Home Blog Page 8352

ఆ విద్యార్థి చదువు కోసం ఊరికి ఇంటర్నెట్ సౌక‌ర్యం క‌ల్పించిన సోనూసూద్!

సోనూసూద్ రీల్ లైఫ్ లో విలన్… ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి సోనూసూద్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రియల్ లైఫ్ లో మాత్రం సోనూసూద్ హీరోనే. ఇప్పటికే ఎంతో మందికి సాయం చేసి సోనూసూద్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా సాయం చేసి సోనూసూద్ వార్తల్లో నిలిచాడు. కష్టాలు పడుతున్న ఎంతో మందిని ఆదుకుని పేరు తెచ్చుకున్నాడు.

Also Read : సివిల్స్ సాధించాలంటే ఈ ఫోన్ వాడండి!

కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేసి సోనూసూద్ ప్రశంసలు అందుకున్నారు. చేతికి ఎముకే లేదనే విధంగా అడిగిన వారికి చేతనైన సహాయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తాజాగా సోనూసూద్ కు లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన విద్యార్థులు ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన సోనూసూద్ వారి కోసం ప్రత్యేకంగా వైఫైను ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ కు చెందిన స్వాప్నిల్ అనే విద్యార్ధిని ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యంతో ఎంతో శ్రమిస్తోంది. ఆమె తన సోదరుడితో కలిసి ప్రతిరోజూ రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి చిన్న గుడిసె వేసుకుని చదువుకునేది. అక్కడ ఆమె ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతోంది. ఆమె చదువు కోసం పడుతున్న తాపత్రయాన్ని అర్థం చేసుకున్న సోనూసూద్ ఆమె కోసం వైఫైను ఏర్పాటు చేశాడు.

Also Read : వలస కార్మికులకు విమాన టికెట్లు బుక్‌ చేసి నెటిజన్ల మనసు దోచిన రైతు!

ఆ పదార్దాలపై మూడు వారాల పాటు కరోనా జీవించే ఉంటుందట!

ఆహార పదార్థాలపై కరోనా ఉంటుందా…? ఉండదా…? అని మనలో చాలామందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఆహారపదార్థాల ద్వారా కరోనా వైరస్ సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ల ద్వారా కానీ కరోనా సోకినట్టు నిర్ధారణ కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలు భయపడవద్దని చెప్పింది.

Also Read : ఏపీలో లక్షణాలు లేకపోయినా 90 శాతం మందికి కరోనా…?

అయితే తాజా అధ్యయనంలో కరోనా వైరస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజా అధ్యయనంలో ఆహార పదార్థాలపై మూడు వారాల వరకు కరోనా వైరస్ జీవించి ఉండగలదని తేలింది. గడ్డకట్టిన మాంసం, చేపలపై వైరస్ యాక్టివ్ గా ఉండగలదని ఈ అధ్యయనం నిర్ధారించింది. కలుషితమైన ఆహారం వల్లే దక్షిణ కొరియాలో తాజాగా కరోనా కేసులు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ పరిశోధనలో గడ్డకట్టిన ఆహారంపై కరోనా వైరస్ మూడు వారాల పాటు జీవించి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చైనాలోని షెంజెన్ లో గడ్డకట్టిన చికెన్ రెక్కల మాంసంలో కరోనా వైరస్ ఉన్నట్టు కొన్ని రోజుల క్రితం అధికారుల పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. ఇది మరవక మునుపే గడ్డకట్టిన మాంసంపై కరోనా వైరస్ ఉంటుందనే వార్త ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. వైరస్ లు సజీవ హోస్ట్ లేకుండా అవి సొంతంగా మనుగడ సాగించలేవు. అందువల్లే వైరస్ లు నోరు, ముక్కు తుంపర్ల ద్వారానే వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందుతునన్ట్టు తెలుస్తోంది.

Also Read : కరోనా మృతదేహాల్లో ఈ కొత్త లక్షణాలు!

సోనియానే కాంగ్రెస్ సారథి.. కథలో ట్విస్ట్?

Sonia is the Congress captain .. a twist in the story?

కాంగ్రెస్ సీనియర్లు అంతా కూడబలుక్కొని కాంగ్రెస్ పగ్గాలు వేరే వారికి అప్పగించాలని లేఖ రాయడం.. దానిపై రాహుల్ గాంధీ మీటింగ్ లో సీనియర్లపై నిప్పులు చెరగడం.. చివరకు సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మన్మోహన్ కు అప్పజెప్పుతున్నట్లు డిసైడ్ అవ్వడం ఈరోజు చకచకా జరిగిపోయాయి. కానీ కాంగ్రెస్ కథలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కొత్త సారథిపై ఏకాభిప్రాయం కాంగ్రెస్ లో కొరవడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ సారథిగా సోనియాగాంధీనే నియామకం కానున్నారని తెలుస్తోంది. నేతల ఒత్తిడితో మళ్లీ సోనియా గాంధీయేతరులకు కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పాలనే నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిసింది.

Also Read : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పిల్లి కథ?

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈసారి వాడివేడిగా సాగింది. రాహుల్ గాంధీ సినియర్లను కడిగేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్టీని ప్రక్షాళన చేయాలని 23మంది సీనియర్లు సోనియాకు లేఖ రాసిన తీరుపై రాహుల్ సీరియస్ అయ్యారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని నిలదీశాడని వార్తలు వచ్చాయి.

