Home Blog Page 8359

రాజకీయాల్లోకి వచ్చేందుకు జంకుతున్న రజనీ?


తమిళనాడులో త్వరలోనే ఎన్నికల శంఖారావం మోగనుంది. దీంతో తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ అందుకు తగ్గట్టుగా సన్నహాలు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు ఇప్పటికే పొత్తులపై క్లారిటీకి వచ్చాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను కూడా ప్రారంభించాయి. దేవుడి శాసిస్తే.. అరుణాచలం పాటిస్తాడు.. అని చెప్పే రజనీకాంత్ పార్టీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనేది సస్పెన్స్ థ్రిలర్ ను తలపిస్తోంది. ఎన్నికల్లో పోటీపై రజనీకాంత్ ఇప్పటివరకు తన మనస్సులోని బయట పెట్టకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Also Read: సోనియా కుటుంబానికి ఎంత బాధ..!?

రాజకీయాలపై అంతగా అవగాహన లేని రజనీకాంత్ నేతల మైండ్ గేమ్ కు చిత్తవుతున్నారు. దీంతోనే ఆయన పార్టీ ప్రకటనపై వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2021 ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని గతంలో ప్రకటించిన రజనీకాంత్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాను సమర్థుడైన నాయకుడిని ముఖ్యమంత్రి చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నానని.. తనకు ముఖ్యమంత్రి పదవీ కావాలనే ఆశలేదని ముందుగానే ప్రకటించడంతో రజనీ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ ప్రకటనకు ముందే రజనీ క్యాడర్లో నిస్తేజాన్ని నింపినట్లయింది.

అయితే కొన్నాళ్లుగా రజనీ అనుచరులు, అభిమానులు మక్కల్ మండ్రంను స్థాపించి సభ్యత్వాలను చేస్తున్నారు. తీరా ఎన్నికలకు గడువు సమీపిస్తున్నప్పటికీ రజనీ నుంచి పార్టీ ప్రకటన రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. దివంగత సీఎం జయలలిత మరణంతో రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. దశాబ్దాలుగా ప్రజలు అన్నాడీఎంకే, డీఎంకే పాలన చూసి విసిగిపోయారు. ఇలాంటి తరుణంలో రజనీ వస్తే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా రజనీ మారుతారని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు.

Also Read: ఇద్దరు మిత్రులే కానీ.. నీళ్ల వద్దే పంచాయితీ..!

రజనీ పార్టీ ప్రకటిస్తారని అలర్ట్ అయిన అధికార, ప్రతిపక్ష పార్టీలు రజనీ స్థానికేతరుడు అంటూ ప్రచారం చేస్తుండటంతో ఆయన పోటీకి వెనక్కి తగ్గారనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో గెలిచే అంతా సమయం లేదని భావిస్తున్నారు. ఇతర పార్టీలతో పోత్తు పెట్టుకునే అవకాశం లేకపోవడంతో రజనీ ఈసారి పోటీకి వెనుకడుగు వేస్తున్నట్లు కన్పిస్తోంది. దీంతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలే మధ్య పోటీ కన్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రజనీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదో అనేది అభిమానులకైనా క్లారిటీ ఇస్తే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దీంతో రజనీని ఈసారి కూడా దేవుడు శాసించలేదా? అనే సైటర్లు విన్పిస్తున్నాయి.

చెట్టుకు కన్ను ఫోటో వైరల్.. మీరు చూశారా ?

కాలం మారుతోంది. కాలంతో పాటే మనుషుల్లో నైపుణ్యాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మనుషులు కలలో కూడా అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేస్తున్నారు. తమకు నచ్చిన రంగాల్లో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ఫోటోగ్రాఫర్ ప్రతిభకు అద్దం పడుతోంది. ఒక చెట్టుపై కూర్చున్న గుడ్లగూబకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read : ఆ గ్రహశకలం భూమిని తాకితే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే…?

ఇంటర్నెట్ లో అప్ లోడ్ అయ్యే ఫోటోలలో కొన్ని ఫోటోలు మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఆయా ఫోటోలలో ఉండే ప్రత్యేకతలే ఆ ఫోటోలు వైరల్ కావడానికి కారణమవుతూ ఉంటాయి. తాజాగా అలా వైరల్ అవుతున్న ఒక ఫోటోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోను దూరం నుంచి చూస్తే చెట్టుకు కన్ను ఉందేమో అనేలా ఉంది.

‘ఒక కన్నుతో చెట్టు. మీకు న‌చ్చే ఉత్త‌మ ఫోటోల‌లో ఇది ఒక‌టి’ అనే ట్యాగ్ లైన్ తో సుశాంత్ సింగ్ షేర్ చేసిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గుడ్లగూబ చెట్టు తొర్ర‌లో కూర్చోగా ఒక కన్ను మాత్రమే ఫోటోలో కనిపించేలా ఫోటోగ్రాఫర్ అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. ఫోటోను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రమే అక్కడ పక్షి ఉందని అర్థమవుతుంది. గుడ్ల‌గూబ రంగు చెట్టు రంగును పోలి ఉండటంతో ఆ విధంగా కనిపిస్తోంది. చెట్టుకే క‌న్ను ఉందనిపించేలా ఫోటో తీయడం సాధారణ విషయం కాదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Also Read : వామ్మో.. ‘జపాన్’లో మరో వింత వ్యాధి.. రోడ్లపైనే పడిపోతున్నారు!

ఫ్యాన్స్‌కు నిరాశే.. ఆచార్య టీజర్ వద్దంటున్న చిరు!


ఆగస్టు 22. మెగా కుటుంబానికి, మెగా అభిమానులకు పండగ రోజు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఆ రోజును ప్రత్యేకంగా మార్చాలని ఎన్నో నెలల నుంచి ప్లాన్‌ చేస్తుంటారు. భారీ కటౌట్లు, కేక్‌ కటింగ్స్‌ మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. రక్త దాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అనాథలను, అభాగ్యులను ఆదుకుంటారు. మరో రెండు రోజుల్లో వచ్చే చిరు బర్త్‌డే ఫ్యాన్స్‌కు మరింత స్పెషల్. ఎందుకంటే అది చిరంజీవి 65వ పుట్టిన రోజు. దీన్ని ఓ రేంజ్‌లో నిర్వహించాలని మెగా ఫ్యాన్స్‌ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. సోషల్ మీడియాలో చిరు బర్త్‌డే కామన్ డీపీ హల్‌ చల్‌ చేస్తోంది. చిరు బర్త్ డే స్పెషల్‌గా రామ్ చరణ్ యువ శక్తి మెగా ర్యాంప్ సాంగ్ ‘నమస్తే మాస్టరు’ రెడీ చేసింది. ఇప్పటికే గ్లింప్స్‌ వదలగా… బర్త్‌డేకు ఒక రోజు ముందు అంటే 21వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు.

