
భారత్ లో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారిన పడుతున్నామని కొందరు చెబుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ సోకకుండా మనల్ని మనం సులభంగా రక్షించుకోవచ్చు. కరోనా వైరస్ విజృంభణ వల్ల చాలామంది పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే నిత్యం ఇంట్లోనే ఉన్నా వైరస్ సోకే అవకాశం ఉంది.
ఇంట్లో సోషల్ డిస్టన్స్ పాటించడం సాధ్యం కాదు. అందువల్ల వీలైనంత సమయం ఇంటి ఆవరణలో ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలని… సూర్యరశ్మి కరోనాను కట్టడి చేయడంలో కొంత వరకు సహాయపడటంతో పాటు శరీరానికి కావాల్సిన డి విటమిన్ ను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ విజృంభణ తగ్గే వరకు ఏసీలకు దూరంగా ఉంటే మంచిది.
ఏసీలు ఉండే గదుల్లో తక్కువ ఉష్ణోగ్రత వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకశాలు ఉంటాయి. అందువల్ల ఏసీలను వినియోగించకపోవడమే ఉత్తమం. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని… కారులో ప్రయాణించే సమయంలో విండోస్ తెరిస్తే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. కారు అద్దాలను మూసి ఉంచితే వైరస్ వ్యాప్తి తీవ్రత పెరుగుతుంది. ఆఫీస్ లలో పని చేసే వాళ్లు ఎవరి ఆహారం వాళ్లే తెచ్చుకోవాలని.. ఇతరులు ఇచ్చిన ఆహరం తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. రోజులో తరచూ చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.