Home Blog Page 8354

రూ.2.5కోట్లు పలికిన మహాత్మ గాంధీ కళ్లజోడు..!

మనలో చాలామంది పురాతన కాలం నాటి వస్తువులను, ప్రముఖులు వాడిన వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు. ఆ వస్తువులు సొంతం చేసుకోవడానికి అవకాశం వస్తే ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. వేలంలో పోటీ పడి కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ వస్తువులను సొంతం చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఇంగ్లండ్ లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ అనే సంస్థ మన దేశ జాతిపిత మహాత్మ గాంధీ కళ్లజోడును వేలం వేసింది.

వేలంలో గాంధీ కళ్లద్దాలు భారీ ధర పలకడం గమనార్హం. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో ధరించిన కళ్లద్దాలను బ్రిస్టల్ లో వేలానికి పెట్టారు. ఈ కళ్లద్దాలు ఏకంగా 2,60,000 యూరోలకు అమ్ముడయ్యాయి. భారత కరెన్సీ ప్రకారం గాంధీజీ కళ్లజోడు విలువ ఏకంగా రెండున్నర కోట్లు పలకడం గమనార్హం. అమెరికాకు చెందిన పేరు తెలియని వ్యక్తి ఈ కళ్లద్దాలను దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఆక్షనర్ ఆండీ స్టోవ్ మాట్లాడుతూ కళ్లద్దాలను కేవలం 15,000 యూరోల ధరకే రిజర్వ్ చేశామని చెప్పారు. మన దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన చాలామంది గాంధీజీ కళ్లజోడును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారని చెప్పారు. దీంతో కళ్లజోడు ధర ఊహించని విధంగా భారీగా పెరిగింది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో బ్రిటిష్ పెట్రోలియంలో పని చేసే ఒక వ్యక్తికి ఈ కళ్లజోడును ఇచ్చాడని సమాచారం. ఇంగ్లండ్ కు చెందిన వ్యక్తి వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళ్లజోడును బ్రిస్టోల్ ఆక్షన్ కు పంపి భారీ మొత్తం దక్కించుకున్నాడు. స్టోవ్ కళ్లజోడు విక్రయం ద్వారా తన జీవితాన్ని మార్చేంత డబ్బును సొంతం చేసుకున్నానని మీడియాకు తెలిపాడు.

సీనియర్ హీరోకి ఇక ఓటీటీలే బెస్ట్ !


ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న హీరోకు ఉండే క్రేజ్, దర్శకుడికి గాని, నిర్మాతకు గాని అలాగే మరో ఏ క్రాఫ్ట్ లోని వ్యక్తికి గాని ఉండదనేది వాస్తవం. అందుకే ఏజ్ అయిపోయినా ఇంకా హీరోగానే కొనసాగడానికి డా. రాజశేఖర్ లాంటి వాళ్ళు కిందామీదా పడుతూ ఉంటారు. నిజానికి రాజశేఖర్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ సినిమా మంచి హిట్ అయింది. ఆ హిట్ తో సహజంగానే రాజశేఖర్ కి డిమాండ్ పెరిగింది. కానీ, తనకున్న డిమాండ్ ను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు రాజశేఖర్. కల్కి అంటూ తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని చూపించే ప్రయత్నం చేసి, బోల్తా పడ్డాడు. దాంతో రాజశేఖర్ కి వచ్చిన డిమాండ్ కాస్త తగ్గిపోయింది.

Also Read: ఆ నలుగురినీ కాదని త్రివిక్రమ్‌కే వెంకీ ఓటు!

మొత్తానికి తనకు థియేటర్ మార్కెట్ లేదని గ్రహించిన రాజశేఖర్, ఇప్పుడు ఓటిటి ల కేసి చూస్తున్నాడు. అసలు ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లో ఎంత వస్తోంది.. మన సినిమాకి వాళ్ళ దగ్గర ఎంత డిమాండ్ ఉంటుంది అని లెక్కలు అడుగుతున్నాడట జీ5 ఓటీటీకి సంబంధించిన నిమ్మకాయల ప్రసాద్ అనే అతన్ని. తనకు ఎంత మార్కెట్ ఉందో తెలిస్తే ఆ బడ్జెట్ లో సినిమా చేసి, ఓటీటీలకు అమ్ముకుందామనే ఆలోచనలో రాజశేఖర్ ఉన్నాడట. ఎంత లేదన్నా రాజశేఖర్ ఒకప్పుడు హిట్లు ఉన్న హీరో. అందుకే ఇప్పటికి ఆయనకు కాస్త డిమాండ్ ఉంది. రెండు, మూడు కోట్ల రేంజ్ లో సినిమా చేసి.. ఐదారు కోట్లకు ఈజీగా ఓటీటీలకు అమ్ముకోవచ్చు.

Also Read: కేజీఎఫ్ లాంటి క్రేజీ యాక్షన్ డ్రామాలో చరణ్ !

ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో వున్న రాజశేఖర్ కి, ఈ ఓటీటీ వర్కౌట్ అయ్యేదే. పైగా తన తరువాత సినిమాలను కూడా వీలయినంత తక్కువ బడ్జెట్ లో తీసి క్యాష్ చేసుకునే వెసులుబాటు రాజశేఖర్ కి ఉంది. ఇక ప్రస్తుతం రాజశేఖర్ ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నాడు.

బీజేపీలో ‘బండి’ బ్యాటింగ్ మొదలుపెట్టాడా?


ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు చూసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘బ్యాటింగ్’ మొదలుపెట్టాడని ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు. బీజేపీ సీనియర్లు, పెద్దలను ఇన్నాళ్లు గౌరవిస్తూ మెతకవైఖరిని అవలంభించిన బండి ఇక జూలు విదిలుస్తున్నాడని అంటున్నారు. తెలంగాణలో తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నారట.. ఈ క్రమంలోనే ఫైరవీలకు.. సీనియర్లకు చెక్ చెప్పినట్టు తెలుస్తోంది.

Also Read: సెటైర్ : దెబ్బకు హరీష్ రావు పాలు అమ్ముతున్నాడు… కేటీఆర్ ఆ మజాకా?

బండి సంజయ్ అధ్యక్షుడు కాకమునుపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా డాక్టర్ కె. లక్ష్మణ్ ఉన్నారు. ఆయన కాలంలోనే బీజేపీ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పుడు ఆయన పదవీకాలం ముగియడంతో బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామం తర్వాత రాష్ట్ర బీజేపీలో లక్ష్మణ్ పాత్ర లేదు. ఆయన బీజేపీ నుంచి పూర్తి దూరంగా జరగడం చర్చనీయాంశమవుతోంది.

సాధారణంగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు చూసిన వారు తప్పుకుంటే వారిని బీజేపీ జాతీయ పార్టీలోని పదవుల్లోకి తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో వారిని రాజ్యసభ ఎంపీలుగా కూడా చేస్తారు. లక్ష్మణ్ విషయంలో ఆ రెండూ జరగలేదు. ఆయనను బీజేపీ జాతీయకార్యవర్గంలోకి తీసుకోలేదు. రాజ్యసభ ఎంపీ ఆఫర్ ను కూడా ఇవ్వలేదట.. తెలంగాణ నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు రాజ్యసభ రేసులో ఉన్నారు. ఆయన తర్వాతే లక్ష్మణ్ కు ఏదైనా పదవులు దక్కవచ్చు. ప్రస్తుతానికి లక్ష్మణ్ బీజేపీలో ఎలాంటి పదవి లేకుండా మౌనంగానే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Also Read: శ్రీశైలంలో ప్రమాదం.. సాగర్ లో అలజడి!

ఇక ఇప్పటికే తీసేసిన అవమానంతో కృంగిపోయిన లక్ష్మణ్.. జాతీయ నాయకత్వం కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ కార్యక్రమాలకు పూర్తి అంటిముట్టనట్టుగా ఉంటున్నాడట.. ఇప్పుడు మరింత అవమానాన్ని కలిగిస్తూ కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ తను కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గంలో లక్ష్మణ్ సూచించిన పలువురి పేర్లను చేర్చలేదు. ఆయన మద్దతుదారులందరూ బండి సంజయ్ ను కలిసి కోరినా రాష్ట్ర బీజేపీ శాఖలో బండి చేర్చకుండా దూరంగా ఉంచారట. ఈ అవమానాన్ని చూసి లక్ష్మణ్.. పార్టీ అధ్యక్షుడు బండిపై గుర్రుగా ఉన్నాడట..

కేంద్రం పూర్తిగా లక్ష్మణ్ ను పక్కనపెట్టిందని తెలుసుకునే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో బ్యాటింగ్ మొదలుపెట్టాడని.. ఆ క్రమంలోనే లక్ష్మణ్ బ్యాచ్ ను చేర్చుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ దర్శకులకెందుకు అర్ధం కాదో !


ఒకప్పుడు హిట్ సినిమా తీసిన దర్శకులు తక్కువుగా ఉండేవారు, దానికి తోడు ఏ దర్శకుడు సినిమా చేయాలన్నా.. ముందుగా కావాల్సిన కథను.. తానే రైటర్స్ చేత ప్రత్యేకంగా రాయించుకునే వాడు. అలా గతంలో వేరే వాళ్ల కథలతో సినిమాలు చేసేవారు ముందుతరం దర్శకులు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరు మంచి కథ తెచ్చుకుంటే.. వాళ్లే దర్శకులుగా మారుతున్నారు. అలా దర్శకులుగా మారినవాళ్లు, మళ్ళీ మరో కథ రాయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. పోనీ, ఆ రాసిన కథ అయినా ఏ హీరోకైనా నచ్చాలి.. లేదంటే ఇక మళ్ళీ ఆ దర్శకుడికి ఛాన్స్ రావట్లేదు.

Also Read: ఆ నలుగురినీ కాదని త్రివిక్రమ్‌కే వెంకీ ఓటు!

అందుకే ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటున్నారేమో మన దర్శకులు. మొత్తానికి రీమేక్ అయితే, రిస్క్ తక్కువ అనుకుంటున్నారు. పెద్దగా క్రియేటివిటీ కూడా అక్కర్లేదు. మార్పులు చేర్పులు సంగతి ఎలా వున్నా, సీన్ టు సీన్ హ్యాపీగా దింపేయచ్చు. దానికంటే ముందు ఓ సినిమా డైరక్ట్ చేసే చాన్స్ వచ్చేస్తుంది. అందుకే సినిమాలు చేతిలో లేక ఖాళీగా వున్న చాలా మంది డైరక్టర్లు ఇప్పుడు రీమేక్ ల మీద పడ్డారు. పక్క భాషలో బాగున్న సినిమాని చూసుకుని.. ఆ రీమేక్ చేద్దాం అంటూ నిర్మాతల వెంట పడుతున్నారు.