Also Read: విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..

తన కోసం ఇంత చేస్తున్న అభిమానులకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు చిరంజీవి కూడా సమాయత్తం అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం నుంచి సర్ప్రైజ్‌ గిఫ్‌ ఇవ్వనున్నాడు చిరు. ఈ మూవీ పోస్టర్తో పాటు టీజర్ కూడా రిలీజ్‌ అవుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, వాళ్ల కోరికలో సగమే నెరవేరనుంది. ఎందుకంటే 22న ఆచార్య మోషన్ పోస్టర్ ఒక్కటే రిలీజ్‌ కానుంది. ఫ్యాన్స్‌ ను థ్రిల్‌ చేసేందుకు టీజర్ కూడా విడుదల చేద్దామన్న దర్శకుడు కొరటాల శివ ప్రతిపాదనను చిరు తిరస్కరించాడని సమాచారం. ఓ చిన్న డైలాగ్‌తో కూడిన టీజర్ అయినా వదులుదామని శివ చెబితే చిరు నో అన్నాడట. తన పుట్టిన రోజు నాడు కేవలం ఆచార్య ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్ ఒక్కటే విడుదల చేద్దామని స్పష్టం చేసినట్టు సమాచారం.

Also Read: నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !

షూటింగ్‌ ఎలాగూ వాయిదా పడింది కాబట్టి టీజర్ను మరో సందర్భంలో రిలీజ్‌ చేద్దామని చెప్పాడట. తద్వారా మూవీపై ప్రేక్షకుల్లో మరింత కాలం కొనసాగించొచ్చన్నది చిరు ప్లాన్‌ అని తెలుస్తోంది. అందువల్ల డైలాగ్‌ టీజర్ను ప్రస్తుతానికి హోల్డ్‌ పెట్టారని సమాచారం. కాబట్టి ఆగస్టు 22న మెగా అభిమానులు ఒక్క ‘ఆచార్య’ పోస్టర్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. కాగా, సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ను చిరు తనయుడు రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. మార్చిలో షూటింగ్ మొదలైంది. రెండు వారాల చిత్రీకరణ అనంతరం కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ మూవీలో చిరు సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌ చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని చూస్తున్నాడు చరణ్.

బాప్‌రే.. ప్రభాస్‌ ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌కే రూ. 250 కోట్లు!


రెబల్‌ స్టార్ ప్రభాస్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. అతని సినిమాలేవీ రిలీజ్‌ కు రెడీగా లేవు. అతనే ప్రమోషన్స్‌లోనూ పాల్గొనడం లేదు. అయినా సరే మన డార్లింగ్‌ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. కేవలం ఓ సినిమా అనౌన్స్‌మెంట్‌తో బాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేశాడు ప్రభాస్‌. బాహుబలి తర్వాత అతను ఇండియన్‌ స్టార్ గా మారితే ఇప్పుడు ఓ హిందీ సినిమా ప్రకటనతోనే అక్కడి బడా హీరోలను తలదన్నే స్టార్డమ్‌ డార్లింగ్‌ సొంతమైంది. తానాజీ ఫేమ్ ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ అనే సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. టైటిల్‌, పోస్టర్ను రిలీజ్‌ చేసినప్పటి నుంచి అందరి దృష్టి ఈ సినిమాపైనే నిలిచింది. ఈ చిత్రం కథేంటి? హీరోయిన్ ఎవరు? బడ్జెట్‌ ఎంత? ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? అని తెగ చర్చించుకుంటున్నారు.

Also Read: నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !

ఈ మూవీలో ప్రభాస్‌ రాముడిగా నటించబోతున్నాడని ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ హింట్‌ ఇవ్వడంతో ప్రాజెక్టుపై మరింత క్రేజ్‌ ఏర్పడింది. బాహుబలిలో రాజుగా మెప్పించిన రెబల్‌ స్టార్ తొలిసారి పౌరాణిక పాత్ర చేయబోతున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చెడుపై మంచి సాధించిన విజయ సంబురం అనే ట్యాగ్‌లైన్‌ ఉండడంతో ఇది కచ్చితంగా రామాయణం, రామరావణుల యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ దీన్ని భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ‘ఆదిపురష్’‌ కోసం రూ. 500 కోట్లు రెడీ చేసిందని.. కాదు ఏకంగా వెయ్యి కోట్లతో సినిమాను నిర్మిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. బడ్జెట్‌ లెక్కలను పక్కనబెడితే ఈ మూవీకి భారీ గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్స్‌ అవసరం కానున్నాయి. దాంతో, కేవలం వీఎఫ్‌ఎక్స్‌ కోసమే నిర్మాతలు ఏకంగా రూ. 250 కోట్లు పైచిలుకు ఖర్చు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. బాహుబలి మాదిరిగా ఆదిపురుష్‌ ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇవ్వనుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతానికైతే 500 కోట్ల బడ్జెట్‌… అందులో సగం విజువల్‌ ఎఫెక్ట్స్ ‌ కోసమే ఖర్చు చేయాలని నిర్మాతల్లో ఒకరైన భూషన్‌ కుమార్ భావిస్తున్నారని సమాచారం.

Also Read: నాని హిట్ అయితేనే.. మిగతా హీరోలకు మార్కెట్ !

ఈ లెక్కన వీఎఫ్‌ఎక్స్‌ కోసం అత్యధిక బడ్జెట్‌ వాడిన ఇండియన్‌ సినిమాగా ‘ఆదిపురుష్‌’ నిలుస్తుంది. మరోవైపు ఈ మూవీలో ప్రభాస్‌ సరసన సీత క్యారెక్టర్లో నేషనల్‌ అవార్డు విన్నర్ కీర్తి సురేశ్‌ నటించే అవకాశం కనిపిస్తోంది. ఇక, ‘ఆదిపురుష్‌’ను పూర్తిగా త్రీడీలో చిత్రకరించనున్నారు. హిందీ, తెలుగులో ఒకేసారి షూట్‌ చేసే ఈ చిత్రాన్ని మరో ఐదారు భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది. ప్రస్తుతం రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధ్యేశ్యామ్‌’లో నటిస్తున్న ప్రభాస్‌.. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమాకు ఒప్పుకున్నాడు. ఈ రెండు కూడా పాన్‌ ఇండియా చిత్రాలుగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానున్నాయి.

విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..


కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్‌కు సౌతిండియాలో మంచి స్టార్డమ్‌ ఉంది. తమిళ్‌తో పాటు కన్నడ, తెలుగులో కూడా ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్‌ అవుతోంది. ఈ మధ్య నేరుగా రిలీజ్‌ అవుతున్నాయి. తెలుగు స్టార్లను తలదన్నే రీతిలో విజయ్ సినిమాలకు టాలీవుడ్‌లో భారీ ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్‌ మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు విజయ్. రాజకీయాలపై కూడా ఆయనకు ఆసక్తి ఉండడమే అందుకు కారణం. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో పని చేస్తే కచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేసే ఒక సందేశం ఉండాలని కోరుకుంటాడు విజయ్‌. వీళ్లిద్దరిదీ సక్సెస్‌ఫుల్‌ జోడీ. వీళ్ల కలయికలో గతంలో వచ్చిన తుపాకి, కత్తి, సర్కార్ వంటి చిత్రాలు బ్లాక్ ‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు విజయ్‌- మురుగదాస్‌ కలయికలో నాలుగో సినిమా ఫిక్సయిందని సమాచారం. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్ సరసన మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్‌. తమన్‌ మ్యూజిక్‌ అందించనుండగా.. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రాఫ్‌గా వ్యవహరిస్తారు.

Also Read:  నాని హిట్ అయితేనే.. మిగతా హీరోలకు మార్కెట్ !

విజయ్‌కు ఇది 65వ చిత్రం కావడం విశేషం. ఇది మురుగదాస్‌తోనే ఉంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ తొందర్లోనే అధికారిక ప్రకటన చేసేందుకు సన్‌ పిక్చర్స్‌ రెడీ అవుతోంది. అప్పుడే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించడనుంది. కాగా, విజయ్‌ తొందర్లోనే రాజకీయాల్లోకి వస్తాడని, ఇప్పటికే ఆయన తండ్రి ఆ పనుల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆలోపు సమాజానికి సందేశం ఇచ్చే బలమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని విజయ్‌ భావిస్తున్నాడట. అలాంటి చిత్రాలకు సరైన దర్శకుడు మురుగదాసే కాబట్టి ఆయనతోనే 65వ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మురుగదాస్‌ కథ, కథనం సిద్ధం చేస్తున్నాడని టాక్‌. అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. విజయ్‌- మురుగదాస్ కాంబినేషన్‌ అనగానే సౌత్‌ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. దానికి తగ్గట్టుగా సినిమాను నిర్మించాలని సన్‌ పిక్చర్స్‌ కసరత్తులు చేస్తోందట.

Also Read: నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !

అయితే, కరోనా సంక్షోభం నేపథ్యంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నారట. మిగతా వాళ్లకు మార్గదర్శకంగా నిలిచేందుకు విజయ్‌, మురుగదాస్‌ తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకొని ఈ ప్రాజెక్టుకు సంతకం చేశారని తెలుస్తోంది. దాంతో మిగతా నటులు, సిబ్బంది కూడా వాళ్ల బాటలోనే నడవనున్నారు. కాగా, విజయ్‌ నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో స్టార్ హీరో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా లేకపోయి ఉంటే వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఓటీటీ నుంచి ఆఫర్లు వస్తున్నా.. థియేటర్లలోనే రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

సారూ… నోరిప్పండి!

Kcr

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. వైరస్ బారిన పడుతున్నవారు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. అయితే వైరస్ సోకినివారికి తెలంగాణలో సరియైన ట్రీట్మెంట్ ఇవ్వడం లేదనే టాక్ వినపడుతోంది. వారికి కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వాలు దేశంలో అనేకం ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందనేది బహిరంగ రహస్యం. ఇదిలా ఉంటే మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్య(రికవరీ) కూడా పెరుగుతొందని ప్రభుత్వ వర్గాలు లెక్కలేస్తున్నాయి. కనీసం ట్రీట్ మెంట్ కి కావలిసిన వైద్య సౌకర్యాలు అందించకుండానే అంతమంది ఎలా రికవరీ  అవుతున్నారనేది..? ఒక సామాన్యుడి ప్రశ్న.

Also Read : ఇద్దరు మిత్రులే కానీ.. నీళ్ల వద్దే పంచాయితీ..!

ఇదే విషయంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయి. ఓ మీడియా సంస్థతో గవర్నర్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని అన్నారు. కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేక పోయిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా తీవ్రత వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సూచనలు చేస్తూ…ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ తమిళిసై తెలిపారు. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది.

కరోనా నియంత్రణలో కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా తెలంగాణ సర్కారును దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన రాకపోవడం సహజంగానే ఆసక్తిని రేకెత్తించే అంశం. ఈ ఎపిసోడ్ పట్ల వివిధ వర్గాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. మొదటిది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహజ శైలి అయిన స్పందించకుండా ఊరుకోవడం. స్పందిస్తే ఈ విషయం ప్రాధాన్యం పొంది చర్చ లోతుల్లోకి వెళ్లి సహజంగానే తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది.

Also Read : చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

రెండో అంశం కేంద్రం దృష్టిలో తన పని తీరు పడాలనే ఉద్దేశంతో గవర్నర్ ఈ రీతిలో స్పందించారని టీఆర్ఎస్ వర్గాలు అనుమానపడుతున్నాయట. తెలంగాణ బీజేపీ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో గవర్నర్ ఇలా అసంతృప్తి వ్యక్తం చేయడం సహజంగానే వారికి మేలు చేసే అంశం. ఈ నేపథ్యంలో గవర్నర్ మాటలపై స్పందిస్తే కరోనా కలకలం మరిన్ని మలుపులు తిరగడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయని టాక్.

మరోవైపు ఈ ఎపిసోడ్లోకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. గవర్నర్ తీరును తప్పుపడుతూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన ట్వీట్ తొలగించడం వెనుక కారణం కేటీఆర్ అని చెప్తున్నారు. మనపని మనం చేసుకుంటూ పోవాలే తప్పించి స్పందించకూడదని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు గవర్నర్ కామెంట్లపై స్పందిస్తే కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ సహా వివిధ సంస్థలు ఎంట్రీ ఇచ్చి కరోనాపై తెలంగాణ సర్కారు పనితనాన్ని విశ్లేషిస్తాయనే ఉద్దేశంతో సైలెంట్ అయిపోవాలని గులాబీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read : వైసీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే పెత్తనమెంటో?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడురోజులేనా?


తెలంగాణ ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సమావేశాలు కేవలం వారంరోజులు మాత్రమే జరిగేలా కన్పిస్తున్నాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలను 15నుంచి 20రోజులపాటు నిర్వహించేలా అధికారులకు సూచించినప్పటికీ అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల కుదింపుకే అధికారులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారం నుంచి పదిరోజులపాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Also Read: మౌనమే కేసీఆర్ ఆయుధం!

