Home Blog Page 8361

అల్లు అరవింద్ కే పరీక్ష అట ?


మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమాలను కూడా ఓటీటీ సంస్థలు బాగా ఆదరిస్తోన్న కరోనా రోజులు ఇవి. మరి అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా ‘బుచ్చినాయుడు కండ్రిగ – తూర్పు వీధి…’. ఈ సినిమా టైటిలే విచిత్రంగా ఉన్నా సినిమాలో మ్యాటర్ బాగానే ఉందట. ఈ సినిమా ట్రైలర్‌ను హీరోయిన్ సమంత విడుదల చేయడం, ఈ సినిమా ‘ఆహా’లో విడుదలవుతుండటంతో మొత్తానికి ఈ బుడ్డ సినిమా పై బాగానే ఆసక్తి పెరిగింది జనాల్లో. ముఖ్యంగా మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాలు జాబ్, చదువు, ప్రేమ, పెళ్లి వంటి ప్రధాన విషయాలతో జనం ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొకుంటున్నారనే థీమ్ ఆధారంగా ఈ సినిమాని ఎమోషనల్ గా తీసినట్లు తెలుస్తోంది.

Also Read: సాంగ్స్ కోసం ‘పుష్ప’ను సిద్ధం చేస్తున్నారు !

మున్నా, దృశిక చందర్ అనే కొత్త హీరోహీరోయిన్లు నటించిన ఈ సినిమాని కృష్ణ పోలూరు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం 1994 నుంచి 2004 మధ్య జరిగిన కథ అట. అల్లు అరవింద్ ఈ సినిమాని చూసి, సినిమాలో కంటెంట్ బాగా నచ్చి.. వెంటనే సినిమాని తీసుకున్నారని తెలుస్తోంది. పరువు నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథలో అన్ని ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశారట. ప్రతి కథ మనిషి పుట్టుకతో మొదలవుతుంది. కానీ, నా కథ నా సావుతో మొదలైంది’’ అంటూ మొదలైన ట్రైలర్‌ కూడా బాగానే ఉంది.

Also Read: తెలుగు స్టార్ పై బాలీవుడ్ హీరోల టెన్షన్ !

మరి ఈ యూత్ ఫుల్ వినూత్న సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.. తనను కాదన్న అమ్మాయిపై అబ్బాయి పెంచుకున్న ద్వేషాన్ని మెయిన్ కథగా తీసుకుని.. ఆ అమ్మాయి కోసం పిచ్చోడై మద్యానికి బానిసైన ఆ కుర్రాడి బాధను సినిమాలో కొత్తగా చూపించారట. మొత్తానికి ఈ సినిమాకైతే అల్లు అరవింద్ మంచి ఎమౌంట్ నే సమర్పించుకున్నాడు. మరి అల్లు అరవింద్ జడ్జ్ మెంట్ ఫలిస్తోందో లేక అవుట్ డేటెడ్ అని ప్రూవ్ చేస్తోందో చూడాలి. బన్నీ వాసు లాంటి వారు, ఈ సినిమా బాగాలేదు అని చెప్పినా కూడా, అల్లు అరవింద్ ఒక్కడే ఈ సినిమా మీద నమ్మకంతో సినిమాని కొన్నారట. ఇప్పుడు ఈ సినిమా అల్లు అరవింద్ జడ్జ్ మెంట్ కి పరీక్షలా అయిపోయింది.

ధోని ఫస్ట్ మ్యాచ్.. లాస్ట్ మ్యాచ్ ఒకేలా ముగిసిందే..!

0


ఇటీవలే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెల్సిందే. క్రికెట్ అభిమానులకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను ధోని అందించాడు. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారి ఇండియా జట్టు ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఆ తర్వాత 28ఏళ్లకు ధోని నాయకత్వంలో మరోసారి భారత్ ప్రపంచకప్ అందుకుంది. ఇక నాయకత్వంలో భారత టీం మూడు ఐసీసీ ట్రోఫీలు (వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) దక్కుంచుకుంది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు.

Also Read: సురేష్ రైనా రిటైర్మెంట్లో ‘లాజిక్’ ఇదేనా?

అనుహ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు సాయంత్రం నుంచి ధోని తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినట్లు భావించండి అంటూ తన ఇన్ స్ట్రాలో పోస్టు చేసిన సంగతి తెల్సిందే. నాటి నుంచి ధోని రిటైర్మెంట్ పలురకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ధోని రిటైర్మెంట్ వెనుక బలమైన కారణం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కారణంగానే ధోని సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించాడనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ధోని తొలి మ్యాచ్.. చివరి మ్యాచ్ ఒకేలా ముగియడంపై అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