సీనియర్లు అంతా కూడబలుక్కోవడం.. దీని వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు రావడం.. కాంగ్రెస్ ప్రక్షాళనకు నడుం బిగించడం.. అదే జరిగితే కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబం పగ్గాలు చేజారుతాయనే భయం సోనియాగాంధీలో వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ల ఒత్తిడి మేరకు సోనియాగాంధీనే సారథ్యం వహించాలని కోరారు. మరికొంత కాలం సోనియాగాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని డిసైడ్ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ప్రధానంగా కాంగ్రెస్ కుమ్ములాటలతో ఇప్పుడు పరిస్థితి చేజారింది. ఎవరికి అధ్యక్ష బాధ్యతలు మార్చినా కాంగ్రెస్ పని ఖతమవుతుంది. అందుకే సోనియానే తిరిగి బాధ్యతలు తీసుకుంది. సీనియర్లు కూడా సోనియా అయితేనే అందరూ వింటారని చెప్పడంతో ఆమె కాంగ్రెస్ సారథిగా మరికొంత కాలం ఉండాలని నిర్ణయించుకున్నారు.

Also Read : కాపులుప్పాడలో రాజధాని నిర్మాణానికి అవకాశం లేదా?

ప్రభాస్‌ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్‌ చాన్స్!

Golden chance for Nidhi Agarwal in Prabhas movie

హైదరాబాద్‌లో పుట్టి బెంగళూరులో పెరిగి.. బాలీవుడ్‌ నుంచి తెరంగేట్రం చేసింది  నిధి అగర్వాల్‌.  బాలీవుడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యువ నటి  ఇస్మార్ట్‌ శంకర్ మూవీలో మెప్పించింది.   మోడలింగ్‌ తర్వాత 2017లో ‘ మున్నా మైఖేల్‌’ అనే మూవీతో హిందీ పరిశ్రమకు పరిచయం అయిన ఆమె తర్వాత  పూర్తిగా టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ఇక్కడ ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. రెండేళ్ల కిందట నాగ చైతన్య సరసన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ వెంటనే మరో అక్కినేని హీరో అఖిల్‌తో ‘మిస్టర్మజ్ఞూ’ చేసింది. ఈ రెండు సినిమాలు ఫెయిలైనా పూరి జగన్నాథ్‌ తన ‘ఇస్మార్ట్‌ శంకర్’లో నిధికి చాన్సిచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు నిధి అగర్వాల్‌కు సైతం  మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. తమిళ్‌లో  ‘భూమి’ అనే సినిమాలో నటిస్తున్న నిధి.. మహేశ్‌ బాబు అల్లుడు గల్లా అశోక్‌ హీరోగా పరిచయం అవుతున్న  చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది.

Also Read : మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ డిటైల్స్ ! 

Golden chance for Nidhi Agarwal in Prabhas movie

ఇప్పుడు నిధిని మరో  గోల్డెన్‌ చాన్స్‌ వరించినట్టు సమాచారం. ఏకంగా ప్రభాస్‌ సినిమాలో నటించే అదృష్టం ఆమె సొంతమైందట. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌, ప్రభాస్‌ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ బ్యానర్పై అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌ నిర్మించే ఈ పాన్‌  ఇండియా మూవీలో బాలీవుడ్‌ స్టార్దీపిక పడుకోన్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా స్పేస్‌ ఉంది. ఆ పాత్రకు నాగ్‌ అశ్విన్‌.. ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ను తీసుకోవాలని చూస్తున్నాడని సమాచారం. దీని గురించి తొందర్లోనే ప్రకటన చేయాలని చూస్తున్నాడని తెలుస్తోంది. అంతా సవ్యంగా సాగితే  ప్రభాస్‌, దీపిక పడుకోన్‌తో కలిసి పనిచేసే లక్కీ చాన్స్‌ నిధి సొంతం కానుంది. తన నటనా నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు లాక్‌డౌన్‌ విరామంలో  న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఆన్‌లైన్‌ కోర్సు చేసింది నిధి. ఒకవేళ ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం అయితే తన నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుందని భావిస్తోందామె.

శ్రీ సూర్య ప్రొడక్షన్స్ ‘జి’ ఫస్ట్ లుక్ విడుదల!

Sri Surya Productions 'G' First Look Released
శ్రీ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూర్య నిర్మాతగా వ్యవహరిస్తూ దీపిక, ఆర్యన్ అనే ఇద్దరు నూతన దర్శకులుగా చేస్తోన్న తొలి చిత్రం జెడ్ ‘జాంబీ’ అనే ఉపశీర్షిక తో మన ముందుకు రాబోతున్నారు.

Also Read : పాత కలకత్తాలో సాయి పల్లవి విలన్ !

ఈ సందర్భంగా డైరెక్టర్ దీపిక మాట్లాడుతూ….

ఇప్పటి వరుకు మన తెలుగు లో ఎవరు ట్రై చేయని జాంబీ అనే కల్పిత పాత్రను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాము. మాకు వున్న పరిధిలో బెస్ట్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ తో చిత్రం వర్క్ చేయడం ఆనందంగా వుంది, మా ఈ తొలి చిత్రాన్ని మీ అందరూ చూసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామని తెలిపారు.

హీరో మరియు డైరెక్టర్ ఆర్యన్ మాట్లాడుతూ….

మేము మొదటిసారి జాంబీస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము, క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించాము. ఈ చిత్ర కథ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు.