ఈమేరకు సెప్టెంబర్ 7నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ సమావేశాలు కేవలం ఏడు నుంచి పదిరోజుల్లో ముగించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో శాసన మండలి సమావేశాలు ఐదురోజులపాటు నిర్వహించాలనే ప్రభుత్వం యోచిస్తోంది. ఇక కరోనా నిబంధనలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సీట్ల మధ్య దూరం.. అసెంబ్లీని శానిటైజ్ చేయడం.. కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సమాశాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డిలు అధికారులతో సమీక్షించనున్నారు. ఏర్పాట్లపై స్పష్టత వచ్చాక సీఎం కేసీఆర్ తో చర్చించి అసెంబ్లీ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోవాల్సి ఉంది. తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ, ఎఫ్‌ఆర్‌బీఎం, ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో పనిచేసే అధ్యాపకుల రిటైర్మెంట్‌ వయసు 65ఏళ్లకు పెంపు వంటి ఆర్డినెన్స్‌లు చర్చకు రానున్నాయి.

Also Read: చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

వీటితోపాటు సాగునీటి విభాగం పునర్వ్యవస్థీకరణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ, నియంత్రిత సాగు, నూతన సచివాలయ భవన నిర్మాణం అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇటీవల మృతిచెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు పలు బిల్లులపై సమావేశాల్లో చర్చించనున్నారు. ఇక మార్చిలో అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కరోనా కారణంగా గడువుకు ముందే అర్ధాంతరంగా ముగించింది.

తాజాగా మరోసారి వర్షాకాల సమావేశాలు కూడా కేవలం ఏడురోజుల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో కీలక బిల్లులపై ఏమేరకు చర్చలు జరుగుతాయనే సందేహాలు మాత్రం కలుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలపై ఎలా ముందుకెళుతుందో వేచి చూడాల్సిందే..!

ఇద్దరు మిత్రులే కానీ.. నీళ్ల వద్దే పంచాయితీ..!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు. వీరిద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నప్పటికీ వీరిద్దరు చాలా సన్నిహితంగా మెలుగుతుంటారు. వీరిద్దరి కామన్ శత్రువు కూడా ఒక్కరే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో వీరిద్దరి స్నేహం మరింత బలపడింది. కిందటి ఎన్నికల్లో ఏపీలో జగన్ సీఎం అయ్యేందుకు తెలంగాణ సీఎం తనవంతు సహకారం అందించారనే టాక్ రాజకీయాల్లో వర్గాల్లో ఉంది. కేసీఆర్ ఊహించినట్లుగా ఏపీకి సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య మరింత స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి.

Also Read: చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటికీ కంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇరు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నారు. ఇద్దరు సీఎంలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ కొంతకాలంగా ముందుకెళుతున్నారు. రాజకీయ కార్యక్రమాలకు కాకుండా అంతకుమించి రిలేషన్ ను ఇద్దరు సీఎంలు మేయింటేన్ చేస్తున్నారు. ఒకరి ఇంటికి ఒకరి వెళుతూ అప్యాయం భోజనం చేసుకున్న సంఘటలున్నాయి. ఇలాంటి వీరిమధ్య నీళ్ల పంచాయతీ చోటుచేసుకోవడం పరిస్థితులు మారిపోతున్నాయి. ఇద్దరు సీఎం బహిరంగంగా విమర్శలు చేసుకోకపోయినప్పటికీ ఎవరికి వారు నీటి కోసం కత్తులు దూసుకునేందుకు రెడీ అవుతున్నారు.

లక్షల క్యూసెక్కుల నీళ్లు గోదావరి పాలవుతుందని.. ఆ నీటిని రాయలసీమకు తరలించాలని సీఎం కేసీఆర్ సూచిస్తున్నారు. ఆ నీటిని తరలించకుండా తెలంగాణను ఎండబెట్టేలా శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని రాయలసీమకు తరలించడంపై కేసీఆర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది విభజన హామీలకు పూర్తి వ్యతిరేకమని కేసీఆర్ బలంగా వాదిస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమకు రావాల్సిన నీటి వాటానే రాయలసీమకు తరలిస్తున్నామని పేర్కొంటున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల వద్ద నీటిని తెలంగాణ తోడేస్తుండటంతో రాయలసీమకు నీరందడటం లేదంటున్నారు. దీంతో పోతిరెడ్డిపాడు ఎత్తుపెంచి నీటిని తరలిచేందుకు జగన్ రెడీ అవుతున్నారు.

Also Read: మౌనమే కేసీఆర్ ఆయుధం!

ఈ విషయంలో తెలంగాణ, ఏపీలు మధ్య వివాదం నెలకొలనడంతో కేంద్రం మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈమేరకు ఇరురాష్ట్రాల సీఎం కూర్చోబెట్టి మాట్లాడేందుకు రెడీ అవుతోంది. ఈనెల 8న జరుగాల్సిన అపెక్స్ కమిటీ మీటింగ్ వాయిదా పడింది. తెలంగాణ సీఎం అభ్యర్థనతో ఈనెల 25కు ఈ భేటి వాయిదా పడినట్లు సమాచారం. ఈ బేటిలో ఇరురాష్ట్రాలు నీళ్ల పంచాయితీని తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికారుల మధ్య పలుమార్లు భేటి జరిగిన ఏమి తేలలేదు. దీంతో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల బేటిలోనైనా నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. నీటి విషయంలో ఇరుప్రాంతాల ప్రయోజనాలు ఉండటంతో ఎవరికీ వారు పైచేయి సాధించేందుకు పావులు కదుపుతుండటం గమనార్హం.

అనంతలో నిధి విలువ రూ.4 కోట్ల పైమాటే..!


అనంతపురం జిల్లాలో బుక్కరాయసముద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది ట్రంకు పెట్టెల్లో ఉన్న నిధి మొత్తం విలువ రూ.4 కోట్లుపైగా ఉంటుందని పోలీసులు తేల్చారు. ఈ మొత్తంలో 2.40 కిలోల బంగారం, 84.10 కిలోల వెండి, రూ.15.50 లక్షల నగదు, 49.10 లక్షల విలువైన ఫిక్సుడ్ డిపాజిట్ లు, 27.05 లక్షల విలువైన ప్రాంసరీ నోట్లు, మూడు గన్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది ట్రంకు పెట్టెల్లో లభించాయి. ఈ నిధి మొత్తం లెక్కించడానికే పోలీసులకు ఒక రోజు పట్టింది. ఇంత పెద్ద మొత్తంలో చరస్తులను కలిగి ఉండటం సాధారణ వ్యక్తులకు సాధ్యంమైయ్యే పని కాదు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న మనోజ్ కుమార్ ఇంత పెద్ద మొత్తంలో నగలు, డబ్బు ఎలా వచ్చాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read: చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. మనోజ్ కుమార్ కు అతని భార్యతో కొంత కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మనోజ్ కుమార్ భార్యను, ఆమె కుటుంబ సభ్యులను గన్ చూపించి కాల్చిపాడేస్తానని బెదిరించాడు. ఈ సంఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గన్ గురించి మనోజ్ ను ఆరా తీయగా తన డ్రైవర్ నాగలింగం మామ బాలప్ప ఇంట్లో ఉన్నట్లు చెప్పారు. గన్ స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన పోలీసులకు ఎనిమిది ట్రంకు పెట్టెలు కనిపించడంతో వాటిని తెరిచారు. పెద్ద మొత్తంలో నగలు, నగదు లభించడంతో స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: అదృష్టం కొద్దీ బెయిల్ వచ్చింది..! మరి బుద్ధి….?

