Home Blog Page 8353

బీపీ మాత్రలతో కరోనా మహమ్మారికి చెక్.. నిజమెంత?

కరోనా వైరస్ కు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు మందులను కనిపెట్టలేకపోయారు. మందుల గురించి, వ్యాక్సిన్ గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కట్టడి కోసం అనేక వ్యాక్సిన్లు పరిశోధన దశలో ఉన్నాయి. రష్యా ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్ ను కనిపెట్టినట్టు ప్రకటించినా ఆ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

అయితే కరోనా వైరస్ నియంత్రణ విషయంలో కొన్ని మందులు మంచి ఫలితాలను కనబరుస్తూ ఉండటం గమనార్హం. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు హై బీపీకి వాడే మందులు కరోనాపై సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. ఈ మందులు కరోనా మరణాల రేటును 33 శాతం తగ్గిస్తున్నాయని తెలుస్తోంది. యాంజియోటెన్సిన్ రిసెపర్టర్ బ్లాకర్స్, యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ అనే మందులను సాధారణంగా మధుమేహం, గుండె జబ్బులు, బీపీతో బాధ పడే వారి కోసం వినియోగిస్తారు.

ఎవరైతే ఆ మందులను వినియోగిస్తున్నారో వారిలో కరోనా ముప్పు గణనీయంగా తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎంజిలా పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. 28,872 మంది రోగులకు శాస్త్రవేత్తలు పరిశీలించారని సమాచారం. అయితే హై బీపీ లేని వాళ్లు ఈ మందులను వినియోగించవచ్చో లేదో తెలియాల్సి ఉంది. డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో బాధ పడుతున్న వాళ్లకు హై బీపీ మందులు సమర్థవంతంగా పని చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బండిగారు… స్పీడ్ తగ్గించండి!

జాతి, కుల, మతాలా పేరుతో దేశ ప్రజలను విచ్ఛన్నం చేసిన ఘనత నేటి రాజకీయాలను ఉంది. అందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందు వరుసలో ఉందనేది అనేకమంది విశ్లేషకుల మాట. అందుకు తగినట్లుగానే ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తుంటారు. తాజాగా వినాయక చవితి సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ రెచ్చి పోతున్నారు. పదే పదే హిందూ, ముస్లింల పండుగలను ప్రస్తావిస్తూ.. రంజాన్, బక్రీద్, వినాయక చవితి సమయాలలో సీఎం కేసీఆర్ అమలుపరుస్తున్న ఆంక్షల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ… కేసీఆర్ ని హిందూ వ్యతిరేక వ్యక్తిగా ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలు, నిర్బంధాలకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చిన నిరసనలకు బీజేపీ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బండి సంజయ్ కుమార్ అన్నారు. గణేశ్ ఉత్సవాలపై నిర్బంధంతోనే కేసీఆర్ పాలన పతనం మొదలైందని, రంజాన్, బక్రీద్ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన స్వేచ్ఛను, బోనాలు, వినాయక చవితి సందర్భంగా విధించిన ఆంక్షలను ప్రజలు గమనించారని అన్నారు.

సీఎం కేసీఆర్ తన పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని, జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, వినాయక మంటపాలు తొలగించిన స్థలాల్లో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. శాంతియుతంగా నిరసన ప్రదర్శించాలని రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులు ధర్మ పరిరక్షణ కోసం స్పందించాలని ఆయన అన్నారు.

ఒవైసీల మెప్పు, ఓ వర్గం ప్రజల సంతుష్టీకరణ కోసం సీఎం కేసీఆర్ నవరాత్రి ఉత్సవాలపై నిర్బంధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసు పహారా, నిఘా అధికారుల పర్యవేక్షణలో ఆంక్షల మధ్య హిందువులు ఉత్సవాలు జరుపుకునే పరిస్థితి కల్పించిన ఘనత భయంకరమైన హిందువుకే దక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. భయంకరమైన హిందువునని చెప్పుకునే కేసీఆర్, పండుగ పూట హిందువుల్ని భయపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఇదేనా భయంకరమైన హిందువు అనే మాటకు అర్థమని ఆయన ప్రశ్నించారు.

ఈ విధంగా బీజేపీ నేతలు చేసే ప్రతి విమర్శను హిందూ మతానికి లింక్ చేసి తోటి రాజకీయ నాయకులను హిందూ వ్యతిరేక వ్యక్తులుగా చేయడం బీజేపీ మత రాజకీయాలకు తార్కాణం. అయితే మన భారతదేశం లౌకికరాజ్యం అనే సత్యాన్ని బీజేపీ నేతలు గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అన్ని మతాలను గౌరవించవలసిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉంది.

నాని ‘వి’ మూవీ సెన్సార్ రిపోర్ట్‌


నేచురల్‌ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘వి’ విడుదలకు ఒక్కో అడ్డు తొలగిపోతోంది. మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లు మూత పడడంతో ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్‌ చేస్తున్నారు. నిర్మాత దిల్‌ రాజు దాదాపు రూ. 30 కోట్లు ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌కు విక్రయించాడని సమాచారం. శాటిలైట్‌ రైట్స్‌ కూడా కలుపుకుంటే మంచి లాభం కూడా వచ్చిందట.

Also Read: తనకు ప్రభాస్‌ హీరోయినే కావాలంటున్న బన్నీ?

తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఇంద్రగంటితో నానికి ఇది మూడో చిత్రం. అష్టాచమ్మ, జెంటిల్‌మెన్‌ ఘన విజయాలు సాధించగా ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం. పైగా, ఇందులో అతను ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషించడంతో చిత్రంపై ఆసక్తి రెట్టింపైంది. వేసవిలోనే విడుదల కావాల్సినా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైంది. థియేటర్లలోనే విడుదల చేద్దామని నాని పట్టుబట్టినా ఈ పరిస్థితుల్లో అది కుదరని పని అని చెప్పిన దిల్‌ రాజు డిజిటల్‌ రిలీజ్‌కు అతడిని ఒప్పించాడు. దాంతో, ఇప్పటికే ప్రమోషన్స్‌ కూడా స్టార్ట్‌ చేశాడు నాని. థియేటర్లు మూతపడితేనేం.. ఇల్లునే థియేటర్గా మార్చుకుందాం అనే థీమ్‌తో ప్రసారం అవుతున్న ప్రమోషన్‌ యాడ్‌ మిగతా చిత్రాలకు సైతం మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇక, ఈ మూవీకి సంబంధించి తాజా కబురు వచ్చింది.‘వి’ సినిమా సెన్సార్ పనులను దర్శకుడు మోహన కృష్ణ పూర్తి చేసుకున్నాడు. దీనికి సెన్సార్ బోర్డు పెద్దగా కట్లు లేకుండా యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది.

Also Read: ఎంఎంఏ ఫైటర్గా విజయ్‌ దేవరకొండ!

ఈ చిత్రంలో నానికి జంటగా అదితి రావు హైదరి, సుధీర్ బాబుకు జంటగా నివేథా థామస్‌ నటించారు. జగపతి బాబు, నాజర్, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక, ఈ మూవీ కథ లీక్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో ఓ స్టోరీ హల్‌చల్‌ చేస్తోంది. తన భార్య అదితి రావును హత్య చేసిన వాళ్లను వరుసపెట్టి చంపేసే కిల్లర్గా నాని కనిపిస్తాడట. ప్రతి మర్డర్ దగ్గర అతను వి అనే మార్కు వదిలేస్తాడని, ఆ మిస్టరీ కిల్లర్ కోసం వెతికే పోలీస్‌ ఆఫీస్‌ పాత్రలో సుధీర్ బాబు కనిపిస్తాడని అంటున్నారు. అనేక ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమాగా ఉంది. మరి, నాని, ఇంద్రగంటి హ్యాట్రిక్‌ విజయం సాధిస్తారో లేదో ఇంకో రెండు వారాల్లో తేలుతుంది.

కరోనా దెబ్బ.. సూర్య బాటలో విజయ్‌ నడవక తప్పదా?


కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను తీవ్రంగా కుదిపేసింది. మార్చి నుంచి షూటింగ్స్‌ ఆగిపోవడంతో చాలా మంది దర్శక నిర్మాతలు, హీరోహీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఖాళీగా ఉంటున్నారు. అన్‌లాక్‌లో భాగంగా షూటింగ్స్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా కరోనా విజృంభణ నేపథ్యంలో సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా మంది ఇప్పటికీ భయపడుతున్నారు. కొన్ని చిన్నాచితకా సినిమాలు, సీరియల్‌ షూటింగ్స్‌ మాత్రమే తిరిగి మొదలయ్యాయి. పెద్ద సినిమాల పరిస్థితి ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. షూటింగ్స్‌ లేకపోవడం ప్రధానంగా సినీ కార్మికులను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఉపాధి కరువై వారంతా పస్తులుంటున్నారు. టాలీవుడ్‌లో కరోనా క్రైసిస్‌ చారిటీ ట్రస్ట్‌ సహా పలు సంస్థలు, దాతలు సాయం చేస్తున్నా.. వారికి రెండు పూటలా ముద్ద దిగడం కష్టంగా మారింది. మరోవైపు థియేటర్లు మూత పడడంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాల విడుదల సస్పెన్స్‌గా మారింది. ప్రింట్లు ల్యాబుల్లో ఉంచడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

Also Read: ఎంఎంఏ ఫైటర్గా విజయ్‌ దేవరకొండ!

మొన్నటిదాకా బడా ప్రొడ్యూసర్లు సిండికేట్‌గా మారి థియేటర్లు తమ గుత్తాధిపత్యంలో ఉంచుకున్నారు. చిన్న సినిమాల కోసం వారం రోజులు కూడా కొన్ని థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అవే చిన్న సినిమాలు అలా చిత్రీకరణ పూర్తి చేసుకొని ఇలా ఓటీటీలో దర్జాగా రిలీజ్‌ అవుతున్నాయి. మంచి లాభాలు కూడా గడిస్తున్నాయి. ఇప్పట్లో థియేటర్లు మొదలైన కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ జనాలు థియేటర్లకు వచ్చే అవకాశం లేకపోవడంతో బడా నిర్మాతలు సైతం ఓటీటీల బాట పడుతున్నారు. లాభం మాట దేవుడెరుగు నష్టాలనైనా తప్పించుకునేందుకు అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ దిగ్గజాలతో బేరాలకు దిగాయి. ఈ క్రమంలో నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం ఓటీటీలో రిలీజయ్యే తెలుగు పెద్ద సినిమా కానుంది. వచ్చే నెల 5వ తేదీన ఆ మూవీ అమెజాన్‌లో స్ట్రీమ్‌ కానుంది. అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా అమెజాన్‌తో చర్చలు జరుపుతోంది. దాంతో, సౌత్‌లో మిగతా ఇండస్ట్రీలు కూడా ఓటీటీల వైపు చూస్తున్నాయి. డిజిటల్‌ మీడియాను ముందు నుంచి ఎంకరేజ్‌ చేస్తూ వస్తున్న తమిళ్‌ స్టార్ హీరో సూర్య ఓ అడుగు ముందుకేశాడు. తన తాజా చిత్రం సూరరై పొట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా)ను అమెజాన్‌ ప్రైమ్‌లో అక్టోబర్30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు.

