Home Blog Page 8336

కారుకు నిప్పు..కార్పొరేటర్ పై దాడికి యత్నం.. అసలేం జరిగింది?

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కార్పొరేటర్  కారుకు ఆందోళనకారులు నిప్పంటించారు. కార్పొరేటర్ పై దాడికి యత్నించడం సంచలనంగా మారింది. ఈ సంఘటనలో కార్పొరేటర్ కారు పూర్తిగా ధ్వంసం కాగా.. ప్రాణనష్టం జరుగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

ఖమ్మం జిల్లా కేంద్రంలోని కైకొండాయగూడెంకు చెందిన తేజ్ అనే యువకుడు ఈనెల 18న అనుమానాస్పదంగా మృతిచెందాడు. తేజ్ మృతికి ఖమ్మం ఒకటో డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమంటూ గతంలోనే బంధువులు ఆరోపించారు. అయితే మంగళవారం సదరు కార్పొరేటర్ కైకొండాయగూడెం వస్తున్నట్లు తెలుసుకున్న తేజ్ బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ అటువైపు రాగానే వాహనాన్ని ఆపి దాడికి యత్నించడంతో ఆయన పక్కనే స్కూల్లోకి వెళ్లి దాక్కున్నాడు.

ఆందోళనకారులను నుంచి తనను రక్షించాలని రామ్మూర్తి నాయక్ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులకు అక్కడి చేరుకొని రాంమ్మూర్తిని వారి నుంచి విడిపిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామ్మూర్తిని పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ఆందోళనకారులు అడ్డుకొని అతడి కారుకు నిప్పంటించారు. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు వెంటనే తెరుకొని ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

ఏపీ లో ‘ఉచిత విద్యుత్తు’ పథకానికి బై బై?

ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ‘ఉచిత విద్యుత్’ పథకానికి కాలం చెల్లిపోయింది. అది కూడా ప్రతిపక్షం టిడిపి వారి పాలనలో కాకుండా అతని తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలా జరగడం గమనార్హం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రైతులకు చేదోడువాదోడుగా ఉండాలన్నది వైఎస్ కల. అయితే అతని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని కొనసాగించాయి.

Also Read : సిల్వర్ జూబ్లీ వేడుకలా.. సిగ్గుచేటు బాబూ!

దేశంలో చాలా రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకొని రాగా ఇది ‘ఓటు బ్యాంకు రాజకీయం’ అని చాలా మంది విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీనికి మంగళం పాడేస్తూ ‘నగదు బదిలీ’ పథకాన్ని తెరమీదకు తెచ్చింది. విద్యుత్ రంగంలో సంస్కరణల దిశగా కేంద్రం రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ సూచనల పై కొన్ని రాష్ట్రాలు అభ్యంతారలని వ్యక్తం చేశాయి.

కేంద్రం చెప్పిన దానికి అనుగుణంగా జగన్ సర్కారు ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేసి ఆస్థానంలో నగదు బదిలీ పథకాన్ని తీసుకొని వచ్చింది. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం వారు వాడిన విద్యుత్తుని గుర్తించి దానికి సరిపడా సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని…. రైతులు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆ చెల్లించాలని పేర్కొంటూ జీవోని విడుదల చేసింది. దీనిలో భాగంగా కొత్త మీటర్లు బిగించేందుకు అయ్యే ఖర్చు కూడా సబ్సిడీ రూపంలో రైతుల ఖాతాల్లోకి వేస్తారట.

గ్రౌండ్ లెవల్ లో రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కోసం వెంటనే స్పందించే యంత్రాంగం కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ప్రభుత్వాలు మారితే రాజధానులే మారిపోతున్నాయి… అలాంటిది ఉచిత విద్యుత్తు, నగదు బదిలీ పథకాల్లో మార్పులు రాకుండా ఉంటాయా? విద్యుత్ పంపిణీ సంస్థలు వేస్తున్న బిల్లులు ఏ రేమ్జ్ లో ఉన్నాయో…. వారి జిమ్మిక్కులు ఎలాంటివో ఈ మధ్య మనం గమనిస్తూనే ఉన్నాం.

రైతుల్లో ఎంత మంది నిరక్షరాస్యులు. ఇలాంటి సమయంలో ఉచిత విద్యుత్ తొలగించి నగదు బదిలీ చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి అని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. ఇక రాజకీయ పరిశీలకులు మాత్రం దీని వల్ల రైతులకు ఏమాత్రం న్యాయం జరగదని అభిప్రాయపడుతున్నారు. దీని లోపల ఎన్ని నొసుగులు ఉన్నాయో.. ఎన్ని పరిమితులు ఉన్నాయో…. ఇంత బిల్లు వరకే ప్రభుత్వం ఉచితంగా కరెంటుని ఇస్తుందన్న షరతులు ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read : యువతను టార్గెట్‌ చేసిన జగన్‌

139మంది రేప్ కేసు: డాలర్‌ భాయ్ వ్యవహారంలో మరో ట్విస్ట్?

139మంది రేప్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. రోజుకో ట్వీస్టు వెలుగుచూస్తుండటంతో ఈ కేసు వివరాలను తెలుసుకునే ప్రజలంతా ఆసక్తి చూపుతున్నారు. 139మంది తనను అత్యాచారం చేశారని తొలి నుంచి బాధితులు ఆరోపిస్తూ వస్తోన్న బాధితురాలు సడన్ గా మాటమార్చడం వెనుక అంతర్యం ఏంటనే చర్చ జరుగుతోంది. ఇటీవల మీడియా ముందుకొచ్చిన బాధితులు తనను 139మంది రేప్ చేయలేదని చెప్పి అందరికీ షాక్ కు గురిచేసింది.

డాలర్ బాయ్ తనను బెదిరించడంతోనే సెలబ్రెటీలైన యాంకర్ ప్రదీప్, సినీనటుడు కృష్ణుడి పేర్లను చెప్పినట్లు వెల్లడింది. ఇక 139మందిలోనూ 40శాతం మంది అమాయకులే ఉన్నారని.. తన వల్ల వారంతా ఇబ్బందులు పడ్డారని చెప్పింది. వారికి తాను క్షమాపణ చెబుతున్నా అంటూ మీడియా ముఖంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాలర్ బాయ్ మరో పోలీసులకు మరో ట్వీస్ట్ ఇచ్చాడు.

కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని డాలర్ భాయ్ మరో డ్రామాకు తెరతీయడం ఆసక్తికరంగా మారింది. వారి నుంచి తాను తప్పించుకొని తిరుగుతున్నానని సెల్ఫీ వీడియో తీసి మీడియా ఛానళ్లకు పంపాడు. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని ఏసీపీ కాల్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా బాధిత యువతీ తనకు మ్యాట్రిమోనిలో పరిచమైందని.. తన కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా పని చేసిందని చెప్పాడు.

ఇక తన సర్టిఫికెట్లను ఎవరూ తీసుకెళ్లలేదని.. అందర్ని నమ్మించడానికే ఆమె సర్టిఫికెట్లు రజనీచౌదరికి ఇచ్చినట్లు వీడియో తెలిసినట్లు పేర్కొన్నాడు. ఇక తనను పోలీసులు బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని డాలర్ బాయ్ చెప్పాడు. కాగా బాధితురాలు వ్యభిచారం చేసేదంటూ ఆరోపించాడు. తనకు ప్రాణభయం ఉందని పోలీసులు తనను రక్షించాలని వేడుకున్నాడు. దీంతో ఈ కేసు విషయంలో పోలీసులు ఎలా ముందుకెళుతారనేది ఆసక్తికరంగా మారింది.

కుమారుడి సక్సెస్ కోసం హీరోగారి కష్టాలు !


‘గీత గోవిందం’ సినిమా ఇద్దరు జీవితాలను పూర్తిగా మార్చేసింది. వారే డైరెక్టర్ పరుశురామ్, హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా హిట్ అయ్యాక పరుశురామ్ కి మొట్టమొదటిగా సినిమా ఆఫర్ ఇచ్చింది అక్కినేని నాగార్జున. అఖిల్ కోసం కథ రెడీ చేయమని అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. పరుశురామ్ కూడా అఖిల్ కోసం స్క్రిప్ట్ పనుల్లో దాదాపు నాలుగు నెలలు గడిపాడు. ఇక త్వరలోనే అఖిల్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి ముహూర్తం పెట్టుకునే లోపు.. పరుశురామ్ కి, మహేష్ నుండి సినిమా ఆఫర్ వచ్చింది. కథ ఉంటే చెప్పమని కాకుండా.. మనం సినిమా చేస్తున్నాం, అయితే కథ పై పూర్తిగా సంతృప్తి వచ్చాకే షూట్ పెట్టుకుందాం అని మహేష్ అభయం ఇవ్వడంతో.. పరుశురామ్ అఖిల్ సినిమా స్క్రిప్ట్ ఆపేసి.. మహేష్ కోసం సర్కారు వారి పాట కథ రాసి మొత్తానికి సినిమాని సెట్ చేసుకున్నాడు.

Also Read: మున్నాళ్ల ముచ్చటగా మన తారల పెళ్లిళ్లు..!

కానీ, అఖిల్ సినిమా కాదనలేక, మహేష్ సినిమా తరువాత అఖిల్ తోనే సినిమా చేస్తానని మాట ఇవ్వడంతో, నాగార్జున కూడా ఓకే చెప్పాడు. మహేష్ సినిమా కూడా సూపర్ హిట్ అయితే, ఆ తరువాత పరుశురామ్ అఖిల్ తో సినిమా చేస్తే.. అఖిల్ మార్కెట్ రేంజ్ పెరుగుతుందనేది నాగ్ ప్లాన్. అందుకే ఈ లాక్ డౌన్ లో నాగార్జున, అఖిల్ సినిమా కథ మీద కూర్చోమని పరుశురామ్ పై ఒత్తిడి తెచ్చాడట. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో కలిసి ఒక కథను రెడీ చేసి.. నాగ్ కి వినిపించాడు పరుశురామ్. కథ నచ్చడంతో ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఏమైనా అఖిల్ సక్సెస్ కోసం నాగ్ బాగానే కష్టపడుతున్నాడు. కానీ, అఖిల్ కి మాత్రం సక్సెస్ రావడం లేదు.

Also Read: బాధను అణిచిపెట్టి వివరణ ఇచ్చాడు !

అఖిల్ లాస్ట్ సినిమా ‘మిస్టర్ మజ్ను’ కూడా అఖిల్ కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయే సరికి ఏ సినిమా చేయాలో.. ఎలాంటి కథతో సినిమా చేయాలో మొత్తానికి జడ్జ్ మెంట్ కోల్పోయాడు అఖిల్. దాంతో తన తరువాత సినిమాల పై నాగార్జున మరింత జాగ్రత్త పడేలా అఖిల్ రిక్వెస్ట్ చేశాడని.. అందుకే, నాగ్ కూడా చైతు సినిమాలు కంటే కూడా.. ఎక్కువగా అఖిల్ సినిమాల పైనే దృష్టి పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక నెగిటివ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సాధారణమై పోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కార్తీక్ రాజు దర్శకత్వంలో ‘ది ఛేజ్’

సందీప్ కిషన్ హీరోగా ‘‘నిను వీడను నీడను నేనే’’, లాంటి థ్రిల్లర్ మూవీ తీసి ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ ప్రస్తుతం రెజీనా తో ‘‘నేనే నా’’ అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ కాకుండా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు డైరెక్టర్ కార్తీక్ రాజు.. తమిళ్ లో హిట్టైన ‘‘ప్యార్ ప్రేమ కాదల్’’మూవీ ఫేం ‘‘రైజా విల్సన్’’ మెయిన్ లీడ్ గా ‘‘ది చేజ్’’ అనే తెలుగు,తమిళ బైలింగ్వల్ మూవీని రూపొందిస్తున్నారు.

Also Read: బాధను అణిచిపెట్టి వివరణ ఇచ్చాడు !

ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ:

మా టీమ్ అంతా కలిసి ఈ లాక్ డౌన్ లో ఏదైనా క్రియేటివ్ గా ప్లాన్ చేయాలనుకొని ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాం. ప్రభుత్వ ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూనే తక్కువ మందితో షూట్ చేసాం.ఈ సినిమాకోసం ఓ పెద్ద ఫారెస్ట్ లోని హిల్ స్టేషన్ లో షూట్ చేశాం.సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

నేను రెజీనా తో చేస్తున్న ‘‘నేనే నా’’ మూవీ నిర్మిస్తున్న యాపిల్ ట్రీ స్టూడియో బ్యానర్ మీద రాజశేఖర్ వర్మ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.

Also Read: మున్నాళ్ల ముచ్చటగా మన తారల పెళ్లిళ్లు..!

ఇది ఓ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ.ఓ తల్లీ,కూతురు ఇంకో టీనేజర్ మధ్య సాగే కథ. చాలా ట్విస్టులతో ఆద్యాంతం ఉత్కంఠ గా సాగుతుంది. రంగస్థలం ఫేం అనసూయ ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం విశేషం.కార్తీ నటించిన ‘‘ఖైదీ’’ మూవీలో హీరో కూతురి గా నటించిన మోనిక కూడా ఇందులో కనిపిస్తుంది. అంతే కాకుండా ఇతర పాత్రల్లో సత్యం రాజేష్, హరీష్ ఉత్తమన్,మధనందన్ నటిస్తున్నారు.

సినిమాటోగ్రాఫర్ వేల్ రాజ్ ,యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్,మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సి.ఎస్,ఎడిటర్ సాబు జోసెఫ్ చక్కటి సహకారాన్ని అందించారు.

చేతులెత్తేసిన తెలంగాణ హై కోర్టు..! అక్కడికి వెళ్ళమని కేసీఆర్ కి సలహా

ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకీ ముదిరి పెద్దదవుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేము అని చెప్పిన హైకోర్టు ఈ విషయంపై సుప్రీంకోర్టుని సంప్రదించవలసినదిగా కోరారు. జగన్…. కేసీఆర్ ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోవడం తో చివరికి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ లోపల ఈ వివాదంలో పైచేయి సాధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు వారు ఈ విధంగా చెప్పారు.

తమ నిర్ణయానికి ఊతంగా గతంలో జరిగిన ఒక పరిణామాన్ని గుర్తుచేస్తూ పంజాబ్ కి చెందిన నదీ జలాన్ని రాజస్థాన్ కు సుప్రీం కోర్టు జోక్యం ద్వారా మళ్ళించారని తెలిపారు. ఇకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఏపీలో నిర్మాణం జరిగితే దక్షిణ తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోతుందన్నది తెలంగాణ ప్రభుత్వం వాదన. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం వారికి కృష్ణ నది నుండి న్యాయబద్ధంగా రావాల్సిన నీటినే తాము ఈ ప్రాజెక్ట్ ద్వారా తీసుకుంటున్నామని చెబుతున్నారు.

తెలంగాణ వారేమో ఆంధ్రప్రదేశ్ 40వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తీసుకుంటుందని…. ఇది తమకు అన్యాయం చేసినట్లేనని వాదిస్తుంటే…. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇదేమీ కొత్త పథకం కాదని… పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుండి ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించకుండా తమ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈ నీటిని తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయమై కృష్ణ నదీ జలాల బోర్డు వారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్రం కి చెందిన అపెక్స్ కౌన్సిల్ మధ్యర్తిత్వానికి పూనుకున్నా…. అన్నీ విఫలయత్నాలే అయ్యాయి. చివరికి సుప్రీంకోర్టు చొరవతో అయినా ఈ విషయం కొలిక్కి వస్తుందేమో చూడాలి.

మోడీ ఇలా చేస్తావా? కేసీఆర్ ఘాటు స్పందన

ప్రధాని మోడీపై కేసీఆర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీరియస్ గా ఇదేంటి మోడీజీ అని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విషయంలో కోతలు పెడుతున్న తీరు చూసి కేసీఆర్ ఘాటుగా స్పందించారు.

ఇప్పటివరకు జీఎస్టీ పరిహారంపై కేరళ సీఎం విజయన్ మాత్రమే సీరియస్ అయ్యారు. కేరళ ముఖ్యమంత్రి అయినా కాస్త గట్టిగానే మోడీని నిలదీశాడు. కమ్యూనిస్టు కాబట్టి ఆ మాత్రం ధైర్యం చూపారు. కానీ మన తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఏం అలిగేషన్స్ ఉన్నాయో కానీ ఇద్దరూ యాంటిమెంట్ పూసినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చెలరేగాయి.

దీంతో ఎట్టకేలకు కేసీఆర్ సార్ బయటపడ్డాడు. జీఎస్టీ పరిహారం చెల్లింపులో అన్యాయంపై ప్రధాని మోడీకి కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. చట్ట ప్రకారం రెండు నెలలకోసారి బకాయిలు చెల్లించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో ఏప్రిల్ లో రాష్ట్ర ఆదాయం 83శాతం పడిపోయిందని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఆదాయం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వేతనాలు, ఖర్చులు అప్పులపై ఆధారపడాల్సి వస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రాలు అప్పులు తీసుకోమనడంపై కేసీఆర్ కరెక్ట్ కాదన్నారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు కేంద్రం అదనంగా సాయం చేయాల్సింది పోయి కోత పెడుతారని అని లేఖలో కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం వృద్ధిలోకి వస్తుందని హితవు పలికారు.కేంద్రానికి ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

ఈ క్రమంలోనే తెలంగాణ సహా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో కేరళ సీఎం తర్వాత మోడీని ప్రశ్నిస్తూ జీఎస్టీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త ఘాటుగానే స్పందించాడు.

రాజమౌళి ప్లాస్మాను ఎందుకు దానం చేయలేదంటే?


దర్శక దిగ్గజం ఎస్ఎస్.రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితోపాటు వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే. వీరంతా వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించి కరోనాను జయించారు. వీరంతా కూడా ప్లాస్మాను దానం చేసి కరోనా వారియర్స్ గా నిలుస్తామని గతంలోనే ప్రకటించారు. చెప్పినట్లుగానే వీరంతా నేడు ప్లాస్మా దానం చేసినట్లు రాజమౌళి తన ట్వీటర్లో ట్వీట్ చేశాడు.

