షిణాదిలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. తమిళ్‌, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో అనేక సినిమాల్లో నటించింది. యంగ్‌ ఏజ్‌లో సౌత్లో దాదాపు అందరు పెద్ద స్టార్ల సరసన నటించిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సీరియర్ నటిగా, హోస్ట్‌గా, ప్రొడ్యూసర్ గా బిజీగా ఉంది. తెలుగులో చివరగా 1993లో పేకాట పాపారావులో హీరోయిన్‌గా నటించింది. 13 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఆమె 2006లో స్టాలిన్‌లో చిరంజీవి అక్కగా నటించి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యమదొంగలో ఓ చిన్న పాత్ర చేసింది. రెండేళ్ల కిందట వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’లో కీలక పాత్రలో నటించింది.

 

 

కేసీఆర్ పై పోస్టు పెట్టినందుకు యువకుడి అరెస్ట్..! అదే చట్టం ప్రభుత్వానికి వర్తించదా?

కొద్ది వారాల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకిందని కొన్ని వార్తలు వచ్చాయి. చివరికి అవి ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయిపోయాయి కూడా. అయితే ఈ పోస్ట్ పెట్టినందుకు రాజు అనే ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అంతా బాగానే ఉంది. అసలు ఒక ఫేక్ పోస్ట్ పెట్టినందుకు దుబాయ్ నుండి ముంబైకి పిలిపించి లాక్ అవుట్ నోటీసులు మీద హైదరాబాద్ కు తీసుకొని వచ్చి మరీ…. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ తతంగం మొత్తం జరిపేందుకు పోలీసులకు చాలా సమయం పట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పై అసత్య లేదా ఫేక్ పోస్ట్ చేసినందుకుగాను అతనిని అరెస్టు చేయడం కరెక్టే. మరి కొద్ది రోజుల క్రితం ఒక టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో చూపిస్తున్న కరోనా మరణాలు కన్నా ఎక్కువ మృతదేహాలను కాల్చేస్తున్నట్లు బయటపడింది. ఆ టీవీ ఛానల్ తన టిఆర్పి కోసం ఒకసారి ఆ న్యూస్ వేసి వదిలేసింది. మరి ఇప్పుడు హెల్త్ బులిటెన్ ఫలితాలపై చర్యలు తీసుకునేది ఎవరు? అది రోజూ జనాలకు ఫేక్ నెంబర్లు చూపించినట్లు కాదా…? అని నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అసలు హైదరాబాదులో లాంటి మహానగరంలో… ఇంకా చెప్పాలంటే దక్షిణాదిన ఉన్న కరోనా కేంద్రాలలో ఒకటైన ఈ మహానగరంలో సరిగ్గా టెస్టులు జరుపకుండా లెక్కకు మిక్కిలి కేసులు టెస్టింగ్ కు నోచుకోకుండా…. ఎంతో మంది జనాలు కరోనాతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటూ ఉంటే…. వారికి ఆ గతి పట్టించిన వారిని అరెస్టు చేసే వారే లేరా? అన్నది విపక్షాల ప్రశ్న. ఒక ఫేక్ పోస్ట్ చేసినందుకు దుబాయ్ నుండి పిలిపించి అరెస్టు చేయించడం న్యాయమే. మరి హైదరాబాద్ లోనే ఉంటూ సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టుకుంటూ…. ఫార్మ్ హౌస్ లో వీలు చిక్కినప్పుడల్లా సేద తీరుతూ.. ప్రైవేటు ఆసుపత్రుల అక్రమాలను గాలికి వదిలేసిన అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రికి మాత్రం ఈ చట్టాలు వర్తించవా…? అసలు నెంబర్లు వాస్తవమేనా… కాదా అని చెక్ చేసే వారు ఎవరూ లేరా…? అన్నది ప్రజల వాదన.

“హైకోర్టు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెడచెవిన పెట్టే వారికి చట్టాలు, న్యాయాలు వర్తించవా…?” అని కేసీఆర్ ప్రభుత్వం పై పలువురు ధ్వజమెత్తారు. మరి వీటికి ఆన్సర్ మీ దగ్గర ఉందా సీఎం సాబ్…?

130 ఏళ్ల తర్వాత కదిలిన జైపూర్ మమ్మీ..!

దాదాపు 130 సంవత్సరాల తరువాత జైపూర్ మమ్మీ కదిలింది. జైపూర్ మమ్మీ ఏమిటి…? కదలటం ఏమిటి…? అని ఆశ్చర్యపోతున్నారా. 130 ఏళ్ల క్రితం ఈజిప్ట్ లోని పురాతన పనో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మమ్మీని గుర్తించారు. ఆ సమయంలో ఆ మమ్మీని అక్కడినుంచి మన దేశంలోని జైపూర్ కు తరలించారు. అప్పటినుంచి ఇప్పటివరకు జైపూర్ లోని ఒక మ్యూజియంలో మమ్మీని జాగ్రత్తగా భద్రపరిచారు.

గత కొన్ని రోజుల నుంచి జైపూర్ లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటం ఆ వర్షాల వల్ల మ్యూజియంలోకి నీరు చేరుతూ ఉండటంతో అధికారులు మమ్మీని అక్కడినుంచి తరలించారు. ఈ జైపూర్ మమ్మీ వయస్సు 2400 సంవత్సరాలు కావడం గమనార్హం. 130 ఏళ్ల క్రితం మ్యూజియంలొ పెట్టిన మమ్మీని ఇప్పటివరకు కదిలించాల్సిన అవసరం రాలేదు. ఒక గాజుపెట్టెలో మమ్మీని ప్రత్యేకంగా భద్రపరిచారు.

భారీ వర్షాల వల్ల మ్యూజియంలోకి చేరిన నీరు మమ్మీ ఉన్న పెట్టెలోకి చేరే అవకాశం ఉండటంతో అధికారులు మమ్మీని అక్కడ ఉంచటం మంచిది కాదని భావించి మరో ప్రాంతానికి తరలించారు. గాజు బాక్స్ లో మమ్మీ ఉండటంతో ఆ బాక్స్ ను బ్రేక్ చేసి మరో బాక్స్ లో మమ్మీని తీసుకెళ్లారు. అత్యంత కట్టుదిట్టంగా ఉండే నేలమాళిగలోకి తీసుకెళ్లి మమ్మీని భద్రపరిచారు. టటు అనే మహిళ 2400 సంవత్సరాల క్రితం మృతి చెందగా అక్కడి ప్రజలు మమ్మీగా మార్చి పిరమిడ్ లో భద్రపరిచారు.