నిర్మాత సూర్య మాట్లాడుతూ…

మొదటి సారి ఈ కథ విన్నప్పుడు దర్శకులు చెప్పిన విధంగా ఈ చిత్రాన్ని తియ్యగలరా అనిపించింది, కానీ సినిమా పూర్తి అయ్యాక ఔట్ పుట్ చూశాను, అద్భుతంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, వారు ఏదైతే చెప్పారో అదే తీశారు, ఆడియన్స్ కూడా తప్పకుండా ఈ సినిమాను ఇష్టపడి చూస్తారని అనుకుంటున్నాను. ఏంతో అనుభవం కలిగిన వారిలాగా దీపిక, ఆర్యన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నాతో సహా 20 మంది నూతన నటీనటులను నా బ్యానర్ లో ఇలాంటి కథ తో మి ముందుకు వస్తునందుకు చాలా ఆనందంగా మరియు గర్వంగా వుంది. మీ అందరి ప్రోత్సాహంతో మరిన్ని వైవిధ్యమైన కథలతో మీ ముందుకు మేము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Also Read : ఐటమ్ సాంగ్ ను సమర్థిస్తున్న మరో హీరోయిన్ !

మళ్లీ ఈనాడు గ్రూపుకు ఊపు.. రంగంలోకి రామోజీ

Ramoji rao enters the business again
తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు రామోజీరావు.. ఈనాడు సంస్థల అధినేతగా.. మీడియా టైకూన్ గా దేశవ్యాప్తంగా పేరుపొందారు. కట్టుదిట్టమైన సామ్రాజన్యాన్ని నెలకొల్పి మీడియా రంగంతోపాటు పలు వ్యాపార రంగంలో క్రమశిక్షణకు మారుపేరుగా ఎదిగారు. తన మొండి వైఖరి, సమర్థవంతమైన వ్యాపార నిర్వహణ నైపుణ్యాలకు పేరుగాంచిన ఈ 83 ఏళ్ల పులి గత కొన్ని నెలలుగా యాక్టివ్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఆయన వ్యాపారాలను పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది.

Also Read : పాత కలకత్తాలో సాయి పల్లవి విలన్ !

తన వ్యాపార స్రామాజ్యం పగ్గాలను ఇటీవలే తన కొడుకు, కోడలుకు తాత్కాలికంగా రామోజీరావు అప్పగించాడు. సక్సెస్ అయితే పూర్తిగా అప్పగించేస్తానని అనుకున్నాడు. అందుకే రోజువారీ కార్యకలాపాలకు రామోజీరావు దూరంగా ఉన్నాడు. కీలక నిర్ణయాలు.. బోర్డు మీటింగ్ ఆమోదాలకు మాత్రమే పరిమితమవుదామని అనుకున్నారు. విశ్రాంతి తీసుకొని సైడ్ అయిపోదామని అనుకున్నాడు.

కానీ ఈ టైంలోనే వచ్చిన కరోనా మహమ్మారి రామోజీ వ్యాపార సామ్రాజ్యాన్ని పునాదుల నుంచి కదిలించింది. పైనుంచి కూలడం ఆరంభమైంది. భారీగా ఖర్చు, వ్యయం ప్రతీరోజు అవసరమయ్యే రామోజీ ఫిల్మ్ సిటీ తీవ్ర సంక్షోభంలోకి మునిగిపోయింది. ఇక మొన్నటి వరకు రామోజీ ఎడిటర్ గా ఉన్న ఈనాడు గ్రూపు భారీ ఆర్థికనష్టాల్లో కూరుకుపోయింది.
తెలుగురాష్ట్రాల్లోనే అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన ఈనాడు పత్రిక దేశంలోని ఇతర పత్రికలలాగే సిబ్బందిపై వేటు వేసి నష్టాలను తగ్గించుకోవడానికి పత్రికల ప్రచురణను తగ్గించుకుంది.

తాజాగా కేంద్రం షూటింగ్ లకు దేశవ్యాప్తంగా అనుమతిని ఇవ్వడంతో బయట కంటే స్టూడియోల్లో నిర్మాణానికి చిత్రం యూనిట్లు మొగ్గుచూపుతున్నాయి. బాలీవుడ్ నుంచి భారీగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ల కోసం వస్తున్నారట.. ఈ క్రమంలోనే రామోజీ ఫిలింసిటీని తిరిగి గాడినపడేయడానికి రామోజీ ప్రయత్నాలు ప్రారంభించారట.

Also Read : మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ డిటైల్స్ !

ఇక ఈనాడును తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. తెలుగు పత్రిక పాఠకుల సంఖ్యను.. ప్రచురణను పెంచి తిరిగి నంబర్ 1 స్థానాన్ని పునరుద్దరించాల్సిన అవసరం ఉందని రామోజీ రంగంలోకి దిగారట.. ఈ క్రమంలోనే విశ్రాంతిని పక్కనపెట్టి తిరిగి తన వ్యాపారంలో చురుకైన పాత్రను పోషించాలని రామోజీరావు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

 
ప్రస్తుతం రామోజీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని కార్యకలాపాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారట..
వార్తాపత్రిక.. దాని మార్కెటింగ్‌తో సహా ఈనాడు వ్యాపార సామ్రాజ్యం   కీర్తిని పునరుద్ధరించడానికి మీడియా మొఘల్ వ్యూహాలను రూపొందిస్తున్నారట..రామోజీ రావు మిగతా కార్యకలాపాలన్నింటినీ తిరిగి తన చేతుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈనాడు తిరిగి పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. 

ప్రమోషన్‌ కోసం ప్రభాస్ పేరు వాడుకోవడం అవసరమా తేజు?

Is it necessary to use Prabhas name for promotion?

