Home Blog Page 8337

భారత్ లో కరోనా: ఒక్క ఆగస్టులోనే 20లక్షల కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఒకటి.. రెండుతో మొదలై పదులు వందలు దాటి లక్షలకు చేరింది. నెలలు గడుస్తున్న కొద్దీ రెట్టింపు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. కేవలం ఒక్క ఆగస్టు నెలలోనే సుమారుగా 20 లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక నెల వ్యవధిలో ఇన్ని కేసులు ప్రపంచంలో ఏ దేశంలోనూ నమోదు కాలేదు.

దేశంలో జనవరి 30న ఫస్ట్‌ కరోనా కేసు నమోదైంది. అప్పటి నుంచి కరోనాను కంట్రోల్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నివిధాలా ప్రయత్నించినా పెద్దగా ఫలితాలు కనిపించలేదు. దీంతో మార్చి నుంచి లాక్‌డౌన్‌ షురూ చేసింది. లాక్‌డౌన్‌తో వ్యాపార, వాణిజ్య, రవాణా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. జన సంచారం కూడా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అయినా కరోనా అదుపులోకి వస్తుందని అందరూ ఆశించగా.. ఆ స్థాయిలో కాకున్నా కొద్దోగొప్పో కంట్రోల్‌లోనే ఉండింది.

గత మూడు నెలలుగా దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తోంది. ఈనెలతో అన్‌లాక్‌ 4.0 అమల్లోకి వచ్చింది. ఎప్పుడైతే అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైందో జనం రోడ్లపైకి వచ్చుడు స్టార్ట్‌ చేశారు. మార్కెట్లు, షాపులు ఎక్కడా చూసినా జనసంచారమే కనిపించింది. దీంతో ఒక్కో రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి.. రాష్ట్రాల నుంచి జిల్లాలకు.. జిల్లాల నుంచి మండలాలకు.. మండలాల నుంచి గ్రామాలకు వైరస్‌ పాకింది. ఉద్యోగులు, కూలీలు ఏ రంగానికి చెందిన వారైనా తమతమ పనుల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు వైరస్‌ను అదుపు చేయడం ఎవరి తరమూ కావడం లేదు.

భారత్‌లో నిత్యం 70 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారానికి దేశవ్యాప్తంగా 36 లక్షల 91 వేల సంఖ్య నమోదైంది. ఇందులో ఇప్పటికే 28.39 లక్షల మంది కోలుకోగా.. మరో 7.85 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య 65,288కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 76 శాతం కనిపిస్తోంది.

మున్నాళ్ల ముచ్చటగా మన తారల పెళ్లిళ్లు..!

సెలబ్రెటీల పెళ్లిళ్లు మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా కాపురం చేయకుండానే వారిమధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరికీవారు సర్దుకుపోకుండా.. వాదనలు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో ఇటీవల కాలంలో విడిపోతున్న సెలబెట్రీల సంఖ్య భారీగా పెరిగిపోతూ పోతుంది.

అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటున్న సినీ సెలబ్రెటీలు కొద్దిరోజుల్లోనే విడిపోతుండటంపై శోచనీయంగా మారింది. కొద్దినెలల క్రితం హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ అమలాపాల్ దర్శకుడు ఎల్.ఎల్. విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. అయితే కొద్దిరోజుల్లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండేళ్లు వీరిద్దరి సంసారం సజావుగానే సాగిన తర్వాత వీరిమధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్ రెండో పెళ్లి చేసుకోగా అమలాపాల్ సినిమాలతో బీజీగా మారిపోయింది.

తాజాగా మరో హీరోయిన్ ఎస్తేర్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందినీ షాక్ గురిచేసింది. గతేడాది క్రితమే హీరోయిన్ ఎస్తేర్, సింగర్ నోయల్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ప్రేమ వివాహం కావడం విశేషం. గతేడాది జనవరి 3న మంగళూరులో గ్రాండ్ గా వివాహం జరిగింది. ఈ పెళ్లికి దర్శక దిగ్గజం రాజమౌళి సైతం హాజరై దంపతులను ఆశీర్వదించారు. అయితే పెళ్లయిన మరుసటి రోజు నుంచి వీరిమధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో వీరిద్దరు పట్టుమని పదిరోజులు కూడా కాపురం చేయకుండానే దూరంగా ఉంటున్నారట. కొన్నినెలలుగా వీరిద్దరు దూరంగా ఉంటుండటంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై వీరిద్దరు పెద్దగా స్పందించలేదు. తాజాగా వీరిద్దరికి కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఎస్తేరు వెల్లడించింది. తాను చాలా విషయాల్లో సూటిగా, నిజాయితీగా ఉంటానని.. అయితే విడాకుల విషయంలో ఇంతకంటే ఎక్కువగా స్పందించ దలుచుకోలేదని ఎస్తేర్ చెప్పింది.

ఇదిలా ఉంటే ఎస్తేర్ తెలుగులో ‘వెయ్యి అబ్దద్దాలు’ మూవీతో పరిచమైంది. సునిల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు మూవీతో ఎస్తేర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళ, మరాఠీ సినిమాల్లో నటిస్తున్న ఎస్తేర్ కేవలం ఐదునెలల వ్యవధిలో విడాకులు తీసుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. తారల పెళ్లిళ్లు పట్టుమని పదికాలలపాటు ఎందుకు సాఫీ జరుగడం లేదని చర్చ ప్రేక్షకుల్లో జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో వారి బతుకులు భారం!

తెలంగాణ రాష్ట్రానికి ఆర్టీసీ పెద్ద రవాణా వ్యవస్థ. అంత పెద్ద వ్యవస్థలో కార్మికుల బతుకులు భారమయ్యాయి. కరోనా కాటుతో బస్సులు నడవకపోవడం.. సిబ్బందికి డ్యూటీలు వేయకపోవడంతో కార్మికులు ఆర్థిక భారంతో కుంగిపోతున్నారు. నెలనెలా జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వచ్చినా ఎంత ఇస్తారో తెలియని దుస్థితి.

ఆది నుంచి రాష్ట్రంలో కష్టాల్లోనే ఉన్న ఆర్టీసీ కరోనాతో మరింత కుదేలైంది. ఎప్పటి నుంచో లాస్‌లోనే నడుస్తున్న సంస్థపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన సర్వీసులను పునఃప్రారంభించినా పెద్దగా ఆదాయం రావడం లేదు. దీంతో స్టాఫ్‌కు కనీసం జీతాలు కూడా ఇవ్వలేకుండా ఉంది సంస్థ. లాక్‌డౌన్‌ ఎత్తివేసి బస్సులు నడిపిస్తున్నా ప్రయాణికులు ఎవరూ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందుకు రావడం లేదు. ఎవరి నుంచి తమకు కరోనా వైరస్‌ సోకుంతుందో అనే భయం వారిలో ఇంకా కనిపిస్తోంది. దీంతో ఎక్కువగా ప్రైవేటు వాహనాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇంకా రూరల్‌ ఏరియాస్‌లో అయితే సర్వీసులు ప్రారంభానికే నోచుకోలేదు. 10,400 బస్సులకు గాను 3 వేల బస్సులను మాత్రమే తిప్పుతున్నారు. రూ.2.50 కోట్ల ఆదాయం వస్తున్నా అవి మెయింటనెన్స్‌కే సరిపోతున్నాయి.

సంస్థలో సుమారు 49,200 మంది సిబ్బంది ఉన్నారు. 20 వేల వరకు పెన్షన్‌దారులు ఉన్నారు. నెలనెలా రూ.169 కోట్ల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం ఆర్టీసీ ఖాతాలో 9 కోట్లు మాత్రమే ఉన్నాయి. రెండు నెలలుగా రిటైర్డ్‌ కార్మికులకు పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు. అవి సుమారుగా రూ.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈనెల జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటే సంస్థకు రూ.207 కోట్లు అవసరం. కానీ.. అంత మొత్తం ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు. సంస్థకు ఆదాయం వచ్చే దిక్కు లేదు. ప్రస్తుతం సంస్థ నెత్తిన సుమారు రూ.3,700 కోట్ల అప్పు ఉంది.