Also Read: తనకు ప్రభాస్‌ హీరోయినే కావాలంటున్న బన్నీ?

థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు వారించినా సూర్య డిజిటల్‌కే జై కొట్టాడు. సూర్య లాంటి బడా హీరో ఓటీటీ బాట పట్టడంతో తమిళ్‌లో మిగతా హీరోలు, దర్శక నిర్మాతలు సైతం అదే బాటలో నడవడం ఖాయమైంది. ఇప్పుడు మరో అగ్ర నటుడు విజయ్‌ నటించిన ‘మాస్టర్’పై అందరి దృష్టి పడింది. ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కరోనా లేకపోయి ఉంటే వేసవిలోనే రిలీజయ్యేది. మరో టాప్‌ హీరో విజయ్‌ సేతపతి విలన్‌గా నటించడంతో ‘మాస్టర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్ల ప్రారంభంపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేకపోవడంతో పాటు మురుగదాస్‌తో తన తదుపరి చిత్రం షూటింగ్‌ ప్రారంభించాలని విజయ్‌ రెడీ అవుతున్నాడు. ఇది విజయ్‌కు 65వ చిత్రం కానుంది. ఆ మూవీ చిత్రీకరణ మొదలైతే అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. దాంతో ఈ లోపే ‘మాస్టర్’ను విడుదల చేయాలని విజయ్‌ భావిస్తున్నాడట. మంచి ఆఫర్ వస్తే ఓటీటీలో నేరుగా రిలీజ్‌ చేస్తే బాగుటుందని చూస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సూర్య మాదిరిగా ఓటీటీకి జై కొట్టడం తప్ప మరో ఆప్షన్‌ లేదంటున్నాడట. ఏం జరుగుతుందో చూడాలి.

పాత కలకత్తాలో సాయి పల్లవి విలన్ !


నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. సహజంగా సినిమా జనాలకి, ఒక సినిమా పై ఆసక్తి బాగా పెరిగింది అంటే… ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. అవును ‘శ్యామ్ సింఘ రాయ్’కి ఆ ప్రత్యేకత ఉంది. ‘శ్యామ్ సింఘ రాయ్’లో పాతకాలం కలకత్తాను ప్రధానంగా హైలైట్ చేస్తూ చూపించడానికి మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Also Read: తనకు ప్రభాస్‌ హీరోయినే కావాలంటున్న బన్నీ?

‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా కథే కాస్త ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందని.. అందుకే పూర్తిగా పాత కలకత్తా లుక్ కావాల్సి వుందని తెలుస్తోంది. కలకత్తా వెళ్లినా పాత లుక్ వుండదు కాబట్టి, ఇక్కడే పాతతరం కలకత్తా లుక్ వచ్చేలా సెట్ డిజైన్స్ చేయించారు. ఆ మధ్య హైదరాబాద్ లోని ఖాళీగా ఉంటున్న అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో సెట్ వేయడం కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సెట్ మరో ఇరవై రోజుల్లో పూర్తి అవుతుందని.. సెట్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు అవుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రేజీ బ్యూటీ సాయి పల్లవిని తీసుకోబోతున్నారు. అయితే సాయి పల్లవి నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. నిజంగా సాయి పల్లవి లాంటి నటి నెగిటివ్ రోల్ అంటే మొత్తానికి సినిమాలో ఏదో కొత్త కంటెంట్ ఉందనే ఫీలింగ్ కూడా జనంలో బాగా క్రియేట్ అవుతుంది. ఏమైనా సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట.

Also Read: ఎంఎంఏ ఫైటర్గా విజయ్‌ దేవరకొండ!

నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తన సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అందుకే మన రచయితలూ, దర్శకులు కూడా నాని కోసం కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. ల్ సాంగ్ చేయబోతుంది.

ఐటమ్ సాంగ్ ను సమర్థిస్తున్న మరో హీరోయిన్ !


ఒక్కోసారి హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ ఛాన్స్ లు రావు. అలా హీరోయిన్ గా అవకాశాలు రాక కొంతమంది, ఐటమ్ సాంగ్స్ కి రెడీ అవుతారు. అలాగే ఒక్కొక్కసారి బాగా డబ్బులొచ్చే సందర్భంలో కూడా స్వయంగా హీరోయిన్సే ఐటెమ్ సాంగ్స్ చేస్తుంటారు. పైగా ఐటమ్ సాంగ్ అందుకే చేశాను, ఇందుకే చేశాను అంటూ సమర్థించుకోవడానికి మన హీరోయిన్స్ పడే పాట్లు గురించి వింటూనే ఉన్నాం. డాన్స్ చేయడానికి బాగా స్కోప్ ఉందని ఐటమ్ సాంగ్ ఒప్పుకున్నానని ఈ ఒక్క రిజనే.. తమన్నా దగ్గర నుండి కాజల్ దాకా అందరూ చెప్పి ఉంటారు.