ఛీ..ఛీ.. బోడి మ్యాటర్ చెప్పేందుకు ఇంత  బిల్డప్‌ అవసరమా?  పైగా ఆ ప్రమోషన్‌ కోసం ప్రభాస్‌ పేరు వాడుకోవడమా? అంటూ అభిమానులు ఓ మెగా హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మెగా హీరో ఎవరు? అభిమానులకు ఎందుకు కోపం తెప్పించాడు.. అనుకుంటున్నారా? అతను మరెవరో కాదు మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్. అతను  ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఎస్ తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్. షూటింగ్‌ కంప్లీట్‌ అయిన ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ముందుగా మే 1వ తేదీనే విడుదల చేయాలని భావించారు. కానీ, కరోనా దెబ్బకు వాయిదా పడింది. టీజర్,  ‘నో పెళ్లి దాంతల్లి.. ఈ తప్పేం చేయకురా వెళ్లి’ అనే లిరికల్‌ సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

Also Read : బ్రేకింగ్ : బాలుగారికి కరోనా నెగిటివ్ !

అయితే, సాయి ధరమ్ తేజ్‌ నిన్న (ఆదివారం) ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టాడు. ‘ఒక్కోసారి మ‌నం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వ‌చ్చిన‌ప్పుడు తప్పదు మ‌రి’ అంటూ  ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో బ్యాచిల‌ర్ హీరోలంద‌రూ క‌లిసి ఉన్న ‘సింగిల్ ఆర్మీ’ అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్‌, నితిన్‌, రానా.. ఒక్కొక్కరూ లెఫ్ట్ అయ్యారు. వీళ్లంతా ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు.  చివ‌ర్లో సాయి ధరమ్‌ కూడా ‘ఇట్స్‌ షో టైమ్‌… సారీ ప్రభాస్‌ అన్నా’ అంటూ లెఫ్ట్‌ అవుతాడు. ఈ రోజు ఉదయం పది గంటలకు మరిన్ని వివరాలు చెబుతా అని ట్వీట్‌ చేశాడు. దాంతో, మెగా హీరోకు పెళ్లి కుదిరిందని, దాని గురించే  ఈ రోజు ప్రకటన వస్తుందని అంతా ఆశించారు. అభిమానులంతా సాయి ట్వీట్‌ కోసం వేచి చూశారు. కానీ, వాళ్లందరికీ షాకిచ్చిన చిరు అల్లుడు… తన మూవీ గురించి మాత్రమే అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘అంత  కఠినం గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూసాక ఏమైంది ???’ అని ట్వీట్‌ చేసిన సాయి ధరమ్‌ ఈ మూవీలో  ‘హే ఇది నేనేనా’ అనే  పాటను ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించాడు. అలాగే, హీరోయిన్‌ నభా నటేష్‌, తాను ఉన్న ఓ పోస్టర్ను కూడా షేర్ చేశాడు.

అయితే,  ప్రభాస్‌ పేరు వాడుకొని ట్విట్టర్లో నిన్న అతను చేసిన హడావుడంతా కేవలం సోలో బ్రతుకే సినిమా ప్రమోషన్‌ కోసమే అని స్పష్టమైంది. దాంతో, కొంత మంది తేజుపై  విమర్శలు ఎక్కు పెట్టారు. సినిమా ప్రమోషన్‌ విషయాన్ని నేరుగా చెప్పాలి గానీ.. ఇంత బిల్డప్‌ ఇవ్వడం ఎందుకు?  దానికి ప్రభాస్‌ పేరు వాడుకోవడం ఎందుకు? ఇదంతా చీప్‌ పబ్లిసిటీ స్టంట్‌ అంటూ సోషల్‌ మీడియాలో  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సాయి రియాక్షన్‌ ఎలా ఉంటుందో మరి?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పిల్లి కథ?

Rahul Gandhi

ఎప్పటినుండో కాంగ్రెస్‌ పార్టీలో పిల్లికథ ప్రాచుర్యంలో ఉంది. జాతీయ కాంగ్రెస్ పార్టీ కి ఎవర్ని అధ్యక్షన్ని చేయాలనేదే.. ఈ పిల్లి కథ సారాంశం. “పిల్లి మెడలో గంట కట్టాలిగా..” అనే ఒక పిట్ట కథతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షన్ని ఎన్నుకుంటారు. అయితే ఈ అధ్యక్ష రాజీనామా నాటకాలు కాంగ్రెస్ లో కొత్తకాదు. సంక్షోభాలు ఎదుర్కొన్న ప్రతిసారీ ఇలాంటివి చాలానే జరిగాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకోవటంతో చాలా రోజులపాటు డ్రామా నడిచింది. చివరకు మళ్లీ సోనియాగాంధీకే పగ్గాలు అప్పగించారు.