ఇప్పటికే సంస్థ ఆస్తులను తనఖా పెట్టి రూ.600 కోట్లు అప్పు తెచ్చింది. మే నెల వరకు జీతాలు సర్దుబాటు చేసింది. ఖాతాలో ఖాళీ కావడంతో జూన్‌ నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఆఫీసర్లు, కార్మిక సంఘాలు సర్కార్‌‌తో మొరపెట్టుకున్నాయి. ఆ సమయంలో రూ.150 కోట్లు ఇచ్చింది. ఇక జూలై, ఆగస్టు నెలల వేతనాలు ఆగిపోయాయి. కొత్తగా కార్గో పార్శిల్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చినా రెస్పాన్స్‌ నామమాత్రంగానే కనిపిస్తోంది. మరోవైపు జీతాల కోసం కార్మికులు సంస్థను కోరుతూనే ఉన్నారు. జీతాలు ఇవ్వకుండా తమ కుటుంబాలను ఎలా పోషించుకునేది అని ఆవేదన చెందుతున్నారు. కరోనా ఉన్నా రిస్క్‌ చేసి డ్యూటీలు చేస్తున్నామని.. అయినా తమకు సంస్థ నుంచి ఎలాంటి భరోసా లేదని.. కనీసం జీతాలైనా ఇవ్వాలని కోరుతున్నారు.

బుల్లితెర పై మరీ ఇంత బూతు బాగోతమా ?


బుల్లితెర అంటే… కుటుంబ ప్రేక్షకుల థియేటర్. ఒకప్పుడు ధైర్యంగా అందరూ కలిసి కూర్చుని చూసేవారు. అమ్మలు అక్కలతో పాటు తండ్రికొడుకులు కూడా అన్ని ప్రోగ్రామ్ లను ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఆస్వాదించేవారు. కాలం మారిందని ప్రేక్షకుల అభిరుచి మారిందని.. బూతు విచ్చలవిడిగా జొప్పించి, మధ్యలో అర్ధం పర్ధం లేని రొమాన్స్ ను పెట్టి.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పడేలా చేస్తున్నారు బుల్లితెర మేకర్స్. అసలు కుటుంబంతో కూర్చుని టీవీ చూడటం ఎప్పుడో మానేశాం అని ఈ మధ్య తరుచూగా కొంతమంది చెప్పుకుంటున్న మాట. అయినా మన బుల్లితెర మేకర్స్ మాత్రం మారట్లేదు.

Also Read: వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?

బుల్లితెర పై శేఖర్ మాస్టర్ కి ఓ రేంజ్‌లో క్రేజ్ ఉందట.. ఆయనగారి మాస్ స్టెప్పులకి, అలాగే ఆయనగారి దిమ్మతిరిగే సెటైర్లకి అభిమానులు ఉన్నారట. అందుకే శేఖర్ మాస్టర్ కూడా సాంగ్ కైనా, బోల్డ్ స్టెప్స్ కైనా ఎప్పుడూ రెడీగా ఉంటాడట. ఇది శేఖర్ మాస్టర్ గురించి బుల్లితెర మేకర్స్ చెబుతున్న మాట. నిజమే కావొచ్చు.. ఢీ షోలో, అప్పుడప్పుడు జబర్దస్త్ వేదికపై శేఖర్ మాస్టర్ వేసే సెటైర్స్ బాగా వర్కౌట్ అవొచ్చు.. అంతమాత్రాన ఆయన పక్కన మాజీ హీరోయిన్స్ ను తీసుకువచ్చి రొమాన్స్ చేయించాలా..? ముఖ్యంగా స్పెషల్ ఈవెంట్లకు రోజా – శేఖర్ మాస్టర్ చేసే రచ్చ మామూలుగా ఉండదనేది అందరికీ తెలిసిందే. రోజాతో చేసే స్కిట్ లో కూడా బూతు లేకుండా ఉండదయ్యే. ఇక రోజాతో చేసే డ్యాన్స్ పర్ఫామెన్స్ గురించి.. ఆయా స్టెప్స్ లోని టచ్ గురించి పూర్తిగా చెబితే.. రోజా గారి విలువ తగ్గించినట్టే అవుతుంది.

Also Read: కరోనా పెరుగుతున్నా .. షూటింగ్ స్టార్ట్ చేశాడు !

ఇప్పుడు శేఖర్ మాస్టర్ మిగిలిన హీరోయిన్స్ తో కూడా తన శైలి స్టెప్స్ వేయడం మొదలుపెట్టాడు. ఈటీవీ 25వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా జబర్దస్త్, ఈటీవీ సీరియల్స్ వారంతా తమలోని అభిమానాన్ని ఎలివేట్ చేస్తూ.. అందరూ కలిసి అదిరిపోయేలా వేడుకలు ఘనంగా చేశారు. ముఖ్యంగా జబర్దస్త్, ఢీ యూనిట్ల హంగామే ఎక్కువగా ఉంది ఈ వేడుకల్లో. పైగా ఈ వేడుకల్లో శేఖర్ మాస్టర్ మరోసారి హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్ లో దుమ్ములేపాడు. హీరోయిన్ పూర్ణతో శేఖర్ మాస్టర్ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ కాస్త హద్దులు దాటింది. డీజే సినిమాలో గుడిలో బడిలో అనే పాటకు పూర్ణతో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ తో శేఖర్ మాస్టర్ రెచ్చిపోయాడు. పూర్ణతో తన శైలి సిగ్నేచర్ స్టెప్పులు వేస్తుంటే… రోజా సైతం ఆశ్చర్యపోయింది. ప్రతీసారి అలాంటి స్టెప్స్ నాతోనే చేస్తాడు, ఈసారి పూర్ణతో చేస్తున్నాడు ఎలా చేస్తాడా? అనుకున్నానని అంటూ రోజా కూడా మొత్తానికి కుళ్ళుకున్నేలా శేఖర్ మాస్టర్ స్టెప్స్ వేశాడు.

బాధను అణిచిపెట్టి వివరణ ఇచ్చాడు !


ఒక సూపర్ స్టార్ కి అల్లుడు, మరో సూపర్ స్టార్ కి బావ. అన్నిటికి మించి తనకు మూడు హిట్లు ఉన్నాయి. పైగా గత సినిమా సమ్మోహనం సూపర్ హిట్.. అయినా ‘వి’ మేకర్స్ మాత్రం తనను మెయిన్ లీడ్ హీరోగా ఎందుకు గుర్తించడం లేదు. నాని ఏమి టాప్ స్టార్ కాదు కదా.. తనలాగే సెకెండ్ లీడ్ హీరో.. కాకపోతే కొంచెం ఫాలోయింగ్ ఉంది. అంతమాత్రాన తనని నాని ముందు మరీ ఇంత తక్కువ చేయాలా ? మొదట్లో తానూ సైలెంట్ గా ఉన్న పాపానికి ఇప్పుడు వి మేకర్స్ పైత్యం ఎక్కువైపోయింది. వీరికి నా గురించి తెలియక ఇలా చేస్తున్నారా.. లేక నాని వల్లే ఇలా చేస్తున్నారా.. ఇలా సాగుతోంది ప్రస్తుతం సుధీర్ బాబు ఆలోచనా ధోరణి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రానున్న వి సినిమాలో మొదట హీరో సుధీర్ బాబు, విలన్ నాని అన్నారు.

Also Read: కరోనా పెరుగుతున్నా .. షూటింగ్ స్టార్ట్ చేశాడు !