Also Read: తనకు ప్రభాస్‌ హీరోయినే కావాలంటున్న బన్నీ?

ఇప్పుడీ ఈ లిస్ట్ లోకి హన్సిక కూడా చేరిపోయింది. హీరోయిన్ గా తనకొచ్చే రోల్స్ లోనే హన్సిక సరిగ్గా న్యాయం చేయదనే టాక్ ఉంది. అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ కి న్యాయం చేయడానికి రెడీ అవుతోంది. నిజానికి హన్సికకి ఇప్పటికీ హీరోయిన్ గా చాలా ఆఫర్లు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అయితే ఆ సినిమాల్లో తన పాత్రలకు డాన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదట. అందుకే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నానని, నాకు మ్యూజిక్, డాన్స్ అంటే చాలా ఇష్టమని.. అందుకే స్పెషల్ సాంగ్ చేస్తున్నానని చెబుతుంది హన్సిక.

Also Read: ఎంఎంఏ ఫైటర్గా విజయ్‌ దేవరకొండ!

ఇలా మొత్తానికి హన్సిక కూడా ఐటమ్ సాంగ్ చేయడాన్ని సమర్థించుకుంటుంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం డాన్స్ బాగా ప్రాక్టిస్ చేస్తోందట. ఇంతకీ హన్సిక ఐటమ్ సాంగ్ చేయబోయే సినిమా రవితేజది. రవితేజ హీరోగా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రానున్న సినిమాలో హన్సిక ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుంది.

తనకు ప్రభాస్‌ హీరోయినే కావాలంటున్న బన్నీ?


శ్రద్దా కపూర్. బాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న యువ నటి. కపూర్ ఫ్యామిలీ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. పదేళ్ల కింద వచ్చిన ‘తీన్‌ పత్తీ’తో వెండితెరకు పరిచయం అయిన శ్రద్దా.. ‘ఆషికీ2’, ఏబీసీడీ2, భాగీ, ఓకే జాను, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌, స్త్రీ, చిచోరే వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి నటిగా నిలదొక్కుకుంది. గతేడాది వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘సాహో’తో టాలీవుడ్‌కు కూడా పరిచయం అయిందామె. ప్రభాస్‌ సరసన తన అందచందాలతో ఆకట్టుకున్న శ్రద్ధ పేరే ఈ మధ్య టాలీవుడ్‌లో తరచుగా వినిపిస్తోంది. సుకుమార్ అల్లు అర్జున్‌ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌లో ఆమె నర్తిస్తుందన్న వార్తలు వచ్చాయి.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి 40 కోట్లు !

బన్నీ- సుక్కూ మూవీ అంటే అందులో ప్రత్యేక పాట ఖాయం. అంచనాలకు తగ్గట్టే పుష్పలో కూడా ఈ పాట ను అద్భుతంగా తీయాలని సుక్కూ భావిస్తున్నాడట. ఇది పాన్‌ ఇండియా మూవీ కాబట్టి బన్నీ రేంజ్‌కు, అతని డ్యాన్స్‌ స్పీడును శ్రద్ధా కపూర్ అయితేనే మ్యాచ్‌ చేస్తుందని భావించాడట. ఇందుకోసం శ్రద్ధను సంప్రదించాడని సమాచారం. ఆమె ఒప్పుకుంటే మూవీ హిందీ మార్కెట్‌కు కూడా బాగా ఉపయోగపడుతుందని చిత్ర బృందం భావిస్తుందట.

Also Read: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే…

అయితే, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు కానీ… బన్నీ మరో సినిమాలో ఈ బాలీవుడ్‌ యువ నటి హీరోయిన్‌గా నటించే అవకాశం కనిపిస్తోంది. మరో టాప్‌ డైరెక్టర్ కొరటాల శివతో అల్లు అర్జున్‌ ఓ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. బన్నీ.. పుష్ప, కొరటాల.. ఆచార్య చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతోంది. అయితే, అల్లు అర్జున్‌ మాత్రం తన చాయిస్‌ శ్రద్ధా కపూర్ అంటున్నాడట. ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలని కొరటాలపై ఒత్తిడి తెస్తున్నాడట. ఇదే నిజమైతే మరో మంచి కాంబినేషన్‌ సెట్‌ కానుంది. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ శ్రద్ధా ఇరగదీస్తుంది. ఒకవేళ మరో తెలుగు సినిమాకు ఆమె ఓకే అంటే మాత్రం బన్నీ అభిమానులకు పండగే.

ఎంఎంఏ ఫైటర్గా విజయ్‌ దేవరకొండ!


ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ . పెళ్లి చూపులుతో హీరోగా పరిచయం అయిన విజయ్… ‘అర్జున్‌ రెడ్డి’తో ఓవర్ నైట్‌గా మారిపోయాడు. ఈ మూవీతో తెలుగు వారినే కాదు దేశ వ్యాప్తంగా సినీ ప్రియులందరి దృష్టిని ఆకర్షించాడు. అర్జున్‌ రెడ్డి హిందీలో రీమేక్‌ అయిన తర్వాత విజయ్‌ సినిమాలన్నీ హిందీలో డబ్ అయ్యాయి. దాంతో, విజయ్‌కు దేశ వ్యాప్తంగా ఫాలోవర్స్‌ పెరిగిపోయారు. గీతగోవిందం, ట్యాక్సీవాలా కూడా భారీ విజయాలు సాధించగా… డియర్ కామ్రేడ్‌ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే, అతని చివరి చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్’ మాత్రం భారీ డిజాస్టర్ గా మారింది.