రాంచికి చెందిన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎలాంటి అంచనాలు లేకుండానే అడుగు పెట్టాడు. 2004 డిసెంబర్‌ 23న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ధోని ఎంట్రీ ఇచ్చాడు. చిట్టగాంగ్‌లో జరిగిన ఈ మ్యాచులో ధోని మొదటి బంతికి రనౌట్ అయి డకౌట్‌ గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాతి కాలంలో భారత్ కు అనేక విజయాలు అందించడంలో కీరోల్ పోషించాడు. వికెట్ కీపర్ గా.. బాట్స్ మెన్ గా.. కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించారు. ఇక ధోని చివరగా 2019లో వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆడాడు. ఈ మ్యాచులో ధోని రనౌట్ గా వెనుదిరిగాడు. డీప్‌లో ఉన్న మార్టిన్‌ గఫ్టిల్‌ విసిరిన థ్రో నేరుగా వికెట్లను తాకడంతో ధోని ఇంచుదూరంలో రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

Also Read: ప్రపంచాన్ని సర్వ నాశనం చేసి.. పార్టీ చేసుకుంటున్న చైనీయులు!

ఈ మ్యాచు తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్లో ఆడలేదు. తాజాగా ధోని తన రిటైర్మెంట్ ప్రకటించడం వరల్డ్ కప్పులో న్యూజిల్యాండ్ తో ఆడిన మ్యాచే ధోని చివరి మ్యాచ్ గా నిలిచింది. దీంతో ధోని తొలి మ్యాచ్.. చివరి మ్యాచ్ రనౌట్ తో ముగియడం కాకతాళీయమే అయినా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ అయినప్పటికీ ఐపీఎల్ ల్లో ఆడే అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ మ్యాచుల కోసం ధోని ఫ్యాన్స్ అత్రుతుగా ఎదురుచూస్తున్నారు.

30 ఎకరాల లో స్టేట్ గెస్ట్ హౌస్! జగన్ దూకుడు మామూలుగా లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరానికి ఉన్న ప్రత్యేకతలు ఎన్నో. పర్ఫెక్ట్ ‘డెస్టినేషన్ సిటీ’ గా అభివర్ణించే ఈ నగరానికి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా ఇవ్వాలని అనుకుంటోంది. చంద్రబాబు హయాంలో కూడా తొలుత రాజధాని విషయమై విశాఖ పేరే వచ్చింది కానీ కొన్ని సామాజిక ఒత్తిళ్ళ వల్ల ఇంకా ఇతరత్రా సమస్యల వల్ల విశాఖ పేరు వెనక్కి వెళ్ళిపోయి అమరావతి రాష్ట్ర రాజధానిగా నిర్మితమైంది. ఇక ఈ సమయంలో ప్రస్తుతానికి రాజధాని రేసులో జగన్ హైకోర్టు స్టే వల్ల వెనుకబడి ఉన్నా కూడా తనదైన దూకుడు మొదలు పెట్టేసాడు అని తెలుస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ లో పనులు కూడా షురు అయిపోయాయి.

వివరాల్లోకి వెళితే 30 ఎకరాల లో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దగా హడావుడి లేకుండా శంకుస్థాపన కూడా చేశారు అని వార్తలు వచ్చాయి. ఇక వీటిలో నిజమెంతో ఇంకా తేలాల్సి ఉంది. ఈ స్టేట్ గెస్ట్ హౌస్ కోసం ప్రీ బిడ్ సమావేశం మంగళవారం జరగడం గమనార్హం. ఈనెల 26వ తేదీ నాటికి బిడ్స్ దాఖలకు అవకాశం కూడా కల్పించారు. 31న వీఎంఆర్‌డీ సమావేశంలో బిడ్డర్‌ని ఖరారు చేసే అవకాశం వుంది. 7వ తేదీ నుంచే పనులు ప్రారంభమవుతాయని వార్తలు వచ్చేశాయి.

ఒక స్టేట్ గెస్ట్ హౌస్ అనేది రాష్ట్రానికి సంబంధించి చాలా ముఖ్యమైనది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా అతిముఖ్యమైన ప్రముఖులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారికి వసతి కల్పించే భవనం అది.. అలాగే వారికి పటిష్టమైన సెక్యూరిటీ అమర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా అలాంటి పరిస్థితుల్లో ఖరీదైన హోటళ్లను ఆశ్రయించే వారు. అదే స్టేట్ గెస్ట్ హౌస్ ఒకటి నిర్మితమైతే ఆ సమస్య ఉండదని అంటున్నారు. ఇక దీనిని విశాఖ ఎయిర్ పోర్టు నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే నిర్మించనుండడం గమనార్హం.

రోహిత్ తో పాటు ఖేల్ రత్నకు ఎంపికైన క్రీడాకారులు వీరే..!

0


క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన ఖేల్ రత్న పురస్కారానికి భారత ఓపెనర్, వైస్ కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్ మ్మెన్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యారు. ఖేల్ రత్న పురస్కానికి వచ్చిన ధరఖాస్తులను పరిశీలించిన సెలక్షన్ కమిటీ జాతీయ అవార్డులకు క్రికెటర్ రోహిత్ శర్మతోపాటు మరో ముగ్గురిని నామినేట్ చేసింది. వీరిలో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా, పారా ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు ఉన్నారు.