అందుకే సుధీర్ బాబు కూడా హీరోలాగే ఈ సినిమా చేశాడు. కానీ, ఆ తరువాత ఈ సినిమా పై మొదటినుంచి సోషల్ మీడియాలో ఇది నాని 25వ చిత్రమని, నాని నుండి వస్తోన్న మరో వైవిధ్యమైన సినిమా అని ఇలా కేవలం నానినే ఫోకస్ చేస్తూ.. సుధీర్ బాబును పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇలాంటి ప్రచారం వచ్చినప్పుడే ఇది ఇద్దరి హీరోల పాత్రల చుట్టూ తిరిగే కథ అని.. ఇందులో నాని, సుధీర్ బాబు ఇద్దరూ సమానమే అని మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో పూర్తిగా నాని డామినేషన్ ఎక్కువైపోయింది. సుధీర్ బాబు కూడా సినిమాలో హీరో అనే విషయం కూడా సరిగ్గా ప్రమోట్ కూడా కాలేదు. దానికి తోడు సుధీర్ బాబు నానిలా ముందు నుంచీ ఓన్ గా ప్రమోషన్స్ చేసుకున్న సంఘటనలు కూడా లేకపోవడం కూడా సుధీర్ బాబును సైడ్ చేసింది.

Also Read: వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?

అయితే సుధీర్ బాబు మాత్రం ఈ విషయం పై రియాక్ట్ అవుతూ.. ‘బలమైన ఇద్దరు వ్యక్తుల ఢీ కొడితే ఎలా ఉంటుందో చూపించేదే ఈ సినిమా కథాకథనాలని.. నేను సినిమాలో మెయిన్ హీరోను కాదు అని బయట వినిపించే మాటలను అంతగా పట్టించుకోనని.. అయినా సినిమా చూశాక మీకే తెలుస్తోంది కదా.. సినిమాలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది.. ఎవరు ఎలా చేశారనేది.. అంతమాత్రాన ఇప్పుడే ఎందుకు ఆవేశపడి కామెంట్స్ చేయడం.. అందుకే తానూ మొదటినుండి ఇలాంటి వార్తలు వస్తున్నా.. పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఎవరికి ఎంత పేరు వస్తుందనేది సినిమా రిలీజ్ అయ్యాక మీకే తెలుస్తుంది. అంటూ సుధీర్ బాబు తన బాధను అణిచిపెట్టి ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఈ వి సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది.

ఓటీటీ.. నిర్మాతలకు ప్రచార ఖర్చును మిగిలిస్తుందా?

‘ఎంకీ పెళ్లి సుబ్బు సావుకొచ్చినట్టు’.. కరోనాతో సినిమా ఇండస్ట్రీ కుదేలవుతుండగా అదేరంగానికి చెందిన ఓటీటీకి మాత్రం కాసులవర్షం కురిపిస్తోంది. కరోనాతో థియేటర్లు మూతపడటం ఓటీటీకి బాగా కలిసొస్తుంది. నిర్మాతలు గత్యంతరంలేక ఓటీటీల్లోనే సినిమాలను విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు మినహా పెద్ద సినిమాలేవీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. తాజాగా టాలీవుడ్ నుంచి ఓ పెద్ద సినిమా ఓటీటీలో రాబోతుంది.

Also Read: బేర్ గ్రిల్స్ తో అక్షయ్ సాహసం చూడాల్సిందే..!

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘వి’ సినిమా ఓటీటీలో రాబోతుంది. గత మూడునెలలుగా ఓటీటీ పెద్ద మూవీలు విడుదల కాలేదు. దీంతో ‘వి’ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ‘వి’ మూవీ సెప్టెంబర్ 5న రాబోతుంది. అయితే సినిమా ప్రమోషన్లకు ఓటీటీకి సంబంధం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం ఓటీటీలు కూడా ‘వి’ మూవీ నుంచి ఢిపెరెంట్ గా ప్రమోషన్లు షూరు చేసినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం ‘వి’ సినిమా ప్రమోషన్ మొత్తం ఓటీటీనే నిర్వహిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ కు భారీ సంఖ్యలో సబ్ స్ర్కయిబర్లు ఉన్నారు. వీరిని ఆకట్టుకునేలా ‘వి’ సినిమా ప్రమోషన్ ను చేపడుతోంది. ఇందులో హీరో, నిర్మాతలకు ఛాన్స్ ఇవ్వకుండా సొంతంగా సినిమా ప్రమోషన్ చేపట్టింది. బాలీవుడ్ తరహాలో ‘వి’ ట్రయిలర్ విడుదల చేయగా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనే టాక్ విన్పించింది. దీనిపై నెటిజన్ల నుంచి ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. దీంతో సదరు ఓటీటీ హీరో, నిర్మాతలతో కలిసి జూమ్ లో ప్రమోషన్లు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక డైరెక్టర్, ఒక హీరోతో ప్రెస్ మీట్ చేసింది. మరోసారి నాని, సుధీర్, నిర్మాత దిల్ రాజుతో ప్రచారం చేయాలని భావిస్తుంది.

Also Read: బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన !

ఓటీటీలే సినిమా ప్రమోషన్లు చేసుకుంటుండటంతో నిర్మాతలకు, హీరోలకు సమయం, ఖర్చు మిగులుతుంది. ఓటీటీలు సైతం జూమ్ లాంటి యాప్ లతో పెద్దగా ఖర్చు పెట్టకుండానే ప్రేక్షకుల ముందుకు వెళుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సినిమా ప్రమోషన్లు కూడా ఇలానే జరిగేలా కన్పిస్తున్నారు. కొత్త తరహా సినిమా పబ్లిసిటీకి ‘వి’ సినిమా నాంది పలుకడంతో మరిన్ని సినిమాలు కూడా ఆ బాటలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నాయి.

ఎల్లోమీడియాకు షాకిచ్చిన హైకోర్టు..!


ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా హైకోర్టు చీవాట్లు పెట్టడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. జగన్ సర్కార్ ఏ నిర్ణయం చేపట్టిన దానిపై పలువురు కోర్టుకు వెళ్లడం.. హైకోర్టు మందలించడం షరా మమూలుగా మారింది. జగన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా టీడీపీకి చెందిన ఎల్లో మీడియా, టీడీపీ నేతలు సంబరాలు చేసుకోనేవారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎల్లోమీడియాను సైతం హైకోర్టు తాజాగా చీవాట్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: చంద్రబాబు, టీడీపీకి జగన్ మరో భారీ షాక్?

విజయవాడకు చెందిన కిలారి నాగశ్రవణ్ ఇటీవల హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రకటనల్లో జగన్ సర్కార్ వివిక్ష చూపుతోందని.. సీఎం ఫొటోను పెద్దగా వాడుతున్నారంటూ పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసన విచారణ చేపట్టింది. పిల్ దాఖలు చేసిన వ్యక్తిని ఘాటుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

‘ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో దివంగత సీఎం(వైఎస్‌ రాజశేఖరరెడ్డి) ఫొటో ఎందుకు ఉండొద్దు.. ఇలా అని ఏ నిబంధనల్లో ఉంది? సుప్రీంకోర్టు తీర్పులోనూ ఎక్కడా అలా పేర్కొనలేదే..! ఆయన ఫొటో ఉంటే తప్పేంటి? ఆయన కూడా రాష్ట్రానికి సీఎంగా సేవలందించారు కదా! అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రకటనల్లో మీకు అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకే వెళ్లి చెప్పుకోండంటూ’ హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా పిటినర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ప్రకటన జారీ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు విరుద్ధంగా ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు. ప్రకటనలపై కేంద్ర, రాష్ట్రాలు ఏమైనా మార్గదర్శకాలు రూపొందించాయా అంటూ ప్రశ్నించింది. సుప్రీం నిబంధనలు ఖరారు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిందేనని చెప్పింది. దానికి విరుద్ధంగా నడుచుకుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ప్రకటనల విషయంలో కేంద్ర, రాష్ట్రాలు మార్గదర్శకాలు ఏం చేయలేదని పిటిషనర్ హైకోర్టు తెలుపడంతో సుప్రీంకే వెళ్లి తేల్చుకోవాలంటూ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.

