
జంతువుల మధ్య ఫైట్ ఎప్పటికీ ఆసక్తికరమే. ఒకే జాతికి చెందిన జంతువులైనా, వేర్వేరు జాతులకు చెందిన జంతువులైనా ఒకదానితో మరొకటి ఫైట్ చేస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. పెద్ద జంతువుల మధ్య జరిగే పోరు అయితే మరింత ఆసక్తి పెరుగుతుంది. భూమిపై నివశించే పెద్ద జంతువుల్లో మొసలి, అనకొండ ఒకదానికి మరొకటి బద్ధ శత్రువులు. మొసలి, అనకొండ ఒకదానితో మరొకటి ఫైట్ చేస్తే ఏదో ఒకటి మరో జంతువుకు ఆహారం కావాల్సిందే.
ఈ రెండు జంతువుల మధ్య జరిగే పోరాటం భయానకంగా ఉండటంతో పాటు మనలో సైతం ఒకింత భయాన్ని కలిగిస్తుంది. మన కంటికి ఈ రెండు జంతువుల పోరాటానికి సంబంధించిన దృశ్యాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా బ్రెజిల్ లో ఈ రెండు జంతువుల మధ్య పోరాటానికి సంబంధించిన దృశ్యాలు హల్చల్ చేశాయి. బ్రెజిల్ లోని మౌనస్ పొంట నెగ్రా అనే ప్రాంతంలో మొసలి అనకొండ ఒకదానితో మరొకటి తలపడ్డాయి.
స్థానికంగా ఉండే ప్రజలు రెండు జంతువుల పోరాటానికి సంబంధించిన ఫోటోలను తీసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. సాధారణంగా రెండు జంతువుల మధ్య పోరాటంలో ఏదో ఒక జంతువు గెలుస్తుంది. కానీ స్థానికులు అనకొండకు తాడు కట్టి జంతువుల మధ్య పోరాటాన్ని బలవంతంగా ఆపారు. అనకొండ నుంచి విడిపోయిన మొసలి అక్కడి నుంచి పరుగున వెళ్లిపోయింది. అనకొండ పొడవు దాదాపు 10 అడుగులు ఉన్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ రెండు జంతువుల పోరాటానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ ఫోటోలకు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.