Also Read: భారత్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూపు..!

రోహిత్ శర్మ గతేడాదిలో క్రికెట్లో అద్భుతంగా రాణించారు. 2019లో రోహిత్ శర్మ వన్డేల్లో 1490 రన్స్ చేయడంతోపాటు ఏడు సెంచరీలు చేశాడు. ఈమేరకు బీసీసీఐ రోహిత్ శర్మను ఖేల్ రత్న అవార్డు కోసం ప్రతిపాదించింది. ఈమేరకు జాతీయ క్రీడా అవార్డుల సెలక్షన్ కమిటీ రోహిత్ రికార్డులను పరిశీలించిన ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్ చేసింది.

భారత క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ తర్వాత సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లు భారత్ నుంచి డబుల్ సెంచరీలు చేశారు. ఇక రోహిత్ శర్మ కంటే ముందుగా భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్-1998లో, ఎంఎస్ ధోని-2007లో, విరాట్ కోహ్లీ-2018లో ఖేల్ రత్న పురస్కాలను అందుకున్నారు.

Also Read: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోమంత్రి అమిత్ షా..!

తాజాగా ఖేల్ రత్నకు నామినేటేడ్ అయిన రోహిత్ శర్మ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకుంటే ఈ అవార్డు దక్కించుకున్న నాల్గోవ క్రికెటర్ గా నిలువనున్నాడు. రోహిత్ శర్మ ఖేల్ రత్నకు నామినేటేడ్ కావడంతో రోహిత్ ఫ్యాన్స్ తోపాటు యావత్ క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కోడలు కోసం నాలుక కోసుకున్న అత్త.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!

కాలం మారుతోంది. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే నేటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ మూఢ నమ్మకాల వల్ల అనేక దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక మహిళ మూఢనమ్మకం వల్ల తన నాలుకను కోసుకుంది. తప్పిపోయిన కోడలు సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని శివుడికి నాలుకను సమర్పించింది.

జార్ఖండ్ రాష్ట్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్ లోని సెరైకెలా ఖర్సావన్ జిల్లాలో ఎన్.ఐ.టీ క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్ లో లక్ష్మీ నిరాలా కోడలు జ్యోతి తన బిడ్డతో పాటు తప్పిపోయింది. కోడలు, మనవడు తప్పిపోవడంతో లక్ష్మీ అక్కడే ఉన్న శివుడి గుడి ముందు కోడలు, మనవడి కోసం ప్రార్థిస్తూ తన నాలుకను కత్తిరించుకుంది. ఎవరో నాలుకను కత్తిరించుకుంటే కోడలు తిరిగి వస్తుందని చెప్పడంతో లక్ష్మీ ఈ విధంగా చేసింది.

లక్ష్మీ భర్త నందూలాల్ మీడియాకు ఈ వివరాలను తెలియజేశారు. నాలుక కత్తిరించుకున్న అనంతరం లక్ష్మీకి తీవ్ర రక్తస్రావమైంది. అయినప్పటికీ ఆమె కోడలు, మనవడి కోసం ఎదురు చూస్తూ ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు. అక్కడి స్థానికులు ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు ఆస్పత్రికి వెళ్లడానికి ఆమె అంగీకరించారు. వైద్యులు నాలుక పూర్తిగా తెగడంతో లక్ష్మీ మాట్లాడలేకపోతున్నారని ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు. పోలీసులు తప్పిపోయిన కోడలు జ్యోతి, బిడ్డ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కేటీఆర్ పై యుద్ధంలో గెలిచిన బీజేపీ


సమస్యలపై యుద్ధాన్ని నేరుగా తలపడి చేయడమే కాదు.. సోషల్ మీడియా ద్వారా కూడా చేయవచ్చని బీజేపీ నిరూపించింది. బీజేపీ వచ్చాక సోషల్ మీడియాను తెగ వాడేస్తోందన్న సంగతి తెలిసిందే. దేశ ప్రధాని మోడీ తలపెట్టిన ఈ తంతును ఇప్పుడు బీజేపీ నేతలు పుణికిపుచ్చుకున్నారు.

All Read: కేసీఆర్ పై గవర్నర్ సీరియస్.. ఎందుకంటే?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇటీవల వరంగల్ లో వరదల భీభత్సంపై ఫొటోలు, వీడియోలు తెలంగాణ వ్యాప్తంగా సర్క్యూలేట్ అయ్యాయి. అక్కడి ఘోరాలను కళ్లకు కట్టాయి. అయితే ఈ వీడియోలను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియాలో షేర్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.వరంగల్ నగరానికి కేసీఆర్ ఇచ్చిన హామీలను బండి సోషల్ మీడియాలో గుర్తు చేశారు.

