
రాజధాని తరలింపు విషయంలో హై కోర్టు విధించిన స్టే ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ విచారణకు వచ్చిన రెండు పర్యాయాలు విచారణ జరగకుండానే వాయిదా పడింది. ప్రభుత్వం త్వరగా విచారణ చేపట్టాలని కోరుతున్నా… విచారణ జరపకుండా వాయిదా వేయడానికి కారణం లేకపోలేదు. వరుసగా రెండు పర్యాయాలు ధర్మాసనంలో సభ్యులైన న్యాయమూర్తుల బంధువులు రాజధాని రైతుల పట్ల వాదించడంతో పిటీషన్ ను మరో బెంచికి కేటాయించాలని న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
Also Read: విశాఖ లోని ఆ ఇంట్లోనే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంతా…! జగన్ దూకుడూ మామూలుగా లేదు
తొలిసారి ఈ నెల 17వ తేదీన పిటీషన్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే అప్పుడు ప్రధాన న్యాయమూర్తి శరత్ అర్వింద్ బాబ్డే ధర్మాసనంలో ఒకరిగా ఉన్నారు. అమరావతి రైతుల తరపున కేసును ప్రధాన న్యాయమూర్తి కుమార్తె రుక్మిణి బాబ్డే వాదించేందుకు సిద్ధమవడంతో రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ కేసును మరో బెంచి ముందుకు పంపమన్నారు.
దీంతో బుధవారం ఈ పిటీషన్ సుప్రీం కోర్టు రిజిస్ట్రారు మరో బెంచికి సమర్పించారు. ఆ బెంచిలో న్యాయమూర్తి రోహిటం నారీమన్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ రోజు అనూహ్యంగా రోహిటం నారీమన్ తండ్రి పాలి నారీమన్ రాజధాని రైతుల తరుపున వాదిస్తున్నారని తెలియడంతో రోహిటం నారీమన్ ‘నాట్ భిపోర్ మీ’ అంటూ పిటీషన్ ను మరో బెంచికి రిఫర్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరగకుండా వాయిదా పడింది.
Also Read: భయంలో చంద్రబాబు.. ప్రతిపక్షం టీడీపీ కాదా?
మరోవైపు ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా విశాఖలో కార్వనిర్వాహక రాజధానికి అధికారుల చేత అనుకున్న మూహుర్తానికే ఈ నెల 16వ తేదీన శంఖుస్థాపన పూర్తి చేయడంతో ఇప్పడు ఈ పిటీషన్ ను త్వరగా విచారించాలనే ఆదుర్దా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. గతంలో 16వ తేదీన విశాఖలో ప్రధానితో కార్యనిర్వాహక రాజధానికి శంఖుస్థాపన చేయించాలని భావించడంతో త్వరగా విచారించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రారుకు ప్రభుత్వం లేఖ రాసింది.