Also Read: బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?

దీనిపై ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న అడ్వొకేట్ జనరల్ పిటినర్ వెనుక చంద్రబాబు ఉన్నారని.. ఇదంతా టీడీపీ రాజకీయంలో భాగమేనని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గత చంద్రబాబు పాలనలో ప్రకటనలు ఇచ్చినపుడు పసుపు రంగు వాడరంటూ ఓ ప్రకటనను ధర్మసనానికి చూపించారు. అప్పుడు పిటిషనర్ ఎందుకు హైకోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంలో భాగంగానే పిటిషనర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారని మండిపడ్డారు.

కాగా ఈ పిల్ ను సుప్రీం ధర్మాసనానికి పంపుతామని చెబుతూనే హైకోర్టు పరోక్షంగా పిటిషనర్ దారుడిని చీవాట్లు పెట్టింది. ఎప్పుడు ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టే హైకోర్టు ఎల్లోమీడియాకు షాక్ ఇవ్వడం విశేషం. ఇప్పటికే ఎల్లోమీడియాకు గట్టి షాకిస్తున్న జగన్ కు హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంతో వాటికి మరింత ఇబ్బందులు ఎదురయ్యేలా కన్పిస్తున్నాయి.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్నుతున్నారు


ఓ వైపు కరోనాతో రాష్ట్రమంతటా నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. ఏం కంపెనీలో చూసినా కరోనా సాకుగా చూపి ఉద్యోగులను తొలగించడం చేస్తున్నాయి. కానీ.. రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు మాత్రం ఈ బర్డెన్‌ తాము మోయలేమంటూ రాజీనామా బాట పడుతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆగస్టు నెల వరకు రాష్ట్రంలో 1,260 మంది రాజీనామా చేశారు.

Also Read: కేసీఆర్ కు అసమ్మతి జ్వాల తగలనుందా?

2018 అక్టోబర్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం 9,355 కార్యదర్శుల పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ నిర్వహించింది. జిల్లా స్థాయిలో మెరిట్‌ సాధించిన వారికి 2019 ఏప్రిల్‌లో హడావుడిగా నియామక పత్రాలు అందించారు. అప్పట్లో కార్యదర్శి కొలువు అంటే పెద్ద స్థాయిలో ఊహించుకొని డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా ఎగ్జామ్‌ రాశారు. రాకరాక సర్కార్‌‌ ఉద్యోగం రావడంతో ఎంతగానో సంబరపడ్డారు. కానీ.. ఆ సంబరం పట్టుమని పది రోజులు కూడా ఉండడం లేదు.

అన్ని శాఖల ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వస్తుండగా.. వీరికి మూడు నెలలకో, నాలుగు నెలలకో ఒకసారి ఇస్తున్నారు. దీంతో కుటుంబపోషణ భారమవుతోంది. దీనికితోడు విపరీతమైన పనిఒత్తిడి. మొన్నటి వరకు గ్రామాల్లో ఈజీఎస్‌ పనులు చూస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను కూడా తొలగించడంతోపాటు ఆ పనిని కూడా సెక్రటరీలకు అప్పజెప్పారు. ఇప్పుడు హరితహారం సీజన్‌ నడుస్తోంది. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని కార్యదర్శులకే టార్గెట్‌ పెట్టారు. పల్లె ప్రకృతి వనాలు, తదితర పర్యవేక్షణ బాధ్యతలు మోపారు. దీంతో కొలువు కష్టంగా భావిస్తున్నారు. ఇవన్ని మోస్తున్నా తమకు ఇస్తామన్న రూ.15 వేల జీతం కూడా సరిగా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.

వీటన్నింటికి తోడు గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శుల మధ్య పొసగడం లేదు. ఏదో ఒక విషయంలో విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అటు మండల స్థాయి అధికారులూ టార్గెట్‌ అంటూ టార్చర్‌‌ పెడుతున్నారు. మీటింగ్‌ల పేరిట ఆఫీసులకు పిలిపించుకుంటూ క్లాస్‌ ఇస్తున్నారు. పొద్దంతా విలేజ్‌లో పనులతో అలసిపోతుంటే.. సాయంత్రం అయిందంటే ఆఫీసుల్లో సమీక్షల పేరిట వేధిస్తున్నారు.

Also Read: తెలంగాణ చారిత్రక సౌధం.. కరిగిపోతోందా?

మరోవైపు పంచాయతీల్లో నిధుల్లేక కార్యదర్శులపై భారం పడుతోంది. పల్లెప్రగతిలో భాగంగా ప్రతినెలా ప్రభుత్వం రూ.339 కోట్లు రిలీజ్‌ చేస్తున్నా.. ఒక్కో గ్రామానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకే వస్తున్నాయి. పెద్ద పంచాయతీల పరిస్థితి కొంత వరకు మెరుగ్గా ఉన్నా.. చిన్న పంచాయతీల్లో అధ్వానంగా ఉంది. పాలకవర్గ మీటింగ్‌లు.. ఆఫీసర్ల పర్యటనలు వీటన్నింటి బాధ్యత కూడా కార్యదర్శులదే. వచ్చిన నిధులు ఎటూ సరిపోవడం లేదని.. బిల్లులు పెడుతున్నా నిధులు ఇవ్వడం లేదని ఓ కార్యదర్శి వాపోయాడు.

వీటన్నింటినీ భరించలేని కార్యదర్శులు వందల సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటివరకు నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 139 మంది, ఆదిలాబాద్‌ జిల్లాలో 62, ఉమ్మడి నల్గొండలో 142 మంది, ఉమ్మడి మెదక్‌లో 212 మంది కొలువులకు దూరమయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలోనూ 163 మంది, మహబూబ్‌నగర్‌‌ జిల్లాలో 267, రంగారెడ్డి జిల్లాలో 61 మంది, వరంగల్‌ జిల్లాలో 214 మంది తప్పుకున్నారు. చాలాసార్లు జిల్లాల వారీగా ఆందోళనలు చేశారు. కలెక్టరేట్లను ముట్టడించారు. కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలనూ తీసుకెళ్లారు. కానీ.. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వచ్ఛందంగా కార్యదర్శి పోస్టులకు రాజీనామాలు చేస్తున్నారు.

తెలంగాణ చారిత్రక సౌధం.. కరిగిపోతోందా?

‘ఒక బైక్‌ పైనుంచి పడిపోయిన వ్యక్తికి గాయం ఎక్కడైందో అక్కడే మందు రాయాలి. కానీ.. మొత్తం కాలే తీసేస్తా అంటే ఎట్ల..?’ ప్రస్తుతం ఇలానే ఉంది మన తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ వైఖరి. దేశంలోనే అతిపురాతన ఆస్పత్రుల్లో ఒకటి.. వంద ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి భవనం కాలగర్భంలో కలిసిపోబోతోంది. బిల్డింగ్‌కు లీకేజీలు వస్తే రిపేర్లు చేయించకుండా.. మొత్తం నేలమట్టం చేసి కొత్తవి నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌‌ చెబుతుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Also Read: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్నుతున్నారు

చివరి నిజాం పాలకుడు ఉస్మాన్‌ అలీఖాన్‌ నిర్మించిన అతని పేరు మీదనే ఈ కట్టడం ప్రసిద్ధికెక్కింది. ఎంతో ఘన కీర్తి.. ఎంతో చరిత్ర.. ఎందరో ప్రాణాలు కాపాడిన కలల సౌధం ఇప్పుడు కరిగిపోతోంది. ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌‌ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. అప్పటి దుస్థితిని చూసి పాత బిల్డింగ్‌ను తొలగించి అత్యాధునిక హంగులతో రెండు టవర్లు నిర్మిస్తామని ప్రకటించారు. అంటే.. అప్పటి నుంచే ఉస్మానియా కట్టడాన్ని కూల్చే ఆలోచన కేసీఆర్‌‌ మదిలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది. హెరిటేజ్‌ భవనాన్ని కూల్చకుండా ఖాళీ స్థలంలో టవర్లు నిర్మించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