దీంతో దెబ్బకు దిగివచ్చిన తెలంగాణ సర్కార్ వెంటనే మంత్రి కేటీఆర్ ను రంగంలోకి అక్కడ పర్యటింపచేసి నష్టనివారణ చర్యలు చేపట్టింది. బండి సంజయ్ ట్వీట్ వల్లే ఇప్పుడు కేటీఆర్ కదిలారని బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రత్యక్షంగానే కాదు.. సోషల్ మీడియా ద్వారా కూడా యుద్ధం చేసి గెలవొచ్చని బీజేపీ ఈ దెబ్బతో నిరూపించింది.

All Read: తెలిసిందిగా.. కేటీఆరే వర్కింగ్ సీఎం అన్నట్టు?

ఇక మరో విశేషం ఏంటంటే.. ఇదే కేటీఆర్ మాందీ మార్బలంతో పర్యటించిన తీరును కూడా సోషల్ మీడియాలో బీజేపీ ఎండగట్టడం విశేషం.ఓ వైపు కరోనా.. మరో వైపు వర్షాలు కురుస్తున్న వేళ ఇలా 25కి పైగా వాహనాల కాన్వాయ్ తో కేటీఆర్ వరంగల్ లో పర్యటించడం వివాదాస్పదమైంది. దాని ఫొటోలు, వీడియోలు తీసి కేటీఆర్ రాజులాగా ఇలా చేశారని బీజేపీ ప్రచారం చేసింది. ప్రజల్లోనూ దీనిపై వ్యతిరేక భావన ఏర్పడింది. ఇంత క్లిష్టసమయంలో ఇలా ప్రచార ఆర్భాటం అవసరమా అని స్థానికులు మండిపడ్డారు.

ఇలా ఇంట్లోనే ఉండి బీజేపీ కాగల కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. కేవలం సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ ను కదిలించి ఓడించిన తీరు నిజంగా అద్భుతమని బీజేపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.

వామ్మో.. ‘జపాన్’లో మరో వింత వ్యాధి.. రోడ్లపైనే పడిపోతున్నారు!

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు వైరస్ పట్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనను కలుగజేస్తున్నాయి. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అయితే ఇదే సమయంలో జపాన్ లో వింత రోగం ప్రజలను మరింత భయపెడుతోంది.

ప్రజలు అకస్మాత్తుగా రోడ్లపై పడి నిద్రపోతూ ఉండటం జపాన్ లో జరుగుతోంది. వినడానికి వింతగా ఉన్నా జపాన్ లో చాలా మంది ప్రజలు ఈ విధంగా రోడ్లపై పడి నిద్రపోతున్నారు. అయితే ప్రజలు ఏ కారణం వల్ల ఈ విధంగా రోడ్లపై పడిపోతున్నారో తెలియట్లేదు. జపాన్ లోని ఒకినోవో నగరంలో ఈ వింత రోగం బయటపడింది ఈ వింత రోగాన్ని అక్కడి ప్రజలు రోజో నీ పేరుతో పిలుస్తున్నారు. రోడ్డుపై పడి నిద్రపోవడాన్ని రోజో నీ అని అంటారు.

జపాన్ లో ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. అక్కడ ఎండలు మండిపొతూ ఉండటంతో ప్రజలు ఈ విధంగా చేస్తున్నారని అదేం వింత రోగం కాదని మరికొందరు చెబుతున్నారు. అయితే మద్యం సేవించిన వ్యక్తులు, మద్యం సేవించని వ్యక్తులు, మహిళలు కూడా సొమ్మసిల్లి పడిపోతూ ఉండటం గమనార్హం. వింత రోగం వల్ల కొందరు ఎక్కడపడితే అక్కడ పడిపోతూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు నగరంలో 7000 కేసులు నమోదయ్యాయి. వైద్యులు ఈ వింత రోగానికి గల కారణాలను కనిపెట్టలేకపోతున్నారు. శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధ్యయనం చేయటం మొదలుపెట్టారు.

సాంగ్స్ కోసం ‘పుష్ప’ను సిద్ధం చేస్తున్నారు !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ కోసం.. సుకుమార్ టీమ్ సర్వం సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 20 నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సెట్స్ కేవలం సాంగ్స్ కోసమేనట. ఫారెన్ లొకేషన్స్ లో సాంగ్స్ తీయాలని మొదట అనుకున్నా.. ఇప్పుడు అది సాధ్యమయ్యే పని కాదు, అందుకే సెట్స్ వేసి.. ఆ సెట్స్ లోనే రెండు సాంగ్స్ ను తీయబోతున్నారు. ముందుగా బన్నీ – రష్మిక పై ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారు.

Also Read: అరె.. లేడీ సూపర్ స్టార్ కి మళ్ళీ పెళ్లి !

ఈ సాంగ్ ను సత్య మాస్టర్ నేతృత్వంలో తీయబోతున్నట్లు.. సాంగ్ లో కాస్త రొమాన్స్ ఎక్కువే ఉండబోతున్నట్లు.. రష్మిక చేత ఈ సాంగ్ లో బికినీ రేంజ్ లో కనిపించేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సాంగ్ తరువాత సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ కోసం బాలీవుడ్‌ హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంకా ఎవరు సెట్ కాలేదు. దాంతో యంగ్ బ్యూటీ అనన్య పాండేను ఫైనల్ చేసే ప్లాన్ లో ఉందట చిత్రబృందం.