Also Read: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే…

దాంతో, మరో బ్లాక్‌ బస్టర్ తో తన టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకోవాలని భావిస్తున్నాడు విజయ్. అందుకు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో చేతులు కలిపాడు. వరుస ఫ్లాపుల అనంతరం ‘ఇస్మార్ట్ శంక‌ర్’ చిత్రంతో మళ్లీ ట్రాక్‌లో పడ్డ పూరి, విజయ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందన్న సంగతి తెలిసిందే. దీనికి ఫైటర్ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ పాన్‌ ఇండియా మూవీలో విజయ్‌ సరసన బాలీవుడ్‌ యువ నటి అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబైలో శరవేగంగా జరుగుతున్న షూటింగ్‌ కు కరోనా వైరస్‌ బ్రేక్‌ వేసింది. తొందర్లోనే రామోజీ ఫిల్మ్‌ సిటీలోని ప్రత్యేక సెట్‌లో షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలని పూరి భావిస్తున్నాడు.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి 40 కోట్లు !

ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఫైటర్ ‌లో విజయ్‌ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ, విజయ్‌ ఇందులో ఎంఎంఏ క్రీడాకారుడిగా కనిపిస్తాడట. ఎంఎంఏ అంటే మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌. మార్షల్‌ ఆర్ట్స్‌లో అన్ని విద్యలతో ఓ కేజ్‌లో భీకరంగా ఫైట్‌ చేయడం. అంతేకాదు ఇందులో విజయ్‌ పాత్ర నత్తిగా మాట్లాడుతుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి నిర్మితమవుతున్న చిత్రంతో దేవరకొండ బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. నెల రోజుల్లో చిత్రీకరణ మొదలైతే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదయ్యే అవకాశం ఉంది.

సాయి ధరమ్‌ తేజ్‌ పెళ్లి కుదిరిందా?


మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ పెళ్లి కుదిరిందా?. ఇప్పటికే నాగబాబు కుమార్తె నిహారిక వివాహ వేడుకకు రెడీ అవుతున్న మెగా కుటుంబంలో తొందర్లోనే మరో పెళ్లి జరగనుందా?. అంటే అవును అనే సమాధానం వస్తోంది. సోలో బ్రతుకే సో బెటరు అన్న సాయిధరమ్‌ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్టు సమాచారం. ‘నో పెళ్లి దాంతల్లీ ఈ తప్పేం చేయకురా మళ్లీ’ అని పాట పడిన తేజు పెళ్లి కొడుకు అయ్యేందుకు గడియలు దగ్గర పడ్డాయని తెలుస్తోంది. తన సోలో లైఫ్‌ను తొందర్లోనే ముగిస్తున్నట్టు స్వయంగా సాయిధరమ్‌ హింట్‌ ఇచ్చాడు. ఈ మేరకు ఈ రోజు (ఆదివారం) ట్విట్టర్లో ఓ ఆసక్తికర పోస్ట్‌, వీడియో షేర్ చేశాడు.

Also Read: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే…

‘ఒక్కోసారి మ‌నం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు తప్పదు మరి’ అనే క్యాప్షన్‌ ఈ వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో ఆర్. నారాయణ మూర్తి డిస్‌ప్లే పిక్చర్తో సింగిల్‌ ఆర్మీ అనే వాట్సప్‌ గ్రూప్‌ ఉంది. ఇందులో నిఖిల్‌, నితిన్‌, రానా, సాయితేజ్‌, ప్రభాస్‌ ఉన్నారు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న నిఖిల్‌, నితిన్‌, రానా ఈ గ్రూప్‌ నుంచి లెఫ్ట్‌ అవుతారు. ఐయామ్‌ గెట్టింగ్‌ ఎంగేజ్‌డ్‌… మిస్‌యూ గాయ్స్‌ అని మెసేజ్‌ పెట్టి నిఖిల్ ఎగ్జిట్‌ అవుతాడు. ఆ వెంటనే ‘ఇకపై నేను భీష్మను కాను. మరొకరితో కలిసిపోయా. సైనింగ్‌ ఆఫ్‌’ అంటూ నితిన్‌ లెఫ్ట్‌ అయితే.. ‘ఇది ఒక హటాత్‌ పరిణామం.. సారీ రా అబ్బాయిలూ’ అంటూ రానా కూడా గ్రూప్‌ నుంచి వైదొలుగుతాడు. చివర్లో ‘ఇట్స్ షో టైమ్‌. సారీ ప్రభాస్‌ అన్నా’ అని సాయి ధరమ్‌ తేజ్‌ కూడా లెఫ్ట్‌ అవుతాడు. రేపు ఉదయం 10 గంటలకు మరిన్ని వివరాలు అని ట్వీట్‌ చేసిన సాయి తన పెళ్లి గురించి ప్రకటన చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి 40 కోట్లు !

