
దాదాపు 130 సంవత్సరాల తరువాత జైపూర్ మమ్మీ కదిలింది. జైపూర్ మమ్మీ ఏమిటి…? కదలటం ఏమిటి…? అని ఆశ్చర్యపోతున్నారా. 130 ఏళ్ల క్రితం ఈజిప్ట్ లోని పురాతన పనో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మమ్మీని గుర్తించారు. ఆ సమయంలో ఆ మమ్మీని అక్కడినుంచి మన దేశంలోని జైపూర్ కు తరలించారు. అప్పటినుంచి ఇప్పటివరకు జైపూర్ లోని ఒక మ్యూజియంలో మమ్మీని జాగ్రత్తగా భద్రపరిచారు.
గత కొన్ని రోజుల నుంచి జైపూర్ లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటం ఆ వర్షాల వల్ల మ్యూజియంలోకి నీరు చేరుతూ ఉండటంతో అధికారులు మమ్మీని అక్కడినుంచి తరలించారు. ఈ జైపూర్ మమ్మీ వయస్సు 2400 సంవత్సరాలు కావడం గమనార్హం. 130 ఏళ్ల క్రితం మ్యూజియంలొ పెట్టిన మమ్మీని ఇప్పటివరకు కదిలించాల్సిన అవసరం రాలేదు. ఒక గాజుపెట్టెలో మమ్మీని ప్రత్యేకంగా భద్రపరిచారు.
భారీ వర్షాల వల్ల మ్యూజియంలోకి చేరిన నీరు మమ్మీ ఉన్న పెట్టెలోకి చేరే అవకాశం ఉండటంతో అధికారులు మమ్మీని అక్కడ ఉంచటం మంచిది కాదని భావించి మరో ప్రాంతానికి తరలించారు. గాజు బాక్స్ లో మమ్మీ ఉండటంతో ఆ బాక్స్ ను బ్రేక్ చేసి మరో బాక్స్ లో మమ్మీని తీసుకెళ్లారు. అత్యంత కట్టుదిట్టంగా ఉండే నేలమాళిగలోకి తీసుకెళ్లి మమ్మీని భద్రపరిచారు. టటు అనే మహిళ 2400 సంవత్సరాల క్రితం మృతి చెందగా అక్కడి ప్రజలు మమ్మీగా మార్చి పిరమిడ్ లో భద్రపరిచారు.