Also Read:  మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ !

అలాగే తమిళ మాజీ హీరో మాధవన్ కూడా ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి చేయాల్సిన రోల్ లో మాధవన్ చేయనున్నాడు. ఇక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాలి, కానీ.. ఈ కరోనా కాలంలో అది అంత ఈజీ కాదు, అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో అటవి సెటప్ వేసి.. అక్కడే ఎక్కువ భాగం షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్. అయితే సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో మాత్రమే షూటింగ్ స్టార్ట్ చేస్తారట. కానీ, భారీ సినిమాని తక్కువమంది టీమ్ తో చేయడం సాధ్యమయ్యే పనేనా అంటే.. అనుమానమే.

వామ్మో.. తాజ్ మహల్ వద్ద ఏడు అడుగుల కొండ చిలువ!

 

సాధారణంగా ప్రేమ బంధానికి చిహ్నమైన తాజ్ మహల్ ను చూడటానికి ప్రేమికులు వస్తూ ఉంటారు. అయితే తాజాగా తాజ్ మహల్ ను చూడటానికి ఒక కొండ చిలువ వచ్చింది. వినడానికి కొంచెం సరదాగా అనిపించినా నిత్యం ఎంతోమంది సందర్శించే తాజ్ మహల్ దగ్గర ఒక కొండ చిలువ పట్టుబడింది. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా లేకుండా మన దేశమంతటా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

వర్షాల వల్ల జంతువులు, సర్పాలు అరణ్య ప్రాంతాల నుంచి జనావసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఆగ్రాలోని తాజ్ మహల్ పరిసరాల్లో కొండ చిలువ కలకలం సృష్టించింది. లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా మార్చి నెల చివరి వారం నుంచి తాజ్ మహల్ ను అధికారులు మూసివేశారు. దీంతో సందర్శకులు లేక సందర్శకులతో కిటకిటలాడే తాజ్ మహల్ వెలవెలబోతుంది. జనం సంచరించని తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లొ ఏడు అడుగుల కొండ చిలువను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.

వెంటనే కొండ చిలువ గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వైల్డ్ లైఫ్ ఎన్.ఓ.ఎస్ బృందానికి కొండ చిలువ గురించి సమాచారం ఇచ్చి దానిని పట్టుకోవాలని కోరారు. విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని కొండ చిలువను తీసుకొని వెళ్లి సమీపంలో ఉన్న అడవిలో వదిలేశారు. పశ్చిమ భాగంలో ఉన్న తాజ్ మ్యూజియం వెలుపల అధికారులు కొండ చిలువను గుర్తించినట్లు సమాచారం. కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.

తెలుగు స్టార్ పై బాలీవుడ్ హీరోల టెన్షన్ !


టాలీవుడ్ లో డార్లింగ్ ప్ర‌భాస్ నంబర్ వన్ హీరో ఏమి కాదు, కానీ ఒక్క బాహుబలి సిరీస్ ప్రభాస్ ని నేషనల్ స్టార్ ను చేసింది. వందల కోట్ల బిజినెస్ ను క్రియేట్ చేసింది. అందుకే ఏ సౌత్ హీరోకి దక్కని ఛాన్స్ ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో దక్కింది. ఆ మాటకొస్తే.. బాలీవుడ్ స్టార్లు కూడా అసూయ పడే ఛాన్స్ ఇది. లేకపోతే ఒక ప్రాంతీయ భాషా హీరో మీద 700 వందల కోట్లు పెట్టి సినిమా చేస్తారని ఎవరైనా ఉహించారా.. అసలు ప్రభాస్ కూడా అనుకోని ఉండడు, త‌న కెరీర్ లో అత్యద్భుతంగా భారీ స్థాయిలో నిర్మించే తొలి 3డి మూవీలో హీరోగా న‌టిస్తానని.

Also Read: అరె.. లేడీ సూపర్ స్టార్ కి మళ్ళీ పెళ్లి !

ఇప్పటివరకూ ఏ సౌత్ హీరో సాధించలేని లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ లాంటిదే ఇది. సినిమాకి ఏడు వందల కోట్లు అనే విషయం పక్కన పెడితే.. తానాజీ లాంటి అద్భుత‌మైన 3డి విజువ‌ల్ వండ‌ర్ ని క్రియేట్ చేసిన‌ ఓం రౌత్ అనే గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ ఏ – ఆదిపురుష్’ వస్తుండటంతో ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అన్నిటికి కంటే ముఖ్యమైనది ఈ సినిమాని తెలుగు-హిందీ – తమిళ- కన్నడ భాషా చిత్రంగా తెర‌కెక్కించి అటు పై దేశంలోని మిగిలిన అన్ని భాష‌ల్లోనూ.. జపాన్, చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయనున్నారు.

Also Read:  మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ !

విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయడం అనేది ఈ మధ్య ఇండియన్ సినిమాలకు చిన్న విషయమే. అయితే, ఇలాంటి భారీ 3డి ఇండియన్ సినిమాని ఎప్పుడూ విదేశాల్లో రిలీజ్ చేయలేదు. ప్రభాస్ ఆదిపురుష్ నే మొదటిసారి కావడం ప్రభాస్ స్థాయిని పెంచేదే. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ భారతీయ సినిమాల పై ఉన్న అన్ని రికార్డుల్ని ఈ ఆదిపురుష్ తుడిచేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉండటంతో ఇప్పుడు మిగిలిన స్టార్ హీరోలకు టెన్షన్ పట్టుకుంది. ఈ సినిమాతో నేషనల్ వైజ్ గా ప్రభాస్ మార్కెట్ ఇంకా పెరిగితే బాలీవుడ్ హీరోలు కూడా.. ప్రభాస్ వెనుకే పడిపోతారు. మరి ప్ర‌భాస్ పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా వెలిగిపోవాలని ఆశిద్దాం.

మహిళ డాక్టర్ దారుణం.. భర్తను, పిల్లలను చంపేసి?

మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా డాక్టర్ భర్త మరియు ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. జీవితంపై నిరాశతోనే డాక్టర్ కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వివరాల్లోకి వెళితే 41 సంవత్సరాల డాక్టర్ స్సుష్మారాణే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేసే భర్త ధీరజ్ తో కలిసి జీవించేది. వీళ్లకు ఇద్దరు సంతానం. డాక్టర్ సుష్మ మొదట భర్త, ఇద్దరు పిల్లలకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఇచ్చింది. ఆహారం తిన్న కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయిన తరువాత వారికి విషంతో కూడిన ఇంజక్షన్ ఇచ్చి హతమార్చింది. అనంతరం సుష్మారాణే మరో గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ తో పాటు రెండు సిరంజీలు దొరికాయి. బ్రతకాలన్న ఆశ లేకపోవడం వల్లే భర్త, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు సుష్మా సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. పోలీసులు నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసు గురించి డాక్టర్ సుష్మా స్నేహితులను, ఆస్పత్రి సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని విచారిస్తున్నారు.

రిలియన్స్ చేతికి నెట్‌మెడ్స్‌.. త్వరలో?

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఆన్ లైన్ ఫార్మసీ రంగంలోకి అడుగుపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా నెట్‌మెడ్స్‌లో మెజారిటీ శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆర్.ఐ.ఎల్ నెట్ మెడ్స్ లో 60 శాతం వాటాను 620 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. రిలయన్స్ జియో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈ కామర్స్ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం అడుగు పెట్టడానికి వీలు కలిగింది.

ఇప్పటికే రిలయన్స్ జియోమార్ట్ పేరుతో ఆన్ లైన్ గ్రాసరీ ఫ్లాట్ ఫామ్ ను నిర్వహిస్తోంది. విశ్లేషకులు రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ ప్రకారం నెట్ మెడ్స్ విలువ 1000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం గత వారం ఔషధ విక్రయాలను ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరులో అమెజాన్ ఆన్ లైన్ ద్వారా ఔషధాలను విక్రయిస్తోంది. త్వరలో భారతదేశమంతటా అమెజాన్ ఔషధాలను విక్రయించబోతున్నట్లు తెలిపింది.

నెట్ మెడ్స్ కొనుగోలుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెజాన్ తో పోటీ పడబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఇప్పటికే మెడ్ లైఫ్, ఫార్మ్ ఈజీ, నెట్మెడ్స్, ఇతర కంపెనీలు ఆన్ లైన్ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్నాయి. ప్రదీప్ ధాధా అనే వ్యక్తి నెట్ మెడ్స్ అనే కంపెనీని ఏర్పాటు చేసి ఆన్ లైన్ ద్వారా ఔషధాలు విక్రయించేలా ఏర్పాటు చేశారు. ప్రదీప్ ధాధా సంవత్సర కాలంగా మంచి ధర లభిస్తే వ్యాపారాన్ని విక్రయించాలని ఆలోచిస్తుండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా నెట్ మెడ్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది.

కరోనా వైరస్ వారి నుంచే ఎక్కువ వ్యాపిస్తుందట!