అయితే, ఇదే వీడియోను రీట్వీట్‌ చేసిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ప్రొడక్షన్‌ హౌజ్‌ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ కూడా రేపు ఉదయం పది గంటల వరకూ ఓ కన్నేసి ఉంచండి  అనిపేర్కొంది. దానికి సోలో బ్రతుకే సో బెటరు హాష్‌ ట్యాగ్‌ జతచేసింది. దాంతో, ఇది సాయి పెళ్లి గురించి కాదు సినిమా ప్రమోషన్స్‌ కోసం చేసిన వీడియో అని మరికొందరు భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ చేయడమో లేదంటే మూవీ రిలీజ్‌ గురించి ప్రకటన రేపు రావొచ్చు అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియాలంటే సోమవారం ఉదయం వరకూ వేచి ఉండాల్సిందే. ఒకవేళ సాయి తేజ్‌ పెళ్లి ఫిక్సయితే మాత్రం… టాలీవుడ్‌ థర్టీ ప్లస్‌ బ్యాచిలర్ హీరోల్లో ప్రభాస్‌ ఒక్కడే ఒంటరి వాడవుతాడు.

ఒకే ఒక్క హిట్ తో లిస్ట్ రెట్టింపైందిగా !


సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టి, సూపర్ హిట్ అవ్వడంతో సాయి తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు అయింది. దాంతో, వరుస సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. ప్రసుతం సెట్ మీద ఒక సినిమా ఉంది, అలాగే కరోనా అనంతరం మరొకటి సెట్ మీదకు వెళ్లనుంది. ఇవి కాకుండా ఆల్ రెడీ మరో కథను ఓకే చేశాడు. ఇన్ని సినిమాలను చేతిలో వుంచుకున్న సాయి తేజ్, ఇప్పుడు కొత్తగా మరో సబ్జెక్ట్ ను విన్నాడట. కథ బాగుండటంతో గత పది రోజుల నుండి ఆ కథ మీదే డిస్కషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి 40 కోట్లు !

ఈ సబ్జెక్ట్ ను రైటర్ కోన వెంకట్ తెచ్చాడని, దాదాపు సినిమా కూడా ఓకె అయిందని తెలుస్తోంది. ఈ సబ్జెక్ట్ లో హీరో డాక్టర్ గా కనిపిస్తాడట. మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లోని లొసుగులను ఈ కథలో ప్రస్తావించబోతున్నారట. మొత్తానికి ఈ కథ తనకు బాగా నచ్చిందని.. ముఖ్యంగా వైద్య నేపథ్యంలో కథ చేస్తే. తనకు ఫ్రెష్ గా ఉంటుందని సాయితేజ ఫీల్ అవుతున్నాడు. మరి ఈ సినిమాని ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి. ప్రస్తుతం సాయి తేజ్ సోలో బతుకే సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.

Also Read: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ఎప్పుడంటే…

అలాగే కరోనా అనంతరం దేవా కట్టా డైరక్షన్ లో ఓ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి భగవాన్ పుల్లారావు నిర్మాత. ఆయన ఇప్పటికే ఈ సినిమాని నవంబర్ నుండి లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆ తరువాత బివివిఎస్ఎన్ ప్రసాద్ కి సాయి తేజ్ మళ్లీ మరో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆయనకు కథ ఇంకా సెట్ కాలేదు. బహుశా ఈ కథను ఆయన దగ్గరకు పంపుతాడేమో చూడాలి. అలాగే ఆ మధ్య సాయి తేజ్ కి, గోపీచంద్ మలినేని కూడా ఓ స్క్రిప్ట్ చెప్పాడు. అది కూడా సాయి తేజ్ లిస్ట్ లో ఉంది. మొత్తానికి ‘ప్రతిరోజూ పండగే’ అనే ఒకే ఒక్క హిట్ తో సాయి తేజ్ లిస్ట్ రెట్టింపైంది.

ఫోటోలకు లైకులు రాలేదని యువతి ఆత్మహత్య!

ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. లాక్ డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగింది. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్ లే లోకంగా గడిపే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది ఫోన్ ఛార్జింగ్ లో ఉంచిన సమయంలో సైతం అడిక్ట్ కావడం వల్ల ఫోన్ ను వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు.

నిపుణులు మాత్రం సోషల్ మీడియా వినియోగం ఎంత పెరిగితే మానసిక సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని చెబుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌లోని లాంచెస్టర్‌లో ఫేస్ బుక్ కు బానిసైన యువతి తాను పెట్టిన పోస్టులకు లైకులు రావడం లేదనే చిన్న కారణం వల్ల ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే 19 ఏళ్ల క్లోయె డేవిసన్ చాలా రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా పోలీసులకు ఆమె ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.

అయితే పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి ఆమె స్నేహితులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చూడటానికి అందంగా ఉండే క్లోయె చదువుకుంటూ హోటల్ లో పార్ట్ టైం జాబ్ చేసేది. తరచూ ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసేది. అయితే వాటికి పెద్దగా లైకులు రాకపోవడంతో ఆమె కలత చెందింది. దీంతో డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుంది. అసలు నిజం తెలియడంతో పోలీసులు తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని… వాళ్ల సోషల్ మీడియా వినియోగం గురించి దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు

సూపర్ ఫోటో.. తాబేలుపై వినాయకుడు!