రాజమౌళి తనయుడు కాలభైరవ, సంగీత దర్శకుడు కిరవాణి నేడు కిమ్స్ ఆస్పత్రిలో ప్లాస్మా దానం చేసినట్లు రాజమౌళి పేర్కొన్నారు. అయితే తాను ప్లాస్మా దానం చేయలేక పోయినట్లు ఆయన తెలిపాడు. వైద్యులు తనకు యాంటీ బాడీస్ కోసం టెస్టు చేయగా ఐజీజీ లెవల్స్ 8.62శాతంగా ఉన్నాయని తేలిందట. వీటి లెవల్స్ 15గా ఉండాలని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతానికి తన పెద్దన్నయ్య, బైరవ మాత్రమే ప్లాస్మాను దానం చేశారని చెప్పుకొచ్చారు. తనలో ఐజీజీ లెవల్స్ పెరిగితే మరోసారి ప్లాస్మాదానం చేసేందుకు తానేప్పుడు రెడీ అని రాజమౌళి చెప్పారు.

ప్రస్తుతం రాజమౌళి మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం షూటింగులకు అనుమతి లభించడంతో కరోనా నిబంధనలు పాటిస్తూనే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాల్లోనే షూటింగు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడ్డాక ఔట్ డోర్ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో రాంచరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఓలివియా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, సీనియర్ నటి శ్రియ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమా కరోనా కారణంగా మరోసారి వాయిదా పడే అవకాశం కన్పిస్తుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ తేదిని ప్రకటించేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది.

మధ్య తరగతి ప్రజలకు శుభవార్త..! ఈఎంఐలపై కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో విజృంభిస్తున్న కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్ర ప్రభావం చూపింది. కోట్ల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోగా వ్యాపారాలు చేసేవాళ్లు లాక్ డౌన్ వల్ల నష్టాలను చవిచూశారు. దీంతో కేంద్రం, ఆర్బీఐ మార్చి నెల నుంచి ఆగష్టు చివరి వారం వరకు లోన్లపై మారటోరియం విధించింది. అయితే నిన్నటితో మారటోరియం గడువు ముగియడంతో ప్రజలు తిరిగి లోన్లు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

ఉపాధి, ఉద్యోగవకాశాలను కోల్పోయిన వాళ్లు ప్రస్తుత పరిస్థితుల్లో లోన్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఆచరణ సాధ్యం కాదు. ఈరోజు సుప్రీం కోర్టులో లోన్ మారటోరియం అంశానికి సంబంధించి విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా కేంద్రం రెండు సంవత్సరాల వరకు లోన్ మారటోరియం ఫెసిలిటీని పొడిగించవచ్చని సుప్రీం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కేంద్రం రెండేళ్ల మారటోరియం గురించి కసరత్తు చేపడుతోంది.

అయితే కేంద్రం రెండేళ్ల వరకు మారటోరియం పొడిగించే అవకాశం ఉందని చెప్పినా ఆ అంశం పూర్తిగా ఆర్బీఐ పరిధిలోనిదని పేర్కొంది. ఆర్బీఐ, బ్యాంకులు కలిసి మారటోరియం పొడిగింపు గురించి నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. అయితే బ్యాంకులు మాత్రం ఇప్పటికే మారటోరియం వల్ల నష్టపోయాని… మరోసారి మారటోరియంను పొడిగించకపోతేనే మంచిదని చెబుతుండటం గమనార్హం. మరోవైపు ఈఎంఐలపై వడ్డీ మినహాయింపు అంశం గురించి రేపు కోర్టులో విచారణ జరగనుండగా విచారణ అనంతరం సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది.

జనసేన-బీజేపీ పొత్తు.. ఏకాభిప్రాయం అవసరం!

2014 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చాయి. అయితే ఐదేళ్లలోనే ఆ పొత్తు వికటించి ఎవరీదారి వారు చూసుకున్నారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా పోటీచేయగా జనసేన కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం వీయడంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక టీడీపీకి కేవలం 23 సీట్లురాగా జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ఒక్క సీటు కూడా రాకపోవడం గమనార్హం.

ఇక విచిత్రం ఏమిటంటే ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ పొత్తు పొడిచినట్లు తెలుస్తోంది. ఏపీలో ఒక్క సీటు లేని బీజేపీతో ఒక్క సీటు ఉన్న జనసేన పార్టీ 2024లో అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచి కలలు కంటున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచనప్పటికీ ప్రజా సమస్యల విషయంలో వేర్వురు ప్రకటనలు చేస్తున్నారు. ప్రధానంగా ఏపీకి అతి ముఖ్యమైన రాజధాని విషయంలో బీజేపీ, జనసేన పార్టీలో విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల వరకు కలిసి ఉంటాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీకి ఒకటే రాజధాని ఉండాలని.. అది అమరావతేననే స్పష్టం చేస్తున్నారు. అమరావతి ప్రజల పక్షాన పోరాడుతానంటూ చెబుతున్నారు. అమరావతి రాజధాని జనసేన కట్టుబడి ఉందని ఎన్నోసార్లు స్పష్టం చేశాడు. అయితే బీజేపీ మాత్రం మూడు రాజధానులే కాదు.. జిల్లాకో రాజధాని పెట్టుకున్న తామకేమీ అభ్యంతరం లేదని చెబుతోంది. దీంతో ఈ రెండు పార్టీలు కేవలం ఓట్లు, రాజకీయ కోసమే పొత్తు పెట్టుకున్నాయా? లేక ప్రజా సమస్యలను పరిష్కరించుకుందుకు పొత్తు పెట్టుకున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తున్నారు.

జనసేన-బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పుడు ఒకే అభిప్రాయంతో ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరూ వారు సొంత ఏజెండాతో ముందుకెళితే ప్రజలు ఎవరినీ నమ్మి ఓట్లు వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇరుపార్టీలు వేర్వేరు అభిప్రాయాలతో ప్రజలు ముందుకెళితే ప్రజల నుంచి విమర్శలు రావడం ఖాయంగా కన్పిస్తోంది. అయినప్పటికీ ఇరుపార్టీలు వేర్వురు ప్రకటనలు చేయడం ప్రజలను మోసగించడం కోసమేనా? అన్న వాదనలు ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నారు.

మరికొందరు మాత్రం ఈ రెండు పార్టీల పొత్తు 2024 వరకు కొనసాగే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. అందువల్లే ఈ రెండు పార్టీలు విభిన్న అభిప్రాయాలతో ప్రజల ముందుకెళుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. ఇక 2024 ఎన్నికలే టార్గెట్ పెట్టుకొని ముందుకెళుతున్న బీజేపీ-జనసేన కూటమి పొత్తు విషయంలో మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసి నడువాలని అని అనుకున్నప్పుడు ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటూనే మంచి ఫలితాలు వస్తాయని లేనట్లయితే ప్రజల చేతిలో ఓటమి చవిచూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ మీడియా రంగంలోకి రవిప్రకాష్?

0

ఎరక్కపోయి ఏడాది కిందట ఇరుక్కున్నాడు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్. మీడియా చేతిలో ఉంది కదా అని అప్పటిదాకా ప్రభుత్వాలనే శాసించిన రవిప్రకాష్ అనవసరంగా సీఎం కేసీఆర్ తో పెట్టుకొని తన పతనాన్ని తానే రాసుకున్నాడనే చర్చ మీడియా సర్కిల్స్ లో సాగుతుంటుంది. తెలంగాణ ప్రభుత్వం గద్దెనెక్కగానే ఎమ్మెల్యేల ప్రమాణంపై వ్యంగ్యాస్త్రాలు వేసినందుకు ఏబీఎన్ తోపాటు టీవీ9ను నిషేధించారు కేసీఆర్. ఆ పగను మనసులో పెట్టుకొని ఎన్నడూ స్క్రీన్ మీదకు రాని టీవీ9 రవిప్రకాష్ నాడు తెలంగాణలో బయటపడ్డ ఇంటర్ పరీక్షల లీకేజీపై పెద్ద దుమారం రేపాడు. నాడు విద్యార్థుల తల్లిదండ్రులను హైలెట్ చేసి రచ్చచేయడం గులాబీ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైందట.. దీంతో సీఎం కేసీఆర్ కు టార్గెట్ గా మారాడని.. ఆయన ఆడిన ఆటలో టీవీ9 రవిప్రకాష్ అరటిపండుగా మారాడని జర్నలిస్ట్ సర్కిల్స్ లో చెబుతుంటారు.

రవిప్రకాశ్.. టీవీ9 కేంద్రంగా బ్రేకింగ్‌ న్యూస్‌.. బిగ్‌ న్యూస్‌లకు ప్రాధాన్యమిచ్చిన ఆయన.. ఇప్పుడు ఆయనే న్యూస్‌ అవుతున్నాడు. ఇప్పటికే ప్రభుత్వాలకు టార్గెట్‌ అయిన ఆయన.. మరో ప్రయోగానికి తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. హ్యాష్ట్యాగ్‌ యూ (HashtagU) పేరుతో న్యూస్‌ చానల్‌ ప్రారంభిస్తున్నట్లుగా ప్రచారం. గతంలో రవిప్రకాశ్‌తో కలిసి పనిచేసిన వారిని.. ఆయన అనుయాయులను కూడా టీవీ9 యాజమాన్యం ఒక్కొక్కరిని పక్కన పెట్టేయగా.. ఆ టీంలో పనిచేసిన వారంతా ఇప్పుడు హాష్‌ ట్యాగ్‌ యూని  ట్రెండింగ్‌ చేసే పనిలో ఉన్నారు.

టీవీ9 నుంచి బయటికి పంపించినప్పటి నుంచి ఏదో ఒక మీడియా హౌజ్‌ నుంచి రీ ఎంట్రీ కోసం రవిప్రకాశ్‌ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ.. పరిస్థితులు ఆయనకు కలిసిరావడం లేదు. ఈ క్రమంలోనే హ్యాష్ట్యాగ్‌ యూ పేరుతో కొత్త చానల్‌ ప్రారంభిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా అందులో వాస్తవం లేదనేది తెలుస్తోంది. ఎందుకంటే హ్యాష్ ట్యాగ్‌ యూ అనేది దినేష్ ఆకుల ప్రారంభిస్తున్న యాప్‌ అని సమాచారం. ఇటీవల న్యూస్‌ యాప్‌లకు మంచి ఆదరణ వస్తుండడంతో మీడియాలో మంచి అనుభవం ఉన్న దినేష్ దీని మీద దృష్టి పెట్టారు. ఈ దినేష్‌ గతంలో రవి ప్రకాశ్ టీంలోనే పనిచేశాడు. అంతకుముందు హిందీ మీడియాలో సుదీర్ఘ అనుభవం ఉంది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దినేష్‌ ఆకులకు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు ఉన్నా.. అనూహ్యంగా తెలుగు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ముందుగా టీవీ9, తర్వాత టీవీ5లో పనిచేశారు. టీవీ9 కన్నడ చానల్‌ ప్రారంభించాక ఆ వ్యవహారాలన్నీ ఆయనే చూశారు. కొద్ది కాలానికే ఆయన టీవీ5ని కూడా వీడారు. ప్రస్తుతం ఢిల్లీలో ఓ సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ హ్యాష్‌ ట్యాగ్‌ యూ పేరుతో తెరమీదకు వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. దీనికి వెనకాల నుంచి రవిప్రకాశ్ సపోర్ట్‌ ఏమైనా ఉందా అని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అనుష్క ‘నిశ్శబ్దం’కు గిట్టుబాటు ధర !


స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ‘నిశ్శబ్దం’ సినిమా మొత్తానికి రిలీజ్ కి సిద్ధం అయింది. నాని ‘వి’తో డిజిటల్ లో సినిమాల విడుదల పరంపర మొదలైంది. ఈ క్రమంలోనే “నిశ్శబ్దం” కూడా ఓటీటీలో వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని.. ఈ సినిమాకి సుమారు 45 కోట్లు రూపాయిల భారీ మొత్తం అందిందని తెలుస్తోంది. ఇక ముందు నుంచి ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని, రచయిత కోన వెంకట్ ఆ మధ్య హింట్ కూడా ఇచ్చాడు. కాకపోతే నిర్మాత కోన వెంకట్ కు, ఓ ఛానల్ కు మధ్య సాగిన ఆర్ధిక లావాదేవీల గందరగోళంలో కొన్ని తేడాలు వచ్చి.. ‘నిశ్శబ్దం’ విడుదల నిశ్శబ్దంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకుఇప్పటికీ రిలీజ్ రెడీ అయింది.

Also Read: టాలీవుడ్ అగ్ర నిర్మాతల పీఠాలు కదులుతున్నాయా?

కాగా ఈ సినిమా ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ అట. సినిమాలో మర్డర్ చేసింది ఎవరనే కోణంలో ప్లే సాగుతూ మంచి ఎమోషనల్ కంటెంట్ తో కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండేలా దర్శకుడు చాలా కష్టపడ్డాడట. యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో మంచి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు అనుష్క, మాధవన్ ల మధ్య నడిచే సస్పెన్స్ ట్రాక్ కూడా చాలా బాగా వచ్చిందని అందుకే అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకి భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని తెలుస్తోంది. అలాగే సినిమాలో మొత్తం క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ అండ్ హారర్ ఎఫెక్ట్స్ ను చాలా బాగా ఎస్టాబ్లిష్మెంట్స్ అయ్యాయట.

Also Read: మున్నాళ్ల ముచ్చటగా మన తారల పెళ్లిళ్లు..!

అనట్టు ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించడంతో ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచింది. పైగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని… ముఖ్యంగా సినిమాలో అనుష్కది నెగిటివ్ క్యారెక్టర్ అని, అయితే చివర్లో పాజిటివ్ గా మారుతుందని.. ఇదే సినిమాలో బిగ్గెస్ట్ ట్విస్ట్ అని తెలుస్తోంది. మరి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. ఏమైనా ఈ సినిమా కోసం నెటిజన్లు కామెంట్స్ పెడుతూ వచ్చినందుకు మేకర్స్ అనుష్క ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పారు.

జగన్ పాలనపై కాపులు సంతృప్తితో ఉన్నారా?

కుల రాజకీయాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందనేది అందరికీ తెల్సిందే.. కుల ప్రాతిపదికగానే అక్కడి ఓటర్లు.. నాయకులను ఎన్నుకుంటారనడంలో అతిశయోక్తి కాదేమో.. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఎక్కువ కులాలు ఏ పార్టీకైతే మద్దతు ఇస్తాయో ఆ పార్టీనే ఏపీలో గద్దెనెక్కుతూ వస్తోంది. దీంతో ఏపీలో ఎక్కువ జనాభా కలిగిన కులాలకు ప్రాధాన్యత పెరిగింది. ఇక ఏపీలో కాపులు అత్యధికంగా ఉండటంతో వీరిని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు పదవుల్లో వారికే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి.

2014 ఎన్నికల్లో కాపులంతా టీడీపీ-జనసేన కూటమికి మద్దతు తెలపడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే టీడీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ విషయంలో కాపులకు హ్యండివ్వడంతో వారంతా కిందటి ఎన్నికల్లో జగన్ కు జై కొట్టారు. దీంతో వైసీపీ ఏపీలో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాపుల్లో కొందరు మాత్రం ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతు ఇచ్చారు. మెజార్టీ కాపులు వైసీపీ వైపు మొగ్గుచూపడంతో ఆపార్టీనే అధికారంలోకి వచ్చింది. గతంలో కాపు పార్టీగా తెరపైకి వచ్చిన ప్రజారాజ్యం స్థాయిలో కూడా జనసేనకు కాపు ఓట్లు రాకపోవడం గమనార్హం.

కాపుల కోసం ప్రస్తుత జగన్ సర్కారు అమలు చేస్తున్న పథకాలతో ఆవర్గం నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కన్పిస్తుంది. కాపు మహిళల్లో ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతుందనే టాక్ విన్పిస్తోంది. మహిళల కోసం జగన్ తీసుకొచ్చిన ‘కాపునేస్తం’ వారిని ఎంతగానో ఆకట్టుకుంటుందని సమాచారం. దీంతోపాటు కాపు కార్పొరేషన్ సకాలంలో నిధులు పెంచడం, సకాలంలో మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా కాపు రిజర్వేషన్ పై జగన్ స్పష్టమైన వైఖరి ప్రకటించడంతో కాపు ఓటర్లంతా జగన్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఆవర్గానికి చెందిన నేతలంతా ఇప్పటికే వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ఎన్నికల అనంతరం తోట త్రిమూర్తులు వైసీపీలో చేరగా తాజాగా పంచకర్ల రమేష్ బాబు, చలమలశెట్టి సునిల్ ఆపార్టీలో చేరారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 23మంది గెలుపొందగా అందులో కేవలం ఇద్దరు మాత్రమే కాపు నేతలు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టీడీపీపై కాపుల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను బీజేపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ కాపులకు పెద్దపీఠ వేస్తోంది. కాగా ప్రస్తుతానికైతే కాపులంతా జగన్ వెంటే నడిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల వరకు కాపులు జగన్ తోనే ఉంటారా? అనేది వేచి చూడాల్సిందే..!

ఏపీ లో మరో దళితుడికి జరిగిన అన్యాయం బయటికొచ్చింది.. ఏమి ప్రభుత్వం ఇది?

Vizag Cop Drags-Beats Half-Naked Doctor Who Complained About Lack of PPE  Kits, Police Calls Latter 'Mentally Unwell' | India.com

గతంలో ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన దళిత డాక్టర్ సుధాకర్ ఉదంతం ఒక కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. ఇక ఇందులో ఉన్న కుట్రా కోణాన్ని సిబిఐ తేల్చిచెప్పింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సుధాకర్ అనస్టీషియన్ గా పనిచేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో మాస్కులు, పీపీఈ కిట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరడం…. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో తన ఆవేదనను వీడియో ద్వారా తెలియచేయడంతో ప్రభుత్వం అతనిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత తన ఉద్యోగం కోసం ఎన్నో విఫలయత్నాలు చేసిన సుధాకర్ చివరికి నడిరోడ్డుపై తప్పతాగి, అర్థ నగ్నంగా ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ పోలీసులకు చిక్కాడు. అయితే ప్రభుత్వ వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించడం తోనే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఈ క్రమంలోనే తను పిచ్చివాడిలా చిత్రీకరించారని సుధాకర్ మొరపెట్టుకున్నాడు. జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయిన ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్ గా తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశించింది. ముందు సుధాకర్ కి ఎవరు గుండు కొట్టారు? అతడిని నడిరోడ్డు మీద అర్థనగ్నంగా మార్చింది ఎవరు? అతనిపై అసలు ఈ కుట్ర ఎందుకు జరిగింది…. అన్న చాలా ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. 

అయితే సీబీఐ వారు మాత్రం సుధాకర్ తప్పు ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కేసును క్లోజ్ చేసే వారు కానీ వారి విచారణలో తేలింది ఏమిటంటే…. వైద్య చికిత్స నిమిత్తం సుధాకర్ ని నేరుగా పిచ్చి ఆసుపత్రికి తరలించడం…. కావాలనే అతడిని పిచ్చివాడిగా చిత్రీకరించేందుకు కొన్ని మందులను ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ విషయంలో కేసు తీవ్రతను గుర్తించిన సీబిఐ వారికి సుధాకర్ కు అనుకూలంగా కొన్ని ఆధారాలు దొరకడంతో వాటిపై మరింత లోతైన విచారణ కోసం న్యాయస్థానాన్ని అదనపు సమయం అడిగినట్లు తెలుస్తోంది. 

ఇక సీబీఐ వర్గాల లోపలి మాట ఏమిటంటే…. సుధాకర్ కి నిజంగానే అన్యాయం జరిగినట్లు ఉందని…. అతనిపై కుట్రపూరితంగా పిచ్చోడు అని ముద్రవేసి కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఈ కిట్ల ఉదంతం నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. ఇక సిబిఐ విచారణలో ఇవన్నీ బయటకొస్తాయి అనుకోండి… అది వేరే విషయం. అయినా రోజు రోజుకీ ఇలా దళితులపై జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే ఈ రాష్ట్రంలో ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.

టాలీవుడ్ అగ్ర నిర్మాతల పీఠాలు కదులుతున్నాయా?

‘ఎవడు కొడితే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..’ అన్నట్లుగా యువ నిర్మాతలు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీల్లో యువరక్తం ఉరకెలేస్తోంది. కొత్త హీరోలకు తోడు.. కొత్త నిర్మాతలు వస్తుండటంతో తెరపై క్రేజీ కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకపోయి అగ్ర నిర్మాతలుగా పేరు సంపాదించుకున్న వారికి సైతం సాధ్యంకానీ రీతిలో సినిమాలను నిర్మిస్తూ యువ నిర్మాతలు దూసుకెళుతున్నారు.

నిన్నటివరకు ఓ వెలుగు వెలిగిన అగ్ర నిర్మాతలంతా కొత్తవాళ్ల ధాటికి నిలువలేకపోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా విన్పిస్తోంది. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి బడా నిర్మాతలుగా పేరుతెచ్చుకున్న అశ్వినీదత్, అల్లు అరవింద్, దిల్ రాజు, బండ్ల గణేష్ వంటి తదితరులు ఇబ్బందులు పడుతున్నారట. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఎలాంటి బడా సినిమా చేయాలన్న వీళ్లే తీసేవాళ్లు. అయితే కొంతకాలంగా ఇండస్ట్రీలోకి కొత్త నిర్మాతలు వస్తుండటంతో వీరి హవా కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తోంది. కొత్త నిర్మాతలు ఖర్చుకు వెనుకాకుండా ముందస్తుగా హీరోలతో కమిట్మెంట్ చేసుకుంటున్నారు.

సీనియర్ నిర్మాతలేమో కథ.. దర్శకుడు.. డబ్బులంటూ లెక్కలేసుకుంటున్నారు. వీరంతా ఆచితూచి వ్యవహరిస్తూ సమయం వృథా చేస్తుండగా యువ నిర్మాతలు మాత్రం దర్శకులు, హీరోలకు అడ్వాన్సు ఇచ్చేస్తూ సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఈ విషయంలో మైత్రీ మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్,  14రీల్స్ ప్లస్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్,  సాహు గారపాటి వంటి చాలా బ్యానర్లు చకచకా సినిమాలను నిర్మిస్తున్నాయి. దీంతో దర్శకులు, హీరోలంతా వారి నిర్మాణంలో పనిచేసేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో సీనియర్ నిర్మాతలకు హీరోలు, దర్శకులు డేట్స్ దొరకడం లేదట. దీంతోపాటు హీరోలు కూడా సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకొని నిర్మాణాలు చేపడుతుండటంతో సీనియర్ నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పోటీ సినీ నిర్మాణంలోనే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ నెలకొంటుంది. కొందరి చేతుల్లో ఉండే డిస్ట్రిబ్యూషన్ ప్రస్తుతం కొత్తవాళ్ల చేతుల్లోకి వెళుతోంది. గతంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ అంతా దిల్ రాజు చేతిలో ఉండేది. ప్రస్తుతం వేరే వారిలో చేతుల్లోకి వెళ్లిందనే టాక్ విన్పిస్తుంది. అదేవిధంగా ఆంధ్రా, సీమలోనూ కొత్తవాళ్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వీరంతా సీనియర్ల కంటే ముందుగానే అంటే సినిమా ప్రారంభంలోనే డిస్ట్రిబ్యూషన్ పై డీల్ చేసుకుంటున్నారట.