గడిచిన ఏడు నెలలుగా దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మహమ్మారి గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. యువత ద్వారానే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో వెస్ట్ ఫసిఫిక్ రీజినల్ డైరెక్టర్ తకేశి కషాయ్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

యువతలో చాలామందిలో కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవడంతో కరోనా సోకినట్లు తెలియడం లేదని అన్నారు. యువత నుంచి ఇతర వ్యాధులతో బాధ పడేవారికి, వృద్ధులకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. మరోవైపు పలు దేశాలు వ్యాక్సిన్ తయారీ సంస్థలతో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తొలుత తమకే అందజేసేలా చేసుకున్న ఒప్పందంపై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కొన్ని దేశాలకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ అందితే వైరస్ సంక్షోభం మరింత తీవ్రం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. సమర్థవంతంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే హెర్డ్ ఇమ్యూన్హిటీ అవసరమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కనీసం 70 శాతం మందిలో వైరస్ ను అడ్డుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అయితే వైరస్ కు అడ్డుకట్ట వేయడం కష్టం కాదని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో జనరల్ సలహాదారు డాక్టర్ బ్రూస్ మాట్లాడుతూ కరోనా ముప్పు ఎదుర్కోవాలంటే యాంటీ ఫ్లూ వ్యాక్సినేషన్లను నిర్వహించాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల కాగా ఈ సంవత్సరం చివరినాటికి మిగతా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

కేసీఆర్ పై గవర్నర్ సీరియస్.. ఎందుకంటే?


తెలంగాణలో కరోనా మహామ్మరి పంజా విసురుతోంది. కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ తొలి ప్రథమరాలు సుందరాజన్ తమిళ సై విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ తమిళ సై తెలంగాణ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణకు గవర్నర్ హోదా ఉన్నప్పటికీ తానొక వైద్యురాలిగా కరోనాపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. మూడునెలల క్రితమే సీఎం కేసీఆర్ తో కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలను వివరించానని చెప్పారు.

Also Read: కెసిఆర్ గారూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడకండి

అయితే ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టడం వల్లే తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. మెడికల్ హాబ్ గా.. ఫార్మా హాబ్ గా ఉన్న తెలంగాణ కరోనా విషయంలో ముందే మెల్కొని దేశానికి ఆదర్శంగా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ తానొక వైద్యురాలిగా.. సామాన్య ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ మాత్రం తన సూచనలు వేరేలా తీసుకొని పెడచెవిన పెట్టడంతో కేసుల సంఖ్య పెరిగిందని సీరియస్ అయ్యారు.

కరోనా తొలిదశలోనే ఉన్నప్పుడే తాను జిల్లాస్థాయిలో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాడంతోపాటు చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే సూచించానని గుర్తుచేశారు. కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం, వైరస్ కేసులు ఎక్కువ ఉన్నచోట మొబైల్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోయాయన్నారు. మూడునెలలు క్రితమే సీఎం కేసీఆర్ కు సూచిస్తే ప్రభుత్వం ఇప్పుడు మేల్కొందన్నారు. ఇప్పుడిప్పుడు టెస్టుల సంఖ్య పెంచున్నారని తాను సూచించినపుడే చర్యలు చేపడితే తెలంగాణలో కరోనా ఇప్పటికే కట్టడి అయ్యేదన్నారు.

Also Read: తెలిసిందిగా.. కేటీఆరే వర్కింగ్ సీఎం అన్నట్టు?

తొలిరోజుల్లో గాంధీ ఆసుపత్రి మాత్రమే కరోనా కోసం ఉండేదన్నారు. దీంతో తొలినాళ్లలో వివిధ జిల్లాల నుంచి రోగులు ఇక్కడి వచ్చేవారని తెలిపారు. ప్రభుత్వా ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని.. బెడ్‌ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లేరన్నారు. వైద్య సిబ్బందిపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఆచరణలో పొంతలేదని స్పష్టం చేశారు. మరింత మంది వైద్యులను నియమించుకోవాల్సిన అవసరాన్ని గవర్నర్ గుర్తుచేశారు. ఆస్పత్రుల్లో బెడ్స్ మాత్రమే ఉంటే ప్రయోజనం ఏమిలేదని తగిన వైద్య సిబ్బంది ఉంటేనే కరోనాను కట్టడి చేయగలమని అన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. మొత్తానికి గవర్నర్ తమిళసై కరోనా విషయంలో కేసీఆర్ ను మరోసారి ఇరుకున పెట్టడం ఆసక్తిని రేపుతోంది.

వామ్మో ప్రభాస్.. మూడు సినిమాలకు అన్ని రూ.కోట్లా!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సిరీస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటించిన సాహోకు డిజాస్టర్ టాక్ వచ్చినా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల తక్కువ నష్టాలతో నిర్మాతలు బయటపడ్డారు. సాహో సినిమాకు నష్టాలు రావడంతో ప్రభాస్ ఇకపై తక్కువ బడ్జెట్ సినిమాలలోనే నటించడానికి సిద్ధమవుతున్నాడంటూ గతంలో రూమర్లు వచ్చాయి.

కానీ ప్రభాస్ మాత్రం తన ప్రతి చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటూ పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ సినిమా తరువాత ప్రభాస్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు;. మహానటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నిన్న ప్రభాస్ హీరోగా ప్రకటించిన ఆదిపురుష్ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ రాబోయే మూడు సినిమాల బడ్జెట్ ఏకంగా 900 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

‘టార్చ్ బెర్రర్’గా మారబోతున్న బాలయ్య!