ప్రతి సంవత్సరం వినాయకచవితి పండుగ వచ్చిందంటే ఉండే సందడి అంతాఇంతా కాదు. పండుగకు ముందు రెండు రోజుల నుంచి నిమజ్జనం వరకు మండపాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించేవాళ్లు. అయితే ఎవరూ ఊహించని విధంగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రభావం గణనాథునిపై పడింది. ఇంట్లోనే ఉండి గణేషునికి పూజలు నిర్వహించే పరిస్థితి నెలకొంది. అయితే ఇళ్లల్లోనే ప్రతిష్టిస్తున్న విగ్రహాల విషయంలో కొందరు తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో ఒక భక్తుడు వినాయకుని విగ్రహాన్ని వెరైటీగా అలంకరించి పూజలు నిర్వహించాడు. వివిధ రూపాల్లో, అనేక ఆకృతుల్లో తయారు చేసే వినాయకునికి సంబంధించిన అవతారాలలో కూర్మావతారం ఒకటి. మోత్కూర్ కు చెందిన రఘువర్ధన్ జంతు ప్రేమికుడు కావడంతో గణనాథుడిని తాబేలుపై ప్రతిష్టించాడు. తాబేలుపై ఉన్న గణనాథుడు చూడముచ్చటగా ఉన్నాడు.

స్థానికంగా ఉండే ప్రజలు ఆ గణనాథుడిని చూసి తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తాబేలుపై గణనాథుడు ఉన్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాబేలుపై గణనాథుడిని ఏర్పాటు చేసిన రఘువర్ధన్ తెలివిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. ఇంట్లో అటూఇటు తిరుగుతున్న తాబేలుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ముచ్చట గొలుపుతున్నాయి. ఈ విగ్రహంతో పాటు ఇతర విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ టిప్స్ పాటిస్తే కరోనాకు చెక్!

0

భారత్ లో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారిన పడుతున్నామని కొందరు చెబుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ సోకకుండా మనల్ని మనం సులభంగా రక్షించుకోవచ్చు. కరోనా వైరస్ విజృంభణ వల్ల చాలామంది పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే నిత్యం ఇంట్లోనే ఉన్నా వైరస్ సోకే అవకాశం ఉంది.

ఇంట్లో సోషల్ డిస్టన్స్ పాటించడం సాధ్యం కాదు. అందువల్ల వీలైనంత సమయం ఇంటి ఆవరణలో ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలని… సూర్యరశ్మి కరోనాను కట్టడి చేయడంలో కొంత వరకు సహాయపడటంతో పాటు శరీరానికి కావాల్సిన డి విటమిన్ ను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ విజృంభణ తగ్గే వరకు ఏసీలకు దూరంగా ఉంటే మంచిది.

ఏసీలు ఉండే గదుల్లో తక్కువ ఉష్ణోగ్రత వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకశాలు ఉంటాయి. అందువల్ల ఏసీలను వినియోగించకపోవడమే ఉత్తమం. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని… కారులో ప్రయాణించే సమయంలో విండోస్ తెరిస్తే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. కారు అద్దాలను మూసి ఉంచితే వైరస్ వ్యాప్తి తీవ్రత పెరుగుతుంది. ఆఫీస్ లలో పని చేసే వాళ్లు ఎవరి ఆహారం వాళ్లే తెచ్చుకోవాలని.. ఇతరులు ఇచ్చిన ఆహరం తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. రోజులో తరచూ చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.

ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి!

0

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల అష్టకష్టాలు పడుతున్న భారత ప్రజలకు ఈ వార్త నిజంగా శుభవార్త అనే చెప్పాలి. సరిగ్గా మరో 73 రోజుల్లో భారతదేశ ప్రజలకు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ‘కోవిషీల్డ్’ పేరుతో అక్టోబర్ నెల చివరినాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ‘‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’’ ప్రతినిధులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనుంది.

సీరం సంస్థ ప్రతినిధులు ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. కేంద్రం వ్యాక్సిన్ విషయంలో తమ కంపెనీకి లైసెన్స్ ను ఇచ్చిందని… మరో 58 రోజుల్లో క్లినికల్ ట్రయల్ పూర్తవుతాయని సీరం సంస్థ ప్రతినిధులు తెలిపారు. తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలను సాధించామని… మూడో దశ ట్రయల్ లో ఇవ్వాల్సిన మొదటి మోతాదును శనివారం రోజున ఇచ్చామని తెలిపారు.

29 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నామని… రెండో డోస్ ఇచ్చిన 15 రోజుల తర్వాత వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని సీరం సంస్థ ప్రతినిధులు చెప్పారు. 17 కేంద్రాల్లో… ప్రతి కేంద్రంలో దాదాపు 100 మందిపై ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీరం సంస్థ నుంచి వ్యాక్సిన్ ను కొనుగోలు చేస్తామని సంకేతాలు ఇచ్చినటు తెలుస్తోంది. 2022 సంవత్సరం జనవరి నాటికి సీరం సంస్థ నుంచి 68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను కేంద్రం కొనుగోలు చేయనుందని తెలుస్తోంది..

డ్యాన్స్ చేస్తున్న కోవిడ్ డాక్టర్లు.. కారణం అదే!

0

మనలో చాలామంది కరోనా వైరస్ సోకిందని తెలియగానే వైరాగ్యంతో, బాధతో కనిపిస్తూ ఉంటారు. కరోనా వైరస్ కంటే ఆ వైరస్ కు సంబంధించిన భయమే ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. దీంతో వైద్య సిబ్బంది పలు ప్రాంతాల్లో రోగుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వైద్య సిబ్బంది పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తున్న వీడియోలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా విశాఖ జిల్లాలోని వైద్య సిబ్బంది కరోనా సోకిన రోగుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. పాడేరులోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో చాలా రోజుల క్రితమే అధికారులు కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో తాజాగా వైద్య సిబ్బంది రోగులను అలరించేందుకు రోగులలో ఆనందాన్ని పెంచే పాటలకు ఆడిపాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైద్య సిబ్బంది డ్యాన్సుల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పాడేరు వైద్య సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ వైరస్ సోకిన వాళ్లలో ఉత్సాహాన్ని నింపడం ద్వారా వాళ్లు త్వరగా కోలుకునేలా చేయవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతోందని… మారుతున్న పరిస్థితుల ప్రకారం కరోనా వైరస్ సోకడం సహజంగా మారిందని చెప్పారు. ఎవరికైనా కరోనా సోకితే మనో ధైర్యంతో వైరస్ ను జయించవచ్చని…. మానసిక ఆందోళన చెందడం వల్ల ప్రయోజనం శూన్యమని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పాడేరు ఏజెన్సీలో కరోనా కేసుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

చైతు ‘లవ్ స్టోరీ’కి 40 కోట్లు !