తాజాగా.. ఇటీవల కురిసిన వర్షాలకు బిల్డింగ్‌లోకి వరద వచ్చి పెషెంట్లు ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ వరద నాలాల నుంచి వచ్చిందే తప్ప బిల్డింగ్‌లో లోపాలు పెద్దగా ఏమీ లేవు. ఎప్పుడో 1908లో హైదరాబాద్‌కు ఫ్లడ్స్‌ వచ్చినప్పుడు నీళ్లు వస్తే.. మళ్లీ ఇప్పుడు వచ్చాయి. ఇన్నాళ్లు రిపేర్లను పట్టించుకోని సర్కార్‌‌ మాత్రం ఒక్కసారిగా తెరమీదకి వచ్చింది. పాత బిల్డింగ్‌ పడగొట్టి కొత్తవి నిర్మించాలని ఆలోచనకు వచ్చింది. వాస్తవానికి ఉస్మానియా హాస్పిటల్‌ను జేఎన్‌టీయూ ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగానే కూలుస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అసలు జేఎన్‌టీయూ రిపోర్టులో ఏముందో స్పష్టం చేయాలంటూ ఫస్ట్‌ నుంచి ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి రిపోర్టులో కూడా ఎక్కడా భవనాన్ని కూల్చాలని రెకమండ్‌ చేయలేదు. అక్కడక్కడ ఉన్న లోపాలను సరిదిద్దాలని సూచించింది. పెచ్చులూడడం, గోడల్లో నీళ్లు ఇంకడం.. మొక్కలు మొలవడం.. స్తంభాలు తుప్పుపట్టడంపై అందులో పేర్కొంది. ఆ రిపేర్లు ఎలా చేయాలో కూడా సొల్యూషన్‌ చెప్పింది.

Also Read: కేసీఆర్ కు అసమ్మతి జ్వాల తగలనుందా?

జేఎన్‌టీయూ రిపోర్టుతో ఉస్మానియా బిల్డింగ్‌ కూల్చేందుకు సర్కార్‌‌ నిర్ణయానికి రావడంతో ఇంటాక్‌ (ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌) సంస్థం రంగంలోకి దిగింది. ఆగస్టు 2,3 తేదీల్లో ఉస్మానియను సందర్శించింది. దానిపై రిపోర్ట్‌ రిలీజ్‌ చేసింది. ఉస్మానియా పునాది గట్టిగా ఉందని, గోడలూ పటిష్టంగానే ఉన్నాయని చెప్పింది. కేవలం పై పెచ్చులే ఊడుతున్నాయని తేల్చింది. వాన నీళ్లు పోయేందుకు వేసిన పైపులు పగిలిపోయాయని.. ఆ నీరు గోడల్లో ఇంకుతోందని పేర్కొంది. తగిన రిపేర్లు చేస్తే దశాబ్దాల పాటు నిలుస్తుందని అంది. కానీ.. ఇవేమీ పట్టని సర్కార్‌‌ రిపేర్లను పక్కన పెట్టింది.

దీనిపై పలువురు పిటిషనర్లు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పాత బిల్డింగ్‌ కూల్చకుండా కొత్త వాటిని నిర్మించాలనే కోరారు. దీనిపై విచారిస్తున్న హైకోర్టు తాజాగా ఆస్పత్రి సైట్ ప్లాన్‌ సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌‌ 8కి వాయిదా వేసింది. కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కౌంటర్‌‌ దాఖలు చేయడంతో హైకోర్టు కూడా ఈ నివేదికను కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఫైనల్‌ తీర్పు కనుక ప్రభుత్వానికి పాజిటివ్‌గా వస్తే వందేడ్ల చరిత్ర కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం..!

దేశంలో ఘోరమైన విపత్తు.. భారీ ఆర్థిక ముప్పు?


కరోనా మహమ్మారి‌ అటు ఎంప్లాయిమెంట్‌నే కాకుండా.. ఇటు దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను పెద్ద ఎత్తున దెబ్బకొట్టింది. లాక్‌డౌన్‌లో పరిశ్రమలు, ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా.. ఆర్థిక వ్యవస్థ మాత్రం డీలా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌, మే, జూన్‌) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా 23.9 శాతం మైనస్‌లోకి పడిపోయినట్లు నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది.

Also Read: ప్రణబ్ ఎలా చనిపోయాడు? అలా ఎందుకు జరుగుతుంది?

అంతకుముందు త్రైమాసికం అంటే 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జీడీపీ 3.1 శాతం వృద్ధిలో ఉండగా.. ఈ త్రైమాసికంగా ఊహించని విధంగా పడిపోయింది. గతేడాది ఆర్థిక సంవత్సరం (2019–20) తొలి త్రైమాసికంలో జీడీపీ 5.2 శాతంలో వృద్ధిలో ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు తిరోగమించింది. ఏకంగా 23.9 శాతం కుంచించుకుపోయిందంటే కరోనా వైరస్ ఎంత పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. 1996లో భారత్ త్రైమాసిక గణాంకాలు విడుదల చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇంత ఘోరమైన పతనం ఎప్పుడూ రాలేదు.

రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడం దేశ ఫైనాన్షియల్‌పై ప్రభావం పడింది. లాక్‌డౌన్‌ పెట్టిన మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా.. వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధి దారుణంగా దెబ్బతిన్నాయి. నెక్ట్స్‌ త్రైమాసికం (జూలై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌‌)లోనూ ఇలాగే ఉంటే ఆర్థిక మాంద్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఇప్పుడున్న గణాంకాలు, పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆ ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏ దేశంలోనైనా రెండు త్రైమాసికాలు ఆర్థిక వ్యవస్థ కుంగిపోతే.. ఆ దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు లెక్కల్లోకి తీసుకుంటారు. మన దేశంలో చివరిసారి 1980లో ఆర్థిక మాంద్యం రాగా.. స్వాతంత్ర్యం వచ్చాక ఇది నాలుగోది.

ఈ భారం నుంచి బయటపడేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. భారత్‌లో ఇప్పటివరకూ 36 లక్షలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదుగా.. గత ఆదివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 78,761 కొత్త కేసులు వచ్చాయి. ప్రపంచంలోని మరే దేశంలోనూ రోజు వారీగా కేసులు ఇంతగా పెరగలేదు. అయినప్పటికీ.. దేశంలో ఆర్థికపరంగా రెండో లాక్‌డౌన్‌ను పెట్టే పరిస్థితి లేదు. ఎలాగైనా ఎకనామిని పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు.

Also Read: భారత్-చైనా మళ్లీ వార్.. అసలేం జరిగింది?

ఎలా చూసినా భారత్‌ ఈ పరిస్థితి నుంచి స్పీడ్‌గా కోలుకునే అవకాశాలు అయితే తక్కువే కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోటళ్లు, వాణిజ్యం, విద్యుదుత్పత్తి, తయారీ రంగం, భవన నిర్మాణ రంగం.. ఇలా దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రతీ విభాగంలో తొలి త్రైమాసికంలో తీవ్రమైన పతనాలు వచ్చాయి. ఒక్క వ్యవసాయ రంగంలోనే సానుకూల వృద్ధి నమోదైంది. ఆ రంగంలో 3.4 శాతం వృద్ధి కనిపించింది. ఏ వస్తువు తయారు చేసినా ఇప్పట్లో ప్రజలు పెద్దగా కొనే పరిస్థితులు కనిపించడం లేదు.