Also Read: కేజీఎఫ్ లాంటి క్రేజీ యాక్షన్ డ్రామాలో చరణ్ !

ఇప్పటికే పక్క భాషా చిత్రాల రైట్స్ కొంతమంది నిర్మాతలు కొని పెట్టుకున్నారు. దాంతో అలాంటి నిర్మాతలకు ఫోన్ చేసి ఈ దర్శకులంతా, మీరు ఫలానా బాషలోని సినిమా రీమేక్ రైట్స్ కొన్నారట కదా? ఆ సినిమా నేను డైరక్ట్ చేస్తాను.. కథ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది అంటూ ఛాన్స్ లు అడుగుతున్నారు. ఈ లిస్ట్ లో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అయినా తాను కొన్న సినిమాని ఏ డైరెక్టర్ తో చేయాలనే క్లారిటీ లేకుండా ఏ నిర్మాత సినిమాని కొనడు కదా. మరి ఆ విషయం ఈ దర్శకులకు ఎందుకు అర్ధం కాదో !

‘కుల’కలం.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్


ఏపీలో రెండు బలమైన సామాజికవర్గాలైన కమ్మ, రెడ్డిల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ, వైసీపీ నేతలు ఇప్పుడు కులాన్ని బేస్ చేసుకొని తగువులాడుకుంటున్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేశ్ ఆస్పత్రి యజమానులు కమ్మలు కావడం.. టీడీపీ మౌనంగా ఉండడం.. వైసీపీ కక్షసాధింపులతో ఈ ఫైట్ ముదురుతోంది.

Also Read: మరో మెట్టు ఎక్కిన ఎంపీ రాజు..! ఇంత ధైర్యం ఎక్కడిది?

స్వర్ణ ప్యాలెస్ ఇష్యూలో హీరో రామ్ ట్వీట్లు చేయడంతో అది మరింత అగ్నికి ఆజ్యంపోసింది. విజయవాడ సీపీ అయితే హీరో రామ్ కు ఆధారాలుంటే చూపించాలని.. లేకుంటే మీకు నోటీసులు జారీ చేస్తామని.. సోషల్ మీడియాలో ఏది పడితే అది వ్యాఖ్యలు చేయడం సరికాదని సవాల్ చేయడం హీట్ పెంచింది. ప్రశ్నించిన హీరో రామ్ ను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆయన తరుఫున వకాల్తా పుచ్చుకోవడంతో ఇది కుల రాజకీయంగా మారిపోయింది.

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం చుట్టూ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ విడిపోయాయి. రెండు బలమైన సామాజికవర్గాల మధ్య వివాదంగా మారిపోయింది. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తాజాగా దీనిపై స్పందిస్తూ హీరో రామ్ కు మద్దతు పలికారు. విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రియల్ లైఫ్ హీరో అనిపించుకోవాలంటూ హీరో రామ్ ను ఆహ్వానించారు. డాక్టర్ రమేశ్ ను కూడా తప్పు చేయనప్పుడు బయటకు వచ్చి నిరూపించుకోవాలని కోరారు. హీరో రామ్ కు నోటీసులిస్తామన్న సీపీ వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఖండించారు. రాక్షసుల పాలనలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా? అని మండిపడ్డారు. విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మేమూ చూస్తాం.. టీడీపీ తరుఫున అండగా ఉంటామని అని సవాల్ చేశారు.

Also Read: ట్యాపింగ్‌ కేసులో పెద్ద తలలు?

ఇక టీడీపీ సవాల్ పై ఆ పార్టీ నుంచే బయటకు వచ్చిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు సినీ హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా..? వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్ ని చెప్పమనండి’ అంటూ వంశీ తనదైన శైలిలో టాలీవుడ్ హీరోకు ప్రశ్నల వర్షం కురిపించారు.చంద్రబాబు కూడా ఇదే కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కమ్మవారికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపిందా అంటూ జగన్ ను వెనకేసుకొచ్చారు.

ఇప్పుడు స్వర్ణ ప్యాలెస్ వివాదం చుట్టూ రెండు సామాజికవర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో అనవసరంగా స్పందించిన హీరో రామ్ ఇప్పుడు ఈ వివాదంలోకి లాగేయబడ్డారు. ఆయనను విజయవాడకు రమ్మంటూ టీడీపీ మద్దతిస్తుండగా.. ఆయన రాకను వ్యతిరేకిస్తూ వైసీపీ రాజకీయం చేస్తోంది. రెండు సామాజికవర్గాలు ఇలా తప్పు ఒప్పులను ఆలోచించకుండా తగువులు ఆడుకోవడం చర్చనీయాంశమైంది.

మరో మెట్టు ఎక్కిన ఎంపీ రాజు..! ఇంత ధైర్యం ఎక్కడిది?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు…. అధికార వైసీపీ పార్టీ పై తన పగని అంతా చల్లార్చుకుంటున్నాడు. జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. పార్టీ నేతల నుండి తనకు సరైన సహకారం అందడం లేదని మొదట్లో విమర్శలు చేసిన ఆయన ప్రస్తుతం వైసీపీని విమర్శించేందుకు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా అందరిని ఒక ఆట ఆడుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు కృష్ణంరాజు ఏ నేతని నేరుగా ఉద్దేశించి పెద్దగా విమర్శలు చేసింది లేదు. అయితే ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉన్న కృష్ణంరాజు రెబలిజం…. ఏపీ మంత్రి కి సింపుల్ గా ఒక సవాల్ విసిరేలా చేసింది. దానితో ఆ వైసీపీ మంత్రి హడలిపోయారు కూడా.