శేఖర్ కమ్ముల అంటేనే సెన్సిబుల్ సినిమాల డైరెక్టర్ అనే బ్రాండ్ క్రియేట్ అయిపొయింది జనంలో. ఆయన సినిమాలు చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చుని ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూడొచ్చు అనే నమ్మకం ఉండటంతో సహజంగానే ముందునుంచి శేఖర్ కమ్ముల సినిమాలకు టీవీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రసుతం థియేటర్ లో సినిమా చూసే పరిస్థితి లేదు, భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా డిజిటల్ బాట పడుతున్నాయి.

Also Read: ప్రభాస్‌ ప్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. రాధేశ్యామ్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఇప్పటికే నాని ‘వి’, సూర్య ‘ఆకాశమే హద్దుగా’, విజయ్ ‘మాస్టర్’ లాంటి సినిమాలు డిజిటల్ టికెట్ ను బుక్ చేసేసుకున్నాయి. ఇప్పుడు వీటి అన్నిటికీ కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న సినిమా లవ్ స్టోరీ. ఈ కరోనా దెబ్బకు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు డిమాండ్ పెరిగింది. దాంతోనే మొదటి నుండి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ లో వస్తోన్న ఈ ‘లవ్ స్టోరీ’ కోసం బాగా ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ కు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరను ఆఫర్ చేస్తోందట.

ఒక్క డిజిటల్ రైట్స్ కే సుమారు 40 కోట్లు ఆఫర్ చేస్తున్నారట. నిజంగా చైతూ గత సినిమాలన్నింటి కంటే ఇది భారీ ధరే. మొన్నటి వరకూ అమెజాన్ పోటీలో ముందు ఉంది. ఇప్పుడు జీ5 రేసులోకి వచ్చి మొత్తానికి లవ్ స్టోరీని ఎగరేసుకుపోయేలా ఉంది. ఇంత భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడానికి ప్రధాన కారణం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేయడానికే. దానితో పాటు ఈ సినిమా కాంబినేషన్ అలాగే శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా ఈ సినిమా బిజినెస్ కి బాగా ప్లస్ అయింది.

Also Read: డిజిటల్ విప్లవంలో రేపటి సినిమాల పరిస్థితి !

కాగా ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ లవ్ స్టోరీతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావులకు నిర్మాతలుగా ఈ సినిమా బాగానే లాభాలను పొందేలా కనిపిస్తోంది.

మొసలితో అనకొండ ఫైట్… చూస్తే భయపడతారు!

జంతువుల మధ్య ఫైట్ ఎప్పటికీ ఆసక్తికరమే. ఒకే జాతికి చెందిన జంతువులైనా, వేర్వేరు జాతులకు చెందిన జంతువులైనా ఒకదానితో మరొకటి ఫైట్ చేస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. పెద్ద జంతువుల మధ్య జరిగే పోరు అయితే మరింత ఆసక్తి పెరుగుతుంది. భూమిపై నివశించే పెద్ద జంతువుల్లో మొసలి, అనకొండ ఒకదానికి మరొకటి బద్ధ శత్రువులు. మొసలి, అనకొండ ఒకదానితో మరొకటి ఫైట్ చేస్తే ఏదో ఒకటి మరో జంతువుకు ఆహారం కావాల్సిందే.

ఈ రెండు జంతువుల మధ్య జరిగే పోరాటం భయానకంగా ఉండటంతో పాటు మనలో సైతం ఒకింత భయాన్ని కలిగిస్తుంది. మన కంటికి ఈ రెండు జంతువుల పోరాటానికి సంబంధించిన దృశ్యాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా బ్రెజిల్ లో ఈ రెండు జంతువుల మధ్య పోరాటానికి సంబంధించిన దృశ్యాలు హల్చల్ చేశాయి. బ్రెజిల్ లోని మౌనస్ పొంట నెగ్రా అనే ప్రాంతంలో మొసలి అనకొండ ఒకదానితో మరొకటి తలపడ్డాయి.

స్థానికంగా ఉండే ప్రజలు రెండు జంతువుల పోరాటానికి సంబంధించిన ఫోటోలను తీసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. సాధారణంగా రెండు జంతువుల మధ్య పోరాటంలో ఏదో ఒక జంతువు గెలుస్తుంది. కానీ స్థానికులు అనకొండకు తాడు కట్టి జంతువుల మధ్య పోరాటాన్ని బలవంతంగా ఆపారు. అనకొండ నుంచి విడిపోయిన మొసలి అక్కడి నుంచి పరుగున వెళ్లిపోయింది. అనకొండ పొడవు దాదాపు 10 అడుగులు ఉన్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ రెండు జంతువుల పోరాటానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ ఫోటోలకు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.