ఇప్పడు మనోజ్ కుమార్ చేసే పనులు ఏంటి? అతని జీవన విధానం ఎలా ఉందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. మనోజ్ కుమార్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఖరీదైన నాలుగు కార్లు, ఐదు గుర్రాలు, ఖరీదైన బైక్ లు, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో మనోజ్ జీవనం సాగిస్తున్నాడు. 2005 లో అతని తండ్రి మృతితో కారణ్య నియామకంలో ఖజానా శాఖలో ఉద్యోగాన్ని పొందిన మనోజ్ కు 15 ఏళ్ల వ్యవధిలో ఇంత సంపద ఎలా వచ్చిందనేది ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారింది. మనోజ్ ఒక స్వామిజీతో సత్సంబందాలు కలిగి ఉన్నాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ చేసి పూర్త సమాచారం సేకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

ఎక్స్ క్లూజివ్ : ESI స్కామ్ లో అరెస్టులు జరిపిన వారే A1?

మాజీ మంత్రి, టిడిపి సీనియర్ పార్టీ నేత అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేపో మాపో అతనిని జైలుకు పంపిస్తాం అన్నట్లు ఏసీబీ ఉన్నతాధికారులు హుటాహుటిన అతని ఆరోగ్యం బాగోలేకపోయినా…. తన సొంత నివాసం నుండి నానా హంగామా చేసి అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన జరిగి దాదాపు రెండు నెలలు పూర్తి అయిపోయింది కానీ ఇప్పటివరకు అచ్చెన్నాయుడి పై చార్జిషీట్ లేదు అని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది.

ఏదైనా స్కామ్ జరిగినప్పుడు అక్కడ అవినీతి సొమ్ము అనేది ఉండాలి. అది కాస్తా తవ్వేకొద్ది బయటపడుతుంది. రెండు నెలల నుండి ఏసీబీ వారు ఎన్నోసార్లు అచ్చెన్నాయుడు ని అతనితోపాటు అరెస్టయిన 12 మందిని విచారించారు. అయితే ఒక్క రూపాయి కూడా బయటపడలేదు. దీంతో “ఈ కేసులో అసలు సీరియస్ నెస్ ఎంత?” అనే ప్రశ్న ప్రజల మదిలోకి వచ్చేసింది. అచ్చెన్నాయుడు ఒత్తిడితోనే అధికారులు స్కామ్ కు తెరలేపారు అన్నది ఏసీబీ ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి గతంలోనే అచ్చెన్నాయుడు రాశాడు అని చెప్పిన కొన్ని లేఖలు బయటకు వచ్చాయి. అయితే అచ్చెన్నాయుడుకి మాత్రం రూపాయి కూడా రాలేదు అన్నదీ ఏసీబీ అధికారులే చెబుతున్నారు. అధికార దుర్వినియోగం కింద ఇన్ని రోజుల లోపల ఉన్న అచ్చెన్నాయుడు అలాంటి వ్యక్తికి బయటనుండి బెయిలు రాకపోవడం ఏమిటి?

ఇక అచ్చెన్నాయుడు చూస్తే తాను స్వతహాగా ఎవరి మీద ఒత్తిడి తీసుకురాలేదని.. ప్రభుత్వం నిర్ణయాల ప్రకారమే నడుచుకున్నాను అన్నట్లు చెబుతున్నాడు. అంతే… వైసీపీ సోషల్ మీడియా దీనిని ఆధారంగా చేసుకొని టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీని వెనకాల ఉన్నాడని… ఈ కేసులో A1 అతనే అని అంటున్నారు. అలాంటప్పుడు ఏసీబీ అధికారులు ఇన్నిసార్లు తీగలాగితే డొంక కదలకపోవడం వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అసలు ఏసీబీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే.. ‘ఇన్ని నెలలు విచారణలో ఒక్క రూపాయి బయటపడకుండా…. ఒకరి పేరు కూడా బయటకు రాకుండా కాలం ఎలా గడుపుతున్నారు…?’ అన్నది ప్రశ్న.

ప్రభుత్వం ఒత్తిడి మీద ఏసీబీ అధికారులు వ్యవహరించినట్లు అయితే అసలు వారు చెబుతున్న ఈ స్కామ్ లో ఎలాంటి బలమైన ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు అరెస్టు జరిపినందుకు వారే A1 ముద్దాయిలుగా గుర్తింపపబడతారు. “అంతటి వరకు ఎవరూ తెచ్చుకోరు” అన్నది ప్రజల నమ్మకం. మరి అవినీతి నిరోధక శాఖ అధికారులే అచ్చెన్నాయుడు అరెస్ట్ పై…. అతనికి సంబంధించిన అవినీతి సొమ్ము పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోవడం…. మీడియా ముందు తడబడటం వంటివి చూస్తుంటే ఎవరైనా ఏమనుకోవాలి?

Also Read : చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

నిన్నమొన్నటిదాకా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అరెస్టు విషయంలో కూడా అధికార పార్టీ నేతలు…. అతను ఖచ్చితంగా జైలు ఊచలు లెక్కపెడతారని సెలవిచ్చారు. ఏసీబీ మాత్రం ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతోంది. అంటే… ప్రభుత్వం, ఏసీబీ మధ్య సమాచార లోపం జరిగిందా…? ఇదంతా చూస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏదో హడావిడి కోసం టిడిపి నేతలను అరెస్ట్ చేయించి, తద్వారా ఆ భయం మిగిలిన వారిలో కూడా నింపేందుకు, నాయుడు నోరుని కంట్రోల్ చేసేందుకు ఇదంతా చేస్తున్నట్లు ఉందే తప్ప…. దీని వెనుక అసలు సరైన కారణాలు లేవంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు…?

Also Read : అదృష్టం కొద్దీ బెయిల్ వచ్చింది..! మరి బుద్ధి….?

నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !


నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే పెళ్లిని కూడా పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్న ప్రభాస్.. అంతే స్పీడ్ తో సినిమాలను కూడా పూర్తి చేయాలని కరోనాను కూడా లెక్క చేయకుండా అక్టోబర్ 12 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేయడానికి డేట్స్ కూడా ఇచ్చేసాడు. నిజానికి కరోనా దెబ్బకు భయపడి షూటింగ్ లకు సినిమా వాళ్ళు బ్రేక్ ఇచ్చి ఇప్పటికే నాలుగు నెలలు పూర్తి అవుతున్నా.. మన స్టార్ హీరోలు షూట్ చేద్దామంటూ ఎవ్వరూ ముందుకు రావట్లేదు. షూటింగ్ కోసం ప్రస్తుతం ప్రభాస్ మాత్రమే సన్నద్ధం అవుతున్నాడు.

Also Read: శ్రీరాముడు ప్రభాస్‌, సీత కీర్తి సురేషేనా..!

అయితే ప్రభాస్ ఇంత త్వరగా షూట్ చేయడానికి కారణం, నిర్మాత నష్ట పోకూడదు అనే. లాక్ డౌన్ కి ముందు ‘రాధే శ్యామ్’ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి ఓ భారీ హాస్పిటల్ సెట్‌ వేశారట. సెట్ కావడంతో అది ఐదు నెలలకు మించి ఎక్కువ కాలం ఉండదని.. ఇప్పటికే సెట్ వేసి నాలుగు నెలలు పూర్తి అవుతున్న నేపథ్యంలో.. అక్కడ సాధ్యమైనంత త్వరగా షూట్ చేయకపోతే సెట్ పోతుంది, నిర్మాతలకు ఆరు కోట్లు నష్టం వస్తోందనే ఉద్దేశ్యంతోనే.. ప్రభాస్ షూట్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఏమైనా నిర్మాత కోసం ప్రభాస్ రిస్క్ చేయడానికి కూడా సిద్ధం కావడం అతని మంచి మనసుకి నిదర్శనం.

Also Read: అయ్యో.. పాపం బాలయ్య.. !

కాగా అక్టోబర్ 12 నుండి మొదలుకానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు పది రోజుల పాటు ప్రభాస్ తో పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై కూడా కీలక సన్నివేశాల షూట్ జరగనుంది. ఆ తరువాత ఈ హాస్పిటల్ సెట్‌ లోనే క్లైమాక్స్ లో ప్రభాస్ పై వచ్చే కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని.. ఈ సీన్స్ సినిమాలోనే హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఏ మాత్రం హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. ఇప్పుడు ఇది మరొక పెద్ద సమస్యగా మారింది. ఈ సినిమాని నాలుగు భాషల్లో మార్కెట్ చేయాలంటే డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ ముఖ్యం. అందుకే ఈ సినిమాకి బిజినెస్ విషయంలో నిర్మాతలకు కాస్త ఇబ్బందే. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నాయి.

సోనియా కుటుంబానికి ఎంత బాధ..!?

Sonia Gandhi

జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏడు పదుల వయసులో తలకు మించిన భారాన్ని మోస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన వేళ.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఈ వయసులోనూ సోనియాగాంధీనే మోస్తోంది. తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వర్గాలు ఎంత కోరుతున్నా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంత ఒత్తిడి తెస్తున్నా.. రాహుల్ మాత్రం ససేమిరా అంటున్నారు. సోనియాగాంధీకి కూడా గాంధీయేతర వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచన లేదు. ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. తన సోదరుడు మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో అంగీకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతరులు నాయకత్వం వహించాలని ఆమె కోరారు. తమ కుటుంబానికి చెందిన వారెవరూ పార్టీ అధ్యక్షుడిగా ఉండకూడదని రాహుల్ తనకు చెప్పారని దానికి అంగీకరించానని ఆమె అన్నారు.పార్టీ దాని సొంత కాళ్లపై ఎదగాలంటే కుటుంబ ప్రభావాన్ని తొలగించాలన్న వాదనకు తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.

Also Read : గాంధీయేతరుడే కాంగ్రెస్ కు దిక్కా?

ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు గాంధీయేతర వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి స్వయంగా ప్రియాంక గాంధీ మద్దతు తెలుపడం విశేషం. గాంధీయేతర వ్యక్తి కింద పనిచేయడానికి తనకు ఎలాంటి సమస్యలు లేవని.. చీఫ్ ఏ పదవిని ఇచ్చినా తాను నెరవేరుస్తానని ప్రియాంక తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీయేతర వ్యక్తికి అప్పజెప్పడానికి సోనియానే అడ్డుగా ఉన్నారు. ఎందుకంటే ఆమె అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యి స్వతంత్రంగా వ్యవహరిస్తే అణిచివేశారు. ఇప్పుడూ ఎవ్వరినీ కాంగ్రెస్ లో ఎదగనీయడం లేదు. కానీ బీజేపీని ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న సోనియా రాహుల్ ప్రియాంక కుటుంబ బలం సరిపోదు. దీంతో గాంధీయేతరుడైన సమర్థవంతమైన వ్యక్తి కోసం కాంగ్రెస్ వెతకాల్సిన అవసరం ఉంది.

మోడీ, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ జెట్ స్పీడ్ తో దూసుకొనిపోతుంటే.. సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడపోతోంది. క్షేత్రస్థాయి నుండి కాంగ్రెస్ పునరుద్ధరించవలిసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు తగిన సమర్ధవంతమైనా నాయకుడు ఆ పార్టీకి చాలా అవసరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సోనియా తీసుకునే నిర్ణయంపై కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంది.

Also Read : భారత్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూపు..!

టీవీ 5, ఎన్టీవీ మీడియా వార్.. అసలు కథేంటి?


తెలుగు న్యూస్ చానెల్స్ లో టాప్ 5లో ఉండే ప్రముఖ చానెల్స్ టీవీ5, ఎన్టీవీల మధ్య మీడియా వార్ జర్నలిస్టు సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు చానెల్స్ ఒకరి తప్పులను ఒకరు ఎత్తుచూపుతూ తాజాగా ప్రోమోలు విడుదల చేశాయి. దీంతో వారి పరువును వారే తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు చేసిన అక్రమాలను తవ్వి తీసుకుంటూ ఒకరి భాగోతాన్ని మరొకరు బయటపెట్టుకున్తున్నారన్న  చర్చ సాగుతోంది.