అటు ఫైనాన్షియల్‌ ప్రభావం.. ఇటు కరోనా భయం వారిని వెంటాడుతూనే ఉంది. వీటికితోడు ప్రభుత్వానికి పన్నులు, పన్నేతర ఆదాయాలూ భారీగా పడిపోయాయి. రిటైల్‌ రంగాలు, పరిశ్రమలు ఇంకా కుదుటపడలేదు. వీటన్నింటి నేపథ్యంలో దేశం ఈ భారీ ఆర్థిక మాంద్యం నుంచి ఎలా బయటపడుతుందా అనేది ఆందోళనగా మారింది.

భారత్-చైనా మళ్లీ వార్.. అసలేం జరిగింది?


కుక్కతోక వంకర అన్నట్టు డ్రాగన్ బుద్ది మారడం లేదు. ఇది వరకు జరిగిన ఘర్షణలో భారత సైనికులు 21 మంది.. చైనా సైనికులు 40కు పైగానే చనిపోయినా చైనా దుస్సాహసం మాత్రం ఆగడం లేదు.తాజాగా తూర్పు లఢక్ లో సరిహద్దులను చైనా సైనికులు మళ్లీ ఉల్లంఘించినట్టు భారత ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించారని.. భారత సైనికులు వారిని అదుపు చేశారని పేర్కొంది.

Also Read: ప్రణబ్ ఎలా చనిపోయాడు? అలా ఎందుకు జరుగుతుంది?

తాజాగా వివాదం మళ్లీ ప్యాంగాంగ్ సరస్సు సమీపంలోనే చోటుచేసుకుంది. అక్కడే చైనా సైనికుల కవ్వింపు చర్యలను భారత సేనలు అడ్డుకున్నాయి. చర్చలు జరిపాయి. కానీ అవి ఫలించలేదు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగితే సహించేది లేదని భారత సైన్యం తెలిపింది. ప్రస్తుతం చుషుల్ లో బ్రిగేడియర్ కమాండర్ స్థాయిలో చర్చలు జరుపుతోంది.

ఆగస్టు 29న రాత్రి ఈ కవ్వింపు చర్యలు చైనా సైనికులు చేసినట్లు భారతసైన్యం తెలిపింది. సరిహద్దుల్లో పరిస్థితులను తారుమారు చేసేందుకు భారీగా వస్తు సామగ్రి తెచ్చి రోడ్లు, రవాణా చర్యలు చేపట్టేందుకు చైనా సైన్యం ప్రయత్నించిందని పేర్కొంది. అయితే భారత సైనికులు అడ్డుకున్నట్లు సమాచారం.

జూన్ 15న లఢక్ లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలో ఇరువైపులా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. అప్పటి నుంచి రెండు దేశాల సైనికుల మధ్య ప్రాణనష్టం చోటుచేసుకుంటోంది. ఇప్పటికీ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి.

Also Read: రాజకీయ భీష్ముడు ‘ప్రణబ్’ గురించి ఆసక్తికర విశేషాలు

భారత్ సరిహద్దుల్లో తాజా ఘర్షణపై చైనా స్పందించింది. చైనా సరిహద్దు బలగాలు వాస్తవాధీన రేఖను ఖచ్చితంగా పాటించాయని.. ఎన్నడూ ఆ రేఖను దాటలేదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియాతో చెప్పారు. సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు.

కాగా దక్షిణ చైనా సముద్రంలో భారత యుద్ధనౌకలను మోహరించడంతో ప్రతీకారంగానే చైనా తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లోకి ఎగదోస్తోందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ప్రణబ్ ఎలా చనిపోయాడు? అలా ఎందుకు జరుగుతుంది?

రాజకీయ కురువృద్ధుడు, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెల్సిందే. ఇటీవల ప్రణబ్ అనారోగ్యానికి గురికాగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే ఆయనకు కోవిడ్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఆర్మీ ఆస్పత్రిలోనే ఆయనకు బ్రెయిన్ ఏర్పడిన బ్లడ్ క్లాట్ కు శస్త్రచికిత్స చేశారు. కొద్దిరోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్న ప్రణబ్ ఆరోగ్యం క్రమంగా క్షిణించడంతో కోమాలోకి వెళ్లారు.

Also Read: కరోనాకు.. మగవాళ్లకు ఉన్న లింకేటీ?

దీంతో ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తుండగా సోమవారం సాయంత్రం మృతిచెందినట్లు ప్రణబ్ కుమారుడు ట్వీటర్లో వెల్లడించారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితర ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ బ్లడ్ క్లాట్ మృతిచెందడంతో అసలు ఇది ఎలా వస్తుంది? ఇది రాకుండా ఎలా చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

*బ్లడ్ క్లాట్ ఎవరికీ వస్తుంది?
బ్లడ్ క్లాట్(బ్రెయిన్ ఎటాక్) అనేది 65ఏళ్లు పైబడిన వారికి ఎక్కవగా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ వచ్చి ఉన్నా.. హృదయ సంబంధ రోగాలున్నా.. బ్లడ్ థిన్నింగ్ కోసం మెడిసిన్స్ వాడుతున్నా.. అధిక బరువు కలిగి ఉన్నా.. డయాబెటీస్, బ్రెయిన్ ట్యూమర్స్, మైగ్రేన్స్ సమస్యలు ఉన్నవారికి.. పొగ, మద్యం అలవాటు ఉన్నవారికి, రెగ్యులర్ గా వ్యాయామం చేయకపోయనా.. బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకునే వారిలో ఎక్కువగా ఈ బ్లడ్ క్లాట్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

*ఇది రాకుండా ఉండాలంటే.?
తొలుత హైబీపీ ఉన్నవారు దానిని అదుపులో పెట్టుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి. పోగ, మద్యం సేవించడం మానేయాలి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ పదార్థాలను తగ్గించుకోవాలి. డ్రగ్స్ ని పూర్తిగా తగ్గించాలి. రోజులో కనీసం 30నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. ఆహారం లో ఫైబర్ ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి.

Also Read: మోడీకి నెటిజన్ల సెగ.. బాగానే తగిలింది

*ముందే గుర్తించవచ్చా?
ఈ స్ట్రోక్ రావడానికి ముందు శరీరం కొన్ని సిగ్నల్స్‌ని అందజేస్తుంది. ఉన్నట్టుండి సరిగ్గా కనపడటం మానేస్తుంది. ప్రతీదీ రెండుగా కనపడొచ్చు. ఇది ఒక కంటికి కానీ లేదా రెండు కళ్ళకి కానీ జరిగే అవకాశం ఉంది. సరిగ్గా మాట్లాడలేరు. ఆహారం, నీళ్లు మింగలేకపోవడం బ్లడ్ క్లాట్ వచ్చిందని సిగ్నల్ అన్నమాట. దీంతోపాటు హఠాత్తుగా బాగా తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతి వస్తున్నట్లు అనిపించడం, శరీరంలో ఒకవైపు తిమ్మిరెక్కడం, ముఖం, కాళ్లు, చేతులకు పక్షవాతం వచ్చినట్లుగా అనిపించడం, చేతులు పైకెత్త లేకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం బ్లడ్ కాట్ లక్షణాలు. వీటిని త్వరగా గుర్తించి వెంటనే సరైన వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాజకీయ భీష్ముడు ‘ప్రణబ్’ గురించి ఆసక్తికర విశేషాలు


ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ‘ట్రబుల్ షూటర్’. ఏ సమస్య వచ్చినా ప్రణబ్ పరిష్కరించేవాడు. రెండు సార్లు ప్రధాని పదవికి చేరువై దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భీష్ముడిగా పేరొందిన ‘భారత రత్న’ ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయనను రాజకీయ ప్రముఖులు, పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. నివాళులర్పిస్తున్నాయి.

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఈనెల 10న ఆస్పత్రిలో చేరిన 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయనకు కరోనా పాజిటివ్ గా కూడా నిర్ణారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి తాజాగా సోమవారం సాయంత్రం మరింత విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది.

