నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ అంతా చాలా ఘనంగా జరుపుకున్నారు. ఎన్నోచోట్ల కేకులు కట్ చేశారు, ఫ్లెక్సీలు, బ్యానర్లు అమర్చారు, రక్తదానం చేశారు, ఇంకా మరింత వినూత్నంగా…. ఎంతో ప్రశంసనీయంగా…. ఆదర్శవంతంగా దాదాపు 300 ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటళ్ళ కు జనసైనికులు తమ జనసేనాని పుట్టినరోజు సందర్భంగా దానం చేయడం కూడా గమనించాం.
Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ
అయితే మొన్న రాత్రి చోటు చేసుకున్న ఒక విషాదకర సంఘటన పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్రంలోని జనసైనికులందరినీ కలిచి వేసింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం లోని శాంతిపురం లో సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం అనే ముగ్గురు.. వారి అభిమాన నాయకుడి పుట్టినరోజుకి బ్యానర్ అమరుస్తూ కరెంటు తీగలు పట్టుకోగా.. కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. వీరంతా పొరపాటున ఇలా దురదృష్టకరంగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. దాదాపు 25 అడుగుల ఎత్తున్న కరెంటు స్తంభాలకి బ్యానర్ ను తగిలించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధితుల కుటుంబాలకు ఒక్కరికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. పవన్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల సహాయం ప్రకటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. వీరంతా ఫ్యాన్స్ ను ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని విన్నవించుకున్నారు.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుప్పంలోని బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నారని సమాచారం. ఇప్పటికే అతను జనసేన కార్యకర్తలను ఆ కుటుంబాల బాగోగులు చూసుకోమని చెప్పడం జరిగింది. ఇక వీలైనంత త్వరగా బయల్దేరి వారిని నేరుగా పరామర్శిస్తారని జనసేన పార్టీ వర్గాల నుండి వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఆ విషయాన్ని మర్చిపోవడానికి పవన్ ఎంత ప్రయత్నించినా…. ఈ పుట్టిన రోజుని జీవితంలో ఈ ముగ్గురి మరణం కారణంగా ఎప్పటికీ చెరిగిపోని ఒక చేదు గాయంలా ఉంటుందన్న విషయం మాత్రం వాస్తవం.
Also Read : ఒకే ఒక్క దెబ్బతో బాబు కుల రాజకీయం బట్టబయలు…?
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Pawan to meet victim families in kuppam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com