తాజాగా సోనియానుంచి మరోసారి రాహుల్‌ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకే లేఖాస్త్రం కథ నడుస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. 2017 డిసెంబర్‌ 16న రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిని చేసేందుకు కూడా పార్టీ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం చేసి గాంధీల చేతినుంచి పార్టీ ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారనే వాదనలు ఉన్నాయి. 1996 నుంచి 98 వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరి నుంచి సోనియాకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కూడా ఇలాంటి నాటకమే నడిచిందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు లేఖ రాసిన సీనియర్లపై రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సమావేశం ప్రారంభం కాగానే మొదట రాహుల్‌ గాంధీ మాట్లాడారు.  23 మంది సీనియర్లు లేఖరాయడంపై సమావేశం సందర్భంగా రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియా ఆరోగ్యం సరిగాలేని సమయంలో లేఖ రాసేందుకు సమయం ఇదేనా అని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా బయటకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. పార్టీ విషయాలను అంతర్గత వ్యవహారాలను సోషల్ మీడియాలో, బహిరంగంగా ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించినట్లుగా తెలిసింది. సంక్షోభ సమయంలో పార్టీ నాయకత్వ బాధ్యతలపై చర్చ అవసరమా? అన్నట్లు తెలుస్తోంది. నాయకత్వం మార్పు సమయం చూసుకోకుండా లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీతో కుమ్మక్కై లేఖ రాసినట్లుగా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. లేఖ రాయడంపై ఉన్న ఉద్దేశాలను ప్రశ్నించారు. తాను రాజీనామా చేశాక సోనియా గాంధీ విముఖ తెలిపారని, కాంగ్రెస్‌  సీనియర్‌ నేతల ఒత్తిడితోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినట్లు ప్రస్తావించినట్లు సమాచారం. కాగా, రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై సీనియర్‌ నేత గులామ్ నబీ ఆజాద్‌ తో పాటు పలువురు నాయకులు స్పందించినట్లు తెలిసింది. బీజేపీతో కుమ్మకైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆజాద్‌ అన్నట్లుగా తెలుస్తోంది.

వైరల్ వీడియో: అత్తను చితకబాదింది.. అరెస్ట్ అయ్యింది!

సాధారణంగా చాలామంది ఇళ్లల్లో అత్తాకోడళ్లకు పొసగదు. కొన్ని సందర్భాల్లో అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం, గొడవలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా హర్యానాలోని సోనిపట్ అనే ప్రాంతంలో 82 ఏళ్ల అత్తగారిని కోడలు కొట్టిన ఘటన విపరీతంగా వైరల్ అయింది. దీంతో పోలీసులు కోడలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే రామేహర్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు.

సోనిపేటలో అతని, తల్లి, భార్య పిల్లలతో కలిసి రామేహర్ నివాసం ఉంటున్నాడు. రామేహర్ భార్య అదే ప్రాంతంలో ఏ.ఎన్.ఎంగా పని చేసేది. అయితే గత కొన్ని నెలల నుంచి రామేహర్ భార్య, తల్లి మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతున్నాయి. రామేహర్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య అత్తకు పనులు చెప్పడంతో పాటు ఆ పనులు అత్త చేయకపోతే తీవ్ర అసహనం వ్యక్తం చేసేది.

ఒక ఇంట్లో చెప్పిన చేని చేయని అత్తను కోడలు డస్ట్ బిన్ తో చితకబాదింది. ఏడుస్తూ ఉన్న అత్తను చూసి మరింత గట్టిగా చితకబాదుతూ ఆమె ఏడిపించింది. స్థానికులు కోడలు అత్తను కొడుతున్న ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోడలు అత్తను కొడుతున్న సమయంలో కోడలి తల్లి కూడా కొట్టమని కూతురిని ప్రోత్సహిస్తూ ఉండటం గమనార్హం. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లీకూతుళ్లు సొంతూరికి పారిపోయారు. సోనిపట్ సిటీ పోలీసులు కోడలితో పాటు కోడలి తల్లిని అరెస్ట్ చేశారని సమాచారం.

పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఏంటంటే?

డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసులను పేటీఎం తాజాగా ప్రారంభించింది. ఇకపై పేటీఎం వినియోగదారులు ఆధార్ కార్డు సహాయంతో నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ, ఇతర లావాదేవీలను జరుపుకునే అవకాశం ఉంటుంది. నగదు డిపాజిట్, ఇంటర్‌బ్యాంక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ లాంటి ఫీచర్లు కూడా త్వరలో పేటీఎం వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

పేటీఎం ఏఈపీఎస్ సర్వీసుల సహాయంతో ఆధార్‌తో అనుసంధానమైన దేశంలోని బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు ఇకపై క్యాష్ విత్‌డ్రాయెల్స్, బ్యాలెన్స్ విచారణ వంటి సేవలను పొందవచ్చని కంపెనీ తాజాగా ప్రకటన చేసింది. సెమీ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు, ఏటీఎంలు పరిమితంగా ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. దేశంలో ఆర్థిక సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఏఈపీఎస్ సర్వీసులను ప్రారంభించింది.

దేశంలోని మారుమూల ప్రాంతంలోని ప్రజలు పూర్తి బ్యాంకింగ్ సేవలను పొందగలిగేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళుతున్నామని పేటీఎం చెల్లింపుల బ్యాంక్ సీఎండీ సతీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటన చేశారు. 10,000కి పైగా వ్యాపార కరస్పాండెంట్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని చెప్పారు. పేటీఎం ప్రారంభించిన ఏఈపీఎస్ సర్వీసుల వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. భవిష్యత్తులో ఇతర సంస్థలు సైతం ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.

బాబు… నీకు రమేష్ లు తెలుసా…? మీ రిలేషన్ ఏమిటి అసలు?

రమేష్… ఈ పేరు చెబితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికిపోతోంది. అది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావచ్చు, విజయవాడ రమేష్ ఆస్పత్రి అధినేత…. డాక్టర్ రమేష్ కావచ్చు. ఇక వీరిద్దరిలో డాక్టర్ రమేష్ ఆచూకీ దొరకడం లేదు. దాంతో పోలీసులు అతని ఆచూకీ చెబితే లక్ష రూపాయల బహుమతి ప్రకటించేశారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు డాక్టర్ రమేష్ బాబు.

