
భారత్ లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ అంచనాలనూ అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పూర్తిస్థాయిలో పని చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో వైద్యులు సమర్థవంతంగా పని చేసే మందులపై ఆధారపడుతున్నారు.
అయితే వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా నియంత్రణకు ఇతర మందులతో పోలిస్తే ఫావిపిరవిర్ మంచి ఫలితాలు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దీంతో మన దేశంలోని చాలా ఔషధ కంపెనీలు ఈ మందును తయారు చేస్తున్నాయి. దేశంలోని ఔషధ కంపెనీలలో ఒకటైన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తాజాగా ఫావిపిరవిర్ ను మార్కెట్లో విడుదల చేసింది. వేర్వేరు పేర్లతో మన దేశంలో అందుబాటులో ఉన్న ఈ మెడిసిన్ తాజాగా అవిగాన్ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది.
Also Read : కరోనా వైరస్ వారి నుంచే ఎక్కువ వ్యాపిస్తుందట!
డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అవిగాన్ 200 మి.గ్రా టాబ్లెట్ కు అనుమతులు ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఈ మెడిసిన్ ను . 122 టాబ్లెట్ల ప్యాక్‌లో విడుదల చేసింది. ఈ మెడిసిన్ ను హోం డెలివరీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దేశంలోని 41 ప్రధాన నగరాల్లో ప్రస్తుతం మెడిసిన్ హోం డెలివరీ చేస్తున్నట్టు రెడ్డీస్ లాబోరేటరీస్ ప్రకటించింది. 18002670810 నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది.
www.readytofightcovid.in వెబ్ సైట్ ద్వారా మందుల కోసం సంప్రదించవచ్చని పేర్కొంది. ఉదయం 9.00 గంటలకు నుంచి రాత్రి 9.00 గంటల వరకు ఆదివారం మినహా మిగతా రోజులు హోం డెలివరీ అందిస్తామని తెలిపింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనా మందులు హొం డెలివరీ చేయడం ద్వారా కరోనా బాధితులకు ప్రయోజనం కలగనుంది.