ఏపీ మంత్రి వెల్లంపల్లి కి రఘురామరాజు ఒక సవాలు విసిరారు. తనను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు అని హెచ్చరిస్తూ…. మాటలతో కాదు దమ్ముంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం నియోజకవర్గం లోకి వచ్చి వినాయక చవితి పూజలు చేయాలని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి వెల్లంపల్లి కి సవాల్ విసిరి రఘు రామరాజు చాలా పెద్ద డేరింగ్ స్టెప్ వేశాడనే చెప్పాలి. ఇప్పటి వరకు జగన్ జోలికి గాని అతని నేతలు జోలికి వెళ్లని రామరాజు నెమ్మదిగా ఇలా ఒక్కో నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తే ప్రజల్లో వారి పై వ్యతిరేక భావం ఏర్పడే ప్రమాదం ఉంది

నిజానికి రఘురామరాజు అంత ధైర్యం చేయడానికి సగం కారణం అతని వ్యక్తిత్వం అయితే మిగతా సగం వైసీపీ నేతలే. ముందు రఘురామని పనికిమాలిన నాయకుడిగా అభివర్ణిస్తూ ఢిల్లీలో కూర్చుని హిందూమతంపై సవతి ప్రేమ చూపిస్తున్నారని… వెల్లంపల్లి విమర్శించారు. దీంతో రెబల్ ఎంపీకి ఆగ్రహం నషాళానికంటింది. ఢిల్లీలో రాకుండా తనపై విమర్శలు చేయడం తగదని…. వెల్లంపల్లి ని ఉద్దేశించి ప్రజల ప్రాణాలని బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.

అంతకుముందు హైదరాబాద్ లో కూర్చున్న చంద్రబాబు మార్గదర్శకంలో ఢిల్లీ లో కూర్చున్న రఘురామ పనిచేస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే వినాయకచవితి కూడా అయిపోయింది.. కానీ రఘురామరాజు జోరు మాత్రం తగ్గడం లేదు. వైసిపి వారు సత్వరమే అతని విషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే నష్టం మాత్రం భారీగా ఉంటుందని విశ్లేషకుల అంచనా.

ట్యాపింగ్‌ కేసులో పెద్ద తలలు?

Ap highcourt

న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మొత్తం 16 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా లిఖిత పూర్వక వివరణ సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డి.రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు నోటీసులు జారీ చేసిన వారిలో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ), సీబీఐ డైరెక్టర్‌, విశాఖ సీబీఐ ఎస్పీ.. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ, సమాచార, సాంకేతిక (ఐటీ) శాఖ, సమాచార, ప్రసార శాఖ, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ.. జియో-రిలయన్స్‌ జియో సీఈవో, వొడాఫోన్‌-ఐడియా సీఈవో, ఎయిర్‌టెల్‌ సీఈవో, బీఎ్‌సఎన్‌ఎల్‌ సీఈవో, భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్‌) చైర్మన్‌, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉన్నారు.

Also Read : వీర్రాజు తో అంత వీజీ కాదని అర్థం చేసుకున్న ఏబిఎన్ ఆర్కే…!

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌పై వార్తాప‌త్రిక‌ల్లో ప్రచురితమైన కథనం ఆధారంగా విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రేస్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు కళంకం తెచ్చేలా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌, ట్రేసింగ్‌, నిఘా తదితరాలకు యత్నించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, డీజీపీల వ్యవహారంపై విచారణకు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేయాలని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అందులో అభ్యర్థించారు. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ను టెలిగ్రాఫ్‌ చట్టానికి, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రకటించాలని కూడా విన్నవించారు. ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఫోన్ల ట్యాపింగ్‌, నిఘాకు అనుమతి ఇవ్వకుండా ప్రైవేటు, ప్రభుత్వ ఫోన్‌ సంస్థలు, ట్రాయ్‌ను ఆదేశించాలని కోరారు.

అదే విధంగా కొంతమంది న్యాయమూర్తుల మొబైల్‌ ఫోన్ల ట్యాపింగ్‌ జరగడంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు తక్షణం టెలికమ్యూనికేషన్ల నిపుణుడిని నియమించాలని సీవీసీకి, సీబీఐ డైరెక్టర్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలనీ అభ్యర్థించారు. కాగా.. ఈ పిటిషన్‌పై ఈ నెల 18వ తేదీన విచారణ జరుగగా.. న్యాయమూర్తుల ఫోన్‌ ట్యాపింగ్‌కు రాష్ట్రంలో ప్రత్యేకంగా ఐపీఎస్‌ అధికారిని కూడా నియమించారని, ఆ మేరకు అదనపు అఫిడవిట్‌ దాఖలు చేస్తానని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. విచారణ సందర్భంగా అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు ఆయన తెలుపగా.. దానిలోని అదనపు అభ్యర్థనలను ప్రధాన అఫిడవిట్‌ లోనే పొందుపరచి, సవరించిన అఫిడవిట్‌ ను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే 3వ తేదీకి వాయిదా వేసింది.

Also Read : మీడియా సంస్థల మధ్య ముదురుతున్న వార్!

ఎలుక‌ల‌పై ప‌రీక్ష స‌క్సెస్‌.. ముక్కు ద్వారా క‌రోనా టీకా!

ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను నియంత్రించడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్ర‌వేత్త‌లు ముక్కు ద్వారా ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నారు. సార్స్‌-సీవోవీ-2 వైర‌స్‌ను టార్గెట్ చేసి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

Also Read : సీతాకోక చిలుక పెయింటింగ్ ఇంట్లో ఉంటే ఏం అవుతుందో తెలుసా?

ఈ వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. వ్యాక్సిన్ తీసుకున్న ఎలుకల్లో రోగ నిరోధక శక్తి పెరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రొఫెస‌ర్ మైఖేల్ డైమండ్ ముక్కు ద్వారా ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ద్వారా ఎలుకలు రక్షణ పొందాయని… ఎలుకల్లో ఇమ్యూనిటీ పొందినట్లు తాము గుర్తించామని తెలిపారు. అడినోవైర‌స్‌కు స్పైక్ ప్రోటీన్ల‌ను ఎక్కించి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

సాధారణంగా అడినో వైరస్ తో తయారు చేసిన వ్యాక్సిన్లను చెయ్యి లేదా తొడ కండరాలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే డాక్ట‌ర్ డేవిడ్ క్రూయిల్ ముక్కు ద్వార ఇమ్యునిటీని పెంచే వ్యాక్సిన్ ను తయారు చేయడం గొప్ప విషయం అని చెప్పారు. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తోనే వైరస్ ను నియంత్రించడంలో సక్సెస్ అయ్యామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఊపిరితిత్తుల్లో వైరస్ ను సైతం సమర్థవంతంగా నియంత్రిస్తోందని అస్త్రవేత్తలు తెలిపారు. వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో అతి త్వరలో వైరస్ ను జయించడం సాధ్యమే.

Also Read : నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘కరోనా థీమ్’తో గణేష్.. ఫోటోలు వైరల్!

నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘కరోనా థీమ్’తో గణేష్.. ఫోటోలు వైరల్!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. కరోనా, ప్రభుత్వ నిబంధనల వల్ల గత సంవత్సరం స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలోనే వినాయ‌కుడి వేడుకలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రజలు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంటి నుండే గణనాథునికి పూజలు చేస్తున్నారు. విఘ్నేషుడికి సంబంధించిన విగ్రహాల పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో నందిని విఘ్నేష్ అనే మ‌హిళ కరోనా థీమ్ తో గణపతిని తయారు చేసింది.

Also Read : ఎలుక‌ల‌పై ప‌రీక్ష స‌క్సెస్‌.. ముక్కు ద్వారా క‌రోనా టీకా!

కరోనా వైరస్ నేపథ్యంలో గణేషున్ని అలంకరించింది. వేల సంఖ్యలో గణేష్ విగ్రహాలను పండుగ జరుపుకోవడం కోసం ఆమె సేకరించింది. నందిని విఘ్నేష్ మాట్లాడుతూ చాలా రోజుల నుంచి తాను, తన కుటుంబ సభ్యులు గణేష్ విగ్రహాలను సేకరించడం ప్రారంభించామని… ఆ విధంగా ఇప్పటివరకు 3,500 విగ్రహాలను సేకరించామని చెబుతోంది. విగ్రహాల సేకరణ కోసం చాలా ప్రాంతాలకు వెళ్లినట్లు నందిని విఘ్నేష్ చెప్పుకొచ్చింది.

ఫేస్‌మాస్క్, శానిటైజర్ ఉన్న గణేష్ విగ్రహం వ్యక్తిగత పరిశుభ్రత గురించి సందేశాన్ని ఇస్తుందని ఆమె చెప్పింది. వినాయకుడి వాహనమైన ఎలుకకు సైతం ఫేస్ మాస్క్ పెట్టామని పేర్కొంది. ఏ వేదికపై విగ్రహాన్ని ఉంచామో దానిపై కరోనాకు సంబంధించిన వాటిని చూడగలుగుతామని ఆమె పేర్కొంది. పోలీస్ అధికారులు, వైద్యులు, ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ కృషికి విగ్రహం తెలియజేస్తుందని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా నందిని విఘ్నేష్ కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు.

Also Read : గుడ్ న్యూస్.. ‘కరోనా వైరస్’ను తగ్గిస్తున్న ఆయింటిమెంట్!

వీర్రాజు తో అంత వీజీ కాదని అర్థం చేసుకున్న ఏబిఎన్ ఆర్కే…!

రాధాకృష్ణ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండిగా మనకు తెలుసు. అయితే రాజకీయపరంగా అతను తెలుగుదేశం పార్టీ అనఫీషియల్ నేత అన్నది విషయం మాత్రం ఎవరూ బయటకు చెప్పలేని నిజం. ఇదే సమయంలో తన శక్తి మేరకు తెలుగుదేశం పార్టీని రక్షించేందుకు ఏబీఎన్ ఆర్కే పాటుపడుతూ ఉంటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని జగన్ ను ఓడించడం వెనుక 2019 ఎన్నికల్లో బాబు ఏకాకిగా అయిపోయి ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడం వెనుక ఆర్కే హస్తం ఎంతైనా ఉందని అది విశ్లేషకుల మాట.