ఇక ఈ కేసులో కులపరమైన ఆరోపణలు ఎన్నో వచ్చాయి. వీటికి అనవసరంగా హీరో రామ్ పోతినేని స్పందించగా ఆయనకు పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు అనుకోండి… అది వేరే విషయం. అయితే ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రమేష్ కుమార్ ని చంద్రబాబే దాచారని అనుమానం వ్యక్తం చేశారు. అతని ఆరోపణ వెనుక బలమైన కారణం ఉందో లేదో తెలియదు కానీ…. ఈ కేసులో కి చంద్రబాబుని కూడా లాగాలని నిర్ణయించుకున్నారు. బహుశా అదే విజయసాయిరెడ్డి ఉద్దేశ్యం అయి ఉండొచ్చు.

అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రభుత్వం తమదే కాబట్టి.. ఈ విషయం లో విజయసాయి రెడ్డి ఇంకాస్త చొరవ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం…. న్యాయస్థానాలను ఆశ్రయించడం చేయవచ్చు. కాదంటే ప్రభుత్వం తరఫున చంద్రబాబు మీద విచారణ కమిటీ కూడా వేయించే ఆస్కారం ఆయనకు ఉంది. అయితే అవన్నీ మానేసి విజయసాయిరెడ్డి వేరే తరహాలో భారీ ట్వీట్ చేశారు.

ఇకపోతే చంద్రబాబు నిజంగానే రమేష్ ను దాచేస్తే అది పసిగట్టలేని అసమర్ధత స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా..? విజయసాయిరెడ్డి నేరుగా ఇంతకీ డాక్టర్ రమేష్ ని ఇంట్లో దాచారా..? లేక మీ కొడుకు ఇంట్లో దాచారా అని అడగడం…. నిమ్మగడ్డ రమేష్ కి – డాక్టర్ రమేష్ కు.. మీకు (చంద్రబాబుకి) ఎటువంటి సంబంధం ఉంది అని ప్రశ్నించడం ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారింది. మరి దీనికి దీనికి బాబు నుండి కౌంటర్ ఆశించవచ్చా…?

ఎమ్మెల్యే వంశీకి గట్టి కౌంటర్ ఇచ్చిన దుట్టా..!

Dutta gave a tough counter to the MLA vamsi

గన్నవరం నియోజకవర్గానికి అన్నీ తానేనని ప్రకటించుకున్న ఎమ్మెల్ల్యే వల్లభనేని వంశీ మోహన్ కు వైసీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట వంశీ గన్నవరానికి ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ఛార్జి అన్నీ తానేనని స్వయంగా ప్రకటించుకున్నారు. ఈ ప్రకటనతో దుట్టా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. గన్నవరానికి ఎనికలు జరిగితే తాను పోటీ చేయడం నూరు శాతం గ్యారంటీ అని స్పష్టం చేశారు. వైసీపీ స్ధాపించిన నాటి నుంచి జెండా మోసిన తనకు పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని వంశీతో కలిసిన పని చేయలేనని చెప్పారు.

Also Read : కాపులుప్పాడలో రాజధాని నిర్మాణానికి అవకాశం లేదా?

ఇదే సమయంలో ఎమ్మెల్యే వంశీ వైసీపీలో చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు వంశీని సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లారని, అయితే లోపల జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరారని అన్నారు. అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావుపైనా కొన్ని విమర్శలు చేశారు. 2019లో పార్టీ ఆదేశాల ప్రకారం వెంకట్రావు గెలుపునకు కృషి చేశారని, ఆయన తనను దూరం పెట్టి, సహకార సంఘాల ఛైర్మన్ ల ఎంపీకలో ఏకపక్షంగా వ్యవహరించారని తెలిపారు. వంశీతో కలిపి పని చేయడానికి పార్టీ ఆదేశాలతో సిద్ధమయ్యానని, అయితే వంశీ తన వెంట వైసీపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తూ అసైన పార్టీ నాయకులను, కార్యకర్తలను విస్మరించారని తెలిపారు.

కొద్ది రోజులుగా గన్నవరం నుంచి దుట్టా అల్లుడు భరత్ గన్నవరం ఇన్ఛార్జిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. దుట్టా మాత్రం ఈ వాదనలు ఖండించారు. తన అల్లుడుకి స్వఛ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించనున్నట్లు తెలిపారు. గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గన్నవరం ఇన్ఛార్జిగా యార్లగడ్డ రంగంలోకి దిగిన అనంతరం వైసీపీలో దుట్టా వర్గం, యార్లగడ్డ వర్గం ఉన్నాయి. ఇప్పడు వల్లభనేని వంశీ పార్టీలో చేయడంతో మూడు వర్గాలుగా మారాయి. స్వతహాగా వైసీపీలో ఉన్న వారికి వల్లభనేని ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం వాస్తవం. దీంతో దుట్టా కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి భరోసా ఇచ్చారు. ఎన్నికలు జరిగితే తానే పోటీ చేస్తానని హామీ ఇచ్చారు.

Also Read : ఐదు నెలల తర్వాత రాష్ట్రం దాటి వెళుతున్న జగన్… ఎందుకంటే…?

దుట్టా చర్యతో పార్టీ ప్రకటించకుండా స్వయంగా తానే వైసీపీ ఇన్చార్జినని ప్రకటించుకున్న వంశీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అసంతృప్తితో ఉన్న దుట్టాతో సంప్రదింపులు జరపకుండా స్వయంగా తనకు తానే ఇన్ఛార్జిని అని ప్రకటించుకోవడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి. 