Also Read: మోడీకి నెటిజన్ల సెగ.. బాగానే తగిలింది

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన రాజ‌కీయ కుటుంబంలో ప్ర‌ణ‌బ్ జ‌న్మించారు. ముఖ‌ర్జీ త‌ల్లిదండ్రులు క‌మ‌దా కింక‌ర్ ముఖ‌ర్జీ, రాజ్య‌ల‌క్ష్మి ముఖ‌ర్జీ. దాదా తండ్రి క‌మ‌దా కింక‌ర్ ముఖ‌ర్జీ భార‌త స్వాతంత్ర ఉద్య‌మంలో చురుకుగా ప‌ని చేశారు. 1952 నుంచి 1964 మ‌ధ్య కాలంలో వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్సీగా సేవ‌లందించారు. క‌ల‌క‌త్తా యూనివ‌ర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌, హిస్ట‌రీలో ఎంఏ డిగ్రీ ప‌ట్టా సాధించారు. అదే వ‌ర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ కూడా పూర్తి చేసి న్యాయ శాస్త్రం ప‌ట్టా పుచ్చుకున్నారు. ఉన్న‌త విద్య పూర్త‌యిన త‌ర్వాత దాదాకు క‌లక‌త్తాలోని డిప్యూటీ అకౌంట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యంలో అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌గా ఉద్యోగం వ‌చ్చింది. 1963లో కోల్‌క‌తాలోని విద్యాన‌గ‌ర్ కాలేజీలో పొలిటిక‌ల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గా ప‌ని చేశారు. ఇదే స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుగా ఆయ‌న ప‌నిచేశారు.

కాంగ్రెస్ పార్టీతో త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రణబ్‌ ముఖర్జీ అదే పార్టీలో కొన‌సాగి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారు. 1969లో మిడ్నాపూర్ ఉప ఎన్నిక‌ల వేళ‌ వీకే కృష్ణ‌మీన‌న్ త‌ర‌పున ప్ర‌ణ‌బ్ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్నారు. ప్ర‌ణ‌బ్ స‌త్తా గుర్తించిన ఇందిర ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించింది. 1969లో రాజ్య‌స‌భ‌కు ప్ర‌ణ‌బ్ తొలిసారి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 1975, 1981, 1993, 1999 ఎన్నిక‌ల్లోనూ ప్ర‌ణ‌బ్ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కేంద్రంలో ఆయా ప్ర‌ధాన‌మంత్రుల వ‌ద్ద ప‌లుమార్లు కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌, విదేశాంగ శాఖ మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. 1982–84 లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1980–85 లో రాజ్యసభ నాయకునిగా కొన‌సాగారు. 2009 నుంచి 2012 వ‌ర‌కు కేంద్ర ఆర్థిక మంత్రిగా సేవ‌లందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ చేతుల‌మీదుగా 2019లో భార‌త‌దేశ అత్యున్న‌త అవార్డు భార‌త‌ర‌త్న‌ను ప్ర‌ణ‌బ్‌ అందుకున్నారు.

ఇందిరా కుటుంబానికి, ముఖ్యంగా ఆమెకు న‌మ్మిన బంటుగా మారిన ప్ర‌ణ‌బ్‌కు 1973లో మంత్రి ప‌ద‌వి వ‌రించింది. 1976 –77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితిలో జరిగిన దురాగతాల విషయంలో కాంగ్రెస్ పార్టీలోను మిగతా కాంగ్రెసు నాయకుల వలనే ముఖ‌ర్జీ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. కాగా, యూపీఏ-2 హ‌యాంలో రాహుల్ గాంధీ పార్టీలో క్రియాశీల‌కంగా మార‌డం దాదాకు న‌చ్చ‌లేదు. ఈ క్ర‌మంలో దాదాకు సోనియా రాష్ట్రపతి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌ణ‌బ్ శాశ్వ‌తంగా రాజ‌కీయాల‌కు దూరం అయ్యారు.

ప్ర‌ధానమంత్రి కావాల‌నేది ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కోరిక. అయితే, మూడుసార్లు ద‌గ్గ‌రికొచ్చిన‌ట్టే వ‌చ్చి ప్ర‌ధాని పీఠం చేజారింది. మొదటిది ఇందిర హత్యానంతరం, రెండోది రాజీవ్‌ హత్యానంతరం, మూడోది 2009లో మన్మోహన్‌సింగ్‌ రెండో టర్మ్‌ సమయంలో ప్ర‌ధాని కావాల‌నే కోరిక ఉంద‌ని పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వానికి ప‌రోక్షంగా తెలియ‌జేసిన‌ప్ప‌టికీ.. అది చిర‌కాల వాంఛ‌గానే మిగిలిపోయింది. సోనియాగాంధీ మూలంగా ఆశ‌లు లేకుండా పోయాయి.

Also Read: కరోనాకు.. మగవాళ్లకు ఉన్న లింకేటీ?

అయితే, ఆయ‌న మ‌రో కోరిక మాత్రం నెర‌వేరింది. 1969లో రాజ్యసభకు తొలిసారిగా ఎన్నికయిన‌ స‌మ‌యంలో రాష్ట్రపతి భవన్‌కు దగ్గరలోనే ముఖర్జీకి అధికారిక బంగ్లాను కేటాయించారు. ఈ క్రమంలో ఆయన ప్రతి రోజు రాష్ట్రపతి భవన్‌ను చూస్తూ నడక సాగించే వారు. భ‌వ‌న్‌లో ఉండే గుర్రపు బగ్గీని చూసి దాదా ముచ్చటపడేవారు. మరో జన్మంటూ ఉంటే.. గుర్రపు బగ్గీలో గుర్రాన్ని అయి పుడుతానని తన సోదరి అన్నపూర్ణతో ప్రణబ్‌ అనే వారు. ఆ మాటలు విన్న సోదరి.. అంత వరకు ఎందుకు.. ఈ జన్మలో తప్పకుండా రాష్ట్రపతి భవన్‌లో ఉండే అవకాశం వస్తుందన్నారట‌. ఆమె నాడు అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. 2012 నుంచి 2017 దాకా ప్రణబ్‌ రాష్ట్రపతిగా పని చేశారు. త‌న ముద్ర వేసుకున్నారు.

కాగా, పార్టీలకు అతీతంగా ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆయ‌న ఎన్నో ద‌ఫాలుగా నిరూపించుకున్నారు. కరుడు కట్టిన కాంగ్రెస్‌ వాది అయినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకే చెల్లింది. 2018, జూన్‌ 7న నాగ్‌పూర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యక్రమానికి ప్రణబ్‌ హాజరయ్యారు. అప్పట్లో అది పెను సంచలనం. కాకలు తీరిన రాజనీతిజ్ఞుడు, వ్యూహ చతురుడిగా పేరున్న దాదా.. ఆ కార్యక్రమంలో మాట్లాడిన తీరుతో అపర కాంగ్రెస్ వాది అన్న పేరును చరమాంకంలో పోగొట్టుకున్నాడు. ఇదే ఆయన జీవితంలో మాయని మచ్చ గా మిగిలింది. రాజకీయ విశ్లేషకులనే తలలు పట్టుకునేలా చేసింది.

కేసీఆర్ కు అసమ్మతి జ్వాల తగలనుందా?


గడిచిన ఆరేళ్లుగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా నడిచింది. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళుతున్న సీఎం కేసీఆర్ కు కొద్దిరోజులుగా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇటీవలీ కాలంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేక గళాలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా ఎంట్రీ తర్వాత అధికార పార్టీకి ఏది కలిసి రావడం లేదు. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

Also Read: మీడియా రంగంలోకి బీజేపీ? ఆ రెండు చానెళ్లతో చర్చలు!