నందమూరి బాలకృష్ణ సినిమాలకు మొదటి నుండి పవర్ ఫుల్ టైటిల్స్ మాత్రమే బాగా వర్కౌట్ అవుతూ వస్తున్నాయి. ఆ మాటకొస్తే బాలయ్యకి యాక్షన్ సెట్ అయినట్లుగా మరే ఎమోషన్ సెట్ అవ్వదు. అందుకే కథల విషయంలో అలాగే డైరెక్టర్ ల విషయంలో కూడా బాలయ్య యాక్షన్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఆయన ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఎప్పటిలాగే వీరి సినిమా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది. అసలు వీరి కలయికలో సినిమా అంటేనే అదొక యాక్షన్ డ్రామా అని ఆడియన్స్ కూడా మెంటల్ గా ఫిక్స్ అయ్యారు అంటే.. వీరి కాంబినేషన్ కు ఉన్న మార్క్ ను అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ మార్క్ ను అందుకోవాలంటే.. ఆ రేంజ్ మాస్ టైటిల్ నే పెట్టాలి.

Also Read: మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ !

బాలయ్య సినిమాకి కథ రొటీన్ గా ఉన్నా, యాక్షన్ అండ్ టైటిల్ మాత్రం పవర్ ఫల్ గా ఉంటే.. ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. అందుకే బోయపాటి, బాలయ్య సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ పెట్టడానికి తెగ ఆలోచిస్తున్నాడు. టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో మెయిన్ గా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ తో పాటు డేంజర్ అనే టైటిల్ కూడా బాగా వినిపించింది. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. ‘టార్చ్ బెర్రర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా ఇప్పుడు బాలయ్య సినిమాకి పెట్టబోతున్నారని బాగా వినిపిస్తోంది. పైగా టార్చ్ బెర్రర్ అనే డైలాగ్ ఎన్టీఆర్ సినిమాలో బాగా పేలిన సంగతి తెలిసిందే.

Also Read: హ్యాకర్ల బారినపడిన యంగ్ బ్యూటీ..!

అయితే బాలయ్య సినిమా కథకు ఈ ‘టార్చ్ బెర్రర్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని.. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పెట్టడానికే బాగా ఆసక్తిగా ఉన్నాడని.. ఆల్ మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను బోయపాటి టీం ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక ఈ టైటిల్‌ ఫ్రీ లుక్ పోస్టర్ ను కూడా త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేస్తారట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. మొత్తానికి ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ లో బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో అభిమానులను ఫుల్ గా అలరించారు.అందుకే బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి మరో సూపర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

బాబుపై కేసు… జగన్ కు మరో అస్త్రమేనా?


రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తుల ఫోన్ లు ట్యాపింగ్ అవుతున్నాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షనేత చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ అవుతుందని, దీనిపై విచారణ నిర్వహించాలని ప్రధానికి లేఖ రాశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షానికి మధ్య దుమారం రేపుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ఎదుర్కొనేందుకు వైసీపీ నేతల వ్యూహం పెద్దగా ఫలించలేకపోయిన బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబును గట్టిదెబ్బ కొట్టగలిగారు.

Also Read: ఏపీ రాజధానిపై సుప్రీంలో కీలక పరిణామం.. వెనుక కథేంటి?

ఒక వైపు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాని మోడీపై కొద్ది రోజుల కిందట తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడాన్ని తప్పుబట్టి సోషల్ మీడియా వేధికగా ఏకి పారేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు చంద్రబాబు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. కేంద్రం ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోదని, న్యాయస్థానాలే ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాయని చెప్పుకోచ్చారు.

అంతటితో ఆయన ఆగిపోలేదు. చంద్రబాబుపై గతంలో ఉన్న అక్రమాస్తుల కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో 15 ఏళ్లుగా స్టే విధిస్తూ వస్తుండటం అసాధారణ అంశంగా పేర్కొన్నారు. ఇది గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు చేయాల్సిన అంశమేనని చెప్పారు. ఏ న్యాయస్ధానంలోనైనా ఒక కేసులో ఇన్నేళ్లపాటు మధ్యంత ఉత్తర్వులు ఇస్తూ ఉండటం విశేషంగానే చెప్పాలిమరి. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ లక్ష్మీపార్వతి కేంద్రానికి లేఖ రాస్తున్నారని, అయితే సిఎం జగన్ కు లేఖ రాస్తే పరిశీలించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని జీవీఎల్ సలహా ఇచ్చారు.

Also Read: పవన్ కళ్యాణ్ ది ‘రాజకీయ’ దీక్షేనా?

మరుగున ఉన్న చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఇప్పడు వెలుగులోకి రావడం, 15 ఏళ్ల నుంచి స్టే పొందుతూ వస్తుండటం చూస్తే ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి ఒక అస్త్రంగానే చెప్పవచ్చు. అమరావతి నిర్మాణం, ఫైబర్ గ్రిడ్ పనుల్లో అవినీతిని తవ్వి మాజీ సీఎం చంద్రబాబును, మంత్రి లోకేష్ ను బుక్ చేయాలని చూస్తున్న జగన్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాడా లేదా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.