*చానెల్స్ మధ్య వివాదమేంటి?
తాజాగా టీవీ5లో ‘జూబ్లీహిల్స్ లో భూదందా’ నడిపారని ప్రత్యర్థి టీవీ చానెల్ ఎండీపై ‘అనకొండ’ పేరుతో కథనాలు ప్రసారం చేయడం వివాదానికి కారణమైంది. ఆ తర్వాత జూలు విదిల్చిన ఎన్టీవీ వరుస కథనాలు రాసుకొచ్చింది. టీవీ5 యజమాని గతంలో సొంతంగా హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్, కీళ్ల నొప్పుల ఆయిల్ ను అభివృద్ధి చేసి దానికి విపరీతమైన ప్రచారాన్ని కల్పించి జుట్టు మొలుస్తుందని.. కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మించి 100 కోట్ల వరకు దండుకున్నాడని ఒక నాయుడు 100 లీలలు అని   ఎన్టీవీ చానెల్ తాజాగా ప్రోమోలు రిలీజ్ చేసి ఆరోపించిన వైనం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి న్యూజెన్ ఆయిల్ ప్రోడక్ట్ ను టీవీ5 ఒకరిని బెదిరించి లాక్కుందని కథనాల్లో ఆరోపించారు.

Also Read: కేసీఆర్ పై పోస్టు పెట్టినందుకు యువకుడి అరెస్ట్..! అదే చట్టం ప్రభుత్వానికి వర్తించదా?

*టీవీ5 వెనుకున్నది ఎవరు?
టీవీ5 ఫక్తు టీడీపీ అనుకూల చానెల్ గా ఉంది. ఎప్పుడూ టీడీపీని మోసే కథనాలు, వార్తలు వండివారుస్తూ వైసీపీని ఎండగడుతుంది. తాజా వివాదంలో టీవీ5 వెనుకాల చంద్రబాబు, సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేశ్ లు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో జరిగిన రియల్ ఎస్టేట్ దందాలో ఎన్టీవీ యజమాని కోట్లు దండుకున్నాడని ఆరోపిస్తూ కథనాలు రాస్తున్నాయి.

*ఈ రెండు చానెల్స్ మధ్య జర్నలిస్టులు బలి
కాగా ఎన్టీవీ, టీవీ5 చానెల్స్ 2014 వరకు బాగానే ఉన్నాయి. చానెల్స్ యజమానులు ఇద్దరూ చంద్రబాబు సామాజికవర్గమే కావడంతో ఆయనకు కాపు కాశాయి. లబ్ధి పొందాయి.అయితే తాజాగా ఎన్టీవీ వైసీపీ అధికారపక్షంలో చేరడం.. వైసీపీకి అనుకూలంగా రాయడంతో టీడీపీ బ్యాచ్ తట్టుకోలేక ఈ వార్ మొదలుపెట్టిందంటున్నారు. వీరిద్దరి మధ్యలో జర్నలిస్టులను బలి చేస్తున్నారు. వీరిద్దరి కోసం ఆధారాలు కూపీలాగుతూ జర్నలిస్టులు టార్గెట్ అవుతున్నారు. రేపు ఈ రెండు చానెల్స్ యజమానులు కలిసినా బలయ్యేది జర్నలిస్టులే..

*ప్రజాసమస్యలను గాలికి వదిలేసిన చానెల్స్
ఇప్పుడు కరోనా కబళిస్తోంది. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. నిర్వాసితుల బాధలు ఘోరంగా ఉన్నాయి. వైద్యసేవలు అథమ స్థాయిలో ఉన్నాయి. అయినా ఇటువంటి ప్రజాసమస్యలు ఏవీ పట్టించుకోకుండా సదురు చానెల్స్ తమ గోతులు తవ్వుకునే కథనాలు వెలువరిస్తూ పరువు తీసుకుంటున్నాయని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సమాజంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఉన్నా కూడా అవేవీ ఈ చానెల్స్ కు పట్టకపోవడంపై జనాలు మండిపడుతున్నారు. జనాలకు సంబంధించిన విషయాల మీద కనీసం కవరేజి ఇవ్వకుండా.. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపకుండా విలువలను ఈ చానెల్స్ పోగొట్టుకుంటున్నాయి. ఎవరి సొంతలాభం… పార్టీల లాభం కోసం ఈ చానెల్స్ దుమ్మెత్తిపోసుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫోర్త్ ఎస్టేట్ కు అర్థం పోగొడుతున్న ఈ చానెల్స్ తీరు అభాసుపాలవుతోంది.

Also Read: సీఎంపై ఫైరవుతున్న రాములమ్మ.. త్వరలోనే ప్రెస్ మీట్?

*టీడీపీ, వైసీపీ ఫైట్ లో పావులుగా చానెల్స్
నిజానికి టీవీ5 ఇప్పుడు టీడీపీ తరుఫున.. ఎన్టీవీ వైసీపీ తరుఫున నిలబడి తమ గోతులు తామే తవ్వుకుంటున్నాయని అంటున్నారు. అధికారం మారడంతో మీడియాల్లో పార్టీలు ఎంట్రీ ఇచ్చి పట్టు సాధించేందుకు చేసే ప్రయత్నాలలో ఎవరికీ వారు తమ ములాలు  పెకిలించుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీలు బాగానే ఉన్నా.. ఈ రెండు చానెల్స్ విశ్వసనీయతకు మాత్రం బొక్కపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈసారి టాంక్‌ బండ్ దగ్గర సందడి లేనట్లేనా?

Khairatabad Ganesh
వినాయక చవితి వచ్చిందంటే చాలు జంట నగరాల్లో ఆ సందడే వేరు టాంక్‌ బండ్ దగ్గర గణపతుల నిమజ్జనాలను వీక్షీంచేందుకు జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ కళ లేదు ఆ సంబరం లేదు. కరోనాతో గణేశ్ ఉత్సవాలు ఇంటికే పరిమితం కానున్నాయి. బొజ్జ గణపయ్యలు ఇళ్లలోనే ఉండిపోనున్నారు. గణేశుడు ఎక్కడ పూజలందుకుంటాడో అక్కడే నిమజ్జనం చేయాలని అధికారులు అంటున్నారు.

Also Read : మౌనమే కేసీఆర్ ఆయుధం!

కోవిద్ వల్ల ఈ సారి గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఖైరతబాద్, బాలాపూర్ వినాయకుల దగ్గర కోవిడ్ నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పోయిన సంవత్సరం 65 అడుగుల ఎత్తున దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి కేవలం 9 అడుగులు మాత్రమే దర్శనం ఇవ్వనున్నాడు. ప్రతి సంవత్సరం ఖైరతబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. ఈసారి కరోనా వల్ల ఆన్‌ లైన్‌ లో మాత్రమే దర్శనం చేసుకోవాలని నిర్వాహకులు చెప్తున్నారు.

గణేశ్ నిమజ్జనాల విషయంలో హిందువుల సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రేటరీ భగవంతరావు విమర్శించారు. గత సంవత్సరం లక్షా 11 వేల మండపాలు ఏర్పాటు చేశారని ఈసారి విగ్రహాల ఎత్తుకు పోటీపడకుండా సాదాసీదాగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈసారి ప్రభుత్వ ఆంక్షలతో ట్యాంక్ బండ్ దగ్గర ప్రతి సంవత్సరం కనిపించే వాతావరణం కనిపించదు. కేవలం ఖైరతాబాద్‌ తో పాటు బాలాపూర్ వినాయకులకు మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

Also Read : సీఎంపై ఫైరవుతున్న రాములమ్మ.. త్వరలోనే ప్రెస్ మీట్?

చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

టిడిపి అధినేత, ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ విషయమై నేరుగా ప్రధానికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో పిల్ వేయించి చంకలు గుద్దుకుంటున్నారు. కోర్టు వారు… ఆరోపణలపై విచారణ జరిపించాలని అడగడం అనేది చంద్రబాబు విజయంగా టిడిపి పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. కానీ అదే అతనిని నిట్టనిలువునా ముంచబోతోంది అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.

Also Read : అదృష్టం కొద్దీ బెయిల్ వచ్చింది..! మరి బుద్ధి….?

అసలు కోర్టు విచారణ జరపడానికి ఆదేశించడమే చంద్రబాబుకు తీరని నష్టం చేకూరుస్తుంది. అదే జరగకపోతే… మూడున్నర ఏళ్ళ పాటు ఇవే ఆరోపణలు చేసుకుంటూ చంద్రబాబు కాలం గడిపేవారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో తప్పు జరిగిందని ఆరోపణలు చేసినప్పుడు దాని పై విచారణ చేపట్టాల్సిన బాధ్యతగా రాష్ట్ర పోలీసు శాఖ సాక్షాలు అడిగారు. అవి లేవు కాబట్టే చంద్రబాబు “మీకు ఇప్పుడే నా లేఖలు కనబడ్డాయా…. నేను వైజాగ్ వచ్చినపుడు ఏం స్పందించలేదే…. మా నేతల అరెస్టు పట్టించుకోలేదే?” అని రకరకాల విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు జడ్జీలు, న్యాయవాదుల ఫోన్లు ట్యాపింగ్ కి గురి అయ్యాయని చంద్రబాబుకి ఎలా తెలిసింది? ఎవరైనా వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకున్నారా…. లేక ఇంకేదైనా కొత్త రహస్యాలను బయటపెట్టే యోచనలో చంద్రబాబు ఉన్నాడా?

నిజంగానే చంద్రబాబు కి అంత నెట్ వర్క్ ఉంటే డిజిపి అడిగినప్పుడే దానికి సంబంధించిన కనీస సమాచారం బయటపెట్టాలి కానీ ఇలా సంబంధం లేని మాటలు మాట్లాడరు. ఈ రోజు కాకపోయినా రేపైనా విచారణలో భాగంగా ట్యాపింగ్ కి గురైన న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎవరు అని కోర్టు వారు ప్రశ్నిస్తారు. అప్పుడైనా సరే పిల్ వేసిన వారికి చివాట్లు తప్పవు. చంద్రబాబు ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడవలసి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ నుండి ఎంతటి ఖచ్చితమైన స్పందన వస్తుందని ఊహించి ఉండరు. అన్నీ ఆరోపణలు లాగానే వీటిని కూడా విస్మరిస్తారు అనే అనుకున్నారు కానీ ఆధారాలు ఉంటే ఇవ్వండి…. విచారణ చేస్తామని స్వయంగా రాష్ట్ర డిజిపి చెప్పిన మాట విని బాబు షాక్ అయ్యాడు. అంతే.. ఢిల్లీ కి పోస్ట్ పంపితే మీకెందుకు నొప్పి అని ఒక్కసారిగా ట్రాక్ మార్చాడు. చివరికి తనకి తెలియకుండానే ఇప్పుడు కార్నర్ అయిపోయాడు.

Also Read : వైసీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే పెత్తనమెంటో?

మౌనమే కేసీఆర్ ఆయుధం!


ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు రాజకీయ నాయకుడు.. ఇప్పుడు కేసీఆర్ అదే చేస్తున్నారు. తనతో సమానులను ఎక్కడో కొట్టాలో కేసీఆర్ కు బాగా తెలుసు. కానీ తనను మించిన వారి విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా కేసీఆర్ కు తెలిసినట్టు మరెవరికీ తెలియదని అంటుంటారు.

Also Read: సీఎంపై ఫైరవుతున్న రాములమ్మ.. త్వరలోనే ప్రెస్ మీట్?

యావత్ దేశమే కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. తెలంగాణ కేసీఆర్ సర్కార్ అందులో విఫలమైందనడం అతిశయోక్తి అవుతుందేమో.. కానీ ఈ విపత్తుకు అందరూ బాధితులే.. సరైన చర్యలు తీసుకోకపోవడంలో కేసీఆర్ వైఫల్యం కనిపిస్తోంది. దేశంలోనా చాలా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.

అయితే తెలంగాణలో కరోనాను సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదని ఏకంగా బీజేపీ నియమించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ సర్కార్ పరువును దేశవ్యాప్తంగా తీశాయి. బీజేపీ నియామక గవర్నర్లు అంతా ఆయా రాష్ట్రాల్లో పుల్లపెడుతూ వారిని ప్రశాంతంగా ఉండనీయని పరిస్థితులు చూస్తున్నాం. అయితే గవర్నర్ సూచించినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని ఆమె ఆడిపోసుకున్నారు.

అయితే గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలకు మింగుడుపడడం లేదు.ఇప్పటికే హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఏకంగా గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్ చేసి డిలీట్ చేయడం దుమారం రేపింది. టీఆర్ఎస్ నేతలంతా లోపల గవర్నర్ తీరుపై కుతకుతలాడుతున్నారు.

Also Read: కేసీఆర్ పై పోస్టు పెట్టినందుకు యువకుడి అరెస్ట్..! అదే చట్టం ప్రభుత్వానికి వర్తించదా?

అయితే కేంద్రంలో మోడీ బలంగా ఉండడం.. ఆమె ప్రతినిధిగా గవర్నర్ తమిళిసై ఉండడం.. కేసీఆర్ సర్కార్ ఆమోదించే బిల్లులన్నీ ఆమె చేతికే వెళుతుండడంతో కేసీఆర్ సర్కార్ టీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళం వేస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోవాలని సూచిస్తోంది. వ్యాఖ్యలు పట్టించుకొని మాట్లాడితే దానిపై ప్రతిపక్షాలు మరింత ఆజ్యం పోసి దుమారం రేపి బీజేపీతో ఇబ్బందులు తెస్తాయని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.. అందుకే అవన్నీ వదిలేసి పనుల్లో ప్రభుత్వ నిబద్ధతను మాత్రమే చూపాలని కేసీఆర్ మౌనం దాల్చారట.. మౌనమే గవర్నర్ వ్యాఖ్యలకు మందు అని..అవే మరుగునపడిపోతాయని కేసీఆర్ భావిస్తున్నారు.