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలామంది నేతలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ మంత్రివర్గ కూర్పు దగ్గరి నుంచి ప్రతీఒక్కటి ఆచితూచి పదవుల పంపకం చేస్తున్నారు. గత క్యాబినెట్లో కొనసాగిన ముగ్గురు మంత్రులను కేసీఆర్ పక్కన పెట్టిన సంగతి తెల్సిందే. దీంతో ఆ నేతలంతా సైలంటయ్యారు. వీరితోపాటు మరికొందరు పదవులపై ఆశలు పెట్టుకొని పదవులు రాకపోవడంతో సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న తరుణంలోనే పలువురు టీఆర్ఎస్ నేతలు తమలోని అసంతృప్తిని బయటికి వెళ్లగక్కుతోన్నారు.

ఇటీవల టీఆర్ఎస్ కు చెందిన కీలక నేత, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కేసీఆర్ పై డైరెక్ట్ గానే విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు గుర్తింపు లేదని.. తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వారికే కేసీఆర్ కీలక పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లు తమకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో ఎన్నడూ టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను, ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేసిన దాఖల్లేవు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో లోలోపల అసంతృప్తి బాగానే ఉందనే సంకేతం ప్రజల్లోకి వెళ్లింది.

Also Read: బై బై గణేశా.. సందడి లేకుండానే విగ్రహాల నిమజ్జనం

అదేవిధంగా కేసీఆర్ క్యాబినెట్లో పదవులు ఆశించిన భంగపడిన నేతలు కూడా సైలంటయ్యారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, రెడ్యానాయక్, జూపల్లి కృష్ణారావు, మాజీ స్పీకర్ మధుసూధనచారి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ తదితరులంతా కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారనే టాక్ విన్పిస్తోంది. సరైన సమయం దొరికినప్పుడు కేసీఆర్ పై ఫైరయ్యేందుకు రెడీగా ఉన్నారు.

ఇక త్వరలోనే దుబ్బాకలో ఉప ఎన్నిక రానుంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సీటును దక్కించుకోవడం ఆపార్టీకి కీలకంగా మారింది. అయితే ఓవైపు టీఆర్ఎస్ లో నెలకొన్న అసంతృప్తి.. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. సొంత పార్టీ నేతలే కారు స్పీడుకు బ్రేకులు వేస్తుండటంతో సీఎం కేసీఆర్ స్టీరింగ్ ను ఎలా మలుపు తిప్పుతారనేది ఆసక్తికరంగా మారింది.

కనికరం లేని మోడీజీ.. ఇలా చేస్తావా?


‘హైదరాబాద్‌కు చెందిన కరణ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. ఇతనికి నెలకు 50 వేల జీతం. జీతం బాగానే ఉండడం.. కంపెనీ పెద్దదే కావడంతో డేర్‌‌ చేసి రూ.50 లక్షలతో ఇల్లు కొన్నాడు. నెలనెలా రూ.25 వేల వరకు ఈఎంఐ పెట్టుకున్నాడు. కానీ.. ఈ కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అతని ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి మారటోరియం అమల్లో ఉండడంతో పెద్దగా టెన్షన్‌ పడలేదు. ఈనెలతో మారటోరియం ముగియడంతో వచ్చే నెల నుంచి ఈఎంఐ ఎలా కట్టేది అని బాధపడుతున్నాడు.’

Also Read: మోడీకి నెటిజన్ల సెగ.. బాగానే తగిలింది

‘హైదరాబాద్‌కు చెందిన ప్రదీప్‌ కోటి రూపాయలతో ఐదంస్తుల బిల్డింగ్‌ కట్టాడు. ఇందుకు సగానికి పైగా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. ఐదంస్తుల్లో ఒక్కో పోర్షన్‌లో రెండు ఫ్యామిలీల చొప్పున 10 ఫ్యామిలీస్‌ రెంట్‌కు దిగాయి. కరోనా ముందు వరకు అంతా సాఫీగానే సాగింది. నెలనెలా రెంటర్స్‌ పే చేసిన రెంట్‌తో ఈఎంఐ చెల్లిస్తూ వచ్చాడు. కానీ.. ఎప్పుడైతే కరోనా హైదరాబాద్‌లో అడుగుపెట్టిందో అప్పటినుంచి ప్రజల్లో భయం పెరిగి పోయి ఇల్లు ఖాళీ చేసి తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన బిల్డింగ్‌లో వారి ఫ్యామిలీ తప్ప ఎవరూ లేరు. దీంతో ఈనెల నుంచి ఈఎంఐ ఎలా చెల్లించలో తెలియక సతమతం అవుతున్నాడు.’

కరోనా కారణంగా ఫైనాన్షియల్‌ ప్రాబ్లం రాకుండా పరిస్థితుల నుంచి కొంత రిలీఫ్ ఇస్తూ గత మార్చిలో ఆర్‌‌బీఐ ఓ ప్రకటన చేసింది. కరోనా కారణంగా అటు ఉద్యోగాలు ఊడిపోవడం.. ఇటు శాలరీస్‌లలో కోతలు పడుతుండడంతో మూడు నెలల పాటు ఈఎంఐలకు మారటోరియం ఇచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వారు మూడు నెలలపాటు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు.

కరోనాతో పేదలు ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం మార్చి 26న రూ.70వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయామని, లోన్ల పేమెంట్లలో మినహాయింపు‌ ఇవ్వాలంటూ పెద్ద సంఖ్యలో రెక్వెస్ట్‌లు రావడంతో పరిగణలోకి తీసుకున్న కేంద్రం మారటోరియం దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కమర్షియల్‌ బ్యాంక్‌, ఫైనాన్స్‌ బ్యాంకులు, కో ఆపరేటివ్‌ బ్యాంకులు, ఆలిండియా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఈ మారటోరియానికి అనుకూలంగా ఓటేశాయి. ఆ తర్వాత మేలో మరో మూడు నెలల పాటు మారటోరియం పొడగిస్తూ ఆర్‌‌బీఐ ప్రకటించింది.

Also Read: కరోనాకు.. మగవాళ్లకు ఉన్న లింకేటీ?

ఈ మారటోరియం కాస్త ఈ ఆగస్టు 31తో ముగిసింది. ఈ నెల సెప్టెంబర్‌‌ 1 నుంచి లోన్లు పే చేయాల్సిందే. దీంతో ఇప్పుడు ఈఎంఐలున్న ప్రతిఒక్కరిలోనూ టెన్షన్‌ పట్టుకుంది. చాలా మంది ఎంప్లాయిస్‌ తమ జాబ్‌ను ఆధారంగా చేసుకొని ఏదో ఒక వస్తువో లేక ఇల్లో, కారో.. కొన్నారు. కరోనాను సాకుగా చూపి చాలా కంపెనీలో ఎంప్లాయిస్‌ని తగ్గించడం.. లేక ఎంప్లాయిస్‌ జీతాల్లో కోత పెడుతుండడంతో ఇప్పుడు ఈఎంఐల పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉందని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇంకా ఇప్పటివరకు ఉద్యోగాలు దొరకలేదు. ఈ ఆరు నెలలు జీతాలు లేక పోయినా ఈఎంఐల బాధ లేకుండే.

నెలనెలా అడ్జస్ట్‌మెంట్లు.. ఫ్యామిలీ మెయింటనెన్స్‌.. అటు ఈఎంఐ. లోన్‌ చెల్లించకుంటే చెక్స్‌ బౌన్స్‌ అవుతాయి. మరోవైపు క్రెడిట్‌ స్కోర్‌‌ పడిపోతూ ఉంటుంది. వీటన్నింటికి తోడు బ్యాంకుల నుంచి నోటీసులు. అటు ఉద్యోగాలు లేక.. ఇటు ఆదాయం ఈ ఈఎంఐలు ఇప్పుడు గుదిబండలా మారాయి. అన్నీ దేశాల్లో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్నారు. కానీ మన కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం ప్రజల జేబుల్లోంచి ఈ కరోనా టైంలోనూ ముక్కుపిండి వసూలు చేయడానికి రెడీ అవుతోంది. దీనిపై అందరూ నెత్తినోరు బాదుకుంటున్నారు.