బ్రేకింగ్ : బాలుగారికి కరోనా నెగిటివ్ !

sp balasubrahmanyam

సినీ గాన గంధర్వుడు కరోనాని జయించారు. కోట్లాది మంది అభిమానులను తన గాత్రంతో మళ్ళీ అలరించనున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్. ఎస్పీ చరణ్ తన తండ్రి హెల్త్ గురించి వీడియో రిలీజ్ చేస్తూ.. ‘నన్నాగారికి కోవిడ్ -19 టెస్ట్ లో నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది.

మరో 3, 4 రోజుల్లో ఐసియు నుండి జనరల్ వార్డుకు ఆయనను షిఫ్ట్ చేయనున్నారు. ఆయన ఆరోగ్యం పై డాక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం కుదటపడుతూ ఉంది. ఆయన కోసం ప్రార్ధనలు చేసిన అందరికీ కృతజ్ఞతలని ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు.

Also Read : మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ డిటైల్స్ ! 

మొత్తానికి బాలుగారికి కోవిడ్ నెగిటివ్ రావడంతో ఆయన కోట్లాది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా బాలుగారు ఆరోగ్యం పై ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా తీవ్ర ఆందోళనకరంగా గురవుతున్న సంగతి తెలిసిందే. కానీ నేటితో వారి ఆందోళన తీరింది. బాలుగారు పూర్తిగా కోలుకోబోతున్నారు. ఇప్పటికే బాలుగారి ఆరోగ్యం పై ప్రముఖుల సైతం తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ చేసిన ప్రార్ధనలతో పాటు అలాగే లక్షలాది అభిమానులు బాలుగారి ఆరోగ్యం కోసం చేసిన పూజలను ఆ దేవుడి ఆలకించాడు. బాలుగారు సంపూర్ణ ఆరోగ్యంతో కరోనాని జయించారు. సంగీత ప్రపంచానికి ఇది ఎంతో శుభవార్త. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులను కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి.

Also Read : పాత కలకత్తాలో సాయి పల్లవి విలన్ !

కాపులుప్పాడలో రాజధాని నిర్మాణానికి అవకాశం లేదా?

కాపులుప్పాడలో రాజధాని నిర్మాణానికి అవకాశం లేదా?

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని నిర్మాణం జగన్ ప్రభుత్వం ఊహించినంత తేలికైన వ్యవహారం కాదని స్పష్టం అవుతుంది. ఇప్పటికే చట్టపరంగా, న్యాయ పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి తాజాగా సాంస్కృతిక ప్రదేశాల అంశానికి సంబంధించి మరో సమస్య ఎదురుకానుంది. ఈ అంశాన్ని ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

Also Read : ఐదు నెలల తర్వాత రాష్ట్రం దాటి వెళుతున్న జగన్… ఎందుకంటే…?

కార్యనిర్వాహక రాజధాని నిర్మాణంలో భాగంగా ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పడు కాకుండా శంకుస్థాపన పనులు పూర్తి చేసింది. అదునాతన హంగులతో భారీ స్టేట్ గెస్ట్ హౌస్ ను కాపులుప్పాడ గ్రేహౌండ్ కార్యాలయ సమీపంలో ఉన్న కొండపై నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఆటంకాలు ఎదుర్కొంటుంది. చారిత్రక ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టకూడాదని చట్టం చెబుతున్నా ఏపీ ప్రభుత్వం భౌద్ద కట్టడాలు ఉన్న ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టడంపై ఎంపి అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాపులుప్పాడలో ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న ప్రదేశంలో 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ద కట్టడాలు ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978 మే 2 న ఈ ప్రదేశాన్ని పురావస్తు ప్రదేశంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన తెలియజేశారు. పురావస్తు ప్రాంతంగా గుర్తంచిన ఈ ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో హై కోర్టు సూచించిందన్నారు. ఈ అంశాలన్నింటీనీ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నిర్మాణాలు జరగకుండా నిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

నిర్మాణం పనులు ప్రారభం అవకుండానే స్టేట్ గెస్ట్ హౌస్ కు అభ్యంతరాలు ప్రారంభం అవడతో రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై ఇంకేన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని నిర్మాణంపై తొలి నుంచి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన అమరావతిలోనే రాజధాని ఉంచాలని కొంత కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. 

Also Read : కాంగ్రెస్, టీడీపీ కథ కంచికేనా?

ఐదు నెలల తర్వాత రాష్ట్రం దాటి వెళుతున్న జగన్… ఎందుకంటే…?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు హర్షా రెడ్డి ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు సాధించారు. కూతురును డ్రాప్ చేయడం కోసం జగన్ దాదాపు ఐదు నెలల తరువాత రాష్ట్రం దాటి వెళుతున్నారు. ఈ నెల 25వ తేదీన జగన్ బెంగళూరుకు వెళ్లి 26వ తేదీ కూడా అక్కడే ఉండి 27వ తేదీన తాడేపల్లికి రిటర్న్ అవుతారని తెలుస్తోంది. కూతురును పారిస్ కు పంపేందుకు జగన్ బెంగళూరుకు వెళుతున్నాడని తెలుస్తోంది.

రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల జగన్ పూర్తిస్థాయిలో ఏపీకే పరిమితమయ్యాడు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలవాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆ పని ఆగిపోయింది. ఆ తర్వాత జగన్ ప్రస్తుతం ఏపీని దాటి వెళ్లాలనుకుంటున్నారు. ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలు ప్రపంచంలోని టాప్ 5 యూనివర్సిటీలలో ఒకటి. హర్షారెడ్డి ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

అనంతరం ఆమెకు అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ హర్షారెడ్డి ఉద్యోగాన్ని వదిలేసుకుని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. చిన్న వయస్సు నుంచి హర్షారెడ్డి ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్ సాధించడం గమనార్హం. సీఎం కూతురు సీటు సాధించడంతో వైసీపీలో సందడి నెలకొంది.

మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ డిటైల్స్ ! 

Megastar 'Acharya' Shooting Details

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్  కొరటాల శివ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ను మొదలు పెడతారని వార్తలు వస్తున్నా.. ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో మెగాస్టార్ లేరట. సినిమాలో మెగాస్టార్ తో పాటు  నాజర్, జయసుధ లాంటి ఆర్టిస్ట్ లు కూడా అరవై సంవత్సరాలు పైబడిన వారే కావడంతో.. ఈ కరోనా పరిస్థితుల్లో షూటింగ్ చేయకపోవవడమే బెటర్ అనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారు. అయితే కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి, కేవలం సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేయాలని.. అందుకు తగ్గట్లుగానే ఆర్టిస్ట్ లను కూడా సిద్ధంగా ఉంచాలని మెగాస్టార్ కొరటాలకు సూచించినట్లు తెలుస్తోంది.

Also Read : బ్రేకింగ్ : బాలుగారికి కరోనా నెగిటివ్ !

ఇక మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమాపై  మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తాడని.. సినిమాలో చరణ్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపించబోతున్నారు.   కాకపోతే పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ లో మాత్రమే చిరు అలా కనిపిస్తారని.. అలాగే ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు  మొదలు అయినా..  గతంలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లోనే షూట్ చేస్తారట. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం  బరువు తగ్గడంతో పాటు లుక్ ను కూడా మార్చారు. అన్నట్టు  కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది.

Also Read : నాని ‘వి’ మూవీ సెన్సార్ రిపోర్ట్‌

కాంగ్రెస్, టీడీపీ కథ కంచికేనా?

Inter-ministerial panel to probe financial dealings of three Rajiv ...

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో.. 100 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు సార్లు దేశంలో చిత్తుగా ఓడిపోయింది. ఒకప్పుడు 1 ఎంపీ సీటు మాత్రమే గెలిచిన బీజేపీ వరుసగా రెండు సార్లు దేశంలో పొత్తు లేకుండా సొంతంగా మెజారిటీ సాధించింది. సంకీర్ణ రాజకీయాలు ఏలే భారతదేశంలో ఎవరి సపోర్టు లేకుండా బీజేపీ ఠీవీగా పాలిస్తోంది. ఇదో అద్భుతమనే చెప్పాలి.

ఎన్నికల వేళ బీజేపీతో కటీఫ్ చేసుకొని కాంగ్రెస్ తో జతకూడిన ఏపీలోని తెలుగు దేశం పార్టీ మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ గతే టీడీపీకి పట్టింది. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ టీడీపీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఓ విఫల ప్రయోగంగా నిలిచిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం  52 సీట్లు మాత్రమే దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.ఇక ఏపీలో మాత్రం చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు బోటాబోటీగా టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కింది.  అయితే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ రెండూ అవసాన దశలో ఉన్నాయి.

Why is Chandrababu Naidu Leaving Back Nara Lokesh?

వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్ పని అయిపోయింది. సోనియా వృద్ధాప్యంతో పార్టీలో చురుకుగా ఉండలేకపోతున్నారు. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడం లేదు. ఇక ఇక్కడ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు 70 ఏళ్లు దాటాయి. ఆయన ఇంకో నాలుగేళ్లు ప్రతిపక్షంలో ఉండాలి. వృద్ధాప్యం చంద్రబాబును అంత యాక్టివ్ గా ఉంచలేదు. ఇక బాబు కు స్టాండ్ బైగా లోకేష్ ఎదగడం లేదు. ఇటు తెలంగాణలో ఇప్పటికే టీడీపీ పని అయిపోయింది. ఆ పార్టీ నుంచి అందరూ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో తెలంగాణలో టీడీపీ తుడుచుపెట్టుకుపోయింది.

నిజానికి అక్కడ కాంగ్రెస్ లో సోనియా-రాహుల్, ఇక్కడ టీడీపీలో చంద్రబాబు-లోకేష్ లకే పార్టీ పగ్గాలు పోతున్నాయి. తప్పితే వేరొకరిని ఈ చట్రంలోకి రానీయడం లేదు. ఎదగనీయడం లేదు. 1995లో టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు ఇప్పటికీ మరొకరికి అది ఇవ్వలేదు. లోకేష్ ను సైతం అధ్యక్షుడిని చేయకపోవడం విశేషం. సోనియా, చంద్రబాబులు రాజకీయాల్లో నిరూపించుకున్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలారు. అయితే వారి వారసులే ఫ్లాప్ అయ్యారు. అక్కడ రాహుల్, ఇక్కడ లోకేష్ లు పార్టీని నడిపించే శక్తి తమకు లేదని నిరూపించుకున్నారు.

అయితే రాహుల్ కు ప్రత్యామ్మయంగా బలమైన ప్రియాంక గాంధీ ఉన్నారు. కానీ ఇక్కడ లోకేష్ కు ప్రత్యామ్మాయంగా ఎన్టీఆర్ ను తేవడానికి చంద్రబాబు అస్సలు ఒప్పుకోరు. బహుశా బ్రహ్మణి తెరమీదకు రావచ్చు. మొత్తానికి ఈ రెండు పార్టీలు ఇప్పుడు నాయకత్వ లోపంతో పార్టీలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోనియా, చంద్రబాబులు వైదొలిగితే టీడీపీ, కాంగ్రెస్ కథ కంచికేనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.