ఈ మధ్య ఆర్కే పైన బాబు ఆధారపడడం తగ్గించినా కూడా ఎంతో విశ్వాసంగా రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కి సాయం చేయాలని అక్కడ అవకాశాలు లేకపోయినా… సృష్టించుకుని మరీ తన సంపాదకీయాల ద్వారా వారికి తన రాతలతో సహకారం అందిస్తూ ఉంటాడు. ఇదే ఈ క్రమంలో అతను రాసిన ఎన్నో విశ్లేషణలు, వ్యాసాలు, సంపాదకీయాలు మరి వన్ సైడ్ గా ఉంటాయి. ఇప్పుడు సోము వీర్రాజుకి కూడా అతను రాసిన ఒక సంపాదకీయం చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అంతే…. మిగతా వారిలా లోపల తిట్టుకోకుండా.. మీడియా ముందు వచ్చి ఇండైరెక్ట్ గా విమర్శలు చేయకుండా నేరుగా ఆర్కే కే లేఖ రాసేశారు.

మా పార్టీ అంతర్గత విషయాలు నిర్లజ్జగా వేలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీసిన సోము వీర్రాజు…. మీరు టిడిపి కి మడుగులు వత్తాలి అనుకుంటే అది మీ ఇష్టం కానీ అలా అని అతి ప్రేమను, లేని ప్రేమను బీజేపీపై ఒలికించ్చాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తమ రాష్ట్ర ప్రజలందరికీ మీ గుట్టు తెలుసునని… కేంద్ర ప్రభుత్వానికి మీ సంపాదకీయం సరిగ్గా అర్ధం కాకపోతే అర్ధం అయ్యేలా తాను చెబుతాను అని అన్నారు. మీరు మీ సంపాదకీయంలో జీవీఎల్ నరసింహారావు గురించి ప్రస్తావించారు కాబట్టి నేను కూడా బహిరంగంగానే ఏపీ బీజేపీ తరఫున రిప్లై ఇలా లేఖ ద్వారా ఇచ్చాని అని తేల్చి చెప్పారు.

ఇప్పటివరకు ఏపీ బిజెపి అంటే పెద్దగా లెక్క చేయని రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారిగా సోము వీర్రాజు దెబ్బకు తల తిప్పి ఇటు వైపు చూశారు. ఇక పచ్చ తమ్ముళ్లు అయితే వణికిపోయారు. ఏబిఎన్ ఆర్కే.. సోము వీర్రాజుని ఇంత తక్కువగా తప్పుడు అంచనా వేశానా అని మదనపడుతూ ఉంటాడు.

గుడ్ న్యూస్.. ‘కరోనా వైరస్’ను తగ్గిస్తున్న ఆయింటిమెంట్!

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ను కట్టడి చేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. అయితే తాజాగా ఒక ఆయింట్మెంట్ కరోనా కట్టడిలో మంచి ఫలితాలను సాధిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏపీటీ టీ3ఎక్స్ పేరుతో విడుదలైన ఈ ఆయింట్మెంట్ ను సొంతంగా ఎవరైనా వాడుకోవచ్చు.

ఈ ఆయింట్మెంట్ కు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం కూడా లభించడం గమనార్హం. ఈ ఆయింట్మెంట్ ను వినియోగించిన 30 సెకన్ల తరువాత వైరస్ కనిపించలేదని శాస్త్రవేత్తల ప్రయోగాల్లో తేలింది. డాక్టర్ బ్రియాన్ హ్యూబర్ వైరస్ ముక్కు ద్వారా సోకకుండా తప్పించుకునేందుకు ఆయింట్మెంట్ కచ్చితంగా ఉపయోగపడుతుందని…. ఈ ఆయింట్మెంట్ గొప్ప ఆవిష్కరణ అని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో ఈ ఆయింట్మెంట్ ముందువరసలో నిలుస్తుందని చెప్పారు.

ఈ ఆయింట్మెంట్ ను వినియోగించడం చాలా సులభం. ఆరోగ్య సిబ్బంది సహాయం అవసరం లేకుండానే దీనిని వినియోగించవచ్చు. ఇన్ ఫ్లూయెంజా వైరస్, కరోనా వైరస్ లపై ఆయింట్మెంట్ అద్భుతంగా పని చేస్తోంది. వైరస్ విస్తరించే శక్తిని సెకన్ల వ్యవధిలోనే ఆయింట్మెంట్ నిర్వీర్యం చేస్తోంది. ఆయింట్మెంట్ ను ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఫంగస్, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కోసం కూడా ఈ ఆయింట్మెంట్ ఉపయోగపడుతుంది.

అందుకే ఆ మూడు దేశాలలో అన్ని కేసులు?

Modi, Trump, bolsanaro

కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత పట్ల అమెరికా, బ్రెజిల్‌, భారత్ దేశాలు స్పందించిన తీరులో తేడాలు ఉండవచ్చు. కానీ ఫలితం మాత్రం ఒకే విధంగా ఉంది. వ్యాధి సోకిన పాజిటివ్‌ కేసులు ఈ మూడు దేశాల్లో మిలియన్ల సంఖ్యలో ఉన్నాయి. ఐదు మిలియన్ల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే, మూడు మిలియన్లకు పైగా కేసులతో బ్రెజిల్‌ రెండవ స్థానంలో, రెండు మిలియన్ల కు పైగా కేసులతో భారతదేశం మూడవ స్థానంలో ఉన్నాయి. అంటే ఈ దేశాల నాయకులు నిర్వర్తించాల్సిన బాధ్యత చాలా వుంది. అహంభావ ప్రదర్శనలో, బడాయి పోవడంలో, విమర్శను తిరస్కరించడంలో ట్రంప్‌, బోల్సనారో, మోడీలు సుప్రసిద్ధులు. పాక్షిక మత భక్తులను ఆకర్షించగలిగే, ద్వంద్వ వ్యక్తిత్వం గలవారిని రెచ్చగొట్టే సామర్థ్యం వీరికి వుంది. ఇంకా వీరు ప్రజాదరణ కోసం, తమ కథనాలను ముందుకు తీసుకెళ్ళేందుకోసం అబద్ధాలను సృష్టించి, దృష్టి మళ్ళించడం ద్వారా నిజాలను ధిక్కరించే వరుస ప్రదర్శనలు చేశారు.

Also Read : అదృష్టవంతులు.. రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు దొరికాయ్!

అంతకన్నా ముందు జరిగిందేమంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన బాధ్యతల పంపిణీలో సమతుల్యత, హేతుబద్ధత, సమన్వయాలు లోపించాయి. కేంద్ర ప్రభుత్వాలు నిపుణుల శాస్త్రీయమైన సలహాలను పరిగణన లోకి తీసుకోకుండా హేతుబద్ధత లేని, తరచుగా మార్చే నియమాలను, విధానాలను రూపొందించాయి. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వైరస్‌ను నిరోధించడంలోనే కాక…ప్రజారోగ్యానికి మద్దతు ఇవ్వడం, మహమ్మారి కారణంగా పడిపోయిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కూడా తమ వంతుగా చాలా భారాన్ని మోస్తూ వస్తున్నాయి. వాటి మధ్య సమన్వయానికి కేంద్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. పైనుండి సమర్థవంతమైన మార్గదర్శకాలు లేకపోవడం కన్నా కూడా, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తగినన్ని వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయబద్ధంగా చెల్లించవలసిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడానికి నిరాకరించిన భారతదేశంలో ఆర్థిక అసమతుల్యత ఎక్కువగానే ఉంది. ఇదే విధానం బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా మొత్తం ప్రజారోగ్యం పైన చేయాల్సిన ఖర్చును పెంచలేదు. ఒకవైపు ప్రభుత్వాలు దెబ్బ తిన్న కంపెనీలకు ఆర్థిక మద్దతు ఇవ్వజూపితే, ప్రయోజనాలు పొందింది మాత్రం పెద్ద కార్పొరేట్‌ సంస్థలు. మరోవైపు పేదలు మాత్రం ముఖ్యంగా భారత దేశంలో అత్యంత తక్కువ సహాయాన్ని పొందారు.

ప్రాణాలకు తెగించి ఆరోగ్య సేవలు అందించడం, ఆహార ధాన్యాలను సరఫరా చేయడం లాంటి సమాజ అవసరాలను తీర్చే కార్మికులు సైతం చాలా తక్కువ మద్దతు, రక్షణ పొందారు. అనేక మంది కార్మికులకు చాలినంత వేతనాలు, సరిపడా సంరక్షణ పరికరాలు, కనీసం మహమ్మారి వ్యాప్తి కాలంలోనైనా ఆరోగ్య బీమా సౌకర్యాలు సమకూర్చలేదు. అయినా ప్రమాదకరమైన ఈ వైఫల్యాలను చక్కదిద్దడానికి బదులుగా, ట్రంప్‌, బోల్సనారో, మోడీలు దష్టి మళ్ళించే చర్యలకు పాల్పడుతున్నారు. ట్రంప్‌ సమర్థవంతంగా ప్రతిస్పందించకుండా, చైనా తప్పుడు సమాచారం ఇస్తుందన్న నెపంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి విరమించుకుంటున్నట్లు, చైనాపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాడు. భారత దేశంలో మోడీ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా హిందూ జాతీయవాద ప్రేరేపిత చర్యలతో ముస్లింలను బలిపశువులను చేస్తోంది.

Also Read : అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలుస్తారా?

ఈ మూడు దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కంటే ముందు నుంచే, ఆధిపత్య సమూహాల భౌతిక దాడులను ప్రోత్సహించడం, సామాజిక విభజనను మరింతగా వేగవంతం చేయడం చూస్తున్నాం. బోల్సనారో కు జాత్యహంకారిగా, స్త్రీ ద్వేషిగా, మైనారిటీల హక్కులను బలహీన పరిచిన చరిత్ర ఉంది. శ్వేతజాతి ఆధిపత్యవాదాన్ని విస్తరించడం, నల్ల జాతికి జరుగుతున్న అన్యాయానికి, పోలీసుల అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న నిరసనల ఖండనలను ట్రంప్‌ విభజన చరిత్రకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ ముగ్గురు నాయకులు కూడా… భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని అణచడానికి వైరస్‌ మహమ్మారిని ఒక సాకుగా ఉపయోగించుకున్నారు.

శాంతియుతంగా నిరసన తెలిపే వారి నోరు మూయించడానికి కేంద్ర బలగాలను (తరచుగా మామూలు దుస్తుల్లో) ఉపయోగించినందుకు ట్రంప్‌ చర్యలను ప్రజలు బహిరంగంగానే నిరసించారు. కానీ భారతదేశంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. శాంతియుతంగా నిరసనలలో పాల్గొన్న ప్రజలను నిర్భందిస్తున్నారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న భారతదేశం లోని జైళ్ళు ఇప్పుడు అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో నిండి వున్నాయి.

అనాగరిక బలప్రయోగం కోవిడ్‌ వైరస్‌ ను నిలువరించలేదు. అదేవిధంగా మోసం, తారుమారు చేసే విధానం, బెదిరింపులు కూడా వైరస్‌ ను అడ్డుకోలేవు. ప్రజల భాగస్వామ్యం, సహకారం, సామాజిక సంఘీభావం మాత్రమే కోవిడ్‌-19 ను ఓడించే ఏకైక మార్గమని ఇతర దేశాలు మనకు రుజువు చేసి చూపాయి. కోవిడ్‌-19 వలన నష్టపోయిన ప్రపంచంలోని పెద్ద దేశాలు ఒక భిన్నమైన మార్గాన్ని అనుసరించడం వల్ల ఎలాంటి ప్రమాదం వుండదు.

Also Read : కరోనా వ్యాక్సిన్ కి ఫిక్సయిన రేట్?

మీడియా సంస్థల మధ్య ముదురుతున్న వార్!

Tv5 and Ntv

అప్పుడెప్పుడో సాక్షి, ఈనాడుల మధ్య మీడియా వార్ జరిగింది. సాక్షి టీవీ, రామోజీరావుపై వరస కథనాలను ప్రసారం చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి వివాదాలు ఛానల్స్ యాజమాన్యాల మధ్య రాలేదు. తాజాగా టీవీ 5, ఎన్టీవీ ల మధ్య వార్ బాగా ముదురుతోంది. రాజకీయ పార్టీ పక్షాన నిలబడే ఈ మీడియా సంస్థలు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. టీవీ 5 అధినేత నాయుడు అవినీతిపై వరస కథనాలను ప్రసారం చేస్తున్నామంటూ ఎన్టీవీ ఇప్పుడు ప్రోమోలను విడుదల చేసింది. టీవీ 5 యాజమాన్యం రియల్ దందాలతో పాటు దాని యాజమాన్యం తయారు చేసే మోకాలినొప్పుల బామ్ లలో కూడా అవినీతి, బోగస్ అంటూ ఎన్టీవీ కథనాలను ప్రసారం చేస్తున్నట్లు ప్రోమో విడుదల చేసింది. ఒక నాయుడు వంద లీలల పేరుతో వరస కథనాలను ప్రసారం చేయడానికి రెడీ అయింది.

Also Read : వారంతా అయిపోయారు ఇప్పుడు వీళ్ళొచ్చారు..! ఎవరి తలరాత మార్చడానికి?

నిజానికి టీవీ5, ఎన్టీవీ యజమానులిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఇద్దరికి ఎటువంటి విభేదాలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే సరికి ఎన్టీవీ కొంత ప్రోగా ప్రభుత్వంవైపు ఉందన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో టీవీ 5 ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం వరస కథనాలను వండి వారస్తుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో టీవీ 5 యాజమాన్యం టీడీపీ స్టాండ్ తీసుకుంది.

టీవీ 5 యాజమాన్యంపై ఏపీ ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది. హైకోర్టు నుంచి యాజమాన్యానికి ఊరట లభించింది. అయితే రెండు ఛానల్స్ యాజమాన్యాల మధ్య ప్రభుత్వ వైఖరే వివాదాలకు కారణమని చెబుతున్నారు. గతంలో సాక్షి టీవీ రామోజీరావుపై వరస కథనాలను ప్రసారం చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి వివాదాలు ఛానల్స్ యాజమాన్యాల మధ్య రాలేదు. ఎన్టీవీ లో వస్తున్న ప్రోమోలను చూస్తుంటే టీవీ 5 యాజమాన్యాన్ని గట్టిగానే ఎటాక్ చేసేటట్లే కనపడుతుంది. మరి ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Also Read : నారా లోకేష్.. గెలుపు పొందేవరకు అలుపు లేదట!

శ్రీశైలంలో ప్రమాదం.. సాగర్ లో అలజడి!

 

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పవర్ ప్యానెల్‌ లో చెలరేగిన మంటలతో ఈ పెను విపత్తు సంభవించింది. ఫలితంగా 900 మెగావాట్లల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ పవర్ ప్లాంట్ మొత్తం దగ్ధమైపోయింది. శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలవిద్యుత్తు కేంద్రం భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే రెండుసార్లు ఇక్కడ షార్ట్‌ సర్క్యూట్‌ కాగా, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

Also Read : సెటైర్ : దెబ్బకు హరీష్ రావు పాలు అమ్ముతున్నాడు… కేటీఆర్ ఆ మజాకా?

శ్రీశైలం తరహా ప్రమాదమే నాగార్జునసాగర్‌ కేంద్రంలో జరిగితే ఆస్తి నష్టం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017 ఫిబ్రవరిలో, 2018 ఫిబ్రవరిలో షార్ట్‌ సర్క్యూట్‌ తో టర్బైన్‌ కాలిపోయింది. 2014 ఓ టర్బైన్‌ పూర్తిగా కాలిపోయింది. సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది.

ఈ ప్లాంట్‌ లో ప్రతి షిఫ్టులో డీఈ, ఏడీఈ, నలుగురు ఏఈలు, మరో నలుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అనుకోని ప్రమాదం సంభవిస్తే.. ఉద్యోగులు తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ గేట్లను ఏర్పాటు చేయాలి. అంబులెన్స్‌ ఉండాలి. ఇవేమీ లేకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు ప్రాధేయపడుతున్నారు.

Also Read : తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పటినుండో?