కొత్తవాళ్ల పోటీని సీనియర్లు ఎదుర్కోవడంలో చతికిపడుతున్నారు. సినీ నిర్మాణంతోపాటు డిస్ట్రిబ్యూషన్లో సీనియర్ల హవాకు జూనియర్లు చెక్ పెడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఏ రంగంలోనైనా పాతనీరు పోయి.. కొత్తనీరు రావాల్సిందే.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ అదే జరుగుతుందనే టాక్ విన్పిస్తోంది.

ఎందుకు చంపుతున్నారు: సురేశ్‌ రైనా సంచలన వ్యాఖ్యలు

చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా అనూహ్యంగా తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి రైనా తప్పుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కేఎస్ విశ్వనాథన్ ప్రకటించాడు. దాంతో.. ఆ కారణాలేంటి..? అని పెద్ద ఎత్తున అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీని ప్రశ్నించడంతో.. ఎట్టకేలకు సమాధానం లభించింది.

టీం ఇండియా క్రికెటర్‌‌ సురేశ్‌ రైనా సంచలన ప్రకటన చేసి ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయ్యారు. ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటూ ఇటీవలే సంచలన నిర్ణయం ప్రకటించి అప్పటి నుంచి సైలెంట్‌ ఉండిపోయిన ఈ క్రికెటర్‌‌  తాజాగా ‘నా కుటుంబసభ్యుల్ని ఎందుకు చంపుతున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితమే రెండు ట్వీట్లు చేసిన ఆయన పంజాబ్‌లో తమ కుటుంబంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై స్పందించాడు.

‘పంజాబ్‌లో మా కుటుంబానికి జరిగింది దారుణం కాదు ఘోరమని అనాలి. మా మామయ్య హత్యకు గుయ్యారు. మేనత్త, వాళ్ల ఇద్దరు కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. దురదృష్టం కొద్దీ గత రాత్రి ఒక సోదరుడు కన్నుమూశాడు. ఇప్పటికీ అత్తయ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె వెంటిలేటర్‌‌పై చికిత్స పొందుతున్నారు’ అంటూ ఫస్ట్‌ ట్వీట్‌ చేయగా.. ‘ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయం మీద మాకు ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ఎవరు..? ఎందుకు ఇలా చేశారో కూడా తెలియదు. దీనిపై పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఆ నేరస్తులను పట్టుకోవాలి’ అంటూ మరో ట్వీట్‌ చేశారు. దీనికి పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌‌ సింగ్‌ను కూడా ట్యాగ్‌ చేశారు.

రైనా ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడానికి ఈ విషాద ఘటనలే కారణమా..? లేక మరే కారణాలేమైనా ఉన్నాయా తెలియకుండా ఉంది. మరోవైపు దుబాయిలో అతడికి కేటాయించిన హోటల్‌లో గది నచ్చక జట్టుతో విభేదాలు వచ్చి తప్పుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ జట్టు యజమాని శ్రీనివాసన్‌ కూడా రైనా మీద అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా రైనా తీసుకున్న నిర్ణయంతో యావత్‌ క్రికెట్ అభిమానులు అయితే ఇంకా షాక్‌లోనే ఉన్నారు.

వైసీపీపై సెటైర్లు వేసి.. అడ్డంగా బుక్కయిన లోకేష్..!

‘తొందరపడి ఓ కోయిలా.. ముందే కూసింది.. చిందులు వేసింది..’ అన్నట్టుగా లోకేష్ తీరు మారిపోయింది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఎలాగైతే ముందు వెనుక ఆలోచించుకుండా మాట్లాడుతూ అబాసుపాలవుతుండటం చూస్తునే ఉన్నాం.. ఇక ఆయన తనయుడు లోకేష్ సైతం వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టాలనే తొందర్లో నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్లు పెడుతూ విమర్శల పాలవుతున్నారు.

ఇటీవల వైసీపీ సర్కార్ ను ఉద్దేశిస్తూ లోకేష్ బాబు తన ట్వీటర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. క్షేత్రస్థాయిలో విషయాలు తెలుసుకోకుండానే విలేకరిపై వైసీపీ గుండాల దాడి అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ వీడియోను పోస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇందులో వైసీపీకి సంబంధం లేదని తేల్చారు. పోలీసులు లోకేష్ గుట్టురట్టు చేయడంతో ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టగా అది చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తేలింది. జిల్లాలోని ఓ హెడ్మాస్టర్ ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా ఓ విలేకరిలో ఇందులో కలుగజేసుకున్నాడట. సదరు హెడ్మాష్టర్ ను కేసు నుంచి తప్పించేందుకు బాలిక తల్లిపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడట. దీంతో బాలిక తరుపు బంధువులు సదరు విలేకరిపై దాడికి యత్నించారు. ఈ వీడియోనే లోకేష్ ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు విలేకరులపై దౌర్జన్యాలు అంటూ రెచ్చిపోయి ట్వీట్లు చేశారు. తీరా పోలీసులు అసలు విషయం బయటపెట్టడంతో లోకేష్ ఖంగుతినాల్సి వచ్చింది.

దీంతో వైసీపీ నేతలు లోకేష్ బాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అబద్దాలు.. అసత్యాలు ప్రచారం చేయడంలో లోకేష్ బాబు చంద్రబాబునే మించిపోతున్నారంటూ సైటర్లు వేస్తున్నారు. లోకేష్ రాజకీయంగా ఎదగాలంటే చంద్రబాబులా కాకుండా నిర్మాణాత్మక విమర్శలు చేయాలని లేకుండా చంద్రబాబుకు పట్టిన గతే లోకేష్ కు పడుతుందంటూ హెచ్చరించారు. తండ్రికొడుకులు రాష్ట్రానికి పట్టిన శాపమంటూ ఓ రేంజులో ఫైరవుతున్నారు. తప్పు తెలుసుకున్న లోకేష్ ప్రస్తుతానికి సైలంటయ్యారు. ఇకనైనా లోకేష్ బాబు నిజనిజాలు తెలుసుకొని ట్వీట్లు చేస్తాడో లేక మళ్లీ అదే దారిలో వెళ్లి విమర్శల పాలవుతారో వేచిచూడాల్సిందే..!