
‘గీత గోవిందం’ సినిమా ఇద్దరు జీవితాలను పూర్తిగా మార్చేసింది. వారే డైరెక్టర్ పరుశురామ్, హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా హిట్ అయ్యాక పరుశురామ్ కి మొట్టమొదటిగా సినిమా ఆఫర్ ఇచ్చింది అక్కినేని నాగార్జున. అఖిల్ కోసం కథ రెడీ చేయమని అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. పరుశురామ్ కూడా అఖిల్ కోసం స్క్రిప్ట్ పనుల్లో దాదాపు నాలుగు నెలలు గడిపాడు. ఇక త్వరలోనే అఖిల్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి ముహూర్తం పెట్టుకునే లోపు.. పరుశురామ్ కి, మహేష్ నుండి సినిమా ఆఫర్ వచ్చింది. కథ ఉంటే చెప్పమని కాకుండా.. మనం సినిమా చేస్తున్నాం, అయితే కథ పై పూర్తిగా సంతృప్తి వచ్చాకే షూట్ పెట్టుకుందాం అని మహేష్ అభయం ఇవ్వడంతో.. పరుశురామ్ అఖిల్ సినిమా స్క్రిప్ట్ ఆపేసి.. మహేష్ కోసం సర్కారు వారి పాట కథ రాసి మొత్తానికి సినిమాని సెట్ చేసుకున్నాడు.
Also Read: మున్నాళ్ల ముచ్చటగా మన తారల పెళ్లిళ్లు..!
కానీ, అఖిల్ సినిమా కాదనలేక, మహేష్ సినిమా తరువాత అఖిల్ తోనే సినిమా చేస్తానని మాట ఇవ్వడంతో, నాగార్జున కూడా ఓకే చెప్పాడు. మహేష్ సినిమా కూడా సూపర్ హిట్ అయితే, ఆ తరువాత పరుశురామ్ అఖిల్ తో సినిమా చేస్తే.. అఖిల్ మార్కెట్ రేంజ్ పెరుగుతుందనేది నాగ్ ప్లాన్. అందుకే ఈ లాక్ డౌన్ లో నాగార్జున, అఖిల్ సినిమా కథ మీద కూర్చోమని పరుశురామ్ పై ఒత్తిడి తెచ్చాడట. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో కలిసి ఒక కథను రెడీ చేసి.. నాగ్ కి వినిపించాడు పరుశురామ్. కథ నచ్చడంతో ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఏమైనా అఖిల్ సక్సెస్ కోసం నాగ్ బాగానే కష్టపడుతున్నాడు. కానీ, అఖిల్ కి మాత్రం సక్సెస్ రావడం లేదు.
Also Read: బాధను అణిచిపెట్టి వివరణ ఇచ్చాడు !
అఖిల్ లాస్ట్ సినిమా ‘మిస్టర్ మజ్ను’ కూడా అఖిల్ కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయే సరికి ఏ సినిమా చేయాలో.. ఎలాంటి కథతో సినిమా చేయాలో మొత్తానికి జడ్జ్ మెంట్ కోల్పోయాడు అఖిల్. దాంతో తన తరువాత సినిమాల పై నాగార్జున మరింత జాగ్రత్త పడేలా అఖిల్ రిక్వెస్ట్ చేశాడని.. అందుకే, నాగ్ కూడా చైతు సినిమాలు కంటే కూడా.. ఎక్కువగా అఖిల్ సినిమాల పైనే దృష్టి పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక నెగిటివ